cheating cases
-
చపాతీ కాదు.. చీటింగ్
బనశంకరి: ఆకలితో ఉన్నవారిని సైబర్ నేరగాళ్లు ఇట్టే దోచుకుంటున్నారు. ఇందులో నిరక్షరాస్యులకంటే విద్యావంతులే ఎక్కువగా నష్టపోతున్నారు. నగరంలో సాధారణ పోలీస్ స్టేషన్లలో ఏడాదికి 250 నుంచి 300 క్రైం కేసులు నమోదు అవుతుంటే, సైబర్ పోలీస్‌స్టేషన్లులో నమోదు అవుతున్న నేరాల సంఖ్య 1000 కి పైగా ఉంటోంది. ఇప్పటి వరకు ఉద్యోగం, బిల్లులు చెల్లింపు, బ్యాంకింగ్, షేర్లు, బిట్‌కాయిన్ పేరుతో ప్రజల వద్ద నుంచి డబ్బు కాజేస్తున్నారు. ఇప్పుడు ఆహార పంపిణీలోకి వంచకులు చొరబడ్డారు. లింక్ పంపి నకిలీ యాప్‌ల ద్వారా దందా ఫుడ్ ఆర్డర్లలో మోసం ఇలా జరుగుతుంది. బెంగళూరు ఎక్కువగా గిరాకీ ఉన్న హోటల్స్ పేరుతో మోసగాళ్లు నకిలీ యాప్‌లను సృష్టిస్తారు. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్‌స్టా తదితరాల్లో ఆకర్షణీయంగా ప్రచారం చేసుకుంటారు. సోషల్ మీడియా చూసేవారు ఈ ప్రకటనల ప్రలోభపడి ఆర్డర్లు బుక్ చేస్తారు. అక్కడ సూచించిన కొన్ని నంబర్లకు ఫోన్ చేయగా బుకింగ్ స్వీకరించాము. నగదు చెల్లించండి అని సూచన వస్తుంది. దానిని నమ్మి కస్టమర్లు గూగుల్‌పే, ఫోన్‌పే తదితరాలతో నగదు చెల్లిస్తారు. ఇంకా కొందరు క్రెడిట్ కార్డు, డెబిట్‌కార్డు వినియోగిస్తారు. మోసగాళ్లు మళ్లీ కాల్ చేసి మీ డబ్బు జమ కాలేదని, తమ హోటల్ యాప్ లింక్ పంపిస్తాము. దానిని ఇన్స్టాల్ చేసుకుంటే పుడ్ ఆర్డర్, చెల్లింపు సులభమవుతుందని, పైగా డిస్కౌంట్ లభిస్తుందని నమ్మిస్తారు. సరేనని వారు పంపిన లింక్ పై క్లిక్ చేస్తే అంతే సంగతులు. బాధితుల ఫోన్‌ను హ్యాక్ చేసి నగదు దోచేస్తారు. అంతేగాక మెయిల్, వాట్సాప్ చాటింగ్‌తో పాటు అనేక వ్యక్తిగత సమాచారం మొత్తం నేరగాళ్ల పాలవుతుంది. తద్వారా బాధితులు తీవ్ర ప్రమాదంలో చిక్కుకుంటారు. రెండు పెద్ద మోసాలు ఆన్లైన్ పుడ్ ఆర్డర్ చేయడానికి వెళ్లిన ఇంజనీర్, మరొకరు భారీగా వంచనకు గురయ్యారు. బెంగళూరుకు చెందిన దీపికా అనే ఇంజనీర్ ఫేస్బుక్లో ఆహార ప్రకటనను చూసి చపాతీ– చికెన్ కర్రీని ఆర్డర్ చేయడానికి ఫోన్ చేసింది. ఫోన్లో మాట్లాడిన వ్యక్తి ఖాందాని రాజధాని రెస్టారెంట్ అని పరిచయం చేసుకున్నాడు. తాము పంపే లింక్‌లో ఉన్న రుచిసాగర్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని సలహా ఇచ్చాడు. దీపిక సరేనని ఆ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని క్రెడిట్‌కార్డు సమాచారం తెలిపి ఆర్డర్ చేసింది. ఇక అంతే.. దశలవారీగా ఆమె అకౌంట్ నుంచి రూ.61 వేలు కట్ అయ్యాయి. మరొకరికి రూ.2.23 లక్షలు టోపీ మరో కేసులో ఇమ్రానుల్లాబేగ్ ఆన్లైన్లో నంబరు చూసి ఫుడ్ ఆర్డర్ చేసి రూ.250 చెల్లించాడు. కానీ అవతలి వ్యక్తి తమకు నగదు జమ కాలేదని, ఫలానా లింక్ ద్వారా యాప్ నుంచి డబ్బు పంపాలని సూచించాడు. ఆకలితో ఉన్న బాధితుడు మరో ఆలోచన లేకుండా ఆ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకున్నాడు. వెంటనే అతని క్రెడిట్ కార్డు నుంచి రూ.2,23,858 పోయాయి. ఆశ్చర్యం ఏమిటంటే ఈ రెండు కేసుల్లో మోసగాళ్లు ఒకే మొబైల్ నంబరును వినియోగించారు. (చదవండి: చెరువు వద్ద మిస్టరీ...పాపను పాఠశాల వద్ద వదిలివస్తానని చెప్పి...) -
తియ్యటి మాటలు.. అందమైన ప్రొఫైల్ ఫోటోతో కోట్లు కొట్టేసింది
సాక్షి, హైదరాబాద్: తియ్యగా మాట్లాడుతూ...అందమైన యువతి ఫొటోతో తప్పుడు ఫ్రొఫైల్ సృష్టించిన యువతి ఓ వ్యక్తికి వలవేసింది. అతడి నుంచి దాదాపు రూ.1.20 కోట్లు కాజేసింది. గత డిసెంబర్ నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు విడతల వారీగా వివిధ కారణాలు చెప్పి డబ్బులు లాగింది. చివరకు మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు బుధవారం అంబర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ మల్లేశ్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి... గుంటురు జిల్లాకు చెందిన వి.సుబ్బారెడ్డికి బాగ్‌అంబర్‌పేట డీడీ కాలనీకి చెందిన సాయిరాంతో పాత పరిచయం ఉంది. గత డిసెంబర్ నెలలో వారిరువురు అనుకోకుండా చాలకాలం తర్వాత కలుసుకున్నారు. చదవండి: పెళ్లికొడుకు కదా అని ‘చెప్పినట్టు’ చేస్తే... అశ్లీల వీడియోలతో.. ఈ సందర్భంగా సాయిరాం తమ మరదలు అర్చన(24) బ్యూటీ పార్లర్ నడుపుతుందని పెట్టుబడి కోసం ఏదైనా సహాయం చేయాలని కోరుతూ సుబ్బారెడ్డికి ఆమె ఫోన్ నంబర్ ఇచ్చాడు. ఆ తర్వాత సుబ్బారెడ్డి, అర్చనలు ఫోన్లో మాట్లాడుకునేవారు. అయితే అర్చన తన ఫొటోకు బదులు అందమైన యువతి ఫొటోను ప్రొఫైల్ పిక్‌గా ఉంచి తనదేనంటూ సుబ్బారెడ్డిని నమ్మించింది. తరచు సుబ్బారెడ్డికి ఫోన్ చేసి బ్యూటీపార్లర్, ఇతర అవసరాల పేరుతో విడతలవారీగా అన్లైన్ ద్వారా నగదు బదిలీ చేయించుకుంది. సుబ్బారెడ్డి ఆమెను ప్రత్యక్షంగా కలవాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా ఏవో సాకులు చెబుతూ ఈ ఏడాది ఆగస్టు నెల వరకు తప్పించుకు తిరిగింది. చదవండి: రోకలి బండతో మోది.. భర్తను హతమార్చి పలుమార్లు గుంటూరు నుంచి నగరానికి వచ్చిన సుబ్బారెడ్డి ఆమెను కలిసేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో తాను మోసపోయానని గుర్తించిన బాధితుడు డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ ఒత్తిడి తెచ్చాడు. అయినా ఫలితం లేకపోవడంతో సీసీఎస్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా అంబర్‌పేట పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. బాధితుడు సుబ్బారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అర్చన, అమె బావ సాయిరాం, ప్రియుడు అనిల్కుమార్లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఒకటే కులం.. పైగా ఇద్దరూ క్లాస్మేట్స్.. ఇద్దరూ డాక్టర్లే!
సాక్షి, హైదరాబాద్: పెళ్లంటే నూరేళ్ల పంట. కానీ కొందరు అమ్మాయిలకు అదే విష వలయంగా మారుతోంది. పెళ్లికి ముందే ఒకరినొకరు అర్థం చేసుకోవాలని ఏకాంతంగా కలుస్తున్నారు. పెద్దలు కుదిర్చిన సంబంధం.. పైగా కాబోయే భార్యాభర్తలమే కదా అని ఏకాంతంగా మాట్లాడేందుకు అనుమతిస్తున్న అమ్మాయిలు దారుణంగా మోసపోతున్నారు. కాబోయే భర్త ముసుగులో ఉన్న కామాంధులు అమ్మాయిలను వంచించి వదిలేస్తున్నారు. తీరా మోసపోయాక బాధిత యువతులు పోలీసులను, భరోసా కేంద్రాన్ని ఆశ్రయిస్తున్నారు. హైదరాబాద్‌లో ఇప్పటివరకు సుమారు 457కు పైగా ఇలాంటి కేసులు నమోదయ్యాయి. మ్యాట్రిమోనీ సంస్థల ద్వారా.. హైదరాబాద్‌లోని ఓ డీమ్డ్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న కేరళకు చెందిన ఓ అమ్మాయి ప్రముఖ మ్యాట్రిమోనీ సంస్థ ద్వారా ఓ అబ్బాయిని ఎంపిక చేసుకుంది. రెండు కుటుంబాలు వారి పెళ్లికి అంగీకరించాయి. దాంతో ఒకరినొకరు అర్థం చేసుకొనేందుకు తరచుగా కలిసేవారు. అయితే అది కాస్తా వారు శారీరకంగా దగ్గరయ్యే దాకా వచ్చింది. కొద్దిరోజుల తర్వాత అబ్బాయి ఫోన్ స్విచాఫ్ చేశాడు. ఆందోళనకు గురైన ఆ అమ్మాయి అతడి బంధువులను సంప్రదించగా స్పందన లేదు. చివరకు పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఆ అమ్మాయి మోసపోయినట్లుగా కేసు నమోదు చేశారు. ఏడాది కింద ఈ కేసు నమోదైనా ఇప్పటికీ ఆమెకు న్యాయం జరగలేదు. ఈ ఉదంతంలో కొసమెరుపు ఏంటంటే.. సదరు మ్యాట్రిమోని సంస్థ జాబితాలో ఇప్పటికీ అతడు ‘వధువు కోసం ఎదురు చూస్తున్న వరుడే’. కట్నం కావాల్సి వచ్చింది.. వధూవరులిద్దరిదీ ఒకటే కులం. పైగా ఇద్దరూ క్లాస్మేట్స్. ఇద్దరూ డాక్టర్లే. చిన్నప్పటి నుంచి తెలిసిన అబ్బాయి కావడంతో అమ్మాయి తల్లిదండ్రులు పెళ్లికి అంగీకరించారు. గతేడాది మాటా ముచ్చట పూర్తయింది. మంచి రోజులు చూసుకొని పెళ్లి చేయాలని భావించారు. అప్పటికే ఓ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న ఆమె అతడిని తన సొంత ఖర్చులతో పీజీలో చేర్పించింది. ఎలాగూ కాబోయే భార్యా భర్తలమనే భరోసాతో శారీరకంగా దగ్గరయ్యారు. ఈ నేపథ్యంలో ఆ వరుడికి ఎక్కువ కట్నం ఇచ్చే మరో సంబంధం వచ్చింది. దాంతో అతడు మొదటి వధువుతో మాట్లాడటం మానేశాడు. దీంతో అమ్మాయి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల సమక్షంలో అతడు తన తప్పును అంగీకరించి, అమ్మాయిని నెల రోజుల్లో పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు. ఇప్పటికి 3 నెలలు దాటింది. ఆమె తనను పోలీసుల ద్వారా వేధింపులకు గురి చేసిందంటూ ఇప్పుడు తప్పించుకొని తిరుగుతున్నాడు. వందల్లో బాధితులు.. నగరానికి చెందిన ఓ యువతి వరంగల్ జిల్లాలో ఏఎన్ఎంగా పని చేస్తోంది. తన కంటే రెండేళ్లు చిన్నవాడైనా కూడా తెలిసిన అబ్బాయి అని చేరదీసి చదివించింది. ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం లభించింది. కొద్దిరోజుల్లో తాము పెళ్లి చేసుకుంటామని ఆమె కలలు కంటున్న తరుణంలో.. ఆ అమ్మాయి తనకంటే పెద్దదని, తాను పెళ్లి చేసుకోనని తెగేసి అతడు చెప్పాడు. దీంతో మోసపోయానని గుర్తించిన ఆమె పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టింది. పెళ్లికి ముందు అభిప్రాయాలు, అభిరుచులను పంచుకోవడం మంచిదే. కానీ కొందరు దీన్ని అవకాశంగా తీసుకొని లైంగిక వంచనకు పాల్పడుతున్నారు. యువతులు అంతగా చనువు ఇవ్వొద్దని పలువురు సూచిస్తున్నారు. నిర్భయ వంటి వాటికే స్పందిస్తారా ‘మోసంతో పాటు, నమ్మిన వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన ఇలాంటి ఉదంతాలను పోలీసులు మోసపోయిన కేసులుగానే నమోదు చేస్తున్నారు. నిర్భయ వంటి సంఘటనల్లో మాత్రమే స్పందించి అత్యాచారం జరిగినట్లు కేసులు నమోదు చేస్తున్నారు. ఇది సరైంది కాదు. పైగా అమ్మాయిలు స్వయంగా తాము అత్యాచారానికి గురైనట్లు కేసులు పెడితే ‘మెడికల్ ఎగ్జామినేషన్’ఉండాలంటున్నారు. ఇది చాలా అన్యాయం.’ – మమత రఘువీర్, సామాజిక కార్యకర్త -
ఇన్‌స్ట్రాగామ్ చాటింగ్‌తో 50 లక్షల మోసం
సాక్షి, సిటీబ్యూరో: సోషల్‌మీడియా యాప్ ఇన్‌స్ట్రాగామ్ కేంద్రంగా యువతులను పరిచయం చేసుకుని, వారితో చాటింగ్స్ చేస్తూ నమ్మకం సంపాదించుకుని మోసం చేస్తున్న గుర్తుతెలియని ఘరానా మోసగాడిపై సిటీ సైబర్ క్రైమ్ బుధవారం కేసు నమోదు చేశారు. ఇతడి చాటింగ్స్ నమ్మి రూ.8.5 లక్షలు ఇచ్చిన బాధితురాలి ఫిర్యాదు మేరకు దీన్ని రిజిస్టర్ చేసి దర్యాప్తు చేపట్టారు. నగరంలోని లోయర్ ట్యాంక్‌బండ్‌కు చెందిన ఓ యువతికి ఇన్‌స్ట్రాగామ్ ద్వారా హర్షగా చెప్పుకున్న వ్యక్తి పరిచయమయ్యాడు. ఈమెతో కొన్నాళ్ళు స్నేహ పూర్వకంగానే చాటింగ్ చేశాడు. ఆపై తనకు అత్యవసరం అంటూ రూ.10 వేల చొప్పున మూడుసార్లు డిపాజిట్ చేయించుకున్నాడు. నమ్మకం చూరగొనడం కోసం చెప్పిన సమయాలకు ఆ మొత్తాలు తిరిగి ఇచ్చేశాడు. ఆపై అసలు కథ ప్రారంభించిన మోసగాడు తాను ఓ సాఫ్ట్వేర్ కంపెనీని స్థాపించానని, దానికి సీఈఓగా వ్యవహరిస్తున్నానని చెప్పాడు. కొన్ని రోజుల తర్వాత తనకు రూ.20 కోట్ల విలువైన ప్రాజెక్టు వచ్చిందని నమ్మించాడు. దాన్ని పూర్తి చేయడానికి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయంటూ నగర యువతి నుంచి రెండు సందర్భాల్లో రూ.8.5 లక్షలు బదిలీ చేయించుకున్నాడు. అక్కడితో ఆగకుండా మరికొంత మొత్తం కావాలని అతడు కోరుతుండటంతో తన వద్ద లేవంటూ ఆమె చెప్పింది. అయితే తన సాఫ్ట్వేర్ ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టే వారు ఎవరైనా ఉంటే పరిచయం చేయాలని, కేవలం కొన్ని రోజుల్లోనే దాన్ని పూర్తి చేసి వారు పెట్టిన మొత్తానికి రెట్టింపు తిరిగి ఇస్తానంటూ నమ్మబలికాడు. దీంతో ఆ యువతి నగర శివార్లలో ఉండే తన బంధువులు ఇద్దరిని పరిచయం చేసింది. వారినీ ఇన్‌స్ట్రాగామ్ చాటింగ్ ద్వారా సంప్రదించిన మోసగాడు వారి నుంచీ దాదాపు రూ.50 లక్షలు మేర స్వాహా చేశాడు. ఇతడి చేతిలో మోసపోయిన నగర యువతి బుధవారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు ఇన్స్పెక్టర్ ఎన్.మోహన్‌రావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
కేటుగాడు చినరామయ్య అరెస్టు..
కైకలూరు: పెళ్లి సంబంధాలు, ఉద్యోగాల పేరుతో యువతులు, నిరుద్యోగులను మోసం చేసిన కేటుగాడిని కైకలూరు పోలీసులు అరెస్టు చేశారు. కైకలూరు టౌన్‌స్టేషన్‌లో సీఐ కేఎన్వీ జయకుమార్ శుక్రవారం వివరాలు వెల్లడించారు. గుంటూరు జిల్లా, వట్టిచెరుకూరు మండలం, చమల్లమూడి గ్రామానికి చెందిన బేతపూడి చినరామయ్య(42)కు భార్య, ఇరువురు సంతానం. విజయవాడలో ఇంటర్నెట్ సెంటర్ పెట్టి నష్టపోయాడు. తరువాత ఇంటి నిర్మాణం చేసి అప్పులపాలయ్యాడు. చివరికి నరసరావుపేటలో అద్దెకు దిగాడు. ఇంటర్నెట్ సెంటర్ అనుభవంతో తెలుగు మ్యాట్రీ మోనిడాట్కామ్లో తనకు వధువు కావాలని తప్పుడు చిరునామా ఇచ్చాడు. లైక్‌లు కొట్టిన మహిళలు, యువతలకు ఫోన్ చేసి తాను యూఎస్ఏ నాసా, న్యూ ఢిల్లీ జవ్సియానా ఎయిర్ క్రాఫ్ట్, గన్నవరం ఎయిర్‌పోర్టులో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌గా ఉద్యోగం చేస్తున్నానని నకిలీ గుర్తింపు కార్డులను సృష్టించాడు. కైకలూరులో ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు. ఆమె ఫిర్యాదు మేరకు విచారణ అనంతరం అరెస్టు చేసినట్లు వివరించారు. అతడి నుంచి రూ.2.50లక్షలు, ల్యాప్‌టాప్, నకిలీ గుర్తింపు కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. విలేకరుల సమావేశంలో టౌన్ ఎస్ఐ షణ్ముఖసాయి పాల్గొన్నారు. మోసాల తీరిది... సైబర్‌నేరగాడి చినరామయ్య ఫేస్బుక్ ద్వారా రావూరి రాము, లంక ప్రకాష్, భాస్కరరావు, విజయ్ అనే పలు పేర్లుతో మహిళలను వల వేస్తుంటాడు. పరిచయం అయిన తరువాత తన అన్నకుంటుంబం ఆపదలో ఉందని డబ్బు కావాలని, త్వరలోనే మనం వివాహం చేసుకుందామని నమ్మబలుకుతాడు. ఏటీఎంలు తీసుకుంటాడు. కొద్ది రోజులకు మీ బంధువులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని వారి వద్ద డబ్బులు గుంజుతాడు. కైకలూరులో ఉద్యోగం చేసే నాగలక్ష్మిని పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమె ఏటీఎం తీసుకుని రూ.2లక్షలు డ్రా చేశాడు. ఆమె బంధువు అంబటి శ్యామ్‌కు గన్నవరం ఎయిర్‌పోర్టులో ఉద్యోగం ఇప్పిస్తానని రూ.2లక్షలు తీసుకున్నాడు. బాపులపాడు మండలం కొత్తమల్లవల్లి గ్రామానికి చెందిన గజ్జల స్వాతిని పెళ్లి చేసుకుంటానని, ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.లక్షా 60వేలు తీసుకున్నాడు. ఆమె ద్వారా అడపాక పెద్దిరాజుకు ఎయిర్‌పోర్టులో ఉద్యోగం ఇస్తానని రూ.2లక్షల 20వేలు దండుకున్నాడు. పాలకోడూరు మండలం శృంగవృక్షంకు చెందిన ఆకుమర్తి చంద్రశేఖర్‌కు విజయ్ అనే పేరుతో ఫేస్బుక్లో పరిచయం చేసుకుని ఉద్యోగం ఇస్తానని రూ.85,000 తీసుకున్నాడు. ఇలా ఎందరినో మోసం చేశాడు. అతడిపై విజయవాడ, వీరవల్లి పోలీసుస్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. -
