షర్మిలకు బ్రహ్మరథం | Extraordinary response to Sharmila Bus Yatra | Sakshi
Sakshi News home page

షర్మిలకు బ్రహ్మరథం

Published Mon, Sep 16 2013 4:38 AM | Last Updated on Fri, Sep 1 2017 10:45 PM

Extraordinary response to Sharmila Bus Yatra

విజయనగరం టౌన్, న్యూస్‌లైన్ : సమన్యాయం లేదా సమైక్యమే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన సమైక్య శంఖారావం బస్సుయాత్రకు జిల్లా కేంద్రంలో అపూ ర్వ స్వాగతం లభించింది. షర్మిలకు ప్రజ లు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావడం తో పట్టణం కిటకిటలాడింది. ఆదివారం సాయంత్రం 4 గంటలకు షర్మిల బస్సు యూత్ర విశాఖ జిల్లా నుంచి విజయనగరంలోని వీటీ అగ్రహారంలోకి ప్రవేశిం చింది. అప్పటికే ఆమె రాకకోసం ఎదురుచూస్తున్న వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు ఎదురెళ్లి ఆమెకు ఘన స్వా గతం పలికారు. బస్సు యాత్ర వీటీ అగ్రహారం జంక్షన్ నుంచి కోర్టు మీదుగా ఎత్తుబ్రిడ్జికి చేరుకుంది. అక్కడ వైఎస్సార్ సీపీ యువజన విభాగం నాయకుడు అవనాపు విక్రమ్, కాళ్ల గౌరీశంకర్, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త గురాన అయ్యలు, ఎస్సీసెల్ కన్వీనర్ ఆదాడ మోహనరావు, పట్టణ మహిళా అధ్యక్షురాలు గండికోట శాంతి తదితరులు షర్మిలకు స్వాగతం పలికారు.
 
 షర్మిల బస్సు లో నుంచే సమైక్యాంధ్రకు మద్దతుగా ని నాదాలు చేశారు. దారిపొడవునా మహిళలు, యువకులు ఆమెకు అభివాదం చెప్పారు. వైఎస్సార్ సీపీ జిల్లా యువజ న విభాగం అధ్యక్షుడు అవనాపు విజయ్ ఆధ్వర్యంలో ఎక్కడికక్కడే ఫ్లెక్సీలు, కటౌ ట్లు,  ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం లో పార్టీ నాయకులు మజ్జి త్రినాథ్, పొ ట్నూరు బంగార్రాజు, మారేష్, కళావల్లి గోపి, చెన్నాలక్ష్మి, చెల్లూరు ఉగ్రనరసింగరావు, తదితరులు పాల్గొన్నారు. బస్సుయాత్ర ఎత్తుబ్రిడ్జి మీద నుంచి ఆర్‌అం డ్‌బీ జంక్షన్, కలెక్టరేట్, జేఎన్‌టీయూ, బొండపల్లి, గజపతినగరం, రామభద్రపురం మీదుగా సాలూరుకు చేరుకుంది. అన్నిచోట్లా షర్మిలకు అదే ఆదరణ లభిం చింది. దారి పొడవునా ఆమె రాక కోసం ప్రజలు ఎదురుచూశారు. కొన్నిచోట్ల పొ లాల నుంచి వ్యవసాయ కూలీలు పరు గు పరుగున వచ్చారు.
 
 విద్యార్థుల పోరాటం అద్భుతం
 - జేఎన్‌టీయూ విద్యార్థులతో షర్మిల 
 విజయనగరం రూరల్ : ‘చిన్న వారైనా సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగస్వాము లు కావడం అభినందనీయం.. గ్లాడ్ బ్లెస్ యూ’ అంటూ జేఎన్‌టీయూ విద్యార్థులను ఉద్దేశించి వైఎస్‌ఆర్ సీపీ నాయకురాలు షర్మిల అన్నారు. సమైక్య శంఖారావంలో భాగంగా జిల్లా పర్యటనకు వచ్చిన షర్మిల సాలూరు వెళుతూ స్థానిక జేఎన్‌టీయూ కూడలి వద్ద విద్యార్థులు చేస్తున్న రిలే నిరాహార దీక్ష శిబిరం వద్ద వాహనాన్ని ఆపి విద్యార్థుల ఉద్యమానికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భం గా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని అన్ని వర్గాల ప్రజ లు చేపడుతున్న ఉద్యమంలో వైఎస్‌ఆర్ సీపీ భాగస్వామ్యం వహిస్తుందని చెప్పా రు. సమైక్యాంధ్ర మద్దతుగా వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ప్రజల పక్షాన నిలిచారని తెలిపారు. టీడీపీ, కాం గ్రెస్ పార్టీ నాయకులు రాజీనామా డ్రా మాలతో ప్రజలను మభ్యపెడుతున్నార ని విమర్శించారు.కార్యక్రమంలో వైఎ స్సార్ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త సుజయ్ కృష్ణ రంగారావు, జిల్లా కన్వీనర్ పెనుమత్స సాంబశివరాజు, నియోజకవర్గ సమన్వయకర్త అవనాపు విజయ్, తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement