vemuru
-
YSRCP జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి సమక్షంలో చేరికలు
-
వేమూరు టీడీపీలో గ్రూపుల మధ్య ఘర్షణ
వేమూరు: గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో గ్రూపు విభేదాలు బహిర్గతమయ్యాయి. ఒకే సామాజికవర్గానికి చెందిన ఇద్దరు ప్రధాన నాయకుల అనుచరులు ఘర్షణ పడ్డారు. పలువురు కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వేమూరు మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ జొన్నలగడ్డ విజయబాబు, కొల్లూరు మాజీ ఎంపీపీ కనగాల మధుసూదనరావు గ్రూపుల మధ్య విభేదాలున్నాయి. ఈ నేపథ్యంలో వేమూరు నియోజకవర్గంలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం, సోషల్ మీడియా బాధ్యతలు జొన్నలగడ్డ విజయబాబు అనుచరుడు కోగంటి గోపికి అప్పగించారు. ఈ క్రమంలో కనగాల మధుసూదనరావు గోపికి ఫోన్ చేసి కొల్లూరు గ్రామంలో సభ్యత్వ నమోదుకు గూగుల్ షీటు ఇవ్వాలని కోరడంతోపాటు దుర్భాషలాడాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో కొల్లూరు గ్రామానికి చెందిన 40 మంది, వేమూరు గ్రామానికి చెందిన 40 మంది టీడీపీ కార్యకర్తలు శుక్రవారం అర్థరాత్రి వేమూరులోని జొన్నలగడ్డ విజయబాబు ఇంటి వద్దకు చేరుకున్నారు. ఇరువర్గాల వారు కర్రలు, రాడ్డులతో ఇష్టారాజ్యంగా కొట్టుకున్నారు. కనగాలకు చెందిన కార్ల అద్దాలు పగులకొట్టి దగ్ధం చేశారు. విజయబాబు, మధుసూదనరావు వర్గానికి చెందిన పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు వచ్చి ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఇరువర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకోకుండా పోలీసులు వేమూరులోని జొన్నలగడ్డ విజయబాబు ఇంటి వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. -
కాలేజీ బస్సు డ్రైవర్‌తో ప్రేమ పెళ్లి.. తల్లికి ఆరోగ్యం బాగోలేదని చెప్పి..
సాక్షి, బాపట్ల(వేమూరు): ప్రేమ పెళ్లి చేసుకున్న యువతి కిడ్నాప్‌కు గురైన ఘటన సోమవారం అనంతవరంలో చోటుచేసుకుంది. పోలీసులు, యువతి భర్త కథనం మేరకు.. గుంటూరు జిల్లా కొల్లిపర మండలం శివలూరుకు చెందిన ఆళ్ల లక్ష్మీపూజిత, తెనాలి సమీపంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ చదివే సమయంలో అదే కళాశాల బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్న కొల్లూరు మండలం అనంతవరానికి చెందిన దేవరాజుగట్టు విశ్వనాథ్‌లు ప్రేమించుకున్నారు. యువతి చదువు పూర్తయిన అనంతరం గత నెల 11న పెద్దలకు తెలియకుండా ప్రేమ వివాహం చేసుకుని కొల్లూరు పోలీసులను ఆశ్రయించారు. అప్పట్నుంచి తన భర్త రాజవిశ్వనాథ్‌తో కలసి అనంతవరంలో ఉంటుంది. యువతిని బలవంతంగా లాక్కెళుతున్న తండ్రి, సోదరుడు, బంధువులు తల్లికి అనారోగ్యమని.. లక్ష్మీపూజిత తల్లికి ఆరోగ్యం బాగోలేదని సోమవారం ఉదయం అనంతవరంలోని లక్ష్మీపూజిత అత్తగారింటికి తాతయ్య, మేనత్త, పిన్ని వచ్చారు. ఇకపై ఇరు కుటుంబాలు కలసి మెలసి ఉందామని నమ్మబలికారు. దీంతో లక్ష్మీపూజిత ఇంటి నుంచి బయటకు రావడంతో ఆమెను బలవంతంగా లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. అప్పటికే అక్కడ ఉన్న యువతి తండ్రి శ్రీనివాసరెడ్డి, సోదరుడు నిరంజన్‌రెడ్డి, కొంతమంది యువకులు లక్ష్మీపూజితను బలవంతంగా కారులో తీసుకెళ్లారు. అడ్డువచ్చిన భర్త, అత్తపై దాడికి పాల్పడ్డారు. భర్త రాజవిశ్వనాథ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కిడ్నాప్ కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ కె.బాబూరావు తెలిపారు. చదవండి: ఊరుకాని ఊరులో.. మానవత్వానికి సలాం -
భారీ స్ప్రేయర్.. 10 గంటల్లో 100 ఎకరాలు పూర్తి.. పెట్రోలు ఖర్చు రూ. 300 లోపే!
రైతును మించిన శాస్త్రవేత్త లేడంటారు... వినూత్న ఆలోచనలకు, ఆవిష్కరణలకు చదువుతో పనిలేదు. అవసరమే అన్నీ నేర్పిస్తుంది. గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గంలోని మండల కేంద్రం అమృతలూరు రైతు మల్లెపెద్ది రామకృష్ణ ఇందుకో నిదర్శనం. ఇంటర్ చదువుకొని వ్యవసాయంలో స్థిరపడ్డారు. పురుగుమందు పిచికారీలో సమయాన్ని, ఖర్చును ఆదా చేసే ట్రాక్టర్ మౌంటెడ్ స్పేయర్‌ను సొంత ఆలోచనతో పెద్ద రైతుగా తన అవసరాల మేరకు తయారు చేసుకొని వాడుతున్నారు. ఈ ఆవిష్కరణతో గంటకు 10 ఎకరాల చొప్పున, కేవలం 10 గంటల్లో తన వందెకరాల పైరుకు మందు పిచికారీని పూర్తి చేస్తుండటం విశేషం. మాగాణి భూమిలో ఖరీఫ్‌లో వరి తర్వాత రెండో పంటగా వంద ఎకరాల్లో మినుము సాగు చేస్తున్నారు రామకృష్ణ. ఈ పంటకు తెగుళ్ల బెడద ఎక్కువ. సాధారణ పవర్ స్ప్రేయర్‌తో ముగ్గురు, నలుగురితో మందు పిచికారీ చేయించినా, కనీసం అయిదు రోజులు వ్యవధి పట్టేది. స్ప్రేయింగ్ చేయటానికి, ట్యాంకుల్లో నీళ్లు కలిపే వారితో సహా కూలీ ఖర్చులు హీనపక్షం రూ.లక్ష తప్పనిసరి. మరూకా పురుగు ఆశిస్తే వెంటనే చేను మొత్తం పిచికారీ చేయాలి. ఇక్కడ ఒకవైపు నుంచి రెండోవైపునకు పని పూర్తి చేసే సరికి కొన్ని రోజులు పట్టేది. ఆలోగా ఆవైపు చేనును పురుగు తినేసేది. ఇలాంటి సమస్యలకు పరిష్కారం ఏమిటా అనే మథనంలోంచి పెద్ద రైతులకు ఉపయోగపడే ఈ వినూత్నమైన భారీ మౌంటెడ్ స్ప్రేయర్ పుట్టుకొచ్చింది. 1800 లీటర్ల సామర్థ్యం కలిగిన ఈ భారీ స్ప్రేయర్‌తో గంటకు పదెకరాల్లో పురుగుమందును ప్రస్తుత రబీలోనే తొలిసారి పిచికారీ చేస్తున్నారు రామకృష్ణ. ఆవిధంగా వందెకరాల పొలంలో 10 గంటల్లోనే పిచికారీ పూర్తిచేస్తున్నారు. ఎటొచ్చినా 50 అడుగుల దూరంలో వానజల్లులా మొక్క మొత్తం పూర్తిగా తడుపుతున్నారు. పదెకరాలకు 1800 లీటర్ల చొప్పున వందెకరాలకు 18 వేల లీటర్ల నీటి పిచికారీతో పనిలో పనిగా.. పొలానికి అవసరమైన నీటితడి కూడా సమకూరుతోంది. ఇప్పుడా వందెకరాల్లోని మినుము పైరు కేవలం 45 రోజుల వయసులోనే ఏపుగా పెరిగి భారీ దిగుబడులకు భరోసానిస్తోంది. సేంద్రియ/ప్రకృతి వ్యవసాయం చేసే పెద్ద రైతులక్కూడా ఈ భారీ స్ప్రేయర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. 2.5 లీ. పెట్రోలుతో వందెకరాల్లో పిచికారీ ట్రాక్టరుకు వెనుక వైపు 650 లీటర్ల చొప్పున సామర్థ్యం కలిగిన రెండు ట్యాంకులు ఒకదానిపై ఒకటి బిగించారు. ముందుభాగంలో 500 లీటర్ల సింటెక్స్ ట్యాంకును అమర్చారు. అంటే మొత్తం 1800 లీటర్లు. 5 హెచ్‌పీ మోటారు, మరో వైపర్ మోటారును బిగించారు. వీటన్నిటినీ ట్యాంకులకు అనుసంధానం చేశారు. మోటారు ఆన్ చేయగానే వైపర్ మోటారు తిరుగుతుంది. వెనుకభాగంలో రెండువైపులా గల వైపర్స్ తిరుగుతూ వీటి చివర గల నాజిల్స్‌లోంచి మందు పిచికారీ అవుతుంది. ట్రాక్టరు తిరిగేందుకు అనువుగా విత్తనాలు చల్లేటపుడే దారులు సిద్ధం చేసుకున్నారు. ఈ భారీ స్ప్రేయర్‌కు కావాల్సిన ఒక్కో పరికరాన్ని ఒక్కోచోట నుంచి సమకూర్చుకున్నట్టు రామకృష్ణ చెప్పారు. ఇందుకు రూ.1.50 లక్షల ఖర్చయ్యిందన్నారు. మోటార్లకు కావాల్సిన పెట్రోలు ట్యాంకులో సామర్థ్యం ముప్పాతిక లీటరు మాత్రమే. కేవలం రెండున్నర లీటర్ల పెట్రోలుతో వంద ఎకరాల్లో మందు పిచికారీకి సరిపోతోంది. అంటే ప్రెటోలు ఖర్చు రూ.300 లోపే. ఈ రకంగా రామకృష్ణ వినూత్న ఆవిష్కరణతో తన సమస్యను అధిగమించటమే కాకుండా, తన స్ప్రేయర్‌ను తోటి రైతులకూ అద్దెకు ఇస్తూ వారి ఖర్చునూ తగ్గిస్తున్నారు రామకృష్ణ (99595 95060). – బి.ఎల్.నారాయణ, సాక్షి, తెనాలి చదవండి: రైతు ఆదాయం పెంచే పట్టు యంత్రం -
ఘోర రోడ్డు ప్రమాదం: ఘటనపై సీఎం ఆరా
సాక్షి, అమరావతి బ్యూరో: గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గంలో గురువారం ఘోరరోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివాహ వేడుకల్లో పాల్గొని తిరిగి వస్తుండగా ట్రాక్టర్ ట్రక్కు బోల్తా కొట్టి ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. చుండూరు మండలం చినపరిమి అంబేడ్కర్‌నగర్‌కు చెందిన యువతి వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు ఆ కాలనీవాసులు తెనాలి సమీపంలోని చినరావూరు వెళ్లి తిరిగి వస్తుండగా మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో రోడ్డు మలుపులో ట్రాక్టర్ ట్రక్కు బోల్తా కొట్టింది. దీంతో గోరోజనం అన్నమ్మ(45), ఉన్నం పద్మావతి (32) అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. గాయపడిన వారిని తెనాలిలోని జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. దగ్గుబాటి హర్షవర్ధన్‌మురళి (9), కట్టుపల్లి నిఖిల్ (7) కూడా మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. గోళ్ల నాగరాణి(34), గుత్తికొండ శ్యామ్(13)ల పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వారు మృతిచెందారు. ప్రమాద సమయంలో ట్రాక్టర్లో 40 మంది వరకూ ప్రయాణిస్తున్నట్టు సమాచారం. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం వల్లే అది బోల్తా కొట్టినట్టు స్థానికులు చెబుతున్నారు. తెనాలి డీఎస్పీ కె.శ్రీలక్ష్మి నేతృత్వంలో చుండూరు సీఐ బి.నరసింహారావు, చుండూరు, అమృతలూరు ఎస్ఐలు కేసు దర్యాప్తు చేస్తున్నారు. వేమూరు ఎమ్మెల్యే డాక్టర్ మేరుగ నాగార్జున తెనాలి వైద్యశాలకు చేరుకుని బాధితులను పరామర్శించారు. ప్రమాద ఘటనపై సీఎం ఆరా ప్రమాద ఘటనపైన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరా తీశారు. బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని జిల్లా కలెక్టర్ ఐ.శామ్యూల్ ఆనందకుమార్‌ను ఆదేశించారు. మృతులు అన్నమ్మ, పద్మావతి, నాగరాణి కుటుంబాలకు వైఎస్సార్ బీమా కింద ఒక్కొక్కరికి రూ.5 లక్షలతో పాటు ప్రభుత్వ పరిహారంగా ఒక్కొక్కరికి అదనంగా మరో రూ.2 లక్షలు ఇస్తున్నట్టు కలెక్టర్ చెప్పారు. చిన్నారులు హర్షవర్ధన్‌మురళి, నిఖిల్ కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున పరిహారం ఇస్తున్నట్టు తెలిపారు. -
వేమూరులో ‘నక్కా’ వారి అవినీతి జిత్తులు
సాక్షి, గుంటూరు : అయనో అవినీతి మాంత్రికుడు.. మంత్రి పదవి రాకముందే అక్రమాలకు తెరతీసిన తాంత్రికుడు.. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని హాంఫట్ అంటూ కాజేశాడు. రాక రాక వచ్చిన అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డగోలుగా దండుకున్నాడు. వేమూరు నియోజకవర్గంలో ఇసుక రీచ్‌లపై మారీచుడిలా వాలాడు. ప్రజలకు ఉచితం పేరుతో ఇసుకను ఆయాచితంగా దోచుకున్నాడు. లారీలు, ట్రాక్టర్లతో యథేచ్ఛగా తరలిస్తూ అక్రమాల దందా కొనసాగించాడు. మంత్రి పదవి వచ్చాక మరింత రెచ్చిపోయాడు. తన అనుచరగణంతో జిల్లా వ్యాప్తంగా దందాకు తెరతీశాడు. గుంటూరులో బెక్కర్ కాంపౌండ్ స్థలాన్ని ఆక్రమించేశాడు. కారుచౌకగా ఏఈఎల్సీ ఆస్తుల లీజు దక్కించుకున్నాడు. మంత్రి ఆధ్వర్యంలో తవ్విన గుంతల్లో పడి చిన్నారుల ప్రాణాలు గాలిలో కలిసిపోగా.. ఆ కుటుంబాల ఉసురుపోసుకున్నాడు మంత్రి నక్కా ఆనందబాబు. ఇసుక అమ్మకాల్లో రూ. 200 కోట్లకుపైనే... ఇసుక తవ్వకాలపై మంత్రి ఆనందబాబును తిప్పలకట్టలో మహిళల నిలదీత 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వేమూరు నియోజకర్గంలోని కొల్లూరు, భట్టిప్రోలు మండలాల్లో ఇసుక అమ్మకాల ద్వారా మంత్రి నక్కా ఆనందబాబు రూ. 200 కోట్లకుపైనే గడించారని నియోజకవర్గంలో విమర్శలున్నాయి. నదీ గర్భశోకం మిగిల్చి ఇసుకను పిండి రూ. కోట్లకు కోట్లు దండుకోవడంలో సిద్ధహస్తుడిగా మంత్రి పేరు గడించారు. ఇసుక మాఫియాకు మంత్రే మూలంగా మారి తన బినామీలతో తవ్వకాలు జరిపించి అక్రమార్జనకు నాంది పలికారు. 2011 నుంచి 2013 మధ్య కాలంలో కొల్లూరు మండలం జువ్వలపాలెంలో ప్రభుత్వం పాట నిర్వహించిన క్వారీని తన బినామీలకు దక్కేలా చక్రం తిప్పి ఇసుక దందాకు తెర తీశారు. జువ్వలపాలెంలో అనుమతులు ఉంటే గాజుల్లంకలో సైతం రెండేళ్లపాటు రేయింబవళ్లు అనధికారిక క్వారీని నడిపించారు. భట్టిప్రోలు మండలం కాకుల డొంక, ఓలేరు ప్రాంతాల్లో మంత్రి కనుసన్నల్లో ఇసుక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగాయి. అప్పట్లో రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఇసుక పాటలను రద్దు చేస్తూ తీర్పు వెలువరించడంతో 2013–2014 మధ్య కాలంలో తన బినామీలను రంగంలోకి దింపి కొత్త తరహా ఇసుక వ్యాపారానికి బీజం వేశారు. ఏడాది క్రితం గుంటూరులో కీలక నామినేటెడ్ పోస్టు దక్కించుకున్న టీడీపీ నాయకుడు కుమారుడు సైతం ఈపూరులో క్వారీ నిర్వహించి రూ. కోట్లు గడించాడు. బెక్కర్ కాంపౌండ్‌లో స్థలం బొక్కేశారు గుంటూరు నగరంలోని మహిమ గార్డెన్స్ బెక్కర్ కాంపౌండ్‌లో స్థలాన్ని సైతం మంత్రి నక్కా ఆనందబాబు కారు చౌకగా బొక్కేశారు. ఈ స్థలాన్ని కాజేయడం కోసం బెక్కర్ కాంపౌండ్‌ను లీజుకు తీసుకున్న బాబూప్రకాశ్తో... టీడీపీ ఎమ్మెల్యేలు నక్కా ఆనంద్‌బాబు, ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఒప్పందం చేసుకున్నారు. ఆ స్థలం తమకు కేటాయిస్తేనే లీజుకు తీసుకున్న స్థలాన్ని చర్చికి అప్పగిస్తానంటూ షరతులతో కూడిన ప్రతిపాదనను చర్చి ముందు పెట్టారు. ఈ షరతులకు తలొగ్గిన చర్చి పెద్దలు 2015 జూలై 22న భీమవరం బేతనీపేట లూథరన్ చర్చిలో జరిగిన కౌన్సిల్ సమావేశంలో.. షరతులను అంగీకరించి, టీడీపీ ఎమ్మెల్యేలు నక్కా ఆనంద్‌బాబు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌కు స్థలం కేటాయించడానికి అంగీకారం తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యే నక్కా ఆనంద్‌బాబు తన పేరిట చర్చి ఇవ్వాలనుకున్న 4400 గజాల స్థలాన్ని తన సోదరుడు నక్కా ప్రసాద్‌బాబు పేరిట ఇవ్వాలని కోరారు. ప్రసాద్‌బాబు పేరిట 4400 గజాల స్థలాన్ని.. గజం రూ. 12 వేల చొప్పున చర్చి విక్రయించింది. మొత్తం స్థలం విలువ రూ.5.28 కోట్లకుగాను నక్కా ప్రసాద్ సంఘానికి అందించిన సేవలకుగాను రూ.3.28 లక్షలు మినహాయించారు. ఈ లెక్కన కేవలం రూ. 2 కోట్లకు 4400 గజాల స్థలాన్ని తన బినామీ అయిన సోదరుడి పేరు మీద ఆనందబాబు కొట్టేశారు. వాస్తవానికి బహిరంగ మార్కెట్లో ఈ స్థలం విలువ గజం రూ.4 లక్షలు ఉంటుందని అంచనా. ఈ ప్రకారం స్థలం విలువ సుమారు రూ.200 కోట్లు ఉంటుంది. ఈ చర్చి భూమిని కొట్టేయడం వెనక నక్కా చక్రం తిప్పారని క్రైస్తవ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. కారుచౌకగా ఏఈఎల్సీ ఆస్తుల లీజు.. కుగ్లర్ ఆసుపత్రి కుగ్లర్ హాస్పిటల్ 6.95 ఎకరాల స్థలాన్ని కారు చౌకగా నక్కా ఆనందబాబు లీజు కొట్టేశాడు. కుగ్లర్ ఆసుపత్రి స్థలం లీజు ధర మార్కెట్లో రూ. 50 లక్షలకుపైగా పలుకుతుంది. అలాంటి స్థలాన్ని ఆనందబాబు సతీమణి చింతబత్తుని సత్యరత్నకుమారి పేరు మీద సంవత్సరానికి రూ.10 వేలు చొప్పున 2006–2036 వరకూ లీజుకు తీసుకున్నారు. కారు చౌకగా కొట్టేసిన నక్కా ఆనందబాబు లీజు డబ్బును చర్చి అకౌంట్లో కట్టిన దాఖలాలే లేవని ఆరోపణలున్నాయి. ఇదే తరహాలో గుంట గ్రౌండ్ స్థలాన్ని సైతం ఆనందబాబు తన బినామీ అయిన సోదరుడు ప్రసాద్ పేరున లీజుకు తీసుకుంటున్నారు. ఆరేడేళ్లుగా గ్రౌండ్‌ను లీజుకు తీసుకుంటున్న ఆయన గత సంవత్సరం వరకూ మార్చి, ఏప్రిల్, మే నెలలకుగాను రూ. 5 లక్షలు లీజుగా చెల్లించేవారు. గత ఏడాది సంఘ సభ్యులు వ్యతిరేకించడంతో లీజు ధరను రూ. 20 లక్షలకు పెంచినట్టు సమాచారం. కారు చౌకగా లీజుకు కొట్టేస్తున్న గుంట గ్రౌండ్ స్థలాన్ని ఎగ్జిబిషన్లు, ప్రైవేట్ కార్యక్రమాలకు అద్దెకు ఇవ్వడం ద్వారా ఆనందబాబు ఏడాదికి రూ.10 కోట్ల వరకూ గడిస్తున్నారని విమర్శలున్నాయి. గుంటూరు నగరంలోని గ్రాండ్ నాగార్జున హోటల్ స్థలాన్ని 1981–2030 వరకు మంత్రి నక్కా ఆనంద్‌బాబు, తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మధ్య లీజ్ కొనసాగుతుంది. దీనికి సంత్సరానికి లీజ్ రూ.33,333 చెల్లిస్తున్నారు. -
వేమూరులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మేరుగు నాగార్జున ప్రచారం
-
వేమూరులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మేరుగ నాగార్జున ప్రచారం
-
ఇద్దరు సీఎంలు ఆ గడ్డ నుంచే..
సాక్షి, అమరావతి బ్యూరో: వేమూరు నియోజకవర్గం రాజకీయ ఉద్ధండులకు ఖిల్లా. పాడి పంటలకు ప్రసిద్ధి చెందిన డెల్టా ప్రాంతం. కృష్ణా తీరప్రాంతానికి సమీపంలో ఉన్న ఈ నియోజకవర్గ ప్రజలు చైతన్యానికి మారుపేరు. మొదట 1952లో అమృతలూరు నియోజకవర్గంగా ఉండేది. 1955లో అది వేమూరు నియోజకవర్గంగా రూపాంతరం చెందింది. 2004 వరకు జనరల్‌గా ఉన్న ఈ స్థానం 2009 పునర్విభజనలో ఎస్సీ రిజర్వుడ్ కేటగిరీ అయింది. ఈ నియోజకవర్గంలో జన్మించిన ఇద్దరు సీఎంలుగా పనిచేయటం విశేషం. వేమూరుకు చెందిన కొణిజేటి రోశయ్య ఉమ్మడి ఏపీలో మంత్రిగా పలు కీలక శాఖలను నిర్వహించడంతో పాటు సీఎంగా, తమిళనాడు గవర్నర్‌గా పనిచేశారు. ఇక మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు స్వగ్రామం కొల్లూరు మండలం దోనేపూడి. ఈయన 1983లో వేమూరు నుంచి ఎన్నికయ్యారు. 1984లో నెల రోజులపాటు సీఎం పదవి నిర్వహించారు. 1955, 1962లో శాసనసభకు ఎన్నికైన కల్లూరి చంద్రమౌళి వేమూరు నియోజకవర్గం అమర్తలూరు మండలం ప్యాపర్రు గ్రామానికి చెందిన వారు. ఈయన మంత్రిగా పనిచేశారు. యడ్లపాటి వెంకటరావు ఈ స్థానం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. జడ్పీ చైర్మన్‌గా కూడా పనిచేశారు. మంత్రిగా కూడా పనిచేసిన ఈయన స్వగ్రామం అమర్తలూరు మండలం బోడపాడు. 1989లో శాసనసభకు ఎన్నికైన మాజీ మంత్రి అలపాటి ధర్మారావు ఈ నియోజకవర్గంలోని కొల్లూరు మండలం అన్నవరపులంక గ్రామానికి చెందినవారు. ఆలపాటి రాజేంద్రప్రసాద్ మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈయన చుండూరు మండలం యడవల్లి గ్రామానికి చెందినవారు. ప్రస్తుతం తెనాలి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఈ నియోజకవర్గంలోని దోనేపూడికి చెందినవారు. పునర్విభజనలో ఈ స్థానం రిజర్వుడు కావడంతో ఈయన తెనాలి నియోజకవర్గానికి మారారు. ప్రస్తుతం వేమూరు స్థానం నుంచి నక్కా అనందబాబు టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. మంత్రిగా పనిచేశారు. టీడీపీ తరపున ప్రస్తుతం మళ్లీ పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ మేరుగ నాగార్జున పోటీలో ఉన్నారు. -
అటొక ఊరు.. ఇటొక ఊరు
