కేసీఆర్ అంత ధైర్యం ఉన్న సీఎం దేశంలో మరొకరు లేరు: డీఎస్
సాక్షి, హైదరాబాద్ : వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రాష్ట్ర రైతాంగానికి ఉచితంగా ఎరువు లు సరఫరా చేయాలని కేసీఆర్ తీసుకున్న నిర్ణయం దమ్మున్న నిర్ణయమని రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ పేర్కొన్నారు. దేశంలో ఇంత గుండె ధైర్యం ఉన్న సీఎం మరొకరు లేరన్నారు. తెలంగాణ భవన్ లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
కేసీఆర్ ఎంతో ధైర్యంగా రిజర్వేషన్ల పెంపుపై ముందుకు సాగుతున్నారన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంకా మూ డేళ్లు కూడా కాలేదని, అయినా అద్భుతాలు సృష్టిస్తోందన్నారు. ఎరువులకోసం ఎకరాకు రూ.4వేలు రైతులకు ఇవ్వాలనే నిర్ణయం సామాన్యమైనది కాదని, ఎవరినో కాపీ కొట్ట వలసిన అవసరం కేసీఆర్‌కు లేదని చెప్పారు. ‘కొందరు నేతలు హామీలుఇచ్చి మర్చిపోతా రు. కేసీఆర్ అలా కాదు’ అన్నారు. రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎందుకు ఉచితంగా ఎరువులు ఇవ్వలేదని ప్రశ్నించారు.