ప్రజాదరణ చూసి ఓర్వలేక..!
Published Tue, Sep 17 2013 2:34 AM | Last Updated on Wed, Aug 8 2018 5:41 PM
శ్రీకాకుళం,న్యూస్‌లైన్: రాష్ట్రంలో వైఎస్‌ఆర్ సీపీకి రోజురోజుకూ పెరుగుతున్న ప్రజాదరణ చూసి అధికార, ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని నరసన్నపేట శాసనసభ్యుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ వైఎస్ షర్మిల చేపట్టిన సమైక్య శంఖారావం బ స్సు యాత్ర సోమవారం శ్రీకాకుళంలో ముగి సింది. స్థానిక వైఎస్‌ఆర్ కూడలిలో నిర్వహించిన సభలో జిల్లాకు చెందిన పలువురు పార్టీ నాయకులు మాట్లాడారు. ప్రజల నుంచి దూరం చేసేం దుకే పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని అక్రమంగా జైల్లో ఉంచారని కృష్ణదాస్ మండిపడ్డారు.
అయినా వెరవకుండా..పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, షర్మిల ఆ బాధ్యతలు తీసుకోవడంతో కాంగ్రెస్, టీడీపీలు దిక్కతోచని స్థితిలో పడ్డాయన్నారు. పార్టీ జిల్లా కన్వీనర్ ధర్మాన పద్మప్రియ మాట్లాడుతూ..సమైక్యాంధ్రే ధ్యేయంగా వైఎస్‌ఆర్ కుటుంబం స్ఫూర్తిగా ముందుకు సాగాలన్నారు. కేంద్ర పాలకమండ లి సభ్యుడు కణితి విశ్వనాథం మాట్లాడుతూ కేం ద్ర ప్రభుత్వం కళ్లుండి చూడలేకపోతోందని దు య్యబట్టారు. బగ్గు లక్ష్మణరావు మాట్లాడుతూ కేసీఆర్ మరో బలి చక్రవర్తి కానున్నాడన్నారు. ఎంవీ కృష్ణారావు మాట్లాడుతూ తెలుగుజాతిని విడగొట్టేలా చంద్రబాబు లేఖ ఇవ్వడం దారు ణమన్నారు.మాజీ మంత్రి తమ్మినేని సీతారాం మాట్లాడుతూ టీడీపీ ప్రజాప్రతినిధులు, చంద్రబాబు రాజీనామాలు చేయకుండా కాంగ్రెస్‌తో చీకటి ఒప్పందాలు కుదుర్చుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. టెక్కలి సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ సొంత రాష్ట్రాల్లో ఎందుకూ పనికిరానివారు విభజన ప్రకటన చేయడం సిగ్గుచేటన్నారు.
శ్రీకాకు ళం సమన్వయకర్త ైవై.వి.సూర్యనారాయణ మా ట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరమే తెలంగాణ గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నిం చారు. మరో సమన్వయకర్త వరుదు కల్యాణి మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేంత వరకు పోరాటం ఆగదన్నారు పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు హనుమంతు కిరణ్‌కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సమైక్య ఉద్యమం లో భాగస్వాములు కావాలన్నారు. మహిళా విభాగం జిల్లా కన్వీనర్ బొడ్డేపల్లి పద్మజ మాట్లాడుతూ టీడీపీ, కాంగ్రెస్‌లు నాటకాలాడుతున్నాయన్నారు. పార్టీ పట్టణ శాఖ అధ్యక్షుడు ధర్మాన ఉదయ్‌భాస్కర్ మాట్లాడుతూ ప్రారంభం నుం చి ప్రజల పక్షాన పోరాడుతున్నది వైఎస్‌ఆర్ సీపీయేనన్నారు. పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు అం ధవరపు సూరిబాబు మాట్లాడుతూ సమైక్య రా ష్ట్రం కోసం పోరాడాలన్నారు. ఈ సమావేశంలో మాజీ శాసనసభ్యుడు ప్రసాదరాజు, కుంబా రవిబాబు, సుజయ్‌కృష్ణ రంగారావు, పాలవలస రాజశేఖరం, పిరియా సాయిరాజ్, కిల్లి రామ్మోహనరావు, మార్పు ధర్మారావు, జేఎం శ్రీను, రెహమాన్, ఎన్ని ధనుంజయ, పైడి రాజారావు, దుప్పల రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.
Advertisement