సాక్షి ప్రతినిధి, ఏలూరు :
హేలాపురి జనసంద్రమైంది. ఉద్యోగులు.. ఉపాధ్యాయులు.. విద్యార్థులు.. మహిళలు.. అన్నివర్గాల ప్రజలు సమైక్య శంఖారావానికి జై కొట్టారు. ఎటుచూసినా జనమే కని పించారు. చంటిపిల్లల్ని చంకన వేసుకుని మహిళలు, ఊతకర్రల సాయంతో వృద్ధులు సైతం సభకు తరలివచ్చారు. రాష్ట్రాన్ని విడగొట్టవద్దంటూ ఊరూవాడా హోరెత్తెలా పోరాడుతున్న ప్రజలు అదే డిమాండ్‌తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల నిర్వహిస్తున్న బస్సుయాత్రకు ఎదురేగి అపూర్వ స్వాగతం పలికారు. సమైక్య శంఖారావం పేరిట ఆమె చేపట్టిన బస్సుయాత్ర గురువారం జిల్లాలో ప్రవేశిం చింది. ప్రతిచోటా షర్మిలకు అపూర్వ ఆదరణ లభించింది.
బస్సుయూత్ర సాయంత్రం 5 గంటలకు కృష్ణా జిల్లా నుంచి ఏలూరు రూరల్ మండలం పెదఎడ్లగాడి వద్ద జిల్లాలోకి ప్రవేశిం చింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు ఆమెకు ఘన స్వాగతం పలి కారు. మహేశ్వరపురం వద్ద గ్రామస్తులు కాన్వాయ్‌ని ఆపి షర్మిలను గ్రామంలోకి రావాలని ఆహ్వానించారు. దీంతో ఆమె బస్సు దిగి అక్కడున్న అంబేద్కర్, వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పిం చారు. శ్రీపర్రు గ్రామంలోనూ మహిళలు బస్సును ఆపి షర్మిలతో కరచాలనం చేసేం దుకు పోటీపడ్డారు. మాదేపల్లిలో సొంత ఆడపడచులా ఆమెకు హారతులిచ్చి సాదరంగా ఆహ్వానించారు. అక్కడి నుంచి ఏలూరు నగరంలోకి వచ్చేవరకూ ప్రతిచోటా షర్మిలను చూసేందుకు జనం రోడ్లపై వేచివున్నారు. వారందరికీ అభివాదం చేస్తూ ఆమె ముందుకు కదిలారు.
ఏలూరు నగరంలోని జూట్‌మిల్లు వద్ద వేలాదిమంది కొల్లేరు ప్రజలు షర్మిలకు స్వాగతం పలకడంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. అక్కడి నుంచి ఓవర్‌బ్రిడ్జి మీదుగా వేలాది మందితో ర్యాలీగా బస్సుయాత్ర ఫైర్‌స్టేషన్ సెంటర్‌కు చేరుకుంది. ఓవర్ బ్రిడ్జి అంతా జనసందోహంతో నిండిపోయింది. జూట్‌మిల్ నుంచి ఫైర్‌స్టేషన్ సెంటర్ వరకూ జనం బారులు తీరి నిలబడి షర్మిలకు అభివాదం చేశారు.
ఆకర్షించిన ఎన్జీవోలు
ఈ సభలో ఎన్జీవోలు ప్రధాన ఆకర్షణగా నిలి చారు. బహిరంగ సభకు పెద్దఎత్తున ఉద్యోగులు తరలిరావడంతోపాటు ఎన్జీవో నేతలు బస్సు ఎక్కి ప్రసంగించారు. ఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎల్.విద్యాసాగర్, ఆర్టీసీ జేఏసీ నాయకుడు, సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక రాష్ట్ర కో-కన్వీనర్ ప్రసాదరావు సమైక్య రాష్ట్రం కోసం పోరాడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సభలోనే మద్దతు ప్రకటించారు. షర్మిల ప్రసంగాన్ని ఉద్యోగులంతా ఆసక్తిగా విన్నారు.
హోరెత్తిన ర్యాలీలు
సమైక్య శంఖారావానికి కొల్లేటి లంక గ్రామాల ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. పాతబస్టాండ్ నుంచి ర్యాలీగా వేలాది మంది సభాస్థలికి చేరుకున్నారు. వివిధ వర్గాల ప్రజలు ప్రదర్శనగా సభా ప్రాంగణానికి చేరు కున్నారు. సభ జరిగేది సాయంత్రమైనా మధ్యాహ్నం 2 గంటల నుంచే నగరంలోకి జనం తాకిడి మొదలైంది. మధ్యాహ్నం కొద్దిసేపు వర్షం కురిసినా లెక్కచేయకుండా జనం వస్తూనే ఉన్నారు. ఆ తర్వాత ఎండను కూడా పట్టించుకోకుండా సభాస్థలి వద్దే షర్మిల వచ్చేవరకూ వేచి ఉన్నారు. సభలో వైఎస్సార్ కాం గ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్, ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మాజీ ఎమ్మెల్యే, ఏలూరు నియోజకవర్గ సమన్వయకర్త ఆళ్ల నాని, మాజీ ఎమ్మెల్యేలు మద్దాల రాజేష్, తానేటి వనిత, ముదునూరి ప్రసాదరాజు, పాతపాటి సర్రాజు, నాయకులు కొయ్యే మోషేన్‌రాజు, తోట గోపి, చీర్ల రాధ య్య, చలుమోలు అశోక్‌గౌడ్, పీవీ రావు, కొఠారు రామచంద్రరావు, మొవ్వా ఆనంద్‌శ్రీనివాస్, కర్రా రాజారావు, బొడ్డు వెంకటరమణచౌదరి, కండిబోయిన శ్రీనివాస్, గంటా ప్రసాద్, కావ లి నాని, ముంగర సంజీవకుమార్, బీసీ సెల్ జిల్లా కన్వీనర్ పాశం రామకృష్ణ, మహిళా విభా గం జిల్లా కన్వీనర్ ఉమాబాల పాల్గొన్నారు.
పోటెత్తిన ఫైర్‌స్టేషన్ సెంటర్
షర్మిల సభ నిర్వహించిన ఫైర్‌స్టేషన్ సెంటర్ ఇసుకవేస్తే రాలనంతమంది జనంతో నిండిపోయింది. ఈ సెంటర్‌లోని బస్టాండ్, అశోక్‌నగర్, ఓవర్‌బ్రిడ్జి రోడ్లు కిటకిటలాడిపోయాయి. షర్మిల ఉద్వేగపూరితంగా చేసిన ప్రసంగానికి విశేష ఆదరణ లభించింది. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ ఆమె చెప్పినప్పుడల్లా జనం చప్పట్లతో ఆ ప్రాంతాన్ని మార్మోగించారు. కేంద్ర మంత్రి, ఏలూరు ఎంపీ కావూరు సాంబశివరావు సమైక్యాం ధ్రకు వ్యతిరేకంగా ఉన్న విషయాన్ని షర్మిల ప్రశ్నించినప్పుడు సభికుల నుంచి మంచి స్పందన వచ్చింది.
సమైక్య నీరాజనం
Published Fri, Sep 13 2013 2:14 AM | Last Updated on Fri, Sep 1 2017 10:39 PM
Advertisement
Advertisement