నేడు జిల్లా బంద్ | Nellore District Samaikya Bandh | Sakshi
Sakshi News home page

నేడు జిల్లా బంద్

Published Wed, Sep 11 2013 3:51 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM

Nellore District Samaikya Bandh

 నెల్లూరు సిటీ,న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర సాధనకు రిలే నిరాహార దీక్షలో పాల్గొని అకాలమృతి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు బట్టా శంకర్‌యాదవ్ మృతి జిల్లాలోని సమైక్యవాదులను కలిచి వేసిందని, దీంతో బుధవారం జిల్లా బంద్ పాటించాలని సమైక్య పౌరులందరూ ఏక గ్రీవంగా తీర్మానించారు. ఏపీఎన్‌జీఓ సంఘం, సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక, ఆర్టీసీ జేఏసీ, సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ, పలు ఉపాధ్యాయ సంఘాలు జిల్లా వ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. కేంద్ర  ప్రభుత్వ కలాపాలను స్తంభింపజేస్తామని స్పష్టం చేశారు. సమైక్యాంధ్ర కోసం అశువులు బాసిన ఉపాధ్యాయుడి ఆత్మ శాంతి కోసం జిల్లాలోని విద్యా సంస్థలు, బ్యాంకులు, వాణిజ్య, వర్తక సంస్థలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అత్యవసర సేవలనకు బంద్ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఇప్పటికైనా  కేంద్రం కళ్లు తెరవాలని ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయి. ఢిల్లీ పెద్దలు తమ నిర్ణయాన్ని మార్చుకుని సమైక్యాంధ్ర ప్రకటించే వరకు సీమాంధ్రులు త్యాగాలకు సిద్ధం కావాలని, బంద్‌కు సహకరించాలని పలు సంఘాలు విన్నవించాయి. 
 
  ఎస్‌యూపీఎస్ ఆధ్వర్యంలో...
  సమైక్యాంధ్రకు మద్దతుగా దీక్ష చేపట్టిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు బీ శంకర్‌యాదవ్ మంగళవారం మీడియాతో మాట్లాడుతుండగా మృతి చెందాడని, ఆయన అకాల మృతికి సంతా ప సూచికంగా జిల్లా బంద్ నిర్వహిస్తున్నామని సమైక్యాంధ్ర ఉపాధ్యాయ పోరాట సమితి కన్వీనర్ ఎస్ నాగేంద్రకుమార్, కో కన్వీనర్లు సీహెచ్ కృష్ణారెడ్డి, బాలకృష్ణమూర్తి ఓ సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఈ బంద్‌ను జిల్లాలోని అన్ని వర్గాలు స్వచ్ఛందంగా చేపట్టాలని పేర్కొన్నారు.  
 
 సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో...
 జిల్లాలోని వాణిజ్య సంస్థలు, వ్యాపార వర్గాలు, విద్యా సంస్థలు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో బంద్ పాటిస్తున్నట్లు వేదిక చైర్మన్ సీ రవీంద్రబాబు ఓ ప్రకటనలో తెలిపారు.  శంకర్ యాదవ్ కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. 
 
 సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో...
 జిల్లా వ్యాప్తంగా సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో బంద్ నిర్వహిస్తున్నట్లు విద్యార్థి జేఏసీ జిల్లా కన్వీనర్ డీ అంజయ్య, నాయకులు గొల్లపల్లి ప్రసన్న శ్రావణ్, సయ్యద్ ముజీర్, రోజ్దార్, కాకర్ల తిరుమలనాయుడు ఓ సంయుక్త ప్రకటనలో  తెలిపారు. శంకర్‌యాదవ్ మృతికి తమ సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. 
 
 విద్యాసంస్థల బంద్
 రాష్ట్ర విభజనకు నిరసనగా నిరాహార దీక్ష చేస్తూ తుదిశ్వాస విడిచిన ఉపాధ్యాయుడు బి. శంకర్‌యాదవ్ మృతికి సంతాపంగా బుధవారం విద్యా సంస్థల బంద్ నిర్వహిస్తున్నట్టు సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ రాష్ట్ర కో కన్వీనర్ జీవీ ప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో  తెలిపారు.  నాయుడుపేటలోని దీక్షా శిబిరంలో సమైక్యాంధ్ర కోసం అసువులు బాసిన శంకర్ యాదవ్ తెలిపారు. 
 
 బీటీఏ సంతాపం :  
 ఉపాధ్యాయుడు శంకరయ్య మృతికి  తీ వ్ర సంతాపం  వ్యక్తం చేస్తున్నట్టు బీటీ ఏ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్. రమణ య్య, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శు లు పి. ఆదినారాయణ, డి. మాల్యాద్రి ఒక సంయుక్త ప్రకటనలో  తెలిపారు.  
 
 సమైక్య ఉద్యమంలో అశువులు బాసిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు శంకర్‌యాదవ్ మృతికి సంతాపంగా జిల్లాలోని ప్రైవేటు విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నట్లు జిల్లా ప్రైవేటు విద్యా సంస్థల జేఏసీ కన్వీనర్ చాట్ల నరసింహారావు ఓ ప్రకటనలో తెలిపారు. సమైక్య రాష్ట్ర సాధనలో భాగంగా నిరాహార దీక్ష శిబిరంలో ఆకస్మికంగా మృతి చెందిన ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement