డిచ్‌పల్లి, న్యూస్‌లైన్ : ఇచ్చిన మాట మీద నిలిచి, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని పీసీసీ మాజీ చీఫ్, ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్ పిలుపునిచ్చారు. పరిషత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన బుధవారం డిచ్‌పల్లి మండలం గన్నారం, తిర్మన్‌పల్లి, రాంపూర్, మిట్టాపల్లి, కమలాపూర్, ఘన్‌పూర్, డిచ్‌పల్లి రైల్వే స్టేషన్, నడిపల్లి, ధర్మారం(బి), బర్ధిపూర్ గ్రామాల్లో పర్యటించారు. ఇచ్చిన మాట ప్రకారమే సోనియా తెలంగాణ ఇచ్చారని అన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీలతో పాటు, ఈనెల 30న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరిని కోరుకుంటున్నారు..
రూరల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరిని కోరుకుంటున్నారని ప్రతి గ్రామంలో నిర్వహించిన ప్రచారంలో డీఎస్ ఆయా గ్రామస్తులను ప్రశ్నించారు. దీనికి డి.శ్రీనివాస్‌ను అని వారు సమాధానం ఇవ్వడంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు. మీరందరూ చెబితే తప్పకుండా ఎన్నికల్లో నిలబడతానన్నారు.
జెడ్పీటీసీ అభ్యర్థి కూరపాటి అరుణతో పాటు, ఎంపీటీసీ అభ్యర్థులు లంబాని లక్ష్మి, డాక్టర్ శివప్రసాద్, దెగావత్ లక్ష్మి, కూతురు సువర్ణ, ఒడ్డెం సవిత, పొలసాని లక్ష్మి, కడ్దూరం రవికిరణ్, సలీం, పాయల్, పార్టీ నాయకులు గజవాడ జైపాల్, కంచెట్టి గంగాధర్, అమృతాపూర్ గంగాధర్, సుజాత, చింతశ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాస్, చిన్నయ్య, మురళి, గాండ్ల లక్ష్మీనారాయణ, ధర్మాగౌడ్, దేవాగౌడ్, అంబర్‌సింగ్ తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు.
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను గెలిపించాలి
Published Thu, Apr 3 2014 2:00 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement