సాక్షి, నవాబుపేట (జడ్చర్ల): మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలంలోని రుద్రారం గ్రామం స్వచ్ఛ పురష్కార్ అవార్డుకు ఎంపికైంది. ఓ మహిళ అనుకుంటే సాధించలేనిది లేదంటూ నిరూపించింది. గ్రామం స్వచ్ఛంగా ఉండాలనే లక్ష్యంతో వందశాతం మరుగుదొడ్లు నిర్మించారు. దీంతో ఈ గ్రామానికి ప్రత్యేక పురష్కారం వచ్చినట్లు సమాచారం. 371 మరుగుదొడ్ల నిర్మాణం ఏడాదిలోపు పూర్తి చేశారు. దీంతో గతేడాది ఢిల్లీలో మహిళా సాధికారిత అవార్డు, జిల్లాల్లో తెలంగాణలో ప్రత్యేక అవార్డును అప్పటి సర్పంచ్ లక్ష్మీకృష్ణగౌడ్ పొందింది. ఈ రెండు అవార్డులతో పాటు తాజాగా స్వచ్ఛభారత్ పురష్కార్‌తో పాటు రూ.10లక్షలు అందుకోనున్నారు. ఈ అవార్డును శుక్రవారం జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మహిళా దినోత్సవం సందర్భంగా నవాబుపేట మండల కేంద్రంలో అందించనున్నారు.
మరింత అభివృద్ధి
గ్రామం మరింత అభివృద్ధి చెందడానికి కృషి చేస్తాం. గతంలో అందరూ కృషి చేశారు. ఆ కృషికి వచ్చిన ఫలితంతో మరింత ముందుకు తీసుకెళ్తాం. గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం. పార్టీలకతీతంగా సమష్టిగా కృషి చేస్తాం. గ్రామ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తాం.
– లలిత కృష్ణారెడ్డి, సర్పంచ్, రుద్రారం
Comments
Please login to add a commentAdd a comment