8న నెల్లూరు జిల్లాకు షర్మిల బస్సుయాత్ర | sharmila bus yatra enter into the nellore district on september 8th | Sakshi
Sakshi News home page

8న నెల్లూరు జిల్లాకు షర్మిల బస్సుయాత్ర

Published Fri, Sep 6 2013 8:57 AM | Last Updated on Fri, Sep 1 2017 10:30 PM

sharmila bus yatra enter into the nellore district on september 8th

సమైక్యాంధ్రకు మద్దతుగా దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ షర్మిల చేపట్టిన 'సమైక్య శంఖారావం'బస్సుయాత్ర షెడ్యూల్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం  ఇక్కడ విడుదల చేసింది.  ఈ నెల 8వ తేదీన సమైక్య శంఖారావం బస్సు యాత్ర నెల్లూరు జిల్లాలో ప్రవేశించనుంది.  ఆ రోజు ఉదయం 10.00 గంటలకు ఆత్మకూరు, సాయంత్రం 4.00 గంటలకు కావలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో షర్మిల ప్రసంగించనున్నారు. 

 

అలాగే షర్మిల బస్సుయాత్ర 10వ తేదీ ప్రకాశం జిల్లాలో ప్రవేశిస్తుంది.ఆ రోజు ఉదయం 10.00 గంటలకు కనిగిరి, సాయంత్రం 4.00 గంటలకు మార్కాపురం బహిరంగ సభలో ఆమె ప్రసంగిస్తారు.అనంతరం 11వ తేదీన గుంటూరు జిల్లాలో ప్రవేశించి ఉదయం 10.00 గంటలకు వినుకొండ, సాయంత్రం 3.00 గంటలకు రేపల్లేలో జరిగే సభలో ఆమె మాట్లాడతారు.

 

అదే రోజు సాయంత్రం 4.30 గంటలకు కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ మరునాడు అంటే 12వ తేదీన ఉదయం 10.30 గంటలకు కైకలూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు.అనంతరం షర్మిల చేపట్టిన సమైక్య శంకారావం బస్సుయాత్ర పశ్చిమగోదావరిలో ప్రవేశిస్తుంది.ఆ రోజు సాయంత్రం 4.00 గంటలకు ఏలూరు నగరంలో ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడనున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement