Shankar Yadav
-
జై చంద్రారెడ్డి ప్రయాణిస్తున్న వాహనంపై రాళ్ల దాడి
-
అమ్మో.. శంకరా!
ఈయన పేరు శంకర్. చేసేవన్నీ వంకర పనులే. ఈయన వృత్తి వ్యాపారం. ప్రవృత్తి మోసాలు చేయ డం. భూ కబ్జాలు చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. అప్పులు చేయడం.. ఆ తరువాత ఎగ్గొట్టడం శంకర్‌కు నిత్యకృత్యం. బెంగళూరులో ఏకంగా కర్ణాటక ప్రభుత్వ భూములనే కబ్జా చేశారు. ఎస్సీ ఎస్టీ భూములను ఆధీనంలోకి తీసుకుని అమ్మేశారు. లేని భూమిని అమ్మేసి.. పక్క రాష్ట్రంలో రికార్డు సృష్టించా రు మాయదారి టీడీపీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్. సాక్షి, చిత్తూరు: తంబళ్లపల్లి ఎమ్మెల్యే శంకర్ యాదవ్ ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బెంగళూరులో క్రిమినల్, చీటింగ్ కేసులు నమోదైనా వాటిని అఫిడవిట్లో ప్రస్తావించలేదు. మదనపల్లె 1టౌన్ పరిధిలో కూడా కేసు ఉన్నా దాని ఊసే లేదు. కనీసం ఒక్క కేసు ప్రస్తావన లేకుండా అఫిడవిట్ ఎన్నికల సంఘానికి ఇచ్చారు. దీంతో ప్రతిపక్షాలు శంకర్‌పై న్యాయపోరాటానికి సిద్ధమయ్యాయి. ఎన్నికల సంఘాన్ని తప్పుదోవ పట్టిం చిన శంకర్ యాదవ్‌పై వేటు వేయాలని డిమాండ్ చేస్తున్నాయి. బెంగళూరులో వేలాది మందిని మోసం చేసిన మోసగాడని, అలాంటి వారికి ఎన్నికల్లో పోటీచేసే అర్హత లేదని నినదిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ పేరుతో ఘరానా మోసం శంకర్ యాదవ్‌పై బెంగళూరులో పదుల సంఖ్యలో క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. రియల్ ఎస్టేట్ పేరుతో వేలాది మందిని మోసం చేశారు. బెంగళూరులోని ఎస్సీ, ఎస్టీ స్థలాలను కబ్జా చేసి ప్లాట్లుగా విక్రయించారు. దీంతో దేవనహల్లి పోలీస్ స్టేషన్లో శంకర్ యాదవ్‌పై 2018 మార్చి 18వ తేదీన 1719/2018, 1720/2018 నంబర్లతో రెండు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఒక్కో ప్లాటు రూ.50 లక్షలకు 35 మందికి అమ్మారు. ప్లాట్లు స్వాధీనం చేసుకునే సమయంలో ఎస్సీ, ఎస్టీలు భూములు తమవని రావడంతో విషయం బయటికొచ్చింది. కొనుగోలు దారులు శంకర్‌యాదవ్‌కు ఎన్నిసార్లు ఫోన్లు చేసినా స్పందించలేదు. ఆఫీసు దగ్గరికి వెళ్లినా దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్నారు. శంకర్‌యాదవ్ బాధితులంతా గత సంవత్సరం మదనపల్లి ప్రెస్‌క్లబ్‌లో ప్రెస్‌మీట్ పెట్టి తూర్పారబట్టారు. దీంతో పాటు బెంగళూరులోని కన్సూమర్ ఫోరమ్‌లో 5 చీటింగ్ కేసులు నమోదయ్యాయి. కేసు నంబర్ 1352/17, 1354/17లపై థర్డ్ డిస్ట్రిక్ట్ కన్సూమర్ ఫోరమ్ శాంతినగర్ బ్రాంచ్‌లో మరో రెండు కేసులు పెట్టారు బాధితులు. శంకర్ ఘరానా దొంగ అని వారు విమర్శించారు. చెమటోడ్చి సంపాదించిన సొమ్ములను దొంగిలించారని వాపోయారు. మోసమే పెట్టుబడి శంకర్ యాదవ్ మొదట్లో పినాకిని డెవెలపర్స్ వద్ద అకౌంటెంట్‌గా జాయిన్ అయ్యారు. రెండు మూడు సంవత్సరాల తరువాత సొంతంగా ఐశ్వర్య బిల్డ్‌టెక్ పేరిట వ్యాపారం ప్రారంభించారు. మోసమే పెట్టుబడిగా అంచలంచెలుగా ఎదిగారు. భూమి కొనడం అభివృద్ధి చేసి.. ప్లాట్లుగా అమ్మడం అతని వ్యాపారం. అయితే శంకర్ యాదవ్ మాత్రం తనదికాని భూమిలో ప్లాట్లు వేయడం.. వినియోగదారులకు అమ్మడమే పని. పెద్ద ఎత్తున ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో ప్లాట్లు వేసి అమ్మి బెంగళూరులోని వందలాది మందిని ముంచేశారు. వారంతా ఒక శంకర్ బాధితుల సంఘంగా ఏర్పడి కోర్టుల్లో చీటింగ్ కేసులు పెట్టారు. పెద్ద ఎత్తున ఎస్సీ, ఎస్టీ భూములను స్వాహా చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. తప్పుడు అఫిడవిట్ శంకర్ యాదవ్ తనపై ఉన్న కేసులన్నీ దాచి ఎన్నికల అఫిడవిట్ ఎన్నికల సంఘానికి సమర్పించారు. ఇది ఇప్పుడు చర్చనీయాంశమైంది. పదుల సంఖ్యలో చీటింగ్ కేసులున్నా ఎన్నికల సంఘాన్ని తప్పుదోవ పట్టించారని శంకర్‌యాదవ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్ష పార్టీలు ఆర్వోకు ఫిర్యాదు చేశారు. అయితే తన పరిధిలోకి రాదని ఆర్వో బదులివ్వడంతో కోర్టుకు వెళ్లేందుకు వారు సిద్ధమయ్యారు. శంకర్ యాదవ్‌పై బెంగళూరులో ఉన్న కేసులు.. -
పోలీస్ ఇంట్లో దొంగల చేతివాటం
హైదరాబాద్ సిటీ: హైదరాబాద్ నగరంలో దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. ఏకంగా పోలీస్ ఇళ్లల్లోనే చోరీలు చేయటం మొదలుపెట్టారు. తాజాగా పేట్‌బషీరాబాద్ ఇన్స్పెక్టర్ శంకర్ యాదవ్ ఇంట్లో శుక్రవారం దొంగలు పడ్డారు. ఈ సంఘటన బోయినపల్లిలోని ఎస్బీఐ కాలనీలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ ఇంట్లో రూ.లక్ష నగదు, 8 తులాల బంగారం, 20 తులాల వెండి, 10 తూటాలు, ఒక రివాల్వర్‌ను దొంగిలించారు. ఇన్స్పెక్టర్ శంకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
యాదవుల సమస్యలు పరిష్కరిస్తా
తిరుపతి కల్చరల్: తెలుగుదేశం పార్టీ గెలుపులో భాగస్వాములైన యాదవుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి హామీ ఇచ్చారు. యాదవ ప్రముఖుడి విగ్రహాన్ని తిరుపతిలో ఏర్పాటు చేయిస్తానన్నారు. అలాగే యాదవుల భవన నిర్మాణానికి ఎకరా భూమిని ఇచ్చేందుకు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో ఆదివారం తిరుపతిలోని ఇందిరామైదానంలో యాదవ ప్రజాప్రతినిధుల సన్మాన సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ బీసీల ఓట్లతోనే రాష్ట్రంలో చంద్రబాబు సహా అందరూ గెలిచారన్నారు. బీసీలంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే బీసీ అని నిరూపించారని తెలిపారు. అనంతరం సన్మాన గ్రహీత తంబళ్లపల్లె ఎమ్మెల్యే శంకర్ యాదవ్ మాట్లాడుతూ యాదవుడైన తనకు చంద్రబాబు సీటు కల్పించడంతో బీసీల అండతో విజేతగా నేడు వేదికపై నిలబడ్డానన్నారు. గతంలో తనకు వైఎస్ఆర్ రాజకీయ అవకాశం కల్పించినా కొందరి కుట్ర కారణంగా స్వల్ప తేడాతో ఓటమి చవి చూడాల్సి వచ్చిందన్నారు. చిన్న రైతు కుటుంబం నుంచి వచ్చిన తాను జీవితంలో ఎదగాలనే లక్ష్యంతో సేవా ట్రస్ట్ ఏర్పాటు చేసి నిరుపేదలందరికీ సేవలు అందిస్తున్నానన్నారు. తన గెలుపునకు కృషి చేసిన బీసీలందరికీ అండగా ఉండి ఆదుకుంటానని భరోసా ఇచ్చారు. అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు అన్నారామచంద్రయ్య మాట్లాడుతూ స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత జిల్లాలో ఏకైక ఎమ్మెల్యేగా యాదవుల నుంచి శంకర్ గెలుపొందడం గర్వకారణమన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ యాదవుల సంక్షేమాన్ని గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. టీటీడీ బోర్డులో