వైఎస్సార్ సీపీతోనే సువర్ణయుగం | general elections campaign | Sakshi
Sakshi News home page

వైఎస్సార్ సీపీతోనే సువర్ణయుగం

Apr 13 2014 3:25 AM | Updated on May 25 2018 9:12 PM

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోనే ప్రజలకు సువర్ణ యుగం లాంటి పాలన అందుతుందని ఆ పార్టీ సాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మల్లు రవీందర్‌రెడ్డి తెలిపారు.

 త్రిపురారం, న్యూస్‌లైన్  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోనే ప్రజలకు సువర్ణ యుగం లాంటి పాలన అందుతుందని ఆ పార్టీ సాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మల్లు రవీందర్‌రెడ్డి తెలిపారు. శనివారం మండలంలోని పెద్దదేవులపల్లి గ్రామం లో ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తెలంగాణలోని ప్రతి కుటుంబంలో ఏదో ఒక రకంగా అందుతున్నాయని చెప్పారు.

 తెలంగాణలో కోట్లాది మంది దివంగత నేత వైఎస్సార్ అభిమానులు ఉన్నారని, వారిని ఓట్ల రూపంలో మలుచుకుంటామని తెలిపారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా తమ పార్టీ పని చేస్తోందని చెప్పారు. వైఎస్సార్ మరణం తరువాత ఆయన ప్రవేశపెట్టిన పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నీరు గార్చిందని విమర్శించారు.

 పేదలకు తామున్నామనే భరోసాపై ఏ నాయకుడు ఇవ్వలేదని, దీంతో ప్రజలు అనేక అవస్థలు పడ్డారని తెలిపారు. సాగర్ నియోజకవర్గంలో సాగు, తాగు నీరందించి సమగ్రాభివృద్ధే లక్ష్యంగా పని చేస్తానని హామీ ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో తనను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

ఆయన వెంట ఆ పార్టీ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు జవహార్‌నాయక్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు కొల్లి రవి కుమార్, బిచ్చునాయక్, కొల్లి అన్నపూర్ణ, బూర రేణుక, దుర్గయ్య, బూర నాగయ్య, బాలరాజు, మురళి, నియోజకవర్గ యూత్ నాయకుడు పడిడోజు సైదాచారి   తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement