
సాక్షి, కోనసీమ: కోనసీమ జిల్లా అంబాజీపేటలో టీడీపీ-జనసేన సమావేశం రసాభాసగా మారింది. మహాసేన రాజేష్‌కి టికెట్ కేటాయింపుపై జనసేన శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రాజేష్ గోబ్యాక్’ అంటూ జనసేన కార్యకర్తలు నినాదాలు చేశారు. టీడీపీ నేత హరీష్ మాధుర్ కారును జనసేన కార్యకర్తలు ధ్వంసం చేశారు. దీంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.