సాక్షి, కృష్ణా : ఇళ్లన్నీ కలిసే ఉంటాయి.. కొత్తవారెవరైనా వచ్చి ఇది ఏ ఊరు? అనడిగితే వూత్రం ఒక్కొక్కరు ఒక్కో ఊరి పేరు చెబుతారు. అదే ఆ ప్రాంతం ప్రత్యేకత! ఇళ్లన్నీ ఒకే చోట ఉన్నా, రెండు జిల్లాలు, మూడు మండలాలకు చెందిన మూడు వేర్వేరు గ్రామాలవి. వినడానికి విచిత్రంగా ఉన్నా వాస్తవం ఇదే! కొల్లూరు మండలంలోని చిలుమూరులంక గ్రామం, కొల్లిపర మండలం అన్నవరపులంక గ్రామాలు కలిసే ఉంటాయి. ఈ రెండు గ్రామాలు గుంటూరు జిల్లావి కాగా, కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం ఐలూరు శివారు గ్రామం అయిన కనిగిరిలంక కూడా ఈ రెండింటితో కలిసే ఉంటుంది. చిలుమూరులంక, అన్నవరపులంక గ్రామాలను పంచాయతీ రోడ్డు వేరుచేస్తుంది. ఈ రెండు గ్రావూలను కలుపుతూ కొత్తూరులంక వెళ్లే తారురోడ్డుకు తూర్పునే ఉన్న ఇళ్లన్నీ కనిగిరిలంక గ్రామాం పరిధిలోనివి. గతంలో కొల్లిపర, కొల్లూరు మండలాలు దుగ్గిరాల నియోజకవర్గంలో అంతర్భాగంగా ఉండగా కనిగిరిలంక మాత్రం కృష్ణాజిల్లా ఉయ్యూరు నియోజకవర్గంలో ఉండేది. నియోజకవర్గాల పునర్విభజనతో దుగ్గిరాల నియోజకవర్గం రద్దయిన విషయం తెలిసిందే. కొల్లూరు మండలంలోని చిలుమూరులంక వేమూరు (ఎస్సీ) నియోజకవర్గంలో చేరింది. కొల్లిపర మండలానికి చెందిన అన్నవరపులంక తెనాలి నియోజకవర్గం పరిధిలోకి వెళ్లింది. కృష్ణాజిల్లాకు చెందిన కనిగిరిలంక అదే జిల్లాలోని పామార్రు (ఎస్సీ)నియోజకవర్గంలోకి వెళ్లింది. అందరూ దాదాపుగా ఒకే చోట ఉంటున్న మూడు గ్రామాల ఓటర్లు, మూడు వేర్వేరు నియోజకవర్గాల ఓటర్లు ఓట్లు వేయనున్నారు. మిగతా వసతులు ఎలా ఉన్నా ఆ గ్రావూలన్నింటికీ కొల్లూరు మండలం నుంచే రోడ్డు రవాణా సౌకర్యం ఉంది. -
‘వెన్నుపోటు పొడిచేది ఆయనే.. దీక్షలు చేసేదీ ఆయనే..’
సాక్షి, వేమూరు(గుంటూరు): ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రాకుండా వెన్నుపోటు పొడిచిన సీఎం చంద్రబాబు నాయుడు.. మళ్లీ నల్లచొక్కాలు వేసుకుని ధర్మపోరాట దీక్షలు చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎద్దేవా చేశారు. మంగళవారం గుంటూరు జిల్లా వేమూరులో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసగించారు. ఆయన మాట్లాడుతూ..‘మీ ఆశీస్సులతో 3,648 కిలోమీటర్ల పాదయాత్ర చేశాను. పాదయాత్రలో మీ గుండె చప్పుడు విన్నాను.. మీ ఆవేదన చూశాను. ఐదేళ్ల కాలంలో చంద్రబాబు అన్ని వర్గాలను మోసం చేశారు. రుణమాఫీ పేరిట రైతులను, డ్వాక్రా సంఘాల అక్కాచెల్లమ్మలను మోసం చేశారు. ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను మోసం చేశారు. రాజధాని నగరంలో పర్మినెంట్ పేరుతో ఒక ఇటుక కూడా వేయలేదు. గ్రామాల్లో నాలుగు, ఐదు బెల్ట్ షాపులు.. కిరాణ షాపుల్లో కూడా మందు దొరికే పరిస్థితి నెలకొంటే.. బెల్ట్ షాపులు మూయించానని చంద్రబాబు చెప్పుకుంటారు. 2014 ఎన్నికల సమయంలో టీడీపీ 650 హామీలు ఇచ్చింది. మేనిఫెస్టోలో ప్రతి కులానికి ఓ పేజీ కేటాయించారు. హీహెచ్డీ చేసి మరి ప్రతి కులాన్ని మోసం చేశారు. ఇప్పుడు ఆన్లైన్లో మేనిఫెస్టోను కనబడకుండా చేశారు. ఇప్పుడు మళ్లీ మీ భవిష్యత్తు.. ఆయన బాధ్యత అంటున్నాడు.ఈ ఐదేళ్లలో పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకుండా పోయింది. వేమూరులో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజ్ లేదు. ప్రజలను మోసం చేసిన చంద్రబాబు ముఖ్యమంత్రి పదవికి అర్హుడా? అగ్రిగోల్డ్ బాధితుల వాదనతో ఏకీభవిస్తున్నాని.. అగ్రిగోల్డ్ ఆస్తులను పెదబాబు, చినబాబు కలిసి కొట్టేశారు. అగ్రిగోల్డ్ కేసును చంద్రబాబు జేబు సంస్థ విచారణ చేస్తే న్యాయం జరుగుతుందా?. అగ్రిగోల్డ్ ఆస్తులను తక్కువ ధరకు ఎలా కొట్టేయాలని చంద్రబాబు ఢిల్లీలో కుర్చొని డీల్స్ కుదుర్చుకుంటారు. రాష్ట్రవ్యాప్తంగా 19 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారు. వందల మంది డీలర్లు, బాధితులు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు చూశాం. 1138 కోట్ల రూపాయలు ఇస్తే బాధితులకు ఊరట కలుగుతుంది. అగ్రిగోల్డ్ బాధితుల వాదనతో ఏకీభవిస్తున్నాను. నేనున్నాననే భరోసా ఇస్తున్నా. చిలుక, గోరింక అసూయ పడేలా కాపురం చేశారు.. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు రాష్ట్రాన్ని దగా చేశారు. ఎన్నికల ముందు ప్రత్యేక హోదా పదిహేను సంవత్సరాలు తీసుకోస్తానని అని చెప్పిన చంద్రబాబు.. బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వకపోయిన నాలుగేళ్లు కాపురం చేశారు. మనకు రావాల్సిన హక్కుల కోసం చంద్రబాబు ఏనాడూ పోరాడలేదు. బీజేపీని రోజు కూడా ప్రత్యేక హోదా గురించి గట్టిగా అడగలేదు. చిలుక, గోరింకలు కూడా అసూయ పడేలా చంద్రబాబు బీజేపీతో కాపురం చేశారు. తర్వాత బీజేపీతో విడాకులు తీసుకుని డ్రామాలు మొదలుపెట్టారు. ప్రత్యేక హోదాను వెన్నుపోటు పోడిచేది ఆయనే.. ధర్మపోరాట దీక్ష పేరిట నల్లచొక్కాలు వేసుకుని డ్రామాలు ఆయనే. పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు.. ఎన్నికలకు ముందు మళ్లీ ఎన్టీఆర్ బొమ్మలకు దండం పెడతారు. ప్రత్యేక హోదా విషయంలో అలానే చేశారు. దమ్ము దైర్యం ఉంటే చంద్రబాబు నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ప్రత్యేక హోదా కోసం ఒక్క లేఖైనా రాశారా? చంద్రబాబు నాయుడుకు దమ్ము, ధైర్యం ఉంటే నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. మార్చి 2, 2014 ప్రత్యేక హోదాపై కేంద్రం ప్రకటన చేసింది. 2014 డిసెంబర్ వరకు ప్రణాళిక సంఘం అమల్లో ఉంది.. అయిన చంద్రబాబు ఒక్కసారైనా కలిశారా? కనీసం ఒక్క లేఖైనా రాశారా?. సెప్టెంబర్ 8, 2016న టీడీపీ క్రియాశీలక సభ్యులు పక్కనే ఉండి అరుణ్ జైట్లీ చేత ప్రత్యేక ప్యాకేజీ పేరిట అబద్దపు ప్రకటన చేయించారు. దానికి అర్ధరాత్రి వరకు మేల్కోని చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వంతో కుమ్మకై ఎందుకు ఈ ప్రకటన చేయించారు? అది అబద్దపు ప్యాకేజీ అయితే బీజేపీ పెద్దలకు శాలువలతో ఎందుకు సత్కరించారు? అసెంబ్లీలో బీజేపీ ప్రభుత్వాన్ని పొగుడుతూ తీర్మానాలు ఎందుకు చేశారు?. హోదా వల్ల ఈశాన్య రాష్ట్రాలు ఏమైనా బాగుపడ్డాయని చంద్రబాబు అన్నారు. 2017 జనవరిలో కేంద్రం మన రాష్ట్రానికి చేసినట్టు ఏ రాష్ట్రానికి చేయలేదని చంద్రబాబు చెప్పారు. కోడలు మొగ బిడ్డను కంటానంటే అత్త వద్దంటుదా అని చంద్రబాబు మట్లాడారు. హోదా కోసం ధర్నాలు, నిరహార దీక్షలు చేస్తే వాటిని నీరుగార్చింది చంద్రబాబు కాదా?. విద్యార్థులు ప్రత్యేక హోదా నినాదాలు ఎత్తుకుంటే పీడీ యాక్ట్ పెడతానని చంద్రబాబు బెదిరించారు. హోదా కోసం వైఎస్సార్ సీపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. ఎంపీలు రాజీనామాలు చేసి అమరణ దీక్ష చేశారు. అప్పుడే చంద్రబాబు వాళ్ల ఎంపీలతో రాజీనామా చేయించి ఉంటే ప్రత్యేక హోదా రాకుండా పోయేదా? ఎల్లో మీడియా పట్ల జాగ్రత్తగా ఉండాలి.. చంద్రబాబు అన్ని అంశాల్లో రాష్ట్రాన్ని మోసం చేశారు. ఈ 20 రోజుల్లో చంద్రబాబు చెప్పని అబద్ధం ఉండదు. చంద్రబాబు తానా అంటే ఎల్లో మీడియా దానికి తందనా అంటూ కొమ్ముకాస్తోంది. ఉన్నది లేనట్టుగా.. లేనిది ఉన్నట్టుగా ప్రచారం చేస్తారు. ఎల్లో మీడియాతో మీరందరు జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఊరికి ముటలు, ముటలు డబ్బులు తీసుకోస్తారు. ప్రతి చేతిలో మూడు వేల రూపాయల డబ్బు పెడతారు. మీరందరు గ్రామాలకు వెళ్లి ప్రతి ఒక్కరికి చంద్రబాబు మోసాల గురించి చెప్పాలి. చంద్రబాబు ఇచ్చే మూడు వేల రూపాయలకు మోసపోకండి అని గ్రామాల్లోని అవ్వ తాతలకు చెప్పిండి. జగనన్న చెప్పకపోయి ఉంటే పించన్ రెండు వేలకు పెరిగిదా అని గుర్తుచేయండి. మన పిల్లలను బడికి పంపిస్తే చాలు అన్న ఏటా రూ. 15 వేల రూపాయలు ఇస్తాడని ప్రతి అక్కాచెల్లమ్మకు చెప్పండి. ఏ చదువైనా అన్న చదివిస్తాడని.. ఎన్ని లక్షలైనా కూడా భరిస్తాడని ప్రతి ఇంట్లో చెప్పండి. 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ మహిళలకు వైఎస్సార్ చేయూత కింద 75 వేల రూపాయలు నాలు దఫాలుగా చెల్లిస్తాం. ప్రతి రైతన్నకు మే నెలలోనే 12,500 రూపాయలు ఇస్తాం. నవరత్నాల గురించి ప్రతి అవ్వకు, తాతకు చెప్పిండి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచుకుందాం. ఎమ్మెల్యేగా నాగర్జునను, ఎంపీగా నందిగం సురేశ్‌ను దీవించమని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఆశీర్వదించమ’ని కోరారు. -
ఆనందబాబుకు ఆవిరైన ఆనందం
కొల్లూరు: వేమూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే, మంత్రి నక్కా ఆనందబాబు ఎన్నికల ప్రచారానికి ఆదిలోనే మహిళలు హంసపాదు పలికారు. గత ఎన్నికల ఆనవాయితీ ప్రకారం ఎన్నికల ప్రచారంలో భాగంగా తొలిగా నియోజకవర్గంలోని కొల్లూరు మండలం చిలుమూరు గ్రామానికి శనివారం ఆయన ప్రచారానికి వెళ్లారు. అయితే ఆయన ఊహలకు భిన్నంగా ఆదిలోనే మహిళల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. చిలుమూరులోని ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం, నియోజకవర్గంలోని నలుమూలల నుంచి కూడగట్టుకుని వచ్చిన అనుచరగణంతో అట్టహాసంగా నక్కా ప్రచారాన్ని ఆరంభించారు. అయితే చెరుకూరి సంపూర్ణ, పీకే రత్నకుమారి, పీకే లక్ష్మిలతోపాటు పలువురు మహిళలు నిలదీసేసరికి బిక్కమొహం వేశారు. తమకు కేటాయించిన నివేశనా స్థలాలను వేరే వ్యక్తులకు ఎలా ఇచ్చారని మహిళలు నిలదీశారు. దీంతో కోపగించుకున్న మంత్రి మహిళలపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో స్థానిక నాయకులు కలుగజేసుకుని సర్దిచెప్పారు. అనంతరం అనంతవరం గ్రామానికి వెళ్లిన నక్కాకు అక్కడ సైతం ఎదురుదెబ్బ తగిలింది. పారిశుద్ధ్య సమస్యపై అక్కడి మహిళలు నిలదీశారు. అయితే ఇవేమీ పట్టించుకోకుండా ఆనందబాబు ఓ కుటుంబం ఓట్లు బహిరంగంగా కొనుగోలు చేశారు. పింఛన్ పొందుతున్న దివ్యాంగుడి కుటుంబానికి బహిరంగంగా నగదు అందజేసి విమర్శల పాలయ్యారు. అనంతరం అనంతవరంలో చర్చికి రూ.1 లక్ష చెక్కును అందజేసి ఎన్నికల కోడ్‌ను అతిక్రమించారు. -
వైఎస్ఆర్సీపీలో చేరిన వేమూరు కాంగ్రెస్ నేతలు
-
నేడు సీఎం చంద్రబాబు జిల్లాకు రాక
వేమూరు: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంగళవారం వేమూరు రానున్నారు. మంగళవారం నుంచి ప్రారంభమవుతున్న తెలుగుదేశం పార్టీ జన చైతన్య యాత్రల్లో భాగంగా సీఎం ఇక్కడకు వస్తున్నట్టు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు సోమవారం తెలిపారు. మండల కేంద్రంలో నిర్వహించే జనచైతన్య గ్రామసభ, ఎన్టీఆర్ పురవేదికలో జరిగే బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొంటారని ఎమ్మెల్యే వివరించారు. సీఎం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. -
ఆ అమ్మాయికి.. పెళ్లి చేశారు
* ప్రేమికుడితోనే అత్యాచార బాధితురాలికి పెళ్లి * పట్టుబడ్డ ఇద్దరు నిందితులకు రిమాండ్ వేమూరు: ఏపీలోని గుంటూరు జిల్లా వేమూరు మండలం రావికంపాడు పంటపొలాల్లో శనివారం వేకువజామున అత్యాచారానికి గురైన యువతికి ప్రేమికుడితోనే పెద్దలు పెళ్లి చేశారు. పోలీసులమంటూ ప్రేమజంటపై నలుగురు అత్యాచారం చేసిన విషయం తెలిసిందే.దీంతో విషయం తెలుసుకున్న ప్రేమజంట కుటుంబసభ్యులు ఆదివారం ఉదయ రూరల్ పోలీస్‌స్టేషనుకు చేరుకున్నారు. గాయపడ్డ రాజేష్ వ్యవసాయ పనులకు వెళుతుంటాడు. అతడు ప్రేమించిన యువతికి తల్లిదండ్రులు లేరు. అమ్మాయికి అన్యాయం జరగకుండా పెళ్లిచేసుకోవాలన్న బంధువులు, సంఘపెద్దల సూచనను రాజేష్, అతడి కుటుంబసభ్యులు అంగీకరించారు. పెళ్లికి అవసరమైన దుస్తులు, ఇతర సామగ్రిని ఎంపీపీ డాక్టర్ మధుసూదన్ సమకూర్చారు. సాయంత్రం కొల్లూరులోని పెద్దచర్చిలో వీరి వివాహం జరిగింది. అత్యాచారానికి పాల్పడ్డ నలుగురిలో అదుపులో ఉన్న ఇద్దరిని శనివారంరాత్రి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా 15 రోజుల రిమాండ్ విధించారు. పట్టుబడినవారిలో రాతంశెట్టి సుధాకర్ (39), అడుసుమల్లి వెంకటేశ్వరరావు(26) ఉన్నారు. సుధాకర్ ఢిల్లీలో సైనికుడిగా విధలు నిర్వర్తిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
యువతిపై గ్యాంగ్ రేప్.
-
కరెంట్‌కూ కటకట
*వ్యవసాయ విద్యుత్ సరఫరాపై ఆందోళన *వర్షాలు పడక .. కరెంట్ లేక అల్లాడుతున్న రైతులు *మోటార్లు పనిచేయక ఎండుతున్న వరి చేలు *నాట్లు వేసిన ప్రాంతాల్లో నీళ్లు లేక నెర్రెలిచ్చిన వరి పొలాలు *కరెంట్‌కూ కటకట వేమూరు: వర్షాభావ పరిస్థితులు రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ ఖరీఫ్ సీజన్‌కుగాను గత నెలలో కురిసిన అరకొర వర్షాలు రైతుల్లో ఆశలు చిగురింపచేయడంతో డెల్టాలో అక్కడక్కడా వరి నాట్లు వేశారు. ఈ నెలలో వరుణుడు ముఖం చాటెయ్యటంతో వేసిన నాట్లు నీరు లేక ఎండిపోతున్నాయి. మరి కొందరు దుక్కి చేసిన పొలాల్లో నాట్లు వేసేందుకు నీటి కోసం ఎదురు చూస్తున్నారు. చేసేది లేక అదనపు భా రాన్ని సైతం భరిస్తూ ఆయిల్ ఇంజన్ల ద్వారా నీటిని సమకూర్చుకునే పనిలో పడ్డారు. కనీసం బోర్ల సాయంతోనైనా సాగు చేసేందుకు వ్యవసాయ విద్యుత్ సరఫరా అరకొరగానే ఉందని రైతులు దిగులు పడుతున్నారు. వేమూరు మండలంలో 22 వేల ఎకరాల్లో రైతులు వరిసాగు చేపట్టారు. వీరిలో రైతులు, కౌలు రైతులు ఉన్నారు. ఇక్కడ వ్యవసాయ మోటార్లు వెయ్యి వరకు ఉన్నాయి. మండలంలో ఎ, బి రెండు గ్రూపులుగా వ్యవసాయ విద్యుత్ సరఫరా ఉంది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఎ గ్రేడ్ విధానంలో రైతులకు ఉదయం నాలుగు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు, రాత్రి పది నుంచి పన్నెండు గంటల వరకు సరఫరానివ్వాలి. అయితే త్రీఫేజ్ సమస్యగా ఉందని రాత్రి వేళ సరఫరా చేయడం లేదు. ఉదయం ఐదు గంటల పాటు ఇవ్వాల్సిన సరఫరాను మూడు గంటలు కూడా ఇవ్వటం లేదు. దీంతో రైతులు నానా తంటాలు పడు తున్నారు. అరకొరగా ఉన్న విద్యుత్ సరఫరాతో మోటార్లు పనిచేయక నాట్లు ఎండిపోతున్నాయి. ఇక కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. ఎకరాకు దాదాపు రూ.25 వేలు కౌలు చెల్లించారు. నీటి కోసం అదనపు ఖర్చుల తో ఇంజన్లు వినియోగిస్తున్నారు. ఇంజన్లు, పైపుల అద్దె, డీజిల్ ఖర్చులు మోయలేని భారంగా ఉన్నాయంటున్నారు. పూర్తిస్థాయిలో ఇవ్వలేకపోతున్నాం.. రైతులకు ఏడు గంటల విద్యుత్ సరఫరా ఇవ్వాల్సి ఉంది. ఉదయం నాలుగు నుంచి తొమ్మిది గంటల వరకు, రాత్రి పది నుంచి 12 వరకు ఇవ్వాలి. అయితే త్రీఫేజ్ సమస్య కారణంగా రాత్రి వేళల్లో విద్యుత్ సరఫరా ఇవ్వలేకపోతున్నాం. ఉదయం ఇస్తున్న సరఫరాలో కూడా కొన్ని సాంకేతిక పరమైన ఇబ్బంది కారణంగా పూర్తిస్థాయిలో ఇవ్వలేకపోతున్నాం. - శివప్రసాదు, విద్యుత్ ఏఈ, వేమూరు అలుగురాజుపల్లి రైతుల రాస్తారోకో మాచర్లటౌన్ :వేళాపాళా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు విద్యుత్ కోతలు విధిస్తూ విద్యుత్ శాఖ సిబ్బంది తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండలంలోని అలుగురాజుపల్లి గ్రామానికి చెందిన రైతులు ఆగ్రహంతో సోమవారం గ్రామ ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ద్వారకాపురి విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణం చాన్నాళ్ల కిందటే పూర్తయినా ప్రజా ప్రతినిధులు ప్రారంభించే వరకు చార్జి చేయకుండా ఉండడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈలోగా వేసిన పంటలకు కరెంటు కోత వల్ల నీరులేక ఎండిపోయే పరిస్థితి నెలకొందన్నారు. గ్రామస్తులు రాస్తారోకో చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న విజయపురిసౌత్ ఎస్ఐ నిస్సార్‌బాషా ఫోన్ ద్వారా రైతులతో సంప్రదింపులు జరిపారు. విద్యుత్ శాఖ అధికారులతో చర్చించి సమస్య పరిష్కారం అయ్యేటట్టు చర్యలు తీసుకుంటానని వారికి తెలిపారు. ఇదే విషయాన్ని రూరల్ ఏఈ గౌతమ్‌కు తెలియపర్చారు. దీంతో ఏఈ గౌతమ్ గ్రామ రైతులతో చర్చలు జరిపి మధ్యాహ్నం నుంచి అలుగురాజుపల్లి ఫీడర్‌కు తాత్కాలికంగా చార్జి చేస్తామని చెప్పడంతో రైతులు రాస్తారోకో విరమించారు. జువ్వలపాలెంలో రైతుల ధర్నా ప్రభుత్వం వ్యవసాయానికి ఏడు గంటల విద్యుత్‌ను అందించడంలో విఫలమైందని ఆరోపిస్తూ 11 లంక గ్రామాల రైతులు విద్యుత్ సబ్‌స్టేష్టన్‌ను ముట్టడించి మెయిన్ గేట్ వద్ద ధర్నా నిర్వహించారు. రైతుల కష్టాలు ప్రభుత్వానికి పట్టడం లేదంటూ కొల్లూరు మండల పరిధిలోని రైతులు సోమవారం జువ్వలపాలెం విద్యుత్ సబ్‌స్టేష్టన్ వద్ద ఆందోళన చేశారు. -
పేకాటరాయుళ్లు అరెస్ట్: భారీగా నగదు స్వాధీనం
గుంటూరు: గుంటూరు జిల్లా వేమూరులోని పేకాటస్థావరాలపై మంగళవారం పోలీసులు దాడులు చేశారు. ఈ సందర్బంగా అయిదుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి భారీగా నగదుతోపాటు సెల్ఫొన్లు స్వధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీసు స్టేషన్‌కు తరలించారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వైఎస్సార్ హయాంలో..
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖ రరెడ్డి హయాంలో నియోజకవర్గం అభివృద్ధి పథంలో పయనించింది. అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. జిల్లాలో ఉన్న ఏకైక చక్కెర ఫ్యాక్టరీ వేమూరు మండలం జంపనిలో ఉంది. 2004 ముందు ప్రైవేట్ సంస్థ ఆధీనంలో ఉండటంతో వందలాది మంది రైతులు, కార్మికుల భవితవ్యం ప్రశ్నార్థకంగా తయారైంది. మూతబడిన ఫ్యాక్టరీని వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తెరిపించి సుమారు 2.5 కోట్లు రూపాయలు మంజూరు చేశారు. వైఎస్సార్ మరణాంతరం ఫ్యాక్టరీ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం ఫ్యాక్టరీ మూతపడింది. జంపనిలో రేపల్లె మెయిన్ డ్రెయిన్‌పై కొత్త వంతెన నిర్మాణానికి వైఎస్ రూ.1.35కోట్లు మంజూరు చేశారు. చుండూరు మండలంలో నూతనంగా నిర్మించిన గురుకుల పాఠశాల భవన నిర్మాణానికి రూ.9.6 కోట్లు మంజూరు చేశారు. వైఎస్సార్ మరణం తర్వాత... పేదోడికి సొంతింటి కల ‘కల్ల’గానే మిగిలిపోయింది. అధికార పార్టీ సిఫార్సులున్నవారికే ఇందిరమ్మ ఇళ్లు దక్కుతున్నాయి. తూతూ మంత్రంగా కొంత మంది అర్హులు దక్కించుకున్నా వారుకూడా బిల్లుల కోసం నెలల తరబడి అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. మహానేత వైఎస్సార్ మరణం తర్వాత పేదలను పట్టించుకునే వారే కరువయ్యారు. -
వేమూరు ఎమ్మెల్యేపై కేసు నమోదు
గుంటూరు: వేమూరు తహసీల్దార్ కార్యాలయ ఉద్యోగిపై చేయి చేసుకున్న వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. రెవెన్యూ వర్గాల ఫిర్యాదు మేరకు ఆనందబాబుపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. ఓటర్ల నమోదు, తొలగింపులో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ శుక్రవారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వేమూరు తహశీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా ఓ ఉద్యోగిపై ఆ పార్టీ ఎమ్మెల్యే ఆనంద బాబు చేయిచేసుకున్నారు. వేమూరు మండలంలో తమ పార్టీ సానుభూతిపరుల పేర్లను జాబితా నుంచి తొలగించారంటూ టీడీపీ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా చేపట్టారు. ఫోర్జరీ సంతకాలు చేసి ఫిర్యాదు చేస్తే ఎలా తొలగిస్తారంటూ ఎమ్మెల్యే ఆనందబాబు కార్యాలయ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసి ఓ ఉద్యోగిపై చేయి చేసుకున్నారు.