సాక్షి, నెల్లూరు: జిల్లాలో ఆదివారం నిర్వహించనున్న షర్మిల సమైక్య శంఖారావం బస్సుయాత్రను విజయవంతం చేయాలని వైఎస్సార్‌సీపీ సీజీసీ సభ్యుడు, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి పార్టీశ్రేణులకు పిలుపునిచ్చారు. షర్మిల యాత్ర నేపథ్యంలో స్థానిక పార్టీ కార్యాలయంలో శుక్రవారం వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డితో పాటు ఆయా నియోజకవర్గాల సమన్వయకర్తలు, ముఖ్యనేతలతో ఎంపీ సమావేశం నిర్వహించారు. నేతలందరూ వచ్చి బద్వేలు నుంచి వచ్చే షర్మిలకు జిల్లా సరిహద్దులో స్వాగతం పలకాలన్నారు. జిల్లాలో జరిగే షర్మిల సభలను అందరూ కలిసి విజయవంతం చేయాలని కోరారు.
అ నంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ మాట్లాడారు. షర్మిల బస్సుయాత్ర 8వ తేదీ ఉదయం బద్వేలు నుంచి జిల్లాలో ప్రవేశిస్తుందన్నారు. 10 గంటలకు ఆత్మకూరులో జరిగే సభలో ఆమె ప్రసంగిస్తారని తెలిపారు. అనంతరం సంగం మీదుగా బుచ్చిరెడ్డిపాళెం వచ్చి అక్కడ జరిగే సభలోనూ ప్రసంగిస్తారన్నారు.
సాయంత్రానికి కావలి చేరుకుని అక్కడ జరిగే సభలో మాట్లాడతారని తెలిపారు. రాత్రికి కావలిలో బసచేస్తారని ఎంపీ చెప్పారు. పార్టీశ్రేణులు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై షర్మిల యాత్రను విజయవంతం చేయాలన్నారు. విడిపోతే సీమాంధ్రకు అన్యాయం జరుగుతుంది కాబట్టే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని
షర్మిల యాత్రను సక్సెస్ చేయాలి
Published Sat, Sep 7 2013 5:15 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement