![Cheruku Sudhakar Questioned State Government Over Free Fertilizer - Sakshi](/styles/webp/s3/article_images/2022/01/15/CHERUKU-SUDHAKAR-3.jpg.webp?itok=wigpjSnl)
సాక్షి, హైదరాబాద్: రైతులకు ఉచిత ఎరువులు, రూ.లక్ష లోపు రుణమాఫీ, దళితబంధు హామీలకు ఎవరు అడ్డొస్తే అమలు చేయడం లేదో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో నెటిజన్లు అడుగుతున్న ప్రశ్నలకు ఎందుకు జవాబు ఇవ్వలేకపోతున్నారని నిలదీశారు.
ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ జీవో 317తో ఎవరూ ప్రాణాలు తీసుకోవద్దని కోరారు. బీజేపీకి సవాల్ విసిరే బదులు ఢిల్లీలో లోపాయికారిగా చర్చలు జరుపుతూ, ఇక్కడ కోవర్టు ఆపరేషన్లతో రాష్ట్ర అధ్యక్షుడిని కించపరుస్తూ మాట్లాడటం మీకే చెల్లుతుందని కేసీఆర్‌నుద్దేశించి వ్యాఖ్యానించార.
Comments
Please login to add a commentAdd a comment