సమైక్యాంధ్రకు మద్దతుగా ‘సమైక్య శంఖారావం’ పేరిట షర్మిల చేపట్టిన బస్సుయాత్రను జిల్లాలో విజయవంతం చేయాలని ఆ పార్టీ నాయకులు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
అమలాపురం, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్రకు మద్దతుగా ‘సమైక్య శంఖారావం’ పేరిట వైఎ స్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన బస్సుయాత్రను జిల్లాలో విజయవంతం చేయాలని ఆ పార్టీ నాయకులు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈనెల 13న అమలాపురం హైస్కూల్ సెంటరు వద్ద షర్మిల పాల్గొనే బహిరంగ సభ జరగనున్న ప్రాంతాన్ని పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి, సీజీసీ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, అమలాపురం పార్లమెంట్ నియోజకర్గ కో ఆర్డినేటర్ గొల్ల బాబూరావు, నియోజకవర్గ కో ఆర్డినేటర్లు చింతా కృష్ణమూర్తి, మిండగుదిటి మోహన్ బుధవారం పరిశీలించారు.
సభకు వేలాది మంది ప్రజలు హాజరయ్యే అవకాశమున్నందున వారికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని బోస్ సూచించారు. బహిరంగ సభలో జిల్లా నాయకుల కోసం ఏర్పాటు చేసే వేదిక, లైట్లు, మైకుల ఏర్పాటు వంటి వాటిపై పట్టణ పార్టీ కన్వీనర్ మట్టపర్తి నాగేంద్ర, పట్టణ యూత్ కన్వీనర్ గనిశెట్టి రమణ్‌లాల్‌తో చర్చించారు. జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు పెన్మత్స చిట్టిరాజు, బొల్లవరపు ఛాయాదేవి, కుడుపూడి త్రినాథ్, మట్టా వెంకట్రావు, నల్లా రమేష్, మట్టా వెంకట్రావు, పితాని చిన్న, యల్లిమల్లి రాజ్‌మోహన్, మాజీ ఎంపీపీ భూపతిరాజు సుదర్శనబాబు పాల్గొన్నారు.