D. Srinivas
-
డీఎస్‌కు తీవ్ర అస్వస్థత.. పరిస్థితి విషమం: ఆసుపత్రి వర్గాలు
సాక్షి, హైదరాబాద్/ ఖలీల్‌వాడి: పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీమంత్రి ధర్మ పురి శ్రీనివాస్(డీఎస్) తీవ్ర అస్వస్థత కు గురయ్యారు. శ్వాస సంబంధిత సమస్యతో ఆయనను కుటుంబసభ్యులు సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని సిటీన్యూరో ఆసుపత్రిలో చేర్చారు. వైద్య పరీక్షల అనంత రం ఐసీయూలో ఉంచి వైద్యులు చికిత్స ప్రారంభించారు. ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని, ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని సోమవారం రాత్రి ఆసుపత్రి వర్గాలు విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో వెల్లడించాయి. -
పుట్టిన రోజునాడే ప్రమాదం.. ఇంట్లో జారి పడిన డీఎస్
సాక్షి, నిజామాబాద్ అర్బన్ : రాజ్యసభ సభ్యుడు డి శ్రీనివాస్ సోమవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో జారిపడ్డారు. దీంతో అతని ఎడమ భుజం వద్ద ఎముక విరిగింది. ఆయన పుట్టిన రోజునాడే ఈ ప్రమాదం జరిగింది. ఇంట్లో పూజ చేసి బయటకు వచ్చే క్రమంలో జారి పడ్డారు. డీఎస్ ఆరోగ్యం బాగానే ఉందని, నాలుగు రోజుల తర్వాత సర్జరీ చేయనున్నట్లు ఈయన తనయుడు ఎంపీ అర్వింద్ ఫేస్బుక్ ద్వారా తెలిపారు. డీఎస్‌తో కలిసిన ఫొటోను షేర్ చేశారు. చదవండి: (ప్రపంచంలోనే అతిపెద్ద ఎకో అర్బన్ పార్క్ ‘తెలంగాణలో..’) -
ఇక జిల్లాలవారీగా పార్టీ ప్రక్షాళన
సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల కోసం ప్రజాక్షేత్రంలో సర్వేలు చేస్తూనే టీఆర్ఎస్లో అంతర్గత అంశాలపై పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దృష్టి కేంద్రీకరించారు. రానున్న ఎన్నికల్లో పార్టీ పరిస్థితితోపాటు అభ్యర్థుల ప్రభావాన్ని, పనితీరును ఎప్పటికప్పుడు మదింపు చేస్తున్నారు. వివిధ సర్వే సంస్థల ద్వారా చేపట్టిన సర్వేలు, పోలీసు నిఘా వర్గాలు, ఇతర మార్గాల ద్వారా నిరంతరం సమాచారాన్ని సేకరిస్తున్నారు. పార్టీకి, కేసీఆర్ నాయకత్వానికి అనుకూలంగానే క్షేత్రస్థాయిలో ఓటర్లు ఉన్నట్లు పలు నివేదికలు, సర్వేలు వస్తున్నాయి. అయితే చాలా నియోజకవర్గాల్లో, అంటే దాదాపుగా రాష్ట్రంలోని మూడొంతుల నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలపై పార్టీ శ్రేణులు, ఓటర్లు వ్యతిరేకంగా ఉన్నట్లు వస్తున్న నివేదికలను సీఎం ప్రత్యేకంగా మదింపు చేస్తున్నారు. దీనికోసం ముందుగా పార్టీలోని పరిస్థితులపై నివేదికలను జిల్లా మంత్రులు, ముఖ్యుల ద్వారా తెప్పించుకుంటున్నట్లు తెలుస్తోంది. పార్టీకి విధేయంగా ఉన్న ఎమ్మెల్యేలు, కొంత కష్టపడితే గెలుస్తారనే విశ్వాసమున్న నియోజకవర్గాల్లో ముందుగా దిద్దుబాటు చర్యలకు దిగుతున్నారు. పార్టీలో అంతర్గతంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తే గెలుపు సులభం అవుతుందనే విశ్వాసమున్న నియోజకవర్గాల్లో కొంత కఠినంగా వ్యవహరించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీనికోసం పార్టీ మండలస్థాయి నేతల బలాబలాలు, శక్తి సామర్థ్యాలతోపాటు భవిష్యత్తు యోచనను జిల్లా యంత్రాంగం ద్వారా సేకరిస్తున్నారు. దీనికి అనుగుణంగానే చర్యలు తీసుకోవాలని యోచిస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్‌ను ఆశిస్తూ సిట్టింగ్ ఎమ్మెల్యేలను నష్టపరిచే చర్యలకు టీఆర్ఎస్ నేతలే దిగుతున్నారు. మరికొందరు ద్వితీయ శ్రేణి నేతలు కొందరు స్థానిక ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ఉన్నారు. దీంతో స్థానికంగా పదవులు, రాజకీయాలపై ఆసక్తి ఉన్న నేతలతో చర్చించి, వారి సమస్యలను పరిష్కరించే బాధ్యతలను జిల్లా నేతలకు అప్పగించనున్నారు. ఎమ్మెల్యే టికెట్‌ను ఆశించి, స్థానికంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఇబ్బందులు కలిగిస్తున్న వారితో జిల్లా మంత్రులు, ఇతర ముఖ్యులు చర్చించాలనే యోచనలో ఉన్నారు. ఎమ్మెల్యేగా అవకాశం కల్పించలేని వారికి మరో మార్గంలో రాజకీయంగా స్థానాన్ని కల్పిస్తామని హామీలతో రానున్న ఎన్నికల్లో వారితో ఇబ్బందులు రాకుండా చూడాలని అనుకుంటున్నారు. ఏదేమైనా ఎమ్మెల్యే టికెట్ తప్ప మరో ప్రత్యామ్నాయ మార్గాన్ని ఒప్పుకోని నాయకులను, ఇంకా ఏవైనా ఇతర మార్గాల్లో పార్టీకి నష్టం కలిగిస్తారనే అంచనా ఉన్న నాయకులను పార్టీ నుంచి బయటకు పంపించడానికి కూడా వెనుకాడకూడదనే యోచనలో సీఎం ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి నియోజకవర్గాల్లో ఇతర పార్టీల నేతలను టీఆర్ఎస్లో చేర్చుకోవడం ద్వారా నష్టాన్ని పూడ్చుకోవాలని భావిస్తున్నారు. భూపతిరెడ్డి, డీఎస్‌పై వ్యూహం ఏమిటో...? నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ ఆర్. భూపతిరెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ ఆ జిల్లాకు చెందిన మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీలు కె.కవిత, బి.బి.పాటిల్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ అధినేత కేసీఆర్‌కు ఆరు నెలల కిందట లేఖ రాశారు. అలాగే రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, ఆయనపైనా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ తాజాగా లేఖ రాశారు. అయితే ఈ రెండు ఫిర్యాదులపైనా సీఎం కేసీఆర్ మనోగతం పార్టీ నేతలకు అంతుచిక్కడం లేదు. ఈ విషయంలో ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారోనని పార్టీ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. -
ప్రత్యామ్నాయాలు చూపండి
సాక్షి, న్యూఢిల్లీ: అంతర్రాష్ట్ర నదీ జలాల పంపిణీలో తలెత్తుతున్న వివాదాల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను చూపాలని నీటి వనరులపై ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో టీఆర్ఎస్ ఎంపీ డి.శ్రీనివాస్ గురువారం కోరారు. నదీ జలాల పంపిణీలో తలెత్తుతున్న వివాదాలను పరిష్కరించేందుకు ట్రిబ్యునల్‌లో చాలా సమయం పడుతోందని, చివరకు సరైన పరిష్కారాలు చూపలేకపోతున్నాయని అన్నారు. దీన్ని పరిష్కరించేందుకు కేంద్రం ప్రత్యేక దృష్టి సారించాలని, నీటి పారుదల రంగ నిపుణుల పర్యవేక్షణలో నూతన ఆలోచనలు చేయాలని సూచించారు. -
డీఎస్ కుమారుడి ‘ప్రకటన’ కలకలం
► జనమంతా మోదీ వెంట నిలవాలని జాతీయస్థాయి ► పత్రికకు భారీ ప్రకటన ► రాజకీయంగా చర్చనీయాంశం ► ఆ ప్రకటనతో సంబంధం లేదన్న డి.శ్రీనివాస్ సాక్షి, నిజామాబాద్: రాజ్యసభ సభ్యుడు, టీఆర్ఎస్ ముఖ్యనేత డి.శ్రీనివాస్ పార్టీ మారతారనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఆయన రెండో కుమారుడు ధర్మపురి అరవింద్ మంగళవారం ఓ జాతీయస్థాయి పత్రికకు ఇచ్చిన భారీ ప్రకటన రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది. ఇప్పటివరకు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న అరవింద్ స్వాతం త్య్ర దినోత్సవం సందర్భంగా ‘‘జాతి మొత్తం మోదీ వెంటే నిలవాలి’’అని పేర్కొంటూ ప్రకటన ఇచ్చారు. ఇది రాజకీయవర్గాల్లో చర్చనీ యాంశమైంది. ఇప్పటికే డీఎస్ ప్రధాన అనుచరుడిగా పేరున్న సంగారెడ్డి జిల్లా మాజీ డీసీ సీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్ కొన్ని నెలల కిందట బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అరవింద్ తాజా ప్రకటనతో డీఎస్ కూడా పార్టీ మారతారనే వాదనకు బలం చేకూరుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాను పార్టీ మారతానని జరుగుతున్న ప్రచారాన్ని డీఎస్ ఖండించారు. అంటీముట్టనట్లుగా.. 2014 ఎన్నికల్లో నిజామాబాద్ రూరల్ నియో జకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన డీఎస్ ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా నియమితులయ్యారు. తర్వాత రాజ్యసభ సభ్యునిగా కేసీఆర్ అవకాశం కల్పించా రు. ఎంపీ పదవిలో ఉన్నా డీఎస్.. కొంతకాలంగా టీఆర్ఎస్లో క్రియాశీలకంగా వ్యవహ రించడం లేదు. ఆయన మొదటి కుమారుడు, నిజామాబాద్ మాజీ మేయర్ సంజయ్ కూడా టీఆర్ఎస్కు దూరంగా ఉంటున్నారు. ఐదు నెలల క్రితం టీఆర్ఎస్ నిర్వహించిన సభ్యత్వ నమోదులో సంజయ్ తన పార్టీ సభ్యత్వాన్ని రెన్యువల్ చేయించుకోలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టీఆర్ఎస్తో అంటీముట్టనట్లు ఉంటున్న డీఎస్, ఆయన కుటుంబీకులతో బీజేపీ రాష్ట్ర నాయకత్వం గత కొంత కాలంగా టచ్‌లో ఉంటోంది. అరవింద్ కూడా ఇటీవల ఆ పార్టీ జాతీయ అ«ధ్యక్షుడు అమిత్‌షాను కలసినట్లు తెలుస్తోంది. ఈ విషయమై అరవింద్‌ను సంప్రదించగా.. తాను ఇచ్చిన ప్రకటనతో తన తండ్రికి ఎలాంటి సంబంధం లేదని వ్యాఖ్యానించారు. తాను ఇప్పట్లో బీజేపీలో చేరడం లేదని, అలాంటిదేమైనా ఉంటే చెబుతామని అన్నారు. పార్టీ వీడను: డి.శ్రీనివాస్ ‘‘నా కుమారుడు అరవింద్ ఇచ్చిన ప్రకటనకు నాకు ఎలాంటి సంబంధం లేదు.. ఆ ప్రకటన అంత ప్రాధాన్య అంశమేమీ కాదు. నేను టీఆర్ఎస్ను వీడేది లేదు. కేసీఆర్ వెంటే ఉంటాను. అరవింద్ ప్రకటన గురించి ఆయన్నే అడగాలి. అరవింద్ కూడా బీజేపీలో చేరతాడని అనుకోవడం లేదు’’ అని డీఎస్ ‘సాక్షి’తో పేర్కొన్నారు. -
పార్టీ మారే ప్రసక్తిలేదు: డీఎస్
సాక్షి, హైదరాబాద్: తాను పార్టీ మారే ప్రసక్తిలేదని టీఆర్ఎస్ రాజ్యసభసభ్యుడు డి.శ్రీనివాస్ స్పష్టంచేశారు. టీఆర్ఎస్ను వదిలిపెట్టి తిరిగి కాంగ్రెస్‌లోకి వెళ్తున్నట్టు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని డీఎస్ అన్నారు. శుక్రవారం ఆయన తెలంగాణభవన్‌లో మాట్లాడుతూ టీఆర్ఎస్కు రాజీనామా చేస్తున్నట్టుగా వచ్చిన వార్తలతో తనలాంటి నాయకులపై ఉన్న విశ్వసనీయతపోతుందన్నారు. తానంటే గిట్టని కొంతమంది నేతలు పనిగట్టుకుని ఉద్దేశపూర్వకంగా ఇలాంటి కుట్రలు, ప్రచారం చేస్తున్నారని అన్నారు. తాను కాంగ్రెస్‌నేతలు ఎవరినీ కలవలేదని, ఎవరితోనైనా మాట్లాడి ఉంటే బయటపెట్టాలని డీఎస్ డిమాండ్ చేశారు. తాను పార్టీ మారుతున్నట్టుగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వంటి నాయకుడు చెబుతాడని అనుకోవడంలేదని పేర్కొన్నారు. -
తిరిగి కాంగ్రెస్‌లో చేరడం అవాస్తవం: డీఎస్
సాక్షి, న్యూఢిల్లీ: తాను తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని వస్తున్న వార్తలు అవాస్తమని టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ స్పష్టం చేశారు. గురువారం ఆయన ఢిల్లీలో మాట్లా డుతూ.. తన సూచన మేరకే దిగ్విజయ్‌ను తెలంగాణ ఇన్చార్జ్ వ్యవహారాల నుంచి సోనియాగాంధీ తొలగించారనడం అవాస్త వమని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తాను టీఆర్ఎస్లో గౌరవంగా ఉన్నా నని, సీఎం కేసీఆర్‌కు.. తనకు ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. తన హోదాకు తగ్గట్టు కేసీఆర్ గౌరవిస్తున్నారన్నారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అన్యాయానికి గురైందని తాను కాంగ్రెస్‌లో ఉన్నప్పుడే చెప్పానన్నారు. ఎన్నికలు సమీపిస్తున్నందునే కాంగ్రెస్ లేనిపోని విమర్శలు చేస్తోందని డీఎస్ మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో బంగారు తెలంగాణ సాధ్యమవుతుందన్నారు. -
దిగ్విజయ్ వ్యాఖ్యలు అర్థరహితం
ఆయనపై చర్యలు తప్పవ్: రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ తెలంగాణ పోలీసులపై చేసిన సంచలన వ్యాఖ్యలు ఆయన బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని టీఆర్ఎస్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ మండిపడ్డారు. ముస్లిం యువకులను ఐసిస్‌లో చేరేలా తెలంగాణ పోలీసులు ప్రోత్సహిస్తున్నారని అనడం అర్థరహితమని, అవి తెలివితక్కువ మాటలని ఆయన అభిప్రాయ పడ్డారు. తెలంగాణ భవన్లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ పోలీసులకు మంచి పేరు ఉందని, వారి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయొద్దని హితవు పలికారు. కేవలం దిగ్విజయ్ వల్లే మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ దుకాణం బంద్ అయిందని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ పోలీసులపై తప్పుడు ప్రచారం చేసిన ఆయన తక్షణం క్షమాపణ చెప్పాలని డీఎస్ డిమాండ్ చేశారు. ఆయన చేసిన ఆరోపణలకు సంబంధించి ఒక వేళ ఏమైనా ఆధారాలు ఉంటే బయటపెట్టాలని సూచించారు. ఆరోపణలు చేయగానే సరిపోదని, రుజువు చేయకుంటే చట్టపరమైన చర్యలుంటాయని హెచ్చరించారు. దిగ్విజయ్ లేపిన ఈ దుమారంపై కాంగ్రెస్ హై కమాండ్ స్పందించాలని అన్నారు. -
ఉచిత ఎరువు .. దమ్మున్న నిర్ణయం
కేసీఆర్ అంత ధైర్యం ఉన్న సీఎం దేశంలో మరొకరు లేరు: డీఎస్ సాక్షి, హైదరాబాద్ : వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రాష్ట్ర రైతాంగానికి ఉచితంగా ఎరువు లు సరఫరా చేయాలని కేసీఆర్ తీసుకున్న నిర్ణయం దమ్మున్న నిర్ణయమని రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ పేర్కొన్నారు. దేశంలో ఇంత గుండె ధైర్యం ఉన్న సీఎం మరొకరు లేరన్నారు. తెలంగాణ భవన్ లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ ఎంతో ధైర్యంగా రిజర్వేషన్ల పెంపుపై ముందుకు సాగుతున్నారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంకా మూ డేళ్లు కూడా కాలేదని, అయినా అద్భుతాలు సృష్టిస్తోందన్నారు. ఎరువులకోసం ఎకరాకు రూ.4వేలు రైతులకు ఇవ్వాలనే నిర్ణయం సామాన్యమైనది కాదని, ఎవరినో కాపీ కొట్ట వలసిన అవసరం కేసీఆర్‌కు లేదని చెప్పారు. ‘కొందరు నేతలు హామీలుఇచ్చి మర్చిపోతా రు. కేసీఆర్ అలా కాదు’ అన్నారు. రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎందుకు ఉచితంగా ఎరువులు ఇవ్వలేదని ప్రశ్నించారు. -
ప్రతిపక్షాల విమర్శలు అర్థరహితం : డి. శ్రీనివాస్
రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్ చంద్రశేఖర్‌కాలనీ(నిజామాబాద్): మహారాష్ట్ర ప్రభుత్వం తో సీఎం కేసీఆర్ చరిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకుంటే ప్రతిపక్షాలు అర్థరహిత విమర్శలు చేస్తున్నాయని రాజ్యసభ సభ్యులు ధర్మపురి శ్రీనివాస్ అన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం మోసపూరితమైందని, తెలంగాణను తాకట్టుపెడుతున్నారని ప్రతిపక్షాలు విమర్శించడం తగదన్నారు. ఆదివారం నిజామాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇరవై ఏళ్లుగా పరిపాలించిన టీడీపీ, కాంగ్రెస్‌ల హయాంలో ప్రాజెక్టుల నిర్మాణాలకు కోట్లాది రూపాయలు ఖర్చు చేసినా పనులు మాత్రం జరగలేదన్నారు. కాంగ్రెస్ హయాంలో తమ్మిడిహెట్టి బ్యారేజీ 152 అడుగుల ఎత్తులో నిర్మాణంపై ఒప్పంథ దం జరగలేదని సీఎల్పీ నేత జానారెడ్డి చెప్పిన మాట వాస్తవమేనని డీఎస్ అన్నారు. -
కాంగ్రెస్ నాకేమిచ్చింది?: డీఎస్
ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన డి.శ్రీనివాస్ సీఎం కేసీఆర్ గొప్ప విజన్ ఉన్న నాయకుడని పొగడ్త హైదరాబాద్: ‘ కాంగ్రెస్ పార్టీని ఉమ్మడి రాష్ట్రంలో రెండు సార్లు అధికారంలోకి తీసుకొస్తే నాకేమిచ్చింది? ’ అని ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుడు ధర్మపురి శ్రీనివాస్ ప్రశ్నిం చారు. ‘‘45 ఏళ్ల పాటు కాంగ్రెస్‌లో ఉన్నా. ఆ పార్టీకి చాలా సేవ చేశాను. రెండు సార్లు అధికారంలోకి తీసుకొచ్చాను. కానీ నాకు ఆ పార్టీ ఇచ్చిందేంటి? కాంగ్రెస్‌లో పదవులు పొంది ఎకరాల కొద్ది ఆస్తులేమైనా సంపాదించానా? నేను కనుక నోరు తెరిస్తే చాలామంది ఇబ్బం దుల్లో పడతారు జాగ్రత్త. కొన్ని విషయాలలో నేనే నష్టపోయాను. అనవసర వివాదాలకు పోకూడదని నిర్ణయించుకున్నా’’ అని వ్యాఖ్యానించారు. శుక్రవారం సచివాలయంలో ఉద యం 11.45 గంటలకు ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా డీఎస్ బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప విజన్ ఉన్న నాయకుడంటూ పొగడ్తలతో ముంచెత్తారు. సీఎం కేసీఆర్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు. తనకున్న అనుభవాన్ని ఉపయోగించి అంతర్రాష్ట్ర వివాదాలు సామరస్యంగా పరిష్కారమయ్యే విధంగా కృషిచేస్తానన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో ఇరిగేషన్‌తో పాటు హైకోర్టు విభజన, ఉద్యోగుల విభజన తదితర సమస్యల పరిష్కారానికి దోహదపడతానన్నారు. టీఆర్ఎస్ను మరింత బలోపేతం చేసి, మరో 2 టర్మ్‌లు అధికారంలోకి వచ్చేలా తన వంతు సహాయం అందిస్తానన్నారు. అంతా బీటీ బ్యాచే..: తెలంగాణ రాష్ట్రం కోసం కృషిచేసిన వారంతా... ముఖ్యంగా టీఆర్ఎస్లో ఉండి పోరాడిన వారు బంగారు తెలంగాణ బ్యాచ్(బీటీ బ్యాచ్)కు చెందిన వారే అని డీఎస్ అన్నారు. ఇటీవల టీఆర్ఎస్లో చేరుతున్న బీటీ బ్యాచ్‌తో మొదటి నుంచి ఉన్న వారికి అన్యాయం జరుగుతోందనే వాదనలపై మీడియా ప్రశ్నకు డీఎస్ బదులిస్తూ.... తలరాతను బట్టి ఎట్ల రాసిపెట్టి ఉంటే అట్లే జరుగుతాదని చెప్పారు. తనకు టాలెంట్ ఉండటం వల్లే కేసీఆర్ పదవి అప్పగించారన్నారు. -
రాజయ్య ఖాళీచేసిన ఛాంబర్ డీఎస్‌కు
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా నియమితులైన టీఆర్ఎస్ నేత డి. శ్రీనివాస్ కు ఎట్టకేలకు ఛాంబర్ కేటాయించారు. సలహాదారుగా నియామకం ఖరారయి పదిరోజులు కావస్తున్నప్పటికీ ఛాంబర్ కేటాయింపులో ఏర్పడిన జాప్యం వల్లే బాధ్యతల స్వీకారానికి ఆయన దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. సచివాలయంలోని డీ బ్లాక్ మొదటి అంతస్తులో డీఎస్ కు పేషీని కేటాయిస్తూ సాధారణ పరిపాలనా శాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. గతంలో డిప్యూటీ సీఎంగా పనిచేసి, అవినీతి ఆరోపణల నేపథ్యంలో రాజీనామా చేసిన టి రాజయ్య ఇదే ఛాంబర్ నుంచి విధులు నిర్వర్తించారు, ఛాంబర్ కేటాయింపు ప్రక్రియ పూర్తి కావడంతో శుక్రవారం (ఆగస్టు 28న) డీఎస్ బాధ్యతలు స్వీకరించనున్నారు. -
డీఎస్‌పై నమ్మకం ఉంది: కేసీఆర్
హైదరాబాద్: రాజకీయ, పరిపాలన విషయాల్లో అపార అనుభవమున్న డి.శ్రీనివాస్ తనకు అప్పగించిన బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తిస్తారన్న నమ్మకం ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. శనివారం క్యాంపు కార్యాలయంలో డీఎస్ సీఎం కేసీఆర్‌ను కలసి తనను ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అంతర్రాష్ట వ్యవహారాల్లో నిరంతరం అప్రమత్తంగా ఉండి, ఇరుగు పొరుగు రాష్ట్రాలతో సమన్వయంతో వ్యవహరించి తనకు అప్పగించిన బాధ్యతలను నెరవేరుస్తానని ఈ సందర్భంగా డీఎస్ పేర్కొన్నారు. -
సోనియా దయతోనే ఎదిగా..
-
‘హస్తం’ అమ్మో.. ‘కారు’దే దమ్ము
ఆయన్ను పార్టీ మోయాల్సి వస్తే అంతగా మోయడం దేనికి? వదిలించుకోవచ్చుగా...అబ్బే అలా ఎలా వదులుకుంటాము...అవసరమైతే ఇంటికి వెళ్లి మరీ గాంధీభవన్‌కు మోసుకువస్తామంటూ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క బంజారాహిల్స్‌లోని డి.శ్రీనివాస్ ఇంటికి వెళ్లారు. నచ్చజెప్పి పార్టీలో ఉండేలా ఒప్పించాలన్నదే వారి వ్యూహం. వీరు వస్తున్నారని తెలిసి డీఎస్ ముందస్తుగా అక్కడి నుంచి తప్పించుకుని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో తేలారు. ముఖ్యమంత్రికి స్వల్ప అనారోగ్యం అని తెలిస్తే పరామర్శించడానికి వచ్చా... అంతే, అంటూనే కాంగ్రెస్‌లో పని చేసేవారికి గుర్తింపు లేదని తాను పార్టీ వీడనున్నట్లు పరోక్షంగా ప్రకటించేశారు. అంతే అప్పటిదాకా డీఎస్‌ను మోయడానికి సిద్ధపడ్డ కాంగ్రెస్ నేతలు...ఆయనను ఇప్పటికే లెక్కకు మించి మోశాము...ఇంకా మోయడం సాధ్యం కాదని తేల్చిపడేశారు. డీఎస్‌ను మోయడమంటే మామూలైన వ్యవహారమా మరి...ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఆ బాధ్యతను భుజాలకెత్తుకుంది...రాజకీయమా మజాకా... -
సోనియా దయతోనే ఎదిగా..
తెలంగాణ ఇచ్చింది సోనియా.. తెచ్చింది కేసీఆర్ 8న టీఆర్ఎస్లో చేరుతా..: డి. శ్రీనివాస్ నిజామాబాద్: ఏఐసీసీ అధ్యక్షురాలు, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ దయతోనే రాజకీయాల్లో ఇంతెత్తుకు ఎదిగానని, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొందరు కోటరీగా ఏర్పడి పార్టీ కోసం సోనియాగాంధీ చేస్తున్న కృషిని బూడిదలో పోసిన పన్నీరులా మారుస్తున్నారని పీసీసీ మాజీ చీఫ్, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ అన్నారు. కాంగ్రెస్ పార్టీలో సుఖాలే కాదు కష్టాలు కూడా అనేకం అనుభవించామని పేర్కొన్నారు. 2004, 2009లో రెండు పర్యాయాలు పార్టీని అధికారంలోకి తేవడానికి తనవంతుగా కష్టపడ్డానన్నారు. శనివారం సాయంత్రం నిజామాబాద్‌లోని ఆయన ఇంట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ధర్మపురి శ్రీనివాస్ మాట్లాడారు. మహిళా నాయకురాలిగా ఆకుల లలితకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం తనకు అభ్యంతరం కాదని, అయితే పార్టీలో కీలకనేతగా ఉన్న తనకు చెప్పకుండా, ప్రమేయం లేకుండా ఏఐసీసీని తప్పుదోవ పట్టించే రీతిలో వ్యవహరించడం బాధ కలిగించిందన్నారు. ఈ విషయంలో తనకు చెప్పినట్లుగా దిగ్విజయ్‌సింగ్ దొంగనాటకమాడి చివరకు తన నిర్ణయంతో అధిష్టానానికి, మీడియాకి సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని డీఎస్ అన్నారు. ఈ నెల ఎనిమిదిన హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో పగలు ఒంటిగంటకు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరేందుకు ముహూర్తం ఖరారయ్యిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి కారణం కేసీఆర్ అయితే, తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీ అన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తానన్నారు. -
దిగ్విజయ్ మోసకారి: డీఎస్
-
దిగ్విజయ్ మోసకారి: డీఎస్
హైదరాబాద్: ఏ పదవి ఆశించి పార్టీ మారడం లేదని కాంగ్రెస్ కు రాజీనామా చేసిన సీనియర్ నాయకుడు డి. శ్రీనివాస్ అన్నారు. బలహీన వర్గాలకు న్యాయం జరగాలన్నదే తన అభిలాష అని పేర్కొన్నారు. గురువారం మధ్యాహ్నం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... సోనియా గాంధీ వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్న విషయం ప్రజలందరికీ తెలుసునని చెప్పారు. రాష్ట్ర సాధనలో ఎక్కువ కృషి కేసీఆర్ దేనని అన్నారు. రాష్ట్రాల అభివృద్ధిలో పార్టీలకు అతీతంగా పనిచేయాలన్నారు. తెలంగాణ అభివృద్ధి పథంలో పయనించాలని ఆకాంక్షించారు. బంగారు తెలంగాణ కోసమే టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నానని తెలిపారు. తన అంతరాత్మ ప్రబోదానుసారం కాంగ్రెస్ పార్టీని వీడినట్టు వెల్లడించారు. ఎమ్మెల్సీ కోసం పార్టీ మారుతున్నానడం సరికాదని, తనకు పదవి ఓ లెక్క కాదన్నారు. పదవుల కోసం పాకులాడే మనిషిని కాదన్నారు. దిగ్విజయ్ సింగ్ మోసకారి అని మండిపడ్డారు. సీఎం తప్ప అన్ని పదవులు దక్కాయని గుర్తు చేసుకున్నారు. సోనియాపై గౌరవం ఎప్పటికీ ఉంటుందన్నారు. తనకు జరిగిన అవమానాలను ఆమె దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. 2014లో కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ విలీనం అంశాన్ని హైకమాండ్ పెద్దలు సరిగా డీల్ చేయలేదన్నారు. తన సేవలను టీఆర్ఎస్ ఎలా వినియోగించుకుంటుందనేది సీఎం కేసీఆర్ చేతిలో ఉందన్నారు. బీసీల సంక్షేమానికి వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్తశుద్ధితో పనిచేశారని ప్రశంసించారు. తెలంగాణలో అభివృద్ధి పనులకు ఏపీ ప్రభుత్వం అడ్డుపడుతోందని ఆరోపించారు. హైదరాబాద్ లో సెటిలర్ల ప్రయోజనాలు కాపాడేందుకు కృషి చేస్తానని డీఎస్ హామీయిచ్చారు. -
'వెళ్లిపోతున్నందుకు బాధగా ఉంది'
-
'వెళ్లిపోతున్నందుకు బాధగా ఉంది'
హైదరాబాద్: తాను జీవితాంతం కాంగ్రెస్‌లోనే కొనసాగాలనుకున్నా.. పార్టీలోని పరిణామాలతో కొనసాగలేకపోతున్నానని పేర్కొంటూ ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీకి డి.శ్రీనివాస్ ఒక లేఖ రాశారు. పార్టీని వీడుతున్న పరిస్థితులు, తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ బుధవారం రాత్రే ఈ లేఖను ఫ్యాక్స్ చేశారు. ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడంలో కాంగ్రెస్‌దే కీలకపాత్ర. రాష్ట్రం ఇచ్చిన ఘనతను గత ఎన్నికల్లో ఉపయోగించుకోలేకపోయాం. దానికి కారణం మీ చుట్టూ చేరిన నాయకుల తప్పుడు సలహాలు. కొందరు స్వార్థపరులు అసూయతో చేసిన ఫిర్యాదులతో తన వంటి సిన్సియర్, నిజాయతీ పరులైన నాయకులను అవమానించారు..’’ అని ఆ లేఖలో డీఎస్ పేర్కొన్నారు. తెలంగాణ ఇవ్వడంతో కాంగ్రెస్‌కు ఈ ప్రాంతంలో ఎదురే ఉండదని విశ్వసించామని, పొన్నాల లక్ష్మయ్య వంటి బలహీనమైన నాయకుడికి టీపీసీసీ పదవి ఇవ్వడంతో చాలా నష్టపోయామన్నారు. ‘జానారెడ్డి, జీవన్‌రెడ్డి వంటి నాయకులు టీడీపీ నుంచి వచ్చారు. జైపాల్‌రెడ్డి జనతాదళ్‌లో ఉన్నప్పుడు తిట్టిన తిట్లు తక్కువేమీ కాదు. అలాంటి నాయకులకు ఉన్నత పదవులు కట్టబెడుతూ.. నాలాంటి సిన్సియర్ నాయకులను అవమానించారు. పార్టీ కష్టకాలంలో ఉన్న ఈ సమయంలో నాకు ఎమ్మెల్సీ పదవిని ఇవ్వలేదు. పదవిని ఆశించిన నాకు కనీస సమాచారం ఇవ్వకుండా వేరొకరిని ఎంపిక చేశారు. ఆ తరువాత కూడా నాతో ఎవరూ మాట్లాడలేదు. అంతకుముందు శాసనమండలిలో ప్రతిపక్షనేతగా అవకాశం ఇవ్వడంలోనూ చాలా ఇబ్బందులు పెట్టారు. తర్వాత షబ్బీర్ అలీని ఎంపిక చేయడంలోనూ దిగ్విజయ్‌సింగ్ అప్రజాస్వామికంగా వ్యవహరించారు. దిగ్విజయ్ నాపై కక్షగట్టారు. పార్టీలో రాహుల్‌గాంధీ శకం నడుస్తున్నది. రాహుల్ శకంలో రాజు, రావులదే హవా నడుస్తోంది. ఇలాంటి అవమానకర పరిస్థితుల్లో పార్టీలో కొనసాగలేక, బాధాతప్త హృదయంతో పార్టీని వీడుతున్నా..’’ అని డీఎస్ ఆ లేఖలో పేర్కొన్నారు. నేడు రాజీనామా ప్రకటన.. డి.శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీకి తన రాజీనామాను గురువారం ఉదయం 11 గంటలకు ప్రకటించే అవకాశం ఉంది. రాజీనామా చేయడానికి కారణాలను, టీఆర్ఎస్లో చేరాలనే నిర్ణయం తీసుకోవడానికి దారితీసిన పరిస్థితులను ఒక బహిరంగ లేఖలో వివరించనున్నారు. సీఎం కేసీఆర్ కనుసన్నల్లో రూపొందిన ఆ బహిరంగ లేఖను ఉదయం విడుదల చేయనున్నారు. -
డిగ్గీ వర్సెస్ డీఎస్!
హైదరాబాద్: ఇద్దరు కీలక నేతల మధ్య తలెత్తిన విభేదాలు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్‌గా మారాయి. ఆదివారం గాంధీభవన్‌లో నిర్వహించిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 94వ జయంత్యోత్సవం ఇందుకు వేదికయింది. తనకు ఎమ్మెల్సీ పదవి రాకుండా అడ్డుకున్నారని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జీ అయిన దిగ్విజయ్ సింగ్ (డిగ్గీ)పై మాజీ మంత్రి, పీసీసీ మాజీ చీఫ్ డీ. శ్రీనివాస్ గుర్రుగా ఉన్నట్లు, అందుకే డిగ్గీ ముఖ్యఅతిథిగా హాజరైన పీవీ జయంతి కార్యక్రమానికి డీఎస్ హాజరుకాలేదని పార్టీ వర్గాలు తెలిపాయి. విషయం తెలుసుకున్న దిగ్విజయ్ స్వయంగా డీఎస్ ఇంటికి వెళ్లి సర్దిచెప్పాలనుకున్నారు. కానీ, అందుకు డీఎస్ అంగీకరించలేదని, దీంతో డిగ్గీ తన ప్రయత్నాన్ని విరమించుకున్నట్లు సమాచారం. అయితే డీఎస్ ఆగ్రహం కేవలం డిగ్గీపైనేగానీ ఇతర అధిష్టానం పెద్దలపై కాదని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఈ విషయంపై పెద్దలెవ్వరికీ డీఎస్ ఫిర్యాదు చేయలేదని, ప్రస్తుతం గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను విజయపథంలో నడిపించడంపైనే ఆయన దృష్టి సారించారని పేర్కొన్నారు. -
భ్రమలన్నీ తొలగిపోయాయి: టి. కాంగ్రెస్
హైదరాబాద్: రాష్ట్రంలో టీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ కల్పించిన భ్రమల వల్లే తమ పార్టీ ఓడిపోయిందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఏడు నెలల పాలనలో మోదీ సర్కారు పలు అంశాల్లో యూటర్న్ తీసుకుందని విమర్శించారు. హామీలపై వెనక్కు తగ్గుతున్న వైనాన్ని ఎండగడతామన్నారు. టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు అమలు చేయడం అసాధ్యమన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై పుస్తక ముద్రణ కాదు, ప్రత్యక్ష పోరాటాలు చేస్తామని పొన్నాల తెలిపారు. ఎన్నికలకుముందు మోదీ చెప్పిన దానికి ఇప్పుడు చేస్తున్న దానికి పొంతన లేదని పీసీసీ మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ అన్నారు. మోదీ సర్కార్ కల్పించిన భ్రమలన్నీ తొలగిపోయాయని చెప్పారు. కాంగ్రెస్ వ్యతిరేక ప్రచారంతో అధికారంలోకి వచ్చిన మోదీ ఇప్పుడు తమ పార్టీ బాటలోనే నడుస్తున్నారని మరో నాయకుడు కె. జానారెడ్డి అన్నారు. గాంధీభవన్ లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో 'మోదీ యూ టర్న్' పుస్తకాన్ని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆవిష్కరించారు. -
ఇంటి పోరు
డీఎస్, బొమ్మ వర్గీయుల పోటాపోటీ శ్రేణులలో ‘మైనారిటీ’ పదవుల చిచ్చు టీపీసీసీకి ఫిర్యాదుల పరంపర సభ్యత్వ నమోదులోను విభేదాలు అస్తవ్యస్తంగా మారిన జిల్లా కాంగ్రెస్ పరిస్థితి ఓడినా మారని పరిస్థితి పట్టించుకోని ఆధిష్టానం గతంలోనూ ఇదే తీరు నిజామాబాద్: కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కల హాలు ముదిరి పాకాన పడుతున్నాయి. సాధారణ ఎన్నికలలో ఘోర పరాజ యం పొందినా ఆ పార్టీ నేతలలో మార్పు రావడం లేదు. ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించాల్సిన నాయకులు గ్రూపు రాజకీయాలకు ఆజ్యం పోస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. శాసనమండలి విపక్షనేత డి.శ్రీనివాస్, మాజీ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి, టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ ఉపాధ్యక్షుడు మహ్మద్ అలీ షబ్బీర్, మాజీ స్పీకర్ కేఆర్ సురేష్‌రెడ్డి తదితర దిగ్గజాలున్న జిల్లా లో వర్గపోరుతో కాంగ్రె స్ పార్టీ అస్థిత్వాన్ని కోల్పోయే ప్రమాదం లేకపోలేదని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. సెప్టెంబర్ నెలాఖరులో ప్రారంభం కావాలిన సభ్యత్వ నమోదు కొన్నిచోట్ల ఇప్పుడిప్పుడే మొదలవుతుండగా, మరికొన్ని చోట్ల సభ్యత్వ నమోదులోనూ విభేదాలే బయట పడుతున్నాయి. దిగ్గజాల వైఖరి ‘ఎవరికీ వారే యమునా తీరే’లా మారగా నిజామాబాద్ అర్బన్‌లో మైనారిటీలకు ప్రాధాన్యం లేదన్న చిచ్చు రగులుతోంది. ఈ విషయమై డి.శ్రీనివాస్, బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్ వర్గీయులు టీపీసీసీకి పోటాపోటీగా ఫిర్యాదులు చేసుకోవడం చర్చనీయాంశం అవుతోంది. అన్నీ వివాదాలే కాంగ్రెస్ పార్టీ నగరంలో శనివారం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి డీఎస్, ఆయన వర్గీయులు హాజరు కాగా, అర్బన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందిన బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్, ఆయన వర్గం హాజరు కాలేదు. నగర కమిటీ అధ్యక్షుడు కేశ వేణు అధ్యక్ష తన జరిగిన సమావే శంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో డీసీసీ అధ్యక్షుడు తాహెర్ బిన్ హందాన్ ఫోటోను చేర్చలేదన్న అంశం వివాదంగా మారింది. జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ జావిద్ అక్రమ్ ఈ అంశాన్ని ప్రస్తావించగా, నగర కమిటీ సభ్యత్వ సేకరణ సమావేశంలో డీసీసీ అధ్యక్షుడి ఫోటో అవసరం లేదని సమర్థించడంపైనా కలకలం రేగింది. బొమ్మ మహేశ్ కుమార్‌కు సమాచారం ఇవ్వలేదంటూ ఆయన అనుచరులు సైతం కార్యక్రమాన్ని బహిష్కరించారు. కాంగ్రెస్‌కు 16 మంది కార్పొరేటర్లుంటే ఐదారుగురే వచ్చారు. ఒకే వర్గానికి చెందిన నేతలతో కార్యక్రమం నిర్వహించారన్న విమర్శలు కూడా పార్టీ సీనియర్ల నుంచి వినిపిం చాయి. అర్బన్ ఇన్చార్జ్గా బొమ్మ మహేశ్ వ్యవహరిస్తుండగా, డీఎస్ తనయులు, మాజీ మేయర్ సంజయ్, అరవింద్ కాంగ్రెస్ కేడర్‌కు ఎస్ఎంఎస్లు పంపడం, ప్రెస్మీట్లు నిర్వహించడం గందరగోళానికి తెరతీస్తోంది. చినికి చినికి గాలివానగా మారుతున్న ఆధిపత్యపోరు, అంతర్గత విభేధాలు అధిష్టానానికి తలనొప్పిగా పరిణమిం చాయి. మైనారిటీలకు పదవులపై రభస కాంగ్రెస్ పార్టీలో మైనారిటీలకు పదవుల కేటాయింపు వివాదాస్పదం అవుతోంది. ఈ విషయమై డీఎస్, బొమ్మ మహేశ్‌కుమార్ వర్గీయులు టీపీసీసీకి పోటాపోటీగా ఫిర్యాదులు చేయడం కలకలం రేపుతోంది. మైనారిటీలకు రాష్ట్రస్థాయి పదవులు దక్కడం అరుదుగా మారిన తరుణంలో, ఇటీవల మహ్మద్ ఇలియాస్‌కు రాష్ట్ర కార్యదర్శి గా అవకాశం దక్కింది. గత కొన్నేళ్లుగా రాష్ట్ర కార్యదర్శులుగా జిల్లాకు చెందిన భూమారెడ్డి, రాయల్వార్ సత్యం, నరాల రత్నాకర్, ప్రేమ్‌దేవ్ అగర్వాల్, రాజేంద్రప్రసాద్ తదితరులకు అవకాశాలు దక్కాయి. ఈ నేపథ్యంలో సాధారణ ఎన్నికల సమయంలో అర్బన్ మైనార్టీలకు పార్టీలో సముచిత స్థానం దక్కడం లేదన్న వాదని కూడా వినిపించింది. అందుకే వారు ఎన్నికలలో పార్టీకి దూరమయ్యారన్న ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి మహ్మద్ షబ్బీర్ అలీ, బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్ ఇలియాస్‌కు రాష్ట్ర కార్యదర్శిగా అవకాశం కల్పించారు. ఇంతవరకు బాగానే ఉన్నా, ఇలియాస్‌కు పదవి దక్కడం ఇష్టం లేని ప్రత్యర్థి వర్గం నేతలు 15 సంవత్సరాల కిందట పోలీసు కేసులు ఉన్నాయంటూ బయటకు తీసి టీపీసీసీకి ఫిర్యాదు చేశారు. ఇలియాస్ వర్గం మరో అడుగు ముందుకేసి, తనపై ఫిర్యాదు చేసిన నాయకులపై ఉన్న భూముల ఆక్రమణ, సెటిల్మెంట్ వ్యవహారాలు, కేసుల చిట్టా తయారు చేసి అధిష్టానానికి ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. ఈ విభేధాలు అన్ని నియోజకవర్గాలపైనా ప్రభావం చూపుతున్నాయి. అధిష్టానం జోక్యం చేసుకుంటేనే పార్టీకి భవిష్యత్ ఉంటుందని కార్యకర్తలు కోరుతున్నారు. -
చంద్రబాబు సహకరించాలి: డీఎస్
మహబూబ్ నగర్: పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్న ఏపీ, తెలంగాణ సీఎంలపై తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. పాలనపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ ధర్నా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు ప్రజాప్రయోజనాలను పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి డీకే అరుణ ఈ సందర్భంగా విమర్శించారు. రైతులకు కరెంట్ ఇవ్వడం, పంటలను కాపాడడం ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత కావాలని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. తెలంగాణ రైతులకు విద్యుత్ ఇవ్వడానికి ఏపీ సీఎం చంద్రబాబు సహకరించాలని మాజీ పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ కోరారు. మేనిఫెస్టో పెట్టిన అంశాలన్నీ అమలు కావడం లేదని ఆయన వాపోయారు. -
రైతులకు భరోసా ఇవ్వడంలో విఫలం
కేసీఆర్, బాబులది గురుశిష్యుల కొట్లాట: శాసనమండలి సీఎల్పీ నేత డీఎస్ హైదరాబాద్: కరెంటు కోతలతో పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వారికి భరోసా ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని శాసనమండలి సీఎల్పీ నేత డి.శ్రీనివాస్ శనివారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ విమర్శించారు. తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబులది గురుశిష్యుల కొట్లాటగా ఆయన అభివర్ణించారు. విద్యుత్ సమస్య పరిష్కారానికి కేసీఆర్ కనీస ప్రయత్నం చేయలేదని విమర్శిం చారు. ఈ విషయంలో చంద్రబాబు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నందునే టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నారని పేర్కొన్నారు. శ్రీశైలంలో విద్యుదుత్పత్తి చేయాల్సిందేనని, చంద్రబాబు సహకరించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రతిపక్ష పార్టీలను కలుపుకుని పోవడం లేదని, అసలు రాష్ట్రంలో ప్రతిపక్షాలను లేకుండా చేయాలని చూస్తున్నారన్నారు. టీఆర్ఎస్లో చేరితేనే పనులు చేస్తామని కండిషన్లు పెడుతున్నారని విమర్శించారు. విద్యుత్ సమస్యపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ, శాసనమండలి సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు. -
కేసీఆర్ వందరోజుల పాలనలో నిరాశే
ఏ ఒక్క హామీపైనా క్లారిటీ రాలేదు శాసనమండలి విపక్షనేత డి.శ్రీనివాస్ నిజామాబాద్: తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వంద రోజుల పాలన పూర్తిగా నిరాశనే మిగిల్చిందని శాసనమండలి విపక్షనేత డి.శ్రీనివాస్ పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంగా ఆయన ఇచ్చిన ఏ ఒక్క హామీపైనా క్లారిటీ రాలేదని విమర్శించారు. మంగళవారం నిజామాబాద్‌లోని మున్నూరుకాపు సంఘం భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పనితీరుపై ఇంకొంత కాలం వేచి చూస్తామన్నారు. ఎస్సీలకు మూడెకరాల భూమి, రెండు పడక గదులతో పక్కా ఇళ్ల నిర్మాణం, రూ. లక్ష వరకు రుణమాఫీ, ఏడు గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ తదితర హామీలన్నీ, వంద రోజులు గడుస్తున్నా కనీసం మొగ్గ తొడగలేదన్నారు. ఎన్నికల హామీలన్నీ తుంగలో తొక్కి, తెలంగాణలోని మూడు ప్రాంతాలను ‘సింగపూర్’లా అభివృద్ధి చేస్తానని అమాయక ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. మార్పు అధిష్టానం ఇష్టం మెదక్ ఉప ఎన్నికలకు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి మార్పునకు సంబంధం లేదని డీఎస్ చెప్పారు. కొత్త కమిటీ వేయాలనుకున్నా, పాత కమిటీనే కొ నసాగించాలనుకున్నా అధిష్టానానిదే తుది నిర్ణయమన్నారు. ‘‘ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియా, తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అని ప్రజలు గుర్తించారు. కానీ, కేసీఆర్‌ను సీఎంగా చూడాలనుకున్నారు.’ అని డీఎస్ పేర్కొన్నారు. మెదక్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచి తీరతారన్నారు. పోలవరంపై అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తామన్న కేసీఆర్ కాలయాపన చేశారన్నారు. భయాందోళనకు గురిచేసి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి బలం పెంచుకోవాలని చూడటం హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు. -
ఏకత్వంలో భిన్నత్వం!
కాంగ్రెస్ సదస్సులో నేతల భిన్న స్వరాలు ఐక్యంగా ఉన్నామంటూనే పరస్పర విమర్శలు పార్టీని అన్ని స్థాయిల్లో ప్రక్షాళన చేయాలన్న గుత్తా సుఖేందర్‌రెడ్డి కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ కోవర్టులున్నారన్న పొంగులేటి సుధాకర్‌రెడ్డి పార్టీలో క్రమశిక్షణ లేకుండా పోయిందన్న డి. శ్రీనివాస్ హైదరాబాద్: నైరాశ్యంలో ఉన్న పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపాలనే లక్ష్యంతో టీపీసీసీ నిర్వహించిన ‘కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణ సదస్సు’లో రాష్ర్ట నేతలు కత్తులు దూసుకోవడం కార్యకర్తలను కలచివేసింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో ఐక్యంగా ఉన్నామనే సందేశాన్ని పంపడానికి ప్రయత్నిస్తూనే ముఖ్య నేతలంతా ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకోవడం పార్టీ వర్గాలను విస్మయానికి గురిచేసింది. క్షేత్ర స్థాయిలో కాం గ్రెస్ బలోపేతానికి అనుసరించాల్సిన విధానాలను సూచిస్తూ.. మరోవైపు నాయకత్వంలోని లుకలుకలను బయటపెట్టుకోవడం కార్యకర్తల్లో నిరాశ కలిగించింది. వాస్తవాలు చెబుతున్నామంటూ పలువురు నాయకులు నాయకత్వం, ఇతర అంశాలపై విమర్శనాస్త్రాలు సంధించారు. ‘పార్టీలో క్రమశిక్షణ అంటే అర ్థం లేకుండా పోయింది. పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారంటూ సస్పెండ్ చేస్తారు. మళ్లీ తెల్లారేసరికి దాన్ని ఎత్తేస్తారు. ఇదేం పద్ధతి?’ అని పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ తప్పుబట్టారు. రైతుల రుణమాఫీపై మనమంతా ఎలాంటి కార్యాచరణ చేపట్టలేదని ఇప్పుడిది హాట్ టాపిక్. ఈ అంశంపై ఇప్పుడు స్పందించవద్దని మన నాయకులు అంటున్నారు. పరిస్థితులకు తగినట్టు స్పందించాలేగానీ ముహూర్తాలు పెట్టుకుంటే లాభంలేదు. జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతుల రుణమాఫీపై మనమంతా ఎలాంటి కార్యాచరణ చేపట్టలేదు. ఇప్పుడిది హాట్ టాపిక్. ఈ అంశంపై ఇప్పుడు స్పందించవద్దని మన నేతలు అంటున్నారు. పరిస్థితులకు తగినట్టు స్పందిం చాలేగానీ ముహూర్తాలు పెట్టుకుంటే లాభంలేదు. పార్టీ జెండా మోసేందుకు బీసీలు కావాలి గానీ అధికారంలోకి వస్తే బీసీలు పనికిరారా? అని టీపీసీసీ ఓబీసీ సెల్ చైర్మన్ చిత్తరంజన్ దాస్ మండిపడ్డారు. బీసీలను దగ్గరకు తీయకుంటే 2019 లోనూ అధికారంలోకి రామన్నారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి అభ్యర్థి కాదన్న విషయాన్ని పార్టీ శ్రేణులకు స్పష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సీఎం అభ్యర్థుల్లో పోటీ ఎక్కువైనందునే ఎన్నికల్లో ఓడిపోయామని ఆయన విశ్లేషించారు. చిన్నారెడ్డి మాట్లాడుతూ .. తెలంగాణ ఉద్యమంలో కీలక ఘట్టమైన సకల జనుల సమ్మెలో మన ప్రాధాన్యత తక్కువగా కనిపించింది. ఈ అంశాన్ని టీఆర్ఎస్ అనుకూలంగా మార్చుకుని ఎన్నికల్లో విజయం సాధించింది. మనం కూడా కాలేజీ స్థాయిలో వంద శాతం సభ్యత్వ నమోదు చేపట్టాలి. యువత మనవైపు ఉంటే తిరుగుండదు. అదేవిధంగా కమిటీల్లో యువతకు 50 శాతం పదవులు ఇవ్వాలి. డి.శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ఫేస్బుక్, ట్విట్ట ర్ లాంటి సామాజిక మీడియాను వినియోగించాల్సిన ఆవశ్యకత ఉంది. పీసీసీ, డీసీసీ స్థాయి లో ప్రత్యేక ఖాతాలు తెరిచి సమాచారాన్ని గ్రామ స్థాయిలో క్షణాల్లో పంపించే ఏర్పాటు చేయాలి ఎంత మంది పార్టీని వీడారో, ఏయే పదవుల్లో ఉన్నవారు కాంగ్రెస్‌లో కొనసాగుతున్నారనే లెక్కలు కూడా పీసీసీ దగ్గర లేవని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. బ్లాక్ స్థాయి నుంచి పీసీసీ వరకు పార్టీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎమ్మెల్సీ పొంగులేటి మాట్లాడుతూ.. ఇతర పార్టీలతో మ్యాచ్‌ఫిక్సింగ్ చేసుకున్నోళ్ల వల్లే కాంగ్రెస్‌కు ఈ దుస్థితి వచ్చిందన్నారు. సీఎం కేసీఆర్ అడుగులకు మడుగులొత్తే వాళ్లు ఇంకా ఉన్నారని, రాజీవ్‌ను తిట్టిన నేతలు కూడా పారీ ్టలో కొనసాగడం కాంగ్రెస్ దౌర్భాగ్యమన్నారు.పునాదులను నిర్మించడంలో పార్టీ విఫలమైందని ఐఎన్టీయూ విభాగం నేత, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ నాయకుడు రాఘవయ్య విమర్శించారు. నేతలంతా ఆత్మస్తుతికే పరిమితమవుతున్నారని రాజ్యసభ సభ్యుడు రాపోలు అన్నారు. నిజమైన కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకోవాలని సూచించారు. ఎన్నికల్లో పోటీకి ఎంత ఖర్చు పెడతావ్.. ఎంత డబ్బు ఇస్తావ్? పెద్ద నేతలే అడిగితే ఎలాగని ఎంపీ నంది ఎల్లయ్య వాపోయారు. డబ్బు ఉన్నోళ్లకే టిక్కెట్లు ఇస్తున్నారని, ఆ తర్వాత వారు పార్టీని నాశనం చేసి వెళ్లిపోతున్నారని మహబూబ్‌నగర్ డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్ ప్రశ్నించారు. నల్గొండ జడ్పీ చైర్మన్ బాలూ నాయక్ సహా పలువురు నాయకులు మాట్లాడుతూ.. కార్యకర్తలమంతా ఐక్యంగానే ఉన్నాం. ఐక్యంగా ఉండాల్సిందిమీరే. లేకపోతే మళ్లీ అధికారంలోకి రాం’’ అని వేదికపై ఉన్న నేతలకు చురకలంటించారు. -
ఎక్కడున్నారు నాయనా ... రండి
అధిష్టానంతో పోరాడి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేశాం... ఇంకే ముంది ఎన్నికల్లో తమకే లాభం చేకూరుతుందని ఆ పార్టీ నాయకులు భావించారు. కానీ తాము ఒకటి తలిస్తే దైవం ఒకటి తలచిందన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ నాయకుల పరిస్థితి తయారైంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైంది. దాంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గాలి తీసిన బెలూన్లా తయారైంది. ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలుపోంది అధికారాన్ని కైవసం చేసుకుంది. ఆ పార్టీ ప్రారంభించిన ఆకర్ష్‌కు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ పార్టీల నేతలు క్యూ కట్టారు. అందులోభాగంగా హస్తానికి చెందిన పలువురు ఎమ్మెల్సీలు చకచక కారు ఎక్కేశారు. రేపోమాపో మరికొంత మంది నాయకులతోపాటు కార్యకర్తలు కారు ఎక్కేందుకు రెడీ అయ్యారు. దాంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దాదాపుగా ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇలాగే ఉంటే కాంగ్రెస్ పార్టీలో హేమా హేమీలంతా కారు ఎక్కేస్తారని ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం భావించింది. అంతే ...వెంటనే రంగంలోకి దిగి ఆ పార్టీ అగ్ర నాయకుడు, శాసన మండలిలో ప్రతిపక్ష నేత డీఎస్ హస్తినకు పయనమైయ్యారు. పార్టీ అధినేత్రితో భేటీ అయి 'కారు' చేసే మ్యాజిక్‌లను అవిడ ఎదుట ఏకరువు పెట్టారు. దాంతో కారు జోరు తగ్గించడానికి వెంటనే రంగంలోకి దిగాలని సూచించారు. పార్టీ పరాజయంతో చెల్లాచెదురైన క్యాడర్‌ను ఏక తాటిపైకి తీసుకువచ్చేందుకు యుద్ద ప్రాతిపదికపైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అంతే డీఎస్ రంగంలోకి దిగారు. అందులోభాగంగా నాయనా ఎక్కడ ఉన్నారు... మీకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటా... మీ సమస్యలు నా సమస్యలుగా భావిస్తానంటూ బుధవారం డీఎస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు బహిరంగ లేఖ రాశారు. చెల్లాచెదురైన కేడర్ మళ్లీ ఒక తాటిపైకి వస్తుందో లేదో కాలమే నిర్ణయించాలి. -
గిరిజనుల శవాలపై పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తారా?
న్యూఢిల్లీ: పోలవరం బిల్లును ఆఘమేఘాలపై ఎలా ఆమోదిస్తారని తెలంగాణ శాసనమండలి ప్రతిపక్ష నేత డి. శ్రీనివాస్ ప్రశ్నించారు. సంబంధిత రాష్ట్రాల అభిప్రాయం తెలుసుకోకుండానే బిల్లును లోక్‌సభలో ఆమోదించడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. గిరిజనుల శవాలపై పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం ఇష్టం లేకున్నా కొన్ని గ్రామాలను పునర్ విభజన చట్టంలో చేర్చామని వెల్లడించారు. తెలంగాణ ప్రజల హక్కుల్ని కాలరాసేలా వ్యవహరిస్తోందని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ కరీంనగర్ లో వ్యాఖ్యానించారు. పోలవరం బిల్లు ఆమోదించడంపై ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. -
వారిపై వేటు వేయాల్సిందే
* నేతి విద్యాసాగర్ సహా 8 మంది ఎమ్మెల్సీలపై ఫిర్యాదు చేయనున్న డీఎస్ సాక్షి, హైదరాబాద్: శాసనమండలి చైర్మన్ ఎన్నికల్లో విప్‌ను ధిక్కరించిన పార్టీ ఎమ్మెల్సీలపై సాధ్యమైనంత తొందరగా అనర్హత వేటు వేయించే దిశగా కాంగ్రెస్ పెద్దలు పావులు కదుపుతున్నారు. వారిలో ఇప్పటికే టీఆర్ఎస్లో చేరిన ఐదుగురు ఎమ్మెల్సీలపై అనర్హత పిటిషన్ దాఖలు చేయగా... తాజాగా తాత్కాలిక చైర్మన్ నేతి విద్యాసాగర్‌రావుతో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్సీలు కె.యాదవరెడ్డి, డి.రాజేశ్వర్లపైనా అనర్హత పిటిషన్ దాఖలు చేసేందుకు మండలిలో ప్రతిపక్ష నేత డి.శ్రీనివాస్ సిద్ధమయ్యారు. కాగా, మండలి చైర్మన్‌గా స్వామిగౌడ్ ఎన్నికైన అనంతరం డీఎస్ విలేకరులతో మాట్లాడుతూ.. పెద్దల సభగా పరిగణించే మండలిని గ్రామ సర్పంచ్ స్థాయికన్నా దిగువకు టీఆర్ఎస్ దిగజార్చిందని మండిపడ్డారు. కలిసి పనిచేస్తామని.. కలిపేసుకోవడమా?: షబ్బీర్ అలీ తెలంగాణ పునర్నిర్మాణంలో అందరితో కలిసి పనిచేస్తామని చెప్పిన సీఎం కేసీఆర్.. ఇప్పుడు అన్ని పార్టీలను టీఆర్ఎస్లో కలుపుకొంటున్నారని ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ విమర్శించారు. కలిసి పనిచేయడమంటే ఇదేనా ? అని మండిపడ్డారు. చట్టాన్ని ఉల్లంఘించారు: దిగ్విజయ్ సాక్షి, న్యూఢిల్లీ: తమ పార్టీ తరఫున గెలిచి టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్సీలు చట్టాన్ని ఉల్లంఘించారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ పేర్కొన్నారు. ఇటీవలి ఎన్నికల్లో పార్టీ ఓటమికి సంబంధించి బుధవారం ఢిల్లీలో ఆంటోనీ కమిటీకి నివేదిక ఇచ్చిన దిగ్విజయ్.. అనంతరం మీడియాతో మాట్లాడా రు. కాంగ్రెస్ నుంచి ఎన్నికై టీఆర్ఎస్లో చేరిన వారిని అనర్హులుగా ప్రకటింపజేసే దిశగా ప్రక్రియను చేపడతాం..’’ అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విరుద్ధం: టీడీపీ మండలి చైర్మన్ ఎన్నిక సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరించిన తీరు ప్రజాస్వామ్య విరుద్ధమని టీడీపీ ఎమ్మెల్సీ ఎ.నర్సారెడ్డి విమర్శించారు. -
కాంగ్రెస్ ఎమ్మెల్సీలకు విప్ జారీ
* మండలి బరిలో ఫారూఖ్ హుస్సేన్ * చైర్మన్ ఎన్నికల్లో గెలుపు కోసం పొన్నాల, డీఎస్, జానా మంతనాలు సాక్షి, హైదరాబాద్: శాసనమండలి చైర్మన్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ తరపున ఎన్నికైన ఎమ్మెల్సీలందరికీ విప్ జారీ చేశారు. మండలిలో ప్రతిపక్షనేత డి.శ్రీనివాస్ మంగళవారం ఎమ్మెల్సీలందరికీ ఈ మేరకు లేఖలు పంపారు. బుధవారం జరిగే సమావేశానికి హాజరై కాంగ్రెస్ ప్రతిపాదించిన అభ్యర్థి ఫారూఖ్ హుస్సేన్‌కు ఓటు వేయాలని అందులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా డీఎస్ మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ అధిష్టానం ఆమోదంతోనే ఫారూఖ్ హుస్సేన్‌ను బరిలో దించామన్నారు. చైర్మన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని మాట వరసకు కూడా సీఎం అడగలేదని, అందుకే తాము అభ్యర్థిని బరిలో దింపామని తెలిపారు.ఇటీవల టీఆర్ఎస్లో చేరిన ఐదుగురు ఎమ్మెల్సీలు కె.ఆర్.ఆమోస్, జగదీశ్వర్‌రెడ్డి, భానుప్రసాద్, వి.భూపాల్‌రెడ్డి, ఎన్.రాజలింగంతోపాటు అసమ్మతి సభ్యులు కె.యాదవరెడ్డి, రాజేశ్వర్లకు కూడా విప్ జారీ చేసినట్టు చెప్పారు. ఇదిలాఉండగా, చైర్మన్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎల్పీ కార్యాలయంలో డీఎస్‌తోపాటు టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, సీఎల్పీ నేత జానారెడ్డిసహా ఎమ్మెల్సీలంతా చర్చించారు. ఫారూఖ్ హుస్సేన్ నామినేషన్ దాఖలు శాసనమండలి చైర్మన్ పదవికి కాంగ్రెస్ అభ్యర్థిగా ఫారూఖ్ హుస్సేన్ మంగళవారం నామినేషన్ దాఖ లు చేశారు. కార్యక్రమంలో పొన్నాల, డీఎస్, జానారెడ్డి, ఎంపీలు గుత్తా, ఎంఏఖాన్తోపాటు ఏడుగురు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫారూఖ్ హుస్సేన్ మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ తాను కలిసి చదువుకున్నామని, ఆయనను కూడా కలసి గెలుపునకు సహకరించాలని కోరుతానన్నారు. స్థానం ఉన్నతం.. విధానమే బాగోలేదు నామినేషన్ కార్యక్రమం అనంతరం కాంగ్రెస్ నేతలంతా సీఎల్పీ కార్యాలయం వైపు వస్తుండగా స్వామిగౌడ్ ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య స్వామిగౌడ్‌ను ఉద్దేశిస్తూ ‘చైర్మన్ స్థానం ఉన్నతమైంది. మీరు ఆ పదవి చేపట్టబోవడం ఆనందమే. కాకపోతే జరుగుతున్న విధానమే సరిగా లేదు. అందులో మిమ్ముల్ని భాగస్వామిని చేయడం మరింత బాధాకరం’అని వ్యాఖ్యానించారు. -
హామీలు అమలు చేయకుంటే ఊరుకోం: డీఎస్
నిజామాబాద్: తెలంగాణ ప్రజలకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చకుంటే ఎండగడతామని శాసనమండలి ప్రతిపక్ష నేత డి. శ్రీనివాస్ అన్నారు. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. పోరాటాలతోనే తెలంగాణ సాధించుకున్నామని, ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలను ఆకర్షించే విధంగా హమీలు ఇవ్వటంతోనే ప్రజలు టీఆర్ఎస్ను గెలిపించారన్నారు. వాటిని నెరవేర్చటంలో కేసీఆర్ విఫలం అయితే, తాము ఊరుకోబోమన్నారు. తెలంగాణ వాదం ప్రతి ఒక్కరి హృదయంలోకి వెళ్లిందని, అదే కాంగ్రెస్ పార్టీ ఓడిమికి కారణం అయ్యిందని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో కేసీఆర్ ఆయన ప్రయత్నం ఆయన చేశారన్నారు. వాస్తవంగా తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీయేనని, దానిని మనం ప్రజల్లోకి తీసుకుపోవటంతో విఫలయమయ్యామన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ, ప్రజల్లోకి తీసుకెళ్లాలని డీఎస్ పిలుపునిచ్చారు. -
సరైన ప్రచారం లేకే ఓడిపోయాం
- తెలంగాణ వాదాన్ని కేసీఆర్ బాగా వాడుకున్నారు - శాసనమండలి ప్రతిపక్ష నేత డీఎస్ నిజామాబాద్ సిటీ : తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అని ప్రతి ఒక్కరికి తెలుసని, ఈ విషయాన్ని తగినంత ప్రచారం చేసుకోకపోవడంతోనే ఎన్నికల్లో ఓడిపోయామని శాసన మండలి ప్రతిపక్ష నేత డి. శ్రీనివాస్ అన్నారు. ఆదివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా, నగర కాంగ్రెస్ పార్టీల అధ్యక్షులు తాహెర్, కేశవేణు ఆధ్వర్యంలో ఇటీవల గెలిచిన కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, పార్టీ డివిజన్ల అధ్యక్షులు, మండలాల అధ్యక్షులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన డీఎస్ మాట్లాడుతూ పోరాటాలతోనే తెలంగాణ సాధించుకున్నామని, ఎన్నికల మేనిఫేస్టోలో కేసీఆర్ ప్రజలను ఆకర్షించే హమీలు ఇవ్వటంతోనే ప్రజలు తెరాసను గెలిపించారన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చటంలో కేసీఆర్ విఫలమైతే వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రభుత్వం పనితీరును ఎండగడతామన్నారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు కాంగ్రెస్ గెలుపుకోసం ఎంతో కృషి చేశారని, అయితే తెలంగాణ వాదం ముందు ఓడిపోయామన్నారు. తెలంగాణపై తాము మొదట మాట్లాడినపుడు కేసీఆర్ టీడీపీలో ఉన్నారని అన్నారు. రాబోయే ఐదేళ్లలో కార్యకర్తలు, నాయకులు ఐక్యంగా ఉండి కాంగ్రెస్ పార్టీయే తెలంగాణ ఇచ్చిందన్న విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకుపోతే భవిష్యత్తు ఉంటుందని డీఎస్ అన్నారు. ప్రజలకు అండగా ఉండాలనే ప్రతిపక్షనేతగా.. శానసమండలి చైర్మన్‌గా తనకు అవకాశం వచ్చినప్పటికి ఆ పదవితో పార్టీకి, ప్రజలకు ఉపయోగపడనని గ్రహించి ప్రతిపక్ష పదవి తీసుకున్నట్లు డి. శ్రీనివాస్ తెలిపారు. తెరాస ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చటంలో జాప్యం చేస్తే ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికే ఈ పదవి తీసుకున్నట్లు చెప్పారు. ఓటమిని గౌరవిస్తాం.. సీఎం కేసీఆర్ తప్పుడు ప్రచారంతోనే అధికారంలోకి వచ్చారని కాంగ్రెస్ పార్టీ అర్బన్ ఇన్చా ర్జి మహేష్‌కుమార్‌గౌడ్ అన్నారు. నిజామాబా ద్ రూరల్ నియోజకవర్గంలో డీఎస్, జిల్లాలో మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి ఎన్నో కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేసినా ప్రజలు తెరాసను గెలిపించారన్నారు. ఎంఐఎం పార్టీ కూడా తమకు ద్రోహం చేసిందన్నారు. ప్రజలు ఎలాంటి తీర్పునిచ్చిన గౌరవించటం పార్టీ నైజమన్నారు. సమావేశంలో టీపీసీసీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆకుల లలిత, డీసీసీ మాజీ అధ్యక్షుడు గంగాధర్, మాజీ మా ర్కెట్ కమిటి చైర్మన్ నగేష్‌రెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి ఆకుల చిన్నరాజేశ్వర్, వక్ఫ్‌బోర్డు చైర్మన్ జావీద్, యువజన కాంగ్రెస్ పార్లమెంట్ అధ్యక్షుడు గన్‌రాజ్, అర్బన్ అధ్యక్షుడు బంటురాము తదితరులు పాల్గొన్నారు. -
మండలిలోకాంగ్రెస్ పక్ష నేతగా డీఎస్
నిజామాబాద్ అర్బన్, న్యూస్‌లైన్ : ధర్మపురి శ్రీనివాస్ ప్రస్థానం శాసన మండలిలో కాంగ్రెస్ పక్ష నేత గా ఎన్నికైన ధర్మపురి శ్రీనివాస్ పార్టీలో కీలక నేతగా పేరుపొందారు. ఆయనకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. డీఎస్ 1989 లో నిజామాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 1994 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. తిరిగి ఇదే నియోజకవర్గం నుంచి 1999, 2004లలో వరుసగా విజయాలు సాధించారు. 2009లో బీజేపీ అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణ చేతిలో ఓటమి చవి చూశారు. 2010లో యెండల తెలంగాణ కోసం తన పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక వచ్చింది. ఆ ఎన్నికల్లోనూ డీఎస్ ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంనుంచి పోటీ చేసినా గెలుపొందలేకపోయారు. డి శ్రీనివాస్.. మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి, వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గాల్లో గ్రామీణాభివృద్ధిశాఖ, ఉన్నత విద్యాశాఖల మంత్రిగా పనిచేశారు. 1999లో పార్టీ శాసనసభాపక్ష ఉప నాయకుడిగా ఉన్నారు. 2004, 2009లలో పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ సభ్యుడుగా వ్యవహరించారు. మూడేళ్లుగా శాసనమండలి సభ్యుడిగా కొనసాగుతున్నారు. షబ్బీర్ అలీ రాజకీయ నేపథ్యం కాంగ్రెస్ పార్టీ శాసనమండలి పక్ష ఉప నేతగా నియమితులైన షబ్బీర్ అలీకి సైతం సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా 1989లో తొలిసారిగా కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంనుంచి పోటీ చేసి గెలుపొందారు. మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి మంత్రివర్గాల్లో పనిచేశారు. 1994, 1999 ఎన్నికల్లో ఇదే నియోజకవర్గంనుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2004 లో గెలిచిన ఆయనకు వైఎస్ మంత్రివర్గంలో చోటు లభించింది. కీలకమైన విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేశారు. 2009 సాధారణ ఎన్నికల్లో కామారెడ్డినుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2010లో ఎల్లారెడ్డి నియోజక వర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసినా ఓటమే ఎదురయ్యింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లోనూ విజయం సాధించలేకపోయారు. ఆయన 2013లో ఎమ్మెల్సీ అయ్యారు. ఈ పదవిలో ఇంకా ఐదేళ్లు కొనసాగనున్నారు. షబ్బీర్ అలీ పార్టీలోనూ కీలక పదవులు నిర్వర్తించారు. యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా, డీసీసీ అధ్యక్షునిగా, పీసీసీ సమన్వయ కమిటీ సభ్యునిగా, పీసీసీ ప్రచార కమిటీ కోకన్వీనర్‌గా పనిచేశారు. జిల్లా కాంగ్రెస్ నేతల్లో హర్షం డీఎస్, షబ్బీర్లకు పార్టీ శాసనమండలి పదవులు లభించడంపై జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. డీఎస్ శాసన మండలి విపక్ష నేతగా ఎన్నికైన విషయం తెలుసుకున్న పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా పార్టీ కార్యాలయం ఎదుట టపాకాయలు కాల్చారు. అనంతరం ఒకరినొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. ప్రగతినగర్‌లోని డీఎస్ ఇంటి వద్ద కూడా టపాకాయలు కాల్చి, స్వీట్లు పంచారు. ఈ సంబురాలలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కేశ వేణు, టీపీసీసీ సహాయ కార్యదర్శి రాజేంద్రప్రసాద్, యువజన కాంగ్రెస్ అర్బన్ అధ్యక్షుడు బంటురాము, నాయకుడు బగ్గలి అజయ్, ఆర్ఎంవై అధ్యక్షుడు ధాత్రిక రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్నెల్ల ముందు ఇస్తే గెలిచేవాళ్లం: డీఎస్
న్యూఢిల్లీ : ఎన్నికలకు ఆరు నెలల ముందు తెలంగాణ ఇచ్చి ఉంటే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేదని పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి చెప్పినట్టు పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ తెలిపారు. సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారన్న అభిమానం ప్రజల్లో ఉన్నా, తన పోరాటంతోనే సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వాల్సి వచ్చిందని చెప్పడంలో కేసీఆర్ సఫలీకృతుడయ్యారన్నారు. బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్‌ను కలిసిన అనంతరం డి.శ్రీనివాస్ ఏపీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. పార్టీ ఓటమికిగల కారణాలు, వాటిని సరిదిద్దుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలను సోనియాకి వివ రించినట్టు తెలిపారు. కేసీఆర్, టీఆర్ఎస్ ఉద్యమ ఫలితంగానే ఆపార్టీ గెలిచిందన్నారు. హైదరాబాద్‌తో సహా కొన్ని ప్రాంతాల్లో సెటిలర్లకు, మైనార్టీలకు నమ్మకం కల్పించలేకపోయామని డీఎస్ అంగీకరించారు. -
కౌన్ బనేగా మేయర్!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ నగరపాలక సంస్థతోపాటు కామారెడ్డి, ఆర్మూ ర్, బోధన్ మున్సిపాలిటీలలోని 141 డివిజన్లు, వార్డులకు మార్చి 30 న ఎన్నికలు జరిగాయి. సోమవా రం ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ క్రమంలో ఎవరెవరికి, ఎక్కడెక్కడ ఆధిక్యం వస్తుందో ప్రధాన పార్టీలు ఓ అం చనాకు రాలేకపోతున్నాయి. అయినా, కార్పొరేషన్‌తో పాటు మున్సిపాలిటీల ను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా క్యాంపు రాజకీయాలకు వ్యూహం రూ పొందిస్తున్నాయి. నిజామాబాద్ మేయ ర్ పీఠంపై కన్నేసిన కాంగ్రెస్ పార్టీ నా మినేషన్ల ఘట్టం ముగియగానే కాపర్తి సుజాతను అభ్యర్థిగా ప్రకటించింది. పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్ నగర మే యర్ పీఠాన్ని ప్రతిష్టాత్మకంగా భావిం చి ప్రచార బాధ్యతలను భుజాన వేసుకున్నారు. టీఆర్ఎస్ నుంచి ఇద్దరు మే యర్ పీఠాన్ని ఆశిస్తున్నారు. ఆర్మూర్ మున్సిపాలిటీ చైర్మన్ పదవి దక్కించుకునేందుకు ఐదుగురు కాంగ్రెస్ మహా మహులు తమ సతీమణులను బరిలో దింపి పావులు కదుపుతున్నారు. ఫలి తాలు వెలువడటమే ఆలస్యం, కౌన్సిల ర్లను క్యాంపులకు తరలించేందుకు సి ద్ధంగా ఉన్నారు. కామారెడ్డి, బోధన్ నుంచి ముగ్గురేసి కాంగ్రెస్ పార్టీ నేతలు చైర్మన్ పదవి కోసం పోటీ పడుతున్నారు. టీఆర్ఎస్ ఒక్కొక్కరినే చైర్మన్ అభ్యర్థులుగా ప్రకటించింది. అందరికీ సవాలే నిజామాబాద్ నగర మేయర్ పదవి ప్ర ధాన పార్టీలకు సవాల్‌గా మారిం ది. ఇక్కడ 50 డివిజన్లలో కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ, వైఎస్ఆర్సీపీ, టీడీపీ, ఎంఐఎం, సీపీఐ అభ్యర్థులను బరిలోకి దింపాయి. కాంగ్రెస్ నుంచి పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్, అప్పటి టీఆర్ఎస్ అర్బన్ అధ్యక్షుడు బస్వ లక్ష్మీనర్సయ్య, ఎమ్మెల్యే యెండల లక్ష్మీ నారాయణ, వైఎస్ఆర్ సీపీ నుంచి అంతిరెడ్డి శ్రీధర్‌రెడ్డి తదితర నేతలు ప్రచారం నిర్వహించారు. మేయర్ పదవికి టీఆర్ఎస్ నుంచి మాజీ కార్పొరేటర్ సుధాం లక్ష్మి, విశాలినీరెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. మెజార్టీపై స్పష్టత లేని టీడీపీ, బీజేపీ మేయర్ అభ్యర్థిని ప్రకటించలేదు. అయితే, సోమవారం జరిగే ఓట్ల లెక్కింపు అనంతరం కార్పొరేటర్లకు ఒక్కొక్కరికి స్విఫ్ట్ కారు ఆఫర్ ఇచ్చి క్యాంపునకు తరలించేందుకు పార్టీలు సిద్ధమవుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఇక్కడా అంతే అర్మూర్ మున్సిపాలిటీలో 23 వార్డులుండగా, కాంగ్రెస్, టీఆర్ఎస్ అన్ని స్థానాలకు పోటీ చేశాయి. చైర్పర్సన్ పదవి కోసం ఈ రెండు పార్టీలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. మెరుగైన ఫలితాలు వస్తాయనుకుంటున్న కాంగ్రెస్ పార్టీ నుంచి ఐదుగురు పోటీ పడుతుండటం టీఆర్ఎస్కు అవకాశంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. మున్సిపల్ మాజీ చైర్మన్ త్రివేణి గంగాధర్ సతీమణి పుష్పలత, ఏబీ శ్రీనివాస్ అలియాస్ చిన్నా సతీమణి ఏబీ శ్రీదేవి, కంచెట్టి లక్ష్మి, మాజీ వైస్ చైర్పర్సన్ పీసీ ఉషారాణి, కాందేశ్ సంగీత మధ్యన ప్రధాన పోటీ నెలకొంది. టీఆర్ఎస్ విషయానికి వస్తే స్వాతీసింగ్ బబ్లూ ఒక్కరి పేరే వినిపిస్తోంది. తమ పార్టీ నుంచి గెలిచినవారితోపాటు, ఇతర పార్టీల విజేతలు, స్వతంత్రులను జత చేసుకొని, కాంగ్రెస్ అసంతృప్తివాదులతో కలిసి క్యాంపునకు తరలే ప్రయత్నంలో టీఆర్ఎస్ ఉంది. టీడీపీ, బీజేపీ మొత్తం స్థానాలలో పోటీలో కారణంగా చైర్ పర్సన్ పదవిపై ఆ రెండు పార్టీలకు ఆశలు లేనట్టే. క్యాంపు రాజకీయాలకు సిద్ధం జనరల్ మహిళకు కేటాయించిన కామారెడ్డి మున్సిపాలిటీలో 33 వార్డులుండగా, హోరాహోరీ పోరులో ఏ పార్టీకీ ఆధిక్యం లభిస్తుందన్న స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో ఫలితాల అనంతరం పోటాపోటీ క్యాంపు రాజకీయాలకు పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. కామారెడ్డిలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆయా పార్టీల అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు. చైర్పర్సన్ పదవికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి ముగ్గురు పోటీ పడుతున్నారు. మాజీ వైస్ చైర్పర్సన్ కారంగుల శకుంతలారెడ్డి, మాజీ కౌన్సిలర్ ఆర్.శోభాగౌడ్, పిప్పిరి సుష్మ, చాట్ల లక్ష్మి బరిలో ఉన్నారు. టీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ రాష్ర్ట కార్యదర్శి కొమ్ముల తిరుమల్‌రెడ్డి సతీమణి సుజాత చైర్పర్సన్ రేసులో ఉన్నారు. ఆశల పల్లకీలో మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి ఇలాకా బోధన్ మున్సిపాలిటీని జనరల్‌కు కేటాయించారు.35 వార్డులలో ప్రధా న పార్టీలు అభ్యర్థులను బరిలోకి దింపాయి. మొత్తం 337 మంది పోటీలో ఉన్నారు. కాంగ్రెస్‌కు ఆధిక్యం లభిస్తే ఇక్కడ చైర్మన్ కావాలని ముగ్గురు నేతలు కలలు కంటున్నారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆబిద్అలీ, పట్టణాధ్యక్షుడు కేవీ సత్యం, మాజీ కౌన్సి లర్ గుణప్రసాద్ చైర్మన్ కావాలని ఆశపడుతున్నారు. టీఆర్ఎస్ నుంచి జేఏసీ నాయకుడు శివరాజ్ చైర్మన్‌గిరీపై కన్నేశారు. టీడీపీ, బీజేపీ, ఎంఐఎం ఆరేడు స్థా నాలలోనే పోటీకి పరిమితం కావడంతో చైర్మన్ పదవి వైపు చూడటం లేదు. కాంగ్రెస్, టీఆర్ఎస్ క్యాంపు రాజకీయాలను కొనసాగిస్తే, ఆయా పార్టీల నుంచి చైర్మన్ పీఠం ఎక్కాలనుకున్న నేతలు, క్యాంపుల కు కీలకంగా మారాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. -
జోరుగా బెట్టింగ్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లాలో తొమ్మిది అసెంబ్లీ, రెండు లోక్‌సభ నియోజకవర్గాలున్నాయి. అయితే నిజామాబాద్ లోక్‌సభతోపాటు నిజామాబాద్ రూరల్, బోధన్, కామారెడ్డి, ఆర్మూర్ నియోజకవర్గాల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ స్థానాల్లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు కవిత, బీజేపీ మాజీ శాసనసభాపక్ష నేత యెండల లక్ష్మీనారాయణ, పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్, మాజీ మంత్రులు సుదర్శన్‌రెడ్డి, షబ్బీర్ అలీ, మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి తదితరులు బరిలో ఉండడంతో పోరు రసవత్తరంగా సాగినట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికలు ఆయా అభ్యర్థులకు ప్రతిష్టాత్మకం కావడంతో విజయం కోసం సర్వశక్తులు ఒడ్డారు. హోరాహోరీగా సాగిన పోరులో గెలుపుపై అందరూ ధీమా వ్యక్తం చేస్తుండటంతో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనేది చర్చనీయాంశంగా కాగా.. నాలుగు స్థానాల్లో మా నేతలే గెలుస్తారంటూ వారి అనుచరులు భారీస్థాయిలో పందాలు కాస్తుండడం గమనార్హం. స్థాయిని బట్టి రూ. 5 వేల నుంచి రూ. 5 లక్షల వరకు పందాలు కాస్తున్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్ లోక్‌సభ స్థానంలో గెలుపోటములపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ స్థానం పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో కారు జోరు కొనసాగినట్లు తెలుస్తుండగా లోక్‌సభకు వచ్చేసరికి భిన్నంగా పోలింగ్ జరిగినట్లు తెలుస్తోంది. ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, వైఎస్ఆర్సీపీల నుంచి కల్వకుంట్ల కవిత, మధుయాష్కీ గౌడ్, యెండల లక్ష్మీనారాయణ, సింగిరెడ్డి రవిందర్‌రెడ్డి పోటీ చేశారు. అయితే పోలింగ్ నాటికి కవిత, లక్ష్మీనారాయణల మధ్య నువ్వా, నేనా అన్న చందంగా పోటీ మారింది. నిజామాబాద్ జిల్లాలోని ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లలో కారు కొంత పైచేయిగా ఉందని, కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాల్లో బీజేపీ హవా కొనసాగిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీంతో టీఆర్ఎస్ గెలుపు ధీమాను వ్యక్తం చేస్తుండగా.. తెలంగాణలో బీజేపీ గెలిచే లోక్‌సభ స్థానాల్లో నిజామాబాద్ ఒకటని ఆ పార్టీ వర్గాలు ఢంకా బజాయించి చెబుతున్నాయి. ఇలా ఫలితాలపై అభ్యర్థులు ఎవరికి వారే ధీమాగా ఉండడంతో వారి అనుచరులూ అంతే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆయా పార్టీల నాయకులు జోరుగా పందాలు కాస్తున్నారు. నిజామాబాద్ రూరల్ నుంచి పోటీ చేసిన డి.శ్రీనివాస్ 1999, 2004లలో వరుసగా నిజామాబాద్ నుంచి గెలుపొందారు. అయితే ఆ తర్వాత 2009, 2010 ఉప ఎన్నికల్లో ఆయన ఓటమిపాలయ్యారు. ఆయన ఈసారి విజయమే లక్ష్యంగా నిజామాబాద్ రూరల్ నుంచి బరిలో నిలిచారు. టీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ఇదేస్థానం నుంచి బరిలో ఉండడంతో పోరు ఆసక్తికరంగా మారింది. బీజేపీ కూటమి అభ్యర్థి గడ్డం ఆనందరెడ్డి సైతం చాపకింద నీరులా గట్టిపోటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. 2009లో ఈ నియోజకవర్గంలో 77.79 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఈసారి 6.70 శాతం తగ్గింది. అయితే తగ్గిన ఓట్ల శాతం ఎవరికి నష్టం చేస్తుందన్న చర్చ జరుగుతోంది. దాని ఆధారంగానే పందాలు కాస్తున్నారు. 2009లో కామారెడ్డిలో, 2010 ఉప ఎన్నికల్లో ఎల్లారెడ్డిలో అపజయం పొందిన మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఈసారి మళ్లీ కామారెడ్డిలో బరిలో నిలిచారు. ఆయన గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. టీపీసీసీలో కీలక బాధ్యతల్లో ఉన్న ఈయనకు తాజా మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్(టీఆర్ఎస్)కు మధ్య నువ్వా? నేనా? అన్న రీతిలో పోరుసాగినట్లు తెలుస్తోంది. 1999 నుంచి ఓటమెరుగని మాజీ మంత్రి పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి నాలుగోసారి మాత్రం ఎదురీదారంటున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి షకీల్‌కు విజయావకాశాలుంటాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 2009లో కాంగ్రెస్ గెలిచిన ఏకైక స్థానం బోధన్ కాగా.. ఈసారి కూడ అక్కడ కాంగ్రెస్‌కే అవకాశం ఉంది అన్న చర్చలూ సాగుతున్నాయి. వీరిద్దరే కాకుండా బీజేపీ, టీడీపీ కూటమి అభ్యర్థి మేడపాటి ప్రకాశ్‌రెడ్డి సైతం తనకూ విజయావకాశాలున్నాయని పేర్కొంటుండడం గమనార్హం. దీంతో ఇక్కడా అభ్యర్థుల గెలుపోటములపై భారీగానే పందాలు కాస్తున్నారు. ఈసారీ ఆర్మూరునుంచే బరిలో నిలిచిన మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డి ఎన్నికల్లో సర్వశక్తులొడ్డారు. ఆయన 1989 నుంచి 2004 వరకు బాల్కొండ నుంచి వరుసగా నాలుగు సార్లు ప్రాతినిధ్యం వహించారు. నియోజకవర్గాల పునర్విభజనతో ఆర్మూరుకు మారిన ఆయన 2009లో ఓటమి పాలయ్యారు. టీఆర్ఎస్ అభ్యర్థి ఆశన్నగారి జీవన్‌రెడ్డి సైతం దీటుగా ప్రచారంలో ముందుకెళ్లారు. కాంగ్రెస్, టీఆర్ఎస్లలో టీఆర్ఎస్దే పైచేయిగా నిలిచిందన్న ప్రచారం పోలింగ్ రోజు జరిగింది. ఇరు పార్టీల కార్యకర్తలు ఎవరికి వారే గెలుపు ధీమాతో బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. -
బీజేపీ తెలంగాణ ఎందుకివ్వలేదు: డీఎస్
నిజామాబాద్, న్యూస్‌లైన్: ఎన్డీఏ హయంలోనే తెలంగాణ ఏర్పాటు చేసి ఉంటే ఒక్క ప్రాణం కూడా పోయేది కాదని పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. మంగళవారం నిజామాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. బీజేపీ హయాంలో తెలంగాణ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. 1200 మంది ప్రాణాత్యాగాలు చేయటంతోనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందని మోడీ అనటం సరికాదన్నారు. ఎన్డీఏ హయంలో మూడు రాష్ట్రాలను విభజించినప్పుడు తెలంగాణ ఏర్పాటు చేసి ఉంటే ఒక్క ప్రాణం పోయేది కాదన్నారు. -
ముఖ్యమంత్రి రేసులో లేను: డీఎస్
ఐనా.. అభిమానులు, కార్యకర్తలు కోరుకుంటున్నారు: డీఎస్ నిజామాబాద్, న్యూస్‌లైన్: తెలంగాణ ముఖ్యమంత్రి పదవి రేసులో తాను లేనని పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ అన్నారు. బుధవారం నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. అయితే, పార్టీ కార్యకర్తలు.. అభిమానులు మాత్రం తాను సీఎం కావాలని కోరుకుంటున్నారని, ప్రజలు కోరుకున్న నాయకులకే పదవులు వస్తాయని తెలిపారు. తెలంగాణను కాంగ్రెస్ పార్టీయే ఇచ్చిందని ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారని, తప్పకుండా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 70 స్థానాలకు పైగా గెలుచుకుంటుందన్న విశ్వాసం వ్యక్తంచేశారు. తెలంగాణలో ఐదు జిల్లాలో టీఆర్ఎస్ ఉనికి కోల్పోయిందని, అటువంటప్పుడు ఆపార్టీ ఎలా అధికారంలోకి వస్తుందని డీఎస్ ప్రశ్నించారు. -
కేసీఆర్ వల్లే పొత్తు కుదర్లేదు: డీఎస్
‘సాక్షి’తో డి.శ్రీనివాస్: కాంగ్రెస్‌కు బహిరంగంగా మద్దతు ఇవ్వాలని జేఏసీని కోరడంలో ఎలాంటి వ్యూహం లేదని పీసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ స్పష్టం చేశారు. సోనియా కాకుండా ఎవరున్నా తెలంగాణ ఏర్పాటు జరిగిఉండేది కాదని జేఏసీ నాయకులే అంగీకరించారని పేర్కొన్నారు. సకలజనులసమ్మె, బలిదానాలే తెలంగాణ ఏర్పాటులో కీలకపాత్ర వహించాయని పేర్కొన్నారు. కేసీఆర్ తాను ముఖ్యమంత్రి కావడం కోసమే మాట మారుస్తున్నారని ధ్వజమెత్తారు. ‘సాక్షి’ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో డీఎస్ అభిప్రాయాలివి... పి.లింగం, ఎలక్షన్‌సెల్: కేసిఆర్ అధికారం కోసం ఆశ పడడం వల్లనే పొత్తు విఫలమైంది. పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఇస్తే ఎలాంటి షరతులు లేకుండా టీఆర్ఎస్ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని కేసీఆర్ అనేక సార్లు ప్రకటించారు. తనకు సీఎం పదవి ఇవ్వాలనీ, టీఆర్ఎస్కు ఎక్కువ సీట్లు కేటాయించాలనిషరతు పెట్టారు. ఏవైనా చిన్నచిన్న సమస్యలుంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత సవరించుకునే వీలుంటుంది. అధికారాన్ని ఆశించే ఆయన ఆంక్షల విధించారన్న వాదన చేస్తున్నారు. తెలంగాణ ద్రోహులకు, బద్ధవిరోధులకు టికెట్లు ఇచ్చారు. అధికారం కోసం దళిత సీఎం నినాదాన్ని కూడా వదిలేశారు. టీఆర్ఎస్తో పొత్తు కోసం కాంగ్రెస్ పార్టీ పాకులాడిందన్న వాదన నిజం కాదు. పొత్తు ద్వారా అనవసరమైన పోటీని నివారించవచ్చునని మాత్రమే ఆశించాం. సరైంది కాదు.. తెలంగాణ ఉద్యమకారులను అవకాశం కల్పిస్తామని ప్రకటించి వెనక్కి తగ్గడం సరైందికాదు. ముందు ప్రకటించిన నలుగురికి టికెట్లు ఇస్తేనే మంచిది. ఏఐసీసీ ప్రకటించిన తరువాత టికెట్లు ఇవ్వకపోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి. ప్రజలు మమ్మల్నే నమ్ముతున్నారు... తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడక ముందునుంచే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కృషి చేసింది. అయితే మేము శాస్త్రీయంగా పనిచేశాం. సరైన వేదికలమీద ప్రయత్నాలు చేశాం. రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ వల్లనే సాధ్యమయ్యిందన్న నమ్మకం ప్రజల్లో బలంగా కనిపిస్తుంది. మూడు అంశాలే కీలకం... జేఏసీ నిర్వహించినసకలజనులసమ్మె, యువకుల బలిదానాలే తెలంగాణ కలను సాకారం చేశాయి తప్ప టీఆర్ఎస్ చేసిందేమీ లేదు. సకలజనుల సమ్మెలో టీఆర్ఎస్ పాత్ర ఏమాత్రంలేదు. సమ్మె విజయవంతం కావడంతో చివరి నిమిషంలో టీఆర్ఎస్ అందులో పాల్గొంది. ప్రభుత్వ యంత్రాంగం స్థంభించిపోయేంత తీవ్రంగా జరిగిన సమ్మెతో ఈ ప్రాంత ప్రజలు, ఉద్యోగులు ఎంతగా నష్టపోయారన్నది కేంద్రం గుర్తించింది. యువత బలిదానాలకు సోనియా చలించిపోయారు. సొంత పార్టీని ధిక్కరించి ఎంపీలు లోకసభను స్థంభింపచేయడాన్ని పార్టీ సీరియస్‌గా తీసుకుంది. ఈ మూడు అంశాలే తెలంగాణ రావడానికి కారణం. సభలు, విలేకరుల సమావేశాలు పెట్టడం తప్ప టీఆర్ఎస్ తెలంగాణ సాధన దిశలో చేసిందేమీ లేదు. కేసీఆర్‌కు తెలంగాణ సాధించుకోవడం కోసం కాకుండా... అధికారాన్ని దక్కించుకుకోవడానికే ఎదురుచూశారు. వాపును చూసి బలమని... 2009 తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను చూసి అది తమ బలమనుకుంటే పొరపాటు. అప్పడు కాంగ్రెస్ తెలంగాణ విషయంలో మాట నిలబెట్టుకోలేదన్న నిరసన ఉండేది. అది టీఆర్ఎస్కు అనుకూలంగా మారింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. టీఆర్ఎస్ ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం. మరో భాగంలో ఆ పార్టీకి బలమే లేదు. సత్తా చాటుతాం.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పెద్ద మెజారిటీతో విజయం సాధిస్తుంది. ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. లోకసభ స్థానాలను కూడా అధికసంఖ్యలో గెలుచుకుంటుంది. పార్టీ తెలంగాణలో పటిష్టంగా ఉంది. ఒంటరిగానే సత్తా చాటుతాం. ఆ పొత్తు ప్రభావం ఉండదు... టీడీపీ, బీజేపీల మధ్య పొత్తుకు అంత ప్రాధాన్యం లేదు. పొత్తు ప్రభావం ఇక్కడ ఉండదు. గతంలోనూ వారు కలిసి పోటీ చేశారు. అప్పుడెందుకు విడిపోయారో... ఇప్పుడెందుకు కలిశారో.. తెలంగాణలో పోటీ కాంగ్రెస్, టీఆర్ఎస్ల మధ్యే ఉంటుంది. -
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను గెలిపించాలి
డిచ్పల్లి, న్యూస్‌లైన్ : ఇచ్చిన మాట మీద నిలిచి, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని పీసీసీ మాజీ చీఫ్, ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్ పిలుపునిచ్చారు. పరిషత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన బుధవారం డిచ్పల్లి మండలం గన్నారం, తిర్మన్‌పల్లి, రాంపూర్, మిట్టాపల్లి, కమలాపూర్, ఘన్పూర్, డిచ్పల్లి రైల్వే స్టేషన్, నడిపల్లి, ధర్మారం(బి), బర్ధిపూర్ గ్రామాల్లో పర్యటించారు. ఇచ్చిన మాట ప్రకారమే సోనియా తెలంగాణ ఇచ్చారని అన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీలతో పాటు, ఈనెల 30న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరిని కోరుకుంటున్నారు.. రూరల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరిని కోరుకుంటున్నారని ప్రతి గ్రామంలో నిర్వహించిన ప్రచారంలో డీఎస్ ఆయా గ్రామస్తులను ప్రశ్నించారు. దీనికి డి.శ్రీనివాస్‌ను అని వారు సమాధానం ఇవ్వడంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు. మీరందరూ చెబితే తప్పకుండా ఎన్నికల్లో నిలబడతానన్నారు. జెడ్పీటీసీ అభ్యర్థి కూరపాటి అరుణతో పాటు, ఎంపీటీసీ అభ్యర్థులు లంబాని లక్ష్మి, డాక్టర్ శివప్రసాద్, దెగావత్ లక్ష్మి, కూతురు సువర్ణ, ఒడ్డెం సవిత, పొలసాని లక్ష్మి, కడ్దూరం రవికిరణ్, సలీం, పాయల్, పార్టీ నాయకులు గజవాడ జైపాల్, కంచెట్టి గంగాధర్, అమృతాపూర్ గంగాధర్, సుజాత, చింతశ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాస్, చిన్నయ్య, మురళి, గాండ్ల లక్ష్మీనారాయణ, ధర్మాగౌడ్, దేవాగౌడ్, అంబర్‌సింగ్ తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు. -
పార్లమెంట్‌లోనూ మూజువాణి ఆమోదమే!
తెలంగాణ బిల్లుపై డీఎస్ ధీమా హరిహరాదులు అడ్డొచ్చినా ఆగదు విభజన వ్యతిరేక తీర్మానం అసెంబ్లీ రికార్డులకే పరిమితం సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ బిల్లును ఫిబ్రవరి 10 లోపే పార్లమెంట్లో ప్రవేశపెడతారనే సమాచారం తనకుందని, 15 లోపే అది మూజువాణి ఓటుతో ఆమోదం పొందుతుందని పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు.హరిహరాదులు అడ్డొచ్చినా తెలంగాణ ఆగదని, ఫిబ్రవరిలోనే రెండు రాష్ట్రాల ఏర్పాటు ఖాయమన్నారు. శుక్రవారం ఎమ్మెల్యేల నివాస ప్రాంగణ సముదాయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్లో తెలంగాణపై ఓటింగ్ ఉంటుందని తాను అనుకోవడం లేదన్నారు. విభజన బిల్లుకు, తిరస్కరణ తీర్మానానికి ఎలాంటి సంబంధం లేదుని, ఆ సంగతి శాసనసభ స్పీకర్ చదివిన నోట్లోనే స్పష్టంగా ఉందన్నారు. ముఖ్యాంశాలు... అసలు బిల్లు రాలేదని, ముసాయిదా మాత్రమే వచ్చిందని, బిల్లులో అనేక లొసుగులున్నాయని, చర్చకు మరింత గడువు పెంచాలని, తెలంగాణను అడ్డుకుంటామని కొందరు రకరకాల ప్రకటనలు చేశారు. బిల్లును తిరస్కరించాలని కోరిన వారు ఆ బిల్లుపైనే అసెంబ్లీలో చర్చించేందుకు మరో మూడువారాల సమయం కావాలని ఎందుకు అడిగారు? అసెంబ్లీలో సభ్యులు చెప్పిన అభిప్రాయాలను మాత్రమే రాష్ట్రపతికి పంపిస్తున్నారు. విభజనను తిరస్కరించిన తీర్మానాన్ని పంపడం లేదు. దానిని అసెంబ్లీ రికార్డుల్లోనే నిక్షిప్తం చేస్తారు. అసెంబ్లీలో సీమాంధ్రుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున మెజారిటీ అభిప్రాయాలు విభజనకు వ్యతిరేకంగా ఉన్నాయి. అలాంటప్పుడు సీఎం తీర్మానాన్ని ప్రవేశపెట్టాల్సిన అవసరం ఏముంది? దానిని మూజువాణితో ఓటుతో ఆమోదించి ఏకగ్రీవమని చెప్పడమెందుకు? రాజ్యాంగ పరంగా జరుగుతున్న విభజన ప్రక్రియపై న్యాయస్థానం జోక్యం చేసుకోదు. టీఆర్ఎస్ అభ్యర్థికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఓటేసే సంగతి హైకమాండ్ నిర్ణయిస్తుంది. {పత్యేక రాష్ట్రం ఇస్తే కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని కేసీఆరే చెప్పారు. అలాంటప్పుడు విలీనం కావడానికి ఎలాంటి అభ్యంతరం ఉండకూడదు. ‘వేరే ఎజెండా’ లేనప్పుడు విలీనమే సరైనది. -
సమైక్య తీర్మానం పెట్టినా అభ్యంతరం లేదు: డీఎస్
హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లుపై అసెంబ్లీలో చర్చలు ముగిశాక సమైక్య తీర్మానం పెట్టినా అభ్యంతరం లేదని పీసీసీ మాజీ చీఫ్ డీ. శ్రీనివాస్ చెప్పారు. విభజన ప్రక్రియ ఫిబ్రవరి మధ్యలో పూర్తవుతుందని ఆయన తెలిపారు. అయితే శాసనసభ వ్యవహారాల శాఖ నుంచి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును తప్పించడంతో ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయడం సరియైనదేనని డీఎస్ చెప్పారు. అయితే శాఖను వదులుకోవాలి కానీ, మంత్రి పదవిని కాదని ఆయన హితవు పలికారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెట్టకపోతే పూర్తి కాలం పదవిలో ఉంటారని డీఎస్ తెలిపారు. కాగా, వేలకోట్ల అవినీతికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పాల్పడినట్టు ఆరోపణలున్నాయని డీ. శ్రీనివాస్ విమర్శించారు. అవినీతిపై మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని డీఎస్ అన్నారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి ఒకసారి, అటల్ బీహారీ వాజ్పాయ్కి వెన్నుపోటు పొడిచి మరోసారి ముఖ్యమంత్రి అయ్యారని ఆయన ఆరోపించారు. ఇతర పార్టీల నేతలను కించపరిచే విధంగా చంద్రబాబు మాట్లాడటం బాధాకరమని డీ శ్రీనివాస్ తెలిపారు. -
సోనియాతో రేణుక, డీఎస్‌ల భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో ఎంపీ రేణుకా చౌదరి, ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్ సోమవారం విడివిడిగా భేటీ అయ్యారు. తొలుత డీఎస్ పది నిమిషాల పాటు సోనియాతో మాట్లాడారు. ఆయన బయటకు వచ్చిన వెంటనే రేణుక ఖమ్మం జిల్లాకు చెందిన ఓ మహిళా సర్పంచ్‌ను వెంట తీసుకొని సోనియాను కలిసేందుకు లోపలికి వెళ్లారు. ఈ భేటీల్లో ప్రధానంగా రాష్ట్ర రాజకీయాలే చర్చకు వచ్చినట్లుగా తెలిసింది. రాష్ట్ర విభజన బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టిన తదనంతర పరిణామాలను సోనియా అడిగి తెలుసుకున్నారని సమాచారం. విభజన బిల్లుపై వెనక్కెళ్లేది లేదని, ఫిబ్రవరిలో జరిగే సమావేశాల్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందడం ఖాయమని, సాధారణ ఎన్నికలకు ముందే రెండు రాష్ట్రాల ఏర్పాటు జరుగుతుందని సోనియా సంకేతాలిచ్చినట్లు చెబుతున్నారు. భేటీ అనంతరం డీఎస్ మీడియాతో మాట్లాడుతూ, ‘‘2014 లోపు రెండు రాష్ట్రాల ఏర్పాటు ఖాయం. సాధారణ ఎన్నికలు రెండు రాష్ట్రాల్లో జరుగుతాయని కచ్చితంగా చెప్పగలను’’ అని అన్నారు. ముఖ్యమంత్రి పదవి కోరుకుంటున్నారా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ‘‘నేను కాంగ్రెస్ కార్యకర్తను, వారు ఏ బాధ్యతను కట్టబెడితే దాన్ని స్వీకరిస్తా’’ అని బదులిచ్చారు. తర్వాత రేణుక మాట్లాడుతూ, తెలంగాణపై ఇప్పటికే ఎవరి పని వారు చేస్తున్నారని చెప్పారు. తెలంగాణపై అసెంబ్లీలో చర్చ జరగాలని అందరూ కోరుకుంటున్నారని, తాను అదే ఆశిస్తున్నానని అన్నారు. -
అఖిలపక్షం అక్కర్లేదు: డి.శ్రీనివాస్
విభజన అమలు కోసమైతే ఓకే తెలంగాణకు సహకరిస్తే సీమాంధ్రకు సంతృప్తికర ప్యాకేజీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నిర్ణయాన్ని పునఃసమీక్షించే అంశంపై కేంద్రం మళ్లీ అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాల్సిన అవసర ం లేదని పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ అన్నారు. విభజనపై రాజకీయ పార్టీలు యూటర్న్ తీసుకున్న నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలంటూ పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలతో విభేదించారు. విస్తృత సంప్రదింపులు, అన్ని రాజకీయ పార్టీల ద్వారా రాతపూర్వక అభిప్రాయాలను సేకరించిన తర్వాతే కేంద్రం విభజన నిర్ణయం తీసుకుందని చెప్పారు. శనివారం సాయంత్రం తన నివాసంలో డీఎస్ మీడియాతో మాట్లాడారు. విభజన ప్రక్రియకు సహకరిస్తే సీమాం ధ్రకు సంతృప్తికరస్థాయిలో ప్యాకేజీ లభిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో చిత్తశుద్ధితో ఉందని, బిల్లు రూపకల్పన అనంతరం దీనిపై స్పష్టత వస్తుందని చెప్పారు. సీమాంధ్ర ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సమ్మె విరమించిన సమైక్యాంధ్ర ఉద్యోగ సంఘాలను అభినందిస్తున్నట్లు చెప్పారు. విభజనవల్ల ఏయే సమస్యలు ఎదురవుతాయని సీమాంధ్ర ప్రజలు భావిస్తున్నారో వాటన్నింటికీ కేంద్ర మంత్రి వర్గ ఉపసంఘం పరిష్కార మార్గాలను చూపుతుందన్నారు. విభజనపై సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్నప్పుడు స్వాగతిస్తూ రాజనీతిజ్ఞత ప్రదర్శించిన చంద్రబాబు ఇప్పుడు అందుకు భిన్నంగా మాట్లాడటం బాధాకరమన్నారు. గవర్నర్‌తో భేటీ: డీఎస్ శనివారం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ నరసింహన్‌తో సమావేశమయ్యారు. నాలుగైదు రోజులుగా ఢిల్లీలో పర్యటించి హైకమాండ్ పెద్దలను కలిసి వచ్చిన డీఎస్ గవర్నర్‌తో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఢిల్లీ పరిణామాలు, సీఎం వ్యవహారం, విభజన ప్రక్రియ వంటి అంశాలు వీరి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. మర్యాదపూర్వకంగానే గవర్నర్‌ను కలిశానని, విజయ దశమి శుభాకాంక్షలు చెప్పి వచ్చానని డీఎస్ పేర్కొన్నారు. -
మరిన్ని అంశాలు బయటకొస్తాయి: డి. శ్రీనివాస్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర విభజన ప్రక్రియకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కొన్ని విషయాలను బయటపెట్టలేదని పీసీసీ మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. సందర్భాన్ని బట్టి వాటిని బయటపెడుతుందని పేర్కొన్నారు. తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా మంగళవారం గాంధీభవన్‌లో ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జానారెడ్డి, డీకే అరుణ, పొన్నాల లక్ష్మయ్య, సుదర్శన్‌రెడ్డి, ఎంపీలు అంజన్‌కుమార్ యాదవ్, ఆనంద భాస్కర్, పార్టీ నేతలు రెడ్యానాయక్, మల్లు రవి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొనగా... సీమాంధ్ర మంత్రులెవరూ హాజరుకాలేదు. జెండా ఆవిష్కరణ అనంతరం పార్టీ శ్రేణులను ఉద్దేశించి డీఎస్ ప్రసంగించారు. రాష్ట్ర విభజన అంశంలో సోనియాగాంధీ పక్షపాతంతో తెలంగాణ వారికి మాత్రమే మేలు చేసిందని ఎవరైనా అనుకుంటే పొరపాటని, దేశ ప్రజలందరూ ఆమెకు ఒక్కటేనని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కార్యరూపం దాల్చిన తరువాత సోనియా, కేంద్రం తీసుకునే చర్యలతో సీమాంధ్ర ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తారన్న విశ్వాసం తనకు ఉందన్నారు. రాష్ట్రాన్ని విడదీయాలన్నది ఒక ప్రాంత ప్రజల అభిప్రాయం మాత్రమే కాదని, 1972లోనే అవతలి ప్రాంతంలోనూ బలమైన జైఆంధ్ర ఉద్యమం జరిగిందని డీఎస్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గత యాభై ఏళ్లుగా తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తిస్తూనే, సాధ్యమైనంత వరకు కలిపి ఉంచే ప్రయత్నం చేసింది తప్పితే.. విభజించే అవకాశం లేదని ఏనాడూ అనలేదని తెలిపారు. పార్టీ అధినేత తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసే బాధ్యత సీఎం నుంచి కింది స్థాయి కార్యకర్తల వరకూ అందరిపై ఉందని స్పష్టంచేశారు. ఎవరికైనా, ఏ పార్టీకైనా హైదరాబాద్‌లో ఫలానా వారు ఉండటానికి వీలులేదనే అధికారం ఉండదన్నారు. అమరవీరులకు నివాళులు : తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని కోఠిలో తెలంగాణ అమరవీరుల అశోక స్థూపం వద్ద నేతలు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి జానారెడ్డి మాట్లాడుతూ.. ఎంతోమంది ప్రాణత్యాగాల ఫలితంగానే తెలంగాణకు విమోచనం కలిగిందన్నారు. 2014లో తెలంగాణ విమోచనాన్ని తెలంగాణ రాష్ట్రంలో జరుపుకొంటామన్నారు. మంత్రులు గీతారెడ్డి, పొన్నాల కూడా మాట్లాడారు. అనిశ్చితికి కారణం కాంగ్రెస్ : బాబు హైదరాబాద్ విమోచనా దినోత్సవం సందర్భంగా, తెలుగుదే శం అధ్యక్షుడు చంద్రబాబునాయుడు వుంగళవారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో జాతీయ పతాకాన్ని, టీడీపీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణలో నాలుగేళ్లుగా అనిశ్చితి ఉందని, విభజనపై కాంగ్రెస్ తాజా నిర్ణయంతో సీమాంధ్రలో కూడా అదే పరిస్థితి తలెత్తిందని ఇందుకు కాంగ్రెస్ పార్టీ పూర్తి బాధ్యత వహించాలన్నారు. హైదరాబాద్‌తోపాటుగా తెలంగాణ అభివృద్ధి టీడీపీ హయంలోనే జరిగిందని, ఈ అంశంపై బహిరంగ చర్చకు సిద్ధమని తాను ప్రకటించినా ఎవ్వరూ ముందుకు రాలేదని అన్నారు. కార్యక్రవుం అనంతరం టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, రేవూరి ప్రకాశ్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ చేతిలో పెడితే, పటేల్, పట్వారీ, పెత్తందారి వ్యవస్థలను మరోసారి చవిచూడాల్సి వస్తుందని, దొరలరాజ్యం తెచ్చేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని అన్నారు. వచ్చే ఏడాది అధికారికంగా నిర్వహిస్తాం : కిషన్‌రెడ్డి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని వచ్చే ఏడాది తామే అధికారికంగా నిర్వహిస్తామని కిషన్‌రెడ్డి చెప్పారు. విమోచన దినోత్సవం సందర్భంగా మంగళవారం అసెంబ్లీ సమీపంలోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ విగ్రహం వద్ద ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. అలాగే, ముస్లిం మైనారిటీలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందినట్టు అని ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ 64వ జన్మదినోత్సవంలో కిషన్‌రెడ్డి అన్నారు. నరేంద్రమోడీ హయాంలో గుజరాత్ ముస్లింలు అభివృద్ధి చెందారని, సుమారు 30 శాతం మంది ముస్లింలు ఆయనను ఆదరిస్తున్నారన్నారు. రాష్ట్ర మైనార్టీ మోర్చా ఇక్కడ ఏర్పాటుచేసిన సభలో మోర్చా అధ్యక్షుడు హనీఫ్ ఆలీతో కలిసి కిషన్‌రెడ్డి కేక్ కట్ చేశారు. మోడీ ప్రధాని కాబోతున్నారని, కాంగ్రెస్ ఇది జీర్ణించుకోలేకపోతోందని కిషన్‌రెడ్డి విమర్శించారు. -
సోనియాను కలిసిన డీఎస్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : కాంగ్రెస్ పార్టీ కోర్‌కమిటీ సమావేశాని కి ముందు ఢిల్లీలో శుక్రవారం యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీని పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ కలవడం జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. అనారోగ్యం కారణంగా అమెరికా వెళ్లిన అధినేత్రి గురువారమే ఢిల్లీకి వచ్చారు. సోనియా లేకపోవడంతో తెలంగాణ నోట్ తయారీలో జాప్యం జరిగిందన్న అ భిప్రాయాలున్నాయి. రాష్ట్ర విభజన వల్ల ఏర్పడనున్న ఇబ్బందులను తొలగించే చర్యల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆంటోని కమిటీని నియమించిన విషయం తెలిసిందే. కొన్ని రోజులుగా రాష్ట్ర విభజనతో ఏర్పడనున్న సమస్యలపై ఇరుపక్షాల నుంచి విజ్ఞాపనలు, నివేదికలను స్వీకరించిన కేంద్రమంత్రి ఆంటోని ఇరుప్రాంతాలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులతో పాటు వివిధ వర్గాల ప్రజలతో విడివిడిగా సమావేశమై అభ్యర్థనలను స్వీకరించారు. సమస్యలను నేరుగా ఆలకించారు. ఈ నేపథ్యంలోనే ఒక నివేదికను కూడా ఆంటోని కమిటీ రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ నివేదికను శుక్రవారం సమావేశమైన కాంగ్రెస్ కోర్ కమిటీకి అందజేసినట్లు సమాచారం. ఇలాంటి కీలక సమయంలోనే రాజకీయ చతురుడిగా పేరొందిన డీఎస్ సోనియాను కలిసి గంటకు పైగా రాజకీయ అంశాలపై చర్చించడం పార్టీ వర్గాల్లో ఉత్కంఠ ను కలిగించింది. ఈ భేటీలో తెలంగాణ ప్రకటన తర్వాత రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను సోనియాకు డీఎస్ క్షుణ్ణంగా వివరించినట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రజల సుదీర్ఘ పోరాటం తర్వాత కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై నిర్ణయం తీసుకుందని, దీంతో ఈ ప్రాంత ప్రజలకు కాంగ్రెస్‌పై ప్రేమానురాగాలు పెరిగాయని డీఎస్ వివరించినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. అదేవిధంగా సీమాంధ్రలో జరుగుతున్న ఆందోళనలు, ఉద్యమాలు, గతంలో తెలంగాణాలో జరిగిన పోరాటాలు, ఉద్యమాలలో నెలకొన్న తేడాపై అవగాహన కల్పించే ప్రయత్నం చేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా డీఎస్ శుక్రవారం ‘సాక్షి’ ప్రతినిధితో ఢిల్లీ నుంచి ఫోన్లో మాట్లాడారు. హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని, సీడబ్ల్యూసీలో తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి రోడ్‌మ్యాప్ ప్రకారం హైకమాండ్ ముందుకు వెళ్తుందని పేర్కొన్నారు. సోనియాగాంధీకి ఇక్కడ జరుగుతున్న అన్ని విషయాలు తెలుసునని, రాష్ట్ర విభజనలో నెలకొన్న అనుమానాలు, అపోహాలపై అన్ని చర్యలు తీసుకుంటారని వివరించారు. మన కోరికలో వాస్తవముంటే దానికి దగ్గట్లుగానే హైకమాండ్ స్పందిస్తుందన్నారు. రెండు ప్రాంతాల మధ్య రాగద్వేషాలు, ధూషణలు ఉండకూడదన్నారు. తెలంగాణపై ఏ మాత్రం జాప్యం ఉండబోదని పేర్కొన్నారు. రాష్ర్ట విభజనతో ఏదో జరుగుతుందన్న భయం సీమాంధ్రులకు అవసరం లేదన్నారు. రాష్ట్ర విభజనతో అందరికీ న్యాయం జరుగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. -
పోలీసుల దౌర్జన్యంపై విచారణ
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: హైదరాబాద్‌లోని నిజాం కళాశాల హాస్టల్, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులపై పోలీసులు జరిపిన దౌర్జన్యంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శనివారం మీడియాతో మాట్లాడారు. సభ నేపథ్యంలో ఎల్బీ స్టేడియానికి దగ్గరలో ఉన్న నిజాం కళాశాల హాస్టల్ నుంచి విద్యార్థులను అక్కడి నుంచి ముందుగానే పంపించి ఉండాల్సిందన్నారు. అలా చేయకుండా వారిపై దౌర్జన్యం చేయడం దారుణమని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లో సభ నిర్వహించుకోవడానికి ఏపీఎన్జీవోలకు అనుమతి ఇచ్చి, తెలంగాణ జేఏసీ శాంతి ర్యాలీకి నిరాకరిం చడం కంటే ఇరు ప్రాం తాల ప్రతినిధులను పిలిపించి, వేర్వేరుగా అనుమతులు ఇస్తే ఇంతా రాద్ధాంతం జరిగి ఉండేది కాదన్నారు. ఏపీఎన్జీవోల సభలో కొందరు బయటి వారు రాజకీయాలు మాట్లాడి తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారని విమర్శించారు. సభలో ఒక కానిస్టేబుల్ ‘జై తెలంగాణ’ నినాదాలు చేస్తే, శభాష్ అని చెప్పి పక్కకు పంపించాల్సింది పోయిసహచరులు చితకబాదడం శోచనీయమన్నారు. ఇక్కడి ప్రజలు సంయమనం పాటించి తెలంగాణ సంస్కృతిని చాటారన్నారు. సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయకుండా హైదరాబాద్‌లో మిలియన్ మార్చ్ చేపడతామని చెప్పడం సమంజసం కాదని హితవుపలికారు. -
ఏపీఎన్జీవోల సభ జరగనీయండి: డి.శ్రీనివాస్
సాక్షి, హైదరాబాద్: ఏపీ ఎన్జీవోల సభకు ఎలాంటి ఆటంకం కలగనీయొద్దని పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ తెలంగాణవాదులను కోరారు. విభజన విషయంలో కేంద్రం నిర్ణయాన్ని ప్రశ్నించకుండా, విభజన వల్ల ఉద్యోగులకు వచ్చే సమస్యల పరిష్కారానికి మాత్రమే సభను వేదికగా ఉపయోగించుకోవాలని ఏపీ ఎన్జీవోలకు సూచించారు. టీఎన్జీవోల సభకు కూడా అనుమతి ఇచ్చి ఉంటే బాగుండేదన్నారు. గురువారం తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ఎన్జీవోలు, టీఎన్జీవోలతో ప్రభుత్వం మాట్లాడి చెరో తేదీని కేటాయిస్తే బాగుండేదన్నారు. హైదరాబాద్ మెట్రో అథారిటీ డెవలప్మెంట్ (హెచ్ఎండీఏ) పరిధిని కేంద్ర పాలిత ప్రాంతంగా చేసే ఆలోచన కేంద్రానికి లేదని చెప్పారు. కేంద్ర పాలిత ప్రాంతం వల్ల తెలంగాణకు నష్టం జరుగుతుందని, సీమాంధ్రకు ఒరిగేది కూడా ఏమీ ఉండదని అన్నారు. 10 జిల్లాల తో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని అధిష్టానం నిర్ణయించిందని, ఈ ప్రక్రియలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలను కూడా భాగస్వాములను చేసిందని తెలిపారు. హైకమాండ్‌తో సీఎం ఏం చెప్పారో తనకు తెలియదని, అధిష్టానం నిర్ణయాన్ని అమలు చేసేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారని భావిస్తున్నట్లు తెలిపారు. సీఎం సీమాంధ్ర పక్షపాతిగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయని, ఆయన వ్యవహారాన్ని హైకమాండ్ చూసుకుంటుందని చెప్పారు. విభజన జరిగితే సీఎం కాంగ్రెస్‌ను వీడి, వేరే పార్టీలోకి వెళతారని తాను అనుకోవడంలేదన్నారు. రాష్ర్ట విభజన నిర్ణయం వల్ల సీమాంధ్రలో కాంగ్రెస్‌కు నష్టం వాటిల్లే ప్రమాదముందని అంగీకరించారు. పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినప్పటీకీ, ఒక్కోసారి రాజ్యాంగ ప్రక్రియను కొనసాగించాల్సి వస్తుందని అన్నారు. ఓట్లు, సీట్ల కోసం కాకుండా అన్ని పార్టీల అభిప్రాయాల మేరకు ప్రజాస్వామ్యబద్దంగా విభజన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. విభజనపై చంద్రబాబు రోజుకో మాట మాట్లాడుతున్నారని, రేపు ఇంకేమి మాట్లాడతారోనని ఎద్దేవా చేశారు. -
అధిష్టానం నిర్ణయాన్ని ప్రశ్నించొద్దు: డీఎస్
రాష్ట్ర విభజనను సమస్యను జటిలం చేయొద్దని ఏపీఎన్జీవోలను పీసీసీ మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ కోరారు. సమస్యలు ఉంటే ఆంటోనీ కమిటీకి చెప్పుకోవాలని సూచించారు. తెలుగుజాతి సంస్కృతిని కాపాడాల్సిన బాధ్యత ఇరుప్రాంతాలపై ఉందన్నారు. అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నించవద్దని సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులను కోరారు. ఏపీఎన్జీవోల అనుమానాలను నివృత్తి చేసేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శి చర్చలు జరిపాలని డీఎస్ మంగళవారం సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం జరిగిపోయిందని అన్నారు. అన్నిస్థాయిల్లో చర్చలు జరిగాకే రాష్ట్ర విభజనపై కేంద్రం నిర్ణయం తీసుకుందని, దీనిపై వెనక్కి వెళ్లదని విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజనను ఆపాలనుకుంటే విఫలయత్నం అవుతుందన్నారు. తమ ప్రాంత ప్రజల మనోభావాలను సీమాంధ్రులు అర్థం చేసుకోవాలని కోరారు. -
ఉద్యోగుల సమస్యలను నివృత్తి చేయాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఉద్యోగుల్లో తీవ్రమైన ఆందోళనలు, అనుమానాలున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ కోరారు. వారి అనుమానాలను నివృత్తి చేసేందుకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి స్థాయి అధికారి ఇరు ప్రాంతాల ఉద్యోగులతో చర్చలు జరపాల్సిన అవసరం ఉందన్నారు. ఎవరెన్ని చెప్పినా విభజన నిర్ణయం జరిగిపోయిందని, ఇక వెనక్కు తిరిగే పరిస్థితి లేనేలేదని ఉద్ఘాటించారు. విభజన ఆగుతుందని ఎవరైనా అనుకుంటే పగటి కల కన్నట్లేనని చెప్పారు. ఆయన మంగళవారం సాయంత్రం తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ...‘‘ఈనెల 7న ఏపీఎన్జీవోలు ఎల్బీస్టేడియంలో సభ పెడతామని నోటీస్ ఇచ్చారు. దానికి ఎదురుగా నిజాం కళాశాల మైదానంలో శాంతి ర్యాలీ నిర్వహిస్తామని టీఎన్జీవోలు చెబుతున్నారు. ఇది చాలా ఆందోళనకరమైన విషయం. వెంటనే కేంద్రం జోక్యం చేసుకుని వాళ్ల ఆందోళనలో నిజమెంత? వాటిని అధిగమించేందుకు చేపట్టే చర్యలను వివరించాల్సిన అవసరం ఉంది’’అని అభిప్రాయపడ్డారు. వాస్తవానికి రాష్ట్ర విభజన అంశం ఏ వర్గాలకు సంబంధించిన అంశమే కాదని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం కొంతవరకు దీనితో సంబంధం ఉందన్నారు. విడిపోతే నిబంధనల మేరకు సీమాంధ్ర ఉద్యోగులు కొత్త రాష్ట్రానికి వెళ్లాల్సి ఉంటుందని, అయితే పదేళ్లు ఉమ్మడి రాజధానిలోనే కొనసాగే అవకాశమున్నందున అప్పటికి చాలా మంది రిటైర్ అవుతారని తెలిపారు. ఉద్యోగుల ఆందోళనలను నివృత్తి చేసేందుకు హోంశాఖ జోక్యం చేసుకుంటేనే మేలని అభిప్రాయపడ్డారు. అన్ని పార్టీలు, వర్గాలతో మాట్లాడిన తరువాతే హైకమాండ్ విభజన నిర్ణయం తీసుకుందని, ఇప్పుడు ఇతర పార్టీలు లేఖలు ఉపసంహరించుకున్నా విభజన ఆగే ప్రసక్తే లేదని చెప్పారు. విభజన నిర్ణయం జరిగినప్పటికీ సోనియాగాంధీ, కాంగ్రె స్ పార్టీ పెద్దలు సీమాంధ్ర ప్రాంతానికి చాలా గొప్ప ప్యాకేజీ ఇస్తారనే నమ్మకం తనకు ఉందన్నారు. ఉద్యోగులకు ఎలాంటి నష్టం జరగదని కూడా భావిస్తున్నట్లు తెలిపారు. సీఎం, పీసీసీ చీఫ్ విభజనను వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశముందా? అని ప్రశ్నించగా... ‘‘విభజన నిర్ణయం అమలులో ఎక్కడైనా ఆటంకం కలిగిందా? ఇక రాష్ట్రపతి పాలనకు ఆస్కారమెక్కడిది? ఒకవేళ మీరు చె ప్పినవాళ్లకు బాధ్యతను అప్పగిస్తే... దానిని అమలు చేయనప్పుడు కదా, మనం మాట్లాడుకోవాల్సింది. కేంద్రం క్లియర్‌గా ఉంది. రోడ్‌మ్యాప్‌ను అమలు చేస్తోంది. ఎక్కడా ఆటంకం లేదు’’అని తెలిపారు. -
సీమాంధ్ర రాష్ట్రం అద్భుతంగా అభివృద్ధి:డీఎస్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్ర అద్భుతంగా అభివృద్ధి చెందుతుందని పీసీసీ మాజీ అధ్యక్షుడు డీ శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన శుక్రవారం మాట్లాడారు. విభజన వల్ల సీమాంధ్ర రాష్ట్రంలో విద్యుత్ రంగానికి నిధులు సమకురుతాయన్నారు. అలాగే నీటి సమస్య తలెత్తకుండా ఇరు ప్రాంతాల మధ్య కచ్చితమైన ఒప్పందాలు జరుగుతాయని తెలిపారు. అలాగే సీమాంధ్రలో ఐదు ప్రధాన నగరాలను ఏర్పాటు చేసుకోవచ్చని చెప్పారు. తెలంగాణ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఇక వెనక్కి తగ్గబోదన్నారు. సమన్యాయం కోసం కావాల్సిన కృషి జరుగుతుందని చెప్పారు. సీమాంధ్ర ప్రాంతంలో మంచి ఉద్దేశ్యంతోనే సీమాంధ్రలు సమైక్యాంధ్ర అంటున్నారని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. ఉద్యోగుల సమస్యలపై కలిసి చర్చించేందుకు ఏపీ ఎన్జీవో, టీఎన్జీవోలు సిద్ధంగా ఉన్నాయని ఈ సందర్భంగా డీఎస్ గుర్తు చేశారు. రాష్ట్ర విజభనలో హైదరాబాద్ నగర సమస్య అసలు సమస్యకాదని అన్నారు. స్థానికంగా ఎవ్వరికి ద్వితీయ పౌరసత్వం ఉండదని డీఎస్ సుస్పష్టంగా చెప్పారు. -
సీమాంధ్ర రాష్ట్రం అద్భుతంగా అభివృద్ధి:డీఎస్