వేమూరు: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంగళవారం వేమూరు రానున్నారు. మంగళవారం నుంచి ప్రారంభమవుతున్న తెలుగుదేశం పార్టీ జన చైతన్య యాత్రల్లో భాగంగా సీఎం ఇక్కడకు వస్తున్నట్టు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు సోమవారం తెలిపారు.
మండల కేంద్రంలో నిర్వహించే జనచైతన్య గ్రామసభ, ఎన్‌టీఆర్ పురవేదికలో జరిగే బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొంటారని ఎమ్మెల్యే వివరించారు. సీఎం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు.
నేడు సీఎం చంద్రబాబు జిల్లాకు రాక
Published Tue, Dec 1 2015 12:51 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM
Advertisement
Advertisement