
సాక్షి, న్యూఢిల్లీ: అంతర్రాష్ట్ర నదీ జలాల పంపిణీలో తలెత్తుతున్న వివాదాల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను చూపాలని నీటి వనరులపై ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో టీఆర్‌ఎస్ ఎంపీ డి.శ్రీనివాస్ గురువారం కోరారు.
నదీ జలాల పంపిణీలో తలెత్తుతున్న వివాదాలను పరిష్కరించేందుకు ట్రిబ్యునల్‌లో చాలా సమయం పడుతోందని, చివరకు సరైన పరిష్కారాలు చూపలేకపోతున్నాయని అన్నారు. దీన్ని పరిష్కరించేందుకు కేంద్రం ప్రత్యేక దృష్టి సారించాలని, నీటి పారుదల రంగ నిపుణుల పర్యవేక్షణలో నూతన ఆలోచనలు చేయాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment