ప్రణయబంధం.. | Real Snake Dance in ambajipeta | Sakshi
Sakshi News home page

ప్రణయబంధం..

Published Sat, Nov 7 2015 11:25 AM | Last Updated on Mon, Aug 20 2018 7:28 PM

ప్రణయబంధం.. - Sakshi

ప్రణయబంధం..

అంబాజీపేట : సరసపట్టు’లో ఉన్న ఏ ప్రాణికైనా పరిసరాల్లో ఏం జరుగుతుందన్న పట్టింపే ఉండదనడానికి.. చిత్రంలో ‘నాలో నీవై.. నీలో నేనై..’ అన్నట్టు అల్లుకుపోరుున ఈ జెర్రిగొడ్డు జాతి పాములే నిదర్శనం. మనిషి అలికిడి సోకగానే చకచకా పాకి, దూరంగా పోయే ఈ పాములు శుక్రవారం అంబాజీపేట మార్కెట్ యూర్డు ఎదురుగా ఉన్న డ్రైన్ వద్ద ఇలా సయ్యాటలాడాయి. దాదాపు గంటపాటు సాగిన ఈ శృంగార ‘చలన’ చిత్రాన్ని దారినపోయే వారు ఆగి, గుమిగూడి మరీ చూశారు. అయినా ఆ జంట..‘ మా లోకం మాది.. మా భోగం మాది.. మానవలోకంతో మాకేం పని’ అన్నట్టు నిస్సంకోచంగా సల్లాపాలను సాగించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement