Free Fertilizer
-
ఎవరు అడ్డొస్తే హామీలు అమలు చేయడం లేదు?
సాక్షి, హైదరాబాద్: రైతులకు ఉచిత ఎరువులు, రూ.లక్ష లోపు రుణమాఫీ, దళితబంధు హామీలకు ఎవరు అడ్డొస్తే అమలు చేయడం లేదో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో నెటిజన్లు అడుగుతున్న ప్రశ్నలకు ఎందుకు జవాబు ఇవ్వలేకపోతున్నారని నిలదీశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ జీవో 317తో ఎవరూ ప్రాణాలు తీసుకోవద్దని కోరారు. బీజేపీకి సవాల్ విసిరే బదులు ఢిల్లీలో లోపాయికారిగా చర్చలు జరుపుతూ, ఇక్కడ కోవర్టు ఆపరేషన్లతో రాష్ట్ర అధ్యక్షుడిని కించపరుస్తూ మాట్లాడటం మీకే చెల్లుతుందని కేసీఆర్‌నుద్దేశించి వ్యాఖ్యానించార. -
ఎరువులు ఉచితంగా ఇస్తానన్నారు.. ఏవీ?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతులందరికీ ఉచితంగా ఎరువులు అందిస్తానని చెప్పిన సీఎం కేసీఆర్ తన హామీని నిలబెట్టుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఎరువులు ఉచితంగా ఇస్తానని 2017 ఏప్రిల్ 13న కేసీఆర్ చెప్పిన మాటలు నాలుగేళ్లు దాటినా అమల్లోకి రాలేదని, చెప్పిన మాటలను ఆయన విస్మరించారని శుక్రవారం ట్విట్టర్లో రేవంత్ పోస్ట్ చేశారు. సవాళ్లు చేసి చర్చలకు రాకుండా తప్పించుకునే బదులు రాష్ట్ర మంత్రి కేటీఆర్ తన తండ్రి ఇచ్చిన హామీలు అమలయ్యేలా చూడాలని ట్వీట్లో పేర్కొన్నారు. -
ఉచిత ఎరువు .. దమ్మున్న నిర్ణయం
కేసీఆర్ అంత ధైర్యం ఉన్న సీఎం దేశంలో మరొకరు లేరు: డీఎస్ సాక్షి, హైదరాబాద్ : వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రాష్ట్ర రైతాంగానికి ఉచితంగా ఎరువు లు సరఫరా చేయాలని కేసీఆర్ తీసుకున్న నిర్ణయం దమ్మున్న నిర్ణయమని రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ పేర్కొన్నారు. దేశంలో ఇంత గుండె ధైర్యం ఉన్న సీఎం మరొకరు లేరన్నారు. తెలంగాణ భవన్ లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ ఎంతో ధైర్యంగా రిజర్వేషన్ల పెంపుపై ముందుకు సాగుతున్నారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంకా మూ డేళ్లు కూడా కాలేదని, అయినా అద్భుతాలు సృష్టిస్తోందన్నారు. ఎరువులకోసం ఎకరాకు రూ.4వేలు రైతులకు ఇవ్వాలనే నిర్ణయం సామాన్యమైనది కాదని, ఎవరినో కాపీ కొట్ట వలసిన అవసరం కేసీఆర్‌కు లేదని చెప్పారు. ‘కొందరు నేతలు హామీలుఇచ్చి మర్చిపోతా రు. కేసీఆర్ అలా కాదు’ అన్నారు. రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎందుకు ఉచితంగా ఎరువులు ఇవ్వలేదని ప్రశ్నించారు.