ఆత్మీయ సోదరికి జనం జేజేలు
Published Tue, Sep 17 2013 3:08 AM | Last Updated on Wed, Aug 8 2018 5:41 PM
బొబ్బిలి/రామభద్రపురం/తెర్లాం/బాడంగి, న్యూస్‌లైన్ : సమైక్య శంఖారావం పేరిట దివంగత మహానేత వైఎస్‌ఆర్ తనయ, జననేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన బస్సు యాత్రకు అడుగడుగునా ప్రజలు, సమైక్యవాదులు, అభిమానులు బ్రహ్మరథం పట్టా రు. ఆదివారం జిల్లాలోనికి ప్రవేశించిన బస్సు యాత్ర.. సోమవారం ఉదయం సాలూరు, బొబ్బిలి నియోజకవర్గా ల్లో పర్యటించి అక్కడ నుంచి శ్రీకాకుళం జిల్లాకు వెళ్లింది. ఉదయం సాలూరులో షర్మిల బస చేసే ప్రాంతానికి అధిక సంఖ్యలో అభిమానులు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. అది మొదలు.. ఎక్కడికక్కడే షర్మిలను చూడడానికి, ఆమె మాటలు వినడానికి ప్రతి గ్రామం వద్ద అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, సమైక్యవాదులు తరలివచ్చారు. పార్టీ జిల్లా కన్వీనరు పెనుమత్స సాంబశివరాజు షర్మిలను సాలూరులోనే కలిసి ఆ నియోజకవర్గ నాయకులను పరిచయం చేశారు. పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త ఆర్వీ సుజయకృష్ణ రంగారావు, అరకు పార్లమెంటు పరిశీలకుడు ఆర్వీఎస్‌కేకే రంగారావు(బేబినాయన)లు షర్మిలతో పాటు బస్సులో ఉన్నారు.
సాలూరు దాటిన తరువాత బొబ్బిలి నియోజకవర్గంలోనికి ప్రవేశించగానే తారాపురంలో అధిక సంఖ్యలో ప్రజలు చేరి జేజేలు పలికారు. వారందరికీ బస్సులోంచి అభివాదం చేసి ఆమె ముందుకు కదిలారు. మహానేత తనయ వస్తున్నారని తెలుసుకుని.. ఎక్కడ పనులు అక్కడే వదిలేసి మహిళలు, వృద్ధులు, పిల్లలు బయటకు వచ్చి ‘జై సమైక్యాంధ్ర, జై జగన్’ నినాదాలు చేశారు. రామభద్రపు రం బైపాస్ రోడ్డు వద్ద నుంచి పెద్ద ఎత్తున యువకులు వైఎస్‌ఆర్ సీపీ జెండాలు పట్టుకుని బైక్ ర్యాలీ నిర్వహించా రు. బైపాస్ రోడ్డులో జనం అధిక సంఖ్యలో వేచి ఉన్నారు. రామభద్రపురం గాంధీబొమ్మ జంక్షన్‌లో ఆ పార్టీ నాయకులు చింతల రామకృష్ణ, మడక తిరుపతి, రాయలు, గొర్లె రామారావు, చిన్నమ్మతల్లి తదితరుల ఆధ్వర్యంలో వందలాది మంది స్వాగతం పలికారు. అక్కడ నుంచి బాడంగి వెళ్లినంత వరకూ ప్రతి గ్రామం వద్ద కొద్దిసేపు బస్సును ఆపి షర్మిల అభివాదం చేశారు. బాడంగిలో సమైక్యాంధ్ర జెండాలతో షర్మిలకు జేఏసీ నాయకులు స్వాగతం పలికా రు. అక్కడ మాట్లాడాలని వారంతా కోరగా.. ఆమె ‘జై సమైక్యాంధ్ర’ అంటూ ముందుకు సాగారు. తెర్లాం మండ లం కూనాయవలస, వెలగవలస, పెరుమాళిలో షర్మిలకు బ్రహ్మరథం పట్టారు. మెరకమొడిదాం మండలం కూనాయవలస జంక్షన్ వద్ద వద్ద అక్కడ ప్రజలు షర్మిల బస్సును ఆపి కొబ్బరిబొండాన్ని ఆమెకు అందించారు. ఆమె తాగాక వాళ్లంతా సంతోషాన్ని వ్యక్తం చేశారు.
తెర్లాం, మెరకముడిదాం, రాజాం తదితర మండలాల నుంచి వచ్చిన అభిమానులు, కార్యకర్తలతో పెరుమాళి జంక్షన్ కిటకిటలాడింది. షర్మిల రాక ఆలస్యం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వేలాది మంది అభిమానులను ఉత్తేజ పరిచేందుకు నెమలాంకు చెందిన డప్పు వాయిద్య కళాకారులు ప్రదర్శన గావించారు. విద్యార్థులు పిరమిడ్ ఆకారంలో నిల్చొన్నారు. పెరుమాళిలో అడుగుతీసి అడుగు వేయలేనంతగా జన సందోహం కనిపించింది. ఆ మండల నాయకులు నర్సుపల్లి వెంకటేశ్వరరావు తదితరులు జననేత సోదరికి స్వాగతం పలికారు. వారంతా షర్మిలను మాట్లాడాలని పట్టుబట్టారు. బస్సులోంచి బయటకు రావాలని, అందరికీ కనిపించాలని కోరారు. ఈ బస్సులోంచి పైకి రావడానికి కుదరదంటూ కొద్దిసేపు మాట్లాడి ఆమె ముందుకు కదిలా రు. జిల్లాలోని రెండో రోజు బస్సు యాత్రలో ప్రసాదరాజు, పార్టీ వివిధ నియోజకవర్గాల కన్వీనర్లు బోకం శ్రీనివాస్, గురాన అయ్యలు, కడుబండి శ్రీనివాసరావు, నాయకులు మక్కువ శ్రీధర్, ఆదాడ మోహనరావు, చెన్నా లక్ష్మి, రమేష్, కుమార్, నాగరాజు, పైల నాగభూషణం, మర్రాపు లీల, అబ్దుల్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజలకు అండగా ఉండి పోరాటం: షర్మిల
ప్రజల కష్టనష్టాల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉండి పోరాటం చేస్తుందని షర్మిల అన్నారు. తెర్లాం మండలం పెరుమాళిలో బస్సులోంచే ఆమె కొద్దిసేపు మాట్లాడారు. ‘త్వరలోనే మంచి రోజులు రానున్నా యి. జగనన్న నాయకత్వంలో మీ కష్టాలన్నీ తీరుతాయం’ టూ ఆమె భరోసా ఇచ్చారు. కోట్లాది మంది సీమాంధ్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని దుయ్యబ ట్టారు. ప్రధాన ప్రతిపక్ష హోదాలో అన్యాయాన్ని నిలదీ యాల్సిన చంద్రబాబు.. ఆ పార్టీకే కొమ్ము కాస్తున్నారని మండిపడ్డారు.
Advertisement
Advertisement