
సాక్షి, శ్రీకాకుళం: ఏడాది పాలనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల మనసులు గెలుచుకుని అందనంత ఎత్తుకు ఎదిగారని రాష్ట్ర రహదారులు,భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ కొనియాడారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సీఎం వైఎస్ జగన్ పాలన దేశంలో మిగతా రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలిచిందన్నారు. రాజకీయ విలువలు పెంచిన వ్యక్తి వైఎస్ జగన్ అని, ఆయన నాయకత్వంలో ప్రజా ప్రతినిధులుగా గర్వంగా ప్రజల మధ్య తిరగగలుగుతున్నామన్నారు.
(‘ఆ ఘనత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానిదే’)
రాజకీయ నాయకులంటే ప్రజలు ద్వేషించే స్థాయి నుంచి గౌరవించే స్థాయికి ఆయన తీసుకొచ్చారని తెలిపారు. మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్ గా ఆయన గౌరవించారన్నారు. మేనిఫెస్టో, ఎన్నికల హామీలంటే చంద్రబాబుకి లెక్కలేనితనమని విమర్శలు గుప్పించారు. కరోనా కట్టడికి అత్యధిక కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించి.. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. విద్య, వైద్య, వ్యవసాయం, ఉపాధి కల్పన ప్రాధాన్యత రంగాలుగా ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. ప్రతిపక్షం టీడీపీ పూర్తిగా ఉనికి కోల్పోయిందని, ఈర్ష్యతో అభివృద్ధికి అడ్డుపడి ప్రజల వ్యతిరేకత ను మూటగట్టుకున్నారని ధర్మాన కృష్ణదాస్ విమర్శించారు.
(టీడీపీ కుట్రలు ఫలించవు: మల్లాది)