special award
-
జోయాలుక్కాస్ చైర్మన్‌కు ప్రత్యేక పురస్కారం
హైదరాబాద్: జోయాలుక్కాస్ గ్రూప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జాయ్ అలుక్కాస్ ప్రపంచ జ్యువెలరీ సమాఖ్య నుంచి ప్రత్యేక పురస్కారం అందుకున్నారు. వర్డల్ జ్యువెలరీ కానె్ఫడరేషన్(సీఐబీజేఓ) జైపూర్‌లో నిర్వహించిన కాంగ్రెస్ 2023 కార్యక్రమంలో సంస్థ ఎండీ జాన్ పాల్ అలుక్కాస్.. చైర్మన్, ఎండీ జాయ్ అలుక్కాస్ తరఫున ఈ గౌరవాన్ని స్వీకరించారు. సప్లై చైన్‌లో నైతిక పద్ధతులు, సుస్థిరతలకు సాటిలేని కృషిని వరల్డ్ జ్యువెలరీ కాన్ఫెడరేషన్ గుర్తించింది. ‘‘ఈ గుర్తింపును మా సంస్థలో ప్రతి ఒక్క సభ్యునితో భాగస్వామ్యం చేస్తున్నాను’’ అని జాయ్‌అలుక్కాస్ తెలిపారు. -
‘స్వచ్ఛ’ రుద్రారం
సాక్షి, నవాబుపేట (జడ్చర్ల): మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలంలోని రుద్రారం గ్రామం స్వచ్ఛ పురష్కార్ అవార్డుకు ఎంపికైంది. ఓ మహిళ అనుకుంటే సాధించలేనిది లేదంటూ నిరూపించింది. గ్రామం స్వచ్ఛంగా ఉండాలనే లక్ష్యంతో వందశాతం మరుగుదొడ్లు నిర్మించారు. దీంతో ఈ గ్రామానికి ప్రత్యేక పురష్కారం వచ్చినట్లు సమాచారం. 371 మరుగుదొడ్ల నిర్మాణం ఏడాదిలోపు పూర్తి చేశారు. దీంతో గతేడాది ఢిల్లీలో మహిళా సాధికారిత అవార్డు, జిల్లాల్లో తెలంగాణలో ప్రత్యేక అవార్డును అప్పటి సర్పంచ్ లక్ష్మీకృష్ణగౌడ్ పొందింది. ఈ రెండు అవార్డులతో పాటు తాజాగా స్వచ్ఛభారత్ పురష్కార్తో పాటు రూ.10లక్షలు అందుకోనున్నారు. ఈ అవార్డును శుక్రవారం జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మహిళా దినోత్సవం సందర్భంగా నవాబుపేట మండల కేంద్రంలో అందించనున్నారు. మరింత అభివృద్ధి గ్రామం మరింత అభివృద్ధి చెందడానికి కృషి చేస్తాం. గతంలో అందరూ కృషి చేశారు. ఆ కృషికి వచ్చిన ఫలితంతో మరింత ముందుకు తీసుకెళ్తాం. గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం. పార్టీలకతీతంగా సమష్టిగా కృషి చేస్తాం. గ్రామ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తాం. – లలిత కృష్ణారెడ్డి, సర్పంచ్, రుద్రారం -
రాష్ట్రస్థాయి ప్రోత్సాహక బహుమతికి రాకుమార
కోల్‌సిటీ : గోదావరిఖని దుర్గానగర్‌కు చెందిన ప్రముఖ కవి రాకుమార రాష్ట్రస్థాయి ప్రోత్సాహక బహుమతికి ఎంపికయ్యారు. ౖయెటింక్లయిన్ కాలనీలోని సింగరేణి పాఠశాలలో ఆయన ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. గుంటూరు జిల్లాలో రెండు నెలల క్రితం జరిగిన ‘సయ్యద్ సైదా సాహెబ్’ స్మారక కవితల పోటీలకు ఆయన పంపిన ‘మనసు’ అనే కవిత బహుమతికి ఎంపికైనట్లు నిర్వాహకుడు జానీబాషా మంగళవారం ప్రకటించినట్లు రాకుమార తెలిపారు.