ఫడ్నవీస్‌కు కోర్టు నోటీసులు
నాగ్‌పూర్: మహారాష్ట్ర మాజీ సీఎం ఫడ్నవీస్‌కు స్థానిక న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ఎన్నికల అఫిడవిట్లో ఫడ్నవీస్ తనపై ఉన్న క్రిమినల్ కేసులను పేర్కొనలేదంటూ దాఖలైన ఫిర్యాదుపై కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు గురువారం ఆయనకు నోటీసులు అందజేశారు. నాగ్‌పూర్ ఎమ్మెల్యే అయిన ఫడ్నవీస్‌పై 1996, 1998లలో ఫోర్జరీ, చీటింగ్ కేసులు నమోదయ్యాయి. ఎన్నికల అఫిడవిట్లో ఈ రెండు కేసులను వెల్లడించనందున ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ నాగ్‌పూర్‌కు చెందిన న్యాయవాది సతీశ్ ఊకె కేసు వేశారు. దీనిపై స్థానిక న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. దీనిపై సతీశ్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. అత్యున్నత న్యాయస్థానం మేజిస్ట్రేట్ కోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. దీంతో స్థానిక న్యాయస్థానం జారీ చేసిన నోటీసులను గురువారం పోలీసులు ఆయన నివాసంలో అందజేశారు. -
నిత్య పెళ్లి కొడుకు అరెస్టు
తార్నాక: మేనమామ కుమార్తెను వివాహమాడి ఆరునెలలకే వదిలేశాడు, కొద్దికాలానికే మరో యువతిని పెళ్లిచేసుకుని వారం రోజులకే వదిలేశాడు. ముచ్చటగా మూడోపెళ్లికి సిద్దమైన ఓ యువకుడు పోలీసులకు దొరికిపోయిన సంఘటన ఓయూ పోలీసుస్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఓయూ ఎస్ఐ నర్సింగరావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మేడ్చల్‌జిల్లా, రాంపల్లికి చెందిన మహ్మద్ సోహేల్(24) ప్రైవేటు ఉద్యోగి. 2016లో అతను తన మేనమామ కుమార్తెను వివాహం చేసుకుని ఆరు నెలలకే వదిలేశాడు. అనంతరం పీర్జాదిగూడకు చెందిన మరో యువతిని పెళ్లి చేసుకున్న అతను కేవలం వారం రోజులు మాత్రమే కాపురం చేసి వదిలేశాడు. నెల రోజుల క్రితం లాలాపేటలో ఓ యువతిని చూసిన అతను ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లి కుదుర్చుకున్నాడు. ఈనెల 23న ఆమెతో ఎంగేజ్మెంట్ కూడా చేసుకోవడమేగాక వధువు తండ్రి నుంచి రూ.50వేలు కట్నంగా తీసుకున్నాడు. అయితే సదరు యువతి కుటుంబ సభ్యులు సోహెల్ గురించి వాకబుచేయగా, అతడికి ఇçప్పటికే రెండుపెళ్లిళ్లు జరిగినట్లు స్థానికులు చెప్పడంతో తాము మోసపోయినట్లు గుర్తించిన బాధితులు ఓయూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువతి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. -
కేఏపాల్‌పై మహిళ ఫిర్యాదు.. అమెరికా పంపిస్తానని
పంజగుట్ట: ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ కేఏ పాల్ ఓ మహిళకు అమెరికా వెళ్లేందుకు స్పాన్సర్షిప్ లెటర్ ఇస్తానని నమ్మించి రూ. 2 లక్షలు తీసుకుని మోసం చేశాడని ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజగుట్ట పోలీసులు పాల్‌పై చీటింగ్ కేసు నమోదు చేశారు. పోలీసులు, బాధితురాలి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రామకృష్ణాపురం ప్రాంతానికి చెందిన కాట్రగడ్డ సత్యవతి వ్యాపారం చేసేది. అమెరికా వెళ్లేందుకు ప్రయత్నంలో ఉన్న ఆమెకు ఒంటరిగా ఉన్నందున నిబంధనల ప్రకారం వీసా తీసుకునేందుకు స్పాన్సర్షిప్ లెటర్ అవసరం. ఈ నేపథ్యంలో కొందరు వ్యక్తులు కేఏ పాల్‌ను సంప్రదిస్తే స్పాన్సర్షిప్ లెటర్ ఇస్తారని చెప్పడంతో ఆయన పీఏ విజయ్‌ని సంప్రదించారు. విజయ్ ద్వారా గత నెల 22న పాల్‌ను కలిసి స్పాన్సర్షిప్ లెటర్ కావాలని కోరగా, రూ. 15 లక్షలు ఖర్చవుతుందని తెలిపారు. రూ. 2 లక్షలకు ఒప్పందం కుదిరింది. ఈ నెల 8న పాల్ అసిస్టెంట్ జ్యోతి పేరుతో రూ. 2 లక్షల చెక్కును అమీర్‌పేటలోని పాల్ కార్యాలయంలో అతడికి ఇచ్చింది. చెక్కును క్యాష్ చేసుకున్నప్పటికీ లెటర్ ఇవ్వాలని కోరినా స్పందన లేదని తెలిపింది. అంతేగాక తన ఫోన్ బ్లాక్‌లిస్టులో పెట్టినట్లు పేర్కొంది. నేరుగా కార్యాలయానికి వెళ్లి అడగ్గా రూ. 2 లక్షలతో పని కాదని, మరో రూ.15 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో బాధితురాలు మంగళవారం పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేఏ పాల్, అతని పీఏ విజయ్, అసిస్టెంట్ జ్యోతిలపై కేసులు నమోదు చేశారు. పాల్‌కు నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. -
అడుగడుగునా... అలసత్వం..నిర్లక్ష్యం
సాక్షి, సిటీబ్యూరో: పోలీసుల అలసత్వం... దర్యాప్తు అధికారుల నిర్లక్ష్యం... విచారణలో లోపం... వెరసి జిత్తులమారి జిన్నా కాంతయ్య ‘ఎదగడానికి’ ఉపకరించాయి. 2007లో మోసాలకు శ్రీకారం చుట్టిన ఇతగాడు నిరాటంకంగా చేస్తూనే ఉన్నాడు. ఇప్పటి వరకు ఆరు కేసులు నమోదైనా ఒక్కదాంట్లోనూ శిక్ష పడకపోవడం, సరైన నిఘా లేని కారణంగానే ఉప్పల్ కేంద్రంగా గ్రీన్ గోల్డ్ బయోటెక్ పేరుతో పల్లీ నూనె మిషన్ల దందాకు పాల్పడ్డాడు. దీని ముసుగులో నిషిద్ధ మల్టీ లెవల్ మార్కెటింగ్‌కు పాల్పడి రూ.కోట్లలో దండుకున్నాడు. ఇకనైనా పోలీసులు కళ్లు తెరవకపోతే భవిష్యత్తులో మరిన్ని ‘అవతారాలు’ ఎత్తే ప్రమాదం ఉందనేది నిర్వివాదాంశం. కాలానుగుణంగా మోసాలు... ఘరానా మోసగాడు కాంతయ్య అలియాస్ శ్రీకాంత్ 12 ఏళ్లుగా ఎప్పటికప్పుడు డిమాండ్ ఉన్న వ్యవహారాన్ని తీసుకుని మోసాలు చేస్తున్నాడు. 2007లో రియల్ ఎస్టేట్‌బూమ్ జోరుగా ఉన్న సమయంలో మహాలైఫ్ ఆన్లైన్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో సంస్థను ఏర్పాటు చేశాడు. ఆపై మహాలైఫ్ ఇన్‌ఫ్రాస్టక్చర్‌గా మార్చి మరికొన్ని వ్యవహారాలు సాగించాడు. రియల్ వ్యాపారం తగ్గి ఆర్గానిక్ ఉత్పత్తులపై జోరుగా ప్రచారం సాగుతున్న సమయంలో గ్రీన్‌గోల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో మరో మోసానికి తెరలేపాడు. ప్లాస్టిక్‌పై నిషేధం ప్రకటన వచ్చిన తరవాత పేపర్ బ్యాగ్స్ తయారీ యంత్రాలు అంటూ జిన్నా ట్రేడింగ్ కంపెనీ పేరుతో మరో మోసానికి తెరలేపాడు. ఇన్ని రకాలుగా సంస్థలు ఏర్పాటు చేసి మోసాలకు పాల్పడిన ఇతడిపై సైబరాబాద్, హైదరాబాద్‌తో పాటు ఏపీలోని కడప జిల్లాతో కలిపి మొత్తం ఎనిమిది కేసులు ఉన్నాయి. తాజాగా ఉప్పల్‌లో తొమ్మిదో కేసు నమోదైంది. అడ్రస్ మారుస్తూ ‘సేఫ్‌జోన్’లోకి... ఘరానా మోసగాడు కాంతయ్య ఒక్కో తడవకు ఒక్కో పేరుతో రూ.కోట్లు దండుకుంటున్నాడు. అయినా స్నాచర్లు వంటి సొత్తు సంబంధ నేరగాళ్లపై ఉన్న నిఘా ఇలాంటి జిత్తులమారులపై ఉండట్లేదు. ఓసారి అరెస్టైన తర్వాత బెయిల్ పొందే ఇతగాడు తన మకాం మార్చేస్తుండటం యథేచ్ఛగా మోసాలు చేయడానికి ప్రధాన కారణంగా మారుతోంది. ఏదైనా కేసులో నిందితుడు కోర్టు నుంచి బెయిల్ పొంది బయటకు వస్తే... వాయిదాలకు హాజరుకావాల్సి ఉంటుంది. అలా చేయని వారిపై న్యాయస్థానాలు వారెంట్లు జారీ చేస్తాయి. వీటిని ఎగ్జిక్యూట్ చేయాల్సిన పోలీసులు చిరునామా మార్చాడన్న కారణం చూపిస్తూ తదుపరి చర్యలు తీసుకోవట్లేదు. ఫలితంగానే మహాలైఫ్ హోమ్స్, మహాలైఫ్ పబ్లికేషన్స్, మహాలైఫ్ క్లినిక్, మహాలైఫ్ మీడియా ఇంక్, మహాలైఫ్ ఇన్నో మార్కెట్స్ ఇంక్, మహాలైఫ్ హోమ్స్ (రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్స్), గ్రీన్ గోల్డ్ బయోటెక్ తదితర సంస్థల ముసుగులోనూ మోసాలు చేయగలిగాడు. ‘ముందస్తు’ను పట్టించుకోక... పలు సంస్థల పేరుతో భారీ మోసాలకు పాల్పడిన శ్రీకాంత్‌ను విచారించడంలోనూ పోలీసులు విఫలమయ్యారు. ఇతగాడికి గతంలో కొన్ని కేసుల్లో ముందస్తు బెయిల్ లభించింది. ఇలా బెయిల్ ఇచ్చే న్యాయస్థానాలు దర్యాప్తు అధికారులకు పూర్తి సహకారం అందించాల్సిందిగా షరతు విధిస్తాయి. అయితే రెండు కేసుల్లో ముందస్తు బెయిల్‌ను ఎగ్జిక్యూట్ చేసిన అప్పటి సీసీఎస్ పోలీసులు ఈ విషయం పట్టించుకోలేదు. కేవలం ఓసారి మాత్రమే పిలిపించి పంపించేయడంతో అనేక అంశాలు మరుగున పడిపోయాయి. మరోపక్క ఒక్కో స్కామ్‌లో వందల మంది బాధితులు ఉన్నా పోలీసులు కేవలం ఐదు నుంచి పది మందిని మాత్రమే సాక్షులుగా పేర్కొంటున్నారు. వీరితో కాంప్రమైజ్ అవుతున్న కాంతయ్య తేలిగ్గా తప్పించుకుంటున్నాడు. బాధితులు అందరినీ బాధితులుగా/సాక్షులుగా చేరిస్తే ఈ పరిస్థితులు ఉండేవి కాదని వినిపిస్తోంది. అంతా చెప్పేది ఒకే అంశం అని భావిస్తూ కొందరు, నిందితులకు పరోక్షంగా సహకరించాలనే ఉద్దేశంతో మరికొందరు బాధితులు/సాక్షుల సంఖ్యను తగ్గించేసి కేసులను కాంతయ్యకు అనుకూలంగా మార్చేశారు. దర్యాప్తు సమర్థంగా ఉన్నప్పటికీ... ‘తిలాపాపం తలాపిడికెడు’ అన్న చందంగా అనేక మంది చేసిన పోరపాట్లు, ఉద్దేశపూర్వక చర్యల కారణంగానే ఈ ‘పల్లీ మొక్క’ మానుగా మారిందనే విమర్శలు ఉన్నాయి. గతంలో కాంతయ్యపై నమోదైన కేసులను దర్యాప్తు చేసిన అధికారులు కొన్ని ఆస్తులను గుర్తించి అటాచ్‌మెంట్‌కు చర్యలు తీసుకున్నారు. అయితే సాక్షులు, బాధితుల్ని మభ్యపెట్టిన అతగాడు న్యాయస్థానం నుంచి వాటిని రిలీవ్ చేయించుకుంటున్నా దర్యాప్తు అధికారుల చేష్టలుడిగి చూశారు. కొన్ని కేసుల్లో పోలీసుల దర్యాప్తు పక్కాగా ఉన్నప్పటికీ తీవ్రతను న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లడంలో ఉన్న లోపాలు అతడికి కలిసి వచ్చాయి. ఇలాంటి అనేక లోపాల నేపథ్యంలోనే కాంతయ్య ఏళ్లుగా మకాం మారుస్తూ నిరాటంకంగా మోసాలు చేస్తూనే ఉన్నాడు. తాజాగా పట్టుకున్న రాచకొండ పోలీసులైనా లోపాలకు తావు లేకుండా దర్యాప్తు చేపట్టి ఉక్కుపాదం మోపితేనే ఇతడి ఆగడాలకు అడ్డుకట్టపడే అవకాశం ఉంది. -
ప్రేమ పేరుతో మోసం.. అధ్యాపకుడి నిర్వాకం
తార్నాక: పెళ్లయి భార్యతో విడాకులు తీసుకున్న అధ్యాపకుడు ప్రేమ,పెళ్లి పేరుతో ఓ విద్యార్థినిని నమ్మించి ఆమెతో సహజీవనం చేయడమేగాక ఆమె పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో మోహం చాటేశాడు.దీంతో బాధితురాలు ఓయూ పోలీసులను ఆశ్రయించింది. తార్నాకలోని ద ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ(ఇఫ్లూ)లో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కేరళకు చెందిన ఓ విద్యార్థిని ఇఫ్లూలో ఎం.ఏ ఇంగ్లిష్(ఈఎల్టీ) కోర్సు చదువుతోంది. కేరళకు చెందిన రంజిత్ తంగప్పన్ ఇఫ్లూలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తూ సీతాఫల్మండిలో ఉంటున్నాడు. ఇద్దరు ఒకే రాష్ట్రానికి చెందిన వారు కావడంతో వారి మధ్య పరిచయం ఏర్పడింది. దీనిని ఆసరాగా తీసుకున్న అతను ప్రేమ పేరుతో వలవేశాడు. తనకు వివాహమైందని, భార్యతో మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుంటున్నట్లు చెప్పి మరింత దగ్గరయ్యాడు. తనకు ఓ తోడు కావాలని, అందుకు అంగీకరిస్తే పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అనంతరం సదరు విద్యార్థినిని హాస్టల్ నుంచి ఖాళీ చేయించి తన ఇంటికి తీసుకువెళ్లగా ఇద్దరు సహజీవనం చేస్తున్నారు. కొద్దిరోజులుగా వారి మధ్య మనస్పర్థలు రావడంతో ఈనెల 12న రంజిత్ బాధితురాలిపై చేసుకున్నాడు. ఆమెను పెళ్లి చేసుకోవడం కుదరదని, హాస్టల్‌కు వెళ్లిపోవాలంటూ ఇంటి నుంచి గెంటేశాడు. ఆమె ఫోన్‌చేసినా సమాధానం ఇవ్వకపోగా, ఆమె నంబర్‌ను బ్లాక్ లిస్టులో పెట్టిన రంజిత్ ఈనెల 19 నుంచి వారం రోజులపాటు సెలవు పెట్టి కేరళకు వెళ్లిపోయాడు. దీంతో బాదితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. -
ఫేస్బుక్ పరిచయంతో ఉద్యోగం ఇప్పిస్తానంటూ..
విలాసవంతమైన జీవితం, గుర్రపు పందాలతో జోష్...ఖరీదైన వాహనాల్లో రయ్...రయ్, లగ్జరీ సూట్లలో హల్చల్...చూస్తే వీఐపీ పోజు ... చేసే పనులన్నీ మస్కా... ఇందుకు చేతినిండా డబ్బులు కావాలి...అందుకే ఫేస్బుక్ ద్వారా పరిచయాలు పెంచుకొని అవతలివారిని ‘బుక్’ చేయడం హాబీగా మార్చుకున్నాడు ఆ యువకుడు. అమరావతి సెక్రటేరియట్లో ఉద్యోగిగా ఓ యువతిని పరిచయం చేసుకుని, జ్యుడీషియల్ డిపార్టుమెంట్లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి దశలవారీగా రూ.16.50 లక్షలు స్వాహా చేసి చివరకు కటకటాలపాలయ్యాడు. తూర్పుగోదావరి , రాజమహేంద్రవరం రూరల్: ఫేస్బుక్లో పరిచయమైన యువతికి మాయమాటలు చెప్పి రూ.16.50 లక్షలు కాజేసిన తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరికి చెందిన మద్దెల దీపుబాబు అలియాస్ దీపక్‌ను బొమ్మూరు పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి రూ.10 వేలు, ఒక ఏటీఎం కార్డును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు గతంలోను ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలకు మొబైల్ ఫ్యాన్సీ నంబర్లు ఇస్తానని చెప్పి రూ.30 లక్షలు కాజేసిన కేసులో జైలు శిక్ష అనుభవించాడు. దీపక్ ఏపీ సెక్రటరీయేట్లో ఉద్యోగం చేస్తున్నానని చెబుతూ ఫేస్బుక్లో పలు పరిచయాలు పెంచుకున్నాడు. శాటిలైట్ సిటీ గ్రామానికి చెందిన దొండపాటి దుర్గ అనే యువతికి దీపక్ ఫేస్బుక్లో పరిచయమయ్యాడు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో నిందితుడు(ఫేస్బుక్లో పోస్ట్ చేసిన చిత్రం) ఆమె పిన్నికుమార్తె బోనగిరి శేషారత్నానికి న్యాయశాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఆమె తల్లిదండ్రుల నుంచి తన అకౌంట్లో రూ.16.50 లక్షలు వేయించుకున్నాడు. సొమ్ములు చెల్లించినా ఉద్యోగం రాకపోవడంతో అనుమానం వచ్చి నిలదీయగా, వారిని నమ్మించేందుకు బెంగళూరులో ఇటీవల జరిగిన న్యాయశాఖ ఉన్నతాధికారులు సమావేశం వద్దకు తీసుకువెళ్లి అపాయింట్మెంట్ లెటర్ తయారవుతోందని, ఉద్యోగం వచ్చేస్తుందని నమ్మించాడు. నెలలు గడుస్తున్నా ఉద్యోగం రాకపోవడంతో ఈ నెల13న శేషారత్నం తాత ఊరా రాముడు బొమ్మూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. తాను వసూలు చేసిన సొమ్మును హైదరాబాద్, బెంగళూరులలో గుర్రపు పందాలు, స్టార్ హోటళ్లలో దిగి వాడేసినట్లు నిందితుడు తెలిపాడు. నిందితుడికి స్కేటింగ్‌లో కుడికాలు పోయిందని..కృత్రిమ కాలును ఏర్పాటు చేసుకుని ఈ ఘాతుకాలకు పాల్పడుతున్నాడని రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా తూర్పుమండల డీఎస్పీ యు.నాగరాజు తెలిపారు. -
చిట్టీల పేరుతో మోసం
అనంతపురం, తాడిపత్రి అర్బన్: పలువురి నుంచి చిట్టీలు కట్టించుకున్న సొమ్ముతో నిర్వాహకుడు ఉడాయించిన ఉదంతం ఆలస్యంగా వెలుగుచూసింది. ఇంటిలోని సామాన్లను తీసుకెళ్లేందుకు వచ్చిన నిర్వాహకుడి భార్యను బాధితులు గుర్తించి పోలీసులకు అప్పగించారు. బాధితులు తెలిపిన మేరకు.. తాడిపత్రి పట్టణంలోని సీపీఐ కాలనీకి చెందిన రాజగోపాల్‌రెడ్డి దాదాపు పద్దెనిమిదేళ్ల నుంచి లగాన్ వ్యాపారం చేస్తున్నాడు. చిరువ్యాపారులు, ఆటో, కారు డ్రైవర్ల వద్ద చిట్టీల పేరుతో దాదాపు రూ.2 కోట్ల వరకు సేకరించాడ. చిట్టీల కంతులు పూర్తయిన వారికి డబ్బు ఇవ్వకుండా తిప్పుకున్నాడు. నాలుగు నెలల కిందట కుటుంబ సభ్యులతో కలిసి పరారయ్యాడు. బాధితులు వాకబు చేయగా నెలన్నర కిందట తిరుపతిలో ఉన్నట్లు గుర్తించి తాడిపత్రికి తీసుకొచ్చారు. ఒకరోజంతా బంధించి తమ డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే రాజగోపాల్‌రెడ్డి వారి కళ్లుగప్పి ఎలాగోలా తప్పించుకుని పారిపోయాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి తాడిపత్రిలో ఉన్న తన ఇంటికి రాజగోపాల్ భార్య శ్రీదేవి వచ్చి సామాన్లు తరలిస్తున్న విషయం తెలుసుకున్న బాధితులు అక్కడకు చేరుకుని ఆమెను పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. బాధితులు ఫిర్యాదు ఇస్తే తాము విచారణ చేపడతామని సీఐ నారాయణరెడ్డి బాధితులకు సూచించారు. శ్రీదేవిని కూడా ఇల్లు విడిచి వెళ్ళవద్దని, భర్త వస్తే వెంటనే తమకు తెలియజేయాలని పోలీసులు సూచించారు. ఆదివారం కూడా బాధితులు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని తమ గోడు వెల్లబోసుకున్నారు. అయితే చిట్టీల నిర్వాహకుడిపై ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదూ అందలేదని పోలీసులు తెలిపారు. -
పేరు తెలుసుకునేందుకే పదేళ్లు..!
సాక్షి, సిటీబ్యూరో: అండమాన్ నికోబార్ దీవుల నుంచి వచ్చిన శర్థక్ రావు బబ్రాస్ దేశంలోని దాదాపు అన్ని మెట్రో నగరాల్లోనూ పంజా విసిరాడు. స్టార్ హోటల్స్ అడ్డాగా చేసుకుని కథ నడిపిన ఇతగాడిని ఢిల్లీ పోలీసులు పదేళ్లకు పట్టుకోగలిగారు. బసేర హోటల్లో బస చేసి, అమర్సన్స్ పెరల్స్ అండ్ జ్యువెల్స్ యజమానిని మోసం చేసిన ఆరోపణలపై ఇతడిని గోపాలపురం పోలీసులు మంగళవారం అరెస్టు చేసిన విషయం విదితమే. ‘డు నాట్ డిస్ట్రబ్’ అంటూ... పోర్ట్ బ్లేయర్లోని ఎంజీ రోడ్ ప్రాంతానికి చెందిన శర్థక్ రావు బబ్రాస్ ఉద్యోగం కోసం ముంబై వచ్చి నేరగాడిగా మారాడు. 2002 నుంచి వరుస పెట్టి అనేక స్టార్ హోటళ్లకు టోకరాలు వేస్తూ వచ్చాడు. విమానాల్లో తిరుగుతూ స్టార్ హోటళ్ళకు వెళ్లే ఇతగాడు కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారిగా పరిచయం చేసుకుంటాడు. బోగస్ ధ్రువపత్రాలు ఇచ్చి గదిలో దిగుతాడు. కనీసం వారు రోజుల పాటు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా బస చేస్తాడు. ఎవరైనా అడిగితే... తాను విమానంలో వచ్చానని, తన సహాయకులు రైలు లేదా రోడ్డు మార్గంలో వస్తున్నారని, నగదుతో పాటు లగేజ్ వారి వద్దే ఉండిపోయిందని చెప్పి కాలం గడుపుతాడు. హోటల్ సిబ్బంది నుంచి ఒత్తిడి పెరుగుతోందని భావిస్తే తన గది బయట ‘డు నాట్ డిస్ట్రబ్’ బోర్డు తగిలిస్తాడు. సదరు కస్టమర్లను నేరుగా, ఫోన్ ద్వారా కూడా డిస్ట్రబ్ చేయకపోవడం హోటళ్ల పాలసీ కావడం ఇతడికి కలిసి వచ్చింది. ఆపై అదును చూసుకుని ఆ హోటల్ ట్రావెల్ డెస్క్ నుంచే టిక్కెట్ బుక్ చేయించుకుని ఉడాయిస్తాడు. ఈ పంథాలో 2002 నుంచి 2012 వరకు గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో నేరాలు చేసినా పోలీసులకు చిక్కలేదు. బెడిసికొట్టిన ‘కంఫర్ట్ ఇన్’ ప్రయత్నం.. ఇలా పదేళ్ల పాటు రెచ్చిపోయిన శర్థక్ అసలు పేరు ఏమిటో, ఎక్కడి నుంచి వచ్చాడో కూడా ఏ పోలీసులకూ తెలియలేదు. 2012లో ఢిల్లీలోని కంఫర్ట్ ఇన్‌లో దిగిన అతను కేంద్ర ప్రభుత్వంలో జాయింట్ సెక్రటరీ హోదా అధికారినని, తన పేరు లోహానీగా చెప్పుకున్నాడు. తన వారు వస్తారనే, డు నాట్ డిస్ట్రబ్ అని బోర్డు పెట్టే ప్రయత్నాలన్నీ ముగిసే సరికి హోటల్ యాజమాన్యానికి అనుమానం వచ్చింది. దీంతో హోటల్ రూమ్ నుంచి అతడు ఎక్కడెక్కడికి కాల్స్ చేశాడో ఆరా తీయగా, ముంబై, భోపాల్, కోల్‌కతాలతో పాటు పోర్ట్ బ్లేయర్కూ కాల్స్ ఉన్నట్లు గుర్తించారు. దీంతో కోల్‌కతాకు చెందిన ఓ నెంబర్‌ను సంప్రదించగా... అతడు ట్రావెల్ ఏజెంట్‌గా తేలింది. లోహానీ తనకూ డబ్బు ఇవ్వాలని వారు చెప్పడంతో వీరి అనుమానాలు బలపడ్డాయి. దీంతో డబ్బు చెల్లిస్తే తప్ప హోటల్ రూమ్ వదిలి వెళ్లనివ్వమని నిర్భంధించారు. ఆర్మీలోని మద్రాస్ రెజిమెంట్‌లో పని చేస్తున్న తన స్నేహితులు అమిత్, వినీత్ వస్తున్నారని.. వారే డబ్బు కడతారన్నా హోటల్ యాజమాన్యం బయటకు వెళ్ళేందుకు అంగీకరించలేదు. గుట్టు విప్పిన శర్థక్ భార్య కవిత.. హోటల్ బకాయిలు పెరిగిపోవడంతో సిబ్బంది లోహానీగా చెప్పుకున్న శర్థక్ సెల్‌ఫోన్ లాక్కున్నారు. అందులో అతడు కాల్స్ చేసిన నెంబర్లు పరిశీలించగా... ఓ నెంబర్‌తో ఎక్కువగా మాట్లాడినట్లు గుర్తించారు. హోటల్ యాజమాన్యం సైతం ఆ నెంబర్‌కు ఫోన్ చేయడంతో కవిత అనే మహిళ మాట్లాడారు. ఈ ఫోన్ నెంబర్ తన మాజీ భర్తదని, అతడు పచ్చి మోసగాడని, అందుకే వదిలేసి దూరంగా ఉంటున్నట్లు తెలిపింది. అతడి పేరు శర్థక్ రావు బబ్రాస్గా వెల్లడించింది. దీన్ని నిరూపించడం కోసం కొన్ని సర్టిఫికెట్లు సైతం హోటల్‌కు ఫ్యాక్స్ చేసింది. దీంతో హోటల్ సిబ్బంది అతడిని ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. విచారణ నేపథ్యంలో అప్పటికే దాదాపు పదేళ్ళుగా తాను న్యూ ఢిల్లీలోని ఓబెరాయ్, రాడిస్సన్, మౌర్య షెరిటాన్, హయత్ రీజెన్సీ, సెంచూరీ, కోల్‌కతాలోని తాజ్ బెంగాల్, నోయిడాలోని హోటల్ ఫార్చూన్, లక్నోలోని తాజ్ హోటల్ తదితర చోట్ల బస చేసి మోసాలు చేసినట్లు బయటపెట్టాడు. తాజాగా శర్థక్ను అరెస్టు చేసిన గోపాలపురం పోలీసుల ఇతడిపై ఆయా నగరాల్లో నా న్–బెయిలబుల్ వారెంట్లు జారీ అయి ఉం టాయని అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్ని నగరాలకు సమాచారం ఇవ్వాలని నిర్ణయించారు. -
జిల్లాలో కేసులు పెరిగాయి
బుట్టాయగూడెం: జిల్లాలో భూ సమస్యలు, కుటుంబ తగాదాలు, చీటింగ్ కేసులు పెరిగాయని జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్ అన్నారు. శనివారం ఆయన బుట్టాయగూడెం పోలీస్‌స్టేషషన్‌ను సందర్శించారు. స్టేషషన్లో నమోదైన కేసులు, సిబ్బంది వివరాలను ఎస్సై డి.రవికుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ప్రజలకు మరింత సేవలు అందించాలన్న ఉద్దేశంతో వచ్చే ఏడాది నుంచి ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ తరహాల్లో కమ్యూనిటీ పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ప్ర ణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతంలో భూ సమస్యలు ఓరకంగా ఉంటే జిల్లాలో మరికొన్ని చోట్ల మరోరకమైన సమస్యలతో కేసులు నమోదవుతున్నాయన్నారు. సరిహద్దు తగాదాలు ఎక్కువగా వస్తున్నాయని చెప్పారు. గతంలో గ్రామాల్లో పంచాయతీలు జరిగేవని, అక్కడే చిన్నపాటి సమస్యలు పరిష్కారం కాగా ఇప్పుడు అవికూడా పోలీస్‌స్టేషన్‌న్లకు రావడంతో కేసులు పెరుగుతున్నాయన్నారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలు, హత్యానేరాల సంఖ్య తగ్గిందన్నారు. గతేడాది 62 హత్యకేసులు నమోదు కాగా ఈ ఏడాది 43 కేసులు మాత్రమే నమోదయ్యాయని పేర్కొన్నారు.జిల్లాలో నేర పరిశోధన రేటు కూడా బాగా పెరిగిందన్నారు. జిల్లాకు రెండు ఏబీసీడీ అవార్డులు రావడమే ఇందుకు నిదర్శమన్నారు. ఏజెన్సీలో భూ సమస్యలకు సంబంధించి పోలీసుల ప్రమేయం ఏమీ ఉండదన్నారు. సమస్య వచ్చినప్పుడు స్థానిక తహసీల్దార్, ఆర్డీవో సమక్షంలో బాధితులు పరిష్కరించుకోవాలని సూచించారు. భూములకు సంబంధించి రెవెన్యూ అధికారులు ప్రొటెక్షన్ ఇస్తే అప్పుడు భూ యజమానికి పోలీసులురక్షణ కల్పిస్తారన్నారు. పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు లేవని చెప్పారు. జిల్లాలో నెలకు రెండు,మూడు సార్లు కూంబింగ్ జరిపిస్తున్నామని పేర్కొన్నారు. -
పంచభూతాలనూ వదలకుండా తినేస్తున్నారు!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన రెండేళ్ల పాలనా కాలంలో ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. మహానాడు ఆత్మస్తుతి పరనిందే లక్ష్యంగా మారిందన్నారు. చంద్రబాబు పంచభూతాలను కూడా వదలకుండా తినేస్తున్నారని బొత్స ఎద్దేవా చేశారు. హామీలు నెరవేర్చని చంద్రబాబుపై జూన్ 2వ తేదీన చీటింగ్ కేసులు పెట్టాలని నిర్ణయించామన్నారు. ఆరోజున అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో సభలు, సమావేశాలు నిర్వహిస్తామన్నారు. సమావేశాల అనంతరం చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ అన్ని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తామన్నారు. అమరావతి అమరేశ్వరుని భూముల కొనుగోలుపై తక్షణమే విచారణ జరపించాలని బొత్స డిమాండ్ చేశారు. భూముల క్రయ, విక్రయాల ఒప్పందాలను వెంటనే రద్దు చేయాలన్నారు. లోకేశ్ కనుసన్నల్లోనే వెయ్యికోట్ల దోపిడీ జరిగిందన్నారు. దేవుడి భూముల్ని కూడా వదిలి పెట్టకుండా దోచుకుంటున్న ఘనత టీడీపీ నేతలదన్నారు. టీడీపీ నేతల దోపిడీని రాష్ట్ర ప్రజలంతా గమనించాలన్నారు. -
కొత్త అంశాలు తెరపైకి..
► ముస్కు మహేందర్‌రెడ్డి, పయ్యావుల కేశవ్‌పై గతంలోనే చీటింగ్ కేసులు ► కాంతం స్వప్న ఎవరో నాకు తెలియదన్న ఏఎస్సై మోహన్‌రెడ్డి ► ఆధారాలపై ఇంటెలిజెన్స్ ఆరా! కరీంనగర్ క్రైం : ఏఎస్సై మోహన్‌రెడ్డి ఉదంతంలో కొత్త అంశాలు తెరపైకి వస్తున్నాయి. నాలుగు నెలల అనంతరం మోహన్‌రెడ్డి గురువారం మీడియా ముందుకు రావడం... ఇన్నాళ్లూ బాధితులుగా పేర్కొంటున్నవారు ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నారని పోలీసులు దృష్టి సారించాలని మోహన్‌రెడ్డి పలు ఆధారాలు చూపడం సంచలనం సృష్టించింది. తనపై నమోదైన పలు కేసుల్లో బాధితులు, ఫిర్యాదు చేసినవారు ఎవరో కూడా తనకు తెలియదని ఆయన పేర్కొనడం గమనార్హం. అన్ని విషయాలపై ఇంటెలిజెన్స్, స్పెషల్‌బ్రాంచ్ వర్గాలు ఆరా తీస్తున్నట్లు సమాచారం. ► మోహన్‌రెడ్డి వెల్లడించిన అంశాల్లో బాధితుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా చెప్పుకుంటున్న ముస్కు మహేందర్‌రెడ్డి తన కుటుంబానికి చెందిన భూమికి నాటి మార్కెట్ ధర కన్నా ఎక్కువగా రూ.43 లక్షలు అప్పుగా తీసుకుని రెండేళ్లపాటు చెల్లించకపోతే వారి కుటుంబసభ్యులు వచ్చి భూమిని అమ్మిపెట్టమని అడిగారని, అప్పటి మార్కెట్ ధర చెల్లించి తన తండ్రి ఆదిరెడ్డి కొనుగోలు చేశారని తెలిపారు. మహేందర్‌రెడ్డి మాత్రం తాను రూ.5 లక్షలు మాత్రమే అప్పు తీసుకున్నానని పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేశాడని మోహన్‌రెడ్డి ఆరోపించారు. దీంతోపాటు మహేందర్‌రెడ్డిపై హుస్నాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఆగస్టు 27న ఫోర్జరీ కేసు, క్రైం నంబర్ 212/2015 నమోదైందని తెలిపారు. అక్రమంగా భూమిని దున్నినందుకు కోహెడ పోలీస్స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. ► కరీంనగర్‌వాసి పయ్యాల పెద్దిరెడ్డి ఇంతకు ముందు చైతన్యపురికాలనీకి చెందిన భీమనాథుని అనురాధ అనే మహిళకు మొదట భూమి విక్రయించాడని, తర్వాత ధర పెరగగానే తప్పుడు పత్రాలు సృష్టించి ఇబ్బందులు పెడుతున్నాడంటూ బాధితురాలు ఫిర్యాదు చేయడంతో 2012 ఆగస్టు 21న కరీంనగర్ టూటౌన్లో కేసు నమోదైందని, లోక్‌సత్తా నాయకుడినని చెప్పుకుంటూ తన నుంచి డబ్బులు వసూలు చేయడానికే ఈ ధర్నాలు చేస్తున్నాడని మోహన్‌రెడ్డి ఆరోపించడం చర్చనీయాంశమైంది. ► బోగ లక్ష్మి సైతం తనపై తప్పుడు ఫిర్యాదు చేసిందని, మొదట భూమి వేరేవారికి విక్రయంచి, రెండు నెలలు గడవకుండానే తన తండ్రికి విక్రయించిందని, దీంతో మొదట కొన్న వ్యక్తి ఆమెతోపాటు తన తండ్రిపైనా కేసు వేశాడని, జగిత్యాలలో ఇంకా నడుస్తోందని మోహన్‌రెడ్డి ఆధారాలు చూపించారు. లక్ష్మి గతంలో సీఎం, డీజీపీ, సీఐడీ అధికారులకు సైతం ఫిర్యాదు చేయగా, పోలీసులు విచారించి నిబంధనల ప్రకారమే కొనుగోలు చేశారని క్లీన్చిట్ ఇచ్చినట్లు అతడు వెల్లడించగా, నిజానిజాలపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. ► తనపై ఫిర్యాదు చేసిన కాంత స్వప్న ఎవరో కూడా తనకు తెలియదని, ఆమె 2015 ఆగస్టు 31న పలువురిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిందని, తాను అరెస్టు కాగానే అందులోంచి ఒకరిని తన బినామీగా పేర్కొంటూ మళ్లీ కొత్తగా ఫిర్యాదు చేసిందని, ఆమె ఎవరో కూడా తనకు తెలియదని మోహన్‌రెడ్డి పలుమార్లు పేర్కొనడంతో పోలీసులు ఈ వ్యవహారంపై విచారణ ప్రారంభించారని సమాచారం. ఎస్బీ ఆరా! తనపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని, ఎలాంటి విచారణకైనా సిద్ధమని మోహన్‌రెడ్డి మీడియా ముఖంగా పేర్కొనడంతో ఈ ఉదంతంపై ఎస్బీ, ఇంటెలిజెన్స్ అధికారులు విచారణ ప్రారంభించినట్లు సమాచారం. మీడియా సమావేశంలో ఆయన పలు డాక్యుమెంట్లతో ఆధారాలు చూపించగా, వాటిపైనా విచారణ చేస్తున్నారని తెలిసింది. ఇప్పటికే ఆయా ప్రాంతాల నుంచి వివరాలు సేకరించినట్లు సమాచారం. మొత్తానికి బాధితులుగా చెప్పుకుంటున్న పలువురిపై మీడియా ముఖంగా మోహన్‌రెడ్డి ఆరోపణలు చేయడం సంచలనం సృష్టించగా, విచారణలో ఏం వెలుగుచూస్తుందోనని ఉత్కంఠగా మారింది. స్వాగతించిన లోక్‌సత్తా కరీంనగర్ క్రైం : న్యాయవ్యవస్థపై తనకు నమ్మకం ఉందని, ఎలాంటి విచారణకైనా సిద్ధమని ఏఎస్సై మోహన్‌రెడ్డి చేసిన ప్రకటనను లోక్‌సత్తా ఉద్యమ సంస్థ స్వాగతించింది. నిజానిజాలు తేల్చేందుకు రెండు మూడు తేదీలను తెలియజేస్తే బాధితులను కూడా సమావేశ పరుస్తామని లోక్‌సత్తా బాధ్యులు ఒక ప్రకటనలో తెలిపారు. -
టీడీపీ నేతపై చీటింగ్ కేసులు
- ఊట్ల నాగేశ్వరరావుపై ఆరోపణల వెల్లువ - అమాయకుల్ని మోసగించి కోట్ల రూపాయలు కైంకర్యం సాక్షి, విజయవాడ : జగ్గయ్యపేట మండలం పెనుగంచిప్రోలు మండలానికి చెందిన తెలుగుదేశం నాయకుడు ఊట్ల నాగేశ్వరరావు ఆర్థిక మోసాలకు పాల్పడినట్లు పలు ఆరోపణలు వస్తున్నాయి. పొలాలు, ఇళ్ల స్థలాలు విక్రయిస్తామంటూ నమ్మబలికి లక్షలాది రూపాయలు వసూలుచేసినట్లు బాధితులు చెబుతున్నారు. పెనుగంచిప్రోలు పోలీసుస్టేషన్లో ఇప్పటికే ఊట్లపై ఒక కేసు నమోదు కాగా మరొకరు ఫిర్యాదుచేశారు. ఊట్ల మోసాల చిట్టా ఊట్ల నాగేశ్వరరావు ఆయన కుమారుడు ఊట్ల గోపీచంద్, కుమార్తె దండెం సుభాషిణి, జెడ్పీ మాజీ సభ్యుడు గజ్జి కృష్ణమూర్తి రూ.60 లక్షలకు మోసం చేశారంటూ వారిపై కొందరు ఫిర్యాదుచేయగా పెనుగంచిప్రోలు పోలీసులు కేసు నమోదు చేశారు. నాగేశ్వరరావు తన కుమార్తె, కుమారుడు పేర్లతో సిరంగి ధనమ్మ నుంచి 1.26 ఎకరాల భూమిని 2010లో కొన్నారు. దీనిని ఖమ్మంలోని ఏలూరు వెంకటేశ్వర్లుకు 2011 నవంబర్ 28న రూ.99.44లక్షలకు విక్రయించేందుకు సిద్ధమై స్టాంపు వెండర్ కూడా అయిన గజ్జి కృష్ణమూర్తి సహకారంతో రూ.60లక్షలు అడ్వాన్స్‌గా తీసుకుని అగ్రిమెంట్ రాసుకున్నారు. ఆ తరువాత మిగిలిన సొమ్ము చెల్లించి భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు వెంకటేశ్వర్లు పలుమార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో వెంకటేశ్వర్లు నందిగామ డీఎస్పీకి ఫిర్యాదు చేయగా నిందితులపై క్రైం నం: 43/15 కేసు నమోదుచేశారు. మరో వ్యవహారంలో విజయవాడ గుణదలలోని తమ వెంచర్‌లోని పది సెంట్లు విక్రయించేందుకు రూ.10.50 లక్షలతో ఊట్ల ఒప్పందం కుదుర్చుకుని 2013 జూన్‌లో రూ.10లక్షలు అడ్వాన్స్‌గా తీసుకున్నాడని మన్నే పద్మజ ‘సాక్షి’కి తెలిపారు. ఆ తర్వాత తాను ఎన్నిసార్లు కోరినా అగ్రిమెంట్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేయలేదు. వెకేషన్ కోర్టుకు వెళ్లగా ఇంజంక్షన్ ఆర్డరు ఇచ్చారన్నారు. గత వారం పెనుగంచిప్రోలు పోలీసుస్టేషన్లో ఫిర్యాదుచేశానన్నారు. నాగేశ్వరరావు, ఆయన కుటుంబసభ్యులు హైదరాబాద్ ఎస్‌ఆర్‌నగర్‌కు చెందిన రమణమ్మ వద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం రూ.9లక్షలు తీసుకుని రెండు లక్షలు మాత్రమే ఇచ్చారు. మిగిలిన ఏడు లక్షలు ఇవ్వకపోవడంతో ఆమె కోర్టుకు వెళ్లారు. మరో సంఘటనలో హుజూర్‌నగర్‌కు చెందిన రవి అనే స్టాఫ్‌వేర్ ఉద్యోగి వద్ద నాగేశ్వరరావు కుమారుడు ఇళ్ల స్థలాలు విక్రయిస్తామని చెబుతూ రూ.40లక్షలు తీసుకుని చెల్లించకపోతే రవి చెక్ బౌన్స్ కేసు వేశారు. కాగా తనపై రాజకీయ దురుద్దేశంతో కేసులు పెట్టిస్తున్నారని నాగేశ్వరరావు ‘సాక్షి’కి చెప్పారు. వెంకటేశ్వర్లు ఇచ్చిన ఫిర్యాదులో తాను యాంటిసిపేటరీ బెయిల్ తీసుకున్నానన్నారు. రమణమ్మ కేసును పెద్దల సమక్షంలో పరిష్కరిస్తున్నామని తెలిపారు. యాంటిసిపేటరీ బెయిల్ తీసుకున్నాడు : సతీష్, ఎస్ఐ ఏలూరు వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు ఊట్ల నాగేశ్వరరావుపై కేసు నమోదు చేశాం. ఆయన యాంటిసిపేటరీ బెయిల్ తీసుకున్నారు. మన్నె పద్మజ ఇప్పటికే కోర్టుకు వెళ్లినందున నాగేశ్వరరావును, ఆయన కుటుంబసభ్యులు అరెస్టు చేయలేకపోతున్నాం. -
మాయలోడు..
- ఈ నెల 5న ఔటర్‌పై ప్రమాదంలో మృతి చెందిన వెంకటరావు - పలు జిల్లాల్లో చీటింగ్ కేసులు - మృతుడు ప్రకాశం జిల్లా వాసి శంషాబాద్ రూరల్: జల్సాలకు అలవాటు పడి భార్యా, పిల్లలను వదిలేశాడు.. పేద కుటుంబాలకు చెందిన అమ్మాయిలను మాయమాటలతో వలలో వేసుకోవడం.. కొన్ని నెలలు వారితో సంసారం చేసి వదిలేయడం.. అంతేకాదు డబ్బున్న వారితో పరిచయాలు పెంచుకుని వారిని మోసం చేయడం అతని ప్రవృత్తి.. షిరిడీలో దైవ దర్శనం చేసుకుని వస్తూ మండల పరిధిలో ఔటర్ రింగు రోడ్డుపై ఈ నెల 5న తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన అతని పూర్తి వివరాలను శంషాబాద్ పోలీసులు మంగళవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. సీఐ ఉమామహేశ్వర్రావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ప్రకాశం జిల్లా కొండేపి మండలం దాసరిపాలెంకు చెందిన గుడిపాటి వెంకటరావు(36) అలియాస్ చంద్రశేఖర్‌రెడ్డి అలియాస్ చందుకు 18 ఏళ్ల కిందట తన అక్క రమణమ్మ కూతురు మంగమ్మతో వివాహం జరిగింది. ఇతనికి ఇద్దరు కుమారులు. జులాయిగా తిరుగుతూ కుటుంబాన్ని పట్టించుకునేవాడు కాదు. ఈ క్రమంలో 11 ఏళ్ల కిందట భార్యా,పిల్లలను వదిలేసి వచ్చాడు. జల్సాలకు అలవాటు పడిన వెంకట్రావు డబ్బున్న వారితో పరిచయాలు పెంచుకోవడం, వ్యాపారంలో భాగస్వాములు కావాలని చెప్పి వారి నుంచి డబ్బులు కాజేయడం హాబీగా పెట్టుకున్నాడు. అవసరమైతే బెదిరింపులకు పాల్పడేవాడు. అంతేకాదు పేదింటి యువతులను మాయ మాటలతో తన వలలో వేసుకునేవాడు. యువతుల కుటుంబాలను తీర్థ యాత్రలకు తీసుకువెళ్లి మంచి అభిప్రాయం కలిగేలా ప్రవర్తించేవాడు. ఒకరి తర్వాత మరొకరిని వివాహం చేసుకుని, కొన్నాళ్లు సంసారం చేసేవాడు. ఇలా యువతులను వంచించడం, డబ్బుల కోసం మోసం చేయడం, వంటి 10 కేసుల్లో వెంకట్రావు నిందితుడు. కడప జైలు నుంచి కోర్టుకు తీసుకువెళ్తున్న సమయంలో పోలీసులను బురిడీ కొట్టించి తప్పించుకున్న ఘనుడు. ఈ ఘటనలో నలుగురు ఆర్ముడు రిజర్వు కానిస్టేబుళ్లు సస్పెండ్ అయ్యారు కూడా. ఒంగోలు, రాజమండ్రి, తిరుపతి, కడప, గుంటూరు ప్రాంతాల్లో ఇతనిపై కేసులు ఉన్నాయి. 2005లో ఒంగోలులో మొదటి సారి ఇతనిపై చీటింగ్ కేసు నమోదయింది. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన సంజీవ రావు, తులసి దంపతులతో పరిచయం చేసుకున్నాడు. ఈ ఏడాది సెప్టెంబరు 18న వారిని బెదిరించి బంగారు నగలు,స్విఫ్ట్ కారు ఏపీ 04- ఏఆర్ 9015( ఔటర్‌పై ప్రమాదానికి గురైన కారు)ను లాక్కున్నాడు. దీనిపై రాజమండ్రిలో కేసునమోదైంది. ఇదిలా ఉండగా మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఓ యువతి మల్కాజిగిరిలోని హోమ్‌కేర్‌లో పనిచేస్తోంది. ఆమెను వివాహం చేసుకుంటానని నమ్మించాడు. తిరుపతమ్మ ఆలయం సమీపంలోని ఉపాధ్యాయుడు నాగేశ్వరరావుకు చెందిన గదిని అద్దెకు తీసుకున్నాడు. నాగేశ్వరరావుతో పరిచయం పెంచుకున్నాడు. సంజీవరావు నుంచి లాక్కున్న కారు నంబరును ఏపీ 20-ఏఆర్ 5959గా మార్చాడు. నాగేశ్వర్రావు కుటుంబ సభ్యులతోపాటు, తనతో ఉండే యువతిని తీసుకుని 2న షిరిడీకి వెళ్లాడు. తిరిగి వస్తూ ఈ నెల 5వ తేదీ పెద్ద గోల్కొండ వద్ద జరిగిన ప్రమాదంలో వెంకటరావు మృతి చెందాడు. మృతదేహాన్ని బంధువులకు అప్పగించిన శంషాబాద్పోలీసులు కేసు దర్యాప్తు చేశారు. దర్యాప్తులో మృతుడికి సంబంధించి పలు ఆసక్తి కరమైన అంశాలు వెలుగుచూశాయి. ఈ కేసు ఛేదనలో కృషి చేసిన ఎస్ఐ శివకుమార్, సిబ్బందిని సీఐ అభినందించారు. -
సర్కారీ స్కూళ్ల హవా
- సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల - 99.6 శాతం మార్కులతో టాప్ ర్యాంక్ సాధించిన ఢిల్లీ విద్యార్థి సార్థక్ అగర్వాల్ సాక్షి, న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) పన్నెండో తరగతి ఫలితాల్లో ఢిల్లీ సర్కారీ పాఠశాలలు అద్భుత ప్రదర్శన కనబరిచాయి. దేశంలోని మిగతా సీబీఎస్ఈ అనుబంధ సంస్థల కంటే నగరంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మంచి మార్కులతో ప్రభంజనం సృష్టించారు. గురువారం విడుదల చేసిన పన్నెండో తరగతి ఫలితాల్లో 88.78 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. గతేడాది 88.62 శాతం మంది పాస్ అయ్యారని సీబీఎస్ఈ తెలిపింది. గతేడాది 85.17 శాతం ఉత్తీర్ణత సాధించిన ఢిల్లీ ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు ఈసారి 86.66 శాతంతో ప్రభంజనం సృష్టించాయి. ఇదే తరహాలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని కేంద్రీయ విద్యాలయ సంస్థల్లో ఉత్తీర్ణత శాతం 97.56 నుంచి 98.02 శాతానికి పెరిగింది. ఇదిలావుండగా జవహర్ నవోదయ విద్యాలయాల్లో గతేడాది 97.06 శాతం ఉన్న ఉత్తీర్ణత ఈసారి 93.94కి పడిపోయింది. కాగా, ఢిల్లీ ప్రాంతంలో సైన్స్ విద్యార్థులలో డీపీఎస్ వసంత్ కుంజ్‌కు చెందిన సార్థక్ అగర్వాల్ అగ్రస్థానంలో నిలిచాడు. అతనికి 99.6 శాతం మార్కులు వచ్చాయి. కామర్స్ విభాగంలో డీపీఎస్ ఆర్కే పురం విద్యార్థిని వ్రుందా 98.4 శాతం మార్కులతో మొదటి స్థానం సాధించింది. బాలికలదే పైచేయి సీబీఎస్ఈ పన్నెండో తరగతి పరీక్ష ఫలితాల్లో బాలికల హవా కొనసాగింది. బాలుర కన్నా పది శాతం ఎక్కువ మంది ఉత్తీర్ణత సాధించారు. 91.72 శాతం మంది బాలికలు, 82.09 శాతం మంది బాలురు ఉత్తీర్ణులయ్యారు. గతేడాది కూడా 91.42 శాతంతో బాలికలు, 82.44 శాతంతో బాలురు ఉత్తీర్ణత సాధించిన సంగతి తెలిసిందే. ఈసారి దేశంలోనే టాప్ ర్యాంకర్‌గా నిలిచినట్టు భావిస్తున్న సర్థాక్ అగర్వాల్ మాట్లాడుతూ తాను ఎలాంటి ట్యూషన్‌కు వెళ్లలేదని, పరీక్షలకు ముందు చదువుపైనే ఎక్కువ ఏకాగ్రత సాధించానని తెలిపాడు. సెంట్రల్ ఢిల్లీలోని ఎయిర్ ఫోర్స్ బాల్ భారతి పాఠశాల విద్యార్థి జి.హరికృష్ణ కామర్స్ విభాగంలో 99.2 శాతంతో మొదటి స్థానంలో నిలిచాడు. డీపీఎస్ ఇంద్రాపుర విద్యార్థి ముగ్ధ్ సేథియా, వసంత్ వాలీ పాఠశాలకు చెందిన వసుధా దీక్షిత్ హ్యుమనీటిస్ విభాగంలో 98.8 శాతంతో టాపర్లుగా నిలిచారు. చీటింగ్ కేసులు నమోదు సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలకు సంబంధించి దేశవ్యాప్తంగా చూస్తే ఢిల్లీలోనే అత్యధికంగా చీటింగ్ కేసులు నమోదయ్యాయి. గతేడాదితో పొల్చుకుంటే మాస్ కాపీరాయుళ్ల సంఖ్య తగ్గింది. గతేడాది 25 కేసులు నమోదు కాగా, ఈసారి వాటి సంఖ్య 13కి తగ్గిందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ఏడు కేసులతో పాట్నా రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో భువనేశ్వర్, డెహ్రాడూన్, పంచ్‌కుల, గౌహతి, చెన్నై, అలహాబాద్‌లు ఉన్నాయి. కేజ్రీవాల్ కుమార్తెకు 96 శాతం మార్కులు న్యూఢిల్లీ: సీబీఎస్ఈ పన్నెండో తరగతి పరీక్షలో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కుమార్తె హర్షిత 96 శాతం మార్కులు సాధించింది. ‘ నా తల్లిదండ్రులే నాకు ఆదర్శప్రాయులు. ఐఐటీలో ఏదో ఒక కోర్సును చేయాలనుకుంటున్నా. ప్రస్తుతం నా ముందున్న లక్ష్యం ఐఐటీలో అడ్మిషన్ సంపాదించడమే’నని సైన్స్ విభాగ విద్యార్థిని అయిన హర్షిత తెలిపింది. -
చీటింగ్ రాజాకుబాబు టికెట్!
ఇళ్ల ప్లాట్లకు డబ్బులు తీసుకుని ఎగనామం ఆక్రమించిన ప్రభుత్వ స్థలాలు, వివాదాస్పద స్థలాల్లో ప్లాట్లు కొనుగోలుదారులు డబ్బులు ఇవ్వాలని నిలదీస్తే చెక్‌లు ఇచ్చిన వైనం ఆ చెక్కులన్నీ బౌన్స్ అవడంతో పోలీస్ కేసులు ఐశ్వర్య హోమ్స్ కంపెనీ పేరుతో మోసాలు లబోదిబోమంటున్న బాధితులు చంద్రబాబునాయుడు తేనెపూసిన కత్తి. ఎక్కువ మోసాలు చేసేవారికే పార్టీలో పెద్దపీట వేస్తుంటారు. గౌరవించి అందలం ఎక్కిస్తుంటారు. ఆపై ఏతప్పూ చేయలేదని బొంకుతుంటారు. ఎదుటివారిపై నిందలు వేసి ఆయనకు నచ్చిన పత్రికల్లో రాయించుకుంటుంటారు. తంబళ్లపల్లె అభ్యర్థి శంకర్ విషయంలోనూ అదే తీరును అవలంభించారు. ఇతనిపై 34 కేసులు ఉన్నాయని తెలిసినా వెనక్కు తగ్గలేదు. టికెట్ ఇచ్చి ప్రజలముందు నిలబెట్టారు. సాక్షి ప్రతినిధి, తిరుపతి: టీడీపీ తంబళ్లపల్లె అభ్యర్థి ఉల్లోల్ల శంకర్ యాదవ్‌పై 34 చీటింగ్ కేసులు ఉన్నాయి. ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసూ నమోదైంది. ఈ కేసులన్నీ 2010లోనే ఎక్కువగా నమోదయ్యాయి. అమెరికాలో ఉంటున్న ఎన్ఆర్ఐలనూ మోసం చేసినట్లు కేసులు నమోదయ్యాయి. ఎన్నికల అఫిడవిట్లో పొందుపరిచిన కేసుల్లో 34 బెంగళూరులో నమోదైనవే. ఈయన బెంగళూరులో నగరానికి అన్ని వైపులా నగర శివారు ప్రాంతాల్లో ప్లాట్లు వేసి, భూములను విక్రయించి రిజిస్ట్రేషన్లు చేయిస్తుంటారు. ఈ వ్యాపారంలో చాలామందిని మోసం చేసినట్లు కేసులు నమోదు కావడం విశేషం. ప్రభుత్వ భూములు, వివాదాల్లో ఉన్న భూములను స్వాధీనం చేసుకుని అభివృద్ధి పేరుతో అక్కడ స్వర్గలోకం ఉందని జనాన్ని నమ్మిస్తారు. ప్లాట్లు కొనుగోలు చేసిన తరువాత కానీ బాధలు అర్థం కావు. సకాలంలో రిజిస్ట్రేషన్లు చేయరు. రిజిస్ట్రేషన్లు చేసినా ఇవి చెల్లవని తర్వాత నోటీసులు వస్తాయి. దీంతో ప్లాట్ల కోసం డబ్బులు కట్టిన వారు ‘ఐశ్వర్య హోమ్స్’వారి చుట్టూ తిరగడం పరిపాటిగా మారింది. ఎక్కువ మంది ఎన్ఆర్ఐలు బెంగళూరులో ఇన్వెస్ట్మెంట్ చేసేందుకు సుముఖంగా ఉంటారు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నందున వారు బెంగళూరును ఎంపిక చేసుకుని అక్కడ ఉండేందుకు వీలుగా ప్లాట్లు కొనుగోలు చేస్తున్నారు. యూఎస్ఏకు చెందిన రఘురత్నం రెడ్డి, బెంగళూరుకు చెందిన రజీద్ చందాని, బిందు ఎస్.బత్తిజ, శ్రీచంద్ వద్యాని, మితోగుప్తా, కవితాచాబ్రియా ఇలా మొత్తం 33 మందికి శంకర్ చెక్కులు ఇచ్చారు. ఇవన్నీ బౌన్స్ అయ్యాయి. వారు అతనిపై కేసులు పెట్టారు. ఇక కేసులు పెట్టకుండా అతని చుట్టూ తిరిగేవారు ఇంకెంత మంది ఉంటారో తెలియని పరిస్థితి. బెంగళూరు నగరంలో సుమారు పది మంది ఏజెంట్లను పెట్టి వారి ద్వారా ప్లాట్లు బుక్ చేయిస్తుంటారు. వారికి ఫోన్ చేయగానే సార్... ఎటువైపు ప్లాట్ కావాలి. మా వన్నీ అప్రూవల్ ప్లాన్స్ సార్, బ్యాంకు రుణాలు కూడా ఇప్పిస్తామంటూ తియ్యగా మాట్లాడతారు. ప్లాట్లు కొనుగోలు చేసి వారి చేతుల్లో ఇరుక్కున్న తరువాత కానీ కొనుగోలుదారులకు పిక్చర్ అర్థం కాదు. 2010 సెప్టెంబర్ 17న బెంగళూరుకు చెందిన వినియోగదారుల రక్షణచట్టం కింద మరో కేసు నమోదైంది. ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని కేసులు ఈ సంస్థపై ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్లాట్ల కొనుగోలుదారులకు కోట్లలో ఎగనామం పెట్టారని పలువురు చెబుతున్నారు. ఎన్నికలప్పుడే కనిపించేది శంకర్ తంబళ్లపల్లె నియోకవర్గంలో కేవలం ఎన్నికల సమయంలోనే కనిపిస్తారు. గత ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా టికెట్ సంపాదించారు. తనకు ఓటేస్తే తంబళ్లపల్లెను స్వర్గదామం చేస్తానని జనం వద్దకు వెళుతున్నారు. ఇక్కడ కూడా మాయమాటలు చెప్పి మోసం చేయడనే గ్యారెంటీ ఏంటని పలువురు గుసగుసలాడుతున్నారు. ఇవన్నీ బాబుకు తెలియవా? తంబళ్లపల్లె టీడీపీ అభ్యర్థి శంకర్‌పై 35 కేసులు నమోదైనట్లు ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు తెలియదా? అంటే అవన్నీ ఎప్పుడో తెలుసునని కార్యకర్తలే చెబుతున్నారు. ఎన్నికల్లో డబ్బులు ఖర్చుపెట్టుకునే వ్యక్తులు కావాలి కాబట్టి శంకర్‌కు టికెట్ ఇచ్చారని వ్యాఖ్యానిస్తున్నారు.