సాక్షి, కోనసీమ జిల్లా: కోనసీమలో కూటమి నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. టీడీపీ నేతలు తమను గుర్తించకపోవడంపై జనసేన కార్యకర్తలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్ట్ పనులు సైతం టీడీపీ నేతలే సర్దుకుంటున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మలికిపురం మండలం గూడపల్లి గ్రామంలో రోడ్ల కాంట్రాక్టుల విషయమై ఓ టీడీపీ నేతకు జనసేన కార్యకర్త ఫోన్ చేసి నిలదీశారు. జనసేన- టీడీపీ నాయకుల సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉచిత ఇసుక పేరుతో కూటమి ప్రభుత్వం రాజోలు ప్రజలను అన్యాయం చేసిందంటూ సోషల్ మీడియాలో జనసేన కార్యకర్త పెట్టిన పోస్ట్ హల్‌చల్ చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment