మోహిత్‌రెడ్డిని పూలతో ఆత్మీయ స్వాగతం పలుకుతున్న మహిళలు
పాకాల : మండలంలోని పంటపల్లె పంచాయతీలో వైఎస్సార్ సీపీ చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డికి అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. బుధవారం పంటపల్లె పంచాయతీలో మోహిత్‌రెడ్డి గడప గడపకు మహా పాదయాత్ర సాగింది.
ఇంటింటికీ వెళ్లి ఆయన ప్రజలతో మమేకమయ్యారు. పథకాల ద్వారా పొందిన లబ్ధిని వివరించి సంక్షేమ బావుటా బుక్‌లెట్‌ను అందించారు. సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకు వస్తే వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి పనులపై ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేసి కృతజ్ఞతలు తెలిపారు.
జగనన్న పాలనలో రామరాజ్యం
ముఖ్యమంత్రి జగనన్న పాలనలో ప్రజలు రామరాజ్యాన్ని చూస్తున్నారని చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ జగనన్న చేదోడు పథకంతో మహిళలను ఆర్థికంగా బలపడుతున్నారని తెలిపారు. హామీలను నెరేవేర్చిన ఏకై క సీఎంగా జగనన్న చరిత్రలో నిలిచిపోతారని కొనియాడారు. అద్భుతమైన పథకాల అమలుతో రాష్ట్రంలో జనరంజక పాలన కొనసాగుతోందని తెలిపారు. ప్రజలంతా జగనన్న వైపే ఉన్నారని, రానున్న ఎన్నికల్లో 175 స్థానాల్లో విజయం తథ్యమని పేర్కొన్నారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తన కుటుంబసభ్యుల కంటే నియోజకవర్గ ప్రజలనే ఎక్కువగా అభిమానిస్తారని వివరించారు.
నిరంతరం ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలనే తపనతో పని చేసే వ్యక్తి మన ఎమ్మెల్యే అని గుర్తు చేశారు. 2024 ఎన్నికల్లో చంద్రగిరి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, తనను ఆశీర్వదించి గెలిపించాలని మోహిత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఎంపీపీ లోకనాథం, వైఎస్సార్ సీపీ కన్వీనర్ నంగా నరే ష్‌రెడ్డి, నాయకులు వల్లివేడు విక్రమ్‌రెడ్డి, మునీశ్వర్‌రెడ్డి, రఘుపతి, కపిలేశ్వర్‌రెడ్డి, సర్పంచ్ సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment