- సమైక్య శంఖారావానికి అడుగడుగునా జన నీరాజనం
- రాజాంలో తీవ్ర ఎండ, శ్రీకాకుళంలో వర్షంలోనూ సభలు సక్సెస్
- సమైక్యనినాదానికి జైకొట్టిన జనం
- చంద్రబాబుపై విమర్శలకు అనూహ్య స్పందన
- వేర్పాటు వాదులను తరిమికొట్టాలని షర్మిల పిలుపు
సిక్కోలులో షర్మిలకు బ్రహ్మరథం..!
Published Tue, Sep 17 2013 2:22 AM | Last Updated on Wed, Aug 8 2018 5:41 PM
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: అడుగడుగునా జననీరాజనం.. ప్రసంగాలకు ఆద్యంతం చప్పట్లు.. వెరసి ‘సమైక్య శంఖారావం’ జిల్లాలో విజయవంతమైంది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి షర్మిలకు అడుగడుగునా సిక్కోలు వాసులు బ్రహ్మరథం పట్టారు. రాజాం మండలం కొత్తపేట వద్ద శ్రీకాకుళం జిల్లాలోకి సోమవారం ప్రవేశించిన ఆమె బస్సు యాత్రకు వైఎస్‌ఆర్ సీపీ జిల్లా నాయకులు, నియోజకవర్గ సమన్వయకర్తలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి మధ్యాహ్నం రా జాంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్దకు చేరుకునే సరికి, కూడలి కిక్కిరిసేలా..జనం నిండిపోయారు. భానుడు నిప్పులు కక్కుతున్నా..షర్మిల ప్రసంగాన్ని ఆద్యంతం విన్నారు. సు మారు అరగంటకు పైగా ఆమె మాట్లాడారు. సమైక్యాంధ్ర కోసం మాట్లాడిన ప్రతి మాటకు జనం జేజేలు పలికారు. అభివృద్ధి, సీమాంధ్రుల జీవితాలతో హైదరాబాద్ ముడిపడినవైనాన్ని వివరిస్తున్నపుడు జనంనిశ్శబ్ధంగా విన్నారు.
దారిపొడవునా...
శ్రీకాకుళం-విజయనగరం జిల్లా సరిహద్దు కొత్తపేట నుంచి రాజాం, అంతకాపల్లి, మొగిలివలస, పొగిరి, జి.సిగడాం మండలం పాలఖండ్యాం, పొందూరు మండలంలోని పొం దూరు, రాపాక, వావిళ్లపల్లి కోట కూడలి, కృష్ణాపురం, రెడ్డిపేట, లోలుగు, నర్సాపురం, కేశవదాసుపురం, చిలకపాలెం జంక్షన్ మీదుగా ఎచ్చెర్ల, నవభారత్ జంక్షన్ మీదుగా షర్మి ల శ్రీకాకుళం చేరుకున్నారు. 45 కిలోమీటర్ల పొడవున జ నం నీరాజనం పట్టారు.
శ్రీకాకుళం చేరుకోగానే.. పలు ప్రాంతాలకు చెందిన పార్టీ కార్యకర్తలు మోటారు సైకిళ్లతో ర్యాలీగా ముందుకు సాగా రు. ఆమదాలవలస నుంచి పార్టీ నాయకుడు మాజీ మంత్రి తమ్మినేని సీతారాం మోటారు సైకిల్ ర్యాలీతో శ్రీకాకుళం చేరుకున్నారు. అనంతరం డేఅండ్‌నైట్ జంక్షన్ నుంచి ఏడు రోడ్ల కూడలికి షర్మిల చేరుకున్నారు. జిల్లాలో మూడు నియోజకవర్గాలు, రెండు మునిసిపాలిటీలు,ఆరు మండలాల్లో యాత్ర సాగింది.
ఎండ, వానలను లెక్కచేయక...
రాజాంలో సభ జరుగుతున్న సమయంలో విపరీతమైన ఎండ ఉంది. జనం చెమటలు కక్కుతూ షర్మిల ప్రసంగాన్ని విన్నారు. ముగిసే వరకు ఒక్కరు కూడా కదలలేదు. ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుం దనుకున్న సభ మధ్యాహ్నం 12.30 గంటల నుంచి ఒంటిగంట వరకు జరిగింది. ఎండ ను లెక్కచేయకుండా ప్రజలు సమైక్య నినాదాన్ని వినిపించారు. శ్రీకాకుళంలో సభ ప్రా రంభం కాకముందు నుంచే వర్షం ప్రారంభమైంది. ముందుగా కొద్దిపాటి వర్షం కువడంతో జనం కొం తమంది రోడ్లపైనుంచి వెళ్లిపోయారు. షర్మిల పట్టణంలోకి రాగానే వేల సంఖ్యలో రోడ్లపైకి వచ్చారు. ఆమె మాట్లాడుతున్నంత సేపూ..వర్షంలోనే ఉండిపోయారు.
చంద్రబాబుపై విమర్శలకు అనూహ్య స్పందన
‘చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో డీల్ పెట్టుకొని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీపై నిందలు మోపుతున్నాడు. ఆ పరిస్థితే ఉంటే ఇంతకాలం జగన్‌మోహన్ రెడ్డి జైల్లో వుండే వారా’ అని షర్మిల ప్రశ్నించారు. చంద్రబాబు అవినీతి బాగోతా లు బయటకు రాకుండా ఉండేందుకు అధికార పార్టీకి సహకరిస్తూ కాంగ్రెస్‌తో డీల్ పెట్టుకొని జనానికి అన్యాయం చేశారని మండిపడ్డారు. అధికారంలో ఉన్నా, లేకున్నా కాం గ్రెస్‌కు సహకరిస్తున్నది చంద్రబాబేనని దుయ్యబట్టారు. చంద్రబాబుపై పది ప్రశ్నలు సంధించిన షర్మిల కాంగ్రెస్‌తో డీల్ కుదుర్చుకున్నదెవరో ప్రజలే చెప్పాలన్నారు. దీంతో జనం నుంచి అనూహ్య స్పందన లభించింది. కుట్ర రాజకీయాలకు తెరతీసిన వ్యక్తి చంద్రబాబని విమర్శిం చారు. అధికారం కోసం మామను చంపి, ఆయన పెట్టిన పార్టీని లాక్కున్న చంద్రబాబు రాష్ట్రం నుంచి సీమాంధ్రను వేరు చేయడంలోనూ కేంద్రంతో డీల్ కుదుర్చుకున్నారన్నారు. రాజధాని కట్టుకునేందుకు ఐదారు లక్షల కోట్లరూపాయలు ఇవ్వాలంటూ చంద్రబాబు కేంద్రాన్ని కోరారని, అంటే హైదరాబాద్‌ను ఐదారు లక్షల కోట్లకు అమ్మివేస్తున్నానని చెప్పకనే చెప్పార నడంతో జనం నుంచి అనూహ్య స్పందన లభించింది.
వేర్పాటు వాదులను తరిమికొట్టాలి
రాష్ట్రాని విడగొట్టాల్సిందిగా లేఖలు ఇచ్చి, ఇప్పుడు రెండు ప్రాంతాల్లోనూ ప్రచారం చేయాలంటూ కార్యకర్తలకు చెబుతున్న చంద్రబాబు, అన్నీ తెలిసినా కళ్లు మూసుకు కూర్చు న్న కిరణ్‌కుమార్‌రెడ్డిలను సీమాంధ్రులు తరిమికొట్టాలని షర్మిల పిలుపునిచ్చారు. ఇద్దరూ సీమాంధ్రులకు ద్రోహం చేశారన్నారు. మొదటి నుంచీ వైఎస్‌ఆర్‌సీపీ సమైక్యవాదానికి కట్టుబడి ఉందని, ఒకవేళ రాష్ట్రాన్ని విడగొట్టాల్సి వస్తే సమన్యాయం చేయాలని, లేకుంటే సమైక్యంగా ఉంచాలని మొదటి నుంచీ డిమాండ్ చేస్తున్నామన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ, సీసీఎం, ఎంఐఎంలు రాష్ట్ర విభజనను వ్యతిరేకించాయన్నారు. చంద్రబాబు వెంటనే కేంద్రానికి ఇచ్చిన లేఖను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
సిక్కోలులో ముగిసిన సమైక్య శంఖారావం
సమైక్య శంఖారావం బస్సు యాత్ర 14వరోజు సోమవారం శ్రీకాకుళం జిల్లాలో ముగిసింది. కడప జిల్లా ఇడుపులపాయ నుంచి బయలుదేరిన షర్మిల సీమాంధ్ర జిల్లాల్లో పర్యటించారు. శ్రీకాకుళంలో రాత్రి ఏడు గంటలకు సభ ముగిసింది.
Advertisement
Advertisement