Sharmila Bus Yatra
-
ఆత్మీయ సోదరికి జనం జేజేలు
బొబ్బిలి/రామభద్రపురం/తెర్లాం/బాడంగి, న్యూస్‌లైన్ : సమైక్య శంఖారావం పేరిట దివంగత మహానేత వైఎస్ఆర్ తనయ, జననేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన బస్సు యాత్రకు అడుగడుగునా ప్రజలు, సమైక్యవాదులు, అభిమానులు బ్రహ్మరథం పట్టా రు. ఆదివారం జిల్లాలోనికి ప్రవేశించిన బస్సు యాత్ర.. సోమవారం ఉదయం సాలూరు, బొబ్బిలి నియోజకవర్గా ల్లో పర్యటించి అక్కడ నుంచి శ్రీకాకుళం జిల్లాకు వెళ్లింది. ఉదయం సాలూరులో షర్మిల బస చేసే ప్రాంతానికి అధిక సంఖ్యలో అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. అది మొదలు.. ఎక్కడికక్కడే షర్మిలను చూడడానికి, ఆమె మాటలు వినడానికి ప్రతి గ్రామం వద్ద అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, సమైక్యవాదులు తరలివచ్చారు. పార్టీ జిల్లా కన్వీనరు పెనుమత్స సాంబశివరాజు షర్మిలను సాలూరులోనే కలిసి ఆ నియోజకవర్గ నాయకులను పరిచయం చేశారు. పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త ఆర్వీ సుజయకృష్ణ రంగారావు, అరకు పార్లమెంటు పరిశీలకుడు ఆర్వీఎస్కేకే రంగారావు(బేబినాయన)లు షర్మిలతో పాటు బస్సులో ఉన్నారు. సాలూరు దాటిన తరువాత బొబ్బిలి నియోజకవర్గంలోనికి ప్రవేశించగానే తారాపురంలో అధిక సంఖ్యలో ప్రజలు చేరి జేజేలు పలికారు. వారందరికీ బస్సులోంచి అభివాదం చేసి ఆమె ముందుకు కదిలారు. మహానేత తనయ వస్తున్నారని తెలుసుకుని.. ఎక్కడ పనులు అక్కడే వదిలేసి మహిళలు, వృద్ధులు, పిల్లలు బయటకు వచ్చి ‘జై సమైక్యాంధ్ర, జై జగన్’ నినాదాలు చేశారు. రామభద్రపు రం బైపాస్ రోడ్డు వద్ద నుంచి పెద్ద ఎత్తున యువకులు వైఎస్ఆర్ సీపీ జెండాలు పట్టుకుని బైక్ ర్యాలీ నిర్వహించా రు. బైపాస్ రోడ్డులో జనం అధిక సంఖ్యలో వేచి ఉన్నారు. రామభద్రపురం గాంధీబొమ్మ జంక్షన్లో ఆ పార్టీ నాయకులు చింతల రామకృష్ణ, మడక తిరుపతి, రాయలు, గొర్లె రామారావు, చిన్నమ్మతల్లి తదితరుల ఆధ్వర్యంలో వందలాది మంది స్వాగతం పలికారు. అక్కడ నుంచి బాడంగి వెళ్లినంత వరకూ ప్రతి గ్రామం వద్ద కొద్దిసేపు బస్సును ఆపి షర్మిల అభివాదం చేశారు. బాడంగిలో సమైక్యాంధ్ర జెండాలతో షర్మిలకు జేఏసీ నాయకులు స్వాగతం పలికా రు. అక్కడ మాట్లాడాలని వారంతా కోరగా.. ఆమె ‘జై సమైక్యాంధ్ర’ అంటూ ముందుకు సాగారు. తెర్లాం మండ లం కూనాయవలస, వెలగవలస, పెరుమాళిలో షర్మిలకు బ్రహ్మరథం పట్టారు. మెరకమొడిదాం మండలం కూనాయవలస జంక్షన్ వద్ద వద్ద అక్కడ ప్రజలు షర్మిల బస్సును ఆపి కొబ్బరిబొండాన్ని ఆమెకు అందించారు. ఆమె తాగాక వాళ్లంతా సంతోషాన్ని వ్యక్తం చేశారు. తెర్లాం, మెరకముడిదాం, రాజాం తదితర మండలాల నుంచి వచ్చిన అభిమానులు, కార్యకర్తలతో పెరుమాళి జంక్షన్ కిటకిటలాడింది. షర్మిల రాక ఆలస్యం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వేలాది మంది అభిమానులను ఉత్తేజ పరిచేందుకు నెమలాంకు చెందిన డప్పు వాయిద్య కళాకారులు ప్రదర్శన గావించారు. విద్యార్థులు పిరమిడ్ ఆకారంలో నిల్చొన్నారు. పెరుమాళిలో అడుగుతీసి అడుగు వేయలేనంతగా జన సందోహం కనిపించింది. ఆ మండల నాయకులు నర్సుపల్లి వెంకటేశ్వరరావు తదితరులు జననేత సోదరికి స్వాగతం పలికారు. వారంతా షర్మిలను మాట్లాడాలని పట్టుబట్టారు. బస్సులోంచి బయటకు రావాలని, అందరికీ కనిపించాలని కోరారు. ఈ బస్సులోంచి పైకి రావడానికి కుదరదంటూ కొద్దిసేపు మాట్లాడి ఆమె ముందుకు కదిలా రు. జిల్లాలోని రెండో రోజు బస్సు యాత్రలో ప్రసాదరాజు, పార్టీ వివిధ నియోజకవర్గాల కన్వీనర్లు బోకం శ్రీనివాస్, గురాన అయ్యలు, కడుబండి శ్రీనివాసరావు, నాయకులు మక్కువ శ్రీధర్, ఆదాడ మోహనరావు, చెన్నా లక్ష్మి, రమేష్, కుమార్, నాగరాజు, పైల నాగభూషణం, మర్రాపు లీల, అబ్దుల్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు అండగా ఉండి పోరాటం: షర్మిల ప్రజల కష్టనష్టాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉండి పోరాటం చేస్తుందని షర్మిల అన్నారు. తెర్లాం మండలం పెరుమాళిలో బస్సులోంచే ఆమె కొద్దిసేపు మాట్లాడారు. ‘త్వరలోనే మంచి రోజులు రానున్నా యి. జగనన్న నాయకత్వంలో మీ కష్టాలన్నీ తీరుతాయం’ టూ ఆమె భరోసా ఇచ్చారు. కోట్లాది మంది సీమాంధ్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని దుయ్యబ ట్టారు. ప్రధాన ప్రతిపక్ష హోదాలో అన్యాయాన్ని నిలదీ యాల్సిన చంద్రబాబు.. ఆ పార్టీకే కొమ్ము కాస్తున్నారని మండిపడ్డారు. -
ప్రతిధ్వనించనున్న సమైక్య శంఖారావం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: సమైక్య శంఖారావం సోమవారం జిల్లాలో ప్రతిధ్వనించనుంది. జిల్లాలో ఉద్ధృతంగా సాగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల పూరించనున్న ఈ శంఖారావం మరింత స్ఫూర్తిని, కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందన్న ఆసక్తితో ప్రజలు ఎదురు చూస్తున్నారు. సమైక్య శంఖారావం పేరిట షర్మిల నిర్వహిస్తున్న బస్సు యాత్ర సోమవారం ఉదయం జిల్లాలోకి ప్రవేశించి.. సాయంత్రం ఇక్కడే ముగుస్తుంది. ఉదయం 10 గంటలకు రాజాంలో, సాయంత్రం 4 గంటలకు శ్రీకాకుళంలో జరిగే సభల్లో రాష్ట్ర విభజన వల్ల వాటిల్లే నష్టాలతోపాటు, సమైక్య రాష్ట్రం కోసం వైఎస్ఆర్సీపీ అనుసరిస్తున్న వైఖరిని షర్మిల ప్రజలకు వివరిస్తారు. యాత్ర సాగేదిలా.. విజయనగరం జిల్లా సాలూరు నుంచి సోమవారం ఉదయం షర్మిల బయలుదేరుతారు. ఆ జిల్లాలోని రామభద్రపురం, తెర్లాం మీదు గా రాజాం చేరుకుంటారు. అక్కడ సభలో ప్రసంగిస్తారు. అనంతరం పొగిరి, పొందూ రు, లోలుగు, చిలకపాలెం, ఎచ్చెర్ల, నవభారత్ జంక్షన్ల మీదుగా శ్రీకాకుళం చేరుకుంటారు. సాయంత్రం వైఎస్సార్ కూడలిలో జరిగే సభలో ప్రసంగిస్తారు. దాంతో ఆమె చేపట్టిన సమైక్య శంఖారావం బస్సుయాత్ర ముగుస్తుంది. కాగా షర్మిల ఇంతకుముందు నిర్వహించిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర శ్రీకాకుళం జిల్లాలో కొనసాగుతున్నప్పుడే రాష్ట్ర విభజన ప్రకటన వెలువడింది. ఆగస్టు 4న ఇచ్ఛాపురంలో జరిగిన పాదయా త్ర ముగింపు సభలోనే షర్మిల సమైక్య శంఖారావం పూరించారు. ఒక తండ్రిలా ఆలోచించి సమన్యాయం చేయలేనప్పుడు రాష్ట్రాన్ని ఎలా ముక్కలు చేస్తారని నిలదీశారు. అందరి కష్టంతో అభివృద్ధి చెందిన హైదరాబాద్‌ను ఒక ప్రాంతం వారికి ధారాదత్తం చేయడం ఎంతవరకు సమంజసమని కూడా సూటిగా ప్రశ్నించారు. సమన్యాయం చేయలేనప్పుడు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న వైఎస్ఆర్సీపీ నినాదాన్ని, విధానాన్ని ప్రజలకు వివరించేందుకు సమైక్య శంఖారావం పేరిట సీమాంధ్రలోని 12 జిల్లాల్లో బస్సుయాత్ర పూర్తి చేసిన ఆమె 13వ జిల్లాగా శ్రీకాకుళానికి విచ్చేస్తున్నారు. ఏర్పాట్లలో నాయకులు సమైక్య శంఖారావం సభలను విజయవంతం చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ముఖ్యులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. జిల్లా పార్టీ కార్యాలయంలోనూ, రాజాంలోనూ ముఖ్య నాయకులు , కార్యకర్తలు సమావేశమై దీనిపై చర్చించారు. నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ జిల్లాలోని పలువురు నాయకులతో మాట్లాడారు. శ్రీకాకుళం నియోజకవర్గ సమన్వయకర్తలు వైవీ సూర్యనారాయణ, వరుదు కల్యాణి, ఇతర నాయకులు సమైక్యవాదులను కూడగట్టే పనిలో నిమగ్నమయ్యారు. మరోవైపు రాజాంలో పార్టీ జిల్లా కన్వీనర్ పద్మప్రియ, ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్, రాజాం నియోజకవర్గ సమన్వయకర్త పి.ఎం.జె.బాబు తదితరులు కార్యకర్తల సమావేశం నిర్వహించి ఏర్పాట్లను సమీక్షించారు. సభలను విజయవంతం చేయండి: పద్మప్రియ రాజాం, శ్రీకాకుళం పట్టణాల్లో జరిగే సమైక్య శంఖారావం సభలకు సమైక్యవాదులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో హజరై జయప్రదం చేయాలని పార్టీ జిల్లా కన్వీనర్ ధర్మాన పద్మప్రియ కృష్ణదాస్ ఒక ప్రకటనలో కోరారు. రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో జరుగుతున్న సమైక్య శంఖారావం సభలకు ఎంతో ప్రాధాన్యం ఉందని పేర్కొన్నారు. శ్రీకాకుళం పట్టణంలో ముగింపు సభ జరగటం కూడా చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్రాన్ని దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రాల వరుసలో నిలిపారని, ఆ తర్వాత నాలుగేళ్ల పాలనలో కాంగ్రెస్ పాలకులకు అభివృద్ధి చేయడం చేతకాకపోగా రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్నారని దయ్యబట్టారు. పాలకుల కుటిల యత్నాలను తిప్పి కొట్టేందుకు షర్మిల సమైక్య శంఖారావం సభలను జయప్రదం చేయాలని కోరారు. -
షర్మిలకు బ్రహ్మరథం
విజయనగరం టౌన్, న్యూస్‌లైన్ : సమన్యాయం లేదా సమైక్యమే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన సమైక్య శంఖారావం బస్సుయాత్రకు జిల్లా కేంద్రంలో అపూ ర్వ స్వాగతం లభించింది. షర్మిలకు ప్రజ లు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావడం తో పట్టణం కిటకిటలాడింది. ఆదివారం సాయంత్రం 4 గంటలకు షర్మిల బస్సు యూత్ర విశాఖ జిల్లా నుంచి విజయనగరంలోని వీటీ అగ్రహారంలోకి ప్రవేశిం చింది. అప్పటికే ఆమె రాకకోసం ఎదురుచూస్తున్న వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు ఎదురెళ్లి ఆమెకు ఘన స్వా గతం పలికారు. బస్సు యాత్ర వీటీ అగ్రహారం జంక్షన్ నుంచి కోర్టు మీదుగా ఎత్తుబ్రిడ్జికి చేరుకుంది. అక్కడ వైఎస్సార్ సీపీ యువజన విభాగం నాయకుడు అవనాపు విక్రమ్, కాళ్ల గౌరీశంకర్, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త గురాన అయ్యలు, ఎస్సీసెల్ కన్వీనర్ ఆదాడ మోహనరావు, పట్టణ మహిళా అధ్యక్షురాలు గండికోట శాంతి తదితరులు షర్మిలకు స్వాగతం పలికారు. షర్మిల బస్సు లో నుంచే సమైక్యాంధ్రకు మద్దతుగా ని నాదాలు చేశారు. దారిపొడవునా మహిళలు, యువకులు ఆమెకు అభివాదం చెప్పారు. వైఎస్సార్ సీపీ జిల్లా యువజ న విభాగం అధ్యక్షుడు అవనాపు విజయ్ ఆధ్వర్యంలో ఎక్కడికక్కడే ఫ్లెక్సీలు, కటౌ ట్లు, ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం లో పార్టీ నాయకులు మజ్జి త్రినాథ్, పొ ట్నూరు బంగార్రాజు, మారేష్, కళావల్లి గోపి, చెన్నాలక్ష్మి, చెల్లూరు ఉగ్రనరసింగరావు, తదితరులు పాల్గొన్నారు. బస్సుయాత్ర ఎత్తుబ్రిడ్జి మీద నుంచి ఆర్అం డ్బీ జంక్షన్, కలెక్టరేట్, జేఎన్టీయూ, బొండపల్లి, గజపతినగరం, రామభద్రపురం మీదుగా సాలూరుకు చేరుకుంది. అన్నిచోట్లా షర్మిలకు అదే ఆదరణ లభిం చింది. దారి పొడవునా ఆమె రాక కోసం ప్రజలు ఎదురుచూశారు. కొన్నిచోట్ల పొ లాల నుంచి వ్యవసాయ కూలీలు పరు గు పరుగున వచ్చారు. విద్యార్థుల పోరాటం అద్భుతం - జేఎన్టీయూ విద్యార్థులతో షర్మిల విజయనగరం రూరల్ : ‘చిన్న వారైనా సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగస్వాము లు కావడం అభినందనీయం.. గ్లాడ్ బ్లెస్ యూ’ అంటూ జేఎన్టీయూ విద్యార్థులను ఉద్దేశించి వైఎస్ఆర్ సీపీ నాయకురాలు షర్మిల అన్నారు. సమైక్య శంఖారావంలో భాగంగా జిల్లా పర్యటనకు వచ్చిన షర్మిల సాలూరు వెళుతూ స్థానిక జేఎన్టీయూ కూడలి వద్ద విద్యార్థులు చేస్తున్న రిలే నిరాహార దీక్ష శిబిరం వద్ద వాహనాన్ని ఆపి విద్యార్థుల ఉద్యమానికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భం గా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని అన్ని వర్గాల ప్రజ లు చేపడుతున్న ఉద్యమంలో వైఎస్ఆర్ సీపీ భాగస్వామ్యం వహిస్తుందని చెప్పా రు. సమైక్యాంధ్ర మద్దతుగా వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ప్రజల పక్షాన నిలిచారని తెలిపారు. టీడీపీ, కాం గ్రెస్ పార్టీ నాయకులు రాజీనామా డ్రా మాలతో ప్రజలను మభ్యపెడుతున్నార ని విమర్శించారు.కార్యక్రమంలో వైఎ స్సార్ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త సుజయ్ కృష్ణ రంగారావు, జిల్లా కన్వీనర్ పెనుమత్స సాంబశివరాజు, నియోజకవర్గ సమన్వయకర్త అవనాపు విజయ్, తదితరులు పాల్గొన్నారు. -
కుట్రదారుల గుండెలదిరేలా... సమైక్య శంఖారావం
వి‘భజన’పరుల కుట్రల అడ్డుగోడలు ఛేదించడమే లక్ష్యంగా ఆమె కదిలారు...జనాల ఆకాంక్షను ప్రతిధ్వనిస్తూ ఆమె సమైక్యశంఖం పూరించారు. సీమాంధ్ర ప్రజల గుండె చప్పుళ్ల ఢంకారావాలను కండకావరనేతల గుండెల్లో గుబులుపుట్టేలా వినిపించారు... ఆమె వాగ్ధాటి, సంధించిన ప్రశ్నల శరాలు జన ప్రవాహంలో చైతన్య తరంగాలను సృష్టించాయి. ఉద్యమానికి నూతనోత్తే‘జనాన్ని’ అందించాయి. వైఎస్ఆర్ సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన సమైక్య శంఖారావం బస్సుయాత్ర ఆదివారం జిల్లాలో నాలుగు నియోజకవర్గాలలో జరిగింది. సాలూరులో సాయంత్రం జరిగిన బహిరంగ సభలో అశేష జనసంద్రం మధ్య ఆమె ప్రసంగం భీకర ప్రళయగంగా ప్రవాహంగా సాగింది... సాలూరు నుంచి సాక్షి ప్రతినిధి : పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణకు పదవి తప్ప ప్రజల మనోభావాలు పట్టడం లేదని మహానేత తనయ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఓట్లు, సీట్ల కోసమే రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు ప్రయత్నిస్తోం దన్నారు. సమన్యాయం లేదా సమైక్యమే లక్ష్యంగా వైఎస్సార్ సీపీ సమైక్య శంఖారావం పేరిట చేపట్టిన బస్సు యాత్రలో భాగంగా ఆదివారం సాయంత్రం ఆమె సాలూరు చేరుకున్నారు. ఈ సందర్భంగా బోసుబొమ్మ జం క్షన్ వద్ద జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. రాష్ట్ర విభజనకు సంబంధించి కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో పాటు పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణకు ముందుగానే తెలుసునని కేంద్రమంత్రి కిశోర్ చంద్రదేవ్ చెప్పారన్నారు. అయినా విభజనపై బొత్స నోరు మెదపడం లేదని ధ్వజమెత్తారు. సీఎం కిరణ్, బొత్స పదవుల కోసం పాకులాడుతున్నారని విమర్శించా రు. ‘మీరు ఎన్ని అక్రమ వ్యాపారాలు చేస్తున్నా ...మీకు పదవులిచ్చి మోస్తున్న ప్రజలకు నష్టం కలుగుతుంటే చూస్తూ ఎలా ఉంటున్నార’ని ప్రశ్నించారు. ఇంత నష్టం చేసి ఇప్పుడు సీమాంధ్రలో ఎలా అడుగుపెట్టగలరని నిల దీశారు. విభజనకు చంద్రబాబే కారణం రాష్ట్ర విభజనకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మరో ప్రధాన కారకుడని షర్మిల ధ్వజ మెత్తారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసుకోండంటూ ఆయన బ్లాంక్ చెక్ లాంటి లేఖ ఇచ్చేశారని ఆరోపించారు. ఇప్పుడేమో ఆయన సమైక్యాం ధ్ర కావాలం టున్నారని.. ఆయన్ను చూస్తుంటే ‘హత్య చేసి మళ్లీ ఆ శవం మీదనే కూర్చుని వెక్కివెక్కి ఏడ్చినట్లుంది’ అని ఎద్దేవా చేశారు. బాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే విభజనకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకు ని, ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆయన్ను, ఆ పార్టీ ఎమ్మెల్యేలను తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చా రు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఉండి ఉంటే ఇలాంటి పరిస్థితులు వచ్చేవి కాదని సాక్షాత్తూ ప్రధాన మంత్రే అన్నారంటే.. మహా నేత ఎంతటి సమైక్యవాదో స్పష్టమవుతోందన్నారు. టీడీపీ, కాంగ్రెస్ ఓట్లు, సీట్ల కోసమే ఇంతటి నీచానికి దిగజారాయని, వాళ్లను భవి ష్యత్ తరాలు కూడా క్షమించవన్నారు. జైల్లో ఉన్నా జగనన్న నిరంతరం ప్రజల కోసమే పో రాడుతున్నారని చెప్పారు. సమైక్యం కోసం పోరాడేది వైఎస్సార్ కాంగ్రెస్సే - సుజయ్ కృష్ణ రంగారావు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఒక్క వైఎ స్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే పోరాడుతోం దని ఆ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త ఆర్వీ సుజయ్ కృష్ణ రంగారావు అన్నారు. రాజకీయ సంక్షోభం వస్తేనే విభజనపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. సీమాంధ్ర ప్రజాప్రతి నిధులు స్పీకర్ ఫార్మెట్లో రాజీనామాలు చేసి ఉద్యమంలోకి రావాలని పిలుపునిచ్చారు. పా ర్టీ అరుకు పార్లమెంట్ నియోజక వర్గ పరిశీల కుడు బేబీనాయన వేదిక మీదకు రాగానే బొబ్బిలి పులి అంటూ అభిమానులు నినాదా లు చేశారు. దీంతో ఆయన జై సమైక్యాంధ్ర అని వేదిక మీద నుంచి ప్రజలతో అనిపిం చారు. పార్టీ జిల్లా కన్వీనర్ పెనుమత్స సాంబ శివరాజు మాట్లాడుతూ షర్మిల యాత్రకు ప్రజ లు బ్రహ్మరథం పడుతున్నారని కొనియాడా రు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు కుంభా రవిబాబు, అవనాపు విజయ్, గులిపల్లి సుదర్శనరావు, గరుడపల్లి ప్రశాంత్ కుమార్, రాయల సుందరరావు, కొయ్యాన శ్రీవాణి, జమ్మాన ప్రసన్నకుమార్, ఉదయభా ను, బోకం శ్రీనివాస్, గేదెల తిరుపతి, కడుబం డి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖరరాజు, ద్వారపురెడ్డి సత్యనారాయ ణ, గురాన అయ్యలు, కాకర్లపూడి శ్రీనివాస రాజు, గొర్లె మధుసూదనరావు, జరజాపు సూ రిబాబు, గిరి రఘు, ముగడ గంగమ్మ, మండవిల్లి కామరాజు పాల్గొన్నారు. పార్టీలో చేరిన మాజీ ఎంపీపీ తీళ్ళ సాలూరు/పాచిపెంట : సాలూరు మండల మాజీ ఎంపీపీ తీళ్ళ సుశీల వైఎస్సార్ సీపీలో చేరారు. ఆమెకు మహానేత తనయ షర్మిల కం డువా వేసి, పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మజ్జి అప్పారావు, కనిమెరకల త్రినాథ, సువ్వాడ గణపతి, అప్పికొండ గణపతి, గుమ్మడాం గణపతి, ఉప్పాడ దైవకృపామణి, మండవిల్లి కామరాజు, శనాపతి కిషోర్, పాడి వేణు, తదితరులు పాల్గొన్నారు. జేఏసీ, ఎన్జీఓలకు అండగా వైఎస్సార్ సీపీ గజపతినగరం : రాష్ట్ర విభజనకు వ్యతిరేకం గా పోరాటం చేస్తున్న జేఏసీ, ఏపీ ఎన్జీఓలకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సో దరి షర్మిల భరోసా ఇచ్చారు. సమైక్య శంఖారావం బస్సుయూత్ర ఆదివారం సా యంత్రం గజపతినగరం మండల కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆమె జాతీ య రహదారిపై రిలే దీక్షలు చేస్తున్న ఎన్జీఓలు, జేఏసీ నాయకులకు సంఘీభావం తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఉద్యమాలు చేస్తున్న జేఏసీ, ఎన్జీఓలకు ప్రభుత్వం జీతాలు నిలిపివేయడం శోచనీ యమన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితికి కాంగ్రెస్, టీడీపీలే కారణమని ఆరోపిం చారు. వచ్చే ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు ప్రజలే బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. సీమాంధ్రప్రజలు సుమారు 45 రోజులుగా ఆందోళనలు చేపడుతున్నా.. కేంద్ర ప్రభుత్వానికి పట్టకపోవడం దారుణమన్నారు. జగనన్న అధికారంలోకి వస్తే.. కార్మికులు, ఉద్యోగులు, విద్యార్థులకు న్యాయం చేస్తారని భరోసా ఇచ్చారు. -
ఇవి రాజకీయాలా?
బాబు పాదయాత్రలు, బస్సుయాత్రలు, ఢిల్లీయాత్రలు ప్రజల కోసం కాదు.. జగన్‌ను అడ్డుకోవటం కోసమే జగన్ బెయిల్‌ను అడ్డుకోవటానికి ఢిల్లీ వెళ్తున్నామని నిస్సిగ్గుగా చెప్తున్నారు.. అసలు మీరు ఏ రకం నాయకులు? ఇవి రాజకీయాలా? తెలంగాణ ఇచ్చేసుకోండని బ్లాంకు చెక్కు ఇచ్చిన చంద్రబాబు.. హత్య చేసి ఆ శవం మీదే పడి వెక్కివెక్కి ఏడ్చినట్టు ప్రజలను మభ్యపెట్టటానికి ఇప్పుడు మొసలి కన్నీళ్లు కారుస్తున్నారు ఓట్లు, సీట్ల కోసమే కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజించాలనుకుంటోంది టీడీపీ సహా ఐదు పార్టీలు విభజనకు అనుకూలమని చెప్తే.. వైఎస్సార్ సీపీ, సీపీఎం, ఎంఐఎంలు విభజనకు ఎప్పుడూ అనుకూలమని చెప్పలేదు ఇప్పటికీ మించిపోయింది లేదు.. బాబుకు చిత్తశుద్ధి ఉంటే విభజనకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కుతీసుకోవాలి.. తాను రాజీనామా చేసి, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో రాజీనామాలు చేయించాలి విశాఖ, విజయనగరం జిల్లాల్లో షర్మిల 13వ రోజు సమైక్య శంఖారావం యాత్ర ప్రజల సమస్యలను కాదని.. జగన్ బెయిల్‌ను అడ్డుకునే బాబు యత్నాలపై షర్మిల ఈసడింపు సమైక్య శంఖారావం నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘చంద్రబాబు గారు పాదయాత్రలు చేసినా, బస్సు యాత్రలు చేసినా, ఢిల్లీ యాత్రలు చేస్తున్నా ప్రజల కోసం కాదు కేవలం జగన్మోహన్రెడ్డి గారిని అడ్డుకోవటం కోసం. తొమ్మిది సంవత్సరాలు అధికారపక్షంలో ఉండి, మరో తొమ్మిది సంవత్సరాలు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఆఖరికి ఒక్క యువకుడ్ని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేకుండా ఈ రోజు ఆయన బెయిల్‌ను అడ్డుకోవటానికి ఢిల్లీకి వెళ్తున్నామని నిస్సిగ్గుగా చెప్తున్నారంటే... అసలు మీరు ఏ రకం నాయకులు? ఒక అమాయకుడ్ని తీసుకెళ్లి 16 నెలలుగా నేరం రుజువు కాకుండానే జైలు పాలు చేశారంటే.. ఛీ..! ఇవి రాజకీయాలా?! మీలాంటి వాళ్లు మనుషులా?’’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల ఈసడించుకున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే డిమాం డ్తో షర్మిల పూరించిన సమైక్య శంఖారావం యాత్ర ఆదివారం 13వ రోజు విశాఖ, విజయనగరం జిల్లాల్లో సాగింది. విశాఖపట్నం నగరం, విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో జరిగిన సమైక్య శంఖారావం సభలకు భారీ ఎత్తున తరలి వచ్చిన ప్రజలను ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు. ఈ ప్రసంగాల సారాంశం ఆమె మాటల్లోనే... మీ ఎమ్మెల్యేలను బేరం పెట్టటానికి వెళుతున్నారా బాబూ? ‘‘చంద్రబాబు గారు ఇప్పుడు ఢిల్లీకి వెళ్తున్నారట. ఎందుకు వెళ్తున్నారు చంద్రబాబు గారు అంటే.. రాష్ట్రంలో చాలా అనిశ్చితి నెలకొని ఉందట.. ఈ అనిశ్చితిని దూరం చేయాలని కాంగ్రెస్ పార్టీని అడగటానికని చంద్రబాబునాయుడు గారు ఢిల్లీకి వెళ్తున్నారట. అసలు ఈ అనిశ్చితికి కారణం మీరు కాదా చంద్రబాబు గారూ? తెలంగాణకు అనుకూలంగా లేఖలు ఇచ్చి ఈ అనిశ్చితికి కారణమై మళ్లీ ఏ మొఖం పెట్టుకొని అనిశ్చితి దూరం చేయటానికి వెళ్తున్నానని చెప్తున్నారు చంద్రబాబు గారూ? తెలుగుదేశం పార్టీలో ఉన్న రెండు ప్రాంతాల నాయకులను తీసుకొని ఢిల్లీకి వెళ్తున్నానని చంద్రబాబు గారు అంటారు. అంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చంద్రబాబు గారు? మీది రెండు కళ్ల సిద్ధాంతం అని చెప్పాలనుకుంటున్నారా? మీది రెండు నాలుకల ధోరణి అని చెప్పాలనుకుంటున్నారా? అందుకనే ఎప్పుడూ రెండు వేళ్లు ఊపుకుంటూ తిరుగుతారా? ఏం చెప్పాలనుకుంటున్నారు? సమైక్యానికి అనుకూలం అని చెప్పాలనుకుంటున్నారా? లేక విభజనకు అనుకూలం అని చెప్పాలనుకుంటున్నారా? లేకపోతే నాకు ఇంతమంది ఎమ్మెల్యేలు, ఇంత మంది ఎంపీలు ఉన్నారు చూడండీ అని, వాళ్లను అమ్మకానికి పెట్టి.. జగన్మోహన్రెడ్డి గారికి ఎలాగైనా బెయిల్ రాకుండా చూడ్డానికి బేరాలు కుదుర్చుకోవటానికి ఢిల్లీ వెళ్తున్నారా? లేకపోతే ఒక కిరణ్‌కుమార్‌రెడ్డి గారికే కాదు, ఒక బొత్స సత్యనారాయణ గారికే కాదు నాకు కూడా సోనియాగాంధీ గారు అధిష్టానమే.. మీరు ఏది ఆదేశిస్తే అది శిరసా వహిస్తాను.. అని చెప్పి కాళ్ల మీద పడి.. నామీద మట్టుకు ఏ కేసులు, విచారణలు జరగకుండా చూడండి అని వేడుకోవడానికి వెళ్తున్నారా? చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో కలిపేసిన ట్టు మీరు కూడా తెలుగుదేశం పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపేసుకుంటే కనీసం మీకు కేంద్రమంత్రి పదవైనా వస్తుందేమో..! ఈ రాష్ట్రంలో ఉంటే మీకు ఏదీ రాదు చంద్రబాబు గారు. తెలంగాణను ఇచ్చేసుకుంటే ఇచ్చేసుకోండి అని బ్లాంకు చెక్కు ఇచ్చేసినట్లు లేఖలు రాసి ఇచ్చేశారు ఈ చంద్రబాబుగారు. హత్య చేసి ఆ శవం మీదే పడి వెక్కివెక్కి ఏడ్చినట్టు చంద్రబాబు గారు తెలంగాణకు అనుకూలంగా లేఖనిచ్చేసి ఇప్పుడు ప్రజలను మభ్యపెట్టటానికి మొసలి కన్నీళ్లు కారుస్తున్నారు. సీఎం, బొత్సలు దిష్టిబొమ్మల్లాగా కూర్చున్నారు... ఓట్లు, సీట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విడగొట్టాలనుకుంటోంది. కనీసం ఈ ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్తారని అనుకుంటే దిష్టిబొమ్మలాగా కూర్చున్నారు. బొత్సగారు ఈ ప్రాంతం నాయకుడు కదా! పీసీసీ అధ్యక్షుడు కదా! ఈయన గారైనా ఏమైనా సమాధానం చెప్తాడా? అంటే.. ఈయన గారు కూడా ఇంకో దిష్టి బొమ్మలాగా నిల్చొని చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేస్తుందని, ఆ విషయం గురించి మన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గారికి, బొత్స గారికి చాలా స్పష్టంగా ఎప్పటి నుంచో తెలుసని కేంద్రమంత్రి కిశోర్‌చంద్రదేవ్ గారు స్వయంగా చెప్పారు. అంటేముఖ్యమంత్రికి, బొత్స గారికి ఈ కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రాన్ని చీల్చబోతున్న సంగతి తెలిసి కూడా.. అడ్డుకుంటే వీళ్ల పదవులు ఎక్కడ పోతాయోనని అడ్డుకోనూ లేదు. బొత్స గారూ..! కాంగ్రెస్ పార్టీ చీల్చుతుందన్న సంగతి ముందు మీకు తెలుసా? తెలియదా? ముందే తెలిస్తే ఎందుకు అడ్డుకోలేదు? కనీసం ప్రజలకు ఎందుకు చెప్పలేదు? లేకపోతే మీకు చెప్పకుండానే చేసి ఉంటే.. దిగ్విజయ్‌సింగ్ గారు మన రాష్ట్రాన్ని చీల్చుతున్నామని ప్రకటన చేసిన రోజే మీరు ఎందుకు రాజీనామాలు చేసి ప్రజల పక్షాన నిలబడలేదు? మేం విభజనకు ఎప్పుడూ మద్దతు పలకలేదు... తెలుగుదేశం పార్టీతో సహా ఐదు పార్టీలు ఈ విభజనకు మద్దతు పలికితే.. మూడు పార్టీలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సీపీఎం, ఎంఐఎం పార్టీలు ఎప్పుడూ విభజనకు మద్దతు పలకలేదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉన్నా, ఇంకా ఆయనలో ఏమాత్రం నిజాయితీ మిగిలి ఉన్నా తాను కూడా తెలంగాణకు వ్యతిరేకమేనని.. ఇప్పటికైనా ఈ మూడు పార్టీల పక్షాన నాలుగో పార్టీగా చేరి, కోట్ల మంది ప్రజలకు క్షమాపణ చెప్పి, తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవాలి. కోట్ల మంది ప్రజలకు అన్యాయం చేయటం తగదని ఆయన రాజీనామా చేయాలి. తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలను రాజీనామా చేయించాలి. అంతవరకు చంద్రబాబు గాని, టీడీపీ నాయకులు గాని సీమాంధ్రలో అడుగుపెట్టడానికి వీలు లేదని ప్రజలంతా తరిమి కొట్టాలి. ఆ రోజే వారు కూడా రాజీనామా చేసి ఉంటే... హఠాత్తుగా ఏ పరిష్కారం చూపించకుండా కాంగ్రెస్ పార్టీ ఓట్లు, సీట్ల కోసం మన రాష్ట్రాన్ని చీలుస్తున్నామని ప్రకటించిన వెంటనే, ఆ సంకేతాలు పంపించిన వెంటనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అంతమంది నాయకులు రాజీనామాలు చేశారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి గారు కూడా రాజీనామాలు చేశారు.. నిరాహార దీక్షలు చేశారు. లేఖల మీద లేఖలు రాసి.. ఇది అన్యాయం మా రాష్ట్రాన్ని విడగొట్టొద్దని ఈ రోజుటి వరకు పోరాటం చేస్తూనే ఉన్నారు. కానీ ఎంత మంది టీడీపీ, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజీనామాలు చేసిన రోజునే వీళ్లందరూ రాజీనామాలు చేసుంటే.. కాంగ్రెస్ పార్టీ తన నిర్ణయాన్ని మార్చుకునేలా ఒత్తిడి పెరిగేది. కానీ పదవీ మత్తులో మునిగి తేలుతున్న ఈ కాంగ్రెస్, టీడీపీ నాయకులు ప్రజలకంటే తమ పదవే ముఖ్యమని మళ్లీ నిరూపించుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నుంచీ ఒకే మాట చెప్పింది. ఏ ఒక్క ప్రాంతానికి అన్యాయం జరగకుండా, ఒక కన్నతండ్రిలాగా ఆలోచన చేయాలి. ఆ ఆలోచన మీరు ఎలా చేస్తారో మీ ఉద్దేశం ఎలా ఉందో ముందు అందరినీ పిలవండి అని పదేపదే చెప్పింది, లేఖలు రాసింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఇది ప్రజాస్వామ్య దేశమనే విషయాన్నే మరచి వ్యవహరించింది. అందుకే మళ్లీ చెప్తున్నాం. న్యాయం చేయ డం మీ ఉద్దేశమే కాదని తేలిపోయింది కనుక రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. సమైక్య రాష్ట్రం కోసం జగనన్న నాయకత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రజల తరఫున నిలబడి పోరాటం చేస్తుందని మీకు మాటిస్తున్నాం.’’ -
షర్మిళ శంఖారావం 15th Sept 2013
-
రేపు సాలూరులో షర్మిల బహిరంగ సభ: పెనుమత్స
విజయనగరం టౌన్, న్యూస్‌లైన్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన బస్సు యాత్ర చరిత్రలో మరో మైలురాయిగా నిలుస్తుందని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ పెనుమత్స సాంబ శివరాజు చెప్పారు. బస్సు యాత్రలో భాగంగా షర్మిల 15న ఆదివారం సాలూరు రానున్నట్టు తెలిపారు. ఆ రోజు సాయంత్రం సాలూరులో జరిగే భారీ బహిరంగ సభలో ఆమె ప్రసంగిస్తారని చెప్పారు. దీనికి సంబంధించి పార్టీ సమన్వయకర్తలు, నాయకులు, కార్యకర్తలు, జగన్ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆ పార్టీ జిల్లా కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రం ఆందోళనలతో అట్టుడుకుపోతుంటే కాంగ్రెస్ నేతలకు పట్టకపోవడం దారుణమని విమర్శించారు. కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కు రాజకీయాలతో రాష్ట్రంలో ఈ పరిస్థితి నెలకొందన్నారు. ప్రజల మనోభావాలను గుర్తెరిగిన పార్టీగా వైఎస్ఆర్ సీపీ పని చేస్తోందన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలంతా ఆ పార్టీ అధినేతతో పాటు స్పీకర్ ఫార్మెట్లో రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందేనన్నారు. ప్రజల కష్టసుఖాలను తెలుసుకునేందుకు వారి బాధల్లో భాగస్వాములయ్యేందుకు వైఎస్ఆర్ కుటుంబం మొత్తం పని చేస్తోందన్నారు. ఇందులో భాగంగానే షర్మిల బస్సు యాత్ర చేపట్టారని తెలిపారు. ఆ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు అవనాపు విజయ్ మాట్లాడుతూ షర్మిల బస్సు యాత్రను విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్రాన్ని విడగొట్టాలని కుట్ర పన్నిన కాంగ్రెస్, టీడీపీ నేతలు నేడు ఉద్యమాల్లో పాల్గొనడం విడ్డూరంగా ఉందన్నారు. పార్టీ ప్రచార కార్యదర్శి గొర్లె వెంకటరమణ మాట్లాడుతూ సాలూరులో నిర్వహించే భారీ బహిరంగ సభకు జిల్లా నలుమూలల నుంచి కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు. సమావేశంలో పార్టీ నాయకులు డాక్టర్ గేదెల తిరుపతి, డాక్టర్ సురేష్‌బాబు, అంబళ్ల అప్పల నాయుడు, ఇప్పిలి రామారావు, చెల్లూరు ఉగ్రనరసింగరావు, నామాల సర్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
షర్మిల బస్సు యాత్రకు విశేష స్పందన
సాక్షి ప్రతినిధి, ఏలూరు : సమైక్యాంధ్ర ఉద్యమం హోరెత్తుతున్న తరుణంలో జిల్లాలో షర్మిల నిర్వహించిన ‘సమైక్య శంఖారావం’ బస్సుయాత్ర కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ప్రజల అభీష్టానికి అనుగుణంగా సమైక్య రాష్ట్రం కోసం ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలతో కలిసి పోరాడుతోంది. ఉద్యోగ, విద్యార్థి, ఉపాధ్యాయ తదితర జేఏసీలు నిర్వహించే ఆందోళనలకు మద్దతు ప్రకటించి వారితోపాటు సమైక్య ఉద్యమంలో ఆ పార్టీ నేతలు, శ్రేణులు మమేకమవుతున్నారు. ఈ క్రమంలోనే ఆ పార్టీ అధినేత వైఎస్. జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల సమైక్య శంఖారావం పేరుతో బస్సుయాత్ర చేసి ఉద్యమాన్ని మరింత పదునెక్కించారు. ఏలూరులో జరిగిన సభ లో షర్మిల సమైక్యాంధ్రకు మద్దతుగా మాట్లాడిన తీరు సమైక్యవాదుల్లో కొత్త ఆలోచనల్ని రేకెత్తించింది. మరోవైపు జిల్లా నలుమూలల నుంచి ఇక్కడ జరిగిన బహిరంగ సభకు భారీ సం ఖ్యలో జనం హాజరుకావడంతో సమై క్య ఉద్యమ ఉధృతి స్పష్టమయ్యింది. అన్ని వయసుల వారు, ఉద్యోగు లు, వ్యాపారులు, కులవృత్తుల వారు, సమైక్య ఉద్యమంలో భాగస్వాములవుతున్నా అధికార, ప్రతిపక్ష పార్టీలు భిన్న వైఖరులతో ఇష్టానుసా రం వ్యవహరించడాన్ని జిల్లా ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ సమైక్య ఉద్యమంలో పాలుపంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే రాజకీయంగా సీమాంధ్ర ప్రాంతానికి సరైన దన్ను లభించడంలేదని ఆందోళన చెం దుతున్న సమైక్యవాదులంతా వైఎస్సా ర్ కాంగ్రెస్ పార్టీ వైఖరిని ఆమోదించి మద్దతు ప్రకటించాయి. ఈతరుణంలో నే షర్మిల రాక వారికి మరింత ఉత్తేజాన్నిచ్చింది. షర్మిల పాల్గొన్న బహిరంగ సభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతోపాటు ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు పెద్దఎత్తున పాల్గొన్నారు. కాంగ్రెస్, టీడీపీ నేతలను సమైక్య వేది కలపైకి రానీయకపోవడంతోపాటు ఎక్కడపడితే అక్కడ నిలదీస్తున్న ప్రజ లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై మా త్రం ఆదరణ కనబరుస్తున్నారనడానికి ఇదే నిదర్శనం. సభలో పాల్గొనడమే కాకుండా సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక నాయకులు ఉద్యమంలో చురుగ్గా పాలుపంచుకుంటున్న వైఎస్సార్సీపీకి అభినందనలు తెలపడం విశేషం. ఆ పార్టీకే తమ పూర్తి మద్దతు ఉంటుంద ని వేదికలో భాగంగా ఉన్న ఉద్యోగ సంఘాల నాయకులు ప్రకటించారు. మరోవైపు సమైక్య శంఖారావం నేపథ్యంలోనే రాజకీయ సమీకరణలు మారాయి. ఇప్పటికే కొల్లేరు ప్రజలు వైఎస్సార్సీపీకి మద్దతు ప్రకటించగా మిగిలిన కొల్లేరు పెద్దలు, ఇతర నాయకులు కూడా ఈ సభలో పార్టీలో చేరడంతో వైఎస్సార్ సీపీకి మరింత బలం పెరిగింది. కాంటూరు సమస్య పరిష్కారం కోసం అన్ని రాజకీయ పార్టీల మద్దతు కోరిన కొల్లేరు నాయకులు చివరికి ఈ సమస్యను పరిష్కరించగలిగేది వైఎస్సార్ సీపీయేనని నమ్మి పార్టీలో చేరడం విశేషం. కాంగ్రెస్ ఖాళీ షర్మిల సభ తర్వాత ఏలూరు నియోజ కవర్గంలో కాంగ్రెస్ పార్టీ దాదాపు ఖాళీ అయింది. కేంద్ర మంత్రి కావూరు, ఇతర నాయకుల అనుచరులు తప్ప డివిజన్లలో నాయకులు, క్యాడర్ పూర్తి స్థాయిలో వైఎస్సార్సీపీలోకి వచ్చారు. మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని ఆధ్వర్యంలో వారంతా షర్మిలకు జైకొట్టారు. కాం గ్రెస్ పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి వైఎస్సార్సీపీలో చేరారు. షర్మిల యాత్రతో సమైక్య ఉద్యమం మరింత పదునెక్కిందని పలువురు అంటున్నారు. -
షర్మిల బస్సుయాత్రను విజయవంతం చేయండి
విజయనగరం టౌన్, న్యూస్‌లైన్: జగనన్న వదిలిన బాణం దూసుకుపోతోంది. ఇప్పటికే మరో ప్రజాప్రస్థానం పాదయాత్రతో జిల్లా ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న షర్మిల సమైక్య శంఖారావం పేరిట మళ్లీ ప్రజలకు చేరువయ్యేందుకు బస్సుయాత్ర రూపంలో జిల్లాకు వస్తున్నారు. ఈ నెల 15న జిల్లాలో జరిగే షర్మిల బస్సుయాత్రను విజయవంతం చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సమన్వయకర్తలు, కార్యకర్తలు విశేష కృషి చేయాలని పార్టీ జిల్లా కన్వీనర్ పెనుమత్స సాంబశివరాజు కోరారు. ఈ మేరకు గురువారం ఆయన పార్టీ జిల్లా కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్తలు, నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల కష్టాలు తెలుసుకునే ఏకైక పార్టీగా వైఎస్ఆర్సీపీ ఆవిర్భవించిందన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా స్పీకర్ ఫార్మాట్లో రాజీనామాలు చేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్,టీడీపీ నాయకుల కుటిల యత్నాలను తిప్పికొట్టేందుకు ప్రతి నాయకుడు, కార్యకర్త పాటుపడాలని కోరారు. ప్రజల కోసం పనిచేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి గ్రామగ్రామాన పార్టీ నాయకులు ప్రజలకు వివరించాలని సూచించారు. అదేవిధంగా సమైక్యాంధ్రకు మద్దతుగా నేటి నుంచి పార్టీఆధ్వర్యంలో రిలే దీక్షలు, కార్యక్రమాలు చేపట్టాలని నాయకులకు, కార్యకర్తలకు సూచించారు. ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని, సమైక్యాంధ్రను సాధించే వరకూ పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. అర్ధరాత్రి నుంచి ఉద్యోగులు చేస్తున్న 48 గంటల బంద్‌కు వైఎస్ఆర్సీపీ పూర్తి మద్దతు ప్రకటిస్తోందని చెప్పారు. సమావేశంలో నియోజకవర్గ సమన్వయకర్తలు కొయ్యాన శ్రీవాణి, జమ్మాన ప్రసన్నకుమార్, అవనాపు విజయ్, డాక్టర్ గేదెల తిరుపతి, కోట్ల సూర్యనారాయణ, పార్టీ నాయకులు గొర్లె వెంకటరమణ, సింగుబాబు, డాక్టర్ సురేష్‌బాబు, చెల్లూరు ఉగ్రనర సింగరావు, నామాల సర్వేశ్వరరావు, అన్ని మండలాల పార్టీ కన్వీనర్లు పాల్గొన్నారు. -
సమైక్యవాదుల్లో పోరాట పటిమ నింపిన షర్మిల ‘సమైక్య శంఖారావం’
సాక్షి, గుంటూరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల జిల్లాలో పూరించిన ‘సమైక్య శంఖారావం’ సమైక్య వాదుల్లో పోరాట పటిమను నింపింది. టీడీపీ, కాంగ్రెస్ నేతల్ని అంతర్మథనంలో పడేసింది. చంద్రబాబు బస్సు యాత్రలో అసలు సమైక్యాం ధ్ర పదమే వినపడలేదని, షర్మిల తెలుగు ప్రజల అభీష్టానికి అనుగుణంగా ‘జై సమైక్యాంధ్ర’ అంటూ నినాదాలు చేసి సభలకు హాజరైన వారిలో స్ఫూర్తి నింపారని సమైక్యవాదులు గుర్తు చేసుకుంటున్నారు. ఇదిలావుంటే, టీడీపీ, కాంగ్రెస్ శిబిరాల్లో గుబులు బయలుదేరింది. జిల్లాలో బుధవారం వినుకొండ నుంచి రేపల్లె వరకు ఏకబిగిన 200 కిలోమీటర్లకు పైగా బస్సు యాత్ర చేసిన షర్మిల ఓట్లు, సీట్ల కోసం రాజకీయ డ్రామాలాడుతున్న కాంగ్రెస్, టీడీపీల అసలు రంగుల్ని బయటపెట్టారు. విభజనకు కారకుడైన చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతాన్ని, తెలుగు ప్రజల నడుమ అగ్గి పెట్టి చలికాచుకుంటున్న కాంగ్రెస్ నేతల వైఖరిని షర్మిల దుయ్యబట్టారు. తెలుగు ప్రజలకు భరోసా కల్పిస్తూ, వారి ఇష్టానికి అనుగుణంగా అడుగులేస్తున్న వైఎస్సార్ సీపీ వెంట జనం నడుస్తుండటంతో టీడీపీ, కాంగ్రెస్ శ్రేణుల్లో నైతిక స్థైర్యం దెబ్బతింటోంది. పైగా జిల్లా ప్రజలు సమైక్య ఉద్యమానికి కట్టుబడి 44 రోజులుగా ఆందోళనలు చేస్తుండడంతో భవిష్యత్తులో ఆ రెండు పార్టీల పుట్టి మునగడం ఖాయమన్న అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది. రానున్న ఎన్నికల్లో ఆ రెండు పార్టీల మనుగడ ప్రశ్నార్థకం కాగలదనే అనుమానాన్ని వ్యక్తచేస్తున్నారు. ఇదే అభిప్రాయం ఆ పార్టీ నేతల ప్రైవేట్ సంభాషణల్లోనూ చర్చకు వస్తుంది. కాంగ్రెస్‌తో చేతులు కలిపామన్న భావన ప్రజల్లో బలంగా నాటుకుందని, ఇది పార్టీ ఉనికికి ప్రమాదమని టీడీపీ నేతలు తమ అంతర్గత సంభాషణల్లో అంగీకరిస్తున్నారు. మేకపోతు గాంభీర్యం ప్రదర్శించక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయనీ స్వయంగా ఒప్పుకుంటున్నారు. సీమాంధ్రలో కాంగ్రెస్ పరిస్థితి దారుణం .. 125 ఏళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పరిస్థితి సీమాంధ్రలో దారుణంగా తయారైందని, తాను మాత్రం ఇప్పుడు ఏ పార్టీలో లేనని జిల్లాకు చెందిన సీనియర్ అయిన ఓ మాజీ మంత్రి వ్యాఖ్యానించారు. మహానేత వైఎస్ ఉండి ఉంటే రాష్ట్రం పరిస్థితి ఇలా ఉండేది కాదని టీడీపీకి చెందిన వారే వ్యాఖ్యానించడం పరిశీలనాంశం. జిల్లాలో జరిగిన చంద్రబాబు, షర్మిల యాత్రలను రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. చంద్రబాబు బస్సు యాత్ర ఆద్యంతం ఆత్మస్తుతి,పరనిందగా, సమైక్యాంధ్ర ఉద్యమాలను పట్టించుకోకుండా సాగిందంటున్నారు. జగన్ సోదరి షర్మిల యాత్ర సమైక్యాంధ్రను కాంక్షిస్తున్న కార్మిక, కర్షక, ఉపాధ్యాయ,ఉద్యోగ, విద్యార్థి, ప్రజా సంఘాల్లో మరింత స్ఫూర్తిని నింపిందని కుండబద్దలు కొట్టినట్లు చెబుతున్నారు. -
షర్మిల బస్సుయాత్ర ముగింపు సభ 16న
శ్రీకాకుళం, న్యూస్‌లైన్: మహానేత వైఎస్సార్ తనయ షర్మిల చేపట్టిన బస్సు యాత్ర ముగింపు సభ ఈ నెల 16వ తేదీ సాయంత్రం 4 గంటలకు శ్రీకాకుళం పట్టణంలో జరగనున్నట్టు నరసన్నపేట ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ శాసనసభ పక్ష ఉప నేత ధర్మాన కృష్ణదాస్ చెప్పారు. జిల్లా పార్టీ కార్యాల యంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గతంలో 3,111 కిలోమీటర్ల పాదయాత్ర జరిపిన షర్మిల ప్రస్తుతం సమైక్యాంధ్ర ఉద్యమంలో ప్రజలను చైతన్యపరిచేందుకు, పార్టీ విధివిధానాలను తెలిపేందుకు బస్సు యాత్ర చేపట్టారన్నారు. రాజాం, ఎచ్చెర్ల, టెక్కలి, శ్రీకాకుళం నియోజకవర్గాల్లో బస్సు యాత్ర ఉంటుందని, రెండు సభలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. సభలు ఎక్కడెక్కడ జరుగుతాయన్న విషయమై పార్టీ ముఖ్యులతో చర్చించి ఈ నెల 14న ఖరారు చేస్తామన్నారు. వైఎస్సార్ సీపీ నేత తమ్మినేని సీతారాం మాట్లాడుతూ షర్మిల బస్సుయాత్రను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో పార్టీ జిల్లా కన్వీనర్ ధర్మాన పద్మప్రియ కృష్ణదాస్, యువజన విభాగం జిల్లా కన్వీనర్ హనుమంతు కిరణ్‌కుమార్, మహిళా విభాగం జిల్లా కన్వీనర్ బొడ్డేపల్లి పద్మజ, శ్రీకాకుళం జిల్లా నియోజకవర్గ సమన్వయకర్తలు వై.వి.సూర్యనారాయణ, వరుదు కళ్యాణి, టెక్కలి సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్, ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త కిల్లి రామ్మోహనరావు, పార్టీ నేతలు అందవరపు సూరిబాబు సంపతి రావు రాఘవరావు, ధర్మాన ఉదయ్‌భాస్కర్, ఎన్ని ధనుంజయ, శిమ్మ వెంకట్రావు, చింతాడ గణపతి, నక్క రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
సమైక్య నీరాజనం
సాక్షి ప్రతినిధి, ఏలూరు : హేలాపురి జనసంద్రమైంది. ఉద్యోగులు.. ఉపాధ్యాయులు.. విద్యార్థులు.. మహిళలు.. అన్నివర్గాల ప్రజలు సమైక్య శంఖారావానికి జై కొట్టారు. ఎటుచూసినా జనమే కని పించారు. చంటిపిల్లల్ని చంకన వేసుకుని మహిళలు, ఊతకర్రల సాయంతో వృద్ధులు సైతం సభకు తరలివచ్చారు. రాష్ట్రాన్ని విడగొట్టవద్దంటూ ఊరూవాడా హోరెత్తెలా పోరాడుతున్న ప్రజలు అదే డిమాండ్‌తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల నిర్వహిస్తున్న బస్సుయాత్రకు ఎదురేగి అపూర్వ స్వాగతం పలికారు. సమైక్య శంఖారావం పేరిట ఆమె చేపట్టిన బస్సుయాత్ర గురువారం జిల్లాలో ప్రవేశిం చింది. ప్రతిచోటా షర్మిలకు అపూర్వ ఆదరణ లభించింది. బస్సుయూత్ర సాయంత్రం 5 గంటలకు కృష్ణా జిల్లా నుంచి ఏలూరు రూరల్ మండలం పెదఎడ్లగాడి వద్ద జిల్లాలోకి ప్రవేశిం చింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు ఆమెకు ఘన స్వాగతం పలి కారు. మహేశ్వరపురం వద్ద గ్రామస్తులు కాన్వాయ్‌ని ఆపి షర్మిలను గ్రామంలోకి రావాలని ఆహ్వానించారు. దీంతో ఆమె బస్సు దిగి అక్కడున్న అంబేద్కర్, వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పిం చారు. శ్రీపర్రు గ్రామంలోనూ మహిళలు బస్సును ఆపి షర్మిలతో కరచాలనం చేసేం దుకు పోటీపడ్డారు. మాదేపల్లిలో సొంత ఆడపడచులా ఆమెకు హారతులిచ్చి సాదరంగా ఆహ్వానించారు. అక్కడి నుంచి ఏలూరు నగరంలోకి వచ్చేవరకూ ప్రతిచోటా షర్మిలను చూసేందుకు జనం రోడ్లపై వేచివున్నారు. వారందరికీ అభివాదం చేస్తూ ఆమె ముందుకు కదిలారు. ఏలూరు నగరంలోని జూట్‌మిల్లు వద్ద వేలాదిమంది కొల్లేరు ప్రజలు షర్మిలకు స్వాగతం పలకడంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. అక్కడి నుంచి ఓవర్‌బ్రిడ్జి మీదుగా వేలాది మందితో ర్యాలీగా బస్సుయాత్ర ఫైర్‌స్టేషన్ సెంటర్‌కు చేరుకుంది. ఓవర్ బ్రిడ్జి అంతా జనసందోహంతో నిండిపోయింది. జూట్‌మిల్ నుంచి ఫైర్‌స్టేషన్ సెంటర్ వరకూ జనం బారులు తీరి నిలబడి షర్మిలకు అభివాదం చేశారు. ఆకర్షించిన ఎన్జీవోలు ఈ సభలో ఎన్జీవోలు ప్రధాన ఆకర్షణగా నిలి చారు. బహిరంగ సభకు పెద్దఎత్తున ఉద్యోగులు తరలిరావడంతోపాటు ఎన్జీవో నేతలు బస్సు ఎక్కి ప్రసంగించారు. ఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎల్.విద్యాసాగర్, ఆర్టీసీ జేఏసీ నాయకుడు, సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక రాష్ట్ర కో-కన్వీనర్ ప్రసాదరావు సమైక్య రాష్ట్రం కోసం పోరాడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సభలోనే మద్దతు ప్రకటించారు. షర్మిల ప్రసంగాన్ని ఉద్యోగులంతా ఆసక్తిగా విన్నారు. హోరెత్తిన ర్యాలీలు సమైక్య శంఖారావానికి కొల్లేటి లంక గ్రామాల ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. పాతబస్టాండ్ నుంచి ర్యాలీగా వేలాది మంది సభాస్థలికి చేరుకున్నారు. వివిధ వర్గాల ప్రజలు ప్రదర్శనగా సభా ప్రాంగణానికి చేరు కున్నారు. సభ జరిగేది సాయంత్రమైనా మధ్యాహ్నం 2 గంటల నుంచే నగరంలోకి జనం తాకిడి మొదలైంది. మధ్యాహ్నం కొద్దిసేపు వర్షం కురిసినా లెక్కచేయకుండా జనం వస్తూనే ఉన్నారు. ఆ తర్వాత ఎండను కూడా పట్టించుకోకుండా సభాస్థలి వద్దే షర్మిల వచ్చేవరకూ వేచి ఉన్నారు. సభలో వైఎస్సార్ కాం గ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్, ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మాజీ ఎమ్మెల్యే, ఏలూరు నియోజకవర్గ సమన్వయకర్త ఆళ్ల నాని, మాజీ ఎమ్మెల్యేలు మద్దాల రాజేష్, తానేటి వనిత, ముదునూరి ప్రసాదరాజు, పాతపాటి సర్రాజు, నాయకులు కొయ్యే మోషేన్‌రాజు, తోట గోపి, చీర్ల రాధ య్య, చలుమోలు అశోక్‌గౌడ్, పీవీ రావు, కొఠారు రామచంద్రరావు, మొవ్వా ఆనంద్శ్రీనివాస్, కర్రా రాజారావు, బొడ్డు వెంకటరమణచౌదరి, కండిబోయిన శ్రీనివాస్, గంటా ప్రసాద్, కావ లి నాని, ముంగర సంజీవకుమార్, బీసీ సెల్ జిల్లా కన్వీనర్ పాశం రామకృష్ణ, మహిళా విభా గం జిల్లా కన్వీనర్ ఉమాబాల పాల్గొన్నారు. పోటెత్తిన ఫైర్‌స్టేషన్ సెంటర్ షర్మిల సభ నిర్వహించిన ఫైర్‌స్టేషన్ సెంటర్ ఇసుకవేస్తే రాలనంతమంది జనంతో నిండిపోయింది. ఈ సెంటర్లోని బస్టాండ్, అశోక్‌నగర్, ఓవర్‌బ్రిడ్జి రోడ్లు కిటకిటలాడిపోయాయి. షర్మిల ఉద్వేగపూరితంగా చేసిన ప్రసంగానికి విశేష ఆదరణ లభించింది. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ ఆమె చెప్పినప్పుడల్లా జనం చప్పట్లతో ఆ ప్రాంతాన్ని మార్మోగించారు. కేంద్ర మంత్రి, ఏలూరు ఎంపీ కావూరు సాంబశివరావు సమైక్యాం ధ్రకు వ్యతిరేకంగా ఉన్న విషయాన్ని షర్మిల ప్రశ్నించినప్పుడు సభికుల నుంచి మంచి స్పందన వచ్చింది. -
నేడు షర్మిల సమైక్య శంఖారావం
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న డిమాండ్‌తో మహానేత రాజన్న తనయ, జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల తిరుపతి వెంకన్న సాక్షిగా పూరించిన ‘సమైక్య శంఖారావం’ బస్సు యాత్ర చినవెంకన్న కొలువైన పశ్చిమగోదావరి జిల్లాలోకి దూసుకొస్తోంది. తెలుగువారంతా ఎప్పటికీ ఒక్కటిగా.. సుభిక్షంగా ఉండాలని కోరుకున్న మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆదర్శాన్ని.. తెలుగు నేలను చీల్చకూడదన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాం క్షను.. ప్రజాభిప్రాయాన్ని గౌరవించాల్సిందేనన్న విజయమ్మ దృఢ సంకల్పాన్ని ఆలంబనగా చేసుకుని షర్మిల సమైక్య శంఖారావం పూరించారు. సాక్షి ప్రతినిధి, ఏలూరు : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన ‘సమైక్య శంఖారావం’ బస్సుయాత్ర గురువారం జిల్లాలో ప్రవేశించనుంది. కృష్ణా జిల్లా కైకలూరులో బహిరంగ సభ అనంతరం షర్మిల పశ్చిమగోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తారు. కలకుర్రు వంతెనపై యాత్ర జిల్లాలోకి రాగానే స్వాగతం పలికేం దుకు దెందులూరు నియోజకవర్గ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. అక్కడి నుంచి ఏలూరు నగరం వరకూ షర్మిల బస్సుయాత్రను మోటార్ సైకిళ్ల ర్యాలీతో నగరంలోకి తీసుకురానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు నగరంలోని ఫైర్‌స్టేషన్ సెంటర్‌కు షర్మిల యాత్ర చేరుకుంటుంది. అక్కడ ఏర్పాటు చేసిన పెద్ద బహిరంగ సభలో ఆమె మాట్లాడతారు. షర్మిల సభ కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఫైర్‌స్టేషన్ సెంటర్‌తోపాటు నగర మంతటా భారీగా స్వాగత ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేశారు. ఏలూరు నియోజకవర్గంతోపాటు జిల్లా నలుమూలల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలతోపాటు సమైక్యవాదులు కూడా ఈ సభలో పెద్దఎత్తున పాల్గొననున్నారు. సభ ముగిసిన తర్వాత షర్మిల నగరంలోనే బస చేస్తారు. శుక్రవారం జిల్లాలోని పలు ప్రాంతాలను సందర్శిస్తూ తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం చేరుకుంటారు. ఏలూరుతోపాటు దెందులూ రు, ఉంగుటూరు, తాడేపల్లిగూడెం, తణుకు, నిడదవోలు నియోజకవర్గాల మీదుగా యాత్ర కొనసాగుతుంది. వైఎస్సార్ సీపీకి మద్దతు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ అలుపెరగకుండా పోరాటం చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ప్రజలు ఆకర్షితులవుతున్నారు. పెద్దఎత్తున నిర్వహిస్తున్న ఆందోళనల్లో తెలుగుదేశం పార్టీ నేతలను ఛీకొడుతున్న ఎన్జీవోలు, విద్యార్థులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఆదరణ కనబరుస్తున్నారు. సమైక్యాంధ్రకు కట్టుబడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న ఆందోళన లో జేఏసీ నాయకులు కూడా పాల్గొంటున్నారు. ఈక్రమంలోనే షర్మిల బస్సుయాత్రకు మద్దతు ఇస్తామని ఇప్పటికే ఎన్జీవోలు ప్రకటించారు. బుధవారం ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక నాయకులు, సభ్యులు కూడా నగరంలో జరిగే బహిరంగ సభలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిలుపునకు వేదికలో భాగంగా ఉన్న ఎన్జీవోలు, వ్యాపారులు, విద్యార్థులు సానుకూలంగా స్పందించే అవకాశం కనిపిస్తోంది. కొల్లేరు ప్రజల మద్దతు సమైక్యాంధ్ర ఉద్యమాన్ని చిత్తశుద్ధితో చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కొల్లేరు ప్రజలు మద్దతు పలికిన విషయం తెలిసిందే. మంగళవారం లంక గ్రామాల పెద్దలు, నాయకులు సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. లంక గ్రామాల ప్రజలు షర్మిల యాత్రలో పాల్గొని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. తమ సమస్యలను పరిష్కరించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయే సరైన వేదికని కొల్లేరు పెద్దలు భావిస్తున్నారు. షర్మిల యాత్రను విజయవంతం చేసేందుకు వారు రెట్టించిన ఉత్సాహంతో తరలివస్తున్నారు. -
షర్మిల ‘సమైక్య శంఖారావానికి’ జన ఉప్పెన
మహానేత రాజన్న తనయ చేపట్టిన మహోద్యమం.. జననేత జగనన్న సోదరి చేస్తున్న సమైక్యాంధ్ర పరిరక్షణోద్యమం.... మూడు వేల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసి ప్రపంచ రికార్డుసృష్టించిన షర్మిల సమైక్య శంఖారావానికి జిల్లా ప్రజానీకం జేజేలు పలికింది. సమైక్యతకే జై అంటూ చేయెత్తి జైకొట్టింది. అడుగడుగునా నీరాజనాలు పలికింది. ఉత్తుంగ తరంగంలా కదిలి వచ్చిన జనవాహిని సమైక్య యజ్ఞంలో మేము సైతం అంటూ నినదించింది. బుధవారం వినుకొండ, రేపల్లెలో మాత్రమే షర్మిల సభలు జరిగినా జిల్లా అంతా ఇక్కడే ఉందా అన్నట్టు జనసందోహం అబ్బురపరిచింది. కిక్కిరిసిన ప్రజాసంద్రంలో సమైక్య నినాదం ప్రతిధ్వనించింది. సింహనాదమై గర్జించింది. సాక్షి, గుంటూరు : జిల్లాలో ‘సమైక్య శంఖారావం’ హోరెత్తింది. ప్రజాభిప్రాయానికి పట్టం గడుతూ మహానేత తనయ, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల పూరించిన శంఖారావానికి జిల్లా ప్రజలు గళం కలిపారు. తెలుగు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆమె ఎలుగెత్తి చాటుతున్న సమైక్య నినాదంతో ప్రతి ఒక్కరూ కదం తొక్కుతూ.. పదం కలిపారు. కాంగ్రెస్, టీడీపీ స్వార్థ రాజకీయం కోసం సీమాంధ్రను వల్లకాడుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్న తీరును షర్మిల ఎండగట్టారు. కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యం అనే పదాన్ని మరిచి వ్యవహరిస్తున్న వైనాన్ని సూటిగా ప్రశ్నించారు. విలువలతో కూడిన రాజకీయం చేసే దమ్ము, ధైర్యం కాంగ్రెస్, టీడీపీలకు లేవని నిప్పులు చెరిగారు. చంద్రబాబు, బొత్స, చిరంజీవిల విషయంలో సీబీఐ వ్యవహరించిన తీరును తూర్పారబట్టారు. పదవుల మత్తులో మునిగి తేలుతున్న కాంగ్రెస్ నాయకులకు మళ్ళీ తమ పదవులే ముఖ్యమని నిరూపించుకున్నారని షర్మిల ధ్వజమెత్తారు. పట్ట పగలు సీమాంధ్రుల గొంతు కోసి ఏ మొహం పెట్టుకుని చంద్రబాబు రోడ్లపై తిరుగుతున్నారని, రాష్ట్ర విభజనకు అనుకూలంగా ఎవరిని అడిగి లేఖ ఇచ్చారు? నీ అబ్బ సొత్తని ఇచ్చావా? అంటూ చంద్రబాబుని నిలదీశారు. ఆత్మగౌరవ యాత్ర అంటూ రోడ్లపై పడి మొసలి కన్నీరు కారుస్తున్న చంద్రబాబుని సీమాంధ్ర నుంచి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. కోట్ల మందికి అన్యాయం జరుగుతుంటే జగనన్న చేతులు కట్టుకుని కూర్చోరని, వైఎస్సార్ సీపీ ప్రజల పక్షాన పోరాడుతుందని స్పష్టం చేశారు. మహానేత దివంగత వైఎస్సార్ పథకాల్ని గుర్తుకు తెస్తూ.. సమైక్య నినాదాన్ని గట్టిగా వినిపిస్తూ.. షర్మిల జిల్లాలో చేపట్టిన బస్సు యాత్రకు జనం పోటెత్తారు. అడుగడుగునా బ్రహ్మరథం... ప్రకాశం జిల్లా మార్కాపురంలో సమైక్య శంఖారావం బస్సు యాత్ర ముగించుకుని బుధవారం జిల్లాలో అడుగుపెట్టిన షర్మిలకు వినుకొండ రూరల్ మండలం శివాపురం వద్ద ఘన స్వాగతం లభించింది. దారి పొడవునా ఆమెకు జనం బ్రహ్మరథం పట్టారు. అందరికీ అభివాదం చేస్తూ మహానేత వై.ఎస్. విగ్రహాలకు పూలమాలలు వేస్తూ షర్మిల బస్సు యాత్రను కొనసాగించారు. వినుకొండ పట్టణానికి చేరే ముందు గుండ్లకమ్మ అడ్డరోడ్ నుంచి భారీ ర్యాలీతో వైఎస్సార్ సీపీ శ్రేణులు, సమైక్య వాదులు షర్మిలను తోడ్కొని వచ్చారు. వినుకొండ పట్టణంలో మధ్యాహ్నం 12.30 గంటలకు పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద జరిగిన బహిరంగ సభ జన సంద్రమైంది. సభ ముగిసిన తరువాత షర్మిల బస్సు యాత్రకు పల్లెలన్నీ కదిలాయి. శావల్యాపురం, సంతమాగులూరు, పుట్టావారిపాలెం అడ్డరోడ్, పెట్లూరివారిపాలెం, కోటప్పకొండ వరకు దార్లన్నీ జన సందోహంతో నిండిపోయాయి. షర్మిలను చూసేందుకు జనం బారులు తీరారు. మద్దిరాల, పురుషోత్తమపట్నంలో విద్యార్థులు, ముస్లింలు షర్మిలను కలిసేందుకు ఉత్సాహం చూపారు. షర్మిల యాత్ర చిలకలూరిపేట, యడ్లపాడు, బుడంపాడు, నారాకోడూరు, చేబ్రోలు, పొన్నూరు, చందోలు, చెరుకుపల్లి, భట్టిప్రోలు, పల్లెకోన మీదుగా రేపల్లె చేరుకునే సరికి రాత్రి 8.10 గంటలైంది. ప్రకటించిన షెడ్యూల్ కంటే నాలుగు గంటలు ఆలస్యమైనా జనాభిమానం చెక్కు చెదరలేదు. రాష్ట్ర ప్రజలకు వైఎస్ చేసిన మేలును తన ప్రసంగంలో ప్రస్తావిస్తూ.. త్వరలోనే జగనన్న రాజన్న రాజ్యం వైపు నడిపిస్తారని భరోసా ఇచ్చారు. ఉదయించే సూర్యుణ్ణి ఎవరూ ఆపలేరని, బోనులో ఉన్నా సింహం సింహమేనంటూ ధైర్యం కల్పించారు. సమైక్యాంధ్ర కోసం ప్రాణాలు పొగొట్టుకున్న వారికి వినుకొండలో రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం తెలిపారు. రాజకీయ విశ్లేషకుల్ని ఆకట్టుకున్న షర్మిల ప్రసంగం వినుకొండ, రేపల్లెలో షర్మిల చేసిన ప్రసంగం రాజకీయ విశ్లేషకుల్ని సైతం ఆకట్టుకుంది. రాష్ట్ర విభజన, తదనంతర పరిణామాలు, విభజనకు కారకులైన చంద్రబాబు, కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టిన తీరు రాజకీయ నేతల్ని ఆలోచింపజేసింది. సామాన్యులకు అర్థమయ్యే రీతిలో చంద్రబాబు, కాంగ్రెస్ నేతలపై చేసిన విమర్శలతో కూడిన చణుకులు పేలాయి. చంద్రబాబు వ్యవహారం ఇంటికి నిప్పు పెట్టి మంట మంట అని అరిచిన విధంగా ఉందని, దున్నపోతా.. దున్నపోతా.. ఎందుకు దున్నలేదంటే పగలు ఎండ.. రాత్రి చీకటి అని చెప్పినట్లుందని సామెతలు చెబుతూ షర్మిల ఎద్దేవా చేశారు. హత్య చేసి ఆ శవంపై పడి వెక్కి వెక్కి ఏడ్చినట్లుందని దుయ్యబట్టారు. చంద్రబాబు బ్లాంక్ చెక్ ఇవ్వడంతోనే కాంగ్రెస్ తెలుగు ప్రజల్ని విడగొట్టేందుకు ధైర్యం చేసిందన్నారు. ఇలాంటి నాయకుడిని ప్రతిపక్ష నాయకుడు అనాలా? దుర్మార్గుడనాలా? అని షర్మిల సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు ఐఎంజీ అవినీతిపై నిజాయితీగా హెడ్ కానిస్టేబుల్‌తో విచారణ చేయించినా జైల్లో ఉండేవారన్నారు. రేపల్లెలో జరిగిన భారీ బహిరంగ సభలో సబితమ్మకు ఓ న్యాయం.. మోపిదేవికి మరో న్యాయం అంటూ అనడంతో ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. మోపిదేవిని బలి పశువుని చేశారని, కుట్రలు పన్ని అమాయకులతో ఆడుకునే దుర్మార్గ కాంగ్రెస్, టీడీపీ నాయకుల పతనం తప్పదని షర్మిల ఉద్ఘాటించారు. సమైక్య వాణిని బలంగా వినిపించిన షర్మిల చివరకు జై సమైక్యాంధ్ర అంటూ సభల్ని ముగించారు. ‘‘హఠాత్తుగా రాష్ట్రాన్ని చీలుస్తున్నామని కేంద్రం సంకేతాలు పంపగానే వైఎస్సార్ సీపీకి చెందిన ఎమ్మెల్యేలు, పార్టీ అధ్యక్షుడు జగన్‌తో పాటు గౌరవాధ్యక్షురాలు విజయమ్మ రాజీనామాలు చేశారు. వీరితో పాటు మోపిదేవి అన్న రాజీనామా చేశారు. తెలుగు వారి ఓట్లు దండుకుని తెలుగు ప్రజలకు కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న దారుణమైన నిర్ణయంతో సీమాంధ్ర మొత్తం మహా ఎడారిగా మారనుంది. కోట్ల మంది గుండెలు రగిలిపోతున్నా సీఎం కిరణ్ దిష్టి బొమ్మలా నిల్చున్నారు. సీఎంగా పదవీ ప్రమాణం చేసేటప్పుడు సోనియా గాంధీకి విధేయంగా ఉంటానని ప్రమాణం చేశారా? ప్రజల హక్కుల్ని పరిరక్షిస్తానని ప్రమాణం చేశారా? ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. కోట్ల మంది ప్రజల్ని క్షమాపణ కోరి కిరణ్, చంద్రబాబులిద్దరూ రాజీనామా చేసి వారి ఎమ్మెల్యేలు, ఎంపీలచే రాజీనామా చేయించండి. ఈ విభజన ప్రక్రియ ఎలా ఆగదో చూద్దాం.’’ - షర్మిల -
సమైక్యాంధ్రకు మద్దతుగా కదలిరండి
అమలాపురం, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్రకు మద్దతుగా ‘సమైక్య శంఖారావం’ పేరిట వైఎ స్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన బస్సుయాత్రను జిల్లాలో విజయవంతం చేయాలని ఆ పార్టీ నాయకులు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈనెల 13న అమలాపురం హైస్కూల్ సెంటరు వద్ద షర్మిల పాల్గొనే బహిరంగ సభ జరగనున్న ప్రాంతాన్ని పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి, సీజీసీ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, అమలాపురం పార్లమెంట్ నియోజకర్గ కో ఆర్డినేటర్ గొల్ల బాబూరావు, నియోజకవర్గ కో ఆర్డినేటర్లు చింతా కృష్ణమూర్తి, మిండగుదిటి మోహన్ బుధవారం పరిశీలించారు. సభకు వేలాది మంది ప్రజలు హాజరయ్యే అవకాశమున్నందున వారికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని బోస్ సూచించారు. బహిరంగ సభలో జిల్లా నాయకుల కోసం ఏర్పాటు చేసే వేదిక, లైట్లు, మైకుల ఏర్పాటు వంటి వాటిపై పట్టణ పార్టీ కన్వీనర్ మట్టపర్తి నాగేంద్ర, పట్టణ యూత్ కన్వీనర్ గనిశెట్టి రమణ్లాల్తో చర్చించారు. జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు పెన్మత్స చిట్టిరాజు, బొల్లవరపు ఛాయాదేవి, కుడుపూడి త్రినాథ్, మట్టా వెంకట్రావు, నల్లా రమేష్, మట్టా వెంకట్రావు, పితాని చిన్న, యల్లిమల్లి రాజ్‌మోహన్, మాజీ ఎంపీపీ భూపతిరాజు సుదర్శనబాబు పాల్గొన్నారు. -
ఇంకాసేపట్లో వినుకొండలో షర్మిళ బహిరంగ సభ
-
సమైక్య శంఖారావం 11th Sept 2013
-
నేడు షర్మిల రాక
సాక్షి, గుంటూరు : సమైక్య ఉద్యమానికి గొంతుకగా మారిన గుంటూరులో ‘సమైక్య శంఖారావం’ మార్మోగనుంది. మహానేత దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిసోదరి షర్మిల బుధవారం జిల్లాలో సమైక్య శంఖారావం పూరించనున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న డిమాండ్‌తో షర్మిల ఈ నెల 2 నుంచి ‘సమైక్య శంఖారావం’ పేరిట బస్సు యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ యాత్ర బుధవారం జిల్లాలోని వినుకొండకు చేరనుంది. వినుకొండలో ఉదయం 10 గంటలకు పొట్టి శ్రీరాములు విగ్రహం ఎదుట బహిరంగ సభ జరగనుంది. అనంతరం యాత్ర వయా కోటప్పకొండ మీదుగా చిలకలూరిపేట -పసుమర్రు - పెదనందిపాడు - కాకుమాను - బాపట్ల - చందోలు - చెరుకుపల్లి - భట్టిప్రోలు మీదుగా రేపల్లెకు చేరుకుంటుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు రేపల్లె నెహ్రూసెంటర్‌లో బహిరంగ సభ జరుగుతుంది. షర్మిల యాత్ర మొత్తం జిల్లాలోని వినుకొండ, నరసరావుపేట, చిలకలూరిపేట, ప్రత్తిపాడు, బాపట్ల, రేపల్లె నియోజకవర్గాల మీదుగా సాగనుంది. రేపల్లె నుంచి కృష్ణాజిల్లాలోని అవనిగడ్డకు చేరుకుని అక్కడ బహిరంగ సభ అనంతరం రాత్రి అవనిగడ్డలో బస చేస్తారని ఆ పార్టీ రాష్ట్ర ప్రోగ్రామ్స్ కమిటీ కన్వీనరు తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ వెల్లడించారు. ఆది నుంచి ఉద్యమిస్తోన్న వైఎస్సార్ సీపీ.... విభజన ప్రకటన వెలువడిన దగ్గర్నుంచీ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న డిమాండ్‌తో వైఎస్సార్ సీపీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తోంది. గుంటూరు వేదికగా ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆరు రోజుల పాటు నిరవధిక నిరాహార దీక్ష చేశారు.ఆమె దీక్షను పోలీసులు భగ్నం చేయడంతో, జననేత జగన్ జైలు గోడల మధ్య ఏడు రోజుల పాటు ఆమరణ దీక్ష చేశారు. చివరకు కేంద్రం సమ న్యాయం చేయలేదని పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ సమైక్య విధానాన్ని ప్రకటిస్తూ రాష్ట్ర ప్రజలకు, కేంద్ర హోం మంత్రి షిండేకు లేఖలు రాశారు. అంతకు ముందు ఆ పార్టీ ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మేకతోటి సుచరిత తమ పదవులకు రాజీనామా లు చేశారు. ఉధృతంగా సాగుతున్న సమైక్య ఉద్యమంలో వైఎస్సార్ సీపీ శ్రేణులు కీలక భూమిక పోషిస్తున్నాయి. విభజనపై ఏక పక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని ధైర్యంగా ప్రశ్నించి, పోరాడింది ఒక్క వైఎస్సార్ సీపీయేనని సమైక్యవాదులు, ఉద్యోగ, కార్మిక, కర్షకులంతా ముక్త కంఠంతో ఎలుగెత్తి చెబుతున్నారు. విభజనకు చంద్రబాబు లేఖను కాంగ్రెస్ గండ్రగొడ్డలిగా ఉపయోగించుకుందని ధ్వజమెత్తుతున్నారు. పై పెచ్చు ‘ఆత్మగౌరవ యాత్ర’ అంటూ జిల్లాకు వచ్చిన చంద్రబాబు తానే లేఖ ఇచ్చానని ప్రకటించడం, సీమాంధ్రుల ప్రయోజనాలు పట్టకుండా పర్యటించడంపై నిరసన వెల్లువెత్తింది. సమైక్య నినాదంతో షర్మిల చేపట్టిన బస్సు యాత్రకు జిల్లా వ్యాప్తంగా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారు. -
నేడు షర్మిల రాక
సాక్షి, గుంటూరు : సమైక్య ఉద్యమానికి గొంతుకగా మారిన గుంటూరులో ‘సమైక్య శంఖారావం’ మార్మోగనుంది. మహానేత దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిసోదరి షర్మిల బుధవారం జిల్లాలో సమైక్య శంఖారావం పూరించనున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న డిమాండ్‌తో షర్మిల ఈ నెల 2 నుంచి ‘సమైక్య శంఖారావం’ పేరిట బస్సు యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ యాత్ర బుధవారం జిల్లాలోని వినుకొండకు చేరనుంది. వినుకొండలో ఉదయం 10 గంటలకు పొట్టి శ్రీరాములు విగ్రహం ఎదుట బహిరంగ సభ జరగనుంది. అనంతరం యాత్ర వయా కోటప్పకొండ మీదుగా చిలకలూరిపేట -పసుమర్రు - పెదనందిపాడు - కాకుమాను - బాపట్ల - చందోలు - చెరుకుపల్లి - భట్టిప్రోలు మీదుగా రేపల్లెకు చేరుకుంటుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు రేపల్లె నెహ్రూసెంటర్‌లో బహిరంగ సభ జరుగుతుంది. షర్మిల యాత్ర మొత్తం జిల్లాలోని వినుకొండ, నరసరావుపేట, చిలకలూరిపేట, ప్రత్తిపాడు, బాపట్ల, రేపల్లె నియోజకవర్గాల మీదుగా సాగనుంది. రేపల్లె నుంచి కృష్ణాజిల్లాలోని అవనిగడ్డకు చేరుకుని అక్కడ బహిరంగ సభ అనంతరం రాత్రి అవనిగడ్డలో బస చేస్తారని ఆ పార్టీ రాష్ట్ర ప్రోగ్రామ్స్ కమిటీ కన్వీనరు తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ వెల్లడించారు. ఆది నుంచి ఉద్యమిస్తోన్న వైఎస్సార్ సీపీ.... విభజన ప్రకటన వెలువడిన దగ్గర్నుంచీ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న డిమాండ్‌తో వైఎస్సార్ సీపీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తోంది. గుంటూరు వేదికగా ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆరు రోజుల పాటు నిరవధిక నిరాహార దీక్ష చేశారు.ఆమె దీక్షను పోలీసులు భగ్నం చేయడంతో, జననేత జగన్ జైలు గోడల మధ్య ఏడు రోజుల పాటు ఆమరణ దీక్ష చేశారు. చివరకు కేంద్రం సమ న్యాయం చేయలేదని పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ సమైక్య విధానాన్ని ప్రకటిస్తూ రాష్ట్ర ప్రజలకు, కేంద్ర హోం మంత్రి షిండేకు లేఖలు రాశారు. అంతకు ముందు ఆ పార్టీ ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మేకతోటి సుచరిత తమ పదవులకు రాజీనామా లు చేశారు. ఉధృతంగా సాగుతున్న సమైక్య ఉద్యమంలో వైఎస్సార్ సీపీ శ్రేణులు కీలక భూమిక పోషిస్తున్నాయి. విభజనపై ఏక పక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని ధైర్యంగా ప్రశ్నించి, పోరాడింది ఒక్క వైఎస్సార్ సీపీయేనని సమైక్యవాదులు, ఉద్యోగ, కార్మిక, కర్షకులంతా ముక్త కంఠంతో ఎలుగెత్తి చెబుతున్నారు. విభజనకు చంద్రబాబు లేఖను కాంగ్రెస్ గండ్రగొడ్డలిగా ఉపయోగించుకుందని ధ్వజమెత్తుతున్నారు. పై పెచ్చు ‘ఆత్మగౌరవ యాత్ర’ అంటూ జిల్లాకు వచ్చిన చంద్రబాబు తానే లేఖ ఇచ్చానని ప్రకటించడం, సీమాంధ్రుల ప్రయోజనాలు పట్టకుండా పర్యటించడంపై నిరసన వెల్లువెత్తింది. సమైక్య నినాదంతో షర్మిల చేపట్టిన బస్సు యాత్రకు జిల్లా వ్యాప్తంగా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారు. -
అలుపెరగని పోరు
సాక్షి, నెల్లూరు : జిల్లావాసులు 42 రోజులుగా ఏ మాత్రం అలసిపోకుండా సమైక్య ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. షర్మిల సమైక్య శంఖారావం బస్సు యాత్ర సక్సెస్ అయింది. ఆమె పర్యటన మంగళవారంతో ముగిసింది. విభజన జరిగితే సీమాంధ్ర తీవ్రంగా నష్టపోతుందని, అందువల్ల సమైక్యంగా ఉంచాలని షర్మిల డిమాండ్ చేశారు. సీమాంధ్రుల ప్రయోజనాలను ఏమాత్రం పట్టించుకోని ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు వైఖరిని ఆమె తూర్పార బట్టారు. సింహపురివాసులు అలుపెరగకుండా ఉద్యమాన్ని దీక్షా దక్షతతో ముందుకు నడిపిస్తున్నారు. ఈ నెల 12 నుంచి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయనున్నట్టు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. జిల్లా వ్యాప్తంగా మంగళవారం ర్యాలీలు, రాస్తారోకోలు, మానవహారాలు, నిరసన దీక్షలు కొనసాగాయి. ఆర్టీసీ బంద్ కొనసాగుతోంది. జన జీవనం స్తంభించింది. షర్మిల సమైక్య శంఖారావం బస్సు యాత్ర మంగళవారం బోగోలు మండలం కడనూతలలోని ఆర్ఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల నుంచి ప్రకాశం జిల్లాలోకి చేరుకుంది. నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యులు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులురెడ్డి, జూపూడి ప్రభాకర్‌రావు తదితరులు వెంట ఉన్నారు. సోమవారం ఆర్ఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన వినాయక చవితి పర్వదిన వేడుకల్లో షర్మిల పాల్గొన్నారు. సమైక్యాంధ్ర సాధన కోసం నీటిపారుదల శాఖ ఉద్యోగులు ఇరిగేషన్ కార్యాలయం నుంచి బాలాజీనగర్, గాంధీ బొమ్మ సెంటర్ల మీదుగా ఎల్ఐసీ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. బ్యాంకులను మూయించారు. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ నుంచి వీఆర్సీ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని విసృ్తతం చేసేందుకు నెల్లూరు జెడ్పీ సమావేశ మందిరంలో జిల్లా అధికారులు, ఉపాధ్యాయులు, ఎంపీడీఓలు సంయుక్త సమావేశం నిర్వహించి కార్యాచరణ రూపొందించారు. ఉదయగిరిలో ఉపాధ్యాయ, ఉద్యోగ జేఏసీ రిలే దీక్షలు 14వ రోజు కొనసాగాయి. బస్టాండ్ సెంటర్లో తిరుమలాపురం పంచాయతీకి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు 21వ రోజు దీక్షలు చేపట్టారు. ఆత్మకూరులో యూటీఎఫ్ ఆధ్వర్యంలోమున్సిపల్ బస్టాండ్ వద్ద ఉపాధ్యాయులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. పొదలకూరు సెంటర్లో సమైక్యాంధ్రకు మద్దతుగా యూటీఎఫ్‌కు చెందిన ఉపాధ్యాయులు మంగళవారం రిలే దీక్షలు నిర్వహించారు. ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం నిరాహార దీక్షా శిబిరాన్ని సందర్శించారు. కోవూరులో ఎన్జీఓ హోంలో న్యాయవాదులు, ఇందుకూరుపేట మండలం గంగపట్నంలో గ్రామస్తుల నిరాహార దీక్ష చేపట్టారు. సూళ్లూరుపేట జేఏసీ ఆధ్వర్యంలో రైల్వేగేట్ సెంటర్లో రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి. మండలంలోని తీర ప్రాంత వాసులు, షార్ కాంట్రాక్ట్ కార్మికులు సూళ్లూరుపేట-శ్రీహరికోట రోడ్డులో అటకానితిప్ప వద్ద షార్కు వెళ్లే వాహనాలను అడ్డుకున్నారు. రాస్తారోకో, వంటావార్పు నిర్వహించారు. దీక్ష కొనసాగుతుండగా మండలంలోని అన్నమేడు జిల్లా పరిషత్ హైస్కూల్ ఉపాధ్యాయుడు బట్టా శంకర్‌యాదవ్ సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేస్తూ కుప్పకూలి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. శంకర్‌యాదవ్ మృతికి సంఘీభావంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కావలిలో ప్రభుత్వ జేఏసీ, సమైక్యాంధ్ర జేఏసీ, సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి, ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు కొసాగుతున్నాయి. -
షర్మిలకు ఆత్మీయ ఆదరణ
బిట్రగుంట/కావలి, న్యూస్‌లైన్: దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిలకు ప్రజలు అడుగడుగునా ఆత్మీయ నీరాజనం పలికారు. కావలిలో సమైక్యశంఖారావం బస్సుయాత్ర అనంతరం ఆదివారం రాత్రి కడనూతలలోని రామిరెడ్డి సుబ్బరామిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో బస చేసిన ఆమె ప్రకాశం జిల్లాలో సమైక్య శంఖారావం బస్సు యాత్రకు మంగళవారం ఉదయం 10 గంటలకు బయలుదేరారు. నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ కావలి నియోజకవర్గ సమన్వయకర్త రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డితో పాటు పలు నియోజకవర్గాల సమన్వయకర్తలు, నాయకులు షర్మిలను కలిసి సమైక్య శంఖారావం బస్సుయాత్రపై మాట్లాడారు. తనను కలిసిన పార్టీ ముఖ్యనేతలతో సమైక్య ఉద్యమంపై ఆమె చర్చించారు. ప్రకాశం జిల్లాలో సమైక్యశంఖారావం బస్సుయాత్ర ప్రారంభించేందుకు బయలుదేరగా ఘనంగా వీడ్కోలు పలికారు. ప్రకాశం జిల్లాకు చెందిన నేతలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్, తదితర ముఖ్యనేతలు కళాశాల వద్ద నుంచే ఆత్మీయ స్వాగతం పలికి షర్మిలను ఆహ్వానించారు. -
షర్మిలయాత్రకు ఎన్నారై నేతల మద్దతు
సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన సమైక్య శంఖారావానికి పార్టీ ఎన్నారై విభాగం నేతలు సంపూర్ణ మద్దతు తెలిపారు. సోమవారం అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలోని హార్ట్ఫోర్డ్ సిటీలో నేతలంతా పెద్ద ఎత్తున సమావేశమయ్యారు. రాష్ట్రం సమైక్యత కోసం షర్మిల చేస్తున్న కృషి హర్షించదగినదని, ఆమె తలపెట్టిన యాత్రకు సంఘీభావం తెల్పుతున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పి.రత్నాకర్, కృష్ణమోహన్, శ్రీను వాసిరెడ్డి, రమేష్‌బాబు, జితేందర్ రెడ్డి, సి. శ్రీధర్, పి. జగన్మోహన్, గోపాల్ సుబ్బయ్య, సురేష్‌రెడ్డి, భక్తలియార్ఖాన్, విజయ్‌రెడ్డి పాల్గొన్నారు. -
పరిష్కారం చూపకుండా విభజన ఎలా?: షర్మిల
-
పరిష్కారం చూపకుండా విభజన ఎలా?: షర్మిల
కనిగిరి: నీళ్లు, రాజధాని విషయంలో పరిష్కారాలు చూపకుండా విభజన ఎలా చేస్తారు? అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల ప్రశ్నించారు. సమైక్య శంఖారావం బస్సు యాత్రలో భాగంగా ఆమె ఈ రోజు ప్రకాశం జిల్లా కనిగిరి చేరుకున్నారు. ఈ సందర్భంగా చర్చి సెంటర్లో జరిగిన భారీ బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడానికి, టిఆర్ఎస్ను కాంగ్రెస్‌లో విలీనం చేయడానికే విభజన చిచ్చు పెట్టారని మండిపడ్డారు. విభజన విషయం మీకు చెప్పి చేశారా? చెప్పకుండా చేశారా? అని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ప్రశ్నించారు. మీతో చర్చల తర్వాతే, మీ ఆమోదం తర్వాతే రాష్ట్రాన్ని విభజిస్తోందా? అనేది సీఎం చెప్పాలని డిమాండ్ చేశారు. అన్యాయం చేసేసి, ఇప్పుడు అన్యాయం జరిగిపోయిందని సిఎం అంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రను వల్లకాడు చేద్దామనుకుందా? అని ప్రశ్నించారు. వైఎస్ఆర్ సిపి నేతలు రాజీనామా చేసినప్పుడే మీరూ రాజీనామా చేసి ఉండవలసిందని కాంగ్రెస్, టిడిపి ఎంపిలు, ఎమ్మెల్యేలనుద్దేశించి అన్నారు. అప్పుడే రాజీనామాలు చేసి ఉంటే పరిస్థితి ఇక్కడిదాకా వచ్చేది కాదన్నారు. ఇంకా పదవులు పట్టుకుని వేలాడుతున్నారని విమర్శించారు. ఛార్జీలు, పన్నులు పెంచకుండా సంక్షేమ పథకాలు ఏకకాలంలో అందించిన ఘనత వైఎస్ఆర్దేనన్నారు. ప్రజలు రాజశేఖర్‌రెడ్డిని ఆశీర్వదించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇచ్చారని తెలిపారు. ప్రజలు మీకు అధికారం ఇవ్వలేదని, సోనియా గాంధీ మిమ్మల్ని సిఎం చేశారని కిరణ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. కాంగ్రెస్, టిడిపి కుట్రలు చేసి జగనన్నను జైలు పాలు చేశారన్నారు. షర్మిల రాక సందర్బంగా అభిమానులు, కార్యకర్తలు, సమైక్యవాదులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. కనిగిరి చర్చి సెంటర్ జనంతో నిండిపోయింది. షర్మిల ప్రసంగానికి అపూర్వ స్పందన లభించింది. -
జన శంఖారావం 10th Sept 2013
-
నేడు ప్రకాశం జిల్లాలో షర్మిళ శంఖారావం
-
షర్మిళ శంఖారావం 9th Sept 2013
-
సమైక్య శంఖారావం సక్సెస్
సాక్షి, కడప : మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ, జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల జిల్లాలో చేపట్టిన సమైక్య శంఖారావం బస్సు యాత్ర సక్సెస్ అయింది. ప్రొద్దుటూరు, మైదుకూరు, బద్వేలు నియోజకవర్గాల్లో చేపట్టిన యాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. షర్మిల వాడివేడి ప్రసంగాలు ఆకట్టుకున్నాయి. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సమైక్యాంధ్ర కోసం ఉద్యమిస్తూ సమైక్య శంఖారావం చేపట్టిన షర్మిల బస్సు యాత్ర సమైక్యవాదుల్లో స్ఫూర్తినింపింది. సమన్యాయం పాటించనప్పుడు విభజించే హక్కు ఎవరిచ్చారని, సమైక్యాంధ్రగానే ఉంచాలన్న మాటలు ప్రజలకు దన్నుగా నిలిచాయి. అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా సభలకు తరలివచ్చి సంఘీభావం తెలిపారు. రాష్ట్రాన్ని విభజిస్తే సీమాంధ్ర ప్రజలకు ఎదురయ్యే సమస్యలు, కష్టనష్టాలను వివరించడంతోపాటు తెలుగుదేశం పార్టీ ద్వంద్వ వైఖరిని షర్మిల ఎండగట్టారు. మరోవైపు షర్మిల పర్యటన వైఎస్సార్సీపీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపింది. నాయకులు, కార్యకర్తల ఆరాటం .. : బద్వేలు సమీపంలో షర్మిల బస చేసిన పర్యాటక అతిధిగృహం వద్దకు ఆదివారం ఉదయం నుంచే పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు తరలివచ్చారు. మహానేత తనయను చూసేందుకు, ఆమెను పలుకరించేందుకు ఆరాటపడ్డారు. వైఎస్సార్సీపీ కేంద్రపాలక మండలి సభ్యులు డీసీ గోవిందరెడ్డి నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతలను, కార్యకర్తలను పరిచయం చేశారు. జిల్లా కన్వీనర్ సురేష్‌బాబు, కడప నియోజకవర్గ సమన్వయకర్త అంజద్‌బాషా, బద్వేలు మాజీ మున్సిపల్ ఛైర్మన్ మునెయ్య, వైస్ ఛైర్మన్ గురుమోహన్, నేతలు రమణారెడ్డి, ఓ.ప్రభాకర్‌రెడ్డి, విజయభాస్కర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ సరస్వతమ్మ, నియోజకవర్గ మండల కన్వీనర్లు, ముఖ్య నేతలు, పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో షర్మిలను కలుసుకున్నారు. పి.పి.కుంటలో మహిళల వీడ్కోలు : జిల్లా సరిహద్దు ప్రాంతమైన గోపవరం మండలంలోని పీపీ కుంట ప్రాంతం వద్ద పెద్ద సంఖ్యలో మహిళలు, పార్టీ కార్యకర్తలు షర్మిలకు ఆత్మీయ వీడ్కోలు పలికారు. షర్మిల చిరునవ్వుతో బస్సులో నుంచే అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. ఈ సందర్భంగా జై జగన్.. జై సమైక్యాంధ్ర అనే నినాదాలు మారుమోగాయి. -
విభజనపై కరవాలం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రజల్లో నెలకున్న భయాందోళనలు, సందేహాలను షర్మిల ప్రస్తావిస్తూ జనగళాన్ని గట్టిగా వినిపించారు. ‘సమైక్య శంఖారావం’లో భాగంగా ఆదివారం ఒక్కరోజు వైఎస్ షర్మిల జిల్లాలో చేపట్టిన బస్సు యాత్ర విజయవంతంగా ముగిసింది. ఈ యాత్రలో ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాళెం, కావలి కేంద్రాల్లో నిర్వహించిన బహిరంగ సభలకు వైఎస్సార్సీపీ కార్యకర్తలు, ప్రజలు వేలాదిగా స్వచ్ఛందంగా తరలి వచ్చారు. రాష్ట్ర విభజనతో సీమాంధ్రులు ఎదుర్కోబోయే కష్టాలు, నష్టాలను పూసగుచ్చినట్లు ప్రజలకు వివరించారు. ముఖ్యంగా హైదరాబాద్ ప్రాధాన్యతను వివరిస్తున్నప్పుడు జనం నుంచి మంచి స్పందన లభించింది. విద్య, ఉపాధి రంగాల్లో భవిష్యత్ తరాలు చవిచూడబోయే దుష్పరిణామాలు జనానికి అర్థమయ్యేలా వివరించడంలో ఆమె సఫలీకృతమయ్యారు. రాష్ట్ర విభజన ప్రకటనకు ముందు, తర్వాత కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల వైఖరిని నిశితంగా ఎండగట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్ర విభజనకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. అప్పటి వరకు ఆయనకు సీమాంధ్రలో బస్సు యాత్ర చేసేందుకు హక్కు లేదని విమర్శలు చేసినప్పుడు జనం ఈలలు, కేకలతో తమ అంతరంగం కూడా అదేనని వెల్లడించారు. సీబీఐని కాంగ్రెస్ పెరటి కుక్కగా, చంద్రబాబును గుంటనక్కగానూ పోల్చినప్పుడు సభా ప్రాంగణం పరిసరాలు హర్షధ్వానాలతో మారుమోగాయి. రాష్ట్ర విభజన జరిగితే నెల్లూరు జిల్లాలోని సోమశిల ప్రాజెక్టుకు నీళ్లురాక ఒక చరిత్రాత్మక కట్టడంగా మిగిలిపోతుందని షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు. బోనులో ఉన్నా సింహం సింహమే.. ‘బోనులో ఉన్నా సింహం సింహమే. జగనన్నను అక్రమంగా జైల్లో నిర్బంధించినా సింహమే’ అంటూ షర్మిల ఉద్వేగపూరిత ప్రసంగం జనాన్ని ఉర్రూతలూగించింది. జనంలో ఉన్నా, జైల్లో ఉన్నా జగనన్న జననేతేనని ఆమె స్పష్టం చేశారు. ‘ఉదయించే సూర్యుడిని ఎవరు ఆపగలరు..? అదే విధంగా జగనన్న కూడా ఏదో ఒక రోజు జైలు నుంచి బయటకు వస్తారు. ఆ రోజు రాజన్య రాజ్యం స్థాపన దిశగా మనలను నడపిస్తారు. అందుకు మీ అండదండలు అవసరం’ అని ఆమె విజ్ఞప్తి చేశారు. అపూర్వ స్వాగతం వైఎస్సార్ జిల్లాలో యాత్ర ముగించుకుని ఆదివారం ఉదయం 10.45 గంటలకు వైఎస్ షర్మిల కాన్వాయ్ మర్రిపాడు మండలం టీపీకుంట వద్ద జిల్లాలోకి ప్రవేశించింది. అక్కడ ఆమెకు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల నుంచి ఘనస్వాగతం లభించింది. నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, జిల్లా పార్టీ కన్వీనర్ మేరిగ మురళీధర్, పార్టీ సీఈసీ సభ్యులు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, నెల్లూరు సిటీ, రూరల్, వెంకటగిరి, గూడూరు, సూళ్లూరుపేట నియోజకవర్గాల సమన్వయకర్తలు పి.అనిల్ కుమార్ యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కొమ్మి లక్ష్మయ్యనాయుడు, డాక్టర్ బాలచెన్నయ్య, పాశం సునీల్‌కుమార్, కిలివేటి సంజీవయ్య, నెలవల సుబ్రమణ్యం, దబ్బల రాజారెడ్డి, నెల్లూరు సిటీ కన్వీనర్ ఆనం వెంకటరమణారెడ్డి తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. కోవూరు, ఉదయగిరి ఎమ్మెల్యేలు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ఆత్మకూరులో మకాం వేసి బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అక్కడి నుంచి పర్యటన ప్రారంభమైంది. మార్గమధ్యంలో చిరువెళ్ల గ్రామం వద్ద షర్మిల బస్సును స్థానికులు నిలిపారు. దీంతో ఆమె బస్సుదిగి వైఎస్సార్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పిం చారు. ఆత్మకూరులో ఆర్టీసీ బస్టాండ్ నుంచి సభా ప్రాంగణం వరకు రోడ్డుకిరువైపులా గుమిగూడిన జనానికి అభివాదం చేస్తూ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. బస్టాండ్ ప్రాంగణం నుంచి సోమశిల రోడ్డు వరకు జన సందోహంతో కిటకిటలాడింది. భోజన విరామం తర్వాత కోలగట్ల, సంగం మీదుగా బుచ్చిరెడ్డిపాళెం చేరుకున్నారు. బుచ్చిలో వైఎస్సార్ విగ్రహం నుంచి కోవూరు వైపు, జొన్నవాడ వైపు, చెన్నూరు రోడ్డులో మలిదేవి కాలువ వరకు జనం కిక్కిరిసి పోయారు. షర్మిలను చూసేందుకు కొంత మంది ఎగబడడంతో తొక్కిసలాట జరిగింది. అనంతరం కావలి చేరుకున్నారు. రాత్రి 8 గంటలకు కావలి ఉదయగిరి బ్రిడ్జి సెంటర్లో భారీ బహిరంగ సభ జరిగింది. వేలాది మంది కార్యకర్తలతో కూడలి నలువైపులా జనంతో కిక్కిరిసి పోయాయి. ప్రసన్న, బాలచెన్నయ్యకు అభినందన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆమరణ నిరాహార దీక్షలకు సంఘీభావంగా కోవూరు, గూడూరులలో దీక్షలు చేపట్టిన ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, సమన్వయకర్త చెంతాటి బాలచెన్నయ్యను వైఎస్ షర్మిల అభినందించారు. -
ఆంటోనీ డ్రామా కమిటీ!
విభజనను కాంగ్రెస్ సొంత వ్యవహారంలా చూస్తోంది: షర్మిల ఆంటోనీ కమిటీలో తెలుగువారే లేరు.. అలాంటప్పుడు తెలుగువారి మనోభావాలు ఆ కమిటీకెలా తెలుస్తాయి? ఆ కమిటీతో సంబంధం లేకుండానే విభజన బిల్లు తయారైపోతోంది సాక్షాత్తూ హోం మంత్రి షిండేనే ఈ మాట చెప్పారు అంటే ఈ ఆంటోనీ కమిటీ ఓ పెద్ద డ్రామా కమిటీ అన్నమాట.. అందులో సీఎం, బొత్స, మంత్రులు క్యారెక్టర్ లేని యాక్టర్లు టీఆర్ఎస్ నాయకులు ఇప్పుడే సీమాంధ్రులపై దాడులు చేస్తున్నారు ఇక విభజనంటూ జరిగితే హైదరాబాద్‌లో బతకనిస్తారా? ఓట్లు, సీట్ల కోసం కాంగ్రెస్ విభజనకు యత్నిస్తుంటే చంద్రబాబు వంతపాడుతున్నారు.. బాబు తన లేఖను వెనక్కు తీసుకుని రాజీనామాలు చేసేదాకా ప్రజలంతా నిలదీయండి టీడీపీ సహా ఐదు పార్టీలు విభజనకు సై అంటున్నాయి వైఎస్సార్ సీపీ, ఎంఐఎం, సీపీఎం మాత్రమే సమైక్యంగా ఉండాలంటున్నాయి ‘సమైక్య శంఖారావం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్ర విభజనను కాంగ్రెస్ సొంత వ్యవహారంలా భావిస్తోందని, సొంత పార్టీ నేతలతో ఆంటోనీ కమిటీ వేసి ప్రజలను మోసం చేయాలని చూస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల మండిపడ్డారు. ‘‘ఇక్కడ రాష్ట్రమంతా అట్టుడికిపోతుంటే, కోట్ల మంది గుండెలు రగిలిపోతుంటే.. అదేదో తమ సొంతపార్టీ వ్యవహారమన్నట్లు ఒక సొంత పార్టీ కమిటీని వేసింది కాంగ్రెస్. దాని పేరు ఆంటోనీ కమిటీ. ఆ కమిటీలో కేరళకు చెందిన ఆంటోనీ ఉన్నారు. కర్ణాటకకు చెందిన వీరప్ప మొయిలీ ఉన్నారు. తమిళనాడుకు చెందిన చిదంబరం ఉన్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన దిగ్విజయ్ సింగ్ ఉన్నారు. గుజరాత్‌కు చెందిన అహ్మద్ పటేల్ ఉన్నారు. కానీ ఈ కమిటీలో ఒక్క తెలుగువాడూ లేడు. తెలుగుజాతి గురించి తెలిసినవాడే లేడు. వీళ్లంతా తెలుగువాళ్ల మనోభావాలను అర్థం చేసుకుంటారా?’’ అని షర్మిల నిలదీశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్నడిమాండ్తో షర్మిల చేపట్టిన ‘సమైక్య శంఖారావం’ బస్సు యాత్ర ఏడో రోజు ఆదివారం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సాగింది. జిల్లాలో ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాలెం, కావలి సభలకు భారీగా తరలివచ్చిన ప్రజలనుద్దేశించి షర్మిల ప్రసంగించారు. రాష్ట్రంలో టీడీపీ సహా ఐదు పార్టీలు విభజనకు అనుకూలమని ప్రకటిస్తే.. వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఎం, ఎంఐఎం మాత్రమే సమైక్యగళం వినిపిస్తున్నాయని గుర్తుచేశారు. షర్మిల ప్రసంగాల సారాంశం ఆమె మాటల్లోనే.. వీళ్లంతా ఓవరాక్షన్ చేసే యాక్టర్లు.. ‘‘సరే ఆంటోనీ కమిటీ అంతా ఒక తోలుబొమ్మ ఆట అనుకుందాం. ఈ కమిటీకి సంబంధం లేకుండా విభజన బిల్లు తయారైపోతోందని, కేబినెట్ ఆమోదం కూడా పొదుతుందని స్వయంగా హోం మంత్రి షిండే చెబుతున్నారు. అంటే ఈ కమిటీ ఒక పెద్ద డ్రామా అన్నమాట. ఈ కమిటీ అభిప్రాయలు సేకరించడం ఒక పెద్ద డ్రామా, వాటిని పరిశీలించడం ఒక పెద్ద డ్రామా.. పరిశీలించి ఒక నివేదిక తయారు చేయడమన్నది ఇంకా పెద్ద డ్రామా. ఈ డ్రామాలో మన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, బొత్స, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు ఓవరాక్షన్ చేసే యాక్టర్లన్నమాట. ‘మన రాష్ట్రంలో కోట్ల మంది ప్రజలకు అన్యాయం జరిగినా ఫరవాలేదు.. మా పదవులు మాకుంటే చాల’నే క్యారెక్టర్‌లేని యాక్టర్లు వీళ్లంతా. చంద్రబాబు వల్లే విభజన.. మన రాష్ట్రంలో 8 కోట్ల మంది ఉంటే.. అందులో 5 కోట్ల మంది సీమాంధ్రులే. ఇంత మందికి అన్యాయం జరుగుతుంటే.. కాంగ్రెస్ పార్టీ కాలర్ పట్టుకొని నిలదీయాల్సిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబులో మటుకు చలనం లేదు. అసలు ఈ విభజనకు కారణమే చంద్రబాబు. తెలంగాణ ఇచ్చేయండి అని.. ఒక బ్లాంక్ చెక్‌లా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశారు చంద్రబాబు.. అసలు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించే సాహసం చేస్తోందీ అంటే దానికి కారణం చంద్రబాబు ఇచ్చిన మద్దతే. పట్టపగలే సీమాంధ్రుల గొంతుకోసి ఇంకా ఏ మొహం పెట్టుకుని యాత్రలు చేస్తున్నారని చంద్రబాబును ప్రజలు నిలదీయాలి. ఇప్పటికీ ఎందుకు రాజీనామాలు చేయలేదని, ఎందుకు లేఖ వెనక్కు తీసుకోలేదని నిలదీయాలి. కాంగ్రెస్, టీడీపీ క్షమించలేని పాపం చేస్తున్నాయి.. మన ఖర్మ ఏమిటంటే.. ఓట్ల కోసం, సీట్ల కోసం, తెలంగాణను తామే ఇచ్చామన్న క్రెడిట్ కోసం.. కాంగ్రెస్ పార్టీ కోట్ల మంది ప్రజలకు అన్యాయం చేస్తుంటే.. మరోవైపు కోట్ల మంది ప్రజలకు అన్యాయం జరుగుతున్నా.. ఓట్లు పోతాయని, సీట్లు పోతాయని, క్రెడిట్ తనకు రాకుండా పోతుందేమోనని నోరు విప్పడం లేదు చంద్రబాబు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కలిసి రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేయడానికి, నాశనం చేయడానికి వెనుకాడడం లేదు. ఇద్దరూ కలిసి క్షమించలేని ఘోర పాపం చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసినప్పుడే.. వీరూ చేసుంటే... హఠాత్తుగా ఏ పరిష్కారమూ చూపించకుండా రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్నామని సంకేతాలు ఇచ్చిన వెంటనే వైఎస్సార్ కాంగ్రెస్‌కు చెందిన అంత మంది ఎమ్మెల్యేలు, అంత మంది నాయకులూ రాజీనామాలు చేసి తమ నిరసన తెలియజేశారు. గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి కూడా రాజీనామాలు చేసి.. నిరాహార దీక్షలు చేశారు.. ఇది అన్యాయం.. రాష్ట్రాన్ని విడగొట్టొద్దంటూ లేఖలు రాస్తూనే ఉన్నారు. కానీ ఎంత మంది టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామాలు చేశారు? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజీనామాలు చేసినప్పుడే అందరూ రాజీనామాలు చేసి ఉంటే దేశమంతా ఇటు తిరిగిచూసేది.. కాంగ్రెస్ పార్టీ తన నిర్ణయాన్ని మార్చుకునేలా ఒత్తిడి పెరిగేది. ఈ విభజన ప్రక్రియ నిలిచిపోయేది. ఈ కాంగ్రెస్ నాయకులకు పదవులే ముఖ్యం..: కానీ పదవి మత్తులో మునిగి తేలుతున్న ఈ కాంగ్రెస్, టీడీపీ నాయకులకు ఓట్లేసిన ప్రజల కంటే తమ పదవులే ముఖ్యమని మళ్లీ నిరూపించుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నుంచీ ఒకటే మాట చెప్పింది.. ఏ ఒక్క ప్రాంతానికీ అన్యాయం జరగకుండా ఒక తండ్రిలా ఆలోచన చేయాలి.. ఆ ఆలోచన మీద మీ ఉద్దేశం ఏమిటో చెప్పండంటూ అందర్నీ పిలిచి చర్చలు జరపండి అని పదే పదే కోరింది. పదేపదే లేఖలు రాసింది. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ ఇది ప్రజాస్వామ్య దేశమన్న సంగతి కూడా మర్చిపోయి.. వ్యవహరించింది. అందుకే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ చెబుతోంది.. మళ్లీ మళ్లీ డిమాండ్ చేస్తోంది. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని డిమాండ్ చేస్తోంది. అప్పటిదాకా జగనన్న నాయకత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున నిలబడి ఎందాకైనా పోరాటం చేస్తుందని ప్రజలకు మాటిస్తున్నాం.’’ విభజిస్తే.. టీఆర్ఎస్ నేతలు పాస్‌పోర్టులు అడగరా? టీఆర్ఎస్ నాయకులు మొన్న మానవహారంగా ఏర్పాటు కావాలనుకున్న లాయర్లపై సాక్షాత్తూ హైకోర్టులోనే దాడి చేశారు. నిన్న ఎన్జీవోలు సమైక్యవాదాన్ని వినిపించడానికి సభ నిర్వహించుకుని వెనక్కు వస్తుంటే.. వాళ్ల మీదా ఈ నాయకులు దాడిచేశారు. సీమాంధ్రులు వాళ్ల గొంతువిప్పి.. మాకు అన్యాయం జరుగుతోందీ అని చెప్పాలనుకుంటుంటే.. పాపం విభజన జరక్కముందే వాళ్ల మీదా ఈ టీఆర్ఎస్ నాయకులు దాడి చేయిస్తున్నారు. ఇక విభజన జరిగాక.. మాకు అన్యాయం జరుగుతోందీ అని.. వారు గొంతు విప్పితే.. ఈ నాయకులు వారి మీద కేసులు పెట్టరా? వారిని జైల్లో పెట్టరా? విభజన జరక్కముందే సీమాంధ్రులను ద్వితీయ శ్రేణి పౌరుల్లా(సెకండ్ క్లాస్ సిటిజన్స్‌లా) చూస్తున్నారే.. ఇక విభజన జరిగితే.. సీమాంధ్రులను టీఆర్ఎస్ నాయకులు పరదేశీయుల్లా చూడరా? హైదరాబాద్ రావాలంటే.. మా పర్మిషన్లు ఉండాలి.. మీరు పాస్‌పోర్టులు తీసుకొని రావాలి అని ఈ నాయకులు ఆంక్షలు పెట్టరా? కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. హైదరాబాద్‌లో, తెలంగాణలో ఉన్న సీమాంధ్ర ప్రజల ఆస్తులను లాగేసుకుంటామని టీఆర్ఎస్ నాయకులు అనడం వాస్తవం కాదా? సీమాంధ్ర ఉద్యోగస్తులను వెళ్లగొడతామని ఈ నాయకులు అనడం వాస్తవం కాదా? విభజన జరగకముందే వీరి మాటలు, వీరి వైఖరి ఇలా ఉంటే.. ఇక విభజన జరిగిన తర్వాత సీమాంధ్రులు హైదరాబాద్‌లో బతకడం అంటే.. భారతీయుడు పాకిస్థాన్‌లో బతికినంత కష్టమైపోదా?’’. నేడు యాత్రకు విరామం వినాయక చవితి సందర్భంగా షర్మిల యాత్రకు సోమవారం రోజు విరామం ఇస్తున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం తెలిపారు. తిరిగి మంగళవారం యాత్ర పునఃప్రారంభమవుతుందని, అదే రోజు యాత్ర ప్రకాశంలో జిల్లాలోకి ప్రవేశిస్తుందని చెప్పారు. వీళ్లంతా రాజీనామాచేస్తేగాని విభజన ఆగదు.. పదవి మత్తులో మునిగి తేలుతున్న ఈ నాయకులంతా ఎప్పుడు మేలుకుంటారో.. ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీ రాజీనామా చేస్తే తప్ప ఈ విభజన ఆగదని ఎప్పుడు అర్థం చేసుకుంటారో.. ఏమిటి మనకీ ఖర్మ! వీళ్లు పాలకులా లేక రాక్షసులా? పచ్చిగా ఓట్ల కోసం, సీట్ల కోసం ఒక జాతినే చీల్చేస్తారా? ఒక్క ఎన్నికలు ఎదుర్కొనే ధైర్యం లేక.. ఒక్క పాలనలో ప్రజలిచ్చే తీర్పును వినే ధైర్యం లేక ఒక కుటుంబంలోనే చిచ్చు పెడతారా? దానికి చంద్రబాబులాంటి దుర్మార్గులు మద్దతిస్తారా? ఏమిటీ అన్యాయం.. ఏమిటి మన రాష్ట్రానికి ఈ ఖర్మ? టీడీపీ అయితేనేమి, చంద్రబాబు, ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలైతేనేమి, కిరణ్‌కుమార్‌రెడ్డి, బొత్స, ఆ పార్టీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలైతేనేమి.. అసలు వీళ్లందరూ మనుషులేనా? లేక మానవ జాతికి మాయని మచ్చలా? - షర్మిల -
చారిత్రక తప్పిదానికి చంద్రబాబే కారణం: షర్మిల
-
చారిత్రక తప్పిదానికి చంద్రబాబే కారణం: షర్మిల
రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ చారిత్రక తప్పిదం చేయబోతుంటే దానికి మద్దతు పలికి చంద్రబాబు చరిత్ర హీనుడిగా మిగిలిపోతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల మండిపడ్డారు. సమైక్య శంఖారావం బస్సుయాత్రలో భాగంగా ఆదివారం రాత్రి కావలిలో ప్రజలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. తెలంగాణకు అనుకూలంగా బ్లాంక్ చెక్కు మీద సంతకం పెట్టినట్లు చంద్రబాబు లేఖ రాసిచ్చేయడంతో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ విభజించే సాహసం చేస్తోందని చెప్పారు. ఏ మొహం పెట్టుకొని చంద్రబాబు సీమాంధ్రలో ఆత్మగౌరవ యాత్ర చేస్తున్నారని ప్రశ్నించారు. ఆయనను ప్రజలంతా నిలదీయాలని పిలుపునిచ్చారు. తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెట్టి ఆ అగ్గిలో కాంగ్రెస్ చలి కాచుకుంటోందని దుయ్యబట్టారు. న్యాయం చేసే సత్తా లేకుంటే విభజించే హక్కు ఎక్కడుందని ప్రశ్నించారు. జగన్ జైల్లో ఉన్నా జననేతే అన్నారు. నిర్బధంలో ఉండి కూడా ప్రజల కోసం వారం రోజులు నిరాహార దీక్ష చేశాడని తెలిపారు. కాంగ్రెస్, టీడీపీ కలిసి అబద్దపు కేసులు పెట్టి జైలు పాల్జేశారని షర్మిల ఆరోపించారు. -
చంద్రబాబువి కపట నాటకాలు
చీరాల, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర కోసం వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల బస్సు యాత్ర చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ జిల్లా అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానంద రెడ్డి చెప్పారు. స్థానిక గడియార స్తంభం సెంటర్ వద్ద వైఎస్ఆర్ సీపీ పదకొండు రోజులుగా నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షకు శనివారం సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆత్మగౌరవ యాత్ర పేరుతో తిరుగుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. కపట నాటకాలు పక్కనపెట్టి సీమాంధ్ర ఉద్యమంలో భాగస్వామి కావాలన్నారు. సీమాంధ్ర ప్రజల ప్రయోజనాలపై ఆయనకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలంతా రాజీనామాలు చేశారని.. పార్టీ అధ్యక్షుడు జైల్లో ఉండి నిరాహార దీక్ష చేశారని.. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కూడా దీక్ష చేశారన్నారు. తెలంగాణే ముందంజ.. వ్యవసాయం, విద్యుత్, ఉపాధి రంగాల్లో తెలంగాణ బాగా అభివృద్ధి చెందిందని బత్తుల చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన సమయంలో కోస్తాంధ్రలో 18లక్షల హెక్టార్లు సాగులో ఉండగా 2009లో 23 లక్షలకు చేరిందని.. రాయలసీమలో 3.8లక్షల హెక్టార్ల నుంచి 6.3 లక్షలకు చేరుకుందని.. అయితే తెలంగాణలో 4 లక్షల హెక్టార్ల నుంచి ఏకంగా 18 లక్షల హెక్టార్లకు చేరుకుందని వివరించారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను కూడా ఆ ప్రాంతంలోని రైతులే అధికంగా ఉపయోగిస్తున్నారన్నారు. నిజాం నవాబుల పరిపాలనలో మచిలీపట్నం, మోటుపల్లి రేవు పట్టణాల ద్వారా 1.50 లక్షల పౌండ్ల కప్పం కట్టారని, దాని ద్వారానే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ సమన్వయకర్త అవ్వారు ముసలయ్య, మాజీ ఏఎంసీ చైర్మన్ దేటా జోసఫ్, నాయకులు మేడిద రత్నకుమార్, దేవరపల్లి బాబూరావు, అక్కల కోటిరెడ్డి, కర్నేటి రవికుమార్, విల్సన్, బంగారు తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాలో నేడు షర్మిల సమైక్య శంఖారావం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : ఆదివారం జిల్లాలో షర్మిల సమైక్య శంఖారావ ం బస్సుయాత్ర జరగనుంది. కడప జిల్లా బద్వేల్ నుంచి ఉదయం 9 గంటలకు షర్మిల నెల్లూరు జిల్లాలో ప్రవేశిస్తారు. ఉదయం 10 గంటలకు ఆత్మకూరు బస్టాండు సెంటర్లో జరిగే సభలో ఆమె ప్రసంగిస్తారు. అనంతరం సంగం మీదుగా యాత్ర బుచ్చిరెడ్డిపాళేనికి చేరుకుంటుంది. 3 గంటలకు బుచ్చిరెడ్డిపాళెంలో జరిగే సభలో షర్మిల ప్రసంగిస్తారు. ఆ తరువాత రాజుపాళెం మీదుగా యాత్ర కావలికి చేరుకుంటుంది. సాయంత్రం 5 గంటలకు కావలిలో జరిగే సభలో షర్మిల ప్రసంగిస్తారు. షర్మిల యాత్రకు జిల్లా పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశాయి. ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ నేతలు షర్మిలకు ఘనస్వాగతం పలకనున్నారు. సెప్టెంబర్ 2న తిరుపతిలో ప్రారంభమైన షర్మిల సమైక్య శంఖారావం బస్సు యాత్ర చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో పూర్తి చేసుకుని ఆదివారం నెల్లూరు జిల్లాలో ప్రవేశించనుంది. రాత్రికి ఆమె కావలిలో బస చేస్తారు. వినాయకచవితి సందర్భంగా సోమవారం యాత్రకు విరామం. తిరిగి మంగళవారం ప్రకాశం జిల్లాలో యాత్ర ప్రారంభం కానుంది. -
జనసంద్రం
సాక్షి ప్రతినిధి, కడప : రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ..సమైక్యాంధ్ర ప్రదేశ్ కోసం ఉద్యమిస్తూ.. సమైక్య శంఖారావం చేపట్టిన షర్మిల బస్సు యాత్ర మార్గం జనసంద్రమవుతోంది. రాజన్న తనయ, జగనన్న సోదరి షర్మిల ప్రసంగాలు సమైక్యవాదులలో స్ఫూర్తిని నింపుతున్నాయి. సమన్యాయం పాటించలేనప్పుడు విభజించే హక్కు ఎవరిచ్చారంటూ షర్మిల నిలదీస్తుండటాన్ని సమైక్యవాదులు హర్షిస్తున్నారు. పొద్దుటూరు నుంచి శనివారం ఉదయం సమైక్య శంఖారావం చేపట్టిన షర్మిల మైదుకూరులోని నాలుగురోడ్ల కూడలికి మధ్యాహ్నం 12 గంటలకు చేరుకున్నారు. అక్కడి నుంచి రాత్రి 7 గంటల ప్రాంతంలో బద్వేలు నాలుగురోడ్ల కూడలికి చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. రైతులను అమితంగా ప్రేమించిన వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మాత్రమేనని కొనియాడారు. మహానేత పట్ల ఉన్న అభిమానంతో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారన్నారు. తెలుగు ప్రజలు పెట్టిన భిక్షతోనే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతోందన్నారు. ఆదరించి అధికారం అప్పజెప్పితే రాష్ట్రాన్ని విభజించడానికి కాంగ్రెస్ నాయకత్వం పూనుకుందని ధ్వజమెత్తారు. విభజన పేరుతో రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా చేసే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. అన్నదమ్ముల్లా ఉన్న తెలుగు ప్రజల మధ్య నిప్పుపెట్టి ఆ మంటల్లో కాంగ్రెస్ నాయకత్వం చలికాచుకుంటోందని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజిస్తే రాయలసీమ ఎడారే! రాష్ట్ర విభజన జరిగితే ఒకనాటి రతనాల సీమ రాయలసీమ ఎడారిగా మారనుందని షర్మిల వివరించారు. రాష్ట్ర విభజన కారణంగా నదీ జలాలను వాడుకునే స్వేచ్చ, హక్కులను కోల్పోతామన్నారు. శ్రీశైలం, ఎస్ఆర్బీసీ, టీజీపీ, జీఎన్ఎస్ఎస్, ఎస్ఎన్ఎస్ఎస్, కేసీ కెనాల్ నిర్వీర్యం కానున్నాయని వివరించారు. కర్ణాటకలోని అల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల్లో నీరు నిండితేనే కిందికి వస్తున్నాయని వివరించారు. అంతర్రాష్ట్ర జలాశయాలుగా మారితే వరద జలాలను సైతం వాడుకునే స్వేచ్చను కోల్పోవలసి వస్తుందని వివరించారు. కృష్ణా, గోదావరి నదులను అనుసంధానం చేస్తేనే ఆంధ్రప్రదేశ్‌కు యోగ్యకరమని షర్మిల వివరించారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన నందమూరి తారక రామారావు కుటుంబాన్నే నిలువునా చీల్చేందుకు నిత్యం కృషిచేస్తున్న చంద్రబాబునాయుడు రాాష్ట్ర విభజనలో ప్రాంతాలేమైనా పోయినా తనకేమీ సంబంధం లేదన్నట్లుగా ఓట్ల రాజకీయాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. విద్యార్థులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, మహిళలు కోట్లాది మంది సమైక్య రాష్ట్రం కోరుతూ 40 రోజులుగా అనునిత్యం రోడ్లపైకి వస్తున్నారని, వారి ఆకాంక్ష మేరకు రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని ఆమె డిమాండ్ చేశారు. మైదుకూరు సమన్వయకర్త రఘురామిరెడ్డి, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, శ్రీనివాసులు, అమర్నాథరెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మాజీఎమ్మెల్యేలు డీసీ గోవిందరెడ్డి, డీసీసీబీ చైర్మన్ తిరుపాల్‌రెడ్డి, కమలాపురం సమన్వయకర్తలు మాజీ మేయర్ పి.రవీంద్రనాథ్‌రెడ్డి, దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, జిల్లా కన్వీనర్ సురేష్‌బాబు, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు వైఎస్ అవినాష్‌రెడ్డి, మైదుకూరు యువనేత శెట్టిపల్లె నాగిరెడ్డి, డీఎల్ సోదరులు శ్రీనివాసరెడ్డి, గంగాధర్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, ఈవీ మహేశ్వర్‌రెడ్డి, ధనపాల జగన్, కడప సమన్వయకర్త అంజాద్బాష,మాసీమబాబు, అఫ్జల్ఖాన్, హఫీజుల్లా తదితరులు షర్మిల వెంట ఉన్నారు. నాడు పన్నుపోటు..నేడు వెన్నుపోటు సీఎంగా తొమ్మిదేళ్లు అధికారాన్ని వెలగబెట్టిన చంద్రబాబు అప్పట్లో రాష్ట్ర ప్రజానీకంపై పన్నులపై పన్నులు పెంచుతూ పన్నుపోటు వేశారన్నారు. అధికారం కోసం పిల్లనిచ్చిన మామ అని కూడా చూడకుండా ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచారన్నారు. నేడు తెలుగు ప్రజలకు, తెలుగు తల్లికి మరోమారు వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు. తెలంగాణ ఇచ్చేసుకోండి అని బ్లాంక్ చెక్కుపై సంతకం చేసినట్లు ఇచ్చినట్లుగా చంద్రబాబు లేఖ రాశారన్నారు. ఆయనగారు చంద్రబాబునాయుడు కాదు... వెన్నుపోటు చంద్రబాబునాయుడని.. ఈ వెన్నుపోటుదారునికి ఆత్మగౌరవం ఉందా.. అని షర్మిల ప్రశ్నించారు. ప్రజల గొంతు కోసి నిసిగ్గుగా యాత్ర చేపట్టారని ధ్వజమెత్తారు. తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవాలని, ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు చేసి పోరాడాలని డిమాండ్ చేశారు. అంతవరకు రాయలసీమలో అడుగు పెట్టనీయవద్దని తరిమితరిమి కొట్టాలన్నారు. -
లేఖ వెనక్కు తీసుకునేదాకా.. తరిమితరిమి కొట్టండి
చంద్రబాబు లేఖ వల్లే విభజనకు కాంగ్రెస్ సాహసం: షర్మిల పట్టపగలే సీమాంధ్రుల గొంతు కోసి ఇంకా ఏ మొహం పెట్టుకొని యాత్ర చేస్తున్నారు చంద్రబాబు? నాడు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు.. మొన్న ఎఫ్‌డీఐ ఓటింగ్‌లో రైతులు, చిన్న వర్తకులకు వెన్నుపోటు.. ఇప్పుడు తాను పుట్టిన తెలుగుగడ్డకు, తెలుగుతల్లికి కూడా వెన్నుపోటు పొడిచారు బాబు లేఖ వెనక్కు తీసుకొని, రాజీనామాలు చేసే దాకా సీమాంధ్రలో అడుగుపెట్టనీయకండి ఓట్లు, సీట్ల కోసం, రాహుల్‌ను ప్రధానిని చేయడం కోసమే కాంగ్రెస్ విభజనకు పూనుకొంది టీడీపీ సహా ఐదు పార్టీలు విభజనకు సరేనని చెబితే.. వైఎస్ఆర్సీపీ, ఎంఐఎం, సీపీఎం ఎన్నడూ అనుకూలమని చెప్పలేదు.. ‘సమైక్య శంఖారావం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి చేసిన పాపాలు చాలవన్నట్లు.. ఇప్పుడు విభజన పేరుతో అన్నదమ్ముల మధ్యే అగ్గిపెట్టి, ఆ అగ్గిలో చలి కాచుకుంటోంది. ఓట్ల కోసం, సీట్ల కోసం, టీఆర్ఎస్ను తమలో కలుపుకొనైనా సరే రాహుల్ గాంధీని ప్రధానిని చేసుకోవడం కోసం కాంగ్రెస్ కోట్ల మంది ప్రజలకు అన్యాయం చేయడానికి పూనుకొంది. రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతున్నా.. మన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబులో మటుకు ఏ చలనమూ లేదు. ఎలా ఉంటుంది? అసలు తెలంగాణ ఇచ్చేసుకోండి అంటూ ఒక బ్లాంక్ చెక్కు మీద సంతకం పెట్టినట్లు తెలంగాణకు అనుకూలంగా లేఖ రాసిచ్చేసింది చంద్రబాబే. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ విభజించే సాహసం చేస్తోందీ అంటే చంద్రబాబు ఆ విభజనకు పలికిన మద్దతే కారణం’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల మండిపడ్డారు. పట్టపగలే సీమాంధ్రుల గొంతుకోసి ఇంకా ఏ మొహం పెట్టుకొని చంద్రబాబు సీమాంధ్రలో అడుగుపెట్టారని ప్రజలంతా నిలదీయాల్సిన అవసరముందన్నారు. ‘‘తెలంగాణకు అనుకూలంగా నువ్వు లేఖను ఎందుకిచ్చావు? ఎవర్నడిగి ఇచ్చావు?’ అని చంద్రబాబును ప్రజలంతా నిలదీయాలి. తను రాజీనామా చేసి.. తన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించేవరకు, తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖ వెనక్కు తీసుకునే వరకు, తప్పయిపోయింది అని ఆయన చెంపలేసుకొనేవరకు ఆయన సీమాంధ్రలో అడుగు పెట్టడానికి వీల్లేదని చంద్రబాబును ప్రజలంతా తరిమి తరిమి కొట్టాలి’ అని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి న్యాయం చేయడం కాంగ్రెస్ పార్టీకి చేతకాలేదు కాబట్టి.. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని డిమాండ్ చేస్తూ షర్మిల చేపట్టిన ‘సమైక్య శంఖారావం’ బస్సు యాత్ర ఆరో రోజు శనివారం వైఎస్సార్ జిల్లాలో సాగింది. మైదుకూరు, బద్వేలులలో నిర్వహించిన బహిరంగ సభలకు పోటెత్తిన ప్రజలనుద్దేశించి షర్మిల మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. ఈ సభల్లో షర్మిల ప్రసంగాల సారాంశం ఆమె మాటల్లోనే.. వెన్నుపోటు చంద్రబాబు.. ‘‘గతంలో ఎఫ్‌డీఐ ఓటింగ్ విషయంలో కాంగ్రెస్ పార్టీతో కలిసిపోయి నిస్సిగ్గుగా తన ఎంపీలను గైర్హాజరు పరిచి కోట్ల మంది రైతులకు, కోట్ల మంది చిన్న వర్తకులకు వెన్నుపోటు పొడిచారు చంద్రబాబు నాయుడు. ఆ తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ ఏకంగా రూ.32 వేల కోట్ల భారాన్ని కరెంటు చార్జీల రూపంలో ప్రజల నెత్తిన వేస్తే.. అందుకు వ్యతిరేకంగా అన్ని ప్రతిపక్ష పార్టీలూ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టాయి. ఒక్క చంద్రబాబు మటుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఈగ కూడా వాలడానికి వీల్లేదని నిస్సిగ్గుగా విప్ జారీచేసి ఆ ప్రభుత్వాన్ని కాపాడి మరీ కోట్ల మంది ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. ఒకప్పుడు సొంత మామకు వెన్నుపోటు పొడిచారు.. తర్వాత ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. ఇప్పుడు తాను పుట్టిన తెలుగు గడ్డకు, తెలుగుతల్లికి కూడా వెన్నుపోటు పొడిచారు. పార్లమెంటు ఎన్నికల నుంచి పంచాయతీ ఎన్నికల దాకా ఏ ఎన్నికలైనా కాంగ్రెస్ పార్టీతో కలిసిపోయి కుమ్మక్కై ప్రజాస్వామ్యానికి కూడా వెన్నుపోటు పొడిచారు చంద్రబాబు నాయుడు. ఈయన్ను నారా చంద్రబాబు అనాలా? లేక వెన్నుపోటు చంద్రబాబు అనాలా? ఆ చేతగాని అబ్బాయి కోసమే చంద్రబాబు యత్నాలు.. ఈ వెన్నుపోటు చంద్రబాబుకు ఒక తరంగాని(చేతగాని) అబ్బాయి ఉన్నాడు. చంద్రబాబు ఏం చేసినా తన అబ్బాయి కోసమే చేస్తారు.. అందుకే ఆయన ఇతరుల అబ్బాయిల గురించి మాట్లాడుతుంటారు. ఆ తరంగాని అబ్బాయిని ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీకి వారసుడిగా చేయడానికి ఎన్టీఆర్ సొంత కొడుకుల్ని కూడా చంద్రబాబు తొక్కి పెడుతున్నారు. పార్టీలో ఎవరు పైకి వచ్చినా బాబు ఓర్వలేరు.. ఎన్టీఆర్ కొడుకుల్లో ఏ ఒక్కరికీ పార్టీలో పెద్ద స్థానాన్ని ఇచ్చేందుకు ఇష్టపడరు. చంద్రబాబు దృష్టిలో లోక కల్యాణం అంటే.. లోకేశ్ కల్యాణం అని అర్థం. ఈ చంద్రబాబు అంటారు.. హైదరాబాద్ ఈ రోజు ఇంత అభివృద్ధి చెందిందీ అంటే అది తన వల్లేనట. ఆయన హైదరాబాద్‌ను సింగపూర్‌లా మార్చేశారట. చార్మినార్‌ను కట్టింది కూడా మీరేనా చంద్రబాబూ? హుస్సేన్ సాగర్‌ను వేయించింది కూడా మీరేనా? 400 సంవత్సరాల చరిత్ర ఉన్న హైదరాబాద్‌కు మొత్తం తానే చేశానని చెప్పుకొంటున్నారంటే.. ఈయన దృష్టిలో ప్రజలు మనుషులు కారు.. గొర్రెలని అర్థమా? లేక ప్రజలు మనుషులేగాని పిచ్చివాళ్లని అభిప్రాయమా? హైదరాబాద్‌కు మీరేం చేశారో ప్రజలకు తెలుసు.. అసలు హైదరాబాద్‌కు ఆయన ఏం చేశారో.. ఆయనకు హైదరాబాద్ ఏం చేసిందో ప్రజలకు గుర్తులేదని అనుకుంటున్నారు చంద్రబాబు. ఈయన తొమ్మిదేళ్ల పాలనలో హైదరాబాద్ చుట్టూ ఉన్న వేల కోట్ల రూపాయల విలువ చేసే భూముల్ని తన బినామీలకు రాసిచ్చేసుకున్నారు. తన భార్య స్థలాన్నేమో కోట్ల రూపాయలకు అమ్ముకున్న ఆయన.. ప్రభుత్వ స్థలాలనేమో.. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు కారుచౌకగా రాసిచ్చేశారు. ఒకే ఒక్క ఉదాహరణ చెబుతా.. ఐఎంజీ అనే తన బినామీ కంపెనీకి, కేవలం రూ.లక్షతో ఏర్పాటైన ఆ కంపెనీకి, అది ఏర్పాటైన మూడు రోజుల్లోనే.. హైదరాబాద్ నడిబొడ్డున 850 ఎకరాల భూముల్ని రాసిచ్చేశారు చంద్రబాబు. ఆ రోజుల్లోనే అది రూ.2,500 కోట్ల విలువ చేసే భూమి. ఈ రోజు అది 10 వేల కోట్ల కంటే ఎక్కువే చేస్తుంది. దాన్ని ఆయన రూ.3.5 కోట్లకు తన బినామీ సంస్థకు రాసిచ్చేశారు. ఈ రోజు బాబు హైదరాబాద్ మీద తనకే హక్కు ఉందంటున్నారు.. ఆ హక్కుతోనే రూ.4 లక్షల కోట్లకు రాజధానిని తెలంగాణకు అమ్మకానికి పెట్టేశారు. పోలవరానికి నీళ్లెక్కడి నుంచి తెస్తారు? ఏ పరిష్కారమూ చూపకుండా హఠాత్తుగా కాంగ్రెస్ ప్రభుత్వం మన రాష్ట్రాన్ని విడగొడుతుందని సంకేతాలు అందగానే వైఎస్సార్ సీపీకి చెందిన అంత మంది నాయకులు ఒకేసారి తమ పదవులకు రాజీనామాలు చేశారు. ఆ తరువాత జగన్మోహన్రెడ్డి, విజయమ్మ రాజీనామా చేశారు. నిరాహార దీక్షలు చేశారు. లేఖలు రాసి ఈ రోజు వరకు ప్రజల మధ్య నిలబడి పోరాటం చేస్తుంటే.. చంద్రబాబు మటుకు గురకపెట్టి నిద్రపోతున్నారు. టీడీపీ సహా ఐదు పార్టీలు విభజనకు అనుకూలమని కేంద్రానికి చెబితే.. వైఎస్సార్ సీపీ, సీపీఎం, ఎంఐఎం ఏనాడూ అనుకూలమని చెప్పలేదు. ఇప్పటికే ఎగువ రాష్ట్రాలు కృష్ణా నీళ్లను కిందకు వదలని పరిస్థితి చూస్తున్నాం. ఇప్పడు రాష్టాన్ని అడ్డగోలుగా విభజించేస్తే.. మధ్యలో వచ్చిన రాష్ట్రం కృష్ణా నీళ్లను అడ్డుకుంటే.. కింద ఉన్న ప్రాంతం మహా ఎడారి అయిపోదా? పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదాను ఇస్తామంటున్నారు... కానీ పోలవరం ప్రాజెక్టుకు, గోదావరికి మధ్య ఇంకో రాష్ట్రం వచ్చి గోదావరి నీళ్లను అడ్డుకుంటే ఆ ప్రాజెక్టును ఏ నీళ్లతో నింపుతారో కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. గోదావరి నీళ్లను కృష్ణా జలాలతో కలిపి వైఎస్సార్ రాయలసీమను సస్యశ్యామలం చేయాలనుకున్నారు. గోదావరి, కృష్ణా నీళ్లను ఒక రాష్ట్రమొచ్చి అడ్డుకుంటే సీమాంధ్ర ఎడారై పోదా? పదేళ్లలో కొత్త రాజధానిని నిర్మించుకోమంటున్నారు.. అభివృద్ధి చేయడానికి అరవయ్యేళ్లు పట్టిన హైదరాబాద్ లాంటి రాజధానిని పదేళ్లలో నిర్మించుకోవడం సాధ్యమా?’’ శనివారం షర్మిల వెంట యాత్రలో పాల్గొన్న నేతల్లో ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, జిల్లా పార్టీ కన్వీనర్ సురేశ్‌బాబు, కడప మాజీ మేయర్ పి.రవీంద్రనాథ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రఘురాంరెడ్డి, డీసీ గోవిందరెడ్డి, స్థానిక నాయకులు దేవిరెడ్డి శివశంక ర్‌రెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డి, తిరుపాల్‌రెడ్డి, ఆర్. ప్రసాదరెడ్డి, మల్లికార్జునరెడ్డి, అంజద్ బాషా తదితరులున్నారు. నేడు నెల్లూరు జిల్లాలో యాత్ర షర్మిల బస్సు యాత్ర ఆదివారం నెల్లూరు జిల్లాలోకి ప్రవేశిస్తుంది. ఉదయం ఆత్మకూరు, సాయంత్రం కావలి సభల్లో షర్మిల ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు బుచ్చిరెడ్డిపాలెంలో కొద్ది సేపు ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. -
13,14 తేదీల్లో తూ.గో జిల్లాలో షర్మిల బస్సు యాత్ర
రాజమండ్రి: రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన ‘సమైక్య శంఖారావం’ బస్సు యాత్ర ఈ నెల 13న ఉదయం 10 గంటలకు పశ్చిమ గోదావరి జిల్లా సిద్దాంతం నుండి తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించనున్నట్టు ఆ జిల్లా కన్వీనర్ చిట్టెబ్బాయి పేర్కొన్నారు. బస్సు యాత్రలో భాగంగా ఉదయం 10.30 గంటలకు రావులపాలెంలోనూ, సాయంత్రం 4 గంటలకు అమలాపురంలో బహిరంగ సభ జరుగుతుందని తెలిపారు. 14వ తేదీన ఉదయం 10 గంటలకు కాకినాడ మెయిన్ రోడ్డు వద్ద సమైక్యాంధ్ర ధర్నాలో షర్మిల పాల్గొంటారు. అదేరోజు సాయంత్రం తుని నుండి విశాఖ జిల్లాలోకి షర్మిల బస్సుయాత్ర ప్రవేశించనునున్నట్టు కన్వీనర్ చిట్టెబ్బాయి పేర్కొన్నారు. -
షర్మిల యాత్రను సక్సెస్ చేయాలి
సాక్షి, నెల్లూరు: జిల్లాలో ఆదివారం నిర్వహించనున్న షర్మిల సమైక్య శంఖారావం బస్సుయాత్రను విజయవంతం చేయాలని వైఎస్సార్సీపీ సీజీసీ సభ్యుడు, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి పార్టీశ్రేణులకు పిలుపునిచ్చారు. షర్మిల యాత్ర నేపథ్యంలో స్థానిక పార్టీ కార్యాలయంలో శుక్రవారం వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డితో పాటు ఆయా నియోజకవర్గాల సమన్వయకర్తలు, ముఖ్యనేతలతో ఎంపీ సమావేశం నిర్వహించారు. నేతలందరూ వచ్చి బద్వేలు నుంచి వచ్చే షర్మిలకు జిల్లా సరిహద్దులో స్వాగతం పలకాలన్నారు. జిల్లాలో జరిగే షర్మిల సభలను అందరూ కలిసి విజయవంతం చేయాలని కోరారు. అ నంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ మాట్లాడారు. షర్మిల బస్సుయాత్ర 8వ తేదీ ఉదయం బద్వేలు నుంచి జిల్లాలో ప్రవేశిస్తుందన్నారు. 10 గంటలకు ఆత్మకూరులో జరిగే సభలో ఆమె ప్రసంగిస్తారని తెలిపారు. అనంతరం సంగం మీదుగా బుచ్చిరెడ్డిపాళెం వచ్చి అక్కడ జరిగే సభలోనూ ప్రసంగిస్తారన్నారు. సాయంత్రానికి కావలి చేరుకుని అక్కడ జరిగే సభలో మాట్లాడతారని తెలిపారు. రాత్రికి కావలిలో బసచేస్తారని ఎంపీ చెప్పారు. పార్టీశ్రేణులు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై షర్మిల యాత్రను విజయవంతం చేయాలన్నారు. విడిపోతే సీమాంధ్రకు అన్యాయం జరుగుతుంది కాబట్టే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని -
బస్సుయాత్రకు ఎన్‌హెచ్ 18 పొడవునా ఘన స్వాగతం
సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ, సమైక్యాంధ్ర కోసం ఉద్యమిస్తున్న వివిధ వర్గాలను ఉత్తేజపరుస్తూ... రాష్ట్ర సమైక్యత కన్నా పదవులే ముఖ్యమని వాటిని పట్టుకు వేళాడుతున్న నాయకులకు చురకలు అంటిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల నంద్యాలలో చేసిన స్ఫూర్తిదాయక ప్రసంగం తలనెరిసిన రాజకీయవేత్తలనూ ఆలోచింపజేసింది. సమైక్యాంధ్ర కోసం షర్మిల చేపట్టిన బస్సుయాత్ర శుక్రవారం కర్నూలు నుంచి నంద్యాల, కోయిలకుంట్ల మీదుగా వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరుకు చేరుకుంది. జిల్లా ప్రజలు షర్మిలకు ఘన వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా నంద్యాలలో వేలాదిగా తరలివచ్చిన ప్రజలనుద్దేశించి ఆమె ప్రసంగించారు. రాష్ట్రాన్ని విభజిస్తే రాయలసీమ, కోస్తాంధ్రలు ఎడారిగా మారతాయని చిన్న పిల్లాడి నుంచి వృద్ధుల వరకు ఆందోళనతో రోడ్లపైకి వస్తున్నా... పదవులు పట్టుకు వేళాడుతున్న కాంగ్రెస్, టీడీపీ ప్రజా ప్రతినిధులపై ఆమె నిప్పులు చెరిగారు. రాజకీయాలు, పార్టీలు ముఖ్యం కాదని, భావితరాల గురించి ఆలోచించి ఇప్పటికైనా రాజీనామాలు చేసి ఉద్యమంలోకి వచ్చి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ఆమె హితవు పలకడంతో సమైక్యవాదుల నుంచి హర్షాతిరేఖాలు వెల్లువెత్తాయి. అన్నదమ్ముల మధ్య అగ్గిపెట్టి ఆ అగ్గిలో చలికాచుకుంటున్న కాంగ్రెస్ పార్టీని, రాష్ట్ర విభజనకు అనుకూలమైన లేఖ ఇచ్చిన చంద్రబాబును ఆమె తన ప్రసంగంలో తూర్పారబట్టిన తీరు అందరినీ ఆలోచింపజేసింది. రాష్ట్రాన్ని నిలువునా కోసేందుకు కత్తి ఇచ్చి ఇప్పుడు ఆత్మగౌరవ యాత్ర చేస్తున్న చంద్రబాబు అంతటి దుర్మార్గుడు ఎవరూ ఉండరంటూ జనం చప్పట్ల మధ్య పునరుద్ఘాటించారు. వైఎస్ సీఎం అయిన తర్వాత ఆయన చేసిన కృషి కారణంగా రాయలసీమ ప్రజలు రెండు పంటలు వేసుకుంటున్నారని, అదే విడిపోతే ఒక్కపంటకూ నీరు రాని పరిస్థితి ఏర్పడుతుందనే వాస్తవాన్ని వివరించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం నీటి కోసం కర్ణాటక, మహారాష్ట్రలతో తగాదాలు పెట్టుకుంటున్న మనం రేపు మరో కొత్త రాష్ట్రంతో కొట్లాడాలా అంటూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే ఎదురయ్యే సాగునీటి సమస్యను వివరించారు. శ్రీశైలం నుంచి సీమకు వస్తున్న ఎస్ఆర్బీసీ, తెలుగుగంగ, కేసీ కెనాల్, హంద్రీనీవాలకు నీరిచ్చే పరిస్థితి ఉంటుందా అంటూ జనాల్లో చైతన్యం నింపారు. వైఎస్ ఉన్నప్పుడు పోలవరం ద్వారా గోదావరి నీటిని కృష్ణాకు మళ్లించి అన్ని ప్రాంతాలను సస్యశ్యామలం చేయాలని చూశారని, ఇప్పుడు రాష్ట్రం విడిపోతే తెలంగాణలో మరో ప్రాజెక్టు కడితే పోలవరానికి నీరెక ్కడి నుంచి తెస్తారని ఆమె కాంగ్రెస్ నేతలను సూటిగా ప్రశ్నించి సమస్య తీవ్రతను తెలియజేశారు. రాష్ట్ర విభజనకు కారకులెవ్వరు.. విడిపోతే వచ్చే సమస్యలు... విడిపోకుండా ఉండేందుకు చేయాల్సిన కృషిని ఆమె తన ప్రసంగంలో అందరినీ ఆకట్టుకునేలా వివరించి ప్రశంసలు పొందారు. కట్టలు తెంచుకున్న జనవాహినినంద్యాలలో మిట్ట మధ్యాహ్నం ఏర్పాటు చేసిన సభకు నంద్యాలతో పాటు చుట్టుపక్క ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గతంలో ఏ సభలో, ఎన్నడూ చూడనంత జనం షర్మిల సభకు తరలివచ్చినట్లు రాజకీయ విశ్లేషకుల అంచనా. నంద్యాలకు వచ్చే అన్ని రోడ్లు జనంతో కిటకిటలాడగా, సభ ఏర్పాటు చేసిన పొట్టి శ్రీరాములు సెంటర్ ఇసుక వేస్తే రాలనంత జనంతో నిండిపోయింది. మాజీ ఎంపీ, పార్టీ నంద్యాల ఇన్చార్జి భూమా నాగిరెడ్డి సభకు వచ్చిన జనానికి అభినందనలు తెలియజేస్తూ సమైక్య ఉద్యమంలో అదే స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. దారి పొడవునా నీరాజనాలు కర్నూలులోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో బసచేసిన షర్మిల ఉదయాన్నే తనను కలిసేందకు వచ్చిన నాయకులు, ప్రజలు, చిన్నారులతో మాట్లాడి సమైక్యాంధ్ర కోసం సాగిస్తున్న ఉద్యమానికి అండగా నిలవాలని కోరారు. అనంతరం సెయింట్ జోసెఫ్ కళాశాల, పాఠశాల విద్యార్థులతో కొద్దిసేపు మాట్లాడారు. ఈ పాఠశాల పూర్వ విద్యార్థి అయిన భూమా నాగిరెడ్డి కర్నూలులో విద్యార్థులు, విద్యాసంస్థలు చేస్తున్న ఉద్యమ తీరును ఆమెకు వివరించారు. అనంతరం నంద్యాలకు బయలుదేరిన షర్మిలకు బి.తాండ్రపాడు, నన్నూరు, ఓర్వకల్లు, కాల్వబుగ్గ, సుగాలిమెట్ట, తమ్మరాజు పల్లె, పాణ్యం, నంద్యాల వరకు అడుగడుగునా ప్రజలు ఎన్‌హెచ్ 18 పైకి వచ్చి స్వాగతం పలికారు. తనకు జై జగన్, జై సమైక్యాంధ్ర నినాదాలతో ఆహ్వానం పలుకుతున్న వారికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా హుస్సేనాపురంలో గ్రామస్తులు షర్మిలకు అరటిగెలను బహుమతిగా అందజేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. నంద్యాల సభ అనంతరం వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరుకు బయలుదేరగా, జిల్లా సరిహద్దుల వరకు ప్రజలు నీరాజనాలు పట్టారు. గోస్పాడులో ట్రాక్టర్లు అడ్డుపెట్టి మరీ షర్మిలను తమ వద్దకు వచ్చి మాట్లాడాల్సిందిగా అభ్యర్థించగా, సమయం మించిపోతుందని చెప్పి ముందుకు సాగారు. కోయిలకుంట్ల బైపాస్ వద్ద వేలాదిగా ప్రజలు రాగా, వారికీ అభివాదం చేస్తూ వెళ్లిపోయారు. నొస్సం వరకు జిల్లాకు చెందిన పార్టీ నాయకులు వెళ్లి వీడ్కోలు పలికారు. బస్సుయాత్రలో పార్టీ సీనియర్ నేతలు పి.రవీంద్రనాథ్‌రెడ్డి, భూమా నాగిరెడ్డి, పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి, ఎమ్మెల్యేలు శోభా నాగిరెడ్డి, కాటసాని రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎస్.వి. మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గౌరు చరిత, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు బుగ్గన రాజారెడ్డి, బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఇతర నాయకులు ఎర్రబోతుల వెంకటరెడ్డి, వెంకట కృష్ణారెడ్డి, నరేందర్ రెడ్డి, యాలూరు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రజల కోసం ఉద్యమించాలా వద్దా అని.. మీ మనస్సాక్షిని అడగండి : షర్మిల
మీ తల్లిదండ్రుల్ని, మీ ఊళ్లో వారిని అడగండి.. వారు ఏది చెబితే అదే చేయండి ఇప్పటికీ రాజీనామాలు చేయని కాంగ్రెస్, టీడీపీ నాయకులకు షర్మిల హితవు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసినప్పుడే మిగతా పార్టీ వారూ చేసుంటే విభజన ప్రక్రియ ఆగిపోయేది ఓట్లు, సీట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు విభజన నిర్ణయం తీసుకుంది వైఎస్ఆర్ సీపీ, ఎంఐఎం, సీపీఎం ఏనాడూ విభజనకు అంగీకరించలేదు చంద్రబాబు ఇచ్చినలేఖ వల్లే విభజన.. దాన్ని ఆయన వెనక్కు తీసుకోవాలి బాబు, ఆయన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి ‘సమైక్య శంఖారావం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ఓట్లు, సీట్ల కోసం, రాహుల్ గాంధీని ప్రధానిని చేసుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ తీసుకున్న విభజన నిర్ణయంతో రాష్ట్రం అట్టుడికిపోతోందని, ఇంత జరుగుతున్నా కాంగ్రెస్, టీడీపీ ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయకుండా పదవులను పట్టుకొని వేలాడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల నిప్పులు చెరిగారు. కాంగ్రెస్, టీడీపీ నాయకులు ఇప్పటికైనా మేలు కోవాలని, తమకు ఓట్లేసిన ప్రజల రుణం తీర్చుకోవాలని కోరారు. ‘‘అయ్యా నాయకులారా ఒక్క మాట చెప్తాను.. చిన్నదాన్ని కదా అని నా మాటను తీసిపారేయకండి.. ఒక్కసారి మీ ఇంటికెళ్లి మిమ్మల్ని కన్న తల్లిదండ్రుల్ని ‘నేను సీమాంధ్ర ప్రజల కోసం ఉద్యమించాలా లేదా?’ అని అడగండి. వాళ్లు ఏది చెబితే అదే చేయండి. ఒక్కసారి మీ ఊరికెళ్లండి.. అక్కడ ఏదో ఒక పొలానికి వెళ్లి అక్కడ రైతును అడగండి. ఆ భూమి పుత్రులు ఏది చెబితే అదే చేయండి. అక్కడ కూలి పని చేసుకుంటున్న ఏదో ఒక రైతు కూలీని అడగండి.. అతడు ఏది చెబితే అదే చేయండి. మీకు తెలిసిన స్కూలు మాస్టార్ దగ్గరకు వెళ్లి అడగండి.. ఆ జ్ఞాని ఏది చెబితే అదే చేయండి. అక్కడే చదువుకుంటున్న ఒక చిన్న విద్యార్థిని కూడా అడగండి.. ఆ స్వచ్ఛమైన మనసు, కలుషితం లేని మనసు ఏది చెబితే అదే చేయండి. ఇంకా మీకు ఓపిక ఉంటే.. మీ నియోజకవర్గంలో ఏదో ఒక గ్రామానికి వెళ్లి, ఏదో ఒక వీధికి వెళ్లి, ఎవర్నయినా అడగండి.. మీకు ఓపిక ఉన్నంతవరకు అడగండి. రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత మీరు తింటున్న అన్నం మీద ఒట్టేసుకుని మీ మనస్సాక్షిని అడగండి. కళ్లు మూసుకుని పడుకునే ముందు మీకు ఓట్లేసిన ప్రజల రుణం ఎలా తీర్చుకోవాలో ఒక్కసారి ఆలోచన చేయండి. పొద్దున్నే లేచి దేవుడికి దణ్ణం పెట్టుకుని, దేవుని దృష్టికి ఏది యథార్థమనిపించిందో అది చేయండి.. చాలు మీ జన్మలు ధన్యమైపోతాయి’’ అని షర్మిల హితవు పలికారు. రాష్ట్రానికి న్యాయం చేయడం కాంగ్రెస్ పార్టీకి చేతకాలేదు కాబట్టి.. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని డిమాండ్ చేస్తూ షర్మిల చేపట్టిన ‘సమైక్య శంఖారావం’ బస్సు యాత్ర ఐదో రోజు శుక్రవారం కర్నూలు, వైఎస్ఆర్ జిల్లాల్లో సాగింది. కర్నూలు జిల్లాలోని నంద్యాల, వైఎస్ఆర్ జిల్లాలోని ప్రొద్దుటూరులలో పెద్ద ఎత్తున తరలివచ్చిన జనసందోహాన్ని ఉద్దేశించి షర్మిల ప్రసంగిస్తూ పై వ్యాఖ్యలు చేశారు. ప్రసంగాల సారాంశం ఆమె మాటల్లోనే.. బాబు లేఖతోనే రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ సాహసం.. ‘‘ఓట్లు, సీట్ల కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విభజన యత్నాలతో రాష్ట్రం అగ్నిగుండంలా రగులుతోంది. ఇంత జరుగుతున్నా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబులో కనీసం చలనం లేదు. ఎలా ఉంటుంది.. అసలు తెలంగాణను ఇచ్చేయండి అంటూ ఒక బ్లాంక్ చెక్ రాసిచ్చినట్లు లేఖ రాసిచ్చేశారు ఈయన. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించే సాహసం చేస్తోందీ అంటే దానికి కారణం.. చంద్రబాబు నాయుడు తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖే. మన రాష్ట్రంలో 60 శాతం మంది ప్రజలకు ఈ రోజు తీరని అన్యాయం జరగబోతోంది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల తరఫున నిలబడి, పోరాటం చేసి, గొంతెత్తి ఇది అన్యాయమని చెప్పి పాలక పక్షాన్ని కాలర్ పట్టుకునైనా సరే నిలదీయాల్సింది చంద్రబాబు. కానీ ఆయన ఈ రోజు ఆ పని చేయలేదు సరికదా.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విడగొడుతున్నామని ప్రకటిస్తే.. ఈయన విలేకరుల సమావేశం పెట్టి.. నాలుగు లక్షల కోట్లీయండి అంటూ హైదరాబాద్‌ను అమ్మకానికి పెట్టేశారు. అసలు ఈయన ప్రతిపక్ష నాయకుడా లేక దుర్మార్గుడా? చంద్రబాబును చూసి తెలుగుతల్లే తలదించుకుంటుంది.. చంద్రబాబు పట్టపగలు సీమాంధ్రుల గొంతుకోసి ఈ రోజు యాత్రలంటూ తిరుగుతున్నారు. ప్రజలంతా ఏ మొహం పెట్టుకొని యాత్ర చేస్తున్నారని చంద్రబాబును నిలదీయాల్సిన అవసరముంది. ఇంత అన్యాయం జరుగుతున్నా.. మీరుగాని, మీ ఎమ్మెల్యేలుగాని, మీ ఎంపీలుగాని ఎందుకు రాజీనామా చేయలేదని నిలదీయాలి. అసలు మీరు తెలంగాణకు అనుకూలంగా లేఖ ఎలా ఇచ్చారు.. ఎవర్నడిగి ఇచ్చారని ప్రజలంతా నిలదీయాలి. ఆయన ఈ రోజు ఇంతటి నీచానికి పాల్పడ్డారంటే.. అసలు ఈయన పుట్టింది ఈ గడ్డమీదేనంటే తెలుగు తల్లే అవమానంతో తలదించుకుంటుంది. టీడీపీ సహా ఐదు పార్టీలు రాష్ట్ర విభజనకు ఒప్పుకుంటే, 3 పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సీపీఎం, ఎంఐఎంలు ఎప్పుడూ ఈ విభజనకు ఒప్పుకోలేదు. చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, సీమాంధ్రుల పట్ల ఏమాత్రం ప్రేమాభిమానాలు ఉన్నా, పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలని ఉన్నా, ఇప్పటికైనా ఆ లేఖ వెనక్కి తీసుకోవాలి. తప్పయిపోయింది అని చెప్పి ఆయన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు చేయాలి. విభజన ప్రక్రియ ఆగిపోయేది.. హఠాత్తుగా ఏ పరిష్కారమూ చూపకుండా అన్యాయంగా రాష్ట్రాన్ని విడగొడుతున్నామని కాంగ్రెస్ సంకేతాలు ఇచ్చిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలందరూ రాజీనామాలు చేసి తమ నిరసన తెలియజేశారు. అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, గౌరవాధ్యక్షురాలు విజయమ్మ కూడా రాజీనామాలు చేసి, తమ వంతు పోరాటంగా నిరాహార దీక్షలు కూడా చేశారు. అంతమంది రాజీనామాలు చేసినప్పుడు.. సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్, టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలందరూ రాజీనామాలు చేసి ఉంటే దేశం మొత్తం రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని తిరిగి చూసేది. కాంగ్రెస్ తన నిర్ణయాన్ని మార్చుకునేలా ఒత్తిడి పెరిగేది. ఈ విభజన ప్రక్రియ ఆగిపోయేది. ఈ ప్రశ్నలకు కాంగ్రెస్ జవాబు చెప్పాలి.. ఇప్పటికే ఎగువన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు మనకు నీళ్లు వదలని పరిస్థితి చూస్తున్నాం. మళ్లీ మధ్యలో మరో రాష్ట్రం వస్తే ఆ రాష్ట్రం కృష్ణా నీళ్లను అడ్డుకుంటే శ్రీశైలానికి, నాగార్జున సాగర్‌కు నీళ్లెలా వస్తాయి? శ్రీశైలం ప్రాజెక్టుకు నీళ్లు రాకపోతే.. కేసీ కెనాల్, తెలుగు గంగ, బీఎంఎస్, హంద్రీ నీవాకు నీళ్లెలా వస్తాయి? వీటికి నీళ్లు రాకపోతే.. ఆ ఆయకట్టు ప్రాంతమంతా ఎండిపోదా? గడప గడపకూ ఆత్మహత్యలు జరిగి గ్రామాలన్నీ శ్మశానాలుగా మారిపోతాయి. పోలవరానికి జాతీయ హోదా కల్పిస్తామని అంటున్నారు.. మధ్యలో మరో రాష్ట్రం వచ్చి గోదావరి నీళ్లను అడ్డుకుంటే ఆ ప్రాజెక్టును ఎలా నింపుతారో మాత్రం చెప్పడం లేదు. కృష్ణా, గోదావరి జలాలను అడ్డుకుంటే సీమాంధ్ర ప్రాంతం మహా ఎడారిగా మారదా? ఒకప్పుడు మద్రాసు నుంచి పొమ్మన్నారు. హైదరాబాద్‌పై ఇప్పుడు మీకు హక్కులు లేవంటున్నారు. నిర్మించడానికి అరవై ఏళ్లు పట్టిన హైదరాబాద్ లాంటి రాజధానిని పదేళ్లలో నిర్మించుకోవడం సాధ్యమేనా?’’ ఆర్టీసీ డ్రైవర్ మృతికి సంతాపం.. సమైక్యాంధ్ర కోసం ప్రొద్దుటూరులో వాటర్ ట్యాంకు మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ డ్రైవర్ మునయ్య మృతికి షర్మిల సంతాపం తెలిపారు. ప్రొద్దుటూరులో సమైక్య శంఖారావం వేదిక మీద నుంచి షర్మిలతో పార్టీ నాయకులు, రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. మరో ఐదు జిల్లాల యాత్ర షెడ్యూల్ ఇలా.. సాక్షి, హైదరాబాద్: షర్మిల చేపట్టిన బస్సు యాత్రకు సంబంధించి మరో ఐదు జిల్లాల పర్యటనా వివరాలను వైఎస్ఆర్ సీపీ కార్యక్రమాల రాష్ట్ర సమన్వయకర్త తలశిల రఘురాం శుక్రవారం వెల్లడించారు. ఆ వివరాలివీ.. 8వ తేదీన నెల్లూరు జిల్లా ఆత్మకూరు, కావలిలలో షర్మిల సభలు నిర్వహించనున్నారు. 9న వినాయక చవితి పర్వదినం కావడంతో యాత్రకు విరామం. 10న ప్రకాశం జిల్లాలో కనిగిరి, మార్కాపురం, 11న గుంటూరు జిల్లా వినుకొండ, రేపల్లె, కృష్ణా జిల్లా అవనిగడ్డ, 12న పశ్చిమ గోదావరి జిల్లా కైకలూరు, ఏలూరులలో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. మాది మొదటి నుంచీ ఒకటే మాట.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నుంచీ ఒకే మాట చెప్పింది.. ఏ ప్రాంతానికీ అన్యాయం చేయకుండా, ఒక తండ్రిలా అందరికీ న్యాయం చేయండి.. ముందు మీ ఉద్దేశం ఏమిటో చెప్పండి.. అందర్నీ పిలవండి.. అందరితో చర్చలు జరపండి.. అని కాంగ్రెస్ పార్టీకి పదే పదే చెప్పింది.. లేఖలు రాసింది. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ ఇది ప్రజాస్వామ్య దేశమన్న సంగతి కూడా మర్చిపోయి వ్యవహరించింది. అందుకే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ చెబుతోంది. మళ్లీ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తోంది. మీకు న్యాయం చేసే ఉద్దేశం లేకపోతే ఆ అధికారాన్నిగాని, ఆ బాధ్యతనుగాని ఎందుకు తీసుకున్నారు? న్యాయం చేసే సత్తా మీకు లేకపోతే.. విభజించే హక్కు మీకు ఎక్కడుంది? న్యాయం చేయడం మీ ఉద్దేశం కాదని, అది మీకు చేతకాదని తేలిపోయింది కాబట్టి.. రాష్ట్రాన్ని యథాతథంగానే, సమైక్యంగానే ఉంచాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా డిమాండ్ చేస్తోంది. మా ప్రజలకు అన్యాయం జరుగుతుంటే.. జగనన్న నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేతులు కట్టుకొని కూర్చోదు. జగనన్న నాయకత్వంలో ఎందాకైనా ప్రజల తరఫున నిలబడి పోరాటం చేస్తూనే ఉంటుందని మీకు మాటిస్తున్నాం. - షర్మిల ఈ సీఎం పనికొస్తారా? ‘‘గత నాలుగేళ్లుగా మన రాష్ట్రం అభివృద్ధిలో ఒక్క అడుగు ముందుకు వేయకపోగా, 20 సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయింది. దానికి కారణం మన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి. కిరణ్‌కుమార్‌రెడ్డికి సంక్షేమం అన్నా. అభివృద్ధి అన్నా కేవలం ప్రచారానికి మాత్రమే పనికి వస్తాయి. ప్రజలకు అందాల్సిన ఆవసరం లేదు అనుకుంటారాయన. ప్రజల కోసం ఏమీ చేయరు కాని నెలకు 15 రోజులు ఢిల్లీకి వెళ్తుంటారు, వస్తుంటారు. అక్కడికి వెళ్లి ఏమైనా ఒరగబెట్టారా? అంటే, ఆయన సమక్షంలోనే ఈ విభజన మొదలైంది. ఇక ఈ ముఖ్యమంత్రి పనికొచ్చేవారో, పనికిమాలినవారో ఆ పార్టీయే చెప్పాలి.’’ - షర్మిల -
బోనులో ఉన్నా సింహం సింహమే
-
చంద్రబాబు పుట్టుక తెలుగు తల్లికే అవమానం
-
8న నెల్లూరు జిల్లాకు షర్మిల బస్సుయాత్ర
సమైక్యాంధ్రకు మద్దతుగా దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ షర్మిల చేపట్టిన 'సమైక్య శంఖారావం'బస్సుయాత్ర షెడ్యూల్‌ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఇక్కడ విడుదల చేసింది. ఈ నెల 8వ తేదీన సమైక్య శంఖారావం బస్సు యాత్ర నెల్లూరు జిల్లాలో ప్రవేశించనుంది. ఆ రోజు ఉదయం 10.00 గంటలకు ఆత్మకూరు, సాయంత్రం 4.00 గంటలకు కావలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో షర్మిల ప్రసంగించనున్నారు. అలాగే షర్మిల బస్సుయాత్ర 10వ తేదీ ప్రకాశం జిల్లాలో ప్రవేశిస్తుంది.ఆ రోజు ఉదయం 10.00 గంటలకు కనిగిరి, సాయంత్రం 4.00 గంటలకు మార్కాపురం బహిరంగ సభలో ఆమె ప్రసంగిస్తారు.అనంతరం 11వ తేదీన గుంటూరు జిల్లాలో ప్రవేశించి ఉదయం 10.00 గంటలకు వినుకొండ, సాయంత్రం 3.00 గంటలకు రేపల్లేలో జరిగే సభలో ఆమె మాట్లాడతారు. అదే రోజు సాయంత్రం 4.30 గంటలకు కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ మరునాడు అంటే 12వ తేదీన ఉదయం 10.30 గంటలకు కైకలూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు.అనంతరం షర్మిల చేపట్టిన సమైక్య శంకారావం బస్సుయాత్ర పశ్చిమగోదావరిలో ప్రవేశిస్తుంది.ఆ రోజు సాయంత్రం 4.00 గంటలకు ఏలూరు నగరంలో ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడనున్నారు. -
రోడ్డు ప్రమాదంలో 200 గొర్రెలు మృతి
ప్యాపిలి, న్యూస్‌లైన్: మండల పరిధిలోని పోదొడ్డి గ్రామ సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 201 గొర్రెలు మృతి చెందాయి. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం నీలంపల్లి గ్రామానికి చెందిన గొర్రెల యజమానులు నారాయణస్వామి, క్రిష్ణయ్య, నాగభూషణం, పెద్దన్నలు ప్యాపిలి పరిసర ప్రాంతంలో గొర్రెలను మేపుకునేందుకు వచ్చారు. పోదొడ్డి సమీపంలోని జాతీయరహదారిపై అనంతపురం వైపు వెళ్తున్న మందపైకి ఏపీ 31 టీటీ 3567 నంబర్ గల లారీ వేగంగా దూసుకొచ్చింది. దీంతో మందలోని దాదాపు 201 గొర్రెలు మృతి చెందడంతో సుమారు రూ. 13 లక్షలు నష్టం వాటిల్లింది. ప్రమాదంలో మృతి చెందిన గొర్రెల కళేబరాల వద్ద బాధితులు కన్నీరు మున్నీరుగా విలపించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సురేష్ తెలిపారు. బాధితులను పరామర్శించిన షర్మిల పోదొడ్డి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గొర్రెలు మృతి చెందిన సంఘటనలో బాధితులు నారాయణస్వామి, క్రిష్ణయ్య, నాగభూషణం, పెద్దన్నలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల పరామర్శించారు. అనంతపురం జిల్లా నుంచి నుంచి కర్నూలు జిల్లాలోకి ప్రవేశించిన షర్మిల బస్సు యాత్ర పోదొడ్డి మీదుగా సాగింది. ఈ సందర్భంగా సంఘటనా స్థలానికి చేరుకోగానే షర్మిల బస్సు దిగి మృతి చెందిన గొర్రెలను చూసి చలించిపోయారు. బాధితులను పరామర్శించారు. వారికి రావాల్సిన పరిహారం విషయమై జిల్లా అధికారులతో మాట్లాడుతానని ఆమె హామీ ఇచ్చారు. -
రోడ్డు ప్రమాదంలో 200 గొర్రెలు మృతి
ప్యాపిలి, న్యూస్‌లైన్: మండల పరిధిలోని పోదొడ్డి గ్రామ సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 201 గొర్రెలు మృతి చెందాయి. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం నీలంపల్లి గ్రామానికి చెందిన గొర్రెల యజమానులు నారాయణస్వామి, క్రిష్ణయ్య, నాగభూషణం, పెద్దన్నలు ప్యాపిలి పరిసర ప్రాంతంలో గొర్రెలను మేపుకునేందుకు వచ్చారు. పోదొడ్డి సమీపంలోని జాతీయరహదారిపై అనంతపురం వైపు వెళ్తున్న మందపైకి ఏపీ 31 టీటీ 3567 నంబర్ గల లారీ వేగంగా దూసుకొచ్చింది. దీంతో మందలోని దాదాపు 201 గొర్రెలు మృతి చెందడంతో సుమారు రూ. 13 లక్షలు నష్టం వాటిల్లింది. ప్రమాదంలో మృతి చెందిన గొర్రెల కళేబరాల వద్ద బాధితులు కన్నీరు మున్నీరుగా విలపించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సురేష్ తెలిపారు. బాధితులను పరామర్శించిన షర్మిల పోదొడ్డి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గొర్రెలు మృతి చెందిన సంఘటనలో బాధితులు నారాయణస్వామి, క్రిష్ణయ్య, నాగభూషణం, పెద్దన్నలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల పరామర్శించారు. అనంతపురం జిల్లా నుంచి నుంచి కర్నూలు జిల్లాలోకి ప్రవేశించిన షర్మిల బస్సు యాత్ర పోదొడ్డి మీదుగా సాగింది. ఈ సందర్భంగా సంఘటనా స్థలానికి చేరుకోగానే షర్మిల బస్సు దిగి మృతి చెందిన గొర్రెలను చూసి చలించిపోయారు. బాధితులను పరామర్శించారు. వారికి రావాల్సిన పరిహారం విషయమై జిల్లా అధికారులతో మాట్లాడుతానని ఆమె హామీ ఇచ్చారు. -
షర్మిల వాణి.. సమైక్య బాణి
సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ‘సమైక్య శంఖారావం’ పేరిట బస్సుయాత్ర చేపట్టిన షర్మిల గురువారం డోన్, కర్నూలులో నిర్వహించిన బహిరంగసభల్లో ప్రసంగించారు. వేలాదిగా తరలివచ్చిన సమైక్యవాదులు, ప్రజలు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిలకు బ్రహ్మరథం పట్టారు. నిప్పు కణికల్లా ఆమె నోటి నుంచి వెలువడ్డ మాటలకు సభలకు హాజరైన జనం చప్పట్లు, ఈలలతో సంఘీభావం ప్రకటించారు. వజ్రంలాంటి రాష్ట్రాన్ని రంపంతో కాంగ్రెస్ పార్టీ కోస్తుందని, అందుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు సంపూర్ణ సాయం అందించారని ఆమె చేసిన ప్రసంగం ప్రజలను ఆలోచింపజేసింది. రాష్ట్ర విభజన ప్రకటనతో సీమాంధ్రలో అగ్గి రాజుకొని తగలబడిపోతుంటే... అందులో కాంగ్రెస్ చలి కాచుకుంటుందంటూ షర్మిల ప్రస్తుతం 13 జిల్లాల్లో నెలకొన్న పరిస్థితిని కళ్లకు కట్టినట్లు చెప్పుకొచ్చారు. డోన్‌లో, కర్నూలు నగరంలో ఆమె ప్రసంగం వినేందుకు ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. సమైక్యాంధ్ర కోసం ఉద్యమిస్తున్న ప్రజలకు అండగా ఉంటామని చెప్పిన ఆమె.. జగనన్నతోనే మళ్లీ రాజన్న రాజ్యం సాకారమవుతుందని భరోసా ఇచ్చారు. జనం పక్కనే జగన్ నిలిచారని ఉద్ఘాటించారు. దివంగత నేత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లు రాష్ట్రంలో అమలైన సంక్షేమ, అభివృద్ధి పథకాలను వివరిస్తూ ప్రసంగాన్ని ప్రారంభించిన షర్మిల అంతకు ముందు తొమ్మిదేళ్ల చంద్రబాబు నాయుడు పాలనతో పోల్చి చూపారు. చంద్రబాబు హయంలో ప్రజలు ఎదుర్కొన్న సంక్షోభ పరిస్థితులను, రాజన్న హయంలో పొందిన సంక్షేమాన్ని లెక్కలతో సహా వివరించారు. ఆ వెంటనే రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఈ నాలుగేళ్లలో రాష్ట్రం ఎంత వెనక్కు వెళ్లిందో తెలియజేశారు. పావలావడ్డీ రుణాలు, ఇందిరమ్మ గృహాలు, 108, 104, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాల ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ సామాన్యుడి జీవితాలతో కిరణ్ సర్కార్ చెలగాటమాడుతున్న తీరుపై ధ్వజమెత్తారు. అదే సమయంలో వైఎస్ హయంలో ఒక్క రూపాయి కూడా పెంచకుండా ప్రజలకు సేవలందిస్తే , ఆయన తదనంతరం కాంగ్రెస్ సర్కార్ ఆర్టీసీ, విద్యుత్ చార్జీలను ఎలా పెంచిందో వివరించి ప్రజలను ఆలోచింపజేశారు. ఇవన్నీ పోగా... ఇప్పుడు కొత్తగా సమైక్య రాష్ట్రాన్ని విభజించే నిర్ణయం తీసుకొని సీమాంధ్ర ప్రజలను ఎడారిపాలు చేసే పన్నాగం పన్నిన తీరును ఎండగట్టారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన లేఖతోనే, ఆయనతో కాంగ్రెస్ పార్టీ నేతలు చేసుకున్న కుమ్మక్కు రాజకీయాల వల్లనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైందని పునరుద్ఘాటించడం సమైక్యవాదుల ఉద్యమానికి కొత్త ఊపిరినిచ్చినట్టయింది. ‘కొత్త రాష్ట్రం ఏర్పాటైతే ఇప్పటికే కర్ణాటకతో తుంగభద్ర నీటికోసం పోరాడుతున్న రాయలసీమవాసులు రేపు తెలంగాణతో కూడా పోరాడాలా? శ్రీశైలం, నాగార్జున సాగర్లకు నీళ్లెలా వస్తాయి? పోలవరానికి నీళ్లు రాకుండా ఎగువన మరో డ్యాం నిర్మిస్తే కోస్తాంధ్ర పరిస్థితి ఏంటి?...’ అంటూ కాంగ్రెస్ నాయకులపై ఆగ్రహంతో ప్రశ్నల వర్షం కురిపించిన షర్మిలను సభకు హాజరైన జనం మనస్ఫూర్తిగా అభినందనలు తెలపడం వారి హర్షద్వానాలతోనే తేటతెల్లమైంది. చంద్రబాబుకు ప్రశ్నల వర్షం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయండి అంటూ బ్లాంక్ చెక్‌లా లేఖ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు తెలుగు ఆత్మగౌరవ యాత్ర పేరుతో బస్సులో బయలుదేరడాన్ని షర్మిల ఎద్దేవా చేశారు. వెన్నుపోటు దారుడిగా చరిత్రకెక్కిన చంద్రబాబుకు అసలు ఆత్మ అనేది ఉందా? 9 ఏళ్లలో హైదరాబాద్‌ను తానే అభివృద్ధి చేశానని చెబుతున్న చంద్రబాబు చార్మినార్‌ను, నాగార్జునసాగర్‌ను నేనే కట్టానని, చివరికి విశాఖపట్నానికి సముద్రాన్ని కూడా నేనే తెచ్చానని చెప్పుకుంటాడని అంటూ ఆయన నైజాన్ని ఘాటుగా దుయ్యబట్టారు. ‘కేంద్రానికి లేఖ ఇచ్చి ఇప్పుడు వైఎస్ వల్లనే విభజన జరిగిందని నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్‌తో వైఎస్ఆర్సీపీ కుమ్మక్కైందని చెబుతున్నారు. అదే జరిగితే జగన్ 16 నెలలుగా జైల్లో ఉండేవాడా? చిరంజీవిలా ఏ కేంద్రమంత్రి గానో, ముఖ్యమంత్రో అయిపోయేవాడు కాదా? చిదంబరంతో చీకటి ఒప్పందాలు చేసుకొని, కేసుల్లేకుండా చేసుకున్న విషయం రాష్ట్ర ప్రజలకు తెలియదా? జగన్ జైల్లో ఉండడానికి మీ కుమ్మక్కు రాజకీయాలు కారణం కాదా?’ అంటూ చంద్రబాబుపై ప్రశ్నల వర్షం కురిపించి సభకు హాజరైన సమైక్యవాదులకు తనదైన శైలిలో వాస్తవాలు వెల్లడించారు. కర్నూలు, డోన్ సభల్లో కడప మాజీ మేయర్ పి.రవీంద్రనాథ్ రెడ్డి, పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి, పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి, ఎమ్మెల్యేలు శోభా నాగిరెడ్డి, చెన్నకేశవరెడ్డి, కాటసాని రామిరెడ్డి, కాపు రాంచంద్రారెడ్డి, గురునాథ రెడ్డి, మాజీ మంత్రి మూలింటి మారెప్ప, మాజీ ఎమ్మెల్సీ ఎస్.వి. మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాలనాగిరెడ్డి, గౌరు చరితా రెడ్డి, కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు బుగ్గన రాజారెడ్డి, కోట్ల హరిచక్రపాణి రెడ్డి, బుడ్డా రాజశేఖర్ రెడ్డి, మణిగాంధీ, గుమ్మనూరు జయరాం, ఇతర నేతలు వాసిరెడ్డి పద్మ, కాపు భారతి, డాక్టర్ హరికృష్ణ, ఎర్రబోతుల వెంకటరెడ్డి, ఐజయ్య, శివానందరెడ్డి, తెర్నెకల్లు సురేందర్ రెడ్డి, హఫీజ్ ఖాన్, నారాయణమ్మ, బాలరాజు, గద్వాల నియోజకవర్గ సమన్వయకర్త కృష్ణమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ‘తెలుగువారంతా ఒక్కటిగా ఉండాలని 60 ఏళ్ల క్రితం రాజధానిగా ఉన్న కర్నూలును వదులుకొని హైదరాబాద్‌ను రాజధాని చేశాం. ఇప్పుడు వెళ్లిపోవాలంట. పదేళ్లలో హైదరాబాద్ వంటి రాజధానిని కట్టుకోవాలంటున్నారు. హైదరాబాద్ అభివృద్ధి అయ్యేందుకు 60 ఏళ్లు పడితే.. పదేళ్లలో అలాంటి రాజధానిని ఎలా కట్టుకోవాలో కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. కోట్లాది మందికి అన్యాయం జరుగుతుంటే తెలంగాణకు అనుకూలమని బ్లాంక్ చెక్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని ప్రజల ముందుకు వస్తున్నారు?’ - వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల -
నేడు షర్మిల సమైక్య శంఖారావం
సాక్షి ప్రతినిధి, కడప: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ, వైఎస్సార్సీపీ అధినేత, కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల శుక్రవారం సొంత గడ్డలో సమైక్య శంఖారావం పూరించనున్నారు. ఓట్లు.. సీట్ల కోసం రాష్ట్ర విభజన చేస్తూ, ప్రజాభీష్టాన్ని పరిగణలోకి తీసుకోకుండా కాంగ్రెస్, టీడీపీ చేస్తున్న కుమ్మక్కు రాజకీయాలను ఎండగడుతూ సమైక్యాంధ్రప్రదేశ్ కోసం ప్రొద్దుటూరు, మైదుకూరు, బద్వేలులో షర్మిల ‘సమైక్య శంఖారావం’ బస్సు యాత్ర చేపట్టనున్నారు. వాణిజ్య కేంద్రమైన ప్రొద్దుటూరులోని కశెట్టి హైస్కూల్ మైదానంలో శుక్రవారం సాయంత్రం 5గంటలకు బహిరంగసభ నిర్వహించనున్నారు. 7వతేదీ శనివారం ఉదయం 10.30గంటలకు మైదుకూరు నాలుగు రోడ్ల జంక్షన్, సాయంత్రం 5గంటలకు బద్వేలు నాలుగు రోడ్లు కూడలిలలో బహిరంగసభలను నిర్వహించనున్నారు. షర్మిల సమైక్య శంఖారావానికి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక, ప్రజాసంఘాలు మద్దతు ప్రకటించాయి. ప్రజాభీష్టానికి అనుగుణంగానే.... రాష్ట్ర విభజనలో సమన్యాయం పాటించాలని, అలా చేయలేని పక్షంలో విభజన చేయరాదని, సమైక్యాంధ్రప్రదేశ్‌కు కట్టుబడి ఉండాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ వచ్చింది. రాష్ట్ర విభజన ప్రకటన చేశాక ప్రజాభీష్టం మేరకు ఆ పార్టీ ఉద్యమాలబాట పట్టింది. రాష్ట్ర గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పదవులకు రాజీనామా చేశారు. ప్రజలకు మద్దతుగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు మహానేత సతీమణి వైఎస్ విజయమ్మ గుంటూరులో ఆమరణదీక్ష చేపట్టారు. ఆ వెనువెంటనే రాష్ట్ర అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్రెడ్డి చంచల్‌గూడ జైల్లోనే ఆమరణదీక్ష చేపట్టారు. పోలీసులు వారి దీక్షలను ఏకపక్షంగా భగ్నం చేశారు. రాష్ట్ర నాయకత్వం ఆకాంక్ష మేరకు జిల్లా కేంద్రాలలో సైతం 25 రోజులుగా ఆమరణదీక్షలను కొనసాగిస్తున్నారు. మహానేత వైఎస్సార్ నాలుగో వర్ధంతి సందర్భంగా సెప్టెంబర్ 2నుంచి సమైక్య రాష్ట్రం కోరుతూ జననేత జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల ‘సమైక్య శంఖారావం’ను ఇడుపులపాయ నుంచి పూరించారు. చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాలలో పర్యటించిన అనంతరం శుక్రవారం సాయంత్రం వైఎస్సార్ జిల్లాలోకి షర్మిల ప్రవేశించనున్నారు. సాయంత్రం 5గంటలకు ప్రొద్దుటూరు కశెట్టి హైస్కూల్ మైదానంలో బహిరంగసభ నిర్వహించనున్నారు. ఆ రోజు ప్రొద్దుటూరులోనే షర్మిల బస చేయనున్నారు. శనివారం ఉదయం బస్సు యాత్రను ప్రారంభించి 10.30గంటలకు మైదుకూరు నాలుగురోడ్లు జంక్షన్‌కు చేరుకోనున్నారు. అక్కడ సమైక్యవాదులను ఉద్దేశించి షర్మిల ప్రసంగిస్తారు. అక్కడి నుంచి బద్వేలు చేరుకుని సాయంత్రం 5గంటలకు నాలుగురోడ్లు కూడలిలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రసంగించనున్నారు. తెలుగుజాతి అంతా ఒక్కటిగా ఉండాలని కోరుతూ షర్మిల చేస్తున్న బస్సు యాత్రకు సమైక్యవాదుల నుంచి పెద్ద ఎత్తున సంఘీబావం వ్యక్తమవుతోంది. -
కాంగ్రెస్‌తో కుమ్మక్కైంది బాబే : షర్మిల
ఆ నిజాన్ని కప్పిపుచ్చుకునేందుకే ఇతర పార్టీలపై ఆరోపణలు: షర్మిల కాంగ్రెస్‌తో, వైఎస్ఆర్ కాంగ్రెస్ కుమ్మక్కైందని చంద్రబాబు అంటున్నారు అదే నిజమైతే వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్యాయంగా జైల్లో ఎందుకు ఉంటారు? చిరంజీవిలా కేంద్రమంత్రో లేదా ముఖ్యమంత్రో అయ్యుండేవారు కదా? ఎవరితో ఎవరు కుమ్మక్కయ్యారో ప్రజలు గమనిస్తున్నారు చంద్రబాబూ.. కాంగ్రెస్‌తో కుమ్మక్కై వైఎస్ పేరును ఎఫ్ఐఆర్లో పెట్టించి ఆయన కొడుకును జైల్లో పెట్టించింది మీరు కాదా? 3 నెలల్లో రావాల్సిన బెయిల్ 16 నెలలవుతున్నా రాలేదంటే మీ కుమ్మక్కు కారణం కాదా? ఓట్లు, సీట్ల కోసమే కాంగ్రెస్ విభజనకు యత్నిస్తోంది రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతున్నా మీరు, మీ ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేయరేం? విభజనకు అనుకూలంగా మీరిచ్చిన లేఖను వెనక్కు తీసుకొని.. సమైక్యానికి అనుకూలంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్, సీపీఎం, ఎంఐఎంలతో చేరాలి ‘‘రాజశేఖరరెడ్డి చనిపోయారే అన్న ఇంగితం కూడా లేకుండా.. ఆయన మీద లక్ష కోట్ల రూపాయలు అని అబద్ధపు ఆరోపణలు మొదలుపెట్టి.. ఆయన పేరును ఎఫ్ఐఆర్లో చేర్పించి ఆయన కొడుకునే జైల్లో పెట్టించారే... ఇది కాంగ్రెస్ పార్టీతో మీరు కుమ్మక్కయి పెట్టించిన కేసు కాదా చంద్రబాబూ? చట్టప్రకారం ఎవరికైనా 3 నెలల్లో బెయిల్ రావాలి.. కానీ 16 నెలలవుతున్నా ఇప్పటివరకు బెయిల్ రాలేదు.. నేరమూ రుజువు కాలేదు.. ఇంతవరకు జగన్మోహన్రెడ్డి జైల్లో ఉన్నారంటే.. అది నీ చలవ కాదా? దానికి నీవు చేసిన కుట్రలు, కుమ్మక్కు రాజకీయాలు కారణం కాదా చంద్రబాబూ?’’ ‘‘రాజధానిని అక్కడికి తానే నిర్మించినట్లు తొమ్మిదేళ్లలో హైదరాబాద్‌ను సింగపూర్‌లా తయారు చేశానని చంద్రబాబు అంటున్నారు. చంద్రబాబు హైదరాబాద్‌లో ఏం చేశారో.. ప్రజలందరికీ తెలుసు. హైదరాబాద్ చుట్టూ ఉన్న వేలకొద్దీ ఎకరాలను, వేలకోట్ల విలువ చేసే భూములను తన బినామీలకు, తన అనుకూలురకు రాసిచ్చేసుకున్నారు. ఇంకొంచెం ఉంటే హైదరాబాద్‌నే కాదు చార్మినార్‌ను కూడా తానే కట్టానంటారు చంద్రబాబు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా కట్టానంటారు. విశాఖపట్నంలో సముద్రాన్ని కూడా తానే వేయించానని అనగలరు.’’ - షర్మిల ‘సమైక్య శంఖారావం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కయిందని, ఇడుపులపాయతో ఇటలీకి లింకు ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేస్తున్న ఆరోపణలను వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల తిప్పికొట్టారు. అసలు కాంగ్రెస్‌తో కుమ్మక్కయింది చంద్రబాబేనంటూ.. దానికి కారణాలను వివరించారు. ‘‘నిజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ... కాంగ్రెస్‌తో కుమ్మక్కయి ఉంటే ఈ రోజు జగన్మోహన్రెడ్డి జైల్లో ఉండేవారా? నిజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. కాంగ్రెస్‌తో కుమ్మక్కయి ఉంటే ఈ రోజు జగన్మోహన్రెడ్డి కూడా చిరంజీవిలాగా కేంద్రమంత్రి అయ్యుండేవారు కాదా? లేక ముఖ్యమంత్రి అయ్యుండేవారు కాదా? నిజానికి కాంగ్రెస్‌తో కుమ్మక్కయింది చంద్రబాబు. ఆ నిజాన్ని కప్పి పుచ్చుకోవడానికే ఇతరులు కుమ్మక్కయ్యారంటూ అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారాయన’’ అని ఆమె నిప్పలు చెరిగారు. ‘‘ఓట్ల కోసం, సీట్ల కోసం కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మన రాష్ట్రానికి ఇంత అన్యాయం చేయాలనుకుంటుంటే.. మీరేమో ఓట్లు పోతాయని, సీట్లు పోతాయని, మీకు క్రెడిట్ రాకుండా పోతుందని విభజనకు మద్దతు పలికారే.. మీరు కాదా చంద్రబాబూ కాంగ్రెస్‌తో కుమ్మక్కయింది?’’ అని ఆమె సూటిగా ప్రశ్నించారు. మూడు ప్రాంతాలకూ న్యాయం చేయలేనప్పుడు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే డిమాండ్‌తో షర్మిల చేపట్టిన ‘సమైక్య శంఖారావం’ బస్సు యాత్ర నాలుగో రోజు గురువారం అనంతపురం జిల్లా పామిడి మీదుగా కర్నూలు జిల్లాలోకి ప్రవేశించింది. కర్నూలు జిల్లా డోన్(ద్రోణాచలం), కర్నూలు జిల్లా కేంద్రంలో సమైక్య శంఖారావం సభలకు జనకెరటాల్లా తరలివచ్చిన ప్రజలనుద్దేశించి ఆమె ప్రసంగించారు. ఈ ప్రసంగాల సారాంశం ఆమె మాటల్లోనే.. పార్లమెంటు నుంచి పంచాయతీదాకా.. ‘‘కాంగ్రెస్‌తో కుమ్మక్కయిన చంద్రబాబు.. ఆ నిజాన్ని కప్పి పుచ్చుకోవడానికే ఇతరులు కుమ్మక్కయ్యారంటూ అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు. ఎఫ్‌డీఐ ఓటింగ్ విషయంలో రైతులను, చిన్న వర్తకులను మోసం చేస్తూ నిస్సిగ్గుగా తన ఎంపీలను గైర్హాజరుపరిచి కుమ్మక్కును రుజువు చేసుకున్నది మీరు కాదా చంద్రబాబూ? ఎమ్మార్, ఐఎంజీ కేసుల్లో మీకొక న్యాయం.. మరొకరికి ఇంకొక న్యాయంలా సీబీఐ వ్యవహరిస్తోందీ అంటే దానికి కారణం చిదంబరాన్ని మీరు చీకట్లో కలిసి చీకటి ఒప్పందాలు చేసుకోవడం కాదా? ఎవరికి ఎవరితో లింకులు ఉన్నాయో ప్రజలు గమనిస్తున్నారు. ఎమ్మార్, ఐఎంజీ కేసుల్లో ఒక పోలీసు కానిస్టేబుల్‌తో విచారణ జరిపించి ఉన్నా ఈ పాటికి మీరు జైల్లో ఉండే వారు కాదా చంద్రబాబూ? ఏకంగా రూ.32 వేల కోట్లను ప్రజల నెత్తిన కరెంటు చార్జీల రూపంలో మోపినందుకు అన్ని ప్రతిపక్ష పార్టీలూ కలిసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెడితే.. మీరు మట్టుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఈగ కూడా వాలడానికి వీల్లేదని నిస్సిగ్గుగా విప్ జారీచేసి మరీ కూలిపోకుండా కాపాడలేదా? మరి మీరు కుమ్మక్కు కాకపోతే.. ఈ మైనారిటీ సర్కారును భుజాన వేసుకొని ఈ రోజు వరకు ఎందుకు మోస్తున్నారు? కాంగ్రెస్‌తో పాలు, నీళ్లలా కలిసిపోయి.. పంచాయతీ ఎన్నికల నుంచి పార్లమెంటు ఎన్నికల దాకా ప్రతి ఎన్నికల్లో కుమ్మక్కయింది మీరు కాదా? విభజనకు కారణమే చంద్రబాబు.. రాష్ట్రంలో ఇంత ఘోరం జరుగుతుంటే, కోట్ల మంది ప్రజలకు అన్యాయం జరుగుతోంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు మటుకు చలనం లేకుండా ఉన్నారు. ఎందుకని? ఎందుకంటే.. విభజనకు కారణమే చంద్రబాబు కనుక. తెలంగాణ ఇచ్చేయండి.. అంటూ ఒక బ్లాంక్ చెక్‌లాగా లేఖ రాసిచ్చేశారు చంద్రబాబు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రాన్ని విభజించే సాహసం చేసిందీ అంటే.. దానికి కారణం ఈ చంద్రబాబు విభజనకు మద్దతు పలకడం కాదా అని అడుగుతున్నాం. చేసిందంతా చంద్రబాబు చేసి.. రాజశేఖరరెడ్డే ఈ విభజనకు కారణం అంటున్నారంటే ఈ మనిషిని ఏమనుకోవాలో కూడా అర్థం కావడంలేదు. ఒకవైపేమో ప్రధాని సహా దేశంలోని ప్రతి ఒక్కరూ.. వైఎస్ బతికి ఉండుంటే ఆంధ్రప్రదేశ్‌కు ఈ గతి పట్టి ఉండేదే కాదని అంటున్నారు. కానీ.. తెలంగాణకు అనుకూలంగా లేఖ రాసిచ్చిన చంద్రబాబు మాత్రం వైఎస్సే విభజనకు కారణమని అంటున్నారంటే.. ఈయనకు మనస్సాక్షి లేదనుకోవాలా? లేక ఈయన ఒంట్లో ప్రవహించేది మానవ రక్తం కాదనుకోవాలా? తెలుగుదేశం పార్టీతో సహా ఐదు పార్టీలు రాష్ట్ర విభజనకు ఒప్పుకుంటే, మూడు పార్టీలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సీపీఎం, ఎంఐఎం పార్టీలు ఎప్పుడూ ఈ విభజనకు ఒప్పుకోలేదు. చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, సీమాంధ్రుల పట్ల ఏమాత్రం ప్రేమాభిమానాలు ఉన్నా.. వెంటనే ఈ మూడు పార్టీల పక్షాన చేరి తెలంగాణ విభజనకు అనుకూలంగా ఇచ్చిన లేఖ వెనక్కి తీసుకొని సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నానని ప్రకటించాలి. ఏ మొహం పెట్టుకుని యాత్ర చేస్తున్నారు? ఈ రోజు ఒక పెద్ద వజ్రంలాంటి మన రాష్ట్రాన్ని ఈ కాంగ్రెస్ పార్టీ ముక్కలు చేయడానికి సాహసించింది అంటే.. దానికి కారణం.. విభజనకు మీరు ఇచ్చిన మద్దతు కాదా చంద్రబాబూ? పట్టపగలు ఇలా సీమాంధ్రుల గొంతుకోసి మళ్లీ ఏ మొహం పెట్టుకుని యాత్ర చేస్తున్నారు? ఇంత అన్యాయం జరుగుతుంటే.. అబద్ధాలు చెప్పి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారుగాని.. మీరుగాని, మీ ఎంపీలు, ఎమ్మెల్యేలుగాని రాజీనామా చేయలేదే అని ప్రజలు అడిగితే ఏం సమాధానం చెప్తారు? తెలంగాణకు అనుకూలంగా అసలు మీరు లేఖ ఎందుకిచ్చారు? ఎవర్నడిగి ఇచ్చారు? ఆరు కోట్ల మంది ప్రజలు ఇక్కడ ఉంటే... రాష్ట్రమేదో మీ సొత్తు అన్నట్లు మీరెలా లేఖ రాసిచ్చేశారు అని ప్రజలు నిలదీస్తే ఏమని సమాధానం చెప్తారు?’’ నాలుగో రోజు యాత్ర సాగిందిలా.. ‘సమైక్య శంఖారావం’ యాత్ర నాలుగో రోజు గురువారం అనంతపురం జిల్లా కేంద్రం నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి కర్నూలు జిల్లా డోన్ సభలో పాల్గొనేందుకు షర్మిల బయలుదేరారు. మార్గం మధ్యలో పామిడి గ్రామస్తులు భారీ ఎత్తున ఆమెకు స్వాగతం పలికేందుకు వచ్చారు. వారు పట్టుబట్టడంతో కొద్దిసేపు ప్రసంగించారు. ఇక్కడ లారీ దూసుకుపోయిన ఘటనలో 200 గొర్రెలు చనిపోయాయి. ఇది తెలిసి అక్కడ ఆగిన షర్మిల.. బాధిత గొర్రెల కాపరులతో మాట్లాడారు. జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి వారికి ఇన్సూరెన్స్ ఇప్పించాలని స్థానిక పార్టీ నాయకులకు సూచించారు. తర్వాత డోన్ సభలో, ఆ తర్వాత కర్నూలు కొండారెడ్డి బురుజు సెంటర్లో పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. షర్మిల వెంట పాల్గొన్న నేతల్లో ఎమ్మెల్యేలు భూమా శోభా నాగిరెడ్డి, చెన్నకేశవరెడ్డి, కాటసాని రాంరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, గుర్నాథరెడ్డి, జిల్లా పార్టీ కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి, మాజీ ఎంపీ భూమా నాగిరెడ్డి, మాజీ మంత్రి మారెప్ప, మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, సాయి ప్రసాద్‌రెడ్డి, కొత్తకోట ప్రకాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎస్వీ మోహన్‌రెడ్డి, కడప మాజీ మేయర్ పి.రవీంద్రనాథ్‌రెడ్డి, పార్టీ నేతలు వాసిరెడ్డి పద్మ, తలశిల రఘురాం, స్థానిక నాయకులు బుగ్గన రాజారెడ్డి, కోట్ల హరిచక్రపాణిరెడ్డి, బుడ్డా రాజశేఖరరెడ్డి, ఉమ్మనూరి జయరాం, మహబూబ్‌నగర్ జిల్లా నేత కృష్ణమోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ప్యాపిలి మండల పరిధిలోని పోదొడ్డి గ్రామ సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 201 గొర్రెలు మృతి చెందాయి. గొర్రెల యజమానుైలైన నారాయణస్వామి, క్రిష్ణయ్య, నాగభూషణం, పెద్దన్నలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల పరామర్శించారు. వారి ఆవేదనను చూసి చలించిపోయారు. బాధితులకు రావాల్సిన పరిహారం విషయమై జిల్లా అధికారులతో మాట్లాడుతానని ఆమె హామీ ఇచ్చారు. -
ఉద్యమ వీరులకు వందనం
‘సమైక్య శంఖారావం’ బస్సు యాత్ర మూడోరోజు బుధవారం (04-09-2013) అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో సాగింది. షర్మిల చిత్తూరు జిల్లాలోని మొలకలచెరువు, అనంతపురం జిల్లా కనకల్లు, కదిరి, గోరంట్ల, హిందూపురం, అనంతపురం సభలలో మాట్లాడారు. సభకు హాజరైన జనవాహినిలో ఓ భాగం, ఇన్సెట్లో ప్రజలకు షర్మిల అభివాదం -
నేడు కర్నూలులో షర్మిల యాత్ర
సాక్షి ప్రతినిధి, కర్నూలు: షర్మిల చేపట్టిన ‘సమైక్య శంఖారావం’ బస్సు యాత్ర గురువారం కర్నూలు జిల్లాలోకి ప్రవేశిస్తుందని ఆ పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా పార్టీ కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. -
ఉద్యమ మీరులకు వందనం: షర్మిల
ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక జేఏసీలకు అభినందనలు తెలిపిన షర్మిల ప్రాణాలను, జీతాలను, జీవితాలను పణంగా పెట్టి ప్రజలు ఉద్యమాలు చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్లు రాక్షసుల్లా వారి మీద కేసులు పెడుతున్నారు.. జీతాలు ఇవ్వబోం అంటున్నారు ఆ కేసులన్నీ మాఫీ చేయాలని, జీతాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం లేదంటే జగనన్న సీఎం కాగానే.. ఉద్యమ కేసులన్నీ మాఫీ చేస్తాం.. జీతాలను పువ్వుల్లో పెట్టి చెల్లిస్తాం ఓట్లు, సీట్ల కోసం, రాహుల్‌ను ప్రధానిని చేయడం కోసమే రాష్ట్రాన్ని అడ్డగోలుగా నరికేయడానికి కాంగ్రెస్ యత్నిస్తోంది చేసిందంతా చేసేసి ఇప్పుడు చంద్రబాబు ఆత్మగౌరవ యాత్ర చేస్తున్నారు విభజన లేఖను వెనక్కు తీసుకోవాలని ప్రజలు అడిగితే చంద్రబాబు ఏం చెప్తారు? మీరు, మీ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయరేమంటే ఏం జవాబిస్తారు? సమైక్యవాదానికి దన్నుగా నిలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్, ఎంఐఎం, సీపీఎం మాత్రమే ‘సమైక్య శంఖారావం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘కడుపు మండితే.. ఎవరైనా నిరసన తెలియజేయొచ్చు అన్నది రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కు. అలాంటిది కోట్ల మంది సీమాంధ్రులకు అన్యాయం జరుగుతోందని ఈ రోజు ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, విద్యార్థులు, సామాన్యులతోపాటు మహిళలు సైతం రోడ్లమీదికొచ్చి ఆందోళనలు చేస్తున్నారు. వారి ప్రాణాలను పణంగా పెడుతున్నారు.. వారి లాభాలను కాదనుకుంటున్నారు.. వారి జీతాలను కాదనుకుంటున్నారు.. వారి చదువులను కాదనుకుంటున్నారు.. వారి పనులను కాదనుకుంటున్నారు. అలాంటివారి మీద ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు పెడుతోంది. కనికరం లేని ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్లు మనుషులా లేక రాక్షసులా?’’ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల నిప్పులు చెరిగారు. సమైక్య ఉద్యమంలో తమ వంతు పాత్ర పోషిస్తున్న ఉద్యోగ, కార్మిక, ఉపాధ్యాయ జేఏసీ సంఘాలన్నింటినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనస్ఫూర్తిగా అభినందిస్తోందని ఆమె అన్నారు. వారి ఉద్యమానికి తమ పార్టీ సంపూర్ణ మద్దతు పలుకుతోందని, వారికి వచ్చిన ప్రతి కష్టంలోనూ పార్టీ అండగా నిలుస్తుందని మాట ఇచ్చారు. రాష్ట్రానికి న్యాయం చేయడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైంది కాబట్టి.. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ షర్మిల చేపట్టిన ‘సమైక్య శంఖారావం’ బస్సు యాత్ర మూడోరోజు బుధవారం అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో సాగింది. షర్మిల చిత్తూరు జిల్లాలోని మొలకలచెరువు, అనంతపురం జిల్లా కనకల్లు, కదిరి, గోరంట్ల, హిందూపురం, అనంతపురం సభలలో మాట్లాడారు. వీటిలో మొలకల చెరువు, కనకల్లు, గోరంట్ల సభలు షెడ్యూల్లో లేకున్నా.. సమైక్యవాదులు, అభిమానులు, పార్టీ కార్యకర్తల కోరిక మేరకు అక్కడ మాట్లాడారు. షర్మిల యాత్రలో మూడో రోజున కూడా ఈ రెండు జిల్లాల్లో ప్రజలు నీరాజనం పట్టారు. పెద్ద సంఖ్యలో మహిళలు, యువకులు ఎదురేగి స్వాగతం పలికారు. షర్మిల ప్రసంగానికి పదేపదే చప్పట్లు, నినాదాలతో జనం హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఆయా సభల్లో షర్మిల ప్రసంగం ఆమె మాటల్లోనే.. జగనన్న సీఎం కాగానే కేసులన్నీ ఎత్తేస్తాం.. ‘‘సీమాంధ్రకు అన్యాయం జరుగుతుందని ఉద్యమిస్తున్న వారి మీద కాంగ్రెస్ పార్టీ పెట్టిన అన్ని కేసులనూ వెంటనే ఎత్తివేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఈ కాంగ్రెస్ పార్టీ ఆ పని చేయకపోతే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం.. జగనన్న ముఖ్యమంత్రి అవడం ఖాయం.. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత.. సీమాంధ్ర కోసం ఉద్యమించిన ఆ వీరుల మీద ఉన్న అన్ని కేసులనూ ఎత్తేస్తారని మాట ఇస్తున్నాం. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక జేఏసీ సంఘాలవారు జీవితాలను పణంగా పెట్టి.. రోడ్ల మీద కూర్చొని ఉద్యమిస్తుంటే.. ఈ కాంగ్రెస్ పార్టీ వారి కడుపుమీద కొట్టి జీతాలు కూడా ఇవ్వనూ అంటోంది. వారి కడుపు మంటను అర్థం చేసుకుని.. భవిష్యత్తు తరాల కోసం వారు చేస్తున్న ఉద్యమాన్ని అర్థం చేసుకుని వారికి వెంటనే జీతాలు ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. అలా వారు ఇవ్వని పక్షంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత.. ఆ పోరాట యోధులందరికీ, వారు కోల్పోయిన జీతాలను పువ్వుల్లో పెట్టి అందిస్తాం. రాహుల్‌ను ప్రధానిని చేయడం కోసమే.. ఓట్ల కోసం, సీట్ల కోసం, టీఆర్ఎస్ను కలుపుకొనైనా సరే.. కేంద్రంలో రాజకీయ లబ్ధి పొంది రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుకోవడం కోసం కోట్ల మంది ప్రజలకు తీరని అన్యాయం చేయడానికి పూనుకొంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే మహారాష్ట్ర అవసరాలు తీరిన తర్వాత.. కర్ణాటకలో ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌లు నిండితే తప్ప కింద ఉన్న మన రాష్ట్రానికి నీళ్లు వదలని పరిస్థితి. ఇప్పుడు మధ్యలో ఒక రాష్ట్రం వచ్చి.. కృష్ణా నీళ్లను అడ్డుకుంటే.. శ్రీశైలం ప్రాజెక్టు, నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు నీళ్లు ఎక్కడ నుంచి వస్తాయి? పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టును చేస్తామంటోంది కేంద్ర ప్రభుత్వం.. మధ్యలో ఒక రాష్ట్రం వచ్చి గోదావరి నీళ్లను అడ్డుకుంటే పోలవరానికి నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయో చెప్పడం లేదు. గతంలో మద్రాసును తీసేసుకున్నారు.. ఇప్పుడు హైదరాబాద్‌ను కూడా దూరం చేస్తామంటోంది కాంగ్రెస్ పార్టీ. హైదరాబాద్ ఇంతలా అభివృద్ధి చెందిందీ అంటే.. దాంట్లో సీమాంధ్రుల పాత్ర లేదా అని అడుగుతున్నాం. మన రాష్ట్రంలో చదువుకున్న ప్రతి విద్యార్థీ తన భవిష్యత్తు కోసం మొట్టమొదటిగా చూసేది హైదరాబాద్‌వైపు. ఇప్పుడు విద్యార్థులంతా ఉద్యోగాల కోసం ఎక్కడికి వెళ్లాలి? పదేళ్లలో హైదరాబాద్‌లాంటి కొత్త రాజధానిని కట్టుకొని వెళ్లిపొమ్మంటే.. 60 ఏళ్లపాటు నిర్మించిన హైదరాబాద్‌ను పదేళ్లలో కట్టుకోవడం ఎలా సాధ్యమవుతుంది? చంద్రబాబు ఆత్మకు ఒక గౌరవం ఉందా? రాష్ట్రాన్ని మీకు నచ్చినట్లు చీల్చేసుకోండంటూ బ్లాంక్ చెక్కులా లేఖ రాసిచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు ఆత్మగౌరవ యాత్ర చేస్తున్నారు. అసలు చంద్రబాబుకు ఆత్మ అనేది ఉందా.. దానికంటూ ఒక గౌరవం ఏడ్చిందా? సొంత మామను వెన్నుపోటు పొడిచి అధికారం చేజిక్కించుకున్న వ్యక్తికి అసలు ఆత్మ అనేది ఉంటుందా! దివంగత ైవె ఎస్ కుమారుడు జగన్ రాజకీయ ఉగ్రవాది అని, ఆయనను ఉరితీయాలని చంద్రబాబు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా, తొమ్మిదేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తి మాట్లాడే మాటలేనా ఇవి! బాబుకు సంస్కారం ఉండి మాట్లాడుతున్నారా.. లేకుండా మాట్లాడుతున్నారా..? మీకెలా ఉంటుంది?: చంద్రబాబు నాయుడుగారూ.. మీరు అందరిపైనా అడ్డగోలుగా ఆరోపణలు చేస్తున్నారు. మిమ్మల్ని ఒక్క మాట అడుగుతున్నా.. మీ కుమారుడు లోకేశ్ పనికిరాని వాడంటే మీకెలా ఉంటుంది? మీరు ఏం చేసినా లోక కల్యాణం కోసమే నిర్ణయాలు తీసుకున్నానని అంటున్నారు.. మీరు తీసుకున్న నిర్ణయాలు లోక కల్యాణం కోసం కాదు, లోకేశ్ కల్యాణం కోసమంటే మీకెలా ఉంటుంది. లోకేశ్‌కు అధికారం కట్టబెట్టేందుకే ఎన్టీఆర్ వారసులను రాజకీయాల్లో తొక్కి పెడుతున్నారని అంటే మీకెలా ఉంటుంది? అసలు రాష్ట్ర విభజనకు బ్లాంక్ చెక్ లాగా లేఖ రాసిచ్చిన మీరు ఏ మొహం పెట్టుకుని ప్రజల ముందుకు వస్తున్నారు? తెలంగాణకు అనుకూలంగా లేఖను ఇచ్చి ఇపుడెందుకు వస్తున్నారని ప్రజలు అడిగితే మీరు ఏం సమాధానం చెప్తారు? విభజనపై నిర్ణయం జరిగాక మీరుగాని, మీ ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నిస్తే ఏం చెబుతారు? ఆ లేఖను వెంటనే వెనక్కు తీసుకోమని అడిగితే ఏం జవాబు చెప్తారు? జైలులో ఉన్నా జననేతే..: విలువలతో కూడిన రాజకీయాలు చేసే ధైర్యంలేని టీడీపీ, కాంగ్రెస్ కుట్ర పన్ని జగన్‌ను జైల్లో పెట్టాయి. ఆయన జైల్లో ఉన్నా తనకు జరిగిన అన్యాయాన్ని పక్కనబెట్టి.. కోట్లాది మంది ప్రజల కోసం వారం రోజులపాటు నిరాహార దీక్ష చేశారు. జగనన్న జనంలో ఉన్నా, జైలులో ఉన్నా జననేతే. ఈ కాంగ్రెస్, టీడీపీ నేతలు బయట ఉన్నా.. దొంగలు, ద్రోహులే. త్వరలోనే జగనన్న బయటకు వస్తారు.. మనందరినీ రాజన్న రాజ్యంవైపు నడిపిస్తారు.’’ షర్మిల యాత్రకు జేఏసీ నేతల సంఘీభావం హిందూపురం అర్బన్, న్యూస్‌లైన్: షర్మిల చేపట్టిన ‘సమైక్య శంఖారావం’ బస్సు యాత్రకు అనంతపురం జిల్లా హిందూపురం జేఏసీ నేతలు సంఘీభావం తెలిపారు. బుధవారం సాయంత్రం ఇక్కడికి బస్సు యాత్ర చేరుకోగానే హిందూపురం రెవెన్యూ, విశాలాంధ్ర పరిరక్షణ కమిటీ కన్వీనర్, జేఏసీ నాయకులు ప్రభాకర్ బాబు, ఆనంద్ రాజు, ఉదయ్ కుమార్, ట్రెజరీ జగదీష్, ఎంపీడీఓ ఆదినారాయణ, ఎన్జీవో చైర్మన్ సుబ్బారెడ్డి, ఇతర నాయకులు యాత్రకు మద్దతు తెలియజేశారు. ‘‘మన ఖర్మ ఏమిటంటే.. ఓట్ల కోసం సీట్ల కోసం, తెలంగాణ తామే ఇచ్చామన్న క్రెడిట్ కోసం.. కోట్ల మంది ప్రజలకు అన్యాయం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఇంకోవైపేమో కోట్ల మంది ప్రజలకు అన్యాయం జరుగుతున్నా.. ఓట్లు పోతాయని, సీట్లు పోతాయని, క్రెడిట్ తనకు రాకుండా పోతుందని అస్సలు పట్టించుకోవట్లేదు చంద్రబాబు. కాంగ్రెస్, టీడీపీ కలిసి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాయి.. కోట్ల మంది ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయి.. తరతరాలు క్షమించలేని ఘోరపాపం చేస్తున్నాయి.’’ ‘‘తెలంగాణకు టీడీపీ సహా ఐదు పార్టీలు అనుకూలంగా ఉంటే.. వైఎస్సార్ సీపీ, ఎంఐఎం, సీపీఎం ఎప్పుడూ విభజనకు అనుకూలంగా లేవు. చంద్రబాబుకు నిజంగా నిజాయితీ ఉంటే, నిజంగా మనిషైతే, నిజంగా ఈ గడ్డమీద పుట్టినవాడైతే.. వచ్చి ఈ మూడు పార్టీల పక్షాన నిలబడి నాలుగో పార్టీగా చేరాలి. ఈయన రాజీనామా చేసి.. తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో రాజీనామా చేయించాలి. లేఖను వెనక్కు తీసుకోవాలి.’’ - షర్మిల -
జన సునామీ
సమైక్య శంఖారావం బస్సుయాత్ర నుంచి సాక్షి ప్రతినిధి : ప్రజాభిప్రాయానికి పట్టం కడుతూ.. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ.. సమైక్యాంధ్ర డిమాండ్‌తో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన ‘సమైక్య శంఖారావం’ బస్సు యాత్రకు ‘అనంత’ ప్రజానీకం నీరాజనాలు పలికింది. అనంతపురం జిల్లా సరిహద్దుల్లోని తనకల్లు మండలం కొక్కం టి క్రాస్ నుంచి మదనపల్లె-కదిరి, కదిరి-హిందూపురం, హిందూపురం-అనంతపురం రహదారులపై జనప్రవాహం పోటెత్తింది. తమ మనోభీష్టం మేరకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సమైక్యాంధ్ర రాష్ట్రానికి కట్టుబడటంపై జేజేలు పలికిన ‘అనంత’ ప్రజానీకం.. వైఎస్ షర్మిల బస్సుయాత్రకు అడుగడుగునా బ్రహ్మరథం పట్టింది. హిందూపురం చరిత్రలో ఏ నాయకుడి సభకూ హాజరుకానంత స్థాయిలో వైఎస్ షర్మిల సభకు రికార్డు స్థాయిలో హాజరయ్యారన్న రాజకీయ పరిశీలకులు చేస్తోన్న విశ్లేషణ కాంగ్రెస్, టీడీపీ శిబిరాల్లో కలకలం రేపుతోంది. ఇదీ.. బుధవారం జిల్లాలో వైఎస్ షర్మిల నిర్వహించిన సమైక్య శంఖారావం బస్సుయాత్రకు వచ్చిన జనస్పందన. షెడ్యూలు సమయం కన్నా రెండు గంటలు ఆలస్యంగా జిల్లా సరిహద్దుకు చేరుకున్న వైఎస్ షర్మిలకు వైఎస్సార్సీపీ జిల్లా నేతలు ఘనస్వాగతం పలికారు. కదిరి నియోజకవర్గ వైఎస్సార్సీపీ నేత జక్కుల ఆదిశేషు భారీ కాన్వాయ్‌తో వైఎస్ షర్మిలకు అఖండ స్వాగతం పలికారు. షెడ్యూలులో లేకున్నా తనకల్లు, నల్లచెరువు మండల కేంద్రాల్లో వేలాది మంది ప్రజానీకం రోడ్లపైకి వచ్చి.. వైఎస్ షర్మిల బస్సుయాత్రకు సంఘీభావం తెలిపారు. కొక్కంటి క్రాస్ నుంచి కదిరి వరకూ రోడ్డు పొడవునా జనం బారులు తీరారు. వైఎస్ షర్మిలపై అడుగడుగునా బంతిపూల వర్షం కురిపించి, తమ అభిమానాన్ని చాటుకున్నారు. అపూర్వ జన స్పందన మధ్య మధ్యాహ్నం 12 గంటలకు వైఎస్ షర్మిల కదిరికి చేరుకున్నారు. షర్మిల కదిరికి చేరుకునే సరికే బస్టాండు సర్కిల్ జనసంద్రాన్ని తలపించింది. కాంగ్రెస్, టీడీపీలపై విమర్శల వర్షం రాష్ట్ర విభజన పాపంలో పాలు పంచుకున్న కాంగ్రెస్, టీడీపీలపై వైఎస్ షర్మిల ఈటెల్లాంటి మాటలతో కదిరిలో విరుచుకుపడ్డారు. ఐదేళ్లపాటు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో చేపట్టిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను జనం ముందు ఏకరువు పెట్టిన షర్మిల.. ఆ తర్వాత రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను ప్రజల దృష్టికి తెచ్చారు. ఓట్లు, సీట్ల కోసం ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా బ్లాంక్ చెక్‌లా టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ ఇచ్చారని గుర్తు చేశారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయడం కోసం కాంగ్రెస్ అధిష్టానం ఏకపక్షంగా రాష్ట్రాన్ని విభజిస్తోందన్నారు. వైఎస్ మరణించినప్పటి నుంచి మొన్నటి పంచాయతీ ఎన్నికల వరకూ కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఓట్లు, సీట్ల కోసం సీమాంధ్రను వల్లకాడు చేసేం దుకు కాంగ్రెస్, టీడీపీలు పూనుకున్నాయని విమర్శించారు. న్యాయం చేసే సత్తా లేనప్పుడు రాష్ట్రాన్ని విభజించే హక్కు లేదని కాంగ్రెస్ అధిష్టానానికి చురకలంటించారు. ఉద్యోగులు తమ జీతాలను, జీవితాలను పణంగా పెట్టి.. కార్మిక, కర్షక, విద్యార్థి, మహిళాలోకం రోడ్లెక్కి సమైక్యాంధ్ర ఉద్యమం చేస్తుంటే కాంగ్రెస్, టీడీపీ నేతలు చోద్యం చూస్తున్నారంటూ విమర్శించా రు. జైల్లో ఉన్నా జనాభ్యుదయం కోసం సమైక్యాంధ్ర కోసం ఆమరణదీక్ష చేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి నిజమైన జననేత అంటూ షర్మిల చేసిన ప్రసంగానికి జనం నీరాజనాలు పలికారు. కదిరి నుంచి హిందూపురం వరకూ గ్రామాలు, మండలాలు షెడ్యూలులో లేకున్నా వేలాది మంది ప్రజానీకం రోడ్లపైకి చేరకుని.. షర్మిలకు బ్రహ్మరథం పట్టారు. ఓడీసీ మండల కేంద్రంలో షర్మిలకు వేలాది మంది ప్రజానీకం మద్దతు తెలిపారు. గోరంట్లలో వేలాది మంది జనం స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి షర్మిలకు సంఘీభావం ప్రకటించారు. మండల కేంద్రమైన గోరంట్లలో సంయుక్త జేఏసీ నేతృత్వంలో మహిళలు చేస్తోన్న రిలే దీక్షలకు షర్మిల మద్దతు పలికారు. గోరంట్ల నుంచి హిందూపురం వరకూ రోడ్లపై జనంపై పోటెత్తారు. వైఎస్ షర్మిల హిందూపురం చేరుకునే సరికి సాయంత్రం 4.30 గంటలైంది. అంబేద్కర్ సర్కిల్ నుంచి ఆర్టీసీ బస్టాండు చివరి వరకూ కనీసం కిమీ మేర ఇసుకేస్తే రాలనంత స్థాయిలో జనం పోటెత్తారు. హిందూపురంలో వైఎస్ షర్మిల సభకు హాజరైనంత జనం ఇప్పటిదాకా ఏ నేత సభకు హాజరుకాలేదని రాజకీయ పరిశీలకులు చేస్తోన్న విశ్లేషణ కాంగ్రెస్, టీడీపీ నేతలకు ముచ్చెమటలు పట్టిస్తోంది. రాత్రిళ్లూ రోడ్డుపై నుంచి కదలని జనం హిందూపురం నుంచి సోమందేపల్లి మీదుగా ఎన్‌హెచ్-44 ద్వారా అనంతపురం వరకూ సాగిన వైఎస్ షర్మిల బస్సుయాత్రకు అపూర్వ జనస్పందన లభించింది. వైఎస్ షర్మిల పెనుకొండ క్రాస్ చేరుకునే సరికి సాయంత్రం 6.30 గంటలైంది. కానీ.. షెడ్యూలులో లేకున్నా పెనుకొండ ప్రజానీకం భారీ ఎత్తున రోడ్డపైకి చేరుకుని.. వైఎస్ షర్మిల బస్సుయాత్రకు సంఘీభావం ప్రకటించారు. హరిపురం, గుట్టూరు, చెన్నేకొత్తపల్లి, ఎర్రంపల్లి, దాదులూరు, మామిళ్లపల్లి, ముక్తాపురం, మరూరు, బొమ్మేపర్తి, రాప్తాడు క్రాస్‌లలో జాతీయ రహదారిపై వేలాది మంది జనం చేరుకుని షర్మిలకు మద్దతు తెలిపారు. అనంతపురం చేరుకునే సరికి రాత్రి 8 గంటలైంది. షెడ్యూలు సమయం కన్నా వైఎస్ షర్మిల మూడు గంటలు ఆలస్యంగా వచ్చినా అనంతపురం జనం చెక్కుచెదరలేదు. వైఎస్ షర్మిలను చూడగానే జనం కేరింతలు కొట్టారు. అనంతపురం సభలో వైఎస్ షర్మిల చేసిన ప్రసంగం ప్రజలను అమితంగా ఆకట్టుకుంది. రాష్ట్ర విభజన వల్ల సీమాంధ్ర చేకూరే నష్టాలను ఏకరవు పెడుతూ.. కాంగ్రెస్, టీడీపీల కుటిల రాజకీయాలను ఎండగడుతూ చేసిన ప్రసంగానికి జనం జేజేలు పలికారు. ‘రాహుల్‌గాంధీని ప్రధానిని చేయడం కోసం కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రాన్ని విభజించిందని చంద్రబాబు చెబుతున్నారు.. 2009 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే తెలంగాణ ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన మాట నిజం కాదా? ఓట్లు, సీట్ల కోసం సీమాంధ్రను వల్లకాడు చేస్తారా? రాహుల్‌గాంధీని ముద్దపప్పు అని చంద్రబాబు విమర్శిస్తున్నారు.. రాహుల్ గాంధీకన్నా చంద్రబాబు కుమారుడు లోకేశ్ పనికిమాలిన వారు. తాను ఏ నిర్ణయం తీసుకున్నా లోకకళ్యాణం కోసమని చంద్రబాబు అంటారు.. లోక కళ్యాణం కోసం కాదు.. లోకేశ్ కళ్యాణం కోసం కాదా చంద్రబాబూ? లోకేశ్‌కు అధికారం అప్పగించడం కోసమే ఎన్టీఆర్ వారసులను చంద్రబాబు తొక్కిపెడుతున్నారన్నది వాస్తవం కాదా? అధికార దాహం కోసం రాజకీయ కుట్రలు చేస్తోన్న కాంగ్రెస్, టీడీపీ నేతలు ప్రజాభ్యుదయం కోసం సమైక్యాంధ్ర డిమాండ్‌తో రాజీనామాలు చేయకపోవడంలో ఆంతర్యమేమిటి? ప్రజాభ్యుదయం కోసం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు.. వైఎస్సార్సీపీ సమైక్యాంధ్ర డిమాండ్ తో ఉద్యమిస్తోంది. సమైక్యాంధ్ర ఉద్యమంలో కదంతొక్కుతున్న ప్రజలకు వైఎస్సార్సీపీ అండ గా ఉంటుంది’ అని షర్మిల భరోసా ఇవ్వడంపై జ నం కేరింతలు కొట్టారు. అనంతపురంలో వైఎస్ షర్మిల సభ రాత్రి 9.10 గంటలకు పూర్తయింది. సభ పూర్తయిన తర్వాత అనంతపురం సమీపంలోని షిర్డీసాయి ఇంజనీరింగ్ కాలేజీలో షర్మిల బుధవారం రాత్రి బస చేశారు. గురువారం కర్నూలు జిల్లాలో బస్సుయాత్ర సాగనుంది. -
కదిరిలో సమైక్య శంఖారావం
-
కదిరిలో సమైక్య శంఖారావం
-
షర్మిల బస్సు యాత్రకు ప్రజలు నీరాజనం
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ షర్మిల చేపట్టిన సమైక్య శంఖారావం బస్సు యాత్రకు ప్రజలు నీరాజనం పడుతున్నారని రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి బుధవారం అనంతపురంలో వెల్లడించారు. ఆ మహానేత కుటుంబంపై ప్రజల్లో ఉన్న విశ్వసనీయతకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ షర్మిల సమైక్య శంఖారావం బస్సు యాత్రను సెప్టెంబర్ 2న తిరుపతిలో ప్రారంభించిన సంగతి తెలిసిందే. -
జనసంద్రంగా మదనపల్లె
మదనపల్లె, న్యూస్‌లైన్: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ వైఎస్ షర్మిల చేపట్టిన సమైక్య శంఖారావం యాత్రతో మదనపల్లె జనసంద్రంగా మారింది. అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పట్టణంలో ఎటు చూసినా వేలాదిగా జనసందోహం కన్పించింది. నాలుగు గంటలకు ప్రారంభం కావాల్సిన బహిరంగసభ మూడన్నర గంటల ఆలస్యంగా రాత్రి ఏడున్నరకు ప్రారంభమైనా జనం ఎంతో ఓపికతో ఎదురుచూశారు. షర్మిల చేసిన ప్రసంగానికి జనం మంత్రముగ్ధులయ్యారు. నేను జగనన్న పూరించిన సమైక్య శంఖారావాన్ని, మదనపల్లె వాసులు చూపిస్తున్న అభిమానం మరువలేనిది అనగానే ఆమెకు చేతులు ఎత్తి జనం అభివాదం చేస్తూ పూల వర్షం కురిపించారు. సభ ప్రాంగణం మొత్తం పూలతో నిండిపోయింది. సభప్రాంగణంలోనే విశేష జనవాహిని మధ్య షర్మిల ఉద్వేగంగా ప్రసంగించారు. మహానేత పాలనలో రైతులు సంతోషంగా ఉండేవారని ఆయన మరణానంతరం రాష్ట్రం కుక్కలు చించిన విస్తరిగా మారిందన్నారు. రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయడానికి చంద్రబాబునాయుడు కుట్ర పన్ని తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చి, నేడు ఆత్మగౌరవ యాత్ర చేపట్టడం సమంజసం కాదని, అది ఆత్మవంచన యాత్ర అని విమర్శించారు. చంద్రబాబుకు నిజం చెప్పితే తల వెయ్యి ముక్కలు అవుతుందని ముని శపించారని అందుకే ఆయన నిజం చెప్పరని ఎద్దేవా చేయగా జనం హర్షధ్వానాలు చేశారు. రాష్ట్రం సమైక్య ఉద్యమాలతో తగలబడుతుంటే సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, కేంద్ర,రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పదవులను గబ్బిలాల్లాగా పట్టుకుని వేలాడుతున్నారని, వారు వెంటనే రాజీనామా చేసి ఉంటే నేడు ఈ దుస్థితి వచ్చేదికాదని చెప్పారు. అడుగడుగునా స్వాగతం షర్మిల చేపట్టిన యాత్ర సభాప్రాంగణం మైనారిటీలు అధికంగా ఉండే ప్రాంతం కావడంతో మైనారిటీలు అడుగడుగునా పూల వర్షాన్ని కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. -
నేడు షర్మిల ‘సమైక్య శంఖారావం’
సాక్షి ప్రతినిధి, అనంతపురం : ఉద్యమాల పురిటిగడ్డ ‘అనంత’లో మహానేత దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల బుధవారం ‘సమైక్య శంఖారావం’ పూ రించనున్నారు. ప్రజాభిప్రాయానికి పట్టం కడుతూ.. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు రాజకీయాలను ఎండగడుతూ.. సమైక్యాంధ్ర కోసం షర్మిల కదిరి, హిందూపురం, అనంతపురంలో ‘సమైక్య శంఖారావం’ బస్సు యాత్రను నిర్వహించనున్నారు. ఈ యాత్రకు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. తమ మనోభీష్టం మేరకు సమైక్య శంఖారావం పూరిస్తున్న షర్మిల బస్సు యాత్రను దిగ్విజయం చేయడానికి ‘అనంత’ ప్రజలు సిద్ధమయ్యారు. మహానేత వైఎస్ మరణం తర్వాత రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిగా మారింది. రాష్ట్రాన్ని నడిపించే సమర్థవంతమైన నాయకత్వం కొరవడం వల్ల వేర్పాటువాదం వెర్రితలలు వేసింది. ఓట్లు, సీట్ల కోసం.. అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై వేర్పాటు వాదాన్ని రాజేశాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలంటూ ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి లేఖ ఇచ్చారు. దాన్ని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తోన్న కాంగ్రెస్ అధిష్టానం జూలై 30న ఏకపక్షంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఇది సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమానికి దారితీసింది. ఈ ఉద్యమానికి ‘అనంత’ చుక్కానిలా నిలుస్తోంది. జిల్లాలో ఉద్యమం మహోధృతంగా కొనసాగుతోంది. సమైక్యాంధ్ర సెంటిమెంటు జిల్లా ప్రజల్లో వేళ్లూనుకుపోయింది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర నిఘావర్గాలు కూడా ప్రభుత్వాలకు నివేదికలు పంపాయి. ప్రజాభిప్రాయం మేరకు వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గుంటూరులో ఆమరణ దీక్ష చేపట్టారు. జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా జైల్లోనే ఆమరణ దీక్ష చేపట్టారు. రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం.. తెలుగుజాతి ఐక్యత కోసం దీక్ష చేపట్టినట్లు జగన్ స్పష్టీకరించిన విషయం విదితమే. ప్రజాభిప్రాయానికి పట్టం కడుతూ సమైక్యాంధ్రకు కట్టుబడినట్లు వైఎస్సార్సీపీ ప్రకటించడంపై జనం హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. వారి అభిప్రాయం మేరకే షర్మిల మహానేత వైఎస్ వర్ధంతి రోజున ఇడుపులపాయ నుంచి ‘సమైక్య శంఖారావం’ బస్సుయాత్ర ప్రారంభించారు. సోమవారం తిరుపతి, మంగళవారం చిత్తూరు, మదనపల్లెల్లో బస్సుయాత్ర సాగింది. బుధవారం జిల్లాలోని కదిరి, హిందూపురం, అనంతపురంలో యాత్ర కొనసాగనుంది. ఉదయం పది గంటలకు కదిరిలోని ఆర్టీసీ బస్టాండు సర్కిల్లో, మధ్యాహ్నం రెండు గంటలకు హిందూపురం అంబేద్కర్ సర్కిల్లో, సాయంత్రం ఐదు గంటలకు అనంతపురంలోని సుభాష్ రోడ్డులోని వైఎస్ విగ్రహం వద్ద నిర్వహించే బహిరంగ సభల్లో షర్మిల ప్రసంగించనున్నారు. షర్మిల బస్సు యాత్రకు ఉపాధ్యాయ, ఆర్టీసీ, జేఎన్టీయూ జేఏసీలు, ఉద్యోగ, కార్మిక, ప్రజాసంఘాలు మద్దతు ప్రకటించాయి. యాత్రను విజయవంతం చేయాలని ప్రజలకు పిలునిచ్చాయి. -
గబ్బిలాల్లా వేలాడుతున్నారు
ఇంత జరుగుతున్నా కాంగ్రెస్, టీడీపీ నేతలకు పదవులే ముఖ్యం: షర్మిల ఓట్లు, సీట్ల కోసమే కాంగ్రెస్ అడ్డగోలు విభజనకు పూనుకొంది అసలు విభజనకు మూల కారణం చంద్రబాబే.. బ్లాంక్ చెక్కులా ఆయన ఇచ్చిన లేఖ వల్లే ఇంతదాకా వచ్చింది బాబు వెంటనే ఆ లేఖను వెనక్కు తీసుకోవాలి ఆయన, ఆయన పార్టీ ప్రజాప్రతినిధులంతా రాజీనామాలు చేయాలి వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఎం, ఎంఐఎం మాత్రమే సమైక్యగళం వినిపిస్తున్నాయి ‘సమైక్య శంఖారావం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: అన్నదమ్ముల్లా ఉన్న తెలుగువారి మధ్య కాంగ్రెస్ పార్టీ విభజన పేరుతో చిచ్చు పెట్టిందని, రాష్ట్రం అగ్నిగుండంలా రగులుతుంటే అందులో చలి కాచుకుంటోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల మండిపడ్డారు. ‘‘వైఎస్ బతికి ఉన్నపుడు అన్నపూర్ణగా ఉన్న రాష్ట్రం ఆయన మరణించిన నాలుగేళ్లకే తలకిందులైపోయింది.. కుక్కలు చింపిన విస్తరిలా తయారైంది.. వైఎస్ పెట్టిన ప్రతి పథకాన్నీఈ ప్రభుత్వం తుంగలో తొక్కుతోంది. ఒక్క పెన్షన్‌గాని, ఒక్క రేషన్‌కార్డుగానీ ఇవ్వకుండా ఈ నాలుగేళ్లుగా కాంగ్రెస్ పార్టీ వారు రాక్షసుల్లా పాలిస్తున్నారు. చేసిన పాపాలు చాలవని చెప్పి ఇప్పుడు అన్నదమ్ముల మధ్య చిచ్చుపెట్టి చలికాచుకుంటున్నారు’’ అని నిప్పులు చెరిగారు. ఇంత అన్యాయం జరుగుతున్నా కాంగ్రెస్, టీడీపీ నాయకులు తమకు ఓట్లేసిన ప్రజలకంటే పదవులే ఎక్కువని భావిస్తున్నారని దుయ్యబట్టారు. ‘‘ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ఇంకా గబ్బిలంలా పదవి పట్టుకుని వేలాడుతున్నారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, కేంద్ర, రాష్ట్ర మంత్రులంతా ఢిల్లీ దర్బారుకు వంగి వంగి సలాములు చేస్తూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి కోట్లాది మంది ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నారు’’ అని విమర్శించారు. మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైన ఆ పార్టీ ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామాలు చేయకుండా నాటకాలాడుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్, సీపీఎం, ఎంఐఎం మాత్రమే సమైక్యగళం వినిపిస్తున్నాయని గుర్తుచేశారు. రాష్ట్రానికి న్యాయం చేయడం కాంగ్రెస్ పార్టీకి చేతకాలేదు కాబట్టి.. సమైక్యంగానే ఉంచాలని డిమాండ్ చేస్తూ షర్మిల చేపట్టిన ‘సమైక్య శంఖారావం’ బస్సు యాత్ర రెండోరోజు మంగళవారం చిత్తూరు జిల్లాలో సాగింది. మదనపల్లె, పుంగనూరు, పలమనేరు, చిత్తూరులలో జరిగిన బహిరంగ సభల్లో అశేష జనవాహినిని ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. షర్మిల ప్రసంగాలకు అడుగడుగునా జనం నుంచి మంచి స్పందన లభించింది. యాత్ర సాగిన మార్గమంతా ఆమెకు బ్రహ్మరథం పట్టిన ప్రజలు.. జై జగన్, జయహో వైఎస్ఆర్ అంటూ నినదించారు. నాలుగు సభల్లో షర్మిల చేసిన ప్రసంగాల సారాంశం ఆమె మాటల్లోనే.. సీమాంధ్రను ఎడారి చేస్తారా? కాంగ్రెస్ పార్టీ కేవలం ఓట్ల కోసం, సీట్ల కోసం, టీఆర్ఎస్ను తనలో కలుపుకొని కేంద్ర రాజకీయాల్లో బలపడడం కోసం ఈ రోజు గొడ్డలితో నరికినట్లు రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయాలనుకుంటోంది. ఇప్పటికే ఎగువన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు మనకు నీళ్లు వదలని పరిస్థితి చూస్తున్నాం. మళ్లీ మధ్యలో మరో రాష్ట్రం వస్తే శ్రీశైలం, నాగార్జున సాగర్‌కు నీళ్లెలా వస్తాయి? ఇప్పటివరకు అన్నదమ్ముల్లా బతికిన కృష్ణా ఆయకట్టు రైతులంతా తన్నుకోవాల్సిన పరిస్థితి రాదా? రాయలసీమ ప్రాంతంలో అయితే ఒక్క పంటకైనా నీళ్లు వస్తాయా? ఒక్క పూటైనా ఇక్కడి ప్రజలకు అన్నం దొరుకుతుందా? అపుడు గడప గడపకూ ఆత్మహత్యలు జరిగి గ్రామాలన్నీ శ్మశానాలుగా మారవా? పోలవరానికి జాతీయ హోదా కల్పిస్తామని అంటున్నారు.. మరి ఆ ప్రాజెక్టును ఎలా నింపుతారో మాత్రం చెప్పడం లేదు. శ్రీకాకుళం నుంచి కుప్పం వరకూ ఉప్పు నీళ్లు తప్ప మంచినీరెక్కడిది? కృష్ణా, గోదావరి జలాలను అడ్డుకుంటే సీమాంధ్ర ప్రాంతం మహా ఎడారిగా మారదా? కాంగ్రెస్ సమాధానం చెప్పాలి.. ఒకప్పుడు మద్రాసు నుంచి పొమ్మన్నారు. పది కాదు, ఇరవై కాదు, అరవై ఏళ్లుగా అందరూ కలిసి అభివృద్ధి చేసుకున్న హైదరాబాద్‌పై ఇప్పుడు మీకు హక్కులు లేవంటున్నారు. ఈ రోజు చదువుకున్న ప్రతి విద్యార్థీ ఉద్యోగం కోసం చూసేది హైదరాబాద్ వైపే! హైదరాబాద్‌పై హక్కు లేదంటే వారంతా ఎక్కడికి వెళ్లాలి? వారిపై ఆశలు పెట్టుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఎక్కడికి పోవాలి? నాలుగైదు లక్షల కోట్ల రూపాయలు ఇస్తే కొత్త రాజధాని కట్టుకోవచ్చని చంద్రబాబు అంటున్నారు... రాజధాని క ట్టుకోవడానికే నిధులన్నీ ఖర్చు చేస్తే సంక్షేమ కార్యక్రమాలు ఎలా అమలు చేయాలి? ఆరోగ్యశ్రీ, వృద్ధాప్య పెన్షన్, సబ్సిడీ బియ్యం పథకాల అమలుకు నిధులెక్కడి నుంచి వస్తాయి? సీమాంధ్ర ప్రజలు ఎలా బతకాలి? అసలు వారు బతక కూడదనేది మీ ఉద్దేశమా? ఆత్మహత్యలు చేసుకోవాలనేది మీ ఉద్దేశమా? ఈ ప్రశ్నలన్నింటికీ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. అసలు కారణం చంద్రబాబే.. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించాలని నిర్ణయం తీసుకుందంటే దానికి ప్రధాన కారణం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడే. ఏ షరతులూ లేకుండానే తెలంగాణ ఇచ్చేసుకోండి అని ఆయన బ్లాంక్ చెక్‌లా లేఖ రాసిచ్చేశారు. ఆ లేఖ వల్లనే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఇంత సాహసం చేసింది. ఇప్పటికైనా చంద్రబాబు తాను రాజీనామా చేసి, తన ఎంపీలు, ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించే ఆలోచన చేయడం లేదు. అసలు రాష్ట్ర విభజనకు ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోకుండా చంద్రబాబు ఏ మొహం పెట్టుకుని యాత్ర చేస్తున్నారు? తెలంగాణకు అనుకూలంగా మీరు లేఖ ఎందుకిచ్చారని ప్రజలు నిలదీస్తే చంద్రబాబు ఏం సమాధానం చెప్తారు? చేసిందంతా తాను చేసి.. ఇప్పుడు రాష్ట్ర విభజనకు వై.ఎస్.రాజశేఖరరెడ్డే కారణమని చంద్రబాబు అంటున్నారు. అసలు బాబుకు మనస్సాక్షి ఉందా? ఇప్పటికైనా చంద్రబాబు మేల్కొని తన ఎంపీలు, ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించి, లేఖ వెనక్కి తీసుకోవాలి. పోరాడుతూనే ఉంటాం: విభజన చేస్తే ఒక తండ్రిలాగా అందరికీ న్యాయం చేయాలని మేం చెప్పాం. ‘అందరినీ పిలవండి, చర్చలు జరపండి’ అన్నాం. కానీ కాంగ్రెస్ పార్టీ ఇది ప్రజాస్వామ్య దేశమన్న సంగతి కూడా మర్చిపోయి నిరంకుశంగా నిర్ణయం తీసుకుంది. న్యాయం చే యడం చేతకాకపోతే ఆ అధికారం ఎందుకు తీసుకుందీ కాంగ్రెస్ పార్టీ? మీరు న్యాయం చేయలేరు, అసలు మీకు న్యాయం చేసే ఉద్దేశమే లేదనేది స్పష్టంగా తేలిపోయింది. అందుకే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తున్నాం.. అప్పటి దాకా జగనన్న నాయకత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపున పోరాడుతూనే ఉంటుందని హామీ ఇస్తున్నాం. బోనులో ఉన్నా జగన్ సింహమే..: విలువలతో కూడిన రాజకీయాలు చేసే దమ్మూ, ధైర్యం కాంగ్రెస్, టీడీపీ పార్టీలు రెండింటికీ లేవు. అందుకే కుట్రలు పన్ని జగనన్నను జైల్లో పెట్టారు. కానీ ఒక్కటే చెబుతున్నా...బోనులో ఉన్నా సింహం సింహమే(షర్మిల ఈ మాటలంటున్నపుడు సభా ప్రాంగణమంతా హర్షధ్వానాలతో మార్మోగింది). దేవుడి మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. దేవుడి దయ వల్ల జగన్ తప్పక బయటకు వస్తారు. రాజన్న రాజ్యం వస్తుంది. ఆరోజు వచ్చే వరకూ జగనన్నకు మీరంతా మద్దతు నివ్వాలని ప్రార్థిస్తున్నాను.’’ అడుగడుగునా జన నీరాజనం సాక్షి, తిరుపతి : షర్మిల బస్సు యూత్రకు చిత్తూరు జిల్లాలో అడుగడుగునా జనం నీరాజనాలు పలికారు. వివిధ ప్రాంతాల్లో రోడ్డుకు అడ్డంగా నిలబడి మరీ షర్మిల మాట్లాడాల్సిందేనని జనం పట్టుబట్టారు. మంగళవారం తిరుపతిలో ఉదయం 9.30 గంటలకు బయలు దేరిన ఆమె 10.30 గంటలకు చిత్తూరు చేరుకోవాల్సి ఉంది. అడుగడుగునా అభిమానులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వాగతం పలకడంతో మధ్యాహ్నం 1.20 గంటలకు చేరుకున్నారు. చంద్రగిరిలో పెద్ద ఎత్తున తరలివచ్చిన అభిమానులు జై జగన్ నినాదాలతో ఘన స్వాగతం పలికారు. నేండ్రగుంట వద్ద వేంకటే శ్వర స్వామి ఆలయం పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆమెను ఆశీర్వదించారు. చిత్తూరు రైల్వే గేటు వద్ద వందలాది మంది ఎదురేగి స్వాగతం పలికారు. పుంగనూరులో పాఠశాల విద్యార్థులు బారులు తీరి సాదరంగా ఆహ్వానించారు. పలుచోట్ల మేడలపై నుంచి పూల వర్షం కురిపించారు. మార్గ మధ్యంలో పలు చోట్ల సమైక్య వాదులు, జేఏసీ నాయకులు షర్మిలకు అభినందనలు తెలిపారు. నేడు ‘అనంత’లో షర్మిల సమైక్య శంఖారావం సాక్షి ప్రతినిధి, అనంతపురం: షర్మిల చేపట్టిన ‘సమైక్య శంఖారావం’ బస్సు యాత్ర బుధవారం అనంతపురం జిల్లాలో కొనసాగుతుందని ఆ పార్టీ ప్రోగ్రామ్స్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ ఎం.శంకరనారాయణ వెల్లడించారు. అందరూ రాజీనామాలు చేసుంటే.. ‘‘ఓట్ల కోసం, సీట్ల కోసం కాంగ్రెస్ ఒక వైపు, స్వార్థ ప్రయోజనాల కోసం చంద్రబాబు మరో వైపు రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. రాష్ట్ర విభజన జరుగుతోందని హఠాత్తుగా సంకేతాలు వెలువడుతున్నపుడే అందుకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా తమ పదవులకు రాజీనామాలు చేశారు. విభజన నిర్ణయం మార్చుకునేలా చేయడానికి కాంగ్రెస్‌పై ఒత్తిడి తెచ్చారు. ఆ సమయంలో ఎంత మంది టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామాలు చేశారు? అందరూ రాజీనామాలు చేసి ఉంటే విభజన ప్రక్రియ నిలిచి ఉండేది కదా!’’ ఆ కొరడాతో బాబును కొట్టి ఉంటే.. పార్లమెంటు ప్రాంగణంలో టీడీపీ ఎంపీ తనను తాను కొరడాతో శిక్షించుకునే బదులుగా అదే కొరడాతో తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును కొట్టి ఉంటే తెలంగాణ ఏర్పాటు చేయాలంటూ కేంద్రానికి ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకుని ఉండే వారని షర్మిల అన్నారు. విభజనలో కాంగ్రెస్‌కు ఎంత బాధ్యత ఉందో చంద్రబాబుకు కూడా అంతే బాధ్యత ఉందని ఆమె దుయ్యబట్టారు. వీరిద్దరి కుమ్మక్కు వల్లనే రాష్ట్రానికి ఈ దుస్థితి వచ్చిందని చెప్పారు. పలమనేరులో ఒక చోట చిత్తూరు ఎంపీ శివప్రసాద్ బొమ్మతో కూడిన బ్యానర్ కట్టి ఉండటాన్ని షర్మిల చూపిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. షర్మిల వ్యాఖ్యలను ప్రజలు ఈలలు, చప్పట్లతో స్వాగతించారు. వాస్తవానికి పలమనేరు సభ షర్మిల యాత్ర షెడ్యూల్లో లేదు. అయితే షర్మిల అటుగా వస్తున్నారని తెలిసి అక్కడ ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావడంతో వారినుద్దేశించి ఆమె ప్రసంగించారు. సమైక్య ఉద్యమంలో తమ వంతు పాత్ర పోషిస్తున్న జేఏసీ నేతలను ఈ సందర్భంగా ఆమె అభినందించారు. పుంగనూరు సైతం షెడ్యూల్లో లేనప్పటికీ ఇలాగే ప్రజలు పెద్ద ఎత్తున చేరడంతో ఆమె వారినుద్దేశించి కాసేపు మాట్లాడారు. మంగళవారం షర్మిల యాత్రలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖరరెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ దేశాయి తిప్పారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఎ.వి. ప్రవీణ్ కుమార్‌రెడ్డి, ఎన్.అమరనాథ్‌రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు నారాయణస్వామి, మహిళా విభాగం అధ్యక్షురాలు పి.వి.గాయత్రి, చిత్తూరు, మదనపల్లె కోఆర్డినేటర్లు ఎ.ఎస్.మనోహర్, షమీమా అస్లం సహా పెద్ద సంఖ్యలో నాయకులు పాల్గొన్నారు. -
షర్మిల ‘సమైక్య’ వాణి
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు సొంత జిల్లా చిత్తూరులో వైఎస్ షర్మిల సమైక్య శంఖరావం రెండో రోజు బస్సు యూత్రకు జనం జేజేలు పలికారు. సభల్లో జనం నుంచి విశేష స్పందన వ్యక్తమైంది. మంగళవారం ఉదయం చిత్తూరు పీసీఆర్ సర్కిల్లో, పలమనేరు, మదనపల్లెలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. మహానేత వైఎస్ తరహాలో బస్సులో నుంచి ప్రజలకు అభివాదం చేసిన ప్రతి సందర్భంలో జనం నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ‘మీ రాజన్న కూతురుని, జగనన్న చెల్లెల్ని’ అంటూ ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలా షర్మిల ఉపన్యాసం ప్రారంభం కావడంతో జనం కేకలు, ఈలలు వేస్తూ ఆనందాన్ని వ్యక్తంచేశార . సాక్షి, తిరుపతి:షర్మిల బస్సుయూత్ర సభల ప్రసంగంలో ఎక్కువగా సమైక్యవాదం వినిపిస్తూ, విడిపోతే వచ్చే నష్టాలను వివరించారు. ఆద్యంతం ఉత్సాహపూరితంగా, ఉద్యమ స్ఫూర్తితో యూత్ర సాగింది. చిత్తూరు సభలో షర్మిల మాట్లాడుతూ వైఎస్ మృతి చెందిన నాలుగేళ్లకు కాంగ్రెస్ తన స్వార్థ రాజకీయం కోసం ఈ రాష్ట్రన్ని అతలాకుతలం చేసి కుక్కలు చింపిన విస్తరిగా మార్చిందని ఆగ్రహం వ్యక్తం చేసినప్పుడు ప్రజలు కరతాళధ్వనులతో కేకలు వేస్తూ స్పందించారు. కృష్ణా, గోదావరి జలాలు సీమాంధ్రకు రాకపోతే ఏడారిగా మారుతుందని, రాష్ట్ర విభజన జరిగితే ఈ పరిస్థితి తప్పదని అనడంతో, జనం కూడా అవును, నిజమే ఈ ప్రాంతం ఎడారిగా మారుతుందంటూ ప్రతిస్పందించారు. మహానేత ప్రారంభించిన 108, 104 పథకాలు అదృశ్యమైయ్యాయని, ఆరోగ్యశ్రీకి జబ్బు చేసిందని, కొత్తగా రేషన్ కార్డులు, ఫించన్లు ఒక్కటిగా కూడా మంజూరు కాకపోగా, ఉన్నవాటిని తీసేసారని అన్నప్పుడు జనం నుంచి అనూహ్య స్పందన వ్యక్తమైంది. రాష్ట్రంలో ఐదేళ్లు విద్యుత్, బస్సు చార్జీలు రూపాయి కూడా పెంచకుండా, ధరలు పెరగకుండా పేదలు, సామాన్య ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వాన్ని నడిపిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అన్నప్పుడు సభ చప్పట్లతో దద్దరిల్లింది. చంద్రబాబు ఆత్మగౌరవం పేరుతో వెన్నుపోటు యాత్ర నిర్వహిస్తున్నారని, ప్రజలను మోసం చేసి బ్లాంక్ చెక్ లాగా కాంగ్రెస్‌కు విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చిన ఆయనను మీరు తరిమికొట్టాలన్నప్పుడు జనం నుంచి విశేష స్పందన వ్యక్తమైంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగానూ, ప్రతిపక్ష నాయకుడుగాను ఈ రాష్ట్రానికి, ప్రజలకు చేసిందేమి లేదని దుయ్యబట్టారు. ప్రతిపక్షపార్టీలు అవిశ్వాస తీర్మానం పెడితే చంద్రబాబు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వంపై ఈగ వాలనివ్వకుండా చూసుకున్నారన్నారు. కేవలం ఓట్ల కోసం, సీట్ల కోసం కాంగ్రెస్ ఈ రాష్ట్రాన్ని అధికార దాహంతో గొడ్డలితో నిలువునా నరికేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు అన్యాయం జరగకుండా చూడాలన్నదే వైఎస్సార్సీపీ విధానమని, ఈ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్నదే తమ డిమాండ్ అని పేర్కొన్నప్పుడు చప్పట్లతో, ఈలలతో సభా ప్రాంతాలు దద్దరిల్లాయి. వైఎస్ బతికి ఉండి ఉంటే రాష్ట్ర విభజన అంశం వచ్చేది కాదన్నప్పుడు, జనం నుంచి ‘అవును విభజన జరిగేది కాదు’ అంటూ ప్రతి స్పందన వ్యక్తమైంది. చిత్తూరు, మదనపల్లె సభలకు భారీగా జనం రెండవ రోజు షర్మిల బస్సు యాత్రకు చిత్తూరు, మదనపల్లెతో పాటు, షెడ్యూల్డ్‌లో లేని పుంగనూరు, పలమనేరుల్లో కూడా సాగింది. ఈ ప్రాంతాల్లో షర్మిలను చూసేందుకు వందలాది మంది బారులు తీరారు. చిత్తూరు పూలే సెంటర్లో జరిగిన సభకు గంగాధరనెల్లూరు, పలమనేరు, బంగారుపాళెం, పూతలపట్టు, చిత్తూరు రూరల్, తవణంపల్లె, పాలసముద్రం, వెదురుకుప్పం, యాదమరి, గుడిపాల మండలాల నుంచి ట్రాక్టర్లు, వాహనాల్లో వచ్చారు. మదనపల్లెలో జరిగిన సభకు మదనపల్లె రూరల్, రామసముద్రం, నిమ్మనపల్లె, బి.కొత్తకోట, తంబళ్లపల్లె, వాయల్పాడు మండలాల నుంచి జనం తరలివచ్చారు. షర్మిల రాకకు ముందే రెండు గంటల నుంచి ఆమె కోసం వేచి ఉన్నారు. దారి పొడవునా ‘జగనన్న ఎలా ఉన్నాడు, ఆరోగ్యం ఎలా ఉందని’ జనం అడిగారు. జగనన్న ఎప్పుడు జైలు నుంచి వస్తాడని ప్రశ్నల వర్షం కురిపించారు. బాబు లేఖతో అమర్ మనస్తాపం మదనపల్లెకు వెళుతూ మార్గమధ్యంలో పలమనేరులో వేచి ఉన్న అభిమానులనుద్దేశించి షర్మిల మాట్లాడుతూ. ‘‘చంద్రబాబు నాయుడు తెలంగాణపై ఇచ్చిన లేఖతో మనస్తాపం చెంది, ముఫ్పై ఏళ్లుగా టీడీపీలో ఉండిన మీ ఎమ్మెల్యే అమరనాథరెడ్డి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి బాబు ప్రయత్నిస్తుండడం ఆయనకు నచ్చలేదు. ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ మాత్రమే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచగలదని భావించి పార్టీలో చే రారు. అలాంటి వ్యక్తిపై డబ్బు తీసుకుని వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి వెళ్లారని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారు’’ అంటూ ధ్వజమెత్తారు. -
ఢిల్లీ దర్బార్‌లో సలాములా?: షర్మిల ప్రశ్న
-
ఢిల్లీ దర్బార్‌లో సలాములా?: షర్మిల ప్రశ్న
రాష్ట్ర విభజనతో సీమాంధ్ర వల్లకాడు అవుతుందని షర్మిల అన్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే తాగడానికే కాదు, సాగుకు కూడా సీమాంధ్రకు నీళ్లు దొరకవని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సమైక్య శంఖారావం బస్సుయాత్రలో భాగంగా చిత్తూరు చేరుకున్న షర్మిల... పీసీఆర్ కాలేజీ సెంటర్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కాంగ్రెస్ స్వార్ధ రాజకీయాల కోసం రాష్ట్రాన్ని విడగొట్టాలని చూస్తున్నారని విమర్శించారు. గతంలో మద్రాసు నుంచి వెల్లగొట్టారు. ఇప్పుడు హైదరాబాద్ నుంచి వెళ్లగొట్టాలని చూస్తున్నారని అన్నారు. ఒక పక్క నీళ్లూ ఇవ్వక హైదరాబాద్‌లో స్థానం ఇవ్వకుంటే మేం ఏం చేయాలని ప్రశ్నించారు. రాయలసీమలో ఉన్న వారు వ్యవసాయం చేసుకోవాలా, వద్దా అని నిలదీశారు. పోలవరం ప్రాజెక్టును ఏ నీళ్లతో నింపుతారని ప్రశ్నించారు. సీమాంధ్ర ఉద్యోగుల కోసం ఎక్కడికి వెళ్లాలి, వారిపై ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు ఏమైపోవాలని అన్నారు. ఇంత జరుగుతున్నా చంద్రబాబులో ఏ చలనం లేదని దుయ్యబట్టారు. విభజనకు కారణం చంద్రబాబే అన్నారు. బ్లాంక్ చెక్కు ఇచ్చినట్టుగా తెలంగాణకు అనుకూలంగా ఆయన లేఖ ఇచ్చారని విమర్శించారు. చంద్రబాబు లేఖ ఇవ్వకుంటే కేంద్రం విభజించే సాహసం చేసివుండేది కాదన్నారు. పట్టపగలే సీమాంధ్రుల గొంతు కోసి ఏ ముఖం పెట్టుకుని యాత్ర చేస్తున్నారని చంద్రబాబును ప్రశ్నించారు. రాష్ట్ర విభజన గురించి తెలియగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఒకేసారి రాజీనామా చేసి నిరసన తెలిపారని అన్నారు. ఎంత మంది సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్, టీడీపీ నాయకులు రాజీనామా చేశారని నిలదీశారు. గబ్బిలాల్లా పదవులు పట్టుకుని వేలాడుతున్నారని విమర్శించారు. అంతమంది ఎంపీలు ఉండి ఢిల్లీ దర్బార్‌లో వంగి.. వంగి సలాములు కొడుతూ తెలుగు ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నారని ధ్వజమెత్తారు. జగనన్నను ధైర్యంగా ఎదుర్కొనలేక కాంగ్రెస్ కుట్ర రాజకీయాలకు పాల్పడుతోందని షర్మిల ఆరోపించారు. కుట్రలతో అక్రమ కేసులు పెట్టి సీబీఐని ఉసిగొల్పారని అన్నారు. న్యాయం చేయనప్పుడు రాష్ట్రాన్ని విడగొట్టే హక్కు కేంద్రానికి లేదని షర్మిల అన్నారు. -
ఇంకా సేపట్లో చిత్తూరులో షర్మిల బహిరంగ సభ
-
షర్మిళ రావడం మా అదృష్టం - తిరుపతి వాసులు
-
కాంగ్రెస్‌కు ఓట్లు సీట్లు తప్ప మరో ప్రాతిపదిక లేదు
-
రాష్ట్ర ప్రజలకు విజయమ్మ బహిరంగ లేఖ
'సమైక్య శంఖారావం' పేరుతో రేపటి నుంచి షర్మిల బస్సుయాత్ర చేపడతారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రజలకు ఆమె బహిరంగ లేఖ రాశారు. ఓట్లు-సీట్లు ప్రతిపాదికన రాష్ట్రాన్ని అడ్డగోలుగా విగడొట్టాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని విజయమ్మ విమర్శించారు. ఈ తప్పిదాన్ని అడ్డుకోకుంటే చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతారని హెచ్చరించారు. ప్రధానికి లేఖకు వైఎస్సార్ సీపీ, ఎంఐఎం, సీపీఎం కట్టుబడి ఉన్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, సీపీఐ, టీఆర్ఎస్ విభజనకు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. సమన్యాయం కోసం ప్రధానికి చంద్రబాబును లేఖ రాయమన్నా వినిపించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఓట్లు-సీట్లు రావనే స్వార్థ రాజకీయాలకు చంద్రబాబుకు పరాకాష్టగా మారారని విజయమ్మ పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి వారసుడిగా నిజాయితీ, నిబద్ధత, విలువలతో కూడిన రాజకీయాలనే వైఎస్ జగన్ చేశారని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని ప్రాణం కంటే మిన్నగా వైఎస్ జగన్ భావించారని అన్నారు. జగన్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని అన్నారు. దరూ కలిసి సంతోషంగా ఉండే సువర్ణయుగం వస్తుందని విజయమ్మ విశ్వాసం వ్యక్తం చేశారు. -
రేపటి నుంచి షర్మిల బస్సు యాత్ర
తిరుపతిలో బహిరంగ సభ సాక్షి, హైదరాబాద్: అందరికీ సమన్యాయం చేయలేనప్పుడు రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలనిడిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల చేపట్టబోయే బస్సు యాత్ర షెడ్యూల్‌ను పార్టీ కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం, చిత్తూరు జిల్లా పార్టీ నాయకులు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి శనివారం ప్రకటించారు. ఈ మేరకు వారు మీడియాతో మాట్లాడుతూ ‘సెప్టెంబర్ 2న ఉదయం షర్మిల ఇడుపులపాయకు చేరుకొని వైఎస్సార్‌కు నివాళి అర్పిస్తారు. అదే రోజు సాయంత్రం చిత్తూరు జిల్లా తిరుపతికి చేరుకొని సాయంత్రం అక్కడ జరిగే భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. రాత్రి తిరుపతిలోనే బస చేస్తారు’ అని చెప్పారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. షర్మిల 3వ తేదీ ఉదయం చిత్తూరులో జరిగే బహిరంగ సభలో, అదే రోజు సాయంత్రం మదనపల్లి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మదనపల్లిలోనే రాత్రి బస చేస్తారు. 4వ తేదీ ఉదయం అనంతపురం జిల్లా కదిరి బహిరంగ సభలో, సాయంత్రం అనంతపురం బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతపురం పట్టణంలో రాత్రి బస చేస్తారు. 5న ఉదయం కర్నూలు జిల్లా డోన్ బహిరంగ సభలో, సాయంత్రం కర్నూలు బహిరంగ సభలో పాల్గొంటారు. కర్నూలు పట్టణంలో రాత్రి బస చేస్తారు. 6వ తేదీ ఉదయం అదే జిల్లా నంద్యాల బహిరంగ సభలో, సాయంత్రం ఆళ్లగడ్డ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆళ్లగడ్డలో రాత్రి బస చేస్తారు. 7వ తేదీ ఉదయం వైఎస్సార్ జిల్లా మైదుకూరు బహిరంగ సభలో, సాయంత్రం బద్వేలు బహిరంగ సభలో పాల్గొంటారు. -
2న ఇడుపులపాయ నుంచి షర్మిల బస్సుయాత్ర
ఇడుపులపాయ నుంచి ప్రారంభం సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల మరో యాత్రకు శ్రీకారం చుడుతున్నారు. తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి రోజైన సెప్టెంబర్ 2వ తేదీన ఆమె బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర మాదిరిగానే ఆమె ఇడుపులపాయలోని వైఎస్సార్ సమాధి వద్ద నుంచి బస్సు యాత్రకు బయలు దేరుతారని పార్టీ కేంద్ర కార్యాలయ వర్గాలు గురువారం తెలిపాయి. రాష్ట్ర విభజనపై సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయం దరిమిలా ఉత్పన్నమయ్యే నష్టాలపై ప్రజలను చైతన్యపర్చడానికి ఆమె ఈ యాత్ర చేపడుతున్నారని పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ వెల్లడించారు. ఇప్పటికే షర్మిల 3,112 కిలోమీటర్ల పాదయాత్రను ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ చేసి చరిత్ర సృష్టించడం తెలిసిందే. బస్సుయాత్ర చేపడితే షర్మిల మరో మైలురాయి అధిగమించిన వారవుతారు. -
సెప్టెంబరు 2నుంచి షర్మిల బస్ యాత్ర
-
సెప్టెంబరు 2నుంచి షర్మిల బస్సు యాత్ర
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి సోదరి షర్మిల సెప్టెంబరు 2 నుంచి బస్సు యాత్ర ప్రారంభించనున్నారు. ఆ రోజు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి. వైఎస్ఆర్ జిల్లా వేంపల్లి మండలం ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద షర్మిల నివాళులర్పించి బస్సుయాత్ర ప్రారంభిస్తారు. రాష్ట్ర విభజన విషయంలో ఇరుప్రాంతాలకు సమన్యాయం చేయాలని, అలా చేయలేకపోతే రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలన్న డిమాండ్‌తో ఆమె ఈ యాత్ర చేయనున్నారు. సీమాంధ్ర జిల్లాలలో ఆమె బస్సు యాత్ర చేస్తారు. షర్మిల 230 రోజులపాటు మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేసిన విషయం తెలిసిందే. పాదయాత్ర కూడా అమె ఇడుపులపాయ నుంచే ప్రారంభించి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగించారు. పాదయాత్రలో ఆమె అన్ని వర్గాల ప్రజలను కలుసుకున్నారు. వారికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇప్పుడు రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న ఏకపక్ష, నిరంకుశ వైఖరికి నిరసనగా బస్సుయాత్ర చేయనున్నారు. సమన్యాయం చేయలేకపోతే, రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలని కూడా ఆమె కోరుతున్నారు.