samaikayandhra
-
సమైక్యాంద్ర గళంతోనే కొనసాగుతున్న లోక్‌సభ
-
ఆత్మీయ సోదరికి జనం జేజేలు
బొబ్బిలి/రామభద్రపురం/తెర్లాం/బాడంగి, న్యూస్‌లైన్ : సమైక్య శంఖారావం పేరిట దివంగత మహానేత వైఎస్ఆర్ తనయ, జననేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన బస్సు యాత్రకు అడుగడుగునా ప్రజలు, సమైక్యవాదులు, అభిమానులు బ్రహ్మరథం పట్టా రు. ఆదివారం జిల్లాలోనికి ప్రవేశించిన బస్సు యాత్ర.. సోమవారం ఉదయం సాలూరు, బొబ్బిలి నియోజకవర్గా ల్లో పర్యటించి అక్కడ నుంచి శ్రీకాకుళం జిల్లాకు వెళ్లింది. ఉదయం సాలూరులో షర్మిల బస చేసే ప్రాంతానికి అధిక సంఖ్యలో అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. అది మొదలు.. ఎక్కడికక్కడే షర్మిలను చూడడానికి, ఆమె మాటలు వినడానికి ప్రతి గ్రామం వద్ద అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, సమైక్యవాదులు తరలివచ్చారు. పార్టీ జిల్లా కన్వీనరు పెనుమత్స సాంబశివరాజు షర్మిలను సాలూరులోనే కలిసి ఆ నియోజకవర్గ నాయకులను పరిచయం చేశారు. పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త ఆర్వీ సుజయకృష్ణ రంగారావు, అరకు పార్లమెంటు పరిశీలకుడు ఆర్వీఎస్కేకే రంగారావు(బేబినాయన)లు షర్మిలతో పాటు బస్సులో ఉన్నారు. సాలూరు దాటిన తరువాత బొబ్బిలి నియోజకవర్గంలోనికి ప్రవేశించగానే తారాపురంలో అధిక సంఖ్యలో ప్రజలు చేరి జేజేలు పలికారు. వారందరికీ బస్సులోంచి అభివాదం చేసి ఆమె ముందుకు కదిలారు. మహానేత తనయ వస్తున్నారని తెలుసుకుని.. ఎక్కడ పనులు అక్కడే వదిలేసి మహిళలు, వృద్ధులు, పిల్లలు బయటకు వచ్చి ‘జై సమైక్యాంధ్ర, జై జగన్’ నినాదాలు చేశారు. రామభద్రపు రం బైపాస్ రోడ్డు వద్ద నుంచి పెద్ద ఎత్తున యువకులు వైఎస్ఆర్ సీపీ జెండాలు పట్టుకుని బైక్ ర్యాలీ నిర్వహించా రు. బైపాస్ రోడ్డులో జనం అధిక సంఖ్యలో వేచి ఉన్నారు. రామభద్రపురం గాంధీబొమ్మ జంక్షన్లో ఆ పార్టీ నాయకులు చింతల రామకృష్ణ, మడక తిరుపతి, రాయలు, గొర్లె రామారావు, చిన్నమ్మతల్లి తదితరుల ఆధ్వర్యంలో వందలాది మంది స్వాగతం పలికారు. అక్కడ నుంచి బాడంగి వెళ్లినంత వరకూ ప్రతి గ్రామం వద్ద కొద్దిసేపు బస్సును ఆపి షర్మిల అభివాదం చేశారు. బాడంగిలో సమైక్యాంధ్ర జెండాలతో షర్మిలకు జేఏసీ నాయకులు స్వాగతం పలికా రు. అక్కడ మాట్లాడాలని వారంతా కోరగా.. ఆమె ‘జై సమైక్యాంధ్ర’ అంటూ ముందుకు సాగారు. తెర్లాం మండ లం కూనాయవలస, వెలగవలస, పెరుమాళిలో షర్మిలకు బ్రహ్మరథం పట్టారు. మెరకమొడిదాం మండలం కూనాయవలస జంక్షన్ వద్ద వద్ద అక్కడ ప్రజలు షర్మిల బస్సును ఆపి కొబ్బరిబొండాన్ని ఆమెకు అందించారు. ఆమె తాగాక వాళ్లంతా సంతోషాన్ని వ్యక్తం చేశారు. తెర్లాం, మెరకముడిదాం, రాజాం తదితర మండలాల నుంచి వచ్చిన అభిమానులు, కార్యకర్తలతో పెరుమాళి జంక్షన్ కిటకిటలాడింది. షర్మిల రాక ఆలస్యం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వేలాది మంది అభిమానులను ఉత్తేజ పరిచేందుకు నెమలాంకు చెందిన డప్పు వాయిద్య కళాకారులు ప్రదర్శన గావించారు. విద్యార్థులు పిరమిడ్ ఆకారంలో నిల్చొన్నారు. పెరుమాళిలో అడుగుతీసి అడుగు వేయలేనంతగా జన సందోహం కనిపించింది. ఆ మండల నాయకులు నర్సుపల్లి వెంకటేశ్వరరావు తదితరులు జననేత సోదరికి స్వాగతం పలికారు. వారంతా షర్మిలను మాట్లాడాలని పట్టుబట్టారు. బస్సులోంచి బయటకు రావాలని, అందరికీ కనిపించాలని కోరారు. ఈ బస్సులోంచి పైకి రావడానికి కుదరదంటూ కొద్దిసేపు మాట్లాడి ఆమె ముందుకు కదిలా రు. జిల్లాలోని రెండో రోజు బస్సు యాత్రలో ప్రసాదరాజు, పార్టీ వివిధ నియోజకవర్గాల కన్వీనర్లు బోకం శ్రీనివాస్, గురాన అయ్యలు, కడుబండి శ్రీనివాసరావు, నాయకులు మక్కువ శ్రీధర్, ఆదాడ మోహనరావు, చెన్నా లక్ష్మి, రమేష్, కుమార్, నాగరాజు, పైల నాగభూషణం, మర్రాపు లీల, అబ్దుల్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు అండగా ఉండి పోరాటం: షర్మిల ప్రజల కష్టనష్టాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉండి పోరాటం చేస్తుందని షర్మిల అన్నారు. తెర్లాం మండలం పెరుమాళిలో బస్సులోంచే ఆమె కొద్దిసేపు మాట్లాడారు. ‘త్వరలోనే మంచి రోజులు రానున్నా యి. జగనన్న నాయకత్వంలో మీ కష్టాలన్నీ తీరుతాయం’ టూ ఆమె భరోసా ఇచ్చారు. కోట్లాది మంది సీమాంధ్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని దుయ్యబ ట్టారు. ప్రధాన ప్రతిపక్ష హోదాలో అన్యాయాన్ని నిలదీ యాల్సిన చంద్రబాబు.. ఆ పార్టీకే కొమ్ము కాస్తున్నారని మండిపడ్డారు. -
నేడు జిల్లా బంద్
నెల్లూరు సిటీ,న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర సాధనకు రిలే నిరాహార దీక్షలో పాల్గొని అకాలమృతి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు బట్టా శంకర్‌యాదవ్ మృతి జిల్లాలోని సమైక్యవాదులను కలిచి వేసిందని, దీంతో బుధవారం జిల్లా బంద్ పాటించాలని సమైక్య పౌరులందరూ ఏక గ్రీవంగా తీర్మానించారు. ఏపీఎన్జీఓ సంఘం, సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక, ఆర్టీసీ జేఏసీ, సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ, పలు ఉపాధ్యాయ సంఘాలు జిల్లా వ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. కేంద్ర ప్రభుత్వ కలాపాలను స్తంభింపజేస్తామని స్పష్టం చేశారు. సమైక్యాంధ్ర కోసం అశువులు బాసిన ఉపాధ్యాయుడి ఆత్మ శాంతి కోసం జిల్లాలోని విద్యా సంస్థలు, బ్యాంకులు, వాణిజ్య, వర్తక సంస్థలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అత్యవసర సేవలనకు బంద్ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఇప్పటికైనా కేంద్రం కళ్లు తెరవాలని ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయి. ఢిల్లీ పెద్దలు తమ నిర్ణయాన్ని మార్చుకుని సమైక్యాంధ్ర ప్రకటించే వరకు సీమాంధ్రులు త్యాగాలకు సిద్ధం కావాలని, బంద్‌కు సహకరించాలని పలు సంఘాలు విన్నవించాయి. ఎస్‌యూపీఎస్ ఆధ్వర్యంలో... సమైక్యాంధ్రకు మద్దతుగా దీక్ష చేపట్టిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు బీ శంకర్‌యాదవ్ మంగళవారం మీడియాతో మాట్లాడుతుండగా మృతి చెందాడని, ఆయన అకాల మృతికి సంతా ప సూచికంగా జిల్లా బంద్ నిర్వహిస్తున్నామని సమైక్యాంధ్ర ఉపాధ్యాయ పోరాట సమితి కన్వీనర్ ఎస్ నాగేంద్రకుమార్, కో కన్వీనర్లు సీహెచ్ కృష్ణారెడ్డి, బాలకృష్ణమూర్తి ఓ సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఈ బంద్‌ను జిల్లాలోని అన్ని వర్గాలు స్వచ్ఛందంగా చేపట్టాలని పేర్కొన్నారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో... జిల్లాలోని వాణిజ్య సంస్థలు, వ్యాపార వర్గాలు, విద్యా సంస్థలు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో బంద్ పాటిస్తున్నట్లు వేదిక చైర్మన్ సీ రవీంద్రబాబు ఓ ప్రకటనలో తెలిపారు. శంకర్ యాదవ్ కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో... జిల్లా వ్యాప్తంగా సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో బంద్ నిర్వహిస్తున్నట్లు విద్యార్థి జేఏసీ జిల్లా కన్వీనర్ డీ అంజయ్య, నాయకులు గొల్లపల్లి ప్రసన్న శ్రావణ్, సయ్యద్ ముజీర్, రోజ్దార్, కాకర్ల తిరుమలనాయుడు ఓ సంయుక్త ప్రకటనలో తెలిపారు. శంకర్‌యాదవ్ మృతికి తమ సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యాసంస్థల బంద్ రాష్ట్ర విభజనకు నిరసనగా నిరాహార దీక్ష చేస్తూ తుదిశ్వాస విడిచిన ఉపాధ్యాయుడు బి. శంకర్‌యాదవ్ మృతికి సంతాపంగా బుధవారం విద్యా సంస్థల బంద్ నిర్వహిస్తున్నట్టు సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ రాష్ట్ర కో కన్వీనర్ జీవీ ప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నాయుడుపేటలోని దీక్షా శిబిరంలో సమైక్యాంధ్ర కోసం అసువులు బాసిన శంకర్ యాదవ్ తెలిపారు. బీటీఏ సంతాపం : ఉపాధ్యాయుడు శంకరయ్య మృతికి తీ వ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నట్టు బీటీ ఏ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్. రమణ య్య, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శు లు పి. ఆదినారాయణ, డి. మాల్యాద్రి ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. సమైక్య ఉద్యమంలో అశువులు బాసిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు శంకర్‌యాదవ్ మృతికి సంతాపంగా జిల్లాలోని ప్రైవేటు విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నట్లు జిల్లా ప్రైవేటు విద్యా సంస్థల జేఏసీ కన్వీనర్ చాట్ల నరసింహారావు ఓ ప్రకటనలో తెలిపారు. సమైక్య రాష్ట్ర సాధనలో భాగంగా నిరాహార దీక్ష శిబిరంలో ఆకస్మికంగా మృతి చెందిన ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. -
సమైక్య గళం.. ప్రజాదళం
ఏలూరు, న్యూస్‌లైన్ : జిల్లాలో సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమం మొదలై నెల రోజులైంది. ఎన్ని రోజులైనా.. ఎన్ని కష్టాలెదురైనా వెనక్కి తగ్గేది లేదంటూ అన్నివర్గాల ప్రజలు ఢంకా బజారుుంచి చెబుతున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులతోపాటు మేధావులు సైతం ‘జై సమైక్యాంధ్ర’ అంటూ సమర శంఖారావం పూరిస్తూనే ఉన్నారు. ఉద్యమ సెగలు ఆరని నిప్పు కణికలా భగభగలాడుతూనే ఉన్నారుు. గురువారం ఏలూరులో రెవెన్యూ ఉద్యోగులు పెద్దఎత్తున తరలివచ్చి ఫైర్‌స్టేషన్ సెంటర్లో మానవహారం నిర్వహించారు. పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగులు జెడ్పీ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు 18వ రోజుకు చేరుకున్నారుు. సంఘం జిల్లా అధ్యక్షుడు జి.