13,14 తేదీల్లో తూ.గో జిల్లాలో షర్మిల బస్సు యాత్ర | sharmila bus yatra to enter east godavari district on 13th | Sakshi
Sakshi News home page

13,14 తేదీల్లో తూ.గో జిల్లాలో షర్మిల బస్సు యాత్ర

Published Sat, Sep 7 2013 7:02 PM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

sharmila bus yatra to enter east godavari district on 13th

రాజ‌మండ్రి: రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సోద‌రి షర్మిల చేపట్టిన ‘సమైక్య శంఖారావం’ బస్సు యాత్ర ఈ నెల 13న ఉదయం 10 గంటలకు పశ్చిమ గోదావరి జిల్లా సిద్దాంతం నుండి తూర్పుగోదావ‌రి జిల్లాలోకి ప్రవేశించనున్నట్టు ఆ జిల్లా క‌న్వీన‌ర్ చిట్టెబ్బాయి పేర్కొన్నారు. బ‌స్సు యాత్రలో భాగంగా ఉదయం 10.30 గంటలకు రావులపాలెంలోనూ,  సాయంత్రం 4 గంటలకు అమలాపురంలో బహిరంగ సభ జరుగుతుందని తెలిపారు.

14వ తేదీన ఉదయం 10 గంటలకు కాకినాడ మెయిన్ రోడ్డు వద్ద సమైక్యాంధ్ర ధర్నాలో షర్మిల పాల్గొంటారు. అదేరోజు సాయంత్రం తుని నుండి విశాఖ జిల్లాలోకి ష‌ర్మిల బస్సుయాత్ర ప్రవేశించనునున్నట్టు క‌న్వీన‌ర్ చిట్టెబ్బాయి పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement