రేపటి నుంచి షర్మిల బస్సు యాత్ర | Sharmila's bus yatra shedule revealed | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి షర్మిల బస్సు యాత్ర

Published Sun, Sep 1 2013 1:56 AM | Last Updated on Tue, May 29 2018 4:06 PM

Sharmila's bus yatra shedule revealed

తిరుపతిలో బహిరంగ సభ
సాక్షి, హైదరాబాద్:
అందరికీ సమన్యాయం చేయలేనప్పుడు రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలనిడిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టబోయే బస్సు యాత్ర షెడ్యూల్‌ను పార్టీ కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం, చిత్తూరు జిల్లా పార్టీ నాయకులు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి శనివారం ప్రకటించారు. ఈ మేరకు వారు మీడియాతో మాట్లాడుతూ ‘సెప్టెంబర్ 2న ఉదయం షర్మిల ఇడుపులపాయకు చేరుకొని వైఎస్సార్‌కు నివాళి అర్పిస్తారు. అదే రోజు సాయంత్రం చిత్తూరు జిల్లా తిరుపతికి చేరుకొని సాయంత్రం అక్కడ జరిగే భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. రాత్రి తిరుపతిలోనే బస చేస్తారు’ అని చెప్పారు. వారు తెలిపిన వివరాల ప్రకారం..

షర్మిల 3వ తేదీ ఉదయం చిత్తూరులో జరిగే బహిరంగ సభలో, అదే రోజు సాయంత్రం మదనపల్లి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మదనపల్లిలోనే రాత్రి బస చేస్తారు.
4వ తేదీ ఉదయం అనంతపురం జిల్లా కదిరి బహిరంగ సభలో, సాయంత్రం అనంతపురం బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతపురం పట్టణంలో రాత్రి బస చేస్తారు.
5న ఉదయం కర్నూలు జిల్లా డోన్ బహిరంగ సభలో, సాయంత్రం కర్నూలు బహిరంగ సభలో పాల్గొంటారు. కర్నూలు పట్టణంలో రాత్రి బస చేస్తారు.
6వ తేదీ ఉదయం అదే జిల్లా నంద్యాల బహిరంగ సభలో, సాయంత్రం ఆళ్లగడ్డ బహిరంగ  సభలో ప్రసంగిస్తారు. ఆళ్లగడ్డలో రాత్రి బస చేస్తారు.
7వ తేదీ ఉదయం వైఎస్సార్ జిల్లా మైదుకూరు బహిరంగ సభలో, సాయంత్రం బద్వేలు బహిరంగ సభలో పాల్గొంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement