సుహాస్ ' అంబాజీపేట మ్యారేజి బ్యాండు'.. ఆసక్తిగా ఫస్ట్‌లుక్ పోస్టర్ | Suhas Latest Movie Ambajipeta Marriage Band First look Released | Sakshi
Sakshi News home page

Ambajipeta Marriage Band: 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు'.. ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజ్

Published Tue, Apr 11 2023 9:36 PM | Last Updated on Tue, Apr 11 2023 9:38 PM

Suhas Latest Movie Ambajipeta Marriage Band First look Released - Sakshi

సుహాస్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు'. దుశ్యంత్ కటికనేని ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తెరకెక్కిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్.

సెలూన్ షాప్ ముందు ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ మెంబర్స్‌తో నిలబడి ఉన్న పోస్టర్ సినిమాపై ఆసక్తి కలిగిస్తోంది. మ్యారేజ్ బ్యాండ్‌లో పనిచేసే మల్లి అనే కుర్రాడి పాత్రలో సుహాస్ ఈ సినిమాలో నటిస్తున్నాడు. కాగా.. మొదటి సినిమా కలర్ ఫోటోతోనే ఫేమ్ సంపాదించుకున్న సుహాస్ ఇటీవలే రైటర్ పద్మభూషణ్ సినిమాతో అలరించాడు. ప్రస్తుతం షూటింగ్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.   ఈ సినిమాకి సంబంధించిన వివరాలను త్వరలో చిత్ర బృందం అధికారికంగా ప్రకటించనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement