
రాష్ట్ర ప్రజలకు విజయమ్మ బహిరంగ లేఖ
'సమైక్య శంఖారావం' పేరుతో రేపటి నుంచి షర్మిల బస్సుయాత్ర చేపడతారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రజలకు ఆమె బహిరంగ లేఖ రాశారు. ఓట్లు-సీట్లు ప్రతిపాదికన రాష్ట్రాన్ని అడ్డగోలుగా విగడొట్టాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని విజయమ్మ విమర్శించారు. ఈ తప్పిదాన్ని అడ్డుకోకుంటే చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతారని హెచ్చరించారు.
ప్రధానికి లేఖకు వైఎస్సార్ సీపీ, ఎంఐఎం, సీపీఎం కట్టుబడి ఉన్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, సీపీఐ, టీఆర్ఎస్ విభజనకు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. సమన్యాయం కోసం ప్రధానికి చంద్రబాబును లేఖ రాయమన్నా వినిపించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఓట్లు-సీట్లు రావనే స్వార్థ రాజకీయాలకు చంద్రబాబుకు పరాకాష్టగా మారారని విజయమ్మ పేర్కొన్నారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి వారసుడిగా నిజాయితీ, నిబద్ధత, విలువలతో కూడిన రాజకీయాలనే వైఎస్ జగన్ చేశారని గుర్తు చేశారు.
రాష్ట్రాన్ని ప్రాణం కంటే మిన్నగా వైఎస్ జగన్ భావించారని అన్నారు. జగన్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని అన్నారు. దరూ కలిసి సంతోషంగా ఉండే సువర్ణయుగం వస్తుందని విజయమ్మ విశ్వాసం వ్యక్తం చేశారు.