
సాక్షి, నెల్లూరు: నెల్లూరులోని ఆత్మకూర్ బస్టాండ్ రైల్వే బ్రిడ్జిపై రైలు ఢీకొని ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు పురుషులు, ఒక మహిళ ఉన్నారు. పట్టాలు దాటుతుండగా ఎదురుగా వస్తున్న రైలు ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకొంది.
సమాచారం అందుకొన్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం ఎలా జరిగింది?. మృతులు ఎవరన్న దానిపై విచారణ చేస్తున్నారు. ప్రమాదమా లేక ఆత్మహత్యకు పాల్పడ్డారా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment