ఆంక్షల్లేని రుణమాఫీ చేయాలి
అంబాజీపేట :ఎన్నికలకు ముందు ఇచ్చిన రుణ మాఫీ హామీని అమలు చేయకుండా పూటకో మాట చెబుతూ రైతులను మోసం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు సర్కారు తీరుపై వైఎస్సార్ సీపీ సమరశంఖం పూరించింది. శుక్రవారం కలెక్టరేట్ వద్ద ఆందోళనకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో గురువారం పలుచోట్ల వైఎస్సార్ సీపీ నాయకులు మోటార్‌బైక్‌ల ర్యాలీ నిర్వహించారు. రుణమాఫీపై చంద్రబాబు చేస్తున్న మోసాన్ని ప్రజలకు వివరించి చైతన్యపరిచారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పి.కె.రావు, పి.గన్నవరం నియోజకవర్గ కో-ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో అంబాజీపేటలో మోటార్‌సైకిల్ ర్యాలీ జరిగింది. అనంతరం పార్టీ అంబాజీపేట మండల అధ్యక్షుడు, ఎంపీటీసీ సభ్యుడు దొమ్మేటి సాయికృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పి.కె.రావు, కొండేటి చిట్టిబాబు మాట్లాడుతూ రైతులను, ఆడపడుచులను మోసంచేసిన తెలుగుదేశం ప్రభుత్వానికి నైతికంగా కొనసాగే అర్హత లేదన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు గంటకోమాట చెబుతూ రైతులను మభ్యపెడుతున్నారని ధ్వజమెత్తారు. రుణమాఫీ కాకపోవడంతో రైతులు, డ్వాక్రా మహిళలు ఇప్పుడు టీడీపీకి ఎందుకు ఓటు వేశామా అని బాధపడుతున్నారని పేర్కొన్నారు. అనంతరం అంబాజీపేట, కె.పెద పూడి, పుల్లేటికుర్రు, ఇరుసుమండ, ముక్కా మల, మొసలపల్లి, గంగలకుర్రు, గంగలకుర్రు మలుపులో మోటార్‌సైకిల్ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీని పి.కె.రావు పార్టీ జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఎం.ఎం.శెట్టి, మాజీ ఎంపీటీసీ వాసంశెట్టి చినబాబు, ఎంపీటీసీ సభ్యులు కోట విజయరాజు, బూడిద వరలక్ష్మి, ఉందుర్తి ఆనందబాబు, కోమలి అనంత లక్ష్మి, పార్టీ జిల్లా యూత్ కో-ఆర్డినేటర్ కుడుపూడి సత్తిబాబు, ఆయా గ్రామాల నాయకులు పేరి శ్రీనివాసరావు, మైలా ఆనందరావు, విత్తనాల సుబ్బారావు, మట్టా వెంకటేశ్వరరావు, అప్పన శ్రీను, దొమ్మేటి వెంకటేశ్వరరావు, కట్టా వెంకట సుబ్రహ్మణ్యం, మంచాల వ్బైయి, విత్తనాల శేఖర్, మట్టపర్తి సోమేశ్వరరావు, దొమ్మేటి సాయిరాం, నేతల నాగరాజు, అప్పన సురేష్, సరెళ్ళ వెంకట్రావు, గంటి శ్రీరామచంద్రమూర్తి, కుడుపూడి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
మామిడికుదురులో..
మామిడికుదురు : మామిడికుదురు మండలంలోనూ గురువారం మోటార్ సైకిల్ ర్యాలీ జరిగింది. పాశర్లపూడి నుంచి ప్రారంభమైన ర్యాలీ మామిడికుదురు, మాకనపాలెం, ఆదుర్రు, లూటుకుర్రు, ఈదరాడ గ్రామాల మీదుగా నగరం, తాటిపాక కూడలి వరకు జరిగింది. పార్టీ జిల్లా అధికార ప్రతినిధి, జిల్లా కో-ఆర్డినేటర్ మిండగుదుటి మోహన్, పి.గన్నవరం కో-ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. రుణమాఫీ అమలులో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. ర్యాలీలో వైఎస్సార్ సీపీ మండల శాఖ అధ్యక్షుడు బొలిశెట్టి భగవాన్, సర్పంచ్ కశిరెడ్డి ఆంజనేయులు, ఎంపీటీసీ సభ్యుడు జోగి వెంకటరామకృష్ణ, ఆయా గ్రామాల నాయకులు గెడ్డం కృష్ణమూర్తి, కొమ్ముల రాము, భూపతి వెంకటపతి, కొనుకు నాగరాజు, ముత్యాల నర్సింహారావు, యూవీవీ సత్యనారాయణ, జక్కంపూడి వాసు, గుత్తుల బాబి, జగతా అరుణాచలనాయుడు, అన్వర్‌తాహిర్ హుస్సేన్, ఎండీవై షరీఫ్, బొక్కా సత్యనారాయణ, పేరాబత్తుల నర్సింహారావు, కొమ్ముల సూరిబాబు, లంకే ఏసు, మోకా విజయరాజు, కొంబత్తుల నిషాంత్, మజహర్ అలీ, అక్బర్ అలీ, కుంపట్ల పెద్దిరాజు, పెదపూడి శ్రీను, గెద్దాడ నాగరాజు, పెంటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
సాధ్యం కాని హామీలతో బాబు మోసం : వరుపుల
ఏలేశ్వరం : చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వెంటనే రుణమాఫీ చేపట్టాలని ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు డిమాండ్ చేశారు. లింగంపర్తి గ్రామంలో గురువారం రుణమాఫీపై డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో చేపట్టనున్న కలెక్టరేట్ ముట్టడిపై రైతులు, డ్వాక్రా మహిళలను చైతన్యం చేసేందుకు ఎమ్మెల్యే వరుపుల ఆధ్వర్యంలో మోటార్‌బైక్ ర్యాలీ నిర్వహించారు. లింగంపర్తి, ఏలేశ్వరం, యర్రవరం, పేరవరం తదితర గ్రామాల మీదుగా బైక్ ర్యాలీ సాగింది. ఎమ్మెల్యే వరుపుల మాట్లాడుతూ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు చంద్రబాబు సాధ్యం కాని హామీలతో గద్దెనెక్కారన్నారు. అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు రుణమాఫీ చేపట్టకపోవడం దారుణమన్నారు. శుక్రవారం ఉదయం నిర్వహించే కలెక్టరేట్ ముట్టడికి పార్టీశ్రేణులతో పాటు రైతులు, డ్వాక్రామహిళలు అధికసంఖ్య పాల్గొనాలని పిలుపునిచ్చారు. జెడ్పీటీసీ సభ్యుడు జ్యోతుల పెదబాబు, పర్వత శేషగిరిరావు, కొండమూరి వెంకటేశ్వరరావు, జువ్వల చినబాబు పాల్గొన్నారు.