అసలేం జరిగింది.. ఏం జరుగుతోంది.. ఏం జరగబోతోంది నాకు తెలియాలి.. నాకు ఇప్పుడే తెలియాలి.. ఇదీ సగటు జనసేన. టీడీపీ నాయకుల ఆందోళన కమ్ కంగారు కమ్ కన్ఫ్యూజన్ కమ్ చిరాకు కమ్ పరాకులు వినిపిస్తున్నాయి. జనసేన, టీడీపీ మధ్య పొత్తు అన్నారు. అదిప్పుడు ఏ స్థాయిలో ఉన్నదో తెలీదు. ఎవరికీ ఎక్కడ సీట్లు ఇస్తారో తెలీదు.. ఎన్నికల షెడ్యూల్ వచ్చేసేలా ఉంది.. ఇప్పటికి కూడా తమ నియోజకవర్గం అడ్రస్ తెలీకుండా ఎలా అని ఇరుపార్టీల్లో ఆందోళన నెలకొంది. కానీ ఎవరూ ఎక్కడా బయటపడడం లేదు.. అంతా గుంభనంగా ఉంటూ మేకపోతు గాంభీర్యం చూపుతున్నారు.
దీనికి తోడు పొత్తు వ్యవహారంలో ఉన్న కన్ ఫ్యూజన్ కూడా ఇరుపార్టీల నాయకులను ఇంకా ఇరకాటంలోనే ఉంచుతోంది. అందుకే చంద్రబాబు ఇప్పటి వరకు తొలి జాబితా విడుదల కాలేదు. ఎవరికీ ఎక్కడ సీట్ అన్నది తేలితే తప్ప పనులు మొదలు పెట్టి ముందుగు సాగే అవకాశం లేకపోవడంతో నాయకులు అంతా అయోమయంలో ఉన్నారు. అసలు నియోజకవర్గాల్లో తిరుగుదాం. పని మొదలు పెడదాం. అందర్నీ కలుద్దాం అంటే టిక్కెట్ వస్తుందో రాదో.. అది కాస్తా జనసేనకు వెళ్ళిపోతే తన ఖర్చు.. కష్టం.. టైం అంతా వృథా అవుతుందని టీడీపీ నాయకులు డైలమాలో ఉన్నారు. ఇదిలా ఉండగా అటు కాపునేత చేగొండి హరిరామ జోగయ్య మాత్రం 51 స్థానాల్లో జనసేనకు సీట్లు ఇవ్వాల్సిందే అని చెబుతూ సొంతంగా లిస్ట్ కూడా విడుదల చేసారు.
మరోవైపు చుట్టపు చూపుగా ఆంధ్రకు వచ్చే పవన్ ఇక్కడి నాయకులకు అస్సలు అందుబాటులో ఉండరు.. కాబట్టి ఆయనతో ఏమైనా మాట్లాడాలి అనుకున్న కష్టమే.. దీంతో జనసేన క్యాడర్ సైతం చికాకు, చిరాకు పడుతోంది. మరోవైపు అంగన్ వాడీలను రెచ్చగొట్టి రాజకీయం చేద్దాం.. ప్రభుత్వం మీద వ్యతిరేకతను ఎక్కువచేసి చూపిద్దాం అనుకున్న టీడీపీకి అక్కడా పెద్ద ఫాయిదా దక్కలేదు. వారి డిమాండ్ల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉండడంతో అంగన్వాడీలు సమ్మె విరమించారు.
దీంతో వారి తెరవెనుక ఉండి చంద్రబాబు ఆడించిన నాటకానికి తెరపడింది. వాళ్లంతా ఇప్పుడు జై జగన్ అంటున్నారు. దీంతో ఎటు చూసినా తనకు దారి క్లియర్‌గా కనిపించకపోవడంతో చంద్రబాబు సైతం ఇంకా సీట్లు సంగతి తేల్చడం లేదు. దీంతో క్యాడర్లో కంగారు మొదలైంది.. చివరి నిముషంలో టిక్కెట్ తెచ్చుకుని బలమైన వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిని ఎదుర్కోవడం కష్టం కదా అని వారు లోలోన ఆందోళన చెందుతున్నారు. కానీ ఈ ఫ్రాస్ట్రేషన్‌నుఎవరిమీద చూపాలో తెలీక లోలోన కుమిలిపోతున్నారు.
-సిమ్మాదిరప్పన్న.
Comments
Please login to add a commentAdd a comment