‘వెన్నుపోటు పొడిచేది ఆయనే.. దీక్షలు చేసేదీ ఆయనే..’ | YS Jagan Speech At Vemuru Public Meeting | Sakshi
Sakshi News home page

‘వెన్నుపోటు పొడిచేది ఆయనే.. దీక్షలు చేసేదీ ఆయనే..’

Published Tue, Mar 19 2019 6:04 PM | Last Updated on Wed, Mar 20 2019 5:42 PM

YS Jagan Speech At Vemuru Public Meeting - Sakshi

సాక్షి, వేమూరు(గుంటూరు): ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రాకుండా వెన్నుపోటు పొడిచిన సీఎం చంద్రబాబు నాయుడు.. మళ్లీ నల్లచొక్కాలు వేసుకుని ధర్మపోరాట దీక్షలు చేశారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. మంగళవారం గుంటూరు జిల్లా వేమూరులో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసగించారు. ఆయన మాట్లాడుతూ..‘మీ ఆశీస్సులతో 3,648 కిలోమీటర్ల పాదయాత్ర చేశాను. పాదయాత్రలో మీ గుండె చప్పుడు విన్నాను.. మీ ఆవేదన చూశాను. ఐదేళ్ల కాలంలో చంద్రబాబు అన్ని వర్గాలను మోసం చేశారు. రుణమాఫీ పేరిట రైతులను, డ్వాక్రా సంఘాల అక్కాచెల్లమ్మలను మోసం చేశారు. ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను మోసం చేశారు. రాజధాని నగరంలో పర్మినెంట్‌ పేరుతో ఒక ఇటుక కూడా వేయలేదు. గ్రామాల్లో నాలుగు, ఐదు బెల్ట్‌ షాపులు.. కిరాణ షాపుల్లో కూడా మందు దొరికే పరిస్థితి నెలకొంటే.. బెల్ట్ షాపులు మూయించానని చంద్రబాబు చెప్పుకుంటారు. 2014 ఎన్నికల సమయంలో టీడీపీ 650 హామీలు ఇచ్చింది. మేనిఫెస్టోలో ప్రతి కులానికి ఓ పేజీ కేటాయించారు. హీహెచ్‌డీ చేసి మరి ప్రతి కులాన్ని మోసం చేశారు. ఇప్పుడు ఆన్‌లైన్‌లో మేనిఫెస్టోను కనబడకుండా చేశారు. ఇప్పుడు మళ్లీ మీ భవిష్యత్తు.. ఆయన బాధ్యత అంటున్నాడు.ఈ ఐదేళ్లలో పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకుండా పోయింది. వేమూరులో ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ కాలేజ్‌ లేదు. ప్రజలను మోసం చేసిన చంద్రబాబు ముఖ్యమంత్రి పదవికి అర్హుడా?

అగ్రిగోల్డ్‌ బాధితుల వాదనతో ఏకీభవిస్తున్నాని..
అగ్రిగోల్డ్‌ ఆస్తులను పెదబాబు, చినబాబు కలిసి కొట్టేశారు. అగ్రిగోల్డ్‌ కేసును చంద్రబాబు జేబు సంస్థ విచారణ చేస్తే న్యాయం జరుగుతుందా?. అగ్రిగోల్డ్‌ ఆస్తులను తక్కువ ధరకు ఎలా కొట్టేయాలని చంద్రబాబు ఢిల్లీలో కుర్చొని డీల్స్‌ కుదుర్చుకుంటారు. రాష్ట్రవ్యాప్తంగా 19 లక్షల మంది అగ్రిగోల్డ్‌ బాధితులు ఉన్నారు. వందల మంది డీలర్లు, బాధితులు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు చూశాం. 1138 కోట్ల రూపాయలు ఇస్తే బాధితులకు ఊరట కలుగుతుంది. అగ్రిగోల్డ్‌ బాధితుల వాదనతో ఏకీభవిస్తున్నాను. నేనున్నాననే భరోసా ఇస్తున్నా.

చిలుక, గోరింక అసూయ పడేలా కాపురం చేశారు..
ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు రాష్ట్రాన్ని దగా చేశారు. ఎన్నికల ముందు ప్రత్యేక హోదా పదిహేను సంవత్సరాలు తీసుకోస్తానని అని చెప్పిన చంద్రబాబు.. బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వకపోయిన నాలుగేళ్లు కాపురం చేశారు. మనకు రావాల్సిన హక్కుల కోసం చంద్రబాబు ఏనాడూ పోరాడలేదు. బీజేపీని రోజు కూడా ప్రత్యేక హోదా గురించి గట్టిగా అడగలేదు. చిలుక, గోరింకలు కూడా అసూయ పడేలా చంద్రబాబు బీజేపీతో కాపురం చేశారు. తర్వాత బీజేపీతో విడాకులు తీసుకుని డ్రామాలు మొదలుపెట్టారు. ప్రత్యేక హోదాను వెన్నుపోటు పోడిచేది ఆయనే..  ధర్మపోరాట దీక్ష పేరిట నల్లచొక్కాలు వేసుకుని డ్రామాలు ఆయనే. పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌ వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు.. ఎన్నికలకు ముందు మళ్లీ ఎన్టీఆర్‌ బొమ్మలకు దండం పెడతారు. ప్రత్యేక హోదా విషయంలో అలానే చేశారు. దమ్ము దైర్యం ఉంటే చంద్రబాబు నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి.

