ప్రజల కష్టాలు తీర్చేందుకే జనంలోకి జగన్ | general elections campaign | Sakshi
Sakshi News home page

ప్రజల కష్టాలు తీర్చేందుకే జనంలోకి జగన్

Published Mon, Apr 14 2014 2:05 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

ప్రజల కష్టాలు తీర్చేందుకే జనంలోకి జగన్ - Sakshi

ప్రజల కష్టాలు తీర్చేందుకే జనంలోకి జగన్

పొట్లపల్లి(హుస్నాబాద్‌రూరల్ ), న్యూస్‌లైన్: పేదల కష్టాలు తీర్చేందుకే వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రజ ల్లోకి వస్తున్నారని, ఆయనను ఆదరించాలని పార్టీ జిల్లా కన్వీనర్, హుస్నాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి, కరీం నగర్ ఎంపీ అభ్యర్థి మీసాల రాజారెడ్డి కోరారు. మండలంలోని పొట్లపల్లి స్వయం భు రాజేశ్వరస్వామి సన్నిధి నుంచి ఆదివారం ప్రచారం ప్రారంభించారు.

 అంత కముందు వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుతూ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ప్రచార రథాన్ని వైఎస్సార్‌సీపీ జిల్లా యువజన సంఘం కన్వీనర్ బోయినపల్లి శ్రీనివాసరావు జెండా ఊపి ప్రారంభించారు. ఎమ్మెల్యే అభ్యర్థి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర సమయంలో పొట్లపల్లికి వచ్చారని, ఆ సమయంలో మెట్ట ప్రాంత రైతుల కోసం వరద కాలువ నిర్మిస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అమలు వైఎస్ జగన్‌తోనే సాధ్యమన్నారు.

 కేజీ నుంచి పీజీ వరకు ఉచితవిద్య, అమ్మ ఒడి పథకం, డ్వాక్రా మహిళల రుణాల మాఫీతోపాటు అనేక రకాల సంక్షేమ పథకాలను మేనిఫెస్టోలో పొందుపరిచినట్లు తె లిపారు. జిల్లాలో 11 అసెంబ్లీ, కరీంనగర్ ఎంపీ స్థానాల్లో  వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారని, ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

కరీంనగర్ ఎంపీ అభ్యర్థి మీసాల రాజారెడ్డి మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో విద్యార్థుల జీవితాల్లో వైఎస్సార్ వెలుగులు నింపారన్నారు. వైఎస్సార్ ఆశయాల సాధన జగన్‌తోనే సాధ్యమన్నారు. కరీంనగర్ ఎంపీగా తనను గెలిపించాలని కోరారు.

 అనంతరం పోట్లపల్లిలో ఇంటింటా ప్రచారం నిర్వహిస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటెయ్యాలని కోరారు. వైఎస్సార్ సీపీ జిల్లా నాయకులు  సింగిరెడ్డి ఇందిరా, శృతి, హుస్నాబాద్, భీమదేవరపల్లి మండల అధ్యక్షులు బొంగోని శ్రీనివాస్‌గౌడ్, వనపర్తి రమేశాచారి, నాయకులు అజయ్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement