ambajipeta
-
రిబ్బన్ కటింగ్ కు దొర్కలేదు.. ఎమ్మెల్యేకు కత్తెర
-
ఎవరు హీరో... ఎవరు విలనో మీరే తేల్చుకోండి..
-
మరో 2 వారాల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం
-
Watch Live: అంబాజీపేటలో సీఎం జగన్ ప్రచార సభ
-
‘మహాసేన రాజేష్ గోబ్యాక్’ అంటూ జనసైనికుల నిరసన
సాక్షి, కోనసీమ: కోనసీమ జిల్లా అంబాజీపేటలో టీడీపీ-జనసేన సమావేశం రసాభాసగా మారింది. మహాసేన రాజేష్‌కి టికెట్ కేటాయింపుపై జనసేన శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రాజేష్ గోబ్యాక్’ అంటూ జనసేన కార్యకర్తలు నినాదాలు చేశారు. టీడీపీ నేత హరీష్ మాధుర్ కారును జనసేన కార్యకర్తలు ధ్వంసం చేశారు. దీంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. -
గుండు గురించి అసలు కథ చెప్పేసిన సుహాస్..!
-
సుహాస్ ' అంబాజీపేట మ్యారేజి బ్యాండు'.. ఆసక్తిగా ఫస్ట్‌లుక్ పోస్టర్
సుహాస్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు'. దుశ్యంత్ కటికనేని ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. సెలూన్ షాప్ ముందు ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ మెంబర్స్‌తో నిలబడి ఉన్న పోస్టర్ సినిమాపై ఆసక్తి కలిగిస్తోంది. మ్యారేజ్ బ్యాండ్‌లో పనిచేసే మల్లి అనే కుర్రాడి పాత్రలో సుహాస్ ఈ సినిమాలో నటిస్తున్నాడు. కాగా.. మొదటి సినిమా కలర్ ఫోటోతోనే ఫేమ్ సంపాదించుకున్న సుహాస్ ఇటీవలే రైటర్ పద్మభూషణ్ సినిమాతో అలరించాడు. ప్రస్తుతం షూటింగ్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమాకి సంబంధించిన వివరాలను త్వరలో చిత్ర బృందం అధికారికంగా ప్రకటించనుంది. గ్యాంగ్ ల్యాండ్ అయ్యింది... ఇంక బ్యాండ్ మోగిపోతుంది 🎺🥁 Here's the first look of #AmbajipetaMarriageBand 💥💥#BunnyVas @Dushyanth_dk @mahaisnotanoun @DheeMogilineni @GA2Official @Mahayana_MP pic.twitter.com/WQ1EyPcwMt — Suhas 📸 (@ActorSuhas) April 11, 2023 -
World Coconut Day: రైతుకు సిరి.. ఉపాధికి ఊపిరి
సాక్షి అమలాపురం/ అంబాజీపేట (పి.గన్నవరం): కొబ్బరి అనగానే కోనసీమ గుర్తుకు వస్తుంది. రాష్ట్రంలో మూడు లక్షల ఎకరాల్లో సాగు జరుగుతుండగా, సుమారు 93 వేల ఎకరాలకు పైగా కోనసీమలోనే ఉంది. 70 వేల మందికిపైగా రైతులు కొబ్బరి సాగుపై ఆధారపడి జీవిస్తున్నారు. దీర్ఘకాలిక ఉద్యాన పంటల్లో ఒకటిగా... నెలనెలా క్రమం తప్పకుండా ఆదాయాన్ని అందించే పంటగా పేరొందింది. అంతేకాదు కొబ్బరి నుంచి సుమారు 160 రకాలకు పైగా ఉత్పత్తులను తయారు చేసే అవకాశముంది. ఇంత విలువైన బంగారు పంటపై రైతులే కాకుండా దింపు, వలుపు, తరుగు కార్మికులుగా, మోత, రవాణా కూలీలుగా వేలాది మంది జీవిస్తున్నారు. జిల్లాలో సుమారు ఐదు వేల మంది వరకు నేరుగా ఉపాధి పొందుతున్నారు. కాయర్ ఉత్పత్తి పరిశ్రమల ద్వారా నిరుద్యోగ యువత ఉపాధి పొందుతుండగా, కూలీలుగానే కాకుండా పీచుతో కళాత్మక ఉత్పత్తుల తయారీతో మహిళలు జీవనం సాగిస్తున్నారు. కొబ్బరి ఎగుమతి, దిగుమతుల చిరు వ్యాపారుల నుంచి బడా వ్యాపారుల వరకు దళారులు, ట్రాన్స్‌పోర్టు యాజమానులు ఇలా వేలాది మంది ఉపాధికి కొబ్బరి ఊపిరిగా నిలుస్తోంది. సెప్టెంబర్ 2వ తేదీ అంతర్జాతీయ కొబ్బరి దినోత్సవం సందర్భంగా నారికేళంతో వివిధ వర్గాల జీవనం పెనవేసుకుపోయిన తీరుపై కథనం... చిన్ననాటి నుంచి అనుబంధం కొబ్బరితో చిన్ననాటి నుంచి అనుబంధం ఉంది. మా కొబ్బరి తోటల్లో ఇంచుమించు ప్రతీ చెట్టు చిన్నప్పుడు నేను సేకరించి విత్తనాల నుంచి మొలక వచ్చినదే. అందుకే వీటితో నాకు సొంత పిల్లలతో ఉన్నంత అనుబంధం ఉంది. బహుశా అందుకేనేమో పెద్దలు కొబ్బరి చెట్టును కన్న కొడుకుతో పోలుస్తారు. 1960ల నుంచి కోనసీమలో కొబ్బరిసాగు బాగా పెరిగింది. మా లంక గ్రామాల్లో ఇది 1980 నుంచి ఆరంభమైంది. – గోదాశి నాగేశ్వరరావు, కొబ్బరి రైతు, లంకాఫ్ ఠాన్నేల్లంక మాది నాలుగవ తరం కురిడీ వ్యాపారంలో మాది నాలుగవ తరం. 60 ఏళ్లకు పైగా మా కుటుంబం ఈ వ్యాపారంలో భాగస్వామిగా ఉంది. ఈ వ్యాపారాన్ని ఇష్టపడి చేయాలని, నిజాయితీగా ఉండాలని మా పెద్దలు చెప్పేవారు. దేశంలో కురిడీ వ్యాపారంలో మాకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉందంటే దీని వల్లే. వ్యాపారం కన్నా ముందు రైతులుగా కొబ్బరి చెట్టును ప్రేమిస్తాం. బహుశా దాని వల్లనేమో కొబ్బరి మా జీవితాల్లో ఇంతగా కలిసిపోయింది. మా తరువాత తరం కూడా ఇదే వ్యాపారాన్ని కొనసాగిస్తోంది. – అప్పన బాలాజీ, కురిడీ కొబ్బరి వ్యాపారి, మాచవరం, అంబాజీపేట మండలం మూడున్నర దశాబ్దాలుగా ఆయిల్ వ్యాపారం మాది కొబ్బరి నూనె వ్యాపారం. మూడున్నర దశాబ్దాలుగా ఇదే వ్యాపారం చేస్తున్నాం. అంబాజీపేటలో ఉత్పత్తి అయ్యే స్వచ్ఛమైన కొబ్బరి నూనెలో మాది ఒకటిగా పేరొచ్చింది. గతంలో రైతులు కొబ్బరి ఎండబెట్టి సొంతంగా ఆయిల్ తయారు చేయించుకునేవారు. ఇప్పుడు కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే మా పిల్లలు సైతం ఈ వ్యాపారంలో భాగస్వాములుగా ఉన్నారు. – గెల్లి నాగేశ్వరరావు, కొబ్బరి నూనె వ్యాపారి, అంబాజీపేట 60 ఏళ్లుగా ఇక్కడే రాజస్థాన్‌లోని నాగూర్ మాది. మా తండ్రితోపాటు మా కుటుంబ సభ్యులు 60 ఏళ్లకు ముందే ఇక్కడకు వచ్చి స్థిరపడ్డాం. అప్పుడు నా వయస్సు రెండేళ్లు. తొలి నుంచి మాది కొబ్బరి కమీషన్ వ్యాపారం. కోనసీమ కొబ్బరి ఉత్తరాదికి పంపడంలో మా కుటుంబం కీలకంగా ఉండేది. అన్నదమ్ములమంతా ఇక్కడ కమీషన్ వ్యాపారం చేసేవాళ్లం. 1980 నుంచి 1996 వరకు కోనసీమ కొబ్బరి దేశీయ మార్కెట్లో ఉజ్వలంగా ఎదిగింది. తుపాను వచ్చిన తరువాత బాగా దెబ్బతింది. ఇప్పటికీ కమీషన్ వ్యాపారం జరుగుతున్నా అంతగా లేదు. – సంపత్ కుమార్ ఫారిక్, కొబ్బరి కమీషన్ వ్యాపారి, అంబాజీపేట కొబ్బరి వలుపే జీవనాధారం ఇప్పుడు నా వయస్సు 49. నా పదిహేనవ ఏట నుంచి కొబ్బరి వలువులో జీవనోపాధి పొందుతున్నాను. ఈ పని తప్ప మరొకటి రాదు. కుటుంబాన్ని పెంచి పోషించింది కూడా ఈ వృత్తిలోనే. నేనే కాదు చాలామంది మా వలుపు కార్మికులకు మరోపని రాదు. ఇన్నేళ్లుగా కొబ్బరితోనే మా జీవనం సాగిపోతోంది. – విప్పర్తి సత్యనారాయణ (బంగారి), పోతాయిలంక, అంబాజీపేట మండలం పరాయి రాష్ట్రమైనా కొబ్బరే ఆధారం మాకు స్థానికంగా పనులు లేక తమిళనాడులోని కాంగేయం వెళ్లిపోయాం. పరాయి రాష్ట్రానికి వెళ్లినా జీవనోపాధికి కొబ్బరి మీదనే ఆధారపడాల్సి వస్తోంది. నేను గడిచిన ఆరు ఏళ్లుగా తమిళనాడులో ఎండు కొబ్బరి తరిగే పనిచేస్తున్నాను. – దోనిపూడి దుర్గాప్రసాద్, తరుగు కార్మికుడు -
Jack Fruit: నోరూరించే పనస పండ్లు.. తింటే ఎన్ని లాభాలో తెలుసా?
అంబాజీపేట(కోనసీమ జిల్లా): చెట్లకు సాధారణంగా పువ్వు నుంచి పిందె, పిందె నుంచి కాయ వచ్చి అది పండుగా మారుతుంది. కాని పనస పండు పుట్టిక మాత్రం అలా జరగదు. ఈ చెట్టు కాండం నుంచే పిందెలు దిగి అవి కాయులు, పండ్లుగా తయారవుతాయి. కనుకనే పనస చెట్టు మొదలు నుంచి చివరి వరకూ కాండంపై కాయలు నిండి ఉంటాయి. సువాసనలు వెదజల్లుతూ నోరూరించే పనసపండు అంటే అందరికీ ఇష్టమే. పనసపండులో శరీరానికి అవసరమైన పలు పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పండును ఆంగ్లంలో జాక్‌ఫ్రూట్ అంటారు. దీని వృక్షశాస్త్ర నామ థేయం ఎట్రోకార్పస్ ఇంటి గ్రిఫోలియా. ఏటా మార్చి నుంచి జూలై వరకూ పనస పండ్లు ఎక్కువగా దొరుకుతాయి. ఒక్కొక్క చెట్టుకు 100 వరకూ కాయలు దిగుబడులు వస్తాయి. ఒక్కొక్క కాయ 10 నుంచి 20 కేజీల బరువు ఉంటాయి. కాగా కాయ ఎంత బరువున్నా అందులో 30 శాతం మాత్రమే తినడానికి ఉపయోగపడుతుంది. కాగా అంబాజీపేట పరిసర ప్రాంతాల్లో దొరకే పనస పండ్లకు మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ డిమాండ్ ఉంది. పనసలో పలు రకాలు బంగారు పనస, కొబ్బరి పనస, ఖర్జూర పనస, వేరు పనస, చిన్నకోల పనస, గుండ్రు పనస, గులాబి పనస, కర్ణపనస, తేనెపనస అనే రకాలు ఉన్నాయి. వివాహాది శుభ కార్యాలయాల్లో పనసకాయ కూర చేస్తారు. పనసకాయను పొట్టుగా కొట్టి కూర వండితే తినతివారు ఉండరు. అంతేకాకుండా లేత పనస కాయలను చిన్న ముక్కలుగా తరిగి మషాలా కూరల్లో ఉపయోగిస్తారు. పోషకాలు ఇలా.. పనస పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు ఉంటాయని, ఏడాదికి ఒకసారైనా కచ్చితంగా పనసపండు తినాలని వైద్యులు సూచిస్తున్నారు. పనస పండులో మాంసకృతులు 1.9 శాతం, చక్కెర 19.8 శాతం, కొవ్వులు 0.1 శాతం, కెరోటిన్ 175 మైక్రో గ్రాములు, థియోమిన్ 0.3 మిల్లీ గ్రాములు, విటమిన్ సి 7 మిల్లీ గ్రాములు, పీచు పదార్థం 1.1 శాతం, సున్నం 20.0 మిల్లీ గ్రాములు, ఇనుము 0.56 మిల్లీ గ్రాములు ఉంటాయి. -
తెల్ల దోమలపై యుద్ధానికి బదనికల సైన్యం
సాక్షి, అమరావతి: నాలుగేళ్ల క్రితం వెలుగులోకి వచ్చిన సర్పిలాకార తెల్లదోమ (రూగోస్ వైట్ ఫ్లై) ఉద్యాన పంటలు సాగుచేసే రైతులను వణికిస్తోంది. దేశంలోని కొబ్బరి తోటలతో పాటు 200 రకాలకు పైగా పంటలపై వేగంగా విస్తరిస్తూ సాగుదారులను నష్టాలకు గురి చేస్తోంది. ఈ కొత్త రకం తెల్లదోమ నియంత్రణ కోసం డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ ఆధ్వర్యంలోని అంబాజీపేట కొబ్బరి పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలు ఫలించాయి. సర్పిలాకార తెల్లదోమలను సమర్థవంతంగా ఎదుర్కొనే మిత్ర పురుగులను తయారు చేయడమే కాకుండా.. వాటి ఉత్పత్తి కోసం రాష్ట్రంలో రెండుచోట్ల ల్యాబొరేటరీలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం ఐదు ప్రైవేటు కంపెనీలతో ఒప్పందాలు కూడా చేసుకున్నారు. కడియంలో కనబడి.. దేశమంతా విస్తరించింది సర్పిలాకార తెల్లదోమ విదేశీ మొక్కల ద్వారా దేశంలోకి చొరబడిన కొత్త రకం దోమ. 2016లో కడియం నర్సరీలలో దీనిని గుర్తించినప్పటికీ అప్పట్లో పెద్దగా ప్రభావం చూపలేదు. గడచిన రెండేళ్లుగా చాపకింద నీరులా దేశమంతటా ఉధృతంగా వ్యాప్తి చెందుతూ ఉద్యాన పంటలను దెబ్బతీస్తోంది. మన రాష్ట్రంతోపాటు కొబ్బరి సాగు ఎక్కువగా ఉన్న కేరళ, గోవా, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, బిహార్, అస్సోం వంటి రాష్ట్రాల్లో వేగంగా విస్తరిస్తోంది. కొబ్బరితో పాటు అంతర పంటల్ని కూడా అతలాకుతలం చేస్తోంది. కొబ్బరిలో 25–30 శాతం, ఆయిల్‌పామ్‌లో 35 శాతం, అరటి ఇతర పంటల్లో 15 నుంచి 25 శాతం విస్తీర్ణంలో వ్యాప్తి చెందినట్టుగా గుర్తించారు. ఎలా దాడి చేస్తోందంటే.. సర్పిలాకార తెల్లదోమ రసం పీల్చే తరగతికి చెందిన రెక్కల పురుగు. ఐదు దశల్లో వృద్ధి చెందే ఇది మామూలు తెల్లదోమ కన్నా ఐదు రెట్లు (దాదాపు 2.5 మి.మీ.) పెద్దది. దీని జీవితకాలం 40–45 రోజులు. ఇవి ఆకుల కింద భాగంలో చేరి రసాన్ని పీల్చేసి తేనె లాంటి జిగురు పదార్థాన్ని విసర్జిస్తాయి. దీనివల్ల ఏర్పడే లెప్టోగైజఫియమ్ అనే బూజు కిరణ జన్య సంయోగ క్రియకు ఆటంకం కలిగిస్తుంది. ఈ దోమలు ఆకుల కింద తెల్లటి వలయాకారంలో గుడ్లను పెడతాయి. వీటి ఉధృతి తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు, ఆకులే కాదు రెమ్మ, మొదళ్లు, పువ్వులు, కాయలు సైతం తెల్లని దూది లాంటి పదార్థంతో నిండిపోతాయి. ఈ ప్రభావం వల్ల 20–30 శాతం మేర దిగుబడి తగ్గే అవకాశాలున్నాయి. నియంత్రణకు ఏం చేయాలంటే.. సర్పిలాకార తెల్లదోమ తల్లి పురుగులను ఆకర్షించేందుకు ఆముదం పూసిన పసుపు రంగు అట్టలను కాండంపై ఏర్పాటు చేసుకోవాలి. ఉధృతి తక్కువగా ఉంటే మిత్రపురుగు డైకో క్రైసా ఆస్టర్‌కు చెందిన 100–150 గుడ్లు, ఎక్కువగా ఉంటే 300–500 గుడ్లు చొప్పున విడుదల చేయాలి. తగిన మిత్ర పురుగులు లేకపోతే ఒక శాతం వేపనూనెకు 10 గ్రాముల డిటర్జెంట్ పౌడర్ కలిపి ఆకు అడుగు భాగాలు తడిసేలా 15 రోజులకోసారి పిచికారీ చేయాలి. ఫలించిన ‘ఉద్యాన’ పరిశోధనలు తెల్లదోమను ఎదుర్కొనేందుకు ‘సూడో మల్లడా’ అనే మిత్ర పురుగులు సమర్థవంతంగా పని చేస్తాయని అంబాజీపేట కొబ్బరి పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు కనుగొన్నారు. బెంగళూరు నుంచి ఇసారియా అనే ఫంగస్, తమిళనాడు, కేరళ, బెంగళూరు నుంచి ‘ఎన్కార్సియా’ అనే మరో మిత్ర పురుగును తీసుకొచ్చారు. వీటి తయారీలో ఆర్బీకే సిబ్బందికి, కోనసీమ ప్రాంత రైతులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి పైలట్ ప్రాజెక్టుగా కోనసీమలో తెల్లదోమపై ప్రయోగించి సత్ఫలితాలను సాధించారు. ఈ మిత్ర పురుగులు, ఫంగస్ తయారీ కోసం శ్రీకాకుళం జిల్లా సోంపేట, పశ్చిమ గోదావరి జిల్లా వెంకట్రామన్నగూడెంలోని డాక్టర్ వైఎస్సార్ హార్టీకల్చర్ యూనివర్సిటీ ప్రాంగణంలో రూ.27 లక్షలతో జీవ నియంత్రణా పరిశోధనా ల్యాబొరేటరీలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం ఐదు ప్రైవేటు కంపెనీలతో ఒప్పందాలు (ఎంవోయూలు) కూడా చేసుకున్నారు. జీవ నియంత్రణా పద్ధతులతోనే నివారణ సాధ్యం తెల్లదోమ సోకిన మొక్కలను ఒకచోట నుంచి మరొక చోటకు తరలించకూడదు. జీవ నియంత్రణా పద్ధతుల ద్వారా సామూహికంగా దీన్ని నియంత్రించగలం. ఇప్పటికే 30 లక్షల మిత్ర పురుగులను తయారు చేశాం. పొరుగు రాష్ట్రాల నుంచి డిమాండ్ అధికంగా ఉన్న దృష్ట్యా ఇవి ఏమాత్రం సరిపోవు. అందుకే వీటి తయారీ కోసం 5 కంపెనీలతో ఉద్యాన యూనివర్సిటీ ఒప్పందాలు చేసుకుంది. – డాక్టర్ ఎన్‌బీవీ చలపతిరావు, శాస్త్రవేత్త, కొబ్బరి పరిశోధనా కేంద్రం, అంబాజీపేట -
ఈ ఏడాది కొబ్బరినామ సంవ్సతరం : కన్నబాబు
సాక్షి, విజయవాడ : రాష్ట్రంలో కొబ్బరి సాగు, ఆ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారంపై అంబాజీపేటలోని కొబ్బరి పరిశోధనా కేంద్రం నిర్వహించిన వెబినార్‌లో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు శుక్రవారం విజయవాడ నుంచి పాల్గొన్నారు. కొబ్బరి రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న పలు చర్యలను ఆయన ఈ సందర్భంగా వివరించారు. కొబ్బరి నామ సంవత్సరం : డాక్టర్ వైయస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఈ ఏడాది (2020–21)ని కొబ్బరి సంవత్పరంగా ప్రకటించిన నేపథ్యంలో కొబ్బరి రైతుల పట్ల ప్రభుత్వానికి మరింత బాధ్యత పెరిగిందని వ్యవసాయ శాఖ మంత్రి కె.కన్నబాబు వెల్లడించారు. కొబ్బరి రైతులకు మేలు చేసేందుకు అంబాజీపేట పరిశోధన కేంద్రం ద్వారా పలు చర్యలు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. అందువల్ల ఈ ప్రక్రియలో రైతులకు కొబ్బరి పరిశోధనా కేంద్రం ఎంతో సహాయకారిగా నిలవనుందని చెప్పారు. (చదవండి : సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం) నాణ్యమైన పరిశోధనలు : కొబ్బరి రైతుల ఆదాయం పెరగడంతో పాటు, ఉత్పత్తిలో వారు ఇతర రాష్ట్రాల రైతలతో పోటీ పడే విధంగా అంబాజీపేట కొబ్బరి పరిశోధన కేంద్రం మరింత నాణ్యమైన పరిశోధనలు జరపాలని మంత్రి కోరారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రైతులకు తగిన సూచనలు, సలహాలు అందించాలని ఆయన అన్నారు. సమస్యలపై దృష్టి : గ్రామాలలో అన్ని విధాలుగా రైతులకు అండగా నిలుస్తోన్న రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) వద్ద ఉన్న వ్యవసాయ సహయకుల ద్వారా కొబ్బరి రైతుల సమస్యలను తెలుసుకోవాలని కొబ్బరి పరిశోధన కేంద్రానికి మంత్రి కన్నబాబు సూచించారు. అదే విధంగా ఆ సమస్యలకు పరిష్కారం కూడా చూపాలని ఆయన కోరారు. నాడు ఉమ్మడి రాష్ట్రంలో 1953లో 60 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైన అంబాజీపేట కొబ్బరి పరిశోధన కేంద్రం, ఇన్నేళ్లుగా రైతులకు సేవలందిస్తోందని మంత్రి ప్రశంసించారు. దశాబ్ధాలుగా సంస్థ పరిశోధనలు కొనసాగించడం హర్షణీయమని ఆయన పేర్కొన్నారు. ఈ కేంద్రంలో అభివృద్ధి చేసిన గంగా బొండాం రకాన్ని జాతీయ స్థాయిలో గతంలో ‘గౌతమి గంగ’ గా విడుదల చేశారని గుర్తు చేశారు.కొబ్బరిలో పురుగుల నివారణకు కొబ్బరి వేరు ద్వారా కీటక నాశక మందుల వినియోగాన్ని ఈ పరిశోధన కేంద్రం రూపొందించగా, ఆ పద్ధతి రైతుల్లో బాగా ప్రాచుర్యం పొందిందని మంత్రి తెలిపారు. కొబ్బరి తోటల సాగులోనూ ఆ విధానం చౌకగానూ, సమర్ధవంతంగానూ నిల్చిందని చెప్పారు. కొబ్బరి ఉత్పత్తిలో మన స్థానం : కొబ్బరి ఉత్పత్తిలో దేశ వ్యాప్తంగా రాష్ట్రం నాలుగవ స్థానంలో ఉండగా, కొబ్బరి ఉత్పాదకత రంగంలో తొలి స్థానంలో నిలుస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు వెల్లడించారు. కొబ్బరి ఉత్పత్తిలో కూడా రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలవాలని ఆయన ఆకాంక్షించారు. ఆ దిశలో వ్యవసాయ శాస్త్రవేత్తలు మరింత పరిశోధనలు చేసి, రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రభుత్వ చర్యలు : కొబ్బరిలో మేలైన రకాల ఉత్పత్తి సాధించడం, ఉత్తమ యాజమాన్యం ద్వారా దిగుబడి, నాణ్యత పెంచడంతో పాటు, కొబ్బరి రకాలకు తగిన యాజమాన్య పద్ధతులను రూపొందిస్తామని మంత్రి కన్నబాబు తెలిపారు. అదే విధంగా రైతులకు ఆధునిక ఉద్యాన పరిజ్ఞానాన్ని అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు. జీవ నియంత్రణపై పరిశోధనలు : జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా చీడ పీడలు, తెగుళ్ల నివారణపై పరిశోధనతో పాటు, తెల్లదోమ నివారణకు జీవ నియంత్రక శిలీంధ్రం (ఇసారియా), మిత్ర పురుగులు (ఎక్కార్సియా డైకో కైసా)పై రైతులకు అవగాహన కల్పిస్తామని వెబినార్‌లో పాల్గొన్న డాక్టర్ వైయస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ టి.జానకిరామ్ తెలిపారు. మిత్ర పురుగులను ఎక్కువ సంఖ్యలో రైతులకు అందుబాటులోకి తెస్తామని ఆయన చెప్పారు. కొబ్బరిని కొత్తగా ఆశిస్తున్న పురుగులు, తెగుళ్ళను జీవ నియంత్రణ ద్వారా సమర్ధవంతంగా నివారించే ప్రయోగాలు కొనసాగుతున్నాయని ఆయన వివరించారు. ఈ వెబినార్‌లో హార్టికల్చర్ కమిషనర్ చిరంజీవి చౌదరి తదితరులు పాల్గొన్నారు. -
మట్టి మూకుడు రొట్టె రుచే వేరు..
సాక్షి, అంబాజీపేట: ప్రస్తుత కాలంలో ప్రతీ ఒక్కరూ ఫిజా.. బగ్గర్లు.. పాస్ట్ ఫుడ్ వైపు చూస్తున్నారు. కాని కోనసీమలో మాత్రం మూకుడు రొట్టె కోసం ప్రియిలు సాయంత్రం సమయంలో మూకుడు రొట్టె కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఉదయం పూట ప్రతీ ఒక్కరూ ఆల్ఫాహారం తీసుకోవడం సర్వసాధరణం. ఇడ్లీ, పూరీ, బజ్జీ, గారె తదితరవి అల్పాహారాలు తీసుకుంటాం. చల్లని సాయంత్రం సమయంలో వేడే వేడి మూకుడు రొట్టె, పైగా మట్టి మూకుడులో సంప్రదాయ ఇంధనంతో తయారు చేసిన మినపరొట్టెను అరటి ఆకులో వేసుకుని తింటూ ఉంటూ ఆరుచికి లొట్టలేసుకుని మరీ తింటున్నారు టిఫిన్ ప్రియులు. వివరాల్లోకి వెళితే అంబాజీపేట మండలం ముక్కామలలో ఒక చిన్న పూరి పాకలో కాల్వగట్టుపై చిన్న హోటల్ ఉంది. అబ్బిరెడ్డి సత్యనారాయణ గత 50 ఏళ్ల నుండి ఈ పూరి పాకలో మినపరొట్టెను సాయంత్రం సమయంలో విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. మట్టి మూకుడులో నిప్పులపై కాల్చిన మినపరొట్టె ఎంత రుచో మాటల్లో చెప్పలేమని రొట్టె ప్రియులు చెబుతున్నారు. పావలా నుండి రూ.15 వరకు గత 50 ఏళ్లుగా నిర్వహిస్తున్న ఈ హొటల్ మినపరొట్టెకు ఫేమస్. 25 పైజల నుండి నేటు రూ.15 రూపాలయు విక్రయిస్తూనే ఉన్నానని సత్యనారాయణ తెలిపాడు. సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు హొటల్ నిర్వహిస్తానని చెబుతున్నాడు. ప్రతీ రోజు సుమారు 100 నుండి 150 మినప రొట్టెలను విక్రయిస్తానంటున్నాడు. సాంప్రదాయ ఇంధనంతో తయారీ.. మట్టి మూకుడులో మినపరొట్టె తయారీకి సత్యనారాయణ ఇంధనాన్ని మాత్రమే వినియోగిస్తాడు. ఇటుకలపొయ్యిపై కొబ్బరి డొక్కలను ఉపయోగిస్తాడు. మట్టి మూకుడులో మినపపిండి వేసి దానిపై మూత ఉంచి కింద పైన డొక్క నిప్పుల సెగతో రొట్టెను తయారు చేస్తాడు. అరటి ఆకులోనే సరఫరా టిఫన్ ప్లేట్లలో ప్లాస్టిక్ పేపర్, గ్లాసులు కూడా వాడకుండా అరటి ఆకులో టిఫిన్ వేసి సరఫరా చేస్తున్నాడు. 50 ఏళ్ల నుంచి ఇప్పటి వరకు మట్టి మూకుడు, నిప్పుల పొయ్యి తప్ప దేనిపైనా వండలేదని చెబుతున్నాడు. రంపచోడవరం: గిరిజనుల ఆహారంలో ప్రత్యేకమైనది వెదురు కూర. ఇది చాలా రుచికరంగా ఉంటుంది. వెదురు కోకిం కుసీర్ అని పిలిచే వెదురు కూరను ఇంగ్లిషులో బాంబూ షూట్ అని అంటారు. అడవిలో వెదురు బొంగులు ఏర్పడడానికి ముందు లేత మొక్కలు (వెదురు కొమ్ములు) వస్తాయి. ఆ దశలో అవి భూమిలో నుంచి పైకి రాగానే వాటిని కట్‌చేసి పై పొరను తీసేసి శుభ్రం చేసి గోరువెచ్చని నీటిలో ఉడకబెడతారు. అనంతరం వాటిని సన్నగా తురిమి కారం, మసాలా దినుసులు కలిపి కూరగా వండుతారు. కొంతమంది వాటిని ఎండబెట్టి కొన్నిరోజుల తరువాత కూడా కూరగా వండుకుంటారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని గిరిజనులు వెదురు కొమ్ములను సేకరించి కొమ్ములుగా లేక సన్నగా తరిగి సంతల్లో విక్రయిస్తున్నారు. వెదురు కొమ్ములతో పచ్చళ్లు కూడా తయారు చేసి పట్టణాల్లోని గిరిజన స్టాల్స్‌లో విక్రయిస్తున్నారు. -
కల్యాణం.. ‘కవలీ’యం
సాక్షి, అంబాజీపేట (పి.గన్నవరం): వివాహమంటే కనుల పండుగ. అందులోనూ కోనసీమలో చేసే సందడి అంతాఇంతా కాదు. ఓ వేదికపై అంతకుమించిన సంబరంతో.. సంభ్రమాశ్చర్యాల నడుమ రెండు కవల జంటలకు వివాహమైంది. తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేట మండలం పెచ్చెట్టివారిపాలెం గ్రామం ఇందుకు వేదికైంది. వివరాల్లోకి వెళితే.. అంబాజీపేట మండలం మాచవరం శివారు పోతాయిలంకకు చెందిన మట్టపర్తి నాగేశ్వరరావు, ధనలక్ష్మి దంపతులకు రెండో సంతానంగా ధర్మారావు, దుర్గారావు అనే కవలలు జన్మించారు. వారికి కవల వధువులతోనే వివాహం జరిపించాలనేది తమ తల్లి ధనలక్ష్మి కోరిక అని ఆమె పెద్ద కొడుకు లక్ష్మణ్ తెలిపారు. కొంతకాలం క్రితం ఆమె మరణించగా.. ధర్మారావు, దుర్గారావు వివాహ బాధ్యతను అన్నా వదినలైన లక్ష్మణ్, కళావతి తీసుకున్నారు. తండ్రి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కవల వధువుల కోసం వెతకసాగారు. సమీప గ్రామమైన పెచ్చెట్టివారి పాలెంలో కొప్పిశెట్టి బాలాజీ, శ్రీలక్ష్మి దంపతులకు జ్యోతి, స్వాతి అనే కవలలు ఉన్నారని తెలియటంతో వారింటికి వెళ్లి సంబంధాన్ని ఖాయం చేసుకున్నారు. ఆదివారం రాత్రి కవలలైన ధర్మారావు, దుర్గారావులకు కవల వధువులు స్వాతి, జ్యోతినిచ్చి వివాహం జరిపించారు. కవల వరులలో పెద్దవాడిగా భావించే ధర్మారావు హైదరాబాద్‌లో వ్యాపారం చేస్తుండగా.. దుర్గారావు బీహెచ్ఈఎల్లో ఉద్యోగం చేస్తున్నారు. వివాహానికి హాజరైనవారు కవల జంటల్ని చూసి ఎవరు ధర్మారావు, ఎవరు దుర్గారావు, ఎవరు జ్యోతి, ఎవరు స్వాతి తెలుసుకోవడంలో ఒకింత తికమకపడ్డారు. -
నాడు కళకళ.. నేడు వెలవెల
అమలాపురం టౌన్/అంబాజీపేట: కోట్లాది రూపాయల లావాదేవీలతో ఒకప్పుడు అంబాజీపేట కొబ్బరి మార్కెట్ దేశంలో మంచి పేరుగడించింది. కేరళలోని అలెప్పీ మార్కెట్ తర్వాత స్థానం దీనిదే. 20 ఏళ్ల క్రితం ఇక్కడ 107 కొత్త కొబ్బరి దుకాణాలు ఉండేవి. 2వేల మందికి పైగా కొబ్బరి కార్మికులు ఇక్కడ ఉపాధి పొందేవారు. కొబ్బరి ఉత్పత్తుల్లో తమిళనాడు రాష్ట్రం దూసుకురావడం, కర్ణాటకకు సైతం కొబ్బరి పంట విస్తరించడంతో ఈ మార్కెట్ ఘన కీర్తి కరుగుతూ వచ్చింది. నేడు ఇక్కడ కొత్త కొబ్బరి దుకాణాలు 20 మాత్రమే ఉన్నాయి. వీటిని నమ్ముకుని జీవించే కొబ్బరి కార్మికులు పని దొరకని అభద్రతా భావం అలుముకుంది. అంబాజీపేట కొబ్బరి మార్కెట్... కొత్త కొబ్బరి కార్మికుల జీవన íస్థితుగతులపై అంబాజీపేట శివారు కొర్లపాటివారిపాలేనికి చెందిన సూర్యమణి పరిశీలన చేసి ఆ వివరాలను సేకరించింది. కొబ్బరి కార్మికుల శ్రమైక జీవనంలోకి తొంగి చూసి వారి మనోభావాలను, అభిప్రాయాలను సేకరించింది. భట్లపాలెం బీవీసీ ఇంజినీరింగ్ కళాశాల హ్యూమన్ రిసోర్స్ ప్రొఫెసర్ డాక్టర్ గోకరకొండ నాగేంద్ర సూచనలతో ఆమె ఈ ప్రాజెక్ట్ చేపట్టంది. సూర్యమణి తన 45 పేజీల ప్రాజెక్ట్ రిపోర్ట్‌ను కళాశాలకు సమర్పించింది. ఆమె పరిశీలనలో వెల్లడైన వివరాలు.. రెండు దశాబ్దాల కిందటి అంబాజీపే కొబ్బరి మార్కెట్లోని 107 కొత్త కొబ్బరి దుకాణాల్లో దుకాణానికి సగటున 20 మంది కొత్త కొబ్బరి కార్మికులు ఉండేవారు. ప్రస్తుతం 20 దుకాణాలకు తగ్గిపోవడంతో కొందరు సంప్రదాయంగా తమకు తెలిసిన ఈ వృత్తిలోనే కష్టమైనా...నష్టమైనా ఉండిపోయారు. మరికొందరు చేతి నిండా పనులు లేక తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు వలస వెళ్లి అక్కడ కొబ్బరి కార్మికులుగా జీవనం సాగిస్తున్నారు. ఇంకొందరు ఇతర వృత్తుల్లో ఉపాధి వెతుక్కున్నారు. ప్రస్తుతం ఉన్న 20 దుకాణాల్లో దాదాపు 200 మంది కార్మికులు పని చేస్తున్నారు. వారికి వచ్చే వేతనాలతో కుటుంబ పోషణ సాఫీగానే సాగిపోతున్నా ఇళ్లలో ఏవైనా శుభకార్యక్రమాలు జరిగినా, దురదృష్టవశాత్తు అనారోగ్యం పాలైనా ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అంబాజీపేట కొబ్బరి మార్కెట్ 20 ఏళ్ల క్రితం వరకూ దేశంలో కీలక స్థానంలో ఉండేది. కేరళలోని అలెప్పీ మార్కెట్ తర్వాతి స్థానం ఈ మార్కెట్‌దే. అయితే అనంతరం చోటు చేసుకున్న పరిణామాలతో ఇది నేల చూపు చూసింది. ఆ ఘనకీర్తి మసకబారింది. దీనిపై ఆధారపడిన కార్మికులు గత్యంతరం లేక వలసబాట పట్టారు. -
‘ధాన్యానికి గిట్టుబాటు ధరే కాదు.. బోనస్ ఇస్తాం’
-
‘ధాన్యానికి గిట్టుబాటు ధరే కాదు.. బోనస్ ఇస్తాం’
సాక్షి, తూర్పు గోదావరి: తమ పార్టీ అధికారంలోకి వచ్చాక దాన్యానికి గిట్టుబాటు కల్పించడమే కాదు.. బోనస్ కూడా ఇస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఆదివారం పి గన్నవరం నియోజకవర్గంలో అంబాజీపేటలో ఎన్నికల ప్రచార సభలో వైఎస్ జగన్ ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ..‘రాష్ట్రంలో సాయం కోసం ఎదురుచూస్తున్న ప్రతి కుటుంబానికి.. నేను విన్నాను.. నేను ఉన్నానని మాటిస్తున్నాను. పాదయాత్రలో చూడని కష్టం లేదు. గిట్టుబాటు అందక, రుణమాఫీ చేయక రైతులు చాలా కష్టాలు ఎదుర్కొంటున్నారు. గోదావరిలో నీళ్లు కనిపిస్తాయి కానీ రెండో పంటకు నీరందదు. పండించిన పంటకు గిట్టుబాటు ధర ఉండదు.. కొనే నాథుడు కూడా ఉండడు. నిరుద్యోగుల కష్టాలు చశా, ఫీజు రియింబర్స్‌మెంట్ రాక తల్లిదండ్రులను కష్టపెట్టడం ఇష్టం లేక ఆత్మహత్యలు చేసుకున్న పిల్లలు చూశా. వైద్యం కోసం అప్పులు చేసి ఆస్తులు అమ్ముకున్న పరిస్థితి.. 108కి ఫోన్ చేస్తే అదెక్కడుందో తెలియని దుస్థితి. గ్రామాల్లో మూడు, నాలుగు బెల్టు షాపులతో కుటుంబాలు చిన్నాభిన్నమై అక్కాచెల్లమ్మలు పడుతున్న కష్టాలు చూశాను. (అధికారంలోకి రాగానే అందరికి న్యాయం: వైఎస్ జగన్) ఉద్యోగాలు రాక.. నోటిఫికేషన్లు లేక పిల్లలు పడుతున్న అవస్థలు చూశా. రాష్ట్రంలో 2.30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా.. చదువుకుని ఉద్యోగాల కోసం నిరుద్యోగులు వేరే రాష్ట్రాలకు, దేశాలకు వలస పోతున్నారు. పక్కనే గోదావరి ఉన్న గ్రామాల్లో తాగడానికి నీళ్లు లేవు. పిల్లల్ని చదివించడానికి అక్కాచెల్లమ్మలు కూలీలుగా మారారు. 2014లో ఎన్నికలకు ముందు మేనిఫెస్టో పేరుతో చంద్రబాబు మోసాలను చూశాం. ప్రజలను మోసం చేయడంలో ఆయన పీహెచ్డీ చేశారు. సీఎం అయ్యాక కాకినాడ, రాజమండ్రి స్మార్ట్ సిటీలుగా చేస్తానని చంద్రబాబు చెప్పిన మాటు నిజమయ్యాయా?. పెట్రోలియం యూనివరిసటీ ఏమైంది?. కోనసీమలో కొబ్బరి పీచు పరిశ్రమ అన్నారు అది ఎక్కడైనా కనబడిందా?. మళ్లీ ఎన్నికల వచ్చేసరికి చంద్రబాబు కపట ప్రేమ కనబరుస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు చెప్పని అబద్ధం ఉండదు, చేయని అన్యాయం ఉండదు, ఎంత ఖర్చు చేయడానికైనా వెనకడాడు. గ్రామాలకు ముటలు ముటలు డబ్బులు పంపుతాడు.. ఓటుకు మూడు వేలు రూపాయలు ఇచ్చి మళ్లీ మోసం చేయడానికి ప్రయత్నిస్తాడు. (అవినీతి లేని పాలన అందిస్తా: వైఎస్ జగన్) చంద్రబాబు ఇచ్చే మూడు వేల రూపాయలకు మోసపోకండి అని గ్రామాల్లోని అవ్వ తాతలకు చెప్పిండి. జగనన్న చెప్పకపోయి ఉంటే పించన్ రెండు వేలకు పెరిగిదా అని గుర్తుచేయండి. మన పిల్లలను బడికి పంపిస్తే చాలు అన్న ఏటా రూ. 15 వేల రూపాయలు ఇస్తాడని ప్రతి అక్కాచెల్లమ్మకు చెప్పండి. ఏ చదువైనా అన్న చదివిస్తాడని.. ఎన్ని లక్షలైనా కూడా భరిస్తాడని ప్రతి ఇంట్లో చెప్పండి. 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ మహిళలకు వైఎస్సార్ చేయూత కింద 75 వేల రూపాయలు నాలు దఫాలుగా చెల్లిస్తాం. ప్రతి రైతన్నకు మే నెలలోనే 12,500 రూపాయలు ఇస్తాం. నవరత్నాల గురించి ప్రతి అవ్వకు, తాతకు చెప్పిండి. ఈ ఎన్నికల్లో ఒకవైపు మోసం కనిపిస్తుంది.. మరోవైపు విశ్వసనీయత, విలువలు కనిపిస్తున్నాయి. చెడిపోయిన రాజకీయ వ్యవస్థలోకి మార్పు రావాలంటే వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావాలి. మోసం చేసే వారిని బంగాళాఖాతంలో కలిపే రోజులు రావాలి. గన్నవరం ఎమ్మెల్యేగా చిట్టిబాబుకు, ఎంపీ అభ్యర్థిగా అనురాధమ్మను దీవించమని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఆశీర్వదించమ’ని కోరారు. -
ఆటోలకు అడ్డా...ఆర్టీసీ బస్టాండ్
సాక్షి, ముక్కామల (అంబాజీపేట): స్థానిక సెంటర్లో నిర్మించిన బస్టాండ్ ఆటోలకు అడ్డాగా మారిందని ప్రయాణికులు, స్థానికులు విమర్శిస్తున్నారు. వేలాది రూపాయలు ఖర్చు చేసి బస్టాండ్‌ను రూ.లక్షలు వెచ్చించి 1996లో నిర్మించారు. అప్పటి నుంచి బస్టాండ్‌లోకి బస్‌లు లోపలకు రాకుండా బయట నుంచి వెళ్లిపోవడంతో ప్రయాణికులు రోడ్లపైనే జాగారం చేస్తున్నారు. దాంతో స్థానికుడు వనచర్ల పండు అమలాపురం ఆర్టీసీ డిపో మేనేజర్‌కు ఫిర్యాదు చేశారు. ఆర్టీసీ బస్‌లు లోపలకు రాకుండానే బయట నుంచి వెళ్లిపోతున్నాయని, లక్షలాది రూపాయలతో నిర్మించిన బస్టాండ్ నిరుపయోగంగా తయారైందని డిపో మేనేజర్‌కు వివరించినట్లు పండు తెలిపారు. బస్టాండ్‌లో ఆర్టీసీ బస్‌లు రాకుండా ఆటోలు అడ్డుగా నిలుపుదల చేస్తున్నారని గతం నుంచి ఆరోపణలు వస్తున్నా ఆర్టీసీ అధికారుల పట్టించుకోలేదనే విషయాన్ని గుర్తు చేశారు. దాంతో ఆర్టీసీ బస్‌లను లోపలకు వచ్చేలా చూడాలని వారం రోజులపాటు బస్టాండ్ వద్ద ఉండాలని అధికారులు సూచించారని పండు తెలిపారు. దాంతో ఆర్టీసీ బస్‌లను బస్టాండ్ లోపలకు తీసుకుని వస్తున్నారని, అయితే బస్‌లు వచ్చే సమయంలో ఆటోలను అడ్డుగా పెడుతున్నారని వాపోయాడు. పసుపల్లి గ్రామానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు బస్టాండ్ ఆవరణలో హల్‌చల్‌చేసి భయబ్రాంతులకు గురిచేశాడని ఈ విషయాన్ని అంబాజీపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశానన్నాడు. బస్‌లకు అడ్డుగా నిలుపుదల చేయవద్దని కోరితే ఆటో డ్రైవర్లు గొడవకు వస్తున్నారని ఈ విషయాన్ని డిపో మేనేజర్‌కు తెలియజేశామన్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు స్పందించి ఆర్టీసీ బస్‌లను లోపలకు వచ్చేలా చూడాలని కోరారు. -
తెగని తమ్ముళ్ల తగవు
– అరుపులు కేకలతో వాయిదా పడ్డ అంబాజీపేట మండల పార్టీ అధ్యక్ష ఎన్నిక పి.గన్నవరం : అంబాజీపేట మండల టీడీపీ అధ్యక్ష పదవి కోసం పి.గన్నవరంలో మంగళవారం జరిగిన సమావేశం రసాభాసగా మారింది. ఆ పదవికోసం మండలంలోని రెండు వర్గాల పార్టీ నాయకులు పోటీ పడటంతో ఎవరికి ఇవ్వాలన్న దానిపై స్థానిక ఎమ్మెల్యేకి తలపోటుగా మారింది. ఆ పదవి తమకు కావాలంటే, తమకు కావాలని రెండు వర్గాల కార్యకర్తలు పెద్ద పెట్టున కేకలు వేయడంతో.. చివరికి పార్టీ పరిశీలకులు వావివాల సరళాదేవి, పాకలపాటి గాంధీ అధ్యక్ష ఎన్నికను వాయిదా వేశారు. ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి అధ్యక్షతన స్థానిక పార్టీ కార్యాలయ ఆవరణలో అంబాజీపేట మండల ఎన్నికలు నిర్వహించారు. ప్రధాన కార్యదర్శిగా గుడాల ఫణి ఏకగ్రీవమయ్యారు. అయితే అధ్యక్ష పదవి కోసం గణపతి నాగసత్యనారాయణ (బాబులు), పబ్బినీడి రాంబాబు పోటీ పడ్డారు. అధ్యక్ష పదవిని తమ నాయకుడికే ఇవ్వాలని ఇరు వర్గాలవారు వేదిక వద్దకు చేరుకుని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఇరువర్గాల కార్యకర్తల మధ్య వాగ్వివాదం జరిగింది. దీంతో ఇద్దరి పేర్లను పార్టీ అధిష్టానానికి పంపుతామని ఎమ్మెల్యే పులపర్తి, పార్టీ పరిశీలకులు చెప్పడంతో ఆందోళనను విరమించారు. సోమవారం జరిగిన అయినవిల్లి మండల ఎన్నికల్లో కూడా తమ్ముళ్లు ఏకాభిప్రాయానికి రాకపోవడంతో గలాటా జరిగిన విషయం విదితమే. అంబాజీపేట ఎంపీపీ డీవీవీ సత్యనారాయణ, జెడ్పీటీసీ బొంతు పెదబాబు, ఏఎంసీ చైర్మన్ అరిగెల బలరామ్మూర్తి, గణపతి రాఘవులు, కాండ్రేగుల గోపాలకృష్ణ, నేదునూరి వెంకటరమణ, దువ్వూరి సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
మరుగుదొడ్ల నిర్మాణంలో అంబాజీపేట అథమం
అధికారుల తీరుపై మండిపడ్డ కలెక్టర్ నిర్లక్ష్యంపై శాఖాపరమైన చర్యలు అంబాజీపేట (పి.గన్నవరం) : వ్యక్తిగత మరుగుదొడ్ల (ఐఎస్ఎల్) నిర్మాణంలో అంబాజీపేట మండలం జిల్లాలోనే అథమ స్థానంలో ఉందని కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయాన్ని, గంగలకుర్రు అగ్రహారం అంగన్వాడీ కేంద్రాన్ని గురువారం ఆయన తనిఖీ చేశారు. అనంతరం విలేకర్లతో మాట్లాడారు. మరుగుదొడ్ల నిర్మాణంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. మండలంలోని 11 గ్రామాల్లో నూరు శాతం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేస్తామని ఎంపీడీఓ తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్ హామీ ఇచ్చారన్నారు. అయితే ఇప్పటివరకూ ఏ ఒక్క గ్రామంలో కూడా నూరు శాతం నిర్మాణాలు పూర్తి కాలేదని చెప్పారు. ప్రజాప్రతినిధులకంటే అధికారుల నిర్లక్ష్యమే అధికంగా కనబడుతోందన్నారు. జిల్లాలో బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలు 530కి గానూ ఇప్పటికే 270 గ్రామాల్లో నూరు శాతం ఐఎస్ఎల్ నిర్మించామని వివరించారు. ఈ 270 గ్రామాల్లో అంబాజీపేట మండలం నుంచి ఒక్క గ్రామం కూడా లేకపోవడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో 830 అంగన్వాడీ కేంద్రాలకు 100 భవనాల నిర్మాణాలు పూర్తి చేశామన్నారు. మార్చి నెలాఖరుకు లక్ష్యం చేరుకుంటామన్నారు. ఈ భవన నిర్మాణాలకు ఉపాధి హామీ పథకం నుంచి నిధులు మంజూరు చేస్తున్నామన్నారు. ఐఎస్ఎల్ నిర్మించుకున్నవారికి తక్షణమే బిల్లులు మంజూరు చేస్తామన్నారు. క్షేత్ర స్థాయి సిబ్బంది బిల్లులు ఆన్లైన్ చేయించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అందువల్లే బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగుతోందని వివరించారు. నిర్లక్ష్యంగా పనిచేసే అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఐఎస్ఎల్ నిర్మాణాల్లో బాధ్యతారహితంగా వ్యవహరించిన ఎంపీడీఓపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎంపీడీఓ కార్యాలయంలో అందుబాటులో లేరని, కేవలం సెలవు చీటీ టేబుల్‌పై ఉంచి నిర్లక్ష్యంగా వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుముందు ఉపాధి హామీ పథకం సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, ఆర్డబ్ల్యూఎస్ జేఈలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీపీ దాసరి వీరవెంకట సత్యనారాయణ, సర్పంచ్ మట్టపర్తి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
నాఫెడ్ కొనుగోలు కేంద్రాలు మూసివేత
అంబాజీపేట : సంక్షోభంలో ఉన్న కొబ్బరి రైతులను ఆదుకునేందుకు ఈ ఏడాది జూ¯ŒS 24వ తేదీన ప్రారంభించిన నాఫెడ్ కొనుగోలు కేంద్రాల గడువు ముగియడంతో మూసివేస్తున్నట్టు ఏపీ ఆయిల్ ఫెడ్ అసిస్టెంట్ మేనేజర్ యు.సుధాకరరావు తెలిపారు. వాటిని మూసివేయాలని ఆయిల్ ఫెడ్ ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు అందాయని శుక్రవారం ఆయన విలేకరులకు వివరించారు. కోనసీమలోని అంబాజీపేట, నగరం, తాటిపాక, ముమ్మిడివరం, కొత్తపేటలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో నవంబర్ 30 వరకు 33,185 క్వింటాళ్లు కొనుగోలు చేశామన్నారు. వీటికి సంబంధించి రూ.19.75 కోట్లు రైతులకు చెల్లించామన్నారు. ఇంకా రూ.2.70 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. బహిరంగ మార్కెట్లో కొత్త కొబ్బరి ధర రూ.5,900 నుంచి రూ.6వేలు వరకు పెరగడం, గడువు ముగిడంతో కొనుగోలు కేంద్రాలను మూసివేశామన్నారు. -
కొబ్బరి రైతుకు కుడి భుజంగా...
పలు పరిశోధనలు చేసిన డాక్టర్ చలపతిరావు ఫలితాలు క్షేత్రస్థాయికి చేరేలా విశేష కృషి అంబాజీపేట కేంద్రంలో సీనియర్ శాస్త్రవేత్తగా సేవలు ఉత్తమ శాస్త్రవేత్తగా రేపు అవార్డు స్వీకరణ అంబాజీపేట : కోనసీమ సిరికి ఇరుసు వంటిది కావడమే కాదు.. ఆ గడ్డ ‘సొగసరి’తనానికీ మూలం కొబ్బరి. అలాంటి కొబ్బరి సాగులో రైతులకు కొండంత అండగా నిలుస్తున్నారు శాస్త్రవేత్త డాక్టర్ ఎన్‌బీవీ చలపతిరావు. అంబాజీపేటలోని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉద్యాన పరిశోధన కేంద్రం కీటకశాస్త్ర విభాగంలో సీనియర్ శాస్త్రవేత్తగా విధులు నిర్వహిస్తున్న ఆయన ‘కొబ్బరిలో వచ్చే తెగుళ్ళు, యాజమాన్య పద్ధతులు’పై అధ్యయనం చేయడంతో వాటిపై పరిశోధనలు చేసి పలు విజయాలు సాధించారు. కొబ్బరిలో వచ్చే పురుగులు, తెగుళ్లపై ప్రత్యేక పరిశోధనలు చేసి, ఫలితాలను కరపత్రాలుగా రూపొందించి, రైతులకు అవగాహన కల్పించడం ద్వారా మేలు చేకూరుస్తున్నారు. జీవ నియంత్రణ పద్ధతిలో బదనికల ఉత్పత్తి గత ఐదేళ్లుగా కీటక విభాగంలో గణనీయమైన పరిశోధనలు చేసిన డాక్టర్ చలపతిరావు వాటి ఫలితాలు రైతులకు ఉపయోగపడే విధంగా ప్రచారం చేశారు. ప్రతి పరిశోధనా ఫలితాన్నీ రైతులకు అర్థమయ్యేలా ప్రచురించి, వారికి చేరువ చేశారు. జీవనియంత్రణ పద్ధతిలో అధిక సంఖ్యలో బదనికలు ఉత్పత్తి చేసి రైతులకు మేలు చేశారు. ఆకుతేలుపై కొత్త బదనికలను, జీవ శిలీంధ్రాలను గుర్తించారు. వీటిపై తాను చేసిన ప్రత్యేక పరిశోధనలు విజయం సాధించాయని, దాంతో రైతుల మన్ననలు పొందడమే కాక అనేక అవార్డులను పొందానని డాక్టర్ చలపతిరావు ‘సాక్షి’కి వివరించారు. ఈ నెల 30న వెంకటరామన్నగూడెంలో నిర్వహించనున్న విశ్వ విద్యాలయం ద్వితీయ స్నాతకోత్సవం సందర్భంగా గవర్నర్, విశ్వవిద్యాలయం కులపతి నరసింహన్, న్యూఢిల్లీ వ్యవసాయ పరిశోధనామండలి, భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి డైరెక్టర్ త్రిలోచన్ మొహపాత్రల ఆధ్వర్యంలో ఉత్తమ శాస్త్రవేత్త అవార్డును అందుకోనున్నట్టు తెలిపారు. -
రౌడీయిజాన్ని ఉక్కుపాదంతో అణచేస్తాం
అంబాజీపేట : జిల్లాలో రౌడీయిజం చెలాయించేవారిపై ఉక్కుపాదం మోపి కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్సీ ఎం.రవిప్రకాష్ అన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్లో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీన ‘చలో అమలాపురం’ జరుగుతున్న నేపథ్యంలో శాంతి భద్రతలను పర్యవేక్షించేందుకు అమలాపురం సబ్ డివిజన్లో ఆతను పర్యటించానన్నారు. డివిజన్ పరిధిలో ఎక్కువగా కులాల ఆధిపత్యపోరు కొనసాగుతోందని, దాన్ని అదనుగా తీసుకొని కొందరు రౌడీయిజాన్ని చెలాయిస్తున్నారన్నారు. కొన్ని విధ్వంసకర శక్తులు కావాలని అల్లర్లు సృష్టించి పబ్బం గడుపుకుంటున్నాయన్నారు. అలాంటి వారి ఎంతటివారైనా వారిపై కఠిన చర్యలు తీసుకుని అవసరమైతే రౌడీషీట్లు తెరుస్తామన్నారు. దందాలు, సెటిల్మెంట్లు చేసేవారిని ఉపేక్షించబోమన్నారు. సూదాపాలెం వంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అంబాజీపేటలో యువకుడి ఆత్మహత్యకు కారకులైన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. -
రౌడీయిజాన్ని ఉక్కుపాదంతో అణచిచేస్తాం
అంబాజీపేట : జిల్లాలో రౌడీయిజం చెలాయించేవారిపై ఉక్కుపాదం మోపి కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్సీ ఎం.రవిప్రకాష్ అన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్లో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీన ‘చలో అమలాపురం’ జరుగుతున్న నేపథ్యంలో శాంతి భద్రతలను పర్యవేక్షించేందుకు అమలాపురం సబ్ డివిజన్లో ఆతను పర్యటించానన్నారు. డివిజన్ పరిధిలో ఎక్కువగా కులాల ఆధిపత్యపోరు కొనసాగుతోందని, దాన్ని అదనుగా తీసుకొని కొందరు రౌడీయిజాన్ని చెలాయిస్తున్నారన్నారు. కొన్ని విధ్వంసకర శక్తులు కావాలని అల్లర్లు సృష్టించి పబ్బం గడుపుకుంటున్నాయన్నారు. అలాంటి వారి ఎంతటివారైనా వారిపై కఠిన చర్యలు తీసుకుని అవసరమైతే రౌడీషీట్లు తెరుస్తామన్నారు. దందాలు, సెటిల్మెంట్లు చేసేవారిని ఉపేక్షించబోమన్నారు. సూదాపాలెం వంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అంబాజీపేటలో యువకుడి ఆత్మహత్యకు కారకులైన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. -
పేరుకే పెద్దచెరువు
అయినా చుక్కనీరు కరువు చిన్నశంకరంపేట : చిన్నశంకరంపేట మండలం అంబాజిపేట పెద్ద చెరువు నీటి సామర్థ్యం 21 అడుగులు.900 ఎకరాల ఆయకట్టుకు ఆధారమైన చెరువు ఇది .పెద్ద చెరువు నిండితే చిన్నశంకరంపేట, అంబాజిపేట, అగ్రహారం, గవ్వలపల్లి, మల్లుపల్లి, చందాపూర్, జంగరాయి గ్రామాల్లోని 900 ఎకరాలు సాగవుతుంది. కానీ చెరువులోకి చుక్కనీరు చేరలేదు.పెద్ద చెరువు ఎప్పుడు పూర్తిస్థాయిలో ఎండిపోయింది లేదు. కానీ ఇసారి వేసవిలో చుక్కనీరులేకుండా ఎండిపోయింది. బోసిపోయిన చెరువులో మూడు రోజుల క్రితం కురిసిన వర్షాలతో కొద్దిపాటి నీరు మాత్రం చేరింది. దీంతో రైతులు చెరువుల కింద పంటల సాగుచేయడం లేదు. కొందరైతే బోరుబావుల ద్వారా వ్యవసాయం చేస్తున్నారు. మరి కొందరైతే ఇటుక బట్టిలు పెట్టేందుకు భూములు లీజుకు కూడా ఇచ్చారు. ఇంకొందరు వర్షంపై ఆధారపడి మొక్కజొన్న పంటలు వేశారు. చెరువు నిండక కరువు తలపిస్తోంది. రెండెకరాలు బీడుగానే ఉంది: ఎర్రి నర్సింలు, చిన్నశంకరంపేట పెద్ద చెరువు కింద రెండెకరాల పోలం ఉంది. కానీ చెరువులో నీరులేకపోవడంతో పొలం బీడుగానే ఉంది. చెరువులోకి చుక్కనీరు కూడా చేరకపోవడంతో చెరువు కింద ఎవరు కూడా పంటలు వేసేందుకు ముందుకు రాలేదు. దీంతో కరువు పరిస్థితని ఎదుర్కొంటున్నాం. పొలం ఇటుక బట్టిలోల్లకు లీజుకిచ్చిన: నర్సింహారెడ్డి, చిన్నశంకరంపేట వర్షాకాలంలో చెరువు నిండుతుందని ఆశపడ్డాం.కానీ చెరువులోకి చుక్క నీరురాలేదు. పేరుకే పెద్ద చెరువుగా మారింది, వర్షాలు కురవకపోవడంతో చుక్కనీరు చేరడంలేదు. దీంతో బీడుగాఉన్న పొలాన్ని చేసేదేమీలేక ఇటుక బట్టిలోల్లకు లీజుకిచ్చా.. ప్రభుత్వం కరువు సాయం అందజేసి ఆదుకోవాలి. -
సంకు‘రాత్రి జాగారాలు’
♦ 4.18 లక్షలమందికి అందని ‘చంద్రన్న కానుక’ ♦ సాంకేతిక లోపాలతో పంపిణీలో విపరీత జాప్యం ♦ రేషన్‌డిపోల ముందు కార్డుదారుల బారులు ♦ సరుకుల కోసం అర్ధరాత్రి వరకూ పడిగాపులు సాక్షి ప్రతినిధి, కాకినాడ : ఆడామగా, పిన్నాపెద్దా పడిగాపులు పడుతూ ఉన్న పై ఫొటో అంబాజీపేటలోని ఓ రేషన్‌షాపు వద్ద తీసింది. అప్పుడు సమయం ఎంతో తెలుసా.. ఆదివారం రాత్రి 11 గంటలు! పాపం.. వారి నిరీక్షణ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించి, ఊరించిన చంద్రన్న సంక్రాంతి కానుక కోసం! ఆ చౌక దుకాణం వద్ద ఆదివారం ఉదయం ఆరు గంటల నుంచీ అదే పరిస్థితి. అలాగని పంపిణీలో డీలరు నిర్లక్ష్యం వహించాడని కాదు.. అలా పూటలుపూటలు.. కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసినా ‘కానుక’ చేతికి అందకపోవడానికి కారణం.. ఈ-పాస్ యంత్రం సరిగా పనిచేయకపోవడమే. ఒక్క అంబాజీపేటలోనే కాదు.. జిల్లా అంతటా చంద్రన్న సంక్రాంతి కానుల పంపిణీలో ఇదే పరిస్థితి. అమలాపురంలో గత మూడురోజులుగా పంపిణీ అర్ధరాత్రి వరకూ కొనసాగుతోంది. చాలా గ్రామాల్లో గత మూడు రోజులుగా సర్వర్ పనిచేయకపోవటంతో కానుక సరుకులు అందలేదు. రోజూ కార్డుదారులు చౌకడిపోల వద్ద ఉదయం నుంచి రాత్రి వరకూ నిరీక్షించి చివరకు నిరాశతో తిరుగుముఖం పడుతున్నారు. ఎముకలు కొరికే చలిలో ఎదురుతెన్నులు.. చంద్రన్న సంక్రాంతి కానుక పేరుతో చౌక డిపోల్లో ఆరు రకాల సరకుల పంపిణీని ప్రభుత్వం ప్రారంభించింది. అయితే ఈ ప్రక్రియ ఈ-పాస్ యంత్రాల పుణ్యాన తాబేలు నడక కన్నా మందకొడిగా మారింది. దీంతో వృద్ధులు కూడా ఎముకలు కొరికే చలిలో వేచి ఉండాల్సి వస్తోంది. సోమవారం నుంచి రెండో సర్వరును అందుబాటులోకి తేవడంతో పంపిణీ కాస్త మెరుగుపడింది. మంగళవారం సాయంత్రానికల్లా జిల్లాలోని తెల్లరంగు కార్డుదారులందరికీ చంద్రన్న కానుక అందజేస్తామని అధికారులు చెబుతున్నా కనీసం బుధవారం నాటికైనా పూర్తవుతుందా అన్న సందే హం వ్యక్తమవుతోంది. జిల్లాలో పాత కార్డులు, ఇటీవల మంజూరు చేసినవి కలిపి మొత్తం 16.43 లక్షల తెల్ల రేషనుకార్డులు ఉన్నాయి. ఇప్పటికే వాటిలో 4.15 లక్షల మంది కార్డుదారులకు క్రిస్మస్కు చంద్రన్న కానుక పేరుతో సరుకులు పంపిణీ చేశారు. ఇక మిగిలిన 12.28 లక్షల కార్డుదారులకు ఈనెల 7 నుంచి సంక్రాంతి కానుక పంపిణీ ప్రారంభించారు. అయితే కలెక్టరేట్లో ఉన్న సర్వరు కాలిపోవడంతో పంపిణీ ప్రక్రియ నిలిచిపోయింది. తర్వాత పునరుద్ధరించినా నెట్‌వర్క్‌లో సాంకేతిక సమస్యలు ఏర్పడటంతో లబ్ధిదారుల వేలిముద్రలు ఇ-పాస్ యంత్రంలో సరిగా నమోదవడం లేదు. దీంతో ఒక్కో చౌక దుకాణం వద్ద రోజుకు 50 కార్డులకు మించి పంపిణీ జరగలేదు. సోమవారం రెండో సర్వరును అందుబాటులోకి తేవడంతో ప్రక్రియ కాస్త మెరుగుపడింది. సోమవారం సాయంత్రానికి క్రిస్మస్, సంక్రాంతి కానుకలు కలిపి మొత్తం 12.25 లక్షల కార్డులకు పంపిణీ పూర్తయిందని పౌరసరఫరాల అధికారులు చెబుతున్నారు. ఈ ప్రక్రియపై కలెక్టరు అరుణ్‌కుమార్ సోమవారం సాయంత్రం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. మంగళవారం సాయంత్రం నాటికి కానుకల పంపిణీ ప్రక్రియ పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. భోగి నాటికైనా అందేనా? సంక్రాంతి కానుక సరుకులు ఇంకా దాదాపు 4.18 లక్షల తెల్లకార్డుదారులకు పంపిణీ చేయాల్సి ఉంది. కనీసం భోగి నాటికైనా చేతికందుతాయో లేదోనని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారిలో ఎక్కువ మంది దినసరి కూలీలే. రోజుల తరబడి చౌక దుకాణాల వద్ద వరుసలో ఉండటం వల్ల అటు కూలి కోల్పోతున్నామని, ఇటు సరుకులు చేతికి అందట్లేదని లబోదిబోమంటున్నారు. ఇక వృద్ధులైతే నీరసించి, డిపోల ముందే కుప్పకూలిపోతున్నారు. కొందరు కార్డుదారులైతే పిల్లలను సైతం క్యూల్లో నిలబెడుతున్నారు. కొత్తకార్డుదారులకు కానుకే దిక్కు... జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో ప్రభుత్వం ఘనంగా పంపిణీ చేసింది ఏవైనా ఉన్నాయంటే కొత్త రేషన్‌కార్డులు ఒక్కటే. అయితే అవి చేతికొచ్చాయనే సంతోషం లబ్ధిదారులకు ఉండడం లేదు. వారికి జనవరి నెల రేషన్ సరుకులు ఉండవు. కేవలం చంద్రన్న కానుకతో సరిపెట్టుకోవాల్సిందే. అయితే రెండు నెలల క్రితమే రేషనుకార్డు అర్హుల జాబితా ఖరారు చేసిన అధికారులు ఆమేరకు సరుకులను ఎందుకు సిద్ధం చేయలేకపోయారని వారు ప్రశ్నిస్తున్నారు. ఫిబ్రవరి నుంచి ప్రతినెలా రేషను సరుకులు ఇస్తామని అధికారులు సరిపెడుతున్నారు. నేటి సాయంత్రానికి పూర్తి... క్రిస్మస్తో కలుపుకొని చంద్రన్న కానుకగా సరుకులు జిల్లావ్యాప్తంగా సోమవారం సాయంత్రానికి మొత్తం 12.25 లక్షల కార్డుదారులకు అందజేశాం. ఇంకా దాదాపు నాలుగు లక్షల కార్డులకు సరుకులు అందజేయాల్సి ఉంది. ఇప్పటివరకు ఒకే సర్వరు ఉండటం, అదీ సరిగా పనిచేయకపోవడం వల్ల పంపిణీ జాప్యమైంది. సోమవారం నుంచి రెండు సర్వర్లు అందుబాటులోకి తెచ్చాం. మంగళవారం సాయంత్రంలోగా పంపిణీ పూర్తి చేస్తాం. - జి.ఉమామహేశ్వరరావు, జిల్లా పౌరసరఫరాల అధికారి -
ప్రణయబంధం..
అంబాజీపేట : సరసపట్టు’లో ఉన్న ఏ ప్రాణికైనా పరిసరాల్లో ఏం జరుగుతుందన్న పట్టింపే ఉండదనడానికి.. చిత్రంలో ‘నాలో నీవై.. నీలో నేనై..’ అన్నట్టు అల్లుకుపోరుున ఈ జెర్రిగొడ్డు జాతి పాములే నిదర్శనం. మనిషి అలికిడి సోకగానే చకచకా పాకి, దూరంగా పోయే ఈ పాములు శుక్రవారం అంబాజీపేట మార్కెట్ యూర్డు ఎదురుగా ఉన్న డ్రైన్ వద్ద ఇలా సయ్యాటలాడాయి. దాదాపు గంటపాటు సాగిన ఈ శృంగార ‘చలన’ చిత్రాన్ని దారినపోయే వారు ఆగి, గుమిగూడి మరీ చూశారు. అయినా ఆ జంట..‘ మా లోకం మాది.. మా భోగం మాది.. మానవలోకంతో మాకేం పని’ అన్నట్టు నిస్సంకోచంగా సల్లాపాలను సాగించాయి. -
అంబాజీపేటలో అగ్ని ప్రమాదం
అంబాజీపేట: తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేటలో ఓ పాత సామాను దుకాణంలో ఆదివారం సాయంత్రం అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదం కారణంగా రూ. 5లక్షల ఆస్తి నష్టం జరిగిందని దుకాణం యాజమాని ఆవేదన వ్యక్తం చేశాడు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను ఫైర్ ఇంజిన్‌తో అదుపు చేశారు. అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. -
ఉద్యోగాలపేరుతో రూ. 54 లక్షలు స్వాహా
అంబాజీపేట (తూర్పుగోదావరి) : అన్నా, చెల్లెలు, మరో వ్యక్తి.. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ లక్షల రూపాయలు వసూలు చేసి, మోసగించినట్టు తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. శుక్రవారం ఏఎస్సై ఐ. మురళీకృష్ణ విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం.. అంబాజీపేట మండలం కె.పెదపూడికి చెందిన గుమ్మడి మురళి, అతని సోదరి వీర నాగమల్లేశ్వరి, బెంగళూరుకు చెందిన షాన్ భగవాన్ నాయుడు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి సొమ్ములు వసూలు చేశారు. కోనసీమలోని 27 మంది నుంచి రూ.54 లక్షలు వసూలు చేశారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. విశాఖలోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో ఉద్యోగం వేయిస్తానని పి. గన్నవరం మండలం గుత్తులవారిపాలెంకు చెందిన కుడుపూడి శ్రీనివాసరావు నుంచి మూడు నెలల క్రితం రూ.4 లక్షలు వసూలు చేశారు. ఇప్పటికీ ఉద్యోగం రాకపోవడంతో శ్రీనివాసరావు అన్నాచెల్లెళ్లను ప్రశ్నించాడు. వారినుంచి సరైన సమాధానం రాకపోవడంతో అంబాజీపేట పోలీసులను ఆశ్రయించాడు. అతని ఫిర్యాదు మేరకు ఎస్హెచ్ఓ పి. జయంత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడుత్ను అన్నాచెల్లెళ్లు, షాన్ భగవాన్ నాయుడులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. కాగా నిరుద్యోగుల నుంచి వసూలు చేసిన సొమ్మును ఎప్పటికప్పుడు ఆన్లైన్ ద్వారా షాన్ భగవాన్ నాయుడుకు పంపించినట్లు వీర నాగమల్లేశ్వరి పోలీసులకు చెబుతోంది. -
ఆంక్షల్లేని రుణమాఫీ చేయాలి
అంబాజీపేట :ఎన్నికలకు ముందు ఇచ్చిన రుణ మాఫీ హామీని అమలు చేయకుండా పూటకో మాట చెబుతూ రైతులను మోసం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు సర్కారు తీరుపై వైఎస్సార్ సీపీ సమరశంఖం పూరించింది. శుక్రవారం కలెక్టరేట్ వద్ద ఆందోళనకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో గురువారం పలుచోట్ల వైఎస్సార్ సీపీ నాయకులు మోటార్‌బైక్‌ల ర్యాలీ నిర్వహించారు. రుణమాఫీపై చంద్రబాబు చేస్తున్న మోసాన్ని ప్రజలకు వివరించి చైతన్యపరిచారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పి.కె.రావు, పి.గన్నవరం నియోజకవర్గ కో-ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో అంబాజీపేటలో మోటార్‌సైకిల్ ర్యాలీ జరిగింది. అనంతరం పార్టీ అంబాజీపేట మండల అధ్యక్షుడు, ఎంపీటీసీ సభ్యుడు దొమ్మేటి సాయికృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పి.కె.రావు, కొండేటి చిట్టిబాబు మాట్లాడుతూ రైతులను, ఆడపడుచులను మోసంచేసిన తెలుగుదేశం ప్రభుత్వానికి నైతికంగా కొనసాగే అర్హత లేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గంటకోమాట చెబుతూ రైతులను మభ్యపెడుతున్నారని ధ్వజమెత్తారు. రుణమాఫీ కాకపోవడంతో రైతులు, డ్వాక్రా మహిళలు ఇప్పుడు టీడీపీకి ఎందుకు ఓటు వేశామా అని బాధపడుతున్నారని పేర్కొన్నారు. అనంతరం అంబాజీపేట, కె.పెద పూడి, పుల్లేటికుర్రు, ఇరుసుమండ, ముక్కా మల, మొసలపల్లి, గంగలకుర్రు, గంగలకుర్రు మలుపులో మోటార్‌సైకిల్ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీని పి.కె.రావు పార్టీ జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఎం.ఎం.శెట్టి, మాజీ ఎంపీటీసీ వాసంశెట్టి చినబాబు, ఎంపీటీసీ సభ్యులు కోట విజయరాజు, బూడిద వరలక్ష్మి, ఉందుర్తి ఆనందబాబు, కోమలి అనంత లక్ష్మి, పార్టీ జిల్లా యూత్ కో-ఆర్డినేటర్ కుడుపూడి సత్తిబాబు, ఆయా గ్రామాల నాయకులు పేరి శ్రీనివాసరావు, మైలా ఆనందరావు, విత్తనాల సుబ్బారావు, మట్టా వెంకటేశ్వరరావు, అప్పన శ్రీను, దొమ్మేటి వెంకటేశ్వరరావు, కట్టా వెంకట సుబ్రహ్మణ్యం, మంచాల వ్బైయి, విత్తనాల శేఖర్, మట్టపర్తి సోమేశ్వరరావు, దొమ్మేటి సాయిరాం, నేతల నాగరాజు, అప్పన సురేష్, సరెళ్ళ వెంకట్రావు, గంటి శ్రీరామచంద్రమూర్తి, కుడుపూడి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. మామిడికుదురులో.. మామిడికుదురు : మామిడికుదురు మండలంలోనూ గురువారం మోటార్ సైకిల్ ర్యాలీ జరిగింది. పాశర్లపూడి నుంచి ప్రారంభమైన ర్యాలీ మామిడికుదురు, మాకనపాలెం, ఆదుర్రు, లూటుకుర్రు, ఈదరాడ గ్రామాల మీదుగా నగరం, తాటిపాక కూడలి వరకు జరిగింది. పార్టీ జిల్లా అధికార ప్రతినిధి, జిల్లా కో-ఆర్డినేటర్ మిండగుదుటి మోహన్, పి.గన్నవరం కో-ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. రుణమాఫీ అమలులో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. ర్యాలీలో వైఎస్సార్ సీపీ మండల శాఖ అధ్యక్షుడు బొలిశెట్టి భగవాన్, సర్పంచ్ కశిరెడ్డి ఆంజనేయులు, ఎంపీటీసీ సభ్యుడు జోగి వెంకటరామకృష్ణ, ఆయా గ్రామాల నాయకులు గెడ్డం కృష్ణమూర్తి, కొమ్ముల రాము, భూపతి వెంకటపతి, కొనుకు నాగరాజు, ముత్యాల నర్సింహారావు, యూవీవీ సత్యనారాయణ, జక్కంపూడి వాసు, గుత్తుల బాబి, జగతా అరుణాచలనాయుడు, అన్వర్‌తాహిర్ హుస్సేన్, ఎండీవై షరీఫ్, బొక్కా సత్యనారాయణ, పేరాబత్తుల నర్సింహారావు, కొమ్ముల సూరిబాబు, లంకే ఏసు, మోకా విజయరాజు, కొంబత్తుల నిషాంత్, మజహర్ అలీ, అక్బర్ అలీ, కుంపట్ల పెద్దిరాజు, పెదపూడి శ్రీను, గెద్దాడ నాగరాజు, పెంటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సాధ్యం కాని హామీలతో బాబు మోసం : వరుపుల ఏలేశ్వరం : చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వెంటనే రుణమాఫీ చేపట్టాలని ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు డిమాండ్ చేశారు. లింగంపర్తి గ్రామంలో గురువారం రుణమాఫీపై డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేపట్టనున్న కలెక్టరేట్ ముట్టడిపై రైతులు, డ్వాక్రా మహిళలను చైతన్యం చేసేందుకు ఎమ్మెల్యే వరుపుల ఆధ్వర్యంలో మోటార్‌బైక్ ర్యాలీ నిర్వహించారు. లింగంపర్తి, ఏలేశ్వరం, యర్రవరం, పేరవరం తదితర గ్రామాల మీదుగా బైక్ ర్యాలీ సాగింది. ఎమ్మెల్యే వరుపుల మాట్లాడుతూ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు చంద్రబాబు సాధ్యం కాని హామీలతో గద్దెనెక్కారన్నారు. అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు రుణమాఫీ చేపట్టకపోవడం దారుణమన్నారు. శుక్రవారం ఉదయం నిర్వహించే కలెక్టరేట్ ముట్టడికి పార్టీశ్రేణులతో పాటు రైతులు, డ్వాక్రామహిళలు అధికసంఖ్య పాల్గొనాలని పిలుపునిచ్చారు. జెడ్పీటీసీ సభ్యుడు జ్యోతుల పెదబాబు, పర్వత శేషగిరిరావు, కొండమూరి వెంకటేశ్వరరావు, జువ్వల చినబాబు పాల్గొన్నారు. -
తండ్రికి తనయ తలకొరివి
అంబాజీపేట : నిండు జీవితాన్ని గడిపి, పండుటాకులా రాలిపోయిన ఆయనకు తలకొరివి పెట్టడానికి కొడుకులు లేకపోవడం ఓ లోటని అంతా భావించారు. అయితే.. పెద్ద కుమార్తె ఆ కర్తవ్యాన్ని పూర్తి చేసి తండ్రి రుణం తీర్చుకుంది. అంబాజీపేట మండలం పుల్లేటికుర్రు మాజీ సర్పంచ్ యనమదల శ్రీరామమూర్తి(93) బుధవారం కన్నుమూశారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. జిల్లా ఎక్సైజ్ కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పనిచేస్తున్న పెద్ద కుమార్తె హేమ సీతామహాలక్ష్మి తానే అంత్యక్రియలు నిర్వహించి, తలకొరివి పెట్టింది. మిగిలిన ఇద్దరు కుమార్తెలు మణికుమారి, ఉషారాణి అంత్యక్రియల్లో పాలు పంచుకున్నారు. శ్రీరామమూర్తి 1956లో పుల్లేటికుర్రులో మొట్టమొదటి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. రెండుసార్లు ఆ పదవిని చేపట్టిన ఆయన గ్రామాభివృద్ధికి పాటు పడ్డారు. స్వాతంత్య్ర సమరంలోనూ పాల్గొన్నట్టు బంధువులు తెలిపారు. ఆయన మృతి పట్ల సర్పంచ్ కాండ్రేగుల గోపాలకృష్ణ, ఎంపీపీ దాసరి వీరవెంకట సత్యనారాయణ, బీజేపీ నాయకులు కుడుపూడి సూర్యనారాయణ సంతాపం వ్యక్తం చేశారు. -
ప్రజా సమస్యలపై పోరాడదాం
అంబాజీపేట :ప్రభుత్వం అవలంస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రజా సమస్యలపై శక్తివంచన లేకుండా పోరాడాలని ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పిలుపునిచ్చారు. స్థానిక వైఎస్సార్, ఏవీఆర్ కళ్యాణ మండపంలో పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు అధ్యక్షతన పి. గన్నవరం నియోజకవర్గ సమీక్ష సమావేశం శనివారం జరిగింది. ఆ సమావేశంలో నెహ్రూ మాట్లాడుతూ అమలు, ఆచరణకు సాధ్యం కాని హామీలను ఇచ్చి చంద్రబాబు అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారన్నారు. రైతు, డ్వాక్రా, చేనేత కార్మికుల రుణమాఫీలో ఇప్పటికీ స్పష్టత లేదన్నారు. గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు ఇప్పటి నుండే కృషి చేస్తానన్నారు. మాజీమంత్రి, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ, సీఈసీ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ ఆర్థిక పరిస్థితిపై పరిపూర్ణ అవగాహన ఉన్న చంద్రబాబు, రుణ మాఫీ ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ప్రజలే తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. రంపచోడవరం, కొత్తపేట ఎమ్మెల్యేలు వంతల రాజేశ్వరి, చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ప్రతీ నాయకుడు, కార్యకర్త పోరాడుతూ పార్టీని మరింత పటిష్టపరచాలన్నారు. మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు మాట్లాడుతూ చంద్రబాబు బడ్జెట్లో అంకెలు తప్ప నిధులు లేవని ఎద్దేవా చేశారు. తొలుత పార్టీ మండల కన్వీనర్లు దొమ్మేటి సాయికృష్ణ, అడ్డగళ్ల వెంకట సాయిరాం, బొలిశెట్టి భగవాన్, మద్దా చంటి, జిల్లా అధికార ప్రతినిధి పి.కె.రావు, సర్పంచ్‌లు కాండ్రేగుల గోపి, తనికెళ్ల మణిబాబు, కసిరెడ్డి అంజిబాబులతో పాటు పలువురు జిల్లా అధ్యక్షుడు నెహ్రూకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం నెహ్రూ, మాజీ ఎమ్మెల్యే కుడుపూడి చిట్టబ్బాయిలను ఘనంగా సన్మానించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి జీవీ రమణ, జిల్లా అధికార ప్రతినిధి పి.కె. రావు, విభాగపు కన్వీనర్లు కర్రి పాపారాయుడు, రావూరి వెంకటేశ్వరరావు, మంతెన రవిరాజు, శెట్టిబత్తుల రాజబాబు, గిరిజాల వెంకటస్వామినాయుడు, చెల్లుబోయిన శ్రీనివాసరావు, అత్తిలి సీతారామస్వామి, ఎంపీటీసీ సభ్యులు ఉందుర్తి ఆనందబాబు, బూడిద వరలక్ష్మి, కోమలి అనంతలక్ష్మి, కోట విజయరావు, సీనియర్ నాయకులు ఎంఎం శెట్టి, పేరి శ్రీనివాసరావు, కొర్లపాటి కోటబాబు తదితరులు పాల్గొన్నారు. నేడు ‘అమలాపురం’ సమీక్ష అమలాపురం : అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గస్థాయి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమావేశం ఆదివారం జరుగుతుందని ఆ పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, పట్టణ పార్టీ కన్వీనర్ మట్టపర్తి నాగేంద్ర తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అమలాపురం సూర్యానగర్‌లోని కమ్యూనిటీ హాల్లో ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు ఈ సమావేశం జరుగుతుందని వారు వివరించారు. జిల్లా పార్టీ అధ్యక్షునిగా జ్యోతుల నెహ్రూ బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారి జరుగుతున్న సమీక్షా సమావేశమని వారు పేర్కొన్నారు. నియోజకవర్గ పరిధిలోని పట్టణ, మండల పార్టీల కన్వీనర్లు, జిల్లా అనుబంధ కమిటీల కన్వీనర్లు, సభ్యులు, స్టీరింగ్ కమిటీ సభ్యులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరుకావాలని వారు కోరారు. -
రాష్ట్రాన్ని మంచు కమ్మేస్తోంది
-
రాష్ట్రాన్ని మంచు కమ్మేస్తోంది
నగరాల్ని, పల్లెలను మంచు కమ్మేస్తోంది. ఉదయం లేవగానే ఆహ్లాద దృశ్యం కళ్లముందు ఆవిష్కారమవుతోంది. గంట తొమ్మిది కొట్టినా... కాంక్రీట్ జంగిల్ పొగతెర మాటున సరికొత్తగా దర్శనమిస్తోంది. ఇక మంచు కురిసే వేళ జీవరాసులూ పరవశిస్తున్నాయి. ఈ మనోహర చిత్రాలు చూసి నగరవాసులు మంత్రముగ్ధులవుతున్నారు.