
‘హస్తం’ అమ్మో.. ‘కారు’దే దమ్ము
ఆయన్ను పార్టీ మోయాల్సి వస్తే అంతగా మోయడం దేనికి? వదిలించుకోవచ్చుగా...అబ్బే అలా ఎలా వదులుకుంటాము...అవసరమైతే ఇంటికి వెళ్లి మరీ గాంధీభవన్‌కు మోసుకువస్తామంటూ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క బంజారాహిల్స్‌లోని డి.శ్రీనివాస్ ఇంటికి వెళ్లారు. నచ్చజెప్పి పార్టీలో ఉండేలా ఒప్పించాలన్నదే వారి వ్యూహం. వీరు వస్తున్నారని తెలిసి డీఎస్ ముందస్తుగా అక్కడి నుంచి తప్పించుకుని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో తేలారు.
ముఖ్యమంత్రికి స్వల్ప అనారోగ్యం అని తెలిస్తే పరామర్శించడానికి వచ్చా... అంతే, అంటూనే కాంగ్రెస్‌లో పని చేసేవారికి గుర్తింపు లేదని తాను పార్టీ వీడనున్నట్లు పరోక్షంగా ప్రకటించేశారు. అంతే అప్పటిదాకా డీఎస్‌ను మోయడానికి సిద్ధపడ్డ కాంగ్రెస్ నేతలు...ఆయనను ఇప్పటికే లెక్కకు మించి మోశాము...ఇంకా మోయడం సాధ్యం కాదని తేల్చిపడేశారు. డీఎస్‌ను మోయడమంటే మామూలైన వ్యవహారమా మరి...ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) ఆ బాధ్యతను భుజాలకెత్తుకుంది...రాజకీయమా మజాకా...