Sharmila Samaikya sankharavam
-
ఆత్మీయ సోదరికి జనం జేజేలు
బొబ్బిలి/రామభద్రపురం/తెర్లాం/బాడంగి, న్యూస్‌లైన్ : సమైక్య శంఖారావం పేరిట దివంగత మహానేత వైఎస్ఆర్ తనయ, జననేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన బస్సు యాత్రకు అడుగడుగునా ప్రజలు, సమైక్యవాదులు, అభిమానులు బ్రహ్మరథం పట్టా రు. ఆదివారం జిల్లాలోనికి ప్రవేశించిన బస్సు యాత్ర.. సోమవారం ఉదయం సాలూరు, బొబ్బిలి నియోజకవర్గా ల్లో పర్యటించి అక్కడ నుంచి శ్రీకాకుళం జిల్లాకు వెళ్లింది. ఉదయం సాలూరులో షర్మిల బస చేసే ప్రాంతానికి అధిక సంఖ్యలో అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. అది మొదలు.. ఎక్కడికక్కడే షర్మిలను చూడడానికి, ఆమె మాటలు వినడానికి ప్రతి గ్రామం వద్ద అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, సమైక్యవాదులు తరలివచ్చారు. పార్టీ జిల్లా కన్వీనరు పెనుమత్స సాంబశివరాజు షర్మిలను సాలూరులోనే కలిసి ఆ నియోజకవర్గ నాయకులను పరిచయం చేశారు. పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త ఆర్వీ సుజయకృష్ణ రంగారావు, అరకు పార్లమెంటు పరిశీలకుడు ఆర్వీఎస్కేకే రంగారావు(బేబినాయన)లు షర్మిలతో పాటు బస్సులో ఉన్నారు. సాలూరు దాటిన తరువాత బొబ్బిలి నియోజకవర్గంలోనికి ప్రవేశించగానే తారాపురంలో అధిక సంఖ్యలో ప్రజలు చేరి జేజేలు పలికారు. వారందరికీ బస్సులోంచి అభివాదం చేసి ఆమె ముందుకు కదిలారు. మహానేత తనయ వస్తున్నారని తెలుసుకుని.. ఎక్కడ పనులు అక్కడే వదిలేసి మహిళలు, వృద్ధులు, పిల్లలు బయటకు వచ్చి ‘జై సమైక్యాంధ్ర, జై జగన్’ నినాదాలు చేశారు. రామభద్రపు రం బైపాస్ రోడ్డు వద్ద నుంచి పెద్ద ఎత్తున యువకులు వైఎస్ఆర్ సీపీ జెండాలు పట్టుకుని బైక్ ర్యాలీ నిర్వహించా రు. బైపాస్ రోడ్డులో జనం అధిక సంఖ్యలో వేచి ఉన్నారు. రామభద్రపురం గాంధీబొమ్మ జంక్షన్లో ఆ పార్టీ నాయకులు చింతల రామకృష్ణ, మడక తిరుపతి, రాయలు, గొర్లె రామారావు, చిన్నమ్మతల్లి తదితరుల ఆధ్వర్యంలో వందలాది మంది స్వాగతం పలికారు. అక్కడ నుంచి బాడంగి వెళ్లినంత వరకూ ప్రతి గ్రామం వద్ద కొద్దిసేపు బస్సును ఆపి షర్మిల అభివాదం చేశారు. బాడంగిలో సమైక్యాంధ్ర జెండాలతో షర్మిలకు జేఏసీ నాయకులు స్వాగతం పలికా రు. అక్కడ మాట్లాడాలని వారంతా కోరగా.. ఆమె ‘జై సమైక్యాంధ్ర’ అంటూ ముందుకు సాగారు. తెర్లాం మండ లం కూనాయవలస, వెలగవలస, పెరుమాళిలో షర్మిలకు బ్రహ్మరథం పట్టారు. మెరకమొడిదాం మండలం కూనాయవలస జంక్షన్ వద్ద వద్ద అక్కడ ప్రజలు షర్మిల బస్సును ఆపి కొబ్బరిబొండాన్ని ఆమెకు అందించారు. ఆమె తాగాక వాళ్లంతా సంతోషాన్ని వ్యక్తం చేశారు. తెర్లాం, మెరకముడిదాం, రాజాం తదితర మండలాల నుంచి వచ్చిన అభిమానులు, కార్యకర్తలతో పెరుమాళి జంక్షన్ కిటకిటలాడింది. షర్మిల రాక ఆలస్యం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వేలాది మంది అభిమానులను ఉత్తేజ పరిచేందుకు నెమలాంకు చెందిన డప్పు వాయిద్య కళాకారులు ప్రదర్శన గావించారు. విద్యార్థులు పిరమిడ్ ఆకారంలో నిల్చొన్నారు. పెరుమాళిలో అడుగుతీసి అడుగు వేయలేనంతగా జన సందోహం కనిపించింది. ఆ మండల నాయకులు నర్సుపల్లి వెంకటేశ్వరరావు తదితరులు జననేత సోదరికి స్వాగతం పలికారు. వారంతా షర్మిలను మాట్లాడాలని పట్టుబట్టారు. బస్సులోంచి బయటకు రావాలని, అందరికీ కనిపించాలని కోరారు. ఈ బస్సులోంచి పైకి రావడానికి కుదరదంటూ కొద్దిసేపు మాట్లాడి ఆమె ముందుకు కదిలా రు. జిల్లాలోని రెండో రోజు బస్సు యాత్రలో ప్రసాదరాజు, పార్టీ వివిధ నియోజకవర్గాల కన్వీనర్లు బోకం శ్రీనివాస్, గురాన అయ్యలు, కడుబండి శ్రీనివాసరావు, నాయకులు మక్కువ శ్రీధర్, ఆదాడ మోహనరావు, చెన్నా లక్ష్మి, రమేష్, కుమార్, నాగరాజు, పైల నాగభూషణం, మర్రాపు లీల, అబ్దుల్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు అండగా ఉండి పోరాటం: షర్మిల ప్రజల కష్టనష్టాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉండి పోరాటం చేస్తుందని షర్మిల అన్నారు. తెర్లాం మండలం పెరుమాళిలో బస్సులోంచే ఆమె కొద్దిసేపు మాట్లాడారు. ‘త్వరలోనే మంచి రోజులు రానున్నా యి. జగనన్న నాయకత్వంలో మీ కష్టాలన్నీ తీరుతాయం’ టూ ఆమె భరోసా ఇచ్చారు. కోట్లాది మంది సీమాంధ్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని దుయ్యబ ట్టారు. ప్రధాన ప్రతిపక్ష హోదాలో అన్యాయాన్ని నిలదీ యాల్సిన చంద్రబాబు.. ఆ పార్టీకే కొమ్ము కాస్తున్నారని మండిపడ్డారు. -
ప్రజాదరణ చూసి ఓర్వలేక..!
శ్రీకాకుళం,న్యూస్‌లైన్: రాష్ట్రంలో వైఎస్ఆర్ సీపీకి రోజురోజుకూ పెరుగుతున్న ప్రజాదరణ చూసి అధికార, ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని నరసన్నపేట శాసనసభ్యుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ వైఎస్ షర్మిల చేపట్టిన సమైక్య శంఖారావం బ స్సు యాత్ర సోమవారం శ్రీకాకుళంలో ముగి సింది. స్థానిక వైఎస్ఆర్ కూడలిలో నిర్వహించిన సభలో జిల్లాకు చెందిన పలువురు పార్టీ నాయకులు మాట్లాడారు. ప్రజల నుంచి దూరం చేసేం దుకే పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని అక్రమంగా జైల్లో ఉంచారని కృష్ణదాస్ మండిపడ్డారు. అయినా వెరవకుండా..పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, షర్మిల ఆ బాధ్యతలు తీసుకోవడంతో కాంగ్రెస్, టీడీపీలు దిక్కతోచని స్థితిలో పడ్డాయన్నారు. పార్టీ జిల్లా కన్వీనర్ ధర్మాన పద్మప్రియ మాట్లాడుతూ..సమైక్యాంధ్రే ధ్యేయంగా వైఎస్ఆర్ కుటుంబం స్ఫూర్తిగా ముందుకు సాగాలన్నారు. కేంద్ర పాలకమండ లి సభ్యుడు కణితి విశ్వనాథం మాట్లాడుతూ కేం ద్ర ప్రభుత్వం కళ్లుండి చూడలేకపోతోందని దు య్యబట్టారు. బగ్గు లక్ష్మణరావు మాట్లాడుతూ కేసీఆర్ మరో బలి చక్రవర్తి కానున్నాడన్నారు. ఎంవీ కృష్ణారావు మాట్లాడుతూ తెలుగుజాతిని విడగొట్టేలా చంద్రబాబు లేఖ ఇవ్వడం దారు ణమన్నారు.మాజీ మంత్రి తమ్మినేని సీతారాం మాట్లాడుతూ టీడీపీ ప్రజాప్రతినిధులు, చంద్రబాబు రాజీనామాలు చేయకుండా కాంగ్రెస్‌తో చీకటి ఒప్పందాలు కుదుర్చుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. టెక్కలి సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ సొంత రాష్ట్రాల్లో ఎందుకూ పనికిరానివారు విభజన ప్రకటన చేయడం సిగ్గుచేటన్నారు. శ్రీకాకు ళం సమన్వయకర్త ైవై.వి.సూర్యనారాయణ మా ట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరమే తెలంగాణ గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నిం చారు. మరో సమన్వయకర్త వరుదు కల్యాణి మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేంత వరకు పోరాటం ఆగదన్నారు పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు హనుమంతు కిరణ్‌కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సమైక్య ఉద్యమం లో భాగస్వాములు కావాలన్నారు. మహిళా విభాగం జిల్లా కన్వీనర్ బొడ్డేపల్లి పద్మజ మాట్లాడుతూ టీడీపీ, కాంగ్రెస్‌లు నాటకాలాడుతున్నాయన్నారు. పార్టీ పట్టణ శాఖ అధ్యక్షుడు ధర్మాన ఉదయ్‌భాస్కర్ మాట్లాడుతూ ప్రారంభం నుం చి ప్రజల పక్షాన పోరాడుతున్నది వైఎస్ఆర్ సీపీయేనన్నారు. పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు అం ధవరపు సూరిబాబు మాట్లాడుతూ సమైక్య రా ష్ట్రం కోసం పోరాడాలన్నారు. ఈ సమావేశంలో మాజీ శాసనసభ్యుడు ప్రసాదరాజు, కుంబా రవిబాబు, సుజయ్‌కృష్ణ రంగారావు, పాలవలస రాజశేఖరం, పిరియా సాయిరాజ్, కిల్లి రామ్మోహనరావు, మార్పు ధర్మారావు, జేఎం శ్రీను, రెహమాన్, ఎన్ని ధనుంజయ, పైడి రాజారావు, దుప్పల రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. -
సిక్కోలులో షర్మిలకు బ్రహ్మరథం..!
సమైక్య శంఖారావానికి అడుగడుగునా జన నీరాజనం రాజాంలో తీవ్ర ఎండ, శ్రీకాకుళంలో వర్షంలోనూ సభలు సక్సెస్ సమైక్యనినాదానికి జైకొట్టిన జనం చంద్రబాబుపై విమర్శలకు అనూహ్య స్పందన వేర్పాటు వాదులను తరిమికొట్టాలని షర్మిల పిలుపు సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: అడుగడుగునా జననీరాజనం.. ప్రసంగాలకు ఆద్యంతం చప్పట్లు.. వెరసి ‘సమైక్య శంఖారావం’ జిల్లాలో విజయవంతమైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి షర్మిలకు అడుగడుగునా సిక్కోలు వాసులు బ్రహ్మరథం పట్టారు. రాజాం మండలం కొత్తపేట వద్ద శ్రీకాకుళం జిల్లాలోకి సోమవారం ప్రవేశించిన ఆమె బస్సు యాత్రకు వైఎస్ఆర్ సీపీ జిల్లా నాయకులు, నియోజకవర్గ సమన్వయకర్తలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి మధ్యాహ్నం రా జాంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్దకు చేరుకునే సరికి, కూడలి కిక్కిరిసేలా..జనం నిండిపోయారు. భానుడు నిప్పులు కక్కుతున్నా..షర్మిల ప్రసంగాన్ని ఆద్యంతం విన్నారు. సు మారు అరగంటకు పైగా ఆమె మాట్లాడారు. సమైక్యాంధ్ర కోసం మాట్లాడిన ప్రతి మాటకు జనం జేజేలు పలికారు. అభివృద్ధి, సీమాంధ్రుల జీవితాలతో హైదరాబాద్ ముడిపడినవైనాన్ని వివరిస్తున్నపుడు జనంనిశ్శబ్ధంగా విన్నారు. దారిపొడవునా... శ్రీకాకుళం-విజయనగరం జిల్లా సరిహద్దు కొత్తపేట నుంచి రాజాం, అంతకాపల్లి, మొగిలివలస, పొగిరి, జి.సిగడాం మండలం పాలఖండ్యాం, పొందూరు మండలంలోని పొం దూరు, రాపాక, వావిళ్లపల్లి కోట కూడలి, కృష్ణాపురం, రెడ్డిపేట, లోలుగు, నర్సాపురం, కేశవదాసుపురం, చిలకపాలెం జంక్షన్ మీదుగా ఎచ్చెర్ల, నవభారత్ జంక్షన్ మీదుగా షర్మి ల శ్రీకాకుళం చేరుకున్నారు. 45 కిలోమీటర్ల పొడవున జ నం నీరాజనం పట్టారు. శ్రీకాకుళం చేరుకోగానే.. పలు ప్రాంతాలకు చెందిన పార్టీ కార్యకర్తలు మోటారు సైకిళ్లతో ర్యాలీగా ముందుకు సాగా రు. ఆమదాలవలస నుంచి పార్టీ నాయకుడు మాజీ మంత్రి తమ్మినేని సీతారాం మోటారు సైకిల్ ర్యాలీతో శ్రీకాకుళం చేరుకున్నారు. అనంతరం డేఅండ్‌నైట్ జంక్షన్ నుంచి ఏడు రోడ్ల కూడలికి షర్మిల చేరుకున్నారు. జిల్లాలో మూడు నియోజకవర్గాలు, రెండు మునిసిపాలిటీలు,ఆరు మండలాల్లో యాత్ర సాగింది. ఎండ, వానలను లెక్కచేయక... రాజాంలో సభ జరుగుతున్న సమయంలో విపరీతమైన ఎండ ఉంది. జనం చెమటలు కక్కుతూ షర్మిల ప్రసంగాన్ని విన్నారు. ముగిసే వరకు ఒక్కరు కూడా కదలలేదు. ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుం దనుకున్న సభ మధ్యాహ్నం 12.30 గంటల నుంచి ఒంటిగంట వరకు జరిగింది. ఎండ ను లెక్కచేయకుండా ప్రజలు సమైక్య నినాదాన్ని వినిపించారు. శ్రీకాకుళంలో సభ ప్రా రంభం కాకముందు నుంచే వర్షం ప్రారంభమైంది. ముందుగా కొద్దిపాటి వర్షం కువడంతో జనం కొం తమంది రోడ్లపైనుంచి వెళ్లిపోయారు. షర్మిల పట్టణంలోకి రాగానే వేల సంఖ్యలో రోడ్లపైకి వచ్చారు. ఆమె మాట్లాడుతున్నంత సేపూ..వర్షంలోనే ఉండిపోయారు. చంద్రబాబుపై విమర్శలకు అనూహ్య స్పందన ‘చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో డీల్ పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై నిందలు మోపుతున్నాడు. ఆ పరిస్థితే ఉంటే ఇంతకాలం జగన్మోహన్ రెడ్డి జైల్లో వుండే వారా’ అని షర్మిల ప్రశ్నించారు. చంద్రబాబు అవినీతి బాగోతా లు బయటకు రాకుండా ఉండేందుకు అధికార పార్టీకి సహకరిస్తూ కాంగ్రెస్‌తో డీల్ పెట్టుకొని జనానికి అన్యాయం చేశారని మండిపడ్డారు. అధికారంలో ఉన్నా, లేకున్నా కాం గ్రెస్‌కు సహకరిస్తున్నది చంద్రబాబేనని దుయ్యబట్టారు. చంద్రబాబుపై పది ప్రశ్నలు సంధించిన షర్మిల కాంగ్రెస్‌తో డీల్ కుదుర్చుకున్నదెవరో ప్రజలే చెప్పాలన్నారు. దీంతో జనం నుంచి అనూహ్య స్పందన లభించింది. కుట్ర రాజకీయాలకు తెరతీసిన వ్యక్తి చంద్రబాబని విమర్శిం చారు. అధికారం కోసం మామను చంపి, ఆయన పెట్టిన పార్టీని లాక్కున్న చంద్రబాబు రాష్ట్రం నుంచి సీమాంధ్రను వేరు చేయడంలోనూ కేంద్రంతో డీల్ కుదుర్చుకున్నారన్నారు. రాజధాని కట్టుకునేందుకు ఐదారు లక్షల కోట్లరూపాయలు ఇవ్వాలంటూ చంద్రబాబు కేంద్రాన్ని కోరారని, అంటే హైదరాబాద్‌ను ఐదారు లక్షల కోట్లకు అమ్మివేస్తున్నానని చెప్పకనే చెప్పార నడంతో జనం నుంచి అనూహ్య స్పందన లభించింది. వేర్పాటు వాదులను తరిమికొట్టాలి రాష్ట్రాని విడగొట్టాల్సిందిగా లేఖలు ఇచ్చి, ఇప్పుడు రెండు ప్రాంతాల్లోనూ ప్రచారం చేయాలంటూ కార్యకర్తలకు చెబుతున్న చంద్రబాబు, అన్నీ తెలిసినా కళ్లు మూసుకు కూర్చు న్న కిరణ్‌కుమార్‌రెడ్డిలను సీమాంధ్రులు తరిమికొట్టాలని షర్మిల పిలుపునిచ్చారు. ఇద్దరూ సీమాంధ్రులకు ద్రోహం చేశారన్నారు. మొదటి నుంచీ వైఎస్ఆర్సీపీ సమైక్యవాదానికి కట్టుబడి ఉందని, ఒకవేళ రాష్ట్రాన్ని విడగొట్టాల్సి వస్తే సమన్యాయం చేయాలని, లేకుంటే సమైక్యంగా ఉంచాలని మొదటి నుంచీ డిమాండ్ చేస్తున్నామన్నారు. వైఎస్ఆర్సీపీ, సీసీఎం, ఎంఐఎంలు రాష్ట్ర విభజనను వ్యతిరేకించాయన్నారు. చంద్రబాబు వెంటనే కేంద్రానికి ఇచ్చిన లేఖను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సిక్కోలులో ముగిసిన సమైక్య శంఖారావం సమైక్య శంఖారావం బస్సు యాత్ర 14వరోజు సోమవారం శ్రీకాకుళం జిల్లాలో ముగిసింది. కడప జిల్లా ఇడుపులపాయ నుంచి బయలుదేరిన షర్మిల సీమాంధ్ర జిల్లాల్లో పర్యటించారు. శ్రీకాకుళంలో రాత్రి ఏడు గంటలకు సభ ముగిసింది. -
ఇవి రాజకీయాలా?
బాబు పాదయాత్రలు, బస్సుయాత్రలు, ఢిల్లీయాత్రలు ప్రజల కోసం కాదు.. జగన్‌ను అడ్డుకోవటం కోసమే జగన్ బెయిల్‌ను అడ్డుకోవటానికి ఢిల్లీ వెళ్తున్నామని నిస్సిగ్గుగా చెప్తున్నారు.. అసలు మీరు ఏ రకం నాయకులు? ఇవి రాజకీయాలా? తెలంగాణ ఇచ్చేసుకోండని బ్లాంకు చెక్కు ఇచ్చిన చంద్రబాబు.. హత్య చేసి ఆ శవం మీదే పడి వెక్కివెక్కి ఏడ్చినట్టు ప్రజలను మభ్యపెట్టటానికి ఇప్పుడు మొసలి కన్నీళ్లు కారుస్తున్నారు ఓట్లు, సీట్ల కోసమే కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజించాలనుకుంటోంది టీడీపీ సహా ఐదు పార్టీలు విభజనకు అనుకూలమని చెప్తే.. వైఎస్సార్ సీపీ, సీపీఎం, ఎంఐఎంలు విభజనకు ఎప్పుడూ అనుకూలమని చెప్పలేదు ఇప్పటికీ మించిపోయింది లేదు.. బాబుకు చిత్తశుద్ధి ఉంటే విభజనకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కుతీసుకోవాలి.. తాను రాజీనామా చేసి, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో రాజీనామాలు చేయించాలి విశాఖ, విజయనగరం జిల్లాల్లో షర్మిల 13వ రోజు సమైక్య శంఖారావం యాత్ర ప్రజల సమస్యలను కాదని.. జగన్ బెయిల్‌ను అడ్డుకునే బాబు యత్నాలపై షర్మిల ఈసడింపు సమైక్య శంఖారావం నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘చంద్రబాబు గారు పాదయాత్రలు చేసినా, బస్సు యాత్రలు చేసినా, ఢిల్లీ యాత్రలు చేస్తున్నా ప్రజల కోసం కాదు కేవలం జగన్మోహన్రెడ్డి గారిని అడ్డుకోవటం కోసం. తొమ్మిది సంవత్సరాలు అధికారపక్షంలో ఉండి, మరో తొమ్మిది సంవత్సరాలు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఆఖరికి ఒక్క యువకుడ్ని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేకుండా ఈ రోజు ఆయన బెయిల్‌ను అడ్డుకోవటానికి ఢిల్లీకి వెళ్తున్నామని నిస్సిగ్గుగా చెప్తున్నారంటే... అసలు మీరు ఏ రకం నాయకులు? ఒక అమాయకుడ్ని తీసుకెళ్లి 16 నెలలుగా నేరం రుజువు కాకుండానే జైలు పాలు చేశారంటే.. ఛీ..! ఇవి రాజకీయాలా?! మీలాంటి వాళ్లు మనుషులా?’’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల ఈసడించుకున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే డిమాం డ్తో షర్మిల పూరించిన సమైక్య శంఖారావం యాత్ర ఆదివారం 13వ రోజు విశాఖ, విజయనగరం జిల్లాల్లో సాగింది. విశాఖపట్నం నగరం, విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో జరిగిన సమైక్య శంఖారావం సభలకు భారీ ఎత్తున తరలి వచ్చిన ప్రజలను ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు. ఈ ప్రసంగాల సారాంశం ఆమె మాటల్లోనే... మీ ఎమ్మెల్యేలను బేరం పెట్టటానికి వెళుతున్నారా బాబూ? ‘‘చంద్రబాబు గారు ఇప్పుడు ఢిల్లీకి వెళ్తున్నారట. ఎందుకు వెళ్తున్నారు చంద్రబాబు గారు అంటే.. రాష్ట్రంలో చాలా అనిశ్చితి నెలకొని ఉందట.. ఈ అనిశ్చితిని దూరం చేయాలని కాంగ్రెస్ పార్టీని అడగటానికని చంద్రబాబునాయుడు గారు ఢిల్లీకి వెళ్తున్నారట. అసలు ఈ అనిశ్చితికి కారణం మీరు కాదా చంద్రబాబు గారూ? తెలంగాణకు అనుకూలంగా లేఖలు ఇచ్చి ఈ అనిశ్చితికి కారణమై మళ్లీ ఏ మొఖం పెట్టుకొని అనిశ్చితి దూరం చేయటానికి వెళ్తున్నానని చెప్తున్నారు చంద్రబాబు గారూ? తెలుగుదేశం పార్టీలో ఉన్న రెండు ప్రాంతాల నాయకులను తీసుకొని ఢిల్లీకి వెళ్తున్నానని చంద్రబాబు గారు అంటారు. అంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చంద్రబాబు గారు? మీది రెండు కళ్ల సిద్ధాంతం అని చెప్పాలనుకుంటున్నారా? మీది రెండు నాలుకల ధోరణి అని చెప్పాలనుకుంటున్నారా? అందుకనే ఎప్పుడూ రెండు వేళ్లు ఊపుకుంటూ తిరుగుతారా? ఏం చెప్పాలనుకుంటున్నారు? సమైక్యానికి అనుకూలం అని చెప్పాలనుకుంటున్నారా? లేక విభజనకు అనుకూలం అని చెప్పాలనుకుంటున్నారా? లేకపోతే నాకు ఇంతమంది ఎమ్మెల్యేలు, ఇంత మంది ఎంపీలు ఉన్నారు చూడండీ అని, వాళ్లను అమ్మకానికి పెట్టి.. జగన్మోహన్రెడ్డి గారికి ఎలాగైనా బెయిల్ రాకుండా చూడ్డానికి బేరాలు కుదుర్చుకోవటానికి ఢిల్లీ వెళ్తున్నారా? లేకపోతే ఒక కిరణ్‌కుమార్‌రెడ్డి గారికే కాదు, ఒక బొత్స సత్యనారాయణ గారికే కాదు నాకు కూడా సోనియాగాంధీ గారు అధిష్టానమే.. మీరు ఏది ఆదేశిస్తే అది శిరసా వహిస్తాను.. అని చెప్పి కాళ్ల మీద పడి.. నామీద మట్టుకు ఏ కేసులు, విచారణలు జరగకుండా చూడండి అని వేడుకోవడానికి వెళ్తున్నారా? చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో కలిపేసిన ట్టు మీరు కూడా తెలుగుదేశం పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపేసుకుంటే కనీసం మీకు కేంద్రమంత్రి పదవైనా వస్తుందేమో..! ఈ రాష్ట్రంలో ఉంటే మీకు ఏదీ రాదు చంద్రబాబు గారు. తెలంగాణను ఇచ్చేసుకుంటే ఇచ్చేసుకోండి అని బ్లాంకు చెక్కు ఇచ్చేసినట్లు లేఖలు రాసి ఇచ్చేశారు ఈ చంద్రబాబుగారు. హత్య చేసి ఆ శవం మీదే పడి వెక్కివెక్కి ఏడ్చినట్టు చంద్రబాబు గారు తెలంగాణకు అనుకూలంగా లేఖనిచ్చేసి ఇప్పుడు ప్రజలను మభ్యపెట్టటానికి మొసలి కన్నీళ్లు కారుస్తున్నారు. సీఎం, బొత్సలు దిష్టిబొమ్మల్లాగా కూర్చున్నారు... ఓట్లు, సీట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విడగొట్టాలనుకుంటోంది. కనీసం ఈ ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్తారని అనుకుంటే దిష్టిబొమ్మలాగా కూర్చున్నారు. బొత్సగారు ఈ ప్రాంతం నాయకుడు కదా! పీసీసీ అధ్యక్షుడు కదా! ఈయన గారైనా ఏమైనా సమాధానం చెప్తాడా? అంటే.. ఈయన గారు కూడా ఇంకో దిష్టి బొమ్మలాగా నిల్చొని చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేస్తుందని, ఆ విషయం గురించి మన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గారికి, బొత్స గారికి చాలా స్పష్టంగా ఎప్పటి నుంచో తెలుసని కేంద్రమంత్రి కిశోర్‌చంద్రదేవ్ గారు స్వయంగా చెప్పారు. అంటేముఖ్యమంత్రికి, బొత్స గారికి ఈ కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రాన్ని చీల్చబోతున్న సంగతి తెలిసి కూడా.. అడ్డుకుంటే వీళ్ల పదవులు ఎక్కడ పోతాయోనని అడ్డుకోనూ లేదు. బొత్స గారూ..! కాంగ్రెస్ పార్టీ చీల్చుతుందన్న సంగతి ముందు మీకు తెలుసా? తెలియదా? ముందే తెలిస్తే ఎందుకు అడ్డుకోలేదు? కనీసం ప్రజలకు ఎందుకు చెప్పలేదు? లేకపోతే మీకు చెప్పకుండానే చేసి ఉంటే.. దిగ్విజయ్‌సింగ్ గారు మన రాష్ట్రాన్ని చీల్చుతున్నామని ప్రకటన చేసిన రోజే మీరు ఎందుకు రాజీనామాలు చేసి ప్రజల పక్షాన నిలబడలేదు? మేం విభజనకు ఎప్పుడూ మద్దతు పలకలేదు... తెలుగుదేశం పార్టీతో సహా ఐదు పార్టీలు ఈ విభజనకు మద్దతు పలికితే.. మూడు పార్టీలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సీపీఎం, ఎంఐఎం పార్టీలు ఎప్పుడూ విభజనకు మద్దతు పలకలేదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉన్నా, ఇంకా ఆయనలో ఏమాత్రం నిజాయితీ మిగిలి ఉన్నా తాను కూడా తెలంగాణకు వ్యతిరేకమేనని.. ఇప్పటికైనా ఈ మూడు పార్టీల పక్షాన నాలుగో పార్టీగా చేరి, కోట్ల మంది ప్రజలకు క్షమాపణ చెప్పి, తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవాలి. కోట్ల మంది ప్రజలకు అన్యాయం చేయటం తగదని ఆయన రాజీనామా చేయాలి. తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలను రాజీనామా చేయించాలి. అంతవరకు చంద్రబాబు గాని, టీడీపీ నాయకులు గాని సీమాంధ్రలో అడుగుపెట్టడానికి వీలు లేదని ప్రజలంతా తరిమి కొట్టాలి. ఆ రోజే వారు కూడా రాజీనామా చేసి ఉంటే... హఠాత్తుగా ఏ పరిష్కారం చూపించకుండా కాంగ్రెస్ పార్టీ ఓట్లు, సీట్ల కోసం మన రాష్ట్రాన్ని చీలుస్తున్నామని ప్రకటించిన వెంటనే, ఆ సంకేతాలు పంపించిన వెంటనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అంతమంది నాయకులు రాజీనామాలు చేశారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి గారు కూడా రాజీనామాలు చేశారు.. నిరాహార దీక్షలు చేశారు. లేఖల మీద లేఖలు రాసి.. ఇది అన్యాయం మా రాష్ట్రాన్ని విడగొట్టొద్దని ఈ రోజుటి వరకు పోరాటం చేస్తూనే ఉన్నారు. కానీ ఎంత మంది టీడీపీ, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజీనామాలు చేసిన రోజునే వీళ్లందరూ రాజీనామాలు చేసుంటే.. కాంగ్రెస్ పార్టీ తన నిర్ణయాన్ని మార్చుకునేలా ఒత్తిడి పెరిగేది. కానీ పదవీ మత్తులో మునిగి తేలుతున్న ఈ కాంగ్రెస్, టీడీపీ నాయకులు ప్రజలకంటే తమ పదవే ముఖ్యమని మళ్లీ నిరూపించుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నుంచీ ఒకే మాట చెప్పింది. ఏ ఒక్క ప్రాంతానికి అన్యాయం జరగకుండా, ఒక కన్నతండ్రిలాగా ఆలోచన చేయాలి. ఆ ఆలోచన మీరు ఎలా చేస్తారో మీ ఉద్దేశం ఎలా ఉందో ముందు అందరినీ పిలవండి అని పదేపదే చెప్పింది, లేఖలు రాసింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఇది ప్రజాస్వామ్య దేశమనే విషయాన్నే మరచి వ్యవహరించింది. అందుకే మళ్లీ చెప్తున్నాం. న్యాయం చేయ డం మీ ఉద్దేశమే కాదని తేలిపోయింది కనుక రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. సమైక్య రాష్ట్రం కోసం జగనన్న నాయకత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రజల తరఫున నిలబడి పోరాటం చేస్తుందని మీకు మాటిస్తున్నాం.’’ -
కలిసుంటే ఎవరికి నష్టం.. విభజిస్తే ఎవరికి లాభం?
ఓట్లు, సీట్ల కోసమే కాంగ్రెస్ రాష్ట్రాన్ని విడగొట్టాలనుకుంటోంది: షర్మిల రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడమే మేలని శ్రీకృష్ణ కమిటీ చెప్పింది తెలుగుగడ్డ మీద వైఎస్సార్ లాంటి సీఎం రాకూడదనే కాంగ్రెస్ కుతంత్రాలు వైఎస్సార్ అంతటి సత్తా ఉన్న సీఎం లేకపోబట్టే రాష్ట్రానికి ఈ గతి పట్టింది తెలుగుదేశం పార్టీ సహా ఐదు పార్టీలు విభజనకు అనుకూలమని చెప్తే.. వైఎస్సార్ సీపీ, సీపీఎం, ఎంఐఎం ఎప్పుడూ అనుకూలమని చెప్పలేదు ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు.. చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా.. తను తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖ వెనక్కు తీసుకోవాలి తను రాజీనామా చేసి.. తన ఎమ్మెల్యేలు, ఎంపీలతో రాజీనామాలు చేయించాలి ‘సమైక్య శంఖారావం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘విభజన విషయంలో యూపీఏ ప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీని నియమించింది. నిపుణులతో కూడిన ఈ కమిటీ దాదాపు సంవత్సరం రోజులు కూలంకషంగా పరిశీలన చేసిన తరువాత రాష్ట్రాన్ని విభజించడం మంచిది కాదని, ఒక్కటిగా ఉంచడమే మంచి పరిష్కారమని చాలా స్పష్టంగా చెప్పింది. ఈ కమిటీ సూచనలను పక్కనపెట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రాన్ని ఎందుకు విభజించాలని అనుకుంటోంది? మన రాష్ట్రాన్ని విభజిస్తే ఎవరికి లాభం? తెలుగు జాతి అంతా ఒక్కటిగా ఉంటే ఎవరికి నష్టం? తెలుగు గడ్డ మీద వైఎస్సార్‌లాంటి ఇంకో ముఖ్యమంత్రి ఆవిర్భవిస్తే తట్టుకోలేని బలహీనత ఎవరికి ఉంది?’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల ప్రశ్నించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే డిమాండ్‌తో షర్మిల చేపట్టిన ‘సమైక్య శంఖారావం’ బస్సు యాత్ర శనివారం 12వ రోజు తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో సాగింది. కాకినాడ, పాయకరావుపేటలలో నిర్వహించిన ‘సమైక్య శంఖారావం’ సభలకు భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ప్రసంగాల సారాంశం ఆమె మాటల్లోనే.. మంచి పనులతో ఓట్లు సంపాదించుకోలేకే.. ‘‘మంచి పనుల ద్వారా ఓట్లు, సీట్లు సంపాదించుకునే సత్తా కాంగ్రెస్‌కు ఉండి ఉంటే.. ఈరోజు రాష్ట్రానికి ఈ గతి పట్టి ఉండేది కాదు. మంచి పనుల ద్వారా ఓట్లు, సీట్లు సంపాదించుకోలేని ఈ పార్టీ.. చెడు చేసైనా సరే వాటిని సంపాదించుకోవాలని, కేవలం స్వార్థ రాజకీయాల కోసమని రాష్ట్రాన్ని విభజించడానికి పూనుకొంది. రాజశేఖరరెడ్డి బతికే ఉంటే.. మన రాష్ట్రానికి ఈ గతి పట్టి ఉండేది కాదని సాక్షాత్తూ ప్రధాన మంత్రి సహా కోట్లమంది ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఒక్క రాజశేఖరరెడ్డి మాత్రమే విభజన అనే గొడ్డలికి అడ్డంగా నిలబడి మన రాష్ట్రాన్ని విడిపోకుండా కాపాడారు. ఎవరికి అన్యాయం జరిగినా సరిదిద్దాలి.. అసలు అన్యాయం ఎందుకు జరిగిందో తెలుసుకోవాలని రోశయ్య కమిటీని వేశారు. 2009లో టీఆర్ఎస్, టీడీపీ పొత్తు కుదుర్చుకున్నా, నాలుగు పార్టీలు కలిసి ఏకధాటిగా యుద్ధం చేసినా రాజశేఖరరెడ్డి ఒకే ఒక్కడిగా నిలబడి ఒంటి చేత్తో పోరాటం చేశారు. గెలిచి మన రాష్ట్ర ప్రజలకు కావాల్సింది సంక్షేమం, అభివృద్ధే తప్ప విభజన, ప్రత్యేక రాష్ట్రం కాదని నిరూపించారు. ఇప్పుడు అంత సత్తా ఉన్న సీఎం లేకపోబట్టే రాష్ట్రానికి ఈ గతి పట్టింది. గారడీ ముఖ్యమంత్రి: ఇప్పుడూ ఉన్నారండి ఒక ముఖ్యమంత్రి.. పని తక్కువ, ప్రచారం ఎక్కువ చేసుకునే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి. రాజశేఖరరెడ్డి ఈయన్ను స్పీకర్‌గా చేయకపోతే అసలు ఈయన సోనియా కంటికి కనిపించి ఉండేవారు కాదు. ముఖ్యమంత్రి అంతకంటే అయ్యుండేవారు కాదు. ఆ కృతజ్ఞత కిరణ్‌కుమార్‌రెడ్డికి లేదు. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచీ రాజశేఖరరెడ్డి పథకాలకు తూట్లు పెట్టారు, ప్రతి ఉద్దేశాన్నీ విమర్శించారు. ప్రతి పన్నూ పెంచుకుంటూనే పోయారు. పేదవాడు పాపం బతుకు భారమై.. అప్పులపాలైపోయి అల్లాడిపోతుంటే తనకు పట్టనట్టే ఉన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రాన్ని చీలుస్తుందన్న సంగతి కిరణ్ కుమార్‌రెడ్డికి ఎప్పుడో తెలుసు.. అయినా అడ్డు చెబితే పదవి ఎక్కడ ఊడిపోతుందేమోనని అడ్డు కూడా చెప్పలేదు. ఆఖరికి దిగ్విజయ్ సింగ్ ప్రకటన చేసే వరకూ ఆ విషయాన్ని గోప్యంగా ఉంచారు. జూలై నెలలోనే ఈయన రాజీనామా చేసేసి ఉంటే.. విభజన ప్రక్రియ మొదలు పెట్టిన రోజే ఆగిపోయేది. కానీ ఈయనకు పదవి మీద ఉన్న మోజు అంతటిది. సొంతంగా కష్టపడి సంపాదించుకున్న పదవి కూడా కాదది. అనుకోకుండా వచ్చిన పదవి కదా.. అందుకే దాన్ని వదులుకోవాలంటే.. ప్రాణాలు వదులుకున్నంత కష్టంగా ఉంది. ఢిల్లీలో ఒక మాట చెప్తారు.. ఇక్కడ ఒక మాట చెప్తారు.. అంతా గారడీచేస్తారని కాంగ్రెస్‌వాళ్లే ఆయన గురించి చెప్తారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా తెరచాటున రాజకీయం చేస్తానంటారు ఈ సీఎం. పదవిలో ఉండి.. ధైర్యంగా ముందడుగు వేసి ఏమీ చేయలేని ఈ వ్యక్తి తెరచాటు రాజకీయం చేస్తారట.. దాన్ని నమ్మి కాంగ్రెస్ వాళ్లు ఈయనకు భజన చేస్తారట! ఇదిగో చంద్రబాబు రాసిచ్చేసిన లేఖ: మన ఖర్మకొద్దీ పాలక పక్షం ఇలా ఏడిస్తే.. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు తెలంగాణ ఇచ్చేసుకుంటే ఇచ్చేసుకోండి అని బ్లాంక్ చెక్‌లా లేఖ ఇచ్చేసి మొసలి కన్నీరు కారుస్తున్నారు. (చంద్రబాబు నాయుడు కేంద్రానికి పంపిన లేఖ చూపిస్తూ) ఇది అదే. 18 అక్టోబర్ 2008న రాశారు. దీంట్లో ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే.. ‘తెలుగుదేశం పార్టీ తరఫున మేం అందరం కూర్చొని చర్చించుకున్నాం. మా కోర్‌కమిటీ మీటింగ్‌లో మేం అంగీకరించిన విషయం ఏమిటంటే.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాల్సిందే. తెలంగాణను ఇచ్చేయాల్సిందే’ అని చంద్రబాబు స్వయంగా కేంద్రానికి రాసిచ్చిన లేఖ ఇది. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మన రాష్ట్రాన్ని విభజించే సాహసం చేస్తోందంటే దానికి కారణం చంద్రబాబు ఆ విభజనకు పలికిన మద్దతే. హత్య చేసి ఆ శవం మీదే పడి వెక్కివెక్కి ఏడ్చినట్టు చంద్రబాబు.. తెలంగాణకు అనుకూలంగా లేఖనిచ్చేసి మొసలి కన్నీళ్లు కారుస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్టీఆర్ తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాపాడటం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే ఈ చంద్రబాబు.. దాన్ని తెలుగు ద్రోహుల పార్టీగా మార్చేశారు. మీ రాష్ట్రాన్ని చీల్చుతున్నామని దిగ్విజయ్‌సింగ్ ప్రకటన చేస్తే ఈయన ప్రెస్‌మీట్ పెట్టి.. కోట్ల మంది ప్రజలకు జరుగుతున్న అన్యాయం గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా రూ.4 లక్షల కోట్లకు హైదరాబాద్‌ను అమ్మకానికి పెట్టేశారు. తెలుగుదేశం పార్టీ సహా ఐదు పార్టీలు ఈ విభజనకు అనుకూలంగా ఉన్నామని చెప్తే... వైఎస్సార్ కాంగ్రెస్ , సీపీఎం, ఎంఐఎం విభజనకు అనుకూలం అని ఎప్పుడూ చెప్పలేదు. ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు.. చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ఏమాత్రం నిజాయితీ ఉన్నా తాను కూడా విభజనకు వ్యతిరేకం అని ఈ మూడు పార్టీల పక్షాన నాలుగో పార్టీగా నిలబడాలి. తను రాజీనామా చేసి.. తన ఎమ్మెల్యేలు, ఎంపీలతో రాజీనామాలు చేయించాలి. తెలంగాణకు అనుకూలంగా తను ఇచ్చిన లేఖ వెనక్కి తీసుకోవాలి. అప్పుడే రాజీనామాలు చేసుంటే: కాంగ్రెస్ మన రాష్ట్రాన్ని చీల్చుతున్నామని సంకేతాలు పంపించిన వెంటనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు. గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, అధ్యక్షులు జగన్మోహన్రెడ్డి కూడా రాజీనామాలు చేశారు. తమ వంతు పోరాటంగా నిరాహార దీక్షలు చేశారు. లేఖల మీద లేఖలు రాసి ఇది అన్యాయం.. మా రాష్ట్రాన్ని విడగొట్టొద్దని ఈ రోజు వరకు పోరాటం చేస్తూనే ఉన్నారు. కానీ ఎంత మంది టీడీపీ, కాంగ్రెస్‌కు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు? వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేసిన రోజే వీరంతా రాజీనామా చేసి ఉంటే.. రాష్ట్ర విభజన ప్రక్రియ ఎప్పుడో ఆగిపోయేది.’’ ఎన్జీవోలకు అండగా ఉంటాం ‘‘రైతులు, కార్మికులు, ఉద్యోగస్తులు, వ్యాపారులు, విద్యార్థులు, మహిళలు సైతం ఈ రోజు తమ పనులు మానుకొని ఆందోళనలు చేస్తుంటే ఈ కాంగ్రెస్ పార్టీ పట్టనట్టే చూస్తోంది. మరీ ముఖ్యంగా ఎన్జీవో సభ్యులైతే ఊరు ఊరునా ఉద్యమాలు చేస్తున్నారు. ఒకవైపేమో వారి ఆవేదనకు కారణమైన ఈ కిరణ్ సర్కారు వారిని వేధిస్తోంది. ఇంకోవైపేమో వారికి జీతాలు కూడా ఇవ్వను అంటోంది. పాపం ఆ ఎన్జీవోలకు ఈ ప్రభుత్వం జీతాలు ఇవ్వకపోయినా వారి ఇళ్లలో వారికి, పిల్లలకు ఎంత ఇబ్బంది కలుగుతున్నా వారి ఉద్యమ స్ఫూర్తి ఈరోజు వరకు చెక్కు చెదరలేదు. నిజంగా ఆ ఎన్జీవో సంఘాలు, సభ్యుల కృషిని, త్యాగాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మనస్ఫూర్తిగా అభినందిస్తోంది. ఆ ఎన్జీవో సంఘాల సభ్యులకు.. ఉద్యమంలో పాలుపంచుకుంటున్న వారందరికీ వెంటనే జీతాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. ఈ ప్రభుత్వం వారికి జీతాలు ఇవ్వకపోయినా ఇంకొన్ని నెలల్లోనే వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం కూడా ఖాయం. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తరువాత వారికి జీతాలు ఇవ్వడమే కాకుండా వారిని గౌరవిస్తూ ఒక నెల బోనస్ కూడా ఇస్తుందని జగనన్న తరఫున మేం మాట ఇస్తున్నాం. ఒక్కజీతాల విషయంలోనే కాదు, ప్రతి విషయంలోనూ ఆ ఎన్జీవో సంఘాల సభ్యులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుందని మాట ఇస్తున్నాం.’’ -షర్మిల -
చీకటి ఒప్పందాల కోసమే.. చంద్రబాబు ఢిల్లీ పర్యటన : షర్మిల
టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై షర్మిల ధ్వజం బాబూ.. జగన్ బెయిల్ తెరమీదికి వచ్చిందనే కదా మీరు ఢిల్లీ వెళుతున్నది? చీకట్లోనే చిదంబరాన్ని కలిసి ఒప్పందాలు చేసుకోవడానికే కదా? గతంలో ఇలాగే మీ ఎంపీలు వెళ్లి ‘సాక్షి’ ఆస్తులను అటాచ్ చేయించి బెయిల్‌ను అడ్డుకోలేదా? నాడు మీరు జెడ్‌ప్లస్ కమాండోలను కూడా కాదని మీడియా కళ్లుగప్పి చీకట్లో చిదంబరాన్ని కలవలేదా? తెలంగాణపై లేఖను వెనక్కు తీసుకోకుండా ఢిల్లీ ఎందుకెళుతున్నారు? ఓట్లు, సీట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించాలని చూస్తోంది టీడీపీ సహా ఐదు పార్టీలు విభజనకు అనుకూలంగా ఉంటే.. వైఎస్సార్ సీపీ, ఎంఐఎం, సీపీఎం ఏనాడూ అనుకూలమని చెప్పలేదు చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే.. లేఖను వెనక్కు తీసుకొని, రాజీనామాలు చేయాలి ‘సమైక్య శంఖారావం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి బెయిల్ విషయంలో రాజకీయాలు చేయడానికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి ఢిల్లీ వెళుతున్నారని జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల విమర్శించారు. ‘‘చంద్రబాబుగారూ.. జగన్మోహన్రెడ్డి బెయిల్ విషయం మళ్లీ తెరమీదికి వచ్చిందన్న కారణంతోనే మీరు ఇప్పుడు ఢిల్లీకి వెళ్లడం లేదా? మళ్లీ చీకట్లోనే చిదంబరాన్ని కలిసి చీకటి ఒప్పందాలు చేసుకోవడానికి కాదా మీరు ఢిల్లీకి వెళుతున్నది? కాంగ్రెస్ వారితో కలిసి కుట్రలు పన్నడానికి కాదా చంద్రబాబూ మీరు ఢిల్లీకి వెళుతున్నది?’’ అని షర్మిల ప్రశ్నించారు. ‘‘గతంలో ఇలాగే ఒక్క రోజులో బెయిల్ ఇస్తున్నారనగా.. మీ ఎంపీలను పంపి ‘సాక్షి’ ఆస్తులను అటాచ్ చేయించి బెయిల్‌ను అడ్డుకున్నారు. గతంలో మీ జెడ్‌ప్లస్ పోలీస్ కమాండోలు కూడా అవసరం లేదని చెప్పి.. మీడియా కళ్లు గప్పి మరీ చిదంబర రహస్య భేటీలు జరిపారు. మళ్లీ అందుకే కదా బాబూ ఇప్పుడు మీరు ఢిల్లీ వెళుతున్నది? లేకపోతే జెడ్‌ప్లస్ కేటగిరీ ఉన్న మీరు.. ఒక దొంగలా అందరి కళ్లూ గప్పి.. అహ్మద్ పటేల్‌ను కలవడానికి వెళుతున్నారా? లేకపోతే సోనియా గాంధీ కాళ్ల మీదపడి జగన్మోహన్రెడ్డికి ఎలాగైనా సరే బెయిల్ రాకుండా చూడండి అని వేడుకోవడానికి వెళుతున్నారా?’’ అని ఆమె నిలదీశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే డిమాండ్‌తో షర్మిల చేపట్టిన ‘సమైక్య శంఖారావం’ బస్సు యాత్ర 11వ రోజు శుక్రవారం తూర్పు గోదావరి జిల్లాలో సాగింది. రావులపాలెం, అమలాపురం పట్టణాల్లో ‘సమైక్య శంఖారావం’ సభలకు భారీ ఎత్తున తరలి వచ్చిన ప్రజలను ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు. ఈ ప్రసంగాల సారాంశం ఆమె మాటల్లోనే.. దమ్ముంటే సమాధానం చెప్పండి.. ‘‘ఇప్పుడు చంద్రబాబు ఢిల్లీకి వెళ్తారట. తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కు తీసుకోకుండా ఢిల్లీకి వెళ్లి ఏం ప్రయోజనం చంద్రబాబూ? నిజం చెబుతారని కాదుగానీ.. అసలు మీరు ఢిల్లీకి ఎందుకు వెళుతున్నారో చెప్పండి. తెలంగాణకు అనుకూలంగా మీరు ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోకుండా.. ఎందుకు ఢిల్లీకి వెళ్తున్నారో మీకు దమ్ముంటే సమాధానం చెప్పండి. మొన్న సమైక్య రాష్ట్రం కోసం ఉద్యమిస్తున్న కొంత మంది చంద్రబాబు దగ్గరకు వెళ్లి ఆయన యాత్రను అడ్డుకున్నారట. దానికి చంద్రబాబు వారి మీద మండిపడ్డారట. మీ అంతు చూస్తానని బెదిరించారట. మీ ఇళ్లలోనే కాదు, మీ ఊళ్లలో ఎలా ఉంటారో చూస్తానని చంద్రబాబు వారిని బెదిరించారట. చంద్రబాబూ.. మీరు మీ ఇష్టమొచ్చినట్లు మాట్లాడతారా? అసలు ఏమనుకుంటున్నారండీ మీ గురించి మీరు? విభజనకు కారణమే చంద్రబాబు.. తెలంగాణను ఇచ్చేసుకుంటే ఇచ్చేసుకోండి అని ఒక బ్లాంకు చెక్కు మీద సంతకం పెట్టినట్టు లేఖలు రాసిచ్చేశారు చంద్రబాబు. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మన రాష్ట్రాన్ని విభజించే సాహసం చేస్తోందంటే దానికి కారణం చంద్రబాబు విభజనకు పలికిన మద్దతే. హత్య చేసి ఆ శవం మీదే పడి వెక్కివెక్కి ఏడ్చినట్టు చంద్రబాబు తెలంగాణకు అనుకూలంగా లేఖనిచ్చేసి ఇప్పుడు మొసలి కన్నీళ్లు కారుస్తున్నారు. మన రాష్ట్రంలో 60 శాతం మంది ప్రజలకు గొప్ప అన్యాయం జరుగుతుంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఈయన చేయాల్సిన పని పాలకపక్షం కాలర్ పట్టుకొని నిలదీయడం. కానీ, దిగ్విజయ్ సింగ్ ప్రకటన చేసిన వెంటనే ఈయన ప్రెస్‌మీట్ పెట్టి.. హైదరాబాద్‌ను రూ.4 లక్షల కోట్లకు అమ్మకానికి పెట్టారంటే ఇంతకంటే దుర్మార్గుడు, ఇంతకంటే ద్రోహి ఇంకొకరు ఉంటారా? తెలుగుదేశం పార్టీ సహా ఐదు పార్టీలు ఈ విభజనకు అనుకూలంగా ఉన్నామని చెప్తే.. మూడు పార్టీలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సీపీఎం, ఎంఐఎం విభజనకు అనుకూలమని ఏనాడూ చెప్పలేదు. చంద్రబాబుకు నిజంగా ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ఆయనకు ఏమాత్రం నిజాయితీ ఉన్నా తెలంగాణకు తను కూడా వ్యతిరేకం అని ఈ మూడు పార్టీల పక్షాన నాలుగో పార్టీగా నిలబడాలి. ప్రజలకు క్షమాపణ చెప్పి తెలంగాణకు అనుకూలంగా తను ఇచ్చిన లేఖ వెనక్కి తీసుకోవాలి. ఆయన, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా రాజీనామాలు చేసి నిరసన తెలియజేయాలి. సీఎం తెలిసీ గోప్యంగా ఉంచారు.. కేవలం ఓట్ల కోసం, సీట్ల కోసం, టీఆర్ఎస్ను తమలో కలుపుకొనైనా సరే కేంద్రంలో లబ్ధి పొంది రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేసుకోవాలనే ఏకైక లక్ష్యంతో కోట్ల మంది ప్రజలకు అన్యాయం చేయడానికి పూనుకొంది కాంగ్రెస్ పార్టీ. తెలుగువారి ఓట్లు దండుకొని తెలుగువారిపైనే వేటు వేసింది. తెలుగువారి భిక్షతో కేంద్రంలో, రాష్ట్రంలో గద్దెనెక్కి కూర్చొని తెలుగువారికే వెన్నుపోటు పొడిచింది. ఇంత జరుగుతోంటే ఈ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి దిష్టిబొమ్మ లాగా కూర్చున్నారు. మన రాష్ట్రాన్ని చీల్చుతున్నారనే సంగతి ఈయనకు ఎప్పుడో తెలుసు. ఆయినా దానికి అడ్డు చెప్తే ఈయన పదవి పోతుందనుకొని అడ్డు చెప్పలేదు, దిగ్విజయ్‌సింగ్ వచ్చి మన రాష్ట్రాన్ని చీల్చుతున్నామని ప్రకటన చేసేంత వరకు కిరణ్‌కుమార్‌రెడ్డి ఆ విషయాన్ని గోప్యంగా ఉంచారు. విభజన సంకేతాలు రాగానే వైఎస్సార్ సీపీ రాజీనామాలు.. హఠాత్తుగా ఎలాంటి పరిష్కారమూ చూపించకుండానే మన రాష్ట్రాన్ని విడగొడుతున్నారన్న సంకేతాలు వచ్చిన వెంటనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అంతమంది నాయకులు రాజీనామాలు చేశారు. గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి రాజీనామాలు చేసి.. నిరాహార దీక్షలు కూడా చేశారు. లేఖల మీద లేఖలు రాస్తూ మన రాష్ట్రాన్ని విడగొట్టొద్దని, రాష్ట్రానికి అన్యాయం చేయొద్దని ఈ రోజు వరకు పోరాటం చేస్తూనే ఉన్నారు. కానీ సీమాంధ్రకు చెందిన ఎంతమంది కాంగ్రెస్, టీడీపీ నాయకులు రాజీనామాలు చేసి ప్రజల తరఫున గొంతెత్తారు?’’ బాబూ.. మీకు అంటువ్యాధులున్నాయా? ‘‘చంద్రబాబును చూసి వైఎస్ రాజశేఖరరెడ్డి భయపడేవారని చంద్రబాబు అంటున్నారట. చంద్రబాబూ.. మిమ్మల్ని చూసి ఎవరైనా భయపడటానికి మీకేమైనా అంటు వ్యాధులు ఉన్నాయా? మిమ్మల్ని చూస్తే వైఎస్సార్ ఒక జోకర్‌ను చూసినట్టు ఎంతలా నవ్వుకునేవారో మీకు గుర్తులేదా? చంద్రబాబూ.. సాక్షి టీవీకి చెప్పి ఆ క్లిప్పింగులు వేయించమంటారా?’’ - షర్మిల -
'న్యాయం చేసే సత్తా లేనప్పుడు.. విభజించే హక్కు మీకెక్కడిది'
ఓట్ల కోసం, సీట్లకోసం కోట్లాదిమందికి కాంగ్రెస్ అన్యాయం చేసింది అని తూర్పు గోదావరి జిల్లా అమలాపురం బహిరంగసభలో షర్మిల మండిపడ్డారు. అమలాపురంలో ఏర్పాటు చేసిన సమైక్య శంఖారావం బహిరంగ సభలో మాట్లాడుతూ... సీమాంధ్ర ప్రజల తరఫున ఎంతమంది టీడీపీ, కాంగ్రెస్ నాయకులు నిలబడ్డారు షర్మిల అని ప్రశ్నించారు. వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు రాజీ నామాలు చేసిన రోజునే... మిగతా పార్టీల ఎమ్మెల్యేలూ చేసుంటే విభజన ప్రక్రియ ఆగి ఉండేది అని అన్నారు. న్యాయం చేసే సత్తా మీకు లేనప్పుడు.. విభజించే హక్కు మీకెక్కడిది అని షర్మిల నిప్పుల చెరిగారు. రాష్ట్రాన్ని సమైక్యాంగానే ఉంచాలని వైఎస్ఆర్ సీపీ డిమాండ్ చేస్తోంది అని అన్నారు. నిర్బంధంలో ఉండికూడా తన కష్టాన్ని పక్కనపెట్టి... ప్రజలకోసం వారంరోజులు జగనన్న నిరాహారదీక్ష చేశారని షర్మిల తెలిపారు. జైల్లో ఉన్నా... జనంలో ఉన్నా జగనన్న జననేతేనని, కోట్లాదిమందికి అన్యాయం జరిగితే జగనన్న చేతులు కట్టుకుని చూస్తూ ఊరుకోరు అని అన్నారు. జగనన్నను ఆపడం ఈ టీడీపీ, కాంగ్రెస్ నాయకుల తరం కాదు సవాల్ విసిరారు. విద్యార్థులకోసం ఓ తండ్రిలా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఆలోచన చేశారు.. ప్రభుత్వమే చదివిస్తుందని వారికి భరోసా కల్పించారు...లక్షలాది మంది లక్షణంగా చదువుకున్న ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నారు అని అమలాపురం బహిరంగసభలో షర్మిల అన్నారు. ఏ పథకాలనైనా వైఎస్ఆర్ అద్భుతంగా నడిపి చూపించారని, చంద్రబాబు గారు 16లక్షల మందికి పింఛన్లు ఇస్తే...వైఎస్ఆర్ 71 లక్షల మందికి పింఛన్లు ఇచ్చారని తెలిపారు. ఇంటింటికీ పథకాలనందించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ఆర్ అని.. ఆయన హయంలో ఏ ఒక్క ఛార్జీ పెంచని సీఎంగా వైఎస్ఆర్ తనదైన పాలనను అందించారని ఆమె వివరించారు. ప్రజలపై భారం మోపడం ఇష్టం లేకనే వైఎస్ ఏ ఛార్జీ పెంచలేదని, వైఎస్ హయాంలో ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి గ్యాస్ ఛార్జీ పెరిగిందా అని ప్రశ్నించారు. శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు మంచినీరు ఎక్కడుందని, హైదరాబాద్‌ను తీసేసుకున్నామంటున్నారు, సీమాంధ్రులకు భాగం లేదని హైదరాబాద్ నుంచి వెళ్లిపోమంటున్నారని, హైదరాబాద్ అభివృద్ధి 60ఏళ్లు పట్టిందని.. కొత్త రాజధాని అభివృద్ధికి పదేళ్లు ఎలా సరిపోతాయని కాంగ్రెస్ ను నిలదీశారు. చేసిందంతా చేసి ఇప్పుడు సీఎం కిరణ్ ప్రజలకే ప్రశ్నలు సంధిస్తున్నారని, ఇంత జరుగుతున్నా చంద్రబాబులో ఏ చలనమూ లేదని.. అసలు విభజనకు కారణమే చంద్రబాబు అని విమర్శించారు. తెలంగాణకు అనుకూలంగా చంద్రబాబు లేఖ రాసిచ్చారని, హత్యచేసి శవం మీద పడి వెక్కివెక్కి ఏడ్చినట్టుంది చంద్రబాబు తీరు అని ఎద్దేవా చేశారు. బాబులో నిజాయతీ ఉంటే చేసిన తప్పుకు క్షమాపణ కోరాలని, తను, తమ ఎంపీ, ఎమ్మెల్యేలు రాజీ నామాలు చేశాకే సీమాంధ్రలో అడుగుపెట్టాలని డిమాండ్ చేశారు. విభజనకు వైఎస్ఆర్ కాంగ్రెస్, సీపీఎం, ఎంఐఎం ఏనాడూ అంగీకరించలేదని అమలాపురం బహిరంగసభలో షర్మిల తెలిపారు. -
సమైక్యాంధ్రకు మద్దతుగా కదలిరండి
అమలాపురం, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్రకు మద్దతుగా ‘సమైక్య శంఖారావం’ పేరిట వైఎ స్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన బస్సుయాత్రను జిల్లాలో విజయవంతం చేయాలని ఆ పార్టీ నాయకులు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈనెల 13న అమలాపురం హైస్కూల్ సెంటరు వద్ద షర్మిల పాల్గొనే బహిరంగ సభ జరగనున్న ప్రాంతాన్ని పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి, సీజీసీ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, అమలాపురం పార్లమెంట్ నియోజకర్గ కో ఆర్డినేటర్ గొల్ల బాబూరావు, నియోజకవర్గ కో ఆర్డినేటర్లు చింతా కృష్ణమూర్తి, మిండగుదిటి మోహన్ బుధవారం పరిశీలించారు. సభకు వేలాది మంది ప్రజలు హాజరయ్యే అవకాశమున్నందున వారికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని బోస్ సూచించారు. బహిరంగ సభలో జిల్లా నాయకుల కోసం ఏర్పాటు చేసే వేదిక, లైట్లు, మైకుల ఏర్పాటు వంటి వాటిపై పట్టణ పార్టీ కన్వీనర్ మట్టపర్తి నాగేంద్ర, పట్టణ యూత్ కన్వీనర్ గనిశెట్టి రమణ్లాల్తో చర్చించారు. జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు పెన్మత్స చిట్టిరాజు, బొల్లవరపు ఛాయాదేవి, కుడుపూడి త్రినాథ్, మట్టా వెంకట్రావు, నల్లా రమేష్, మట్టా వెంకట్రావు, పితాని చిన్న, యల్లిమల్లి రాజ్‌మోహన్, మాజీ ఎంపీపీ భూపతిరాజు సుదర్శనబాబు పాల్గొన్నారు. -
అలుపెరగని పోరు
సాక్షి, నెల్లూరు : జిల్లావాసులు 42 రోజులుగా ఏ మాత్రం అలసిపోకుండా సమైక్య ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. షర్మిల సమైక్య శంఖారావం బస్సు యాత్ర సక్సెస్ అయింది. ఆమె పర్యటన మంగళవారంతో ముగిసింది. విభజన జరిగితే సీమాంధ్ర తీవ్రంగా నష్టపోతుందని, అందువల్ల సమైక్యంగా ఉంచాలని షర్మిల డిమాండ్ చేశారు. సీమాంధ్రుల ప్రయోజనాలను ఏమాత్రం పట్టించుకోని ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు వైఖరిని ఆమె తూర్పార బట్టారు. సింహపురివాసులు అలుపెరగకుండా ఉద్యమాన్ని దీక్షా దక్షతతో ముందుకు నడిపిస్తున్నారు. ఈ నెల 12 నుంచి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయనున్నట్టు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. జిల్లా వ్యాప్తంగా మంగళవారం ర్యాలీలు, రాస్తారోకోలు, మానవహారాలు, నిరసన దీక్షలు కొనసాగాయి. ఆర్టీసీ బంద్ కొనసాగుతోంది. జన జీవనం స్తంభించింది. షర్మిల సమైక్య శంఖారావం బస్సు యాత్ర మంగళవారం బోగోలు మండలం కడనూతలలోని ఆర్ఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల నుంచి ప్రకాశం జిల్లాలోకి చేరుకుంది. నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యులు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులురెడ్డి, జూపూడి ప్రభాకర్‌రావు తదితరులు వెంట ఉన్నారు. సోమవారం ఆర్ఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన వినాయక చవితి పర్వదిన వేడుకల్లో షర్మిల పాల్గొన్నారు. సమైక్యాంధ్ర సాధన కోసం నీటిపారుదల శాఖ ఉద్యోగులు ఇరిగేషన్ కార్యాలయం నుంచి బాలాజీనగర్, గాంధీ బొమ్మ సెంటర్ల మీదుగా ఎల్ఐసీ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. బ్యాంకులను మూయించారు. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ నుంచి వీఆర్సీ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని విసృ్తతం చేసేందుకు నెల్లూరు జెడ్పీ సమావేశ మందిరంలో జిల్లా అధికారులు, ఉపాధ్యాయులు, ఎంపీడీఓలు సంయుక్త సమావేశం నిర్వహించి కార్యాచరణ రూపొందించారు. ఉదయగిరిలో ఉపాధ్యాయ, ఉద్యోగ జేఏసీ రిలే దీక్షలు 14వ రోజు కొనసాగాయి. బస్టాండ్ సెంటర్లో తిరుమలాపురం పంచాయతీకి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు 21వ రోజు దీక్షలు చేపట్టారు. ఆత్మకూరులో యూటీఎఫ్ ఆధ్వర్యంలోమున్సిపల్ బస్టాండ్ వద్ద ఉపాధ్యాయులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. పొదలకూరు సెంటర్లో సమైక్యాంధ్రకు మద్దతుగా యూటీఎఫ్‌కు చెందిన ఉపాధ్యాయులు మంగళవారం రిలే దీక్షలు నిర్వహించారు. ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం నిరాహార దీక్షా శిబిరాన్ని సందర్శించారు. కోవూరులో ఎన్జీఓ హోంలో న్యాయవాదులు, ఇందుకూరుపేట మండలం గంగపట్నంలో గ్రామస్తుల నిరాహార దీక్ష చేపట్టారు. సూళ్లూరుపేట జేఏసీ ఆధ్వర్యంలో రైల్వేగేట్ సెంటర్లో రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి. మండలంలోని తీర ప్రాంత వాసులు, షార్ కాంట్రాక్ట్ కార్మికులు సూళ్లూరుపేట-శ్రీహరికోట రోడ్డులో అటకానితిప్ప వద్ద షార్కు వెళ్లే వాహనాలను అడ్డుకున్నారు. రాస్తారోకో, వంటావార్పు నిర్వహించారు. దీక్ష కొనసాగుతుండగా మండలంలోని అన్నమేడు జిల్లా పరిషత్ హైస్కూల్ ఉపాధ్యాయుడు బట్టా శంకర్‌యాదవ్ సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేస్తూ కుప్పకూలి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. శంకర్‌యాదవ్ మృతికి సంఘీభావంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కావలిలో ప్రభుత్వ జేఏసీ, సమైక్యాంధ్ర జేఏసీ, సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి, ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు కొసాగుతున్నాయి. -
షర్మిలకు ఆత్మీయ ఆదరణ
బిట్రగుంట/కావలి, న్యూస్‌లైన్: దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిలకు ప్రజలు అడుగడుగునా ఆత్మీయ నీరాజనం పలికారు. కావలిలో సమైక్యశంఖారావం బస్సుయాత్ర అనంతరం ఆదివారం రాత్రి కడనూతలలోని రామిరెడ్డి సుబ్బరామిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో బస చేసిన ఆమె ప్రకాశం జిల్లాలో సమైక్య శంఖారావం బస్సు యాత్రకు మంగళవారం ఉదయం 10 గంటలకు బయలుదేరారు. నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ కావలి నియోజకవర్గ సమన్వయకర్త రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డితో పాటు పలు నియోజకవర్గాల సమన్వయకర్తలు, నాయకులు షర్మిలను కలిసి సమైక్య శంఖారావం బస్సుయాత్రపై మాట్లాడారు. తనను కలిసిన పార్టీ ముఖ్యనేతలతో సమైక్య ఉద్యమంపై ఆమె చర్చించారు. ప్రకాశం జిల్లాలో సమైక్యశంఖారావం బస్సుయాత్ర ప్రారంభించేందుకు బయలుదేరగా ఘనంగా వీడ్కోలు పలికారు. ప్రకాశం జిల్లాకు చెందిన నేతలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్, తదితర ముఖ్యనేతలు కళాశాల వద్ద నుంచే ఆత్మీయ స్వాగతం పలికి షర్మిలను ఆహ్వానించారు. -
పార్టీలు తోడైతేనే ఉద్యమానికి ఊపు!
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్ర సమైక్యత కోసం సాహసోపేతంగా ఉద్యమిస్తున్న ఉద్యోగులు, ప్రజా సంఘాలను కచ్చితంగా అభినందిచాల్సిందే. ఈ సమస్యకు అంతిమ పరిష్కారం రాజకీయ ప్రక్రియే. కాబట్టి రాజకీయ పార్టీలు తమ నిర్ణయాలను మార్చుకొని కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తేనే రాష్ట్రం సమైక్యంగా ఉంటుంది. ఉద్యోగస్తులు కూడా సమైక్యవాదంపై నిలబడి పోరాడుతున్న రాజకీయ పార్టీలను కలుపుకుపోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వారి శ్రమకు రాజకీయ పార్టీలు తోడైతే ఉద్యమం విజయవంతమవుతుంది’ అని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ నేత ఏవీ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఉధృతంగా సాగుతున్న సమైక్య ఉద్యమం మరింత బలోపేతం కావాలంటే రాజకీయ పార్టీల భాగస్వామ్యం కచ్చితంగా అవసరమన్నారు. టీఆర్ఎస్ ఇదే వ్యూహాన్ని అమలు పరిచిందన్నారు. సమైక్య ఉద్యమంపై శనివారం ‘సాక్షి టీవీ’ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ప్రవీణ్ మాట్లాడారు. రాష్ట్ర సమైక్యత కోసం ఏపీఎన్జీవోలు, ప్రజా సంఘాలు చేస్తున్న ఉద్యమం ప్రపంచ చరిత్రలోనే అత్యంత అరుదైనదన్నారు. అయితే, రాజకీయ పార్టీల విధానాలు, సిద్ధాంతాల్లో మార్పు తేకుండా ఎన్ని ఉద్యమాలు చేసినా ఉపయోగం లేదన్నారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ఏపీఎన్జీవోల సభ పార్టీలపై ఒత్తిడి తెచ్చే దిశగా సాగుతుందని తాను భావించానన్నారు. కానీ, ఈ మహాసభలో ఆ ప్రయత్నం జరగలేదన్నారు. ఇప్పటికైనా సమైక్య ఉద్యమం మరింత ముందుకెళ్లాలంటే రాజకీయ పార్టీలన్నింటిపైనా ఆ దిశగా ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. ఇప్పటికే సమైక్య గళాన్ని గట్టిగా వినిపిస్తున్న పార్టీలను కలుపుకెళ్లాల్సిన అవసరం రానున్న రోజుల్లో ఉంటుందన్నారు. ఉద్యమాలు ఎంతవరకూ చేయాలి.. ఎంతవరకూ రాజకీయంగా ముందుకెళ్లాలనే దానిపై టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరించి, రాష్ట్రాన్ని ఈ దుస్థితికి తీసుకొచ్చిందని ప్రవీణ్ వివరించారు. బొత్సది బాధ్యతారాహిత్యం సమ్మె 30 రోజులేంటి, 365 రోజులు జరపడానికి సిద్ధంగా ఉండాలని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ మాట్లాడటం అతని బాధ్యతా రాహిత్యానికి నిదర్శనమని ప్రవీణ్ దుయ్యబట్టారు. విభజన నిర్ణయం తీసుకున్నది కాంగ్రెస్ పార్టీ, యూపీఏ ప్రభుత్వం కనుక.. ప్రజల ఆకాంక్ష మేరకు కేంద్రంపై ఒత్తిడి చేయాల్సిన ఆ పార్టీ నేతలు, కేంద్ర మంత్రులు ఆ పని చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర మంత్రులు, అధికారంలో ఉన్న నేతలు రాజీనామా చేస్తే జాతీయ స్థాయిలో స్పందన రావడమే కాక విభజన ప్రక్రియ ఆగుతుందన్నారు. ఇప్పటికైనా ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నట్లు, ప్రజల ఆలోచనకు అనుగుణంగా మంత్రులంతా రాజీనామా చేయాలని సూచించారు. లేనిపక్షంలో రానున్న రోజుల్లో నియోజకవర్గాల్లో అడుగుపెట్టే పరిస్థితి కూడా ఉండదని హెచ్చరించారు. బావోద్వేగాల ప్రాతిపదికగానే విభజించాలనుకుంటే ఇప్పటికే పంజాబ్ ప్రత్యేక దేశంగా మారేదని, ఎల్టీటీఈ కోరినట్లు శ్రీలంక ఎప్పుడో రెండుగా చీలిపోయేదని గుర్తుచేశారు. అవాస్తవ పునాదుల మీద తెలంగాణ ఉద్యమం నిర్మితమైందన్నారు. కేసీఆర్ అవాస్తవాలతో యువతను, తెలంగాణ ప్రజానీకాన్ని తప్పుదోవ పట్టించారని ప్రవీణ్ విమర్శించారు. -
కాపీ కొట్టడానికి చంద్రబాబు గాంధీనా?
‘‘నిన్న చంద్రబాబు అన్నారట.. ఆయనను చూసి మేం యాత్రలు చేస్తూ ఆయన్ను కాపీ కొడుతున్నామట. చంద్రబాబూ.. మిమ్మల్ని కాపీ కొట్టడానికి మీరేమైనా మహాత్మా గాంధీనా? లేక మదర్ థెరెస్సానా? ఎక్కడైనా మీ బొమ్మ కనిపిస్తే.. తల్లిదండ్రులు తమ బిడ్డలకు ఆ బొమ్మ చూపించి.. ‘ఇదిగో ఈయన చంద్రబాబు.. కన్న తల్లిదండ్రులను ఏనాడూ పట్టించుకోలేదు. మంత్రి పదవినిచ్చి, పార్టీలో హోదానిచ్చి, పిల్లనిచ్చిన సొంత మామకే వెన్నుపోటు పొడిచాడు. మీరు ఇలా తయారుకాకండి’ అని తల్లులు ఉగ్గుపాఠాలు చెప్పే క్యారెక్టర్ మీది చంద్రబాబూ! అలాంటిది రాజశేఖరరెడ్డి వారసత్వంతో పుట్టిన ఈ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిన్ను కాపీ కొడుతుందా? చంద్రబాబును కాపీకొట్టే ఖర్మ ఎవ్వరికీ పట్టకూడదు. నిజానికి రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేసినప్పుడు.. ఈ పాదయాత్రలెందుకంటూ హేళన చేసింది నువ్వుకాదా? రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి అయిపోయాడని ఆయన పాదయాత్రను కాపీకొట్టి ముఖ్యమంత్రి అయిపోవాలనుకున్నది నువ్వు కాదా? రాజశేఖరరెడ్డి ఉచిత విద్యుత్ ఇస్తే.. కరెంటు తీగలు బట్టలు ఆరేసుకోవడానికి తప్ప దేనికీ పనికిరావని అన్నది నువ్వు కాదా? పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తే.. ఇప్పడు ‘నేనూ దానిని చేస్తా’నని చెయ్యెత్తి చెప్పిన మాట నిజంకాదా? వైఎస్ ఆరోగ్యశ్రీని అమలు చేస్తే.. ఆసుపత్రుల్లో యూజర్ చార్జీలు వసూలు చేసిన నువ్వు ఇప్పుడు ‘నేనూ ఆరోగ్య శ్రీ అమలు చేస్తా’నని అంటూ ఆ పథకాన్ని కాపీ కొట్టాలని చూస్తున్నది నువ్వు కాదా? చంద్రబాబూ మీరు ఎంత కాపీ కొట్టాలనుకున్నా.. ఎన్ని వాతలు పెట్టుకున్నా.. పులి పులే.. నక్క నక్కే.’’ - షర్మిల -
రాష్ట్ర విభజనతో సాగునీటి కష్టాలు
డోన్, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనతో సీమాంధ్రలో సాగునీటి కష్టాలు ఎక్కువవుతాయని వైఎస్ఆర్సీపీ డోన్ నియోజకవర ్గసమన్వయకర్త బుగ్గన రాజారెడ్డి తెలిపారు. సమైక్య శంఖారావం పేరుతో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన బస్సుయాత్ర గురువారం డోన్‌కు చేరింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బుగ్గన మాట్లాడారు. రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్రప్రాంతంలోని ప్రజలకు ఇబ్బందులు తప్పవన్నారు. తెలంగాణ ప్రాంతం నుంచే కృష్ణా, గోదావరి నదులు ప్రవహిస్తాయని.. వీటిపై ఆనకట్టలు కడితే కిందనున్న ప్రాంతం ఎడారిగా మారుతుందని తెలిపారు. కృష్ణా జాలాలపై ఆధారపడి జీవనం సాగించే రాయలసీమ ప్రాంతం పూర్తిగా కరవుకోరల్లో చిక్కుకుంటుందని చెప్పారు. ఇవ్వన్నీ తెలిసి కూడా.. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ మంత్రులు తమ పదవులు పట్టుకొని వేలాడుతున్నారని విమర్శించారు. వీరంతా రాజీనామా చేసి కేంద్రంపై వత్తిడి పెంచి ఉంటే రాష్ట్ర విభజన ప్రకటన వచ్చేది కాదని తెలిపారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఎన్టీరామారావు ఆనాడు కృషి చేస్తే.. నేడు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజనకు అనుకూలంగా కేంద్రానికి లేఖ ఇచ్చి ఆ గౌరవాన్ని మంటకలిపారని ఆరోపించారు. చంద్రబాబు లేఖ ఇవ్వడం వల్లే రాష్ట్రాన్ని విభజించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధపడిందన్నారు. నాడు కర్నూలు రాజధానిని త్యాగం చేశామని, నేడు హైదరాబాద్‌ను వదులుకునేందుకు సిద్ధంగా లేమని పేర్కొన్నారు. రాజధాని నగరం ఒక్కరి సొత్తుకాదని, అన్ని ప్రాంతాల ప్రజలు దానిని అభివృద్ధి చేశారనని వివరించారు. సమైక్యాంధ్ర కోసమే షర్మిల బస్సుయాత్ర చేపట్టారని, ఆమె అడిగే ప్రశ్నలకు చంద్రబాబునాయుడు, కాంగ్రెస్ పెద్దలు సమాధానం చెప్పాలన్నారు. అనంతరం నాగలిని షర్మిలకు బహూకరించారు. బస్సుయాత్రలో వైఎస్ఆర్సీపీ నాయకులు ధర్మవరం సుబ్బారెడ్డి, శ్రీరాములు, రామకృష్ణారెడ్డి, సురేంద్రనాథ్‌రెడ్డి, నాగభూషణంరెడ్డి, బాబుల్‌రెడ్డి, బోరెడ్డిశ్రీరామిరెడ్డి, చిట్యాలరాజు తదితరులు పాల్గొన్నారు. -
కర్నూలు జిల్లాలో షర్మిల యాత్ర
షర్మిల చేపట్టిన సమైక్య శంఖారావం బస్సుయాత్ర గురువారం కర్నూలు జిల్లాలో సాగింది. -
కదిరిలో సమైక్య శంఖారావం
-
రేపు అనంతపురం జిల్లాలో సమైక్య శంఖారావం
అనంతపురం: రేపు అనంతపురం జిల్లాలో షర్మిల సమైక్యశంఖారావం బస్సు యాత్ర షెడ్యూల్‌ను వైఎస్ఆర్ సిపి నేతలు రవీంద్రనాధ్‌రెడ్డి, తలసిల రఘురాం, శంకరనారాయణ విడుదల చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న డిమాండ్‌తో ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ షర్మిల బస్సు యాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. కదిరి బస్టాండ్ సర్కిల్లో ఉదయం 10.30 గంటలకు సమైక్య శంఖారావం బహిరంగ సభ జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటలకు హిందూపురం అంబేద్కర్ సర్కిల్లో బహిరంగ సభ జరుగుతుంది. సాయంత్రం 6 గంటలకు అనంత నందిని హోటల్ వద్ద బహిరంగ సభ జరుగుతుందని వారు వివరించారు.