ప్రత్యేక హోదా కోసం ఒక్క లేఖైనా రాశారా? 
చంద్రబాబు నాయుడుకు దమ్ము, ధైర్యం ఉంటే నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. మార్చి 2, 2014 ప్రత్యేక హోదాపై కేంద్రం ప్రకటన చేసింది. 2014 డిసెంబర్‌ వరకు ప్రణాళిక సంఘం అమల్లో ఉంది.. అయిన చంద్రబాబు ఒక్కసారైనా కలిశారా? కనీసం ఒక్క లేఖైనా రాశారా?. సెప్టెంబర్‌ 8, 2016న టీడీపీ క్రియాశీలక సభ్యులు పక్కనే ఉండి అరుణ్‌ జైట్లీ చేత ప్రత్యేక ప్యాకేజీ పేరిట అబద్దపు ప్రకటన చేయించారు. దానికి అర్ధరాత్రి వరకు మేల్కోని చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వంతో కుమ్మకై ఎందుకు ఈ ప్రకటన చేయించారు? అది అబద్దపు ప్యాకేజీ అయితే బీజేపీ పెద్దలకు శాలువలతో ఎందుకు సత్కరించారు? అసెంబ్లీలో బీజేపీ ప్రభుత్వాన్ని పొగుడుతూ తీర్మానాలు ఎందుకు చేశారు?.

హోదా వల్ల ఈశాన్య రాష్ట్రాలు ఏమైనా బాగుపడ్డాయని చంద్రబాబు అన్నారు. 2017 జనవరిలో కేంద్రం మన రాష్ట్రానికి చేసినట్టు ఏ రాష్ట్రానికి చేయలేదని చంద్రబాబు చెప్పారు.  కోడలు మొగ బిడ్డను కంటానంటే అత్త వద్దంటుదా అని చంద్రబాబు మట్లాడారు. హోదా కోసం ధర్నాలు, నిరహార దీక్షలు చేస్తే వాటిని నీరుగార్చింది చంద్రబాబు కాదా?. విద్యార్థులు ప్రత్యేక హోదా నినాదాలు ఎత్తుకుంటే పీడీ యాక్ట్‌ పెడతానని చంద్రబాబు బెదిరించారు. హోదా కోసం వైఎస్సార్‌ సీపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. ఎంపీలు రాజీనామాలు చేసి అమరణ దీక్ష చేశారు. అప్పుడే చంద్రబాబు వాళ్ల ఎంపీలతో రాజీనామా చేయించి ఉంటే ప్రత్యేక హోదా రాకుండా పోయేదా?

ఎల్లో మీడియా పట్ల జాగ్రత్తగా ఉండాలి..
చంద్రబాబు అన్ని అంశాల్లో రాష్ట్రాన్ని మోసం చేశారు. ఈ 20 రోజుల్లో చంద్రబాబు చెప్పని అబద్ధం ఉండదు. చంద్రబాబు తానా అంటే ఎల్లో మీడియా దానికి తందనా అంటూ కొమ్ముకాస్తోంది. ఉన్నది లేనట్టుగా.. లేనిది ఉన్నట్టుగా ప్రచారం చేస్తారు. ఎల్లో మీడియాతో మీరందరు జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఊరికి ముటలు, ముటలు డబ్బులు తీసుకోస్తారు. ప్రతి చేతిలో మూడు వేల రూపాయల డబ్బు పెడతారు. మీరందరు గ్రామాలకు వెళ్లి ప్రతి ఒక్కరికి చంద్రబాబు మోసాల గురించి చెప్పాలి.

చంద్రబాబు ఇచ్చే మూడు వేల రూపాయలకు మోసపోకండి అని గ్రామాల్లోని అవ్వ తాతలకు చెప్పిండి. జగనన్న చెప్పకపోయి ఉంటే పించన్‌ రెండు వేలకు పెరిగిదా అని గుర్తుచేయండి. మన పిల్లలను బడికి పంపిస్తే చాలు అన్న ఏటా రూ. 15 వేల రూపాయలు ఇస్తాడని ప్రతి అక్కాచెల్లమ్మకు చెప్పండి. ఏ చదువైనా అన్న చదివిస్తాడని.. ఎన్ని లక్షలైనా కూడా భరిస్తాడని ప్రతి ఇంట్లో చెప్పండి. 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ మహిళలకు వైఎస్సార్‌​ చేయూత కింద 75 వేల రూపాయలు నాలు దఫాలుగా చెల్లిస్తాం. ప్రతి రైతన్నకు మే నెలలోనే 12,500 రూపాయలు ఇస్తాం. నవరత్నాల గురించి ప్రతి అవ్వకు, తాతకు చెప్పిండి.  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తెచుకుందాం. ఎమ్మెల్యేగా నాగర్జునను, ఎంపీగా నందిగం సురేశ్‌ను దీవించమని, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఓటేసి ఆశీర్వదించమ’ని కోరారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement