కుట్రదారుల గుండెలదిరేలా... సమైక్య శంఖారావం
Published Mon, Sep 16 2013 4:34 AM | Last Updated on Fri, Sep 1 2017 10:45 PM
వి‘భజన’పరుల కుట్రల అడ్డుగోడలు ఛేదించడమే లక్ష్యంగా ఆమె కదిలారు...జనాల ఆకాంక్షను ప్రతిధ్వనిస్తూ ఆమె సమైక్యశంఖం పూరించారు. సీమాంధ్ర ప్రజల గుండె చప్పుళ్ల ఢంకారావాలను కండకావరనేతల గుండెల్లో గుబులుపుట్టేలా వినిపించారు... ఆమె వాగ్ధాటి, సంధించిన ప్రశ్నల శరాలు జన ప్రవాహంలో చైతన్య తరంగాలను సృష్టించాయి. ఉద్యమానికి నూతనోత్తే‘జనాన్ని’ అందించాయి. వైఎస్‌ఆర్ సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన సమైక్య శంఖారావం బస్సుయాత్ర ఆదివారం జిల్లాలో నాలుగు నియోజకవర్గాలలో జరిగింది. సాలూరులో సాయంత్రం జరిగిన బహిరంగ సభలో అశేష జనసంద్రం మధ్య ఆమె ప్రసంగం భీకర ప్రళయగంగా ప్రవాహంగా సాగింది...
సాలూరు నుంచి సాక్షి ప్రతినిధి : పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణకు పదవి తప్ప ప్రజల మనోభావాలు పట్టడం లేదని మహానేత తనయ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఓట్లు, సీట్ల కోసమే రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు ప్రయత్నిస్తోం దన్నారు. సమన్యాయం లేదా సమైక్యమే లక్ష్యంగా వైఎస్సార్ సీపీ సమైక్య శంఖారావం పేరిట చేపట్టిన బస్సు యాత్రలో భాగంగా ఆదివారం సాయంత్రం ఆమె సాలూరు చేరుకున్నారు. ఈ సందర్భంగా బోసుబొమ్మ జం క్షన్ వద్ద జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. రాష్ట్ర విభజనకు సంబంధించి కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో పాటు పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణకు ముందుగానే తెలుసునని కేంద్రమంత్రి కిశోర్ చంద్రదేవ్ చెప్పారన్నారు. అయినా విభజనపై బొత్స నోరు మెదపడం లేదని ధ్వజమెత్తారు. సీఎం కిరణ్, బొత్స పదవుల కోసం పాకులాడుతున్నారని విమర్శించా రు. ‘మీరు ఎన్ని అక్రమ వ్యాపారాలు చేస్తున్నా ...మీకు పదవులిచ్చి మోస్తున్న ప్రజలకు నష్టం కలుగుతుంటే చూస్తూ ఎలా ఉంటున్నార’ని ప్రశ్నించారు. ఇంత నష్టం చేసి ఇప్పుడు సీమాంధ్రలో ఎలా అడుగుపెట్టగలరని నిల దీశారు.
విభజనకు చంద్రబాబే కారణం
రాష్ట్ర విభజనకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మరో ప్రధాన కారకుడని షర్మిల ధ్వజ మెత్తారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసుకోండంటూ ఆయన బ్లాంక్ చెక్ లాంటి లేఖ ఇచ్చేశారని ఆరోపించారు. ఇప్పుడేమో ఆయన సమైక్యాం ధ్ర కావాలం టున్నారని.. ఆయన్ను చూస్తుంటే ‘హత్య చేసి మళ్లీ ఆ శవం మీదనే కూర్చుని వెక్కివెక్కి ఏడ్చినట్లుంది’ అని ఎద్దేవా చేశారు. బాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే విభజనకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకు ని, ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆయన్ను, ఆ పార్టీ ఎమ్మెల్యేలను తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చా రు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఉండి ఉంటే ఇలాంటి పరిస్థితులు వచ్చేవి కాదని సాక్షాత్తూ ప్రధాన మంత్రే అన్నారంటే.. మహా నేత ఎంతటి సమైక్యవాదో స్పష్టమవుతోందన్నారు. టీడీపీ, కాంగ్రెస్ ఓట్లు, సీట్ల కోసమే ఇంతటి నీచానికి దిగజారాయని, వాళ్లను భవి ష్యత్ తరాలు కూడా క్షమించవన్నారు. జైల్లో ఉన్నా జగనన్న నిరంతరం ప్రజల కోసమే పో రాడుతున్నారని చెప్పారు.
సమైక్యం కోసం పోరాడేది వైఎస్సార్ కాంగ్రెస్సే
- సుజయ్ కృష్ణ రంగారావు
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఒక్క వైఎ స్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే పోరాడుతోం దని ఆ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త ఆర్‌వీ సుజయ్ కృష్ణ రంగారావు అన్నారు. రాజకీయ సంక్షోభం వస్తేనే విభజనపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. సీమాంధ్ర ప్రజాప్రతి నిధులు స్పీకర్ ఫార్మెట్‌లో రాజీనామాలు చేసి ఉద్యమంలోకి రావాలని పిలుపునిచ్చారు. పా ర్టీ అరుకు పార్లమెంట్ నియోజక వర్గ పరిశీల కుడు బేబీనాయన వేదిక మీదకు రాగానే బొబ్బిలి పులి అంటూ అభిమానులు నినాదా లు చేశారు. దీంతో ఆయన జై సమైక్యాంధ్ర అని వేదిక మీద నుంచి ప్రజలతో అనిపిం చారు. పార్టీ జిల్లా కన్వీనర్ పెనుమత్స సాంబ శివరాజు మాట్లాడుతూ షర్మిల యాత్రకు ప్రజ లు బ్రహ్మరథం పడుతున్నారని కొనియాడా రు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు కుంభా రవిబాబు, అవనాపు విజయ్, గులిపల్లి సుదర్శనరావు, గరుడపల్లి ప్రశాంత్ కుమార్, రాయల సుందరరావు, కొయ్యాన శ్రీవాణి, జమ్మాన ప్రసన్నకుమార్, ఉదయభా ను, బోకం శ్రీనివాస్, గేదెల తిరుపతి, కడుబం డి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖరరాజు, ద్వారపురెడ్డి సత్యనారాయ ణ, గురాన అయ్యలు, కాకర్లపూడి శ్రీనివాస రాజు, గొర్లె మధుసూదనరావు, జరజాపు సూ రిబాబు, గిరి రఘు, ముగడ గంగమ్మ, మండవిల్లి కామరాజు పాల్గొన్నారు.
పార్టీలో చేరిన మాజీ ఎంపీపీ తీళ్ళ
సాలూరు/పాచిపెంట : సాలూరు మండల మాజీ ఎంపీపీ తీళ్ళ సుశీల వైఎస్సార్ సీపీలో చేరారు. ఆమెకు మహానేత తనయ షర్మిల కం డువా వేసి, పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మజ్జి అప్పారావు, కనిమెరకల త్రినాథ, సువ్వాడ గణపతి, అప్పికొండ గణపతి, గుమ్మడాం గణపతి, ఉప్పాడ దైవకృపామణి, మండవిల్లి కామరాజు, శనాపతి కిషోర్, పాడి వేణు, తదితరులు పాల్గొన్నారు.
జేఏసీ, ఎన్‌జీఓలకు అండగా వైఎస్సార్ సీపీ
గజపతినగరం : రాష్ట్ర విభజనకు వ్యతిరేకం గా పోరాటం చేస్తున్న జేఏసీ, ఏపీ ఎన్‌జీఓలకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సో దరి షర్మిల భరోసా ఇచ్చారు. సమైక్య శంఖారావం బస్సుయూత్ర ఆదివారం సా యంత్రం గజపతినగరం మండల కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆమె జాతీ య రహదారిపై రిలే దీక్షలు చేస్తున్న ఎన్‌జీఓలు, జేఏసీ నాయకులకు సంఘీభావం తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఉద్యమాలు చేస్తున్న జేఏసీ, ఎన్‌జీఓలకు ప్రభుత్వం జీతాలు నిలిపివేయడం శోచనీ యమన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితికి కాంగ్రెస్, టీడీపీలే కారణమని ఆరోపిం చారు. వచ్చే ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు ప్రజలే బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. సీమాంధ్రప్రజలు సుమారు 45 రోజులుగా ఆందోళనలు చేపడుతున్నా.. కేంద్ర ప్రభుత్వానికి పట్టకపోవడం దారుణమన్నారు. జగనన్న అధికారంలోకి వస్తే.. కార్మికులు, ఉద్యోగులు, విద్యార్థులకు న్యాయం చేస్తారని భరోసా ఇచ్చారు.
Advertisement
Advertisement