శాశ్వత సభ్యుడుగా యాదవుల్లో ఒకరికి అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు తిరుపతి మున్సిపాలిటీ కార్పొరేషన్ మేయర్ పదవి యాదవులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. అనంతరం తంబళ్లపల్లె ఎమ్మెల్యే శంకర్‌యాదవ్‌ను అతిథులతో పాటు యాదవ సంఘ నాయకులు పూలమాల లు, శాలువలు, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. జిల్లా వ్యాప్తంగా గెలుపొందిన జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, వార్డు సభ్యులను ఘనంగా సత్కరించారు. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిత్య, తిరుపతి ఎ మ్మెల్యే వెంకటరమణతో పాటు బీసీ, యాదవ నాయకులు నరసింహయాదవ్, అశోక్‌సామ్రాట్ యాదవ్, కృష్ణయ్య యాదవ్, పుష్పావతి, ఆనంద్ యాదవ్, అక్కినపల్లి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. -
చీటింగ్ రాజాకుబాబు టికెట్!
ఇళ్ల ప్లాట్లకు డబ్బులు తీసుకుని ఎగనామం ఆక్రమించిన ప్రభుత్వ స్థలాలు, వివాదాస్పద స్థలాల్లో ప్లాట్లు కొనుగోలుదారులు డబ్బులు ఇవ్వాలని నిలదీస్తే చెక్‌లు ఇచ్చిన వైనం ఆ చెక్కులన్నీ బౌన్స్ అవడంతో పోలీస్ కేసులు ఐశ్వర్య హోమ్స్ కంపెనీ పేరుతో మోసాలు లబోదిబోమంటున్న బాధితులు చంద్రబాబునాయుడు తేనెపూసిన కత్తి. ఎక్కువ మోసాలు చేసేవారికే పార్టీలో పెద్దపీట వేస్తుంటారు. గౌరవించి అందలం ఎక్కిస్తుంటారు. ఆపై ఏతప్పూ చేయలేదని బొంకుతుంటారు. ఎదుటివారిపై నిందలు వేసి ఆయనకు నచ్చిన పత్రికల్లో రాయించుకుంటుంటారు. తంబళ్లపల్లె అభ్యర్థి శంకర్ విషయంలోనూ అదే తీరును అవలంభించారు. ఇతనిపై 34 కేసులు ఉన్నాయని తెలిసినా వెనక్కు తగ్గలేదు. టికెట్ ఇచ్చి ప్రజలముందు నిలబెట్టారు. సాక్షి ప్రతినిధి, తిరుపతి: టీడీపీ తంబళ్లపల్లె అభ్యర్థి ఉల్లోల్ల శంకర్ యాదవ్‌పై 34 చీటింగ్ కేసులు ఉన్నాయి. ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసూ నమోదైంది. ఈ కేసులన్నీ 2010లోనే ఎక్కువగా నమోదయ్యాయి. అమెరికాలో ఉంటున్న ఎన్ఆర్ఐలనూ మోసం చేసినట్లు కేసులు నమోదయ్యాయి. ఎన్నికల అఫిడవిట్లో పొందుపరిచిన కేసుల్లో 34 బెంగళూరులో నమోదైనవే. ఈయన బెంగళూరులో నగరానికి అన్ని వైపులా నగర శివారు ప్రాంతాల్లో ప్లాట్లు వేసి, భూములను విక్రయించి రిజిస్ట్రేషన్లు చేయిస్తుంటారు. ఈ వ్యాపారంలో చాలామందిని మోసం చేసినట్లు కేసులు నమోదు కావడం విశేషం. ప్రభుత్వ భూములు, వివాదాల్లో ఉన్న భూములను స్వాధీనం చేసుకుని అభివృద్ధి పేరుతో అక్కడ స్వర్గలోకం ఉందని జనాన్ని నమ్మిస్తారు. ప్లాట్లు కొనుగోలు చేసిన తరువాత కానీ బాధలు అర్థం కావు. సకాలంలో రిజిస్ట్రేషన్లు చేయరు. రిజిస్ట్రేషన్లు చేసినా ఇవి చెల్లవని తర్వాత నోటీసులు వస్తాయి. దీంతో ప్లాట్ల కోసం డబ్బులు కట్టిన వారు ‘ఐశ్వర్య హోమ్స్’వారి చుట్టూ తిరగడం పరిపాటిగా మారింది. ఎక్కువ మంది ఎన్ఆర్ఐలు బెంగళూరులో ఇన్వెస్ట్మెంట్ చేసేందుకు సుముఖంగా ఉంటారు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నందున వారు బెంగళూరును ఎంపిక చేసుకుని అక్కడ ఉండేందుకు వీలుగా ప్లాట్లు కొనుగోలు చేస్తున్నారు. యూఎస్ఏకు చెందిన రఘురత్నం రెడ్డి, బెంగళూరుకు చెందిన రజీద్ చందాని, బిందు ఎస్.బత్తిజ, శ్రీచంద్ వద్యాని, మితోగుప్తా, కవితాచాబ్రియా ఇలా మొత్తం 33 మందికి శంకర్ చెక్కులు ఇచ్చారు. ఇవన్నీ బౌన్స్ అయ్యాయి. వారు అతనిపై కేసులు పెట్టారు. ఇక కేసులు పెట్టకుండా అతని చుట్టూ తిరిగేవారు ఇంకెంత మంది ఉంటారో తెలియని పరిస్థితి. బెంగళూరు నగరంలో సుమారు పది మంది ఏజెంట్లను పెట్టి వారి ద్వారా ప్లాట్లు బుక్ చేయిస్తుంటారు. వారికి ఫోన్ చేయగానే సార్... ఎటువైపు ప్లాట్ కావాలి. మా వన్నీ అప్రూవల్ ప్లాన్స్ సార్, బ్యాంకు రుణాలు కూడా ఇప్పిస్తామంటూ తియ్యగా మాట్లాడతారు. ప్లాట్లు కొనుగోలు చేసి వారి చేతుల్లో ఇరుక్కున్న తరువాత కానీ కొనుగోలుదారులకు పిక్చర్ అర్థం కాదు. 2010 సెప్టెంబర్ 17న బెంగళూరుకు చెందిన వినియోగదారుల రక్షణచట్టం కింద మరో కేసు నమోదైంది. ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని కేసులు ఈ సంస్థపై ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్లాట్ల కొనుగోలుదారులకు కోట్లలో ఎగనామం పెట్టారని పలువురు చెబుతున్నారు. ఎన్నికలప్పుడే కనిపించేది శంకర్ తంబళ్లపల్లె నియోకవర్గంలో కేవలం ఎన్నికల సమయంలోనే కనిపిస్తారు. గత ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా టికెట్ సంపాదించారు. తనకు ఓటేస్తే తంబళ్లపల్లెను స్వర్గదామం చేస్తానని జనం వద్దకు వెళుతున్నారు. ఇక్కడ కూడా మాయమాటలు చెప్పి మోసం చేయడనే గ్యారెంటీ ఏంటని పలువురు గుసగుసలాడుతున్నారు. ఇవన్నీ బాబుకు తెలియవా? తంబళ్లపల్లె టీడీపీ అభ్యర్థి శంకర్‌పై 35 కేసులు నమోదైనట్లు ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు తెలియదా? అంటే అవన్నీ ఎప్పుడో తెలుసునని కార్యకర్తలే చెబుతున్నారు. ఎన్నికల్లో డబ్బులు ఖర్చుపెట్టుకునే వ్యక్తులు కావాలి కాబట్టి శంకర్‌కు టికెట్ ఇచ్చారని వ్యాఖ్యానిస్తున్నారు. -
జోరు పెరిగిన పోరు
సాక్షి, నెల్లూరు : రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ తలపెట్టిన పోరు జోరు పెరిగింది. సమైక్యాంధ్రకు మద్దతుగా 43వ రోజు బుధవారం ఉద్యమాన్ని మరింత ఉధృతంగా మార్చారు. సమైక్య పోరులో ఉపాధ్యాయుడు శంకరయ్యయాదవ్ మృతికి సంతాప సూచికంగా జిల్లా వ్యాప్తంగా సంపూర్ణ బంద్ పాటించారు. దీంతో నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, వ్యాపార, వాణిజ్య సంస్థలు, హోటళ్లు మూత పడ్డాయి. ఆర్టీసీతో పాటు ప్రైవేటు బస్సులు తిరగలేదు. విద్యార్థి, ఉపాధ్యాయ, ఉద్యోగ జేఏసీలు బంద్‌ను పర్యవేక్షించాయి. విద్యుత్ ఉద్యోగులు బుధవారం అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెకు దిగనున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వం ఇచ్చిన సిమ్‌కార్డులను ఎస్ఈకి అప్పగించారు. పోరులో భాగంగా పెద్ద ఎత్తున ర్యాలీలు, రాస్తారోకోలు, మానవహారాలు, నిరసన దీక్షలు కొనసాగించారు. వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి పొదలకూరులో జరిగిన దీక్షల్లో పాల్గొన్నారు. నెల్లూరులో నీటిపారుదల శాఖ ఉద్యోగులు తమ కార్యాలయం నుంచి గాంధీ బొమ్మ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో నగరంలోని ప్రధాన కూడళ్లలో రాస్తారోకోలు, మానవహారం, ధర్నాలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. వీఎస్‌యూ అధ్యాపక జేఏసీ ఆధ్వర్యంలో క్యాంపస్ కళాశాల నుంచి వీఆర్సీ కూడలి వరకు శాంతి ర్యాలీ నిర్వహించారు. సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ నాయకులు ఐసెట్ కౌన్సెలింగ్‌ను అడ్డుకున్నారు. జిల్లా అధికారుల సంఘం ఆధ్వర్యంలో శంకరయ్య యాదవ్ మృతికి సంతాప సూచికంగా జెడ్పీ కార్యాలయం నుంచి ఉద్యోగులు నగరంలో ప్రదర్శన నిర్వహించారు. కోవూరు ఎన్జీఓ హోంలో కోవూరు గ్రామస్తులు రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. బుచ్చిరెడ్డిపాళెం మండలంలో శనివారం వరకు పాఠశాలలు మూసేయించాలని నిర్ణయించారు. వెంకటగిరిలో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో అడ్డరోడ్డు సెంటర్ నుంచి కాశీపేట వరకు ర్యాలీ నిర్వహించారు. ఆటోయూనియన్ ఆధ్వర్యంలో పాత బస్టాండ్ నుంచి అడ్డరోడ్డు వరకు ఆటోలతో ర్యాలీ నిర్వహించారు. కావలిలో ఉపాధ్యాయుడి మృతికి సంతాపంగా ఉపాధ్యాయ సంఘాలు ఆర్డీఓ కార్యాలయం నుంచి జెండాచెట్టు సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. సమైక్యాంధ్ర జేఏసీ, సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఉదయగిరిలో జేఏసీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుడు శంకరయ్య యాదవ్ మృతికి సంతాపం తెలిపారు. రెండు నిమిషాలు మౌనం పాటించి మానవహారం ఏర్పాటు చేశారు. మనుబోలులో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించి సమైక్యవాదులు, ఉపాధ్యాయులు మానవహారం నిర్వహించారు. ఉపాధ్యాయుడి మృతికి సంతాపంగా పొదలకూరులో ఉపాధ్యాయుల రిలే దీక్షలు ప్రారంభించారు. వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు, సర్వేపల్లి సమన్వయకర్త కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఈ శిబిరంలో పాల్గొన్నారు. గూడూరులో సమైక్యాంధ్ర కోసం జరుగుతున్న రిలే దీక్షల్లో బుధవారం పాలిటెక్నిక్, సిరామిక్ కళాశాలల అధ్యాపకులు కూర్చున్నారు. వైఎస్సార్సీపీ నాయకుడు బత్తిన విజయ్‌కుమార్ శంకరయ్య యాదవ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కోట క్రాస్‌రోడ్డులో కోట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు రిలే దీక్షలు నిర్వహించారు. శంకరయ్య యాదవ్ మృతికి సంతాపంగా సూళ్లూరుపేట నియోజక వర్గంలో బంద్ నిర్వహించారు. దుకాణాలు, విద్యా సంస్థలు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. -
నేడు జిల్లా బంద్
నెల్లూరు సిటీ,న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర సాధనకు రిలే నిరాహార దీక్షలో పాల్గొని అకాలమృతి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు బట్టా శంకర్‌యాదవ్ మృతి జిల్లాలోని సమైక్యవాదులను కలిచి వేసిందని, దీంతో బుధవారం జిల్లా బంద్ పాటించాలని సమైక్య పౌరులందరూ ఏక గ్రీవంగా తీర్మానించారు. ఏపీఎన్జీఓ సంఘం, సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక, ఆర్టీసీ జేఏసీ, సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ, పలు ఉపాధ్యాయ సంఘాలు జిల్లా వ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. కేంద్ర ప్రభుత్వ కలాపాలను స్తంభింపజేస్తామని స్పష్టం చేశారు. సమైక్యాంధ్ర కోసం అశువులు బాసిన ఉపాధ్యాయుడి ఆత్మ శాంతి కోసం జిల్లాలోని విద్యా సంస్థలు, బ్యాంకులు, వాణిజ్య, వర్తక సంస్థలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అత్యవసర సేవలనకు బంద్ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఇప్పటికైనా కేంద్రం కళ్లు తెరవాలని ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయి. ఢిల్లీ పెద్దలు తమ నిర్ణయాన్ని మార్చుకుని సమైక్యాంధ్ర ప్రకటించే వరకు సీమాంధ్రులు త్యాగాలకు సిద్ధం కావాలని, బంద్‌కు సహకరించాలని పలు సంఘాలు విన్నవించాయి. ఎస్‌యూపీఎస్ ఆధ్వర్యంలో... సమైక్యాంధ్రకు మద్దతుగా దీక్ష చేపట్టిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు బీ శంకర్‌యాదవ్ మంగళవారం మీడియాతో మాట్లాడుతుండగా మృతి చెందాడని, ఆయన అకాల మృతికి సంతా ప సూచికంగా జిల్లా బంద్ నిర్వహిస్తున్నామని సమైక్యాంధ్ర ఉపాధ్యాయ పోరాట సమితి కన్వీనర్ ఎస్ నాగేంద్రకుమార్, కో కన్వీనర్లు సీహెచ్ కృష్ణారెడ్డి, బాలకృష్ణమూర్తి ఓ సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఈ బంద్‌ను జిల్లాలోని అన్ని వర్గాలు స్వచ్ఛందంగా చేపట్టాలని పేర్కొన్నారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో... జిల్లాలోని వాణిజ్య సంస్థలు, వ్యాపార వర్గాలు, విద్యా సంస్థలు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో బంద్ పాటిస్తున్నట్లు వేదిక చైర్మన్ సీ రవీంద్రబాబు ఓ ప్రకటనలో తెలిపారు. శంకర్ యాదవ్ కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో... జిల్లా వ్యాప్తంగా సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో బంద్ నిర్వహిస్తున్నట్లు విద్యార్థి జేఏసీ జిల్లా కన్వీనర్ డీ అంజయ్య, నాయకులు గొల్లపల్లి ప్రసన్న శ్రావణ్, సయ్యద్ ముజీర్, రోజ్దార్, కాకర్ల తిరుమలనాయుడు ఓ సంయుక్త ప్రకటనలో తెలిపారు. శంకర్‌యాదవ్ మృతికి తమ సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యాసంస్థల బంద్ రాష్ట్ర విభజనకు నిరసనగా నిరాహార దీక్ష చేస్తూ తుదిశ్వాస విడిచిన ఉపాధ్యాయుడు బి. శంకర్‌యాదవ్ మృతికి సంతాపంగా బుధవారం విద్యా సంస్థల బంద్ నిర్వహిస్తున్నట్టు సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ రాష్ట్ర కో కన్వీనర్ జీవీ ప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నాయుడుపేటలోని దీక్షా శిబిరంలో సమైక్యాంధ్ర కోసం అసువులు బాసిన శంకర్ యాదవ్ తెలిపారు. బీటీఏ సంతాపం : ఉపాధ్యాయుడు శంకరయ్య మృతికి తీ వ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నట్టు బీటీ ఏ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్. రమణ య్య, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శు లు పి. ఆదినారాయణ, డి. మాల్యాద్రి ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. సమైక్య ఉద్యమంలో అశువులు బాసిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు శంకర్‌యాదవ్ మృతికి సంతాపంగా జిల్లాలోని ప్రైవేటు విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నట్లు జిల్లా ప్రైవేటు విద్యా సంస్థల జేఏసీ కన్వీనర్ చాట్ల నరసింహారావు ఓ ప్రకటనలో తెలిపారు. సమైక్య రాష్ట్ర సాధనలో భాగంగా నిరాహార దీక్ష శిబిరంలో ఆకస్మికంగా మృతి చెందిన ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.