ఏలూరు, న్యూస్‌లైన్ : జిల్లాలో సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమం మొదలై నెల రోజులైంది. ఎన్ని రోజులైనా.. ఎన్ని కష్టాలెదురైనా వెనక్కి తగ్గేది లేదంటూ అన్నివర్గాల ప్రజలు ఢంకా బజారుుంచి చెబుతున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులతోపాటు మేధావులు సైతం ‘జై సమైక్యాంధ్ర’ అంటూ సమర శంఖారావం పూరిస్తూనే ఉన్నారు. ఉద్యమ సెగలు ఆరని నిప్పు కణికలా భగభగలాడుతూనే ఉన్నారుు. గురువారం ఏలూరులో రెవెన్యూ ఉద్యోగులు పెద్దఎత్తున తరలివచ్చి ఫైర్‌స్టేషన్ సెంటర్‌లో మానవహారం నిర్వహించారు. పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగులు జెడ్పీ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు 18వ రోజుకు చేరుకున్నారుు. సంఘం జిల్లా అధ్యక్షుడు జి.శ్రీధర్‌రాజు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ ఉద్యోగులు సమైక్య నినాదాలు చేస్తూ ప్రదర్శన నిర్వహించారు. విద్యుత్ ఉద్యోగులు ఫైర్‌స్టేషన్ సెంటర్‌లో వంటావార్పు చేసి కబడ్డీ ఆడారు. నగరంలోని క్రైస్తవులు ఫైర్‌స్టేషన్ సెంటర్‌లో మానవహారం నిర్వహించారు. పాస్టర్లు సమైక్యాంధ్ర కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆర్ అండ్‌బీ ఉద్యోగులు ర్యాలీగా ఫైర్‌స్టేషన్ సెంటర్‌కు చేరుకుని మానవహారం నిర్వహించారు. విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున గర్జన నిర్వహించి నిరసన గళం వినిపించారు.
వన్నె తగ్గని పోరు
జిల్లాలో ఏమూలకు వెళ్లినా సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమం వాడీవేడిగా సాగుతోంది. కొ వ్వూరు మునిసిపల్ ఉపాధ్యాయులు, సాంఘిక సంక్షేమ శాఖ ఉద్యోగులు టాక్సీ స్టాండు సెంటరులో రిలే దీక్షలు నిర్వహించారు. ఎన్‌జీవో హోంలో నిర్వహిస్తున్న రిలే దీక్షల్లో వికలాంగులు, సాంఘిక సంక్షేమ శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు. గృహ నిర్మాణశాఖ ఉద్యోగులుర ా్యలీ నిర్వహించారు. చాగల్లులో ఏపీ ఎన్‌జీవో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు. బ్రాహ్మణగూడెంలో జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు, నిడదవోలు-పంగిడి రహదారిపై కోలాటం ఆడారు. గోపాలపురంలో ఉపాధ్యాయుల జేఏసీ ఆధ్వర్యంలో 48 గంటల నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. దేవరపల్లిలో ఉద్యోగుల రిలే దీక్షలు కొనసాగుతున్నారుు.
దేవరపల్లి ప్రధాన రహదారిపై వైద్యులు కారుపాటి అనిల్ రోడ్డుపైనే విద్యార్థులకు రక్తపరీక్షలు నిర్వహించారు. జేఏసీ ఆధ్వర్యంలో ఉండి, ఆకివీడు, కాళ్ల, పాలకోడేరు మండ లాల్లో రిలే నిరాహార దీక్షలు, వివిధ ఆందోళనలు నిర్వహించారు. నరసాపురంలో జేఏసీ, ఉద్యోగ జేఏసీ, న్యాయశాఖ ఉద్యోగుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. భాష్యం పాఠశాల విద్యార్థులు రోడ్డుపై ఆటలు ఆడి నిరసన తెలిపారు. జంగారెడ్డిగూడెంలో పంచాయతీరాజ్ ఉద్యోగుల ఆధ్వర్యంలో రిలే దీక్షలు, తహసిల్దార్ కార్యాలయం వద్ద రెవెన్యూ ఉద్యోగుల నిరసన దీక్షలను వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కర్రా రాజారావు సందర్శించి సంఘీభావం ప్రకటించారు. లింగపాలెంలో ఎన్జీవోలు రోడ్లను శుభ్రం చేశారు, విద్యార్థులు, ఉద్యోగులు ర్యాలీ, మానవహారం నిర్వహించారు. తాడేపల్లిగూడెంలో పశు సంవర్థక శాఖ ఉద్యోగులు భారీ ప్రదర్శన నిర్వహించి, రోడ్డుపైనే పశువులకు వైద్యం చేసి నిరసన తెలిపారు. కొవ్వూరు డివిజన్ పరిధిలోని రెవెన్యూ అధికారులు, సిబ్బంది తణుకులో బైక్‌ర్యాలీ చేశారు.
సమైక్య గళం.. ప్రజాదళం
Published Fri, Aug 30 2013 12:56 AM | Last Updated on Fri, Sep 1 2017 10:14 PM
Advertisement
Advertisement