కాపీ కొట్టడానికి చంద్రబాబు గాంధీనా?
Published Sun, Sep 8 2013 2:16 AM | Last Updated on Sat, Jul 28 2018 3:21 PM
‘‘నిన్న చంద్రబాబు అన్నారట.. ఆయనను చూసి మేం యాత్రలు చేస్తూ ఆయన్ను కాపీ కొడుతున్నామట. చంద్రబాబూ.. మిమ్మల్ని కాపీ కొట్టడానికి మీరేమైనా మహాత్మా గాంధీనా? లేక మదర్ థెరెస్సానా? ఎక్కడైనా మీ బొమ్మ కనిపిస్తే.. తల్లిదండ్రులు తమ బిడ్డలకు ఆ బొమ్మ చూపించి.. ‘ఇదిగో ఈయన చంద్రబాబు.. కన్న తల్లిదండ్రులను ఏనాడూ పట్టించుకోలేదు. మంత్రి పదవినిచ్చి, పార్టీలో హోదానిచ్చి, పిల్లనిచ్చిన సొంత మామకే వెన్నుపోటు పొడిచాడు. మీరు ఇలా తయారుకాకండి’ అని తల్లులు ఉగ్గుపాఠాలు చెప్పే క్యారెక్టర్ మీది చంద్రబాబూ! అలాంటిది రాజశేఖరరెడ్డి వారసత్వంతో పుట్టిన ఈ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిన్ను కాపీ కొడుతుందా? చంద్రబాబును కాపీకొట్టే ఖర్మ ఎవ్వరికీ పట్టకూడదు.
నిజానికి రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేసినప్పుడు.. ఈ పాదయాత్రలెందుకంటూ హేళన చేసింది నువ్వుకాదా? రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి అయిపోయాడని ఆయన పాదయాత్రను కాపీకొట్టి ముఖ్యమంత్రి అయిపోవాలనుకున్నది నువ్వు కాదా? రాజశేఖరరెడ్డి ఉచిత విద్యుత్ ఇస్తే.. కరెంటు తీగలు బట్టలు ఆరేసుకోవడానికి తప్ప దేనికీ పనికిరావని అన్నది నువ్వు కాదా? పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేస్తే.. ఇప్పడు ‘నేనూ దానిని చేస్తా’నని చెయ్యెత్తి చెప్పిన మాట నిజంకాదా? వైఎస్ ఆరోగ్యశ్రీని అమలు చేస్తే.. ఆసుపత్రుల్లో యూజర్ చార్జీలు వసూలు చేసిన నువ్వు ఇప్పుడు ‘నేనూ ఆరోగ్య శ్రీ అమలు చేస్తా’నని అంటూ ఆ పథకాన్ని కాపీ కొట్టాలని చూస్తున్నది నువ్వు కాదా? చంద్రబాబూ మీరు ఎంత కాపీ కొట్టాలనుకున్నా.. ఎన్ని వాతలు పెట్టుకున్నా.. పులి పులే.. నక్క నక్కే.’’ - షర్మిల
Advertisement
Advertisement