చీటింగ్ రాజాకుబాబు టికెట్! | Cheating Raja Babu ticket! | Sakshi
Sakshi News home page

చీటింగ్ రాజాకుబాబు టికెట్!

Published Fri, Apr 25 2014 2:17 AM | Last Updated on Fri, Aug 10 2018 8:06 PM

చీటింగ్ రాజాకుబాబు టికెట్! - Sakshi

చీటింగ్ రాజాకుబాబు టికెట్!

  •      ఇళ్ల ప్లాట్లకు డబ్బులు తీసుకుని ఎగనామం
  •      ఆక్రమించిన ప్రభుత్వ స్థలాలు, వివాదాస్పద స్థలాల్లో ప్లాట్లు
  •      కొనుగోలుదారులు డబ్బులు ఇవ్వాలని నిలదీస్తే చెక్‌లు ఇచ్చిన వైనం
  •      ఆ చెక్కులన్నీ బౌన్స్ అవడంతో పోలీస్ కేసులు
  •      ఐశ్వర్య హోమ్స్ కంపెనీ పేరుతో మోసాలు
  •      లబోదిబోమంటున్న బాధితులు
  •  
    చంద్రబాబునాయుడు తేనెపూసిన కత్తి. ఎక్కువ మోసాలు చేసేవారికే పార్టీలో పెద్దపీట వేస్తుంటారు. గౌరవించి అందలం ఎక్కిస్తుంటారు. ఆపై ఏతప్పూ చేయలేదని బొంకుతుంటారు. ఎదుటివారిపై నిందలు వేసి ఆయనకు నచ్చిన పత్రికల్లో రాయించుకుంటుంటారు. తంబళ్లపల్లె అభ్యర్థి శంకర్ విషయంలోనూ అదే తీరును అవలంభించారు. ఇతనిపై 34 కేసులు ఉన్నాయని తెలిసినా వెనక్కు తగ్గలేదు. టికెట్ ఇచ్చి ప్రజలముందు నిలబెట్టారు.
     
    సాక్షి ప్రతినిధి, తిరుపతి: టీడీపీ తంబళ్లపల్లె అభ్యర్థి ఉల్లోల్ల శంకర్ యాదవ్‌పై 34 చీటింగ్ కేసులు ఉన్నాయి. ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసూ నమోదైంది. ఈ కేసులన్నీ 2010లోనే ఎక్కువగా నమోదయ్యాయి. అమెరికాలో ఉంటున్న ఎన్‌ఆర్‌ఐలనూ మోసం చేసినట్లు కేసులు నమోదయ్యాయి. ఎన్నికల అఫిడవిట్‌లో పొందుపరిచిన కేసుల్లో 34 బెంగళూరులో నమోదైనవే.

    ఈయన బెంగళూరులో నగరానికి అన్ని వైపులా నగర శివారు ప్రాంతాల్లో ప్లాట్లు వేసి, భూములను విక్రయించి రిజిస్ట్రేషన్లు చేయిస్తుంటారు. ఈ వ్యాపారంలో చాలామందిని మోసం చేసినట్లు కేసులు నమోదు కావడం విశేషం. ప్రభుత్వ భూములు, వివాదాల్లో ఉన్న భూములను స్వాధీనం చేసుకుని అభివృద్ధి పేరుతో అక్కడ స్వర్గలోకం ఉందని జనాన్ని నమ్మిస్తారు. ప్లాట్లు కొనుగోలు చేసిన తరువాత కానీ బాధలు అర్థం కావు. సకాలంలో రిజిస్ట్రేషన్లు చేయరు.

    రిజిస్ట్రేషన్లు చేసినా ఇవి చెల్లవని తర్వాత నోటీసులు వస్తాయి. దీంతో ప్లాట్ల కోసం డబ్బులు కట్టిన వారు ‘ఐశ్వర్య హోమ్స్’వారి చుట్టూ తిరగడం పరిపాటిగా మారింది. ఎక్కువ మంది ఎన్‌ఆర్‌ఐలు బెంగళూరులో ఇన్వెస్ట్‌మెంట్ చేసేందుకు సుముఖంగా ఉంటారు. సాఫ్ట్‌వేర్ రంగంలో ఉన్నందున వారు బెంగళూరును ఎంపిక చేసుకుని అక్కడ ఉండేందుకు వీలుగా ప్లాట్లు కొనుగోలు చేస్తున్నారు.

    యూఎస్‌ఏకు చెందిన రఘురత్నం రెడ్డి, బెంగళూరుకు చెందిన రజీద్ చందాని, బిందు ఎస్.బత్తిజ, శ్రీచంద్ వద్యాని, మితోగుప్తా, కవితాచాబ్రియా ఇలా మొత్తం 33 మందికి శంకర్ చెక్కులు ఇచ్చారు. ఇవన్నీ బౌన్స్ అయ్యాయి. వారు అతనిపై కేసులు పెట్టారు. ఇక కేసులు పెట్టకుండా అతని చుట్టూ తిరిగేవారు ఇంకెంత మంది ఉంటారో తెలియని పరిస్థితి. బెంగళూరు నగరంలో సుమారు పది మంది ఏజెంట్లను పెట్టి వారి ద్వారా ప్లాట్లు బుక్ చేయిస్తుంటారు. వారికి ఫోన్ చేయగానే సార్... ఎటువైపు ప్లాట్ కావాలి.

    మా వన్నీ అప్రూవల్ ప్లాన్స్ సార్, బ్యాంకు రుణాలు కూడా ఇప్పిస్తామంటూ తియ్యగా మాట్లాడతారు. ప్లాట్లు కొనుగోలు చేసి వారి చేతుల్లో ఇరుక్కున్న తరువాత కానీ కొనుగోలుదారులకు పిక్చర్ అర్థం కాదు. 2010 సెప్టెంబర్ 17న బెంగళూరుకు చెందిన వినియోగదారుల రక్షణచట్టం కింద మరో కేసు నమోదైంది. ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని కేసులు ఈ సంస్థపై ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్లాట్ల కొనుగోలుదారులకు కోట్లలో ఎగనామం పెట్టారని పలువురు చెబుతున్నారు.
     
    ఎన్నికలప్పుడే కనిపించేది

    శంకర్ తంబళ్లపల్లె నియోకవర్గంలో కేవలం ఎన్నికల సమయంలోనే కనిపిస్తారు. గత ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా టికెట్ సంపాదించారు. తనకు ఓటేస్తే తంబళ్లపల్లెను స్వర్గదామం చేస్తానని జనం వద్దకు వెళుతున్నారు. ఇక్కడ కూడా మాయమాటలు చెప్పి మోసం చేయడనే గ్యారెంటీ ఏంటని పలువురు గుసగుసలాడుతున్నారు.
     
    ఇవన్నీ బాబుకు తెలియవా?
     
    తంబళ్లపల్లె టీడీపీ అభ్యర్థి శంకర్‌పై 35 కేసులు నమోదైనట్లు ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు తెలియదా? అంటే అవన్నీ ఎప్పుడో తెలుసునని కార్యకర్తలే చెబుతున్నారు. ఎన్నికల్లో డబ్బులు ఖర్చుపెట్టుకునే వ్యక్తులు కావాలి కాబట్టి శంకర్‌కు టికెట్ ఇచ్చారని వ్యాఖ్యానిస్తున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement