రౌడీయిజాన్ని ఉక్కుపాదంతో అణచిచేస్తాం
Published Thu, Sep 8 2016 10:20 PM | Last Updated on Mon, Sep 4 2017 12:41 PM
అంబాజీపేట :
జిల్లాలో రౌడీయిజం చెలాయించేవారిపై ఉక్కుపాదం మోపి కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్సీ ఎం.రవిప్రకాష్ అన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీన ‘చలో అమలాపురం’ జరుగుతున్న నేపథ్యంలో శాంతి భద్రతలను పర్యవేక్షించేందుకు అమలాపురం సబ్ డివిజన్‌లో ఆతను పర్యటించానన్నారు. డివిజన్ పరిధిలో ఎక్కువగా కులాల ఆధిపత్యపోరు కొనసాగుతోందని, దాన్ని అదనుగా తీసుకొని కొందరు రౌడీయిజాన్ని చెలాయిస్తున్నారన్నారు. కొన్ని విధ్వంసకర శక్తులు కావాలని అల్లర్లు సృష్టించి పబ్బం గడుపుకుంటున్నాయన్నారు. అలాంటి వారి ఎంతటివారైనా వారిపై కఠిన చర్యలు తీసుకుని అవసరమైతే రౌడీషీట్లు తెరుస్తామన్నారు. దందాలు, సెటిల్‌మెంట్లు చేసేవారిని ఉపేక్షించబోమన్నారు. సూదాపాలెం వంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అంబాజీపేటలో యువకుడి ఆత్మహత్యకు కారకులైన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
Advertisement
Advertisement