శ్రీధర్‌రాజు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ ఉద్యోగులు సమైక్య నినాదాలు చేస్తూ ప్రదర్శన నిర్వహించారు. విద్యుత్ ఉద్యోగులు ఫైర్‌స్టేషన్ సెంటర్లో వంటావార్పు చేసి కబడ్డీ ఆడారు. నగరంలోని క్రైస్తవులు ఫైర్‌స్టేషన్ సెంటర్లో మానవహారం నిర్వహించారు. పాస్టర్లు సమైక్యాంధ్ర కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆర్ అండ్‌బీ ఉద్యోగులు ర్యాలీగా ఫైర్‌స్టేషన్ సెంటర్‌కు చేరుకుని మానవహారం నిర్వహించారు. విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున గర్జన నిర్వహించి నిరసన గళం వినిపించారు. వన్నె తగ్గని పోరు జిల్లాలో ఏమూలకు వెళ్లినా సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమం వాడీవేడిగా సాగుతోంది. కొ వ్వూరు మునిసిపల్ ఉపాధ్యాయులు, సాంఘిక సంక్షేమ శాఖ ఉద్యోగులు టాక్సీ స్టాండు సెంటరులో రిలే దీక్షలు నిర్వహించారు. ఎన్జీవో హోంలో నిర్వహిస్తున్న రిలే దీక్షల్లో వికలాంగులు, సాంఘిక సంక్షేమ శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు. గృహ నిర్మాణశాఖ ఉద్యోగులుర ా్యలీ నిర్వహించారు. చాగల్లులో ఏపీ ఎన్జీవో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. బ్రాహ్మణగూడెంలో జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు, నిడదవోలు-పంగిడి రహదారిపై కోలాటం ఆడారు. గోపాలపురంలో ఉపాధ్యాయుల జేఏసీ ఆధ్వర్యంలో 48 గంటల నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. దేవరపల్లిలో ఉద్యోగుల రిలే దీక్షలు కొనసాగుతున్నారుు. దేవరపల్లి ప్రధాన రహదారిపై వైద్యులు కారుపాటి అనిల్ రోడ్డుపైనే విద్యార్థులకు రక్తపరీక్షలు నిర్వహించారు. జేఏసీ ఆధ్వర్యంలో ఉండి, ఆకివీడు, కాళ్ల, పాలకోడేరు మండ లాల్లో రిలే నిరాహార దీక్షలు, వివిధ ఆందోళనలు నిర్వహించారు. నరసాపురంలో జేఏసీ, ఉద్యోగ జేఏసీ, న్యాయశాఖ ఉద్యోగుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. భాష్యం పాఠశాల విద్యార్థులు రోడ్డుపై ఆటలు ఆడి నిరసన తెలిపారు. జంగారెడ్డిగూడెంలో పంచాయతీరాజ్ ఉద్యోగుల ఆధ్వర్యంలో రిలే దీక్షలు, తహసిల్దార్ కార్యాలయం వద్ద రెవెన్యూ ఉద్యోగుల నిరసన దీక్షలను వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కర్రా రాజారావు సందర్శించి సంఘీభావం ప్రకటించారు. లింగపాలెంలో ఎన్జీవోలు రోడ్లను శుభ్రం చేశారు, విద్యార్థులు, ఉద్యోగులు ర్యాలీ, మానవహారం నిర్వహించారు. తాడేపల్లిగూడెంలో పశు సంవర్థక శాఖ ఉద్యోగులు భారీ ప్రదర్శన నిర్వహించి, రోడ్డుపైనే పశువులకు వైద్యం చేసి నిరసన తెలిపారు. కొవ్వూరు డివిజన్ పరిధిలోని రెవెన్యూ అధికారులు, సిబ్బంది తణుకులో బైక్‌ర్యాలీ చేశారు.