
పార్టీ మారే ప్రసక్తిలేదు: డీఎస్
సాక్షి, హైదరాబాద్: తాను పార్టీ మారే ప్రసక్తిలేదని టీఆర్‌ఎస్ రాజ్యసభసభ్యుడు డి.శ్రీనివాస్ స్పష్టంచేశారు. టీఆర్‌ఎస్‌ను వదిలిపెట్టి తిరిగి కాంగ్రెస్‌లోకి వెళ్తున్నట్టు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని డీఎస్ అన్నారు. శుక్రవారం ఆయన తెలంగాణభవన్‌లో మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేస్తున్నట్టుగా వచ్చిన వార్తలతో తనలాంటి నాయకులపై ఉన్న విశ్వసనీయతపోతుందన్నారు.
తానంటే గిట్టని కొంతమంది నేతలు పనిగట్టుకుని ఉద్దేశపూర్వకంగా ఇలాంటి కుట్రలు, ప్రచారం చేస్తున్నారని అన్నారు. తాను కాంగ్రెస్‌నేతలు ఎవరినీ కలవలేదని, ఎవరితోనైనా మాట్లాడి ఉంటే బయటపెట్టాలని డీఎస్ డిమాండ్ చేశారు. తాను పార్టీ మారుతున్నట్టుగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వంటి నాయకుడు చెబుతాడని అనుకోవడంలేదని పేర్కొన్నారు.