ప్యాపిలి, న్యూస్‌లైన్: మండల పరిధిలోని పోదొడ్డి గ్రామ సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 201 గొర్రెలు మృతి చెందాయి. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం నీలంపల్లి గ్రామానికి చెందిన గొర్రెల యజమానులు నారాయణస్వామి, క్రిష్ణయ్య, నాగభూషణం, పెద్దన్నలు ప్యాపిలి పరిసర ప్రాంతంలో గొర్రెలను మేపుకునేందుకు వచ్చారు. పోదొడ్డి సమీపంలోని జాతీయరహదారిపై అనంతపురం వైపు వెళ్తున్న మందపైకి ఏపీ 31 టీటీ 3567 నంబర్ గల లారీ వేగంగా దూసుకొచ్చింది. దీంతో మందలోని దాదాపు 201 గొర్రెలు మృతి చెందడంతో సుమారు రూ. 13 లక్షలు నష్టం వాటిల్లింది. ప్రమాదంలో మృతి చెందిన గొర్రెల కళేబరాల వద్ద బాధితులు కన్నీరు మున్నీరుగా విలపించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సురేష్ తెలిపారు.
బాధితులను పరామర్శించిన షర్మిల
పోదొడ్డి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గొర్రెలు మృతి చెందిన సంఘటనలో బాధితులు నారాయణస్వామి, క్రిష్ణయ్య, నాగభూషణం, పెద్దన్నలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకులు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సోదరి షర్మిల పరామర్శించారు. అనంతపురం జిల్లా నుంచి నుంచి కర్నూలు జిల్లాలోకి ప్రవేశించిన షర్మిల బస్సు యాత్ర పోదొడ్డి మీదుగా సాగింది. ఈ సందర్భంగా సంఘటనా స్థలానికి చేరుకోగానే షర్మిల బస్సు దిగి మృతి చెందిన గొర్రెలను చూసి చలించిపోయారు. బాధితులను పరామర్శించారు. వారికి రావాల్సిన పరిహారం విషయమై జిల్లా అధికారులతో మాట్లాడుతానని ఆమె హామీ ఇచ్చారు.
రోడ్డు ప్రమాదంలో 200 గొర్రెలు మృతి
Published Fri, Sep 6 2013 4:00 AM | Last Updated on Fri, Sep 1 2017 10:28 PM
Advertisement
Advertisement