సాక్షి, తూర్పు గోదావరి: తమ పార్టీ అధికారంలోకి వచ్చాక దాన్యానికి గిట్టుబాటు కల్పించడమే కాదు.. బోనస్ కూడా ఇస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఆదివారం పి గన్నవరం నియోజకవర్గంలో అంబాజీపేటలో ఎన్నికల ప్రచార సభలో వైఎస్ జగన్ ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ..‘రాష్ట్రంలో సాయం కోసం ఎదురుచూస్తున్న ప్రతి కుటుంబానికి.. నేను విన్నాను.. నేను ఉన్నానని మాటిస్తున్నాను. పాదయాత్రలో చూడని కష్టం లేదు. గిట్టుబాటు అందక, రుణమాఫీ చేయక రైతులు చాలా కష్టాలు ఎదుర్కొంటున్నారు. గోదావరిలో నీళ్లు కనిపిస్తాయి కానీ రెండో పంటకు నీరందదు. పండించిన పంటకు గిట్టుబాటు ధర ఉండదు.. కొనే నాథుడు కూడా ఉండడు. నిరుద్యోగుల కష్టాలు చశా, ఫీజు రియింబర్స్‌మెంట్ రాక తల్లిదండ్రులను కష్టపెట్టడం ఇష్టం లేక ఆత్మహత్యలు చేసుకున్న పిల్లలు చూశా. వైద్యం కోసం అప్పులు చేసి ఆస్తులు అమ్ముకున్న పరిస్థితి.. 108కి ఫోన్ చేస్తే అదెక్కడుందో తెలియని దుస్థితి. గ్రామాల్లో మూడు, నాలుగు బెల్టు షాపులతో కుటుంబాలు చిన్నాభిన్నమై అక్కాచెల్లమ్మలు పడుతున్న కష్టాలు చూశాను.
(అధికారంలోకి రాగానే అందరికి న్యాయం: వైఎస్ జగన్)
ఉద్యోగాలు రాక.. నోటిఫికేషన్లు లేక పిల్లలు పడుతున్న అవస్థలు చూశా. రాష్ట్రంలో 2.30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా.. చదువుకుని ఉద్యోగాల కోసం నిరుద్యోగులు వేరే రాష్ట్రాలకు, దేశాలకు వలస పోతున్నారు. పక్కనే గోదావరి ఉన్న గ్రామాల్లో తాగడానికి నీళ్లు లేవు. పిల్లల్ని చదివించడానికి అక్కాచెల్లమ్మలు కూలీలుగా మారారు. 2014లో ఎన్నికలకు ముందు మేనిఫెస్టో పేరుతో చంద్రబాబు మోసాలను చూశాం. ప్రజలను మోసం చేయడంలో ఆయన పీహెచ్‌డీ చేశారు. సీఎం అయ్యాక కాకినాడ, రాజమండ్రి స్మార్ట్ సిటీలుగా చేస్తానని చంద్రబాబు చెప్పిన మాటు నిజమయ్యాయా?. పెట్రోలియం యూనివరిసటీ ఏమైంది?. కోనసీమలో కొబ్బరి పీచు పరిశ్రమ అన్నారు అది ఎక్కడైనా కనబడిందా?. మళ్లీ ఎన్నికల వచ్చేసరికి చంద్రబాబు కపట ప్రేమ కనబరుస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు చెప్పని అబద్ధం ఉండదు, చేయని అన్యాయం ఉండదు, ఎంత ఖర్చు చేయడానికైనా వెనకడాడు. గ్రామాలకు ముటలు ముటలు డబ్బులు పంపుతాడు.. ఓటుకు మూడు వేలు రూపాయలు ఇచ్చి మళ్లీ మోసం చేయడానికి ప్రయత్నిస్తాడు.
(అవినీతి లేని పాలన అందిస్తా: వైఎస్ జగన్)
చంద్రబాబు ఇచ్చే మూడు వేల రూపాయలకు మోసపోకండి అని గ్రామాల్లోని అవ్వ తాతలకు చెప్పిండి. జగనన్న చెప్పకపోయి ఉంటే పించన్ రెండు వేలకు పెరిగిదా అని గుర్తుచేయండి. మన పిల్లలను బడికి పంపిస్తే చాలు అన్న ఏటా రూ. 15 వేల రూపాయలు ఇస్తాడని ప్రతి అక్కాచెల్లమ్మకు చెప్పండి. ఏ చదువైనా అన్న చదివిస్తాడని.. ఎన్ని లక్షలైనా కూడా భరిస్తాడని ప్రతి ఇంట్లో చెప్పండి. 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ మహిళలకు వైఎస్సార్ చేయూత కింద 75 వేల రూపాయలు నాలు దఫాలుగా చెల్లిస్తాం. ప్రతి రైతన్నకు మే నెలలోనే 12,500 రూపాయలు ఇస్తాం. నవరత్నాల గురించి ప్రతి అవ్వకు, తాతకు చెప్పిండి. ఈ ఎన్నికల్లో ఒకవైపు మోసం కనిపిస్తుంది.. మరోవైపు విశ్వసనీయత, విలువలు కనిపిస్తున్నాయి. చెడిపోయిన రాజకీయ వ్యవస్థలోకి మార్పు రావాలంటే వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావాలి. మోసం చేసే వారిని బంగాళాఖాతంలో కలిపే రోజులు రావాలి. గన్నవరం ఎమ్మెల్యేగా చిట్టిబాబుకు, ఎంపీ అభ్యర్థిగా అనురాధమ్మను దీవించమని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఆశీర్వదించమ’ని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment