జిల్లాలో కేసులు పెరిగాయి
Published Sun, Dec 25 2016 2:05 AM | Last Updated on Mon, Sep 4 2017 11:31 PM
బుట్టాయగూడెం: జిల్లాలో భూ సమస్యలు, కుటుంబ తగాదాలు, చీటింగ్ కేసులు పెరిగాయని జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్ అన్నారు. శనివారం ఆయన బుట్టాయగూడెం పోలీస్‌స్టేషషన్‌ను సందర్శించారు. స్టేషషన్‌లో నమోదైన కేసులు, సిబ్బంది వివరాలను ఎస్సై డి.రవికుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ప్రజలకు మరింత సేవలు అందించాలన్న ఉద్దేశంతో వచ్చే ఏడాది నుంచి ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ తరహాల్లో కమ్యూనిటీ పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ప్ర ణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతంలో భూ సమస్యలు ఓరకంగా ఉంటే జిల్లాలో మరికొన్ని చోట్ల మరోరకమైన సమస్యలతో కేసులు నమోదవుతున్నాయన్నారు. సరిహద్దు తగాదాలు ఎక్కువగా వస్తున్నాయని చెప్పారు. గతంలో గ్రామాల్లో పంచాయతీలు జరిగేవని, అక్కడే చిన్నపాటి సమస్యలు పరిష్కారం కాగా ఇప్పుడు అవికూడా పోలీస్‌స్టేషన్‌న్లకు రావడంతో కేసులు పెరుగుతున్నాయన్నారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలు, హత్యానేరాల సంఖ్య తగ్గిందన్నారు. గతేడాది 62 హత్యకేసులు నమోదు కాగా ఈ ఏడాది 43 కేసులు మాత్రమే నమోదయ్యాయని పేర్కొన్నారు.జిల్లాలో నేర పరిశోధన రేటు కూడా బాగా పెరిగిందన్నారు. జిల్లాకు రెండు ఏబీసీడీ అవార్డులు రావడమే ఇందుకు నిదర్శమన్నారు. ఏజెన్సీలో భూ సమస్యలకు సంబంధించి పోలీసుల ప్రమేయం ఏమీ ఉండదన్నారు. సమస్య వచ్చినప్పుడు స్థానిక తహసీల్దార్, ఆర్డీవో సమక్షంలో బాధితులు పరిష్కరించుకోవాలని సూచించారు. భూములకు సంబంధించి రెవెన్యూ అధికారులు ప్రొటెక్షన్ ఇస్తే అప్పుడు భూ యజమానికి పోలీసులురక్షణ కల్పిస్తారన్నారు. పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు లేవని చెప్పారు. జిల్లాలో నెలకు రెండు,మూడు సార్లు కూంబింగ్ జరిపిస్తున్నామని పేర్కొన్నారు.
